కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టిన టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌కు మద్దతుగా ఎమ్మార్పీఎస్ 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీక్షలో కోదండరాం, విమలక్క, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై జాప్యం *ప్రొఫెసర్ కోదండరామ్* ఎస్సీ వర్గీకరణ దీర్ఘకాలిక సమస్య. ఇది న్యాయమైన డిమాండ్ అని, ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయాలన్నారు.
Back
500029
హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు
Hyderabad, Telangana
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Dhamsalapuram, Telangana:
ఖమ్మం నగర కార్పోరేషన్ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో వారు సెప్టిక్ ట్యాంక్ వాహనాలతో కార్పోరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేసారు. వ్యర్థాలను డంప్ చేయడానికి ఖమ్మం చుట్టుప్రక్కల సుమారు 20 కిలో మీటర్ల మేర ఎక్కడ డంప్ చేయనివ్వడం లేదని వారు ఆవేధన వ్యక్తం చేసారు. వరదలు వచ్చిన తరువాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందన్నారు. తక్షణమే అధికారులు సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నారు.
1
Share
Report
Khammam, Telangana:
శిక్షణపూర్తి చేసుకున్న సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థుల అవుట్ పాసింగ్ ఖమ్మంలో జరిగింది. రామగుండం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 263 అభ్యర్థులు తొమ్మిది నెలల పాటు నగరంలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో అవుట్ పాసింగ్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి మల్టీజోన్_1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, సిపి సునీల్ దత్ తదితరులు హాజరయ్యారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
1
Share
Report
Mothkur, Telangana:
మోత్కూర్ పట్టణ కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజల బెంబేలెత్తిపోతున్నారు. కోతులు గుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వీరంగం సృష్టిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. బయటికి వెళ్లాలంటే కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.
1
Share
Report
Yadagirigutta, Telangana:
యాదగిరిగుట్ట మండలంలోని సైదాపూర్ చెరువులో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆదివారం గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి జలాలను సైదాపూర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఐలయ్యను శాలువాలతో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
0
Share
Report
Yadagirigutta, Telangana:
మూసి పైన బిజెపి నేతలు బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్త డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట కార్యాలయంలో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజు నిద్ర చేస్తాననడం సిగ్గుచేటని, ఒక్కరోజు నిద్రలో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఒక రాత్రి షో చేయడానికి మీడియా ప్రచారం కోసం కిషన్ రెడ్డి వెళ్తున్నారని తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా అనేక బాధలను అనుభవిస్తూ నిరుపేదల నివసిస్తున్నారని తెలిపారు.
1
Share
Report
M.Turkapally, Telangana:
తుర్కపల్లి మండలంలోని వీరరెడ్డి పల్లి గ్రామ సమీపంలోని అంజన్న గట్టు ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలలో భాగంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా రామలింగేశ్వర స్వామి వారిని, సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు.కార్తీక మాస ఉచారుల భాగంగా శివ పార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు.ఆలయ నిర్వాహకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.
0
Share
Report
Bhuvanagiri, Telangana:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బిజెపి ప్రవర్తిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.మూసి ప్రక్షాళనను రాజకీయం చేయకుండా,గంగా నది, సబర్మతి నది ప్రక్షాళన కోసం మోడీకి సహకరించిన విధంగానే ఇక్కడ మూసీ నదికి కూడా సహకరించి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు.మిమ్ములను ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం మీరు పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
1
Share
Report
Mahabubabad, Telangana:
ఖమ్మం జిల్లా మధిరలో లేడీ ఆఘోరీ ప్రత్యేక్షం అయింది. ఓ ప్రవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె చేరుకుని ప్రత్యేక పూజలు చేసింది. ఇదే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని హాజరైయ్యారు. ఈ క్రమంలో ఆఘోరీ కాళ్లు మొక్కిన నందిన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నేపాథ్యంలో స్థానికులు ఆఘోరీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
1
Share
Report
Mahabubabad, Telangana:
ఖమ్మం జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష ఉండగా మద్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్2 పరీక్ష కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలు ఉండగా 27,984 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. నిమిషం నిభందన అమల్లో ఉండడంతో పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు.
1
Share
Report
Hyderabad, Telangana:
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జే ఎన్ ఏ ఎఫ్ యు) కి స్థలాన్ని కేటాయించడం హర్షనీయమని జే ఎన్ ఏ ఎఫ్ ఏ యు టీచింగ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ పేర్కొంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడారు. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళలపై ఉన్న తన ఆసక్తిని ప్రత్యేకంగా ప్రదర్శించారని అన్నారు.
0
Share
Report