ఖమ్మం: సెప్టెలిక్ ట్యాంకులతో ధర్నా
Dhamsalapuram, Telangana:ఖమ్మం నగర కార్పోరేషన్ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో వారు సెప్టిక్ ట్యాంక్ వాహనాలతో కార్పోరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేసారు. వ్యర్థాలను డంప్ చేయడానికి ఖమ్మం చుట్టుప్రక్కల సుమారు 20 కిలో మీటర్ల మేర ఎక్కడ డంప్ చేయనివ్వడం లేదని వారు ఆవేధన వ్యక్తం చేసారు. వరదలు వచ్చిన తరువాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందన్నారు. తక్షణమే అధికారులు సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
YS Jagan Padayatra: పాదయాత్ర షెడ్యూల్‌పై వైఎస్ జగన్ కీలక ప్రకటన..వచ్చే దసరా నుంచి షురూ!
Nunna, Vijayawada, Andhra Pradesh:YS Jagan Padayatra 2.0 Announcement: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్ర షెడ్యూల్‌పై కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయిందని.. మరో ఆరు నెలల్లో మూడేళ్లు గడిచాక.. తన పాదయాత్రను మొదలుపెట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది అనగా 2027 సెప్టెంబరు లేదా అక్టోబరు నెల నుంచి తన పాదయాత్రను ప్రారంభించినున్నట్లు వైఎస్ జగన్ తాజాగా వెల్లడించారు.YS Jagan: పాదయాత్ర 2.0 ఎప్పుడో చెప్పిన మాజీ సీఎం వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:YSRCP Chief YS Jagan Announces Padayatra On 2027 September Or October Watch VideoChandrababu: మూడేళ్ల కిందట అరెస్ట్.. జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు
Nuzendla, Andhra Pradesh:Chandrababu Jail: 'మూడేళ్ల కిందట సెప్టెంబర్ 9వ తేదీన నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేయడం బాధ కలిగించింది' అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు. తాను 48 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని.. 31 ఏళ్ల కిందట తొలిసారి సీఎం అయినట్లు చెప్పుకొచ్చారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలని.. పేదలకు, తెలుగు జాతికి న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేట గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మూడేళ్ల కిందట సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ జరిగిన ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నైజాన్ని.. అతడిపై మాజీ సీఎం రోశయ్య వ్యాఖ్యలను ప్రస్తావించారు. 'చాలా మంది నాపై ఆరోపణలు చేశారు. కోర్టులకు వెళ్లారు. నాపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయలేక పోయారు. అదే నా నిబద్ధత' అని ప్రకటించారు.
'రాజకీయంపై కుటుంబం ఆధారపడకూడదనే 36 ఏళ్ల కిందట ఫ్యామిలీ బిజినెస్ ప్రారంభించాం. అప్పట్లో ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కుటుంబ వ్యాపారాన్ని నా భార్యకు అప్పగించా' అని సీఎం చంద్రబాబు తెలిపారు. తనకు ధన వ్యామోహం లేదని స్పష్టం చేశారు. కేవలం తెలుగు జాతి బాగుండాలనే నిరంతరం ఆలోచన చేస్తానని చెప్పారు. 'నంద్యాలలో ఓ సమావేశానికి వెళ్లిన నన్ను అరెస్టు చేస్తామని అర్ధరాత్రి వచ్చారు. నాపై ఆరోపణలు ఏమిటో చెప్పాలని అడిగితే అరెస్టు చేసిన తర్వాత చెబుతామని అన్నారు' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు.
50 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి, విలువలకే ప్రాధాన్యం ఇచ్చాను. సెప్టెంబర్ 9న తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేశారు. ఆ కష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి అందించిన మద్దతు నా జీవితంలో మర్చిపోలేను. #NijamGelichindi#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/URjQhT19fB
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2026
'ఓ మాజీ ముఖ్యమంత్రిని ఉన్న పళంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. నా జీవితంలో ఎన్నడూ అనుకోని సంఘటన ఓ దుర్మార్గమైన వ్యక్తి ఆలోచనలతో జరిగింది. నేను జైల్లో ఉన్న సమయంలో నాకేం జరుగుతుందోనని తెలుగు జాతి మొత్తం రోడ్లపైకి వచ్చింది' అని చంద్రబాబు వివరించారు. పవన్ కల్యాణ్ తనకు సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే అడ్డుకున్నారని చెప్పారు. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తనకు ఆయన సంఘీభావం తెలిపారని తెలిపారు.
'గత పాలకులు పెట్టిన కేసులను కోర్టులు కొట్టేశాయి. ఈడీ లాంటి సంస్థలు కూడా ఇందులో ఏమీ లేదని తేల్చింది. గతంలో అచ్చెన్నాయుడు లాంటి నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. వేధింపులు చేశారు. పవన్ కల్యాణ్ విశాఖ వెళ్తే ఆయన్ను అక్కడి నుంచి బలవంతంగా వెనక్కు పంపేశారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్క నిముషం చాలు అని.. కానీ తాను ఆ పని చేయలేదని చెప్పుకొచ్చారు.
'నేను చాలా సౌమ్యంగా ఉంటా. ఏం చేయలేకపోతున్నారని చాలా మంది అనేవారు. కానీ నాకు సహనం ఎక్కువ. నేను చేసే ఏ పని అయినా అది తెలుగు జాతికి న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 'మాజీ సీఎం వైఎస్సార్‌కు ఆయన కొడుకు విషయంలో జాగ్రత్తలు తీసుకోమని ఆనాడే చెప్పా. గొడ్డలి పార్టీ అధ్యక్షుడిని ఆయన తండ్రి వైఎస్సార్ చదువుకోవడానికి అమెరికా పంపిస్తే తిరుగుటపాలో వచ్చేశాడు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పాడు' అని చంద్రబాబు ఆసక్తికర విషయం తెలిపారు.
'కొడుకుతో బాధలు భరించలేక అతడిని వైఎస్సార్ బెంగళూరులోనే ఉంచారని తల్లి విజయమ్మ మాజీ సీఎం రోశయ్యకు చెప్పుకుని బాధపడ్డారు. రోశయ్యే స్వయంగా ఈ విషయం చెప్పారు. ఓ సీఎంగా ఉన్న వ్యక్తి తన కుమారుడిని బెంగుళూరులాంటి చోట పెట్టాడు. అంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎలాంటి వాడో అర్థం చేసుకోండి' అని సీఎం చంద్రబాబు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కొడుకును ఎప్పుడూ ఏపీకి రానీయలేదని గుర్తుచేశారు.
'బాబాయి వివేకాను గొడ్డలి వేటుతో కిరాతకంగా చంపేశారు. తెల్లవారితే సీఎంగా ఉన్న నాపై నింద వేసి తన పత్రికలో రాయించారు. తన చెల్లి సునీతను కూడా ఏమార్చారు. ఆ రోజే దోషులందరినీ అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా?. ఇప్పుడు తల్లిని, చెల్లినీ కూడా ఆస్తి కోసం మోసం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన దుస్థితి వచ్చింది' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Chalo Hyderabad: ప్రభుత్వ ఉద్యోగుల్లో గందరగోళం..రేపు చలో హైదరాబాద్ ఉందా? లేదా?!
Hyderabad, Telangana:TGEJAC Chalo Hyderabad: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం TGEJAC ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ (PRTUTS)ల ఉమ్మడి ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 10, 2026) నిర్వహించనున్న 'చలో హైదరాబాద్ - ఉద్యోగుల హక్కుల సాధన సభ' తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తొలుత ఈ కార్యక్రమానికి వేలాదిగా ఉద్యోగులు, పెన్షనర్లు తరలి రావడానికి ప్లానింగ్ జరగ్గా..తాజాగా ఈ ఆందోళనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.Wife And Husband: భర్త వీడియో కాల్ లిఫ్ట్ చేయనందుకు భార్య ఆత్మహత్య
Mahabubabad, Telangana:Wife Ends Her Life After Husband Deny To Video Call In Warangal Watch VideoBank Holidays: బ్యాంకులు సమ్మె..వరుసగా 4 రోజులు సెలవు..నెలాఖరులో మరో 3 రోజులు బంద్!
Hyderabad, Telangana:Bank Strike Holiday: వివిధ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్య సెప్టెంబర్ 11న సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించింది. ఈ సమ్మెకు తోడు వరుసగా సెలవులు రావడం వల్ల బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 11న బ్యాంకు సమ్మె జరగనుండగా, సెప్టెంబర్ 12 రెండో శనివారం సెలవు, సెప్టెంబర్ 13 ఆదివారం వారపు సెలవు, సెప్టెంబర్ 14న గణేశ చతుర్థి ప్రభుత్వ సెలవుదినం ఉన్నాయి. ఈ విధంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. పండుగ సమయంలో బ్యాంకింగ్ సేవలపై ఆధారపడే ప్రజలు ఈ అంతరాయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏటీఎంలు, నగదు లావాదేవీలపై ప్రభావం
బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూసివేసి ఉండటం వల్ల వివిధ బ్యాంకింగ్ లావాదేవీల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఏటీఎంలు సాధారణంగా పనిచేస్తున్నప్పటికీ, నిరంతర సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు నింపే సేవల్లో ఆలస్యం జరగవచ్చు. దీని ఫలితంగా కొన్ని ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లలో నగదు వాడకం పెరుగుతుంది కాబట్టి ఏటీఎంల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఎక్కువగా ప్రభావితమయ్యే వర్గాలు
ఈ నాలుగు రోజుల నిరంతర సెలవుల వల్ల చిన్న వ్యాపారులు, రోజువారీ నగదు లావాదేవీలు చేసే పారిశ్రామికవేత్తలు, పింఛనుదారులు, బ్యాంకింగ్ సేవలపై నేరుగా ఆధారపడేవారు ఎక్కువగా ప్రభావితం కావచ్చు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేయాలనుకునేవారు ఆలస్యాన్ని నివారించడానికి ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఖాతాదారులకు ముందస్తు జాగ్రత్తలు
పండుగ పూట ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నిపుణులు వినియోగదారులకు పలు సూచనలు చేశారు. అత్యవసర ఖర్చుల కోసం అవసరమైన నగదును ముందే విత్‌డ్రా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
డిజిటల్ బ్యాంకింగ్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI సేవలు పనిచేస్తున్నాయని నిర్ధారించుకుని ఉపయోగించుకోవాలి. ముందస్తు లావాదేవీలు అనగా.. పండుగకు ముందే ప్రధాన ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవాలి. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లతో సహా బ్యాంకింగ్ సేవలను ముందుగానే ఉపయోగించుకోవడం మంచిది.
భవిష్యత్ సమ్మె హెచ్చరిక
సెప్టెంబర్ 11న జరగనున్న సమ్మె తర్వాత కూడా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే, సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో మరో మూడు రోజుల సమ్మెకు దిగుతామని బ్యాంక్ ఉద్యోగుల సంఘాల సమాఖ్య హెచ్చరించింది. ఈ ప్రకటన బ్యాంకు ఖాతాదారులలో మరింత ఆందోళన రేకెత్తించింది. కాబట్టి ప్రజలు తమ ఆర్థిక ప్రణాళికను ముందుగానే చేసుకోవడం చాలా అవసరం.
Also Read: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?
Also REad: ఇళ్లు లేని వాళ్లకు గుడ్‌న్యూస్..పీఎం ఆవాస్ యోజనతో రూ.2.30 లక్షల కోట్లు మంజూరు?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Natural Snake Repellent: ఈ వాసన చూస్తే పాములు కిలోమీటర్ పారిపోతాయి..ఇవి ఇంట్లో ఉంటే వాసనకు మీ దరిదాపుల్లోకి రావు!
Hyderabad, Telangana:Natural Snake Repellent Smells: వర్షాకాలంతో సహా అనేక సందర్భాల్లో ఇళ్లు, తోటలు, గ్యారేజీల వద్ద పాములు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఇళ్ల చుట్టూ పొదలు పెరగడం, చెత్త పేరుకుపోవడం లేదా ఆహారం కోసం ఎలుకలు అధికంగా ఉండటం వల్ల ఆ ప్రాంతానికి పాములు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఇంటి పరిసరాల్లోకి పాములు రాకుండా నివారించేందుకు దాల్చినచెక్క నూనె, లవంగ నూనె, వెల్లుల్లి, నిమ్మగడ్డి, బంతి పూలు వంటి ఘాటైన వాసన గల సహజ పదార్థాలను కొందరు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ సహజ సువాసనలు పాములను 100% అరికడతాయనే గ్యారెంటీ ఏమీ లేదు. ఇవి కేవలం అదనపు ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే పనిచేస్తాయి
పాముల ముప్పు నుండి రక్షణ పొందడానికి కేవలం వాసనలపైనే ఆధారపడకుండా, ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించడం, పొదలు, చెత్తను తొలగించడం, ఇంటికి ఉన్న పగుళ్లను మూసివేయడం అత్యంత కీలకమని నిపుణులు వెల్లడిస్తున్నారు.
సహజ వాసనల ప్రభావం..
పాములను దూరంగా ఉంచడానికి కొన్ని ఘాటైన సువాసనలు ఉపయోగపడతాయని నివేదికలు తెలుపుతున్నాయి.
దాల్చినచెక్క నూనె లేదా పొడి..
దాల్చినచెక్క నూనెలోని ఘాటైన వాసన పాములకు ఇబ్బందికరంగా ఉంటుందని యునైటెడ్ స్టేట్స్కు చెందిన USDA యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఇన్స్పెక్షన్ సర్వీస్ (APHIS) పేర్కొంది. దాల్చినచెక్కలో ఉండే సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం కూడా పాములను దూరంగా ఉంచుతుంది. ఇంటి ప్రవేశ ద్వారాలు, గ్యారేజీలు లేదా తోట అంచుల్లో దీనిని చల్లవచ్చు. అయితే దీనిని వాడేటప్పుడు ఇంట్లోని పిల్లలు, పెంపుడు జంతువుల భద్రతను గమనించాలి.
లవంగ నూనె, వెల్లుల్లి..
లవంగ నూనెలోని ఘాటు వాసనకు పాములు దూరంగా ఉంటాయని భావిస్తారు. అలాగే వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాల వల్ల వచ్చే ప్రత్యేక వాసన పాములకు ఇబ్బంది కలిగిస్తుంది.
నిమ్మగడ్డి, బంతి పూలు..
నిమ్మగడ్డి విడుదల చేసే సిట్రోనెల్లా వాసన, బంతి పూల వేర్ల నుండి వెలువడే సమ్మేళనాలు కూడా పాములను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.
పరిశుభ్రతే అసలైన రక్షణ..
ఈ సహజ పద్ధతులు కేవలం అదనపు రక్షణగా మాత్రమే తోడ్పడతాయి గానీ, పాములను పూర్తిగా నివారిస్తాయని ఎలాంటి హామీ లేదు. వాసనల కంటే ఇంటి పరిసరాల పరిశుభ్రత అత్యంత ముఖ్యం.
పగుళ్లు మూసివేయడం: గోడలు, నేలలో ఉన్న పగుళ్లు, రంధ్రాలు, తలుపుల కింద ఉన్న ఖాళీలను మూసివేయాలి.
దాక్కునే స్థలాలు తగ్గించడం: పొదలు, రాళ్ల కుప్పలు, చెత్త, కట్టెల నిల్వలను తొలగించి పాములు ఆశ్రయం పొందే ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి.
ఎలుకల నియంత్రణ: ఎలుకలు వృద్ధి చెందకుండా ఆహార వ్యర్థాలను బయట పారవేయకూడదు.
పాము కనిపిస్తే ఏం చేయాలి?
ఒకవేళ ఇంట్లో లేదా పెరట్లో పాము కనిపిస్తే, దానిని పట్టుకోవడానికి, కొట్టడానికి లేదా చంపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దు. దానికి సురక్షితమైన దూరం పాటించి, వెంటనే స్థానిక అటవీ శాఖ లేదా శిక్షణ పొందిన పాముల నిపుణుల సహాయం తీసుకోవడమే సురక్షితమైన మార్గం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా మాత్రమే పాఠకాసక్తి కోసం పొందుపరిచినది. దీన్ని పాటించేముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Snake Attracting Plants: పాములను ఆకర్షించే మొక్కలు..మీ ఇంట్లో ఉంటే వెంటనే పీకేయండి!
Also REad: విదేశీ మహిళతో నగ్నంగా పూజలు చేసిన జోతిష్య్కుడు..వీడియో రికార్డు చేసి బెదిరింపులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan Padayatra: పాదయాత్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన
Tadepalli, Andhra Pradesh:YS Jagan Padayatra: 'చూస్తుండగానే రెండున్నర ఏళ్లు గడిచాయి. చూస్తుండగానే మరో ఏడాది కూడా గడిచిపోతుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా పాదయాత్ర సాగుతుంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 'వైఎస్సార్సీపీ పాలనపై మన ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోగలిగేలా.. ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలిగేలా మన పాలన సాగింది' అని పేర్కొన్నారు. ఏ ఇంటికి అయినా వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందని వెల్లడించారు.
బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర ఉంటుందని ప్రకటన చేశారు. వైఎస్సార్సీపీ పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారని.. ప్రతి ఇంట్లో అదే చర్చ జరుగుతోందని తెలిపారు.
'మ్యానిఫెస్టోకు ఒక అర్థం తీసుకొచ్చి. మొత్తం అమలు చేసిన చరిత్ర మనది. చంద్రబాబు ఏకంగా మ్యానిఫెస్టోతోపాటు ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంపారు. ఎన్నికల తర్వాత మ్యానిఫెస్టో జాడ ఉండదు' అని టీడీపీపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేశారు. తాము మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి 99 శాతం అమలు చేశామని.. ప్రతి మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చార. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
'ఏటా బడ్జెట్ సమయంలోనే క్యాలెండర్ ప్రకటించి పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మనది. గతంలో ఎప్పుడూ అలా జరగలేదు. వ్యవస్థలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. రైతులు, పిల్లలు, మహిళలు, పేదలకు అందించే పథకాలు లంచాలు లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహాలు తీర్చాం. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్, ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి పాలన ఇంటి గడప వద్దే అందించాం. పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేశాం' అని తన గురించి మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
'ప్రజలను చంద్రబాబు దగా చేశారు. ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి తన సంతకం, పవన్ సంతకంతో బాండ్లు పంపారు. మనం ఇచ్చిన పథకాలు మాత్రమే కాకుండా, మన కంటే ఇంకా మూడింతలు ఇస్తామని చెప్పారు' అని చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదని.. చెప్పింది చేసిందని తెలిపారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని.. తమ నాలుగువేళ్లు నోట్లోకి పోవడం లేదని ప్రజలు వాపోతున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
'చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదు. ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు. అరెస్టులు. జైలుకు పంపడం. రోజుకో డ్రామా. రోజుకో నటన. డైవర్షన్ పాలిటిక్స్' అని వైఎస్ జగన్ విమర్శించారు. ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం అని ప్రకటించారు. ఎన్నికలు సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదామని వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. స్థానిక ఎన్నికల్లో గట్టిగా నిలబడాలని సూచించారు.
'రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో వీరు చేసే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం.. వాటన్నింటిపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనబడాలి. స్థానిక ఎన్నికలు కార్యకర్తల ఎన్నికలు. ప్రజలకు తోడుగా కార్యకర్తలు నిలబడతారు. వారికి తోడుగా మన పార్టీ నిలబడాలి' అని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. దౌర్జన్యంతో ఎప్పుడూ పాలకులు రాజ్యం చేయలేరని గుర్తుంచుకోవాలని కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. జరగబోయే కురుక్షేత్రంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలని.. పోరాడాలని వైఎస్సార్సీపీ నాయకత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ సూచనలు చేశారు.
OPPO A7 Pro ఫోన్ లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో అదరగొట్టిన కొత్త ఫోన్!
Hyderabad, Telangana:OPPO A7 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ OPPO మార్కెట్లోకి అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ ఒప్పో A7 ప్రోను చైనా మార్కెట్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఒప్పో నుంచి ఈ కొత్త A-సిరీస్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ చిప్సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ A7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాకుండా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ IP69K రేటింగ్‌ను కలిగి ఉండడం విశేషం.. ఈ ఫోన్లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఒప్పో A7 ప్రో స్మార్ట్‌ఫోన్ వివిధ రకాల స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. దీని మొదటి వేరియంట్ 6GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర భారత కరెన్సీలో రూ.31,000తో లభిస్తోంది. అంతేకాకుండా రెండవ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.35,000తో లభిస్తోంది.. ఇది డెసర్ట్ బ్రౌన్, ఎవ్రీ స్టెప్ బ్లాసమ్తో పాటు రైడింగ్ ది వేవ్స్ వంటి కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.. ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కూడా ప్రారంభమయ్యాయి. ఇది సెప్టెంబర్ 11వ తేదీ నుంచి చైనాలో అందుబాటులోకి రాబోతోంది..
ఒప్పో A7 ప్రో ఫీచర్లు..
ఒప్పో A7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.57-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని రిజల్యూషన్ 2372x1080 పిక్సెల్స్‌తో పాటు రిఫ్రెష్ రేట్ 120Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz, గ్లోబల్ బ్రైట్నెస్ 800 నిట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా పీక్ బ్రైట్నెస్ 1,400 నిట్స్ ఉండడం వల్ల స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ OS 16 పై పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.. A7 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 MAX చిప్సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది IP69K రేటింగ్ లభిస్తోంది.. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. ఇది 45W సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది..
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ వెనుక భాగంలో ఆటోఫోకస్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీతో పాటు వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.. కనెక్టివిటీ కోసం ఇందులో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, NFCతో పాటు GPS, QZSS కనెక్టివీ ఒక USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇందులో చాలా రకాల స్పెషల్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read: Flipkart బంపర్ ఆఫర్.. సగం ధరకే Realme 43-ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Madhuri Rathod: మాధురి రాథోడ్ 'నిమ్మతోట వనములో' పాటతో ఎంత సంపాదనో తెలుసా? రూ.10 లక్షలు పెడితే..16.2 కోట్లతో దూసుకుపోతుంది!
Hyderabad, Telangana:Madhuri Rathod News: గత ఏడాది కాలంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలోని ప్రతి శుభకార్యం, పార్టీలో మారుమోగుతున్న జానపద పాటల్లో 'నిమ్మతోట వనములో' ఒకటి. ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ తన మాస్ డ్యాన్స్ అభినయంతో ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టారు. 'లీడింగ్ బాయ్స్' అందించిన కొరియోగ్రఫీ, లావణ్య రవిందర్ రాసిన ఆకట్టుకునే లిరిక్స్, ప్రభ గాత్రం ఈ పాటను యూట్యూబ్‌లో సంచలనంగా మార్చాయి.
యూట్యూబ్‌తో పాటు స్పోటిఫై (Spotify), జియో సావన్ (JioSaavn) వంటి డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా ఈ ఆడియో వెర్షన్ దద్దరిల్లింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో వైరల్ అవ్వడమే కాకుండా.. విదేశాల్లోని తెలుగు వారు కూడా తమ వేడుకల్లో ఈ పాటను విరివిగా ఉపయోగిస్తున్నారు.
రూ.10 లక్షల ఖర్చు.. లాభం ఎంతంటే?
ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఏకంగా 162 మిలియన్ల (16 కోట్లకు పైగా) వ్యూస్ లభించాయి. దాదాపు రూ. 10 లక్షల లోపు నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ పాట, యూట్యూబ్, ఇతర ఆడియో ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా మొత్తం దాదాపు రూ.50 లక్షలకు పైగానే రెవెన్యూ సాధించింది. అంటే పెట్టిన పెట్టుబడికి ఏకంగా నాలుగు రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
నేపథ్యం, సంచలన వివాదాలు
సగటు మధ్య తరగతి కుటుంబంలో ఏడుగురు పిల్లల్లో ఒకరిగా జన్మించిన మాధురి రాథోడ్, జానపద నృత్యాలు, సోషల్ మీడియా వీడియోల ద్వారా స్వశక్తితో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, తనతో పాటు డ్యాన్స్ చేసే తోటి కళాకారుడు ఈశ్వర్ సాయితో వేములవాడలోని రెడ్డి భవన్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వచ్చి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో పెద్ద వివాదం రాజుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఒకవైపు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కోట్ల వ్యూస్, భారీ సంపాదన సాధిస్తూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో వివాదాల చుట్టూ తిరుగుతుండటంతో మాధురి రాథోడ్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Madhuri Rathod: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయికి మాధురి బిగ్ షాక్!
Also Read: బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన రెండు రోజులకే గోడదూకాలని..20 అడుగుల గోడపైకి ఎక్కి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ganesh Chaturthi 2026: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Vinayaka Chavithi 2026 Timing: భారతీయుల సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి అత్యంత ప్రాముఖ్యమైనది. పార్వతీపరమేశ్వరుల చిన్న కుమారుడైన విఘ్నేశ్వరుడి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకొంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితి నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే, ప్రతి ఏటా లాగే ఈసారి కూడా పండుగను ఏ రోజున నిర్వహించుకోవాలి, పూజలకు ఏ సమయం అత్యంత ఉత్తమమైనది అనే విషయాలపై భక్తులలో క్లారిటీ లేక సందేహాలు ఏర్పడ్డాయి
చవితి తిథి వేళలు.. రెండు రోజుల అవకాశం
ఈ ఏడాది వినాయక చవితి తిథి సమయాల వివరాల్లోకి వెళితే.. భాద్రపద శుక్ల పక్ష చవితి తిథి సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం ఉదయం 7:06 గంటలకు (AM) ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15వ తేదీ మంగళవారం ఉదయం 7:44 గంటల (AM) వరకు కొనసాగుతుంది. ఈ విధంగా సుదీర్ఘ తిథి సమయం ఉండటం వల్ల 2026 సంవత్సరంలో వినాయక చవితి పండుగను భక్తులు రెండు రోజుల పాటు జరుపుకునే పవిత్ర అవకాశం లభించింది.
సెప్టెంబర్ 14నే పూజించేందుకు అవకాశం..
అయితే, అత్యధిక శాతం మంది భక్తులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజునే ఈ పవిత్ర పండుగ పూజలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే వినాయక ప్రతిమలను ఎంతో ఉత్సాహంగా కొనుగోలు చేసి తమ ఇళ్లకు, పూజా మండపాలకు తరలిస్తున్నారు. ఈసారి పండుగ సోమవారం రోజున రావడం భక్తులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే శనివారం, ఆదివారం, సోమవారం కలుపుకొని వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘమైన సెలవులు లభించాయి.
ఒకవేళ అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 14న పండుగ చేసుకోలేని వారు, సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 7:44 గంటల వరకు తిథి అందుబాటులో ఉన్నందున ఆ రోజు ఉదయం కూడా పూజా కార్యక్రమాలను జరుపుకోవచ్చు.
11 రోజుల పూజలు, నవరాత్రుల ఉత్సవాలు
సాధారణంగా సెప్టెంబర్ 14న వినాయక ప్రతిమలను నిలిపి నాటి నుండి దాదాపు 11 రోజుల పాటు నిత్యం అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ భాద్రపద మాసం మొత్తం గణపతి ఆరాధనకు అంకితం చేస్తారు. ఈ మాసంలో గణేశ్ చతుర్థి రోజు నుండి ప్రారంభించి అనంత చతుర్దశి తిథి వరకు భక్తులు నిరంతరాయంగా గణనాథుడిని పూజిస్తారు.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, పండితుల సూచనల ఆధారంగా పాఠకుల ఆసక్తి మేరకు అందించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు.)
Also Read: ఇళ్లు లేని వాళ్లకు గుడ్‌న్యూస్..పీఎం ఆవాస్ యోజనతో రూ.2.30 లక్షల కోట్లు మంజూరు?!
Also Read: సెప్టెంబరు 11న అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..BRICS కారణంగా వరుసగా 4 రోజులు బంద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Awas Yojana 2.0: ఇళ్లు లేని వాళ్లకు గుడ్‌న్యూస్..పీఎం ఆవాస్ యోజన 2.0 కింద రూ. 2.30 లక్షల కోట్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్!
Vijayawada, Andhra Pradesh:PM Awas Yojana 2.0 News: నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లలో లేదా అరకొర వసతులతో నివసిస్తున్న నిరాశ్రయులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పించడమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 (PMAY-U 2.0) ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలు కొత్తగా ఇల్లు నిర్మించుకోవడానికి, నిర్మించిన ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా అందుబాటు ధరలలో అద్దె గృహాలను పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.
రూ.10 లక్షల కోట్ల బడ్జెట్..
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నాలుగు ప్రధాన విభాగాల కింద అమలు చేస్తోంది.
1) లబ్ధిదారుల నేతృత్వంలోని గృహ నిర్మాణం: సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు సాయం
2) భాగస్వామ్యంతో అందుబాటు ధరల గృహ నిర్మాణం: డెవలపర్లు లేదా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణం.
3) అందుబాటు ధరల అద్దె గృహ నిర్మాణం: నగరాల్లో తక్కువ అద్దెకే వసతి పొందడం.
4) వడ్డీ రాయితీ పథకం: బ్యాంక్ రుణాలు తీసుకునే వారికి వడ్డీలో మినహాయింపు లేదా రాయితీ.
ఈ మొత్తం ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిని అంచనా వేయగా, అందులో ప్రభుత్వం రూ.2.30 లక్షల కోట్లను నేరుగా ఆర్థిక సహాయంగా సమకూరుస్తుంది. దీనిద్వారా సుమారు కోటి పట్టణ కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళలకు ప్రాధాన్యత, లబ్ధిదారుల అర్హతలు
ఈ పథకంలో ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), తక్కువ ఆదాయ వర్గాలు (LIG), మధ్య ఆదాయ వర్గాలు (MIG) చెందిన అర్హులైన కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. దేశంలో ఎక్కడా సొంతంగా శాశ్వత (పాకా) ఇల్లు లేని పట్టణ నివాసితులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంతేకాకుండా, గృహ కేటాయింపుల్లో మహిళల పేర్లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఆస్తిపై మహిళా యాజమాన్యాన్ని బలోపేతం చేస్తున్నారు.
1.25 కోట్లకు పైగా గృహాల ఆమోదం
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 2026 నాటికి 13.61 లక్షల ఇళ్లకు, జూన్ 2026 నాటికి అదనంగా 2.13 లక్షల ఇళ్లకు ఆమోదం లభించింది. ఆగస్టు 2026 నాటికి PMAY-U, PMAY-U 2.0 పథకాల కింద మొత్తం ఆమోదించిన ఇళ్ల సంఖ్య 1.25 కోట్లకు పైగా చేరింది. ప్రస్తుతం రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాల్లో సాంకేతిక బృందాల ఏర్పాటు ద్వారా స్థానిక నగర స్థాయిల్లో సర్వే, లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోంది. అర్హులైన నివాసితులు తమ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థలు (ULBs) లేదా అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: సెప్టెంబరు 11న అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..BRICS కారణంగా వరుసగా 4 రోజులు బంద్!
Also REad: School Holidays: ఈవారంలో స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు..విద్యార్థులకు పండగే పండగ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala: అలిపిరిలో మరోసారి చిరుత సంచారం.. తీవ్ర భయాందోళనల్లో తిరుమల భక్తులు ..
Hyderabad, Telangana:Leopard spotted at alipiri steps in Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగు బంగారం అయిన తిరుమలలో భక్తులరద్దీ విపరీతంగా ఉంది. తిరుమల లోని అన్ని కంపార్ట్ మెంట్ లు భక్తులతో నిండిపోయింది. శిలాతోరణం వరకు భక్తులు దర్శనాల కోసం వేచి ఉంటున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకుఇబ్బందులు లేకుండా టీటీడీ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తిరుమలలో నడక మార్గంలో ఇటీవల క్రూర జంతువుల సంచారం మాత్రం మరీ ఎక్కువైందని చెప్పుకొవచ్చు.
తరచుగా నడక మార్గంలో చిరుత పులులు, ఏనుగులు, ఎలుగు బంట్లు, పాములు వస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. తాజాగా.. మరోసారి అలిపిరి వద్ద చిరుత కన్పించడంతో భక్తులు చాలా సేపు టెన్షన్ లో ముందుకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు.
తిరుమలలోని అలిపిరి ఏడో మైలు సమీపంలో చిరుతను కొంత మంది భక్తులు చూశారు. వెంటనే అలర్ట్ అయి అక్కడున్న టీటీడీ సిబ్బందికి చెప్పారు. భక్తులు గట్టిగా కేకలు వేయడంతొ చిరుత పొదల్లోకివెళ్లిపోయింది. వెంటనే టీటీడీ విజిలెన్స్ అక్కడకు చేరుకున్నారు. భక్తులను గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచించారు.
చిన్న పిల్లలను మధ్యలో పెట్టుకొవాలన్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని కీలక సూచనలు చేశారు. మరోవైపు బ్రహ్మోత్సవాల వేళ తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిరుత సంచారంతో మరోసారి దీనిపై ఏదైన శాశ్వతంగా చర్యలు తీసుకొవాలని భక్తులు టీటీడీని డిమాండ్ చేస్తున్నారు.
Read more: Tirumala news: తిరుమలలో మరో అపచారం.!. మహాద్వార గోపురంపై విరిగిన కృష్ణస్వామి చెయ్యి.. వీడియో..
ఇటీవల రొబొ శునకాలను టీటీడీ టెస్ట్ చేసింది. దీనిపై పాలక మండలి సమావేశంలో చర్చించి ఈ క్రూర జంతువుల భయాందోళనలు లేకుండా ఒక శాశ్వతమైన పరిష్కారందిశగా అడుగులు వేస్తామని టీటీడీ ఇప్పటికే తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bigg Boss 10 Ansar: బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన రెండు రోజులకే గోడదూకి పారిపోవాలని..20 అడుగుల గోడపైకి ఎక్కి..చివరికి!
Chembarambakkam, Tamil Nadu:Bigg Boss 10 Ansar Escape: బుల్లితెరపై విజయవంతంగా ప్రసారం అవుతున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్' ఇటీవలే ఐదు ప్రాంతీయ భాషల్లో గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. సెప్టెంబరు 6వ తేదీన హిందీలో బిగ్‌బాస్ 20వ సీజన్ బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభం అవ్వగా.. ఇటు తెలుగు అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా.. తమిళంలో విజయ్ సేతుపతి హోస్టింగ్‌లో 10 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది.
అలాగే కన్నడం, మలయాళంలోనూ బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభమైంది. అయితే తాజాగా ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కేవలం రెండు రోజులకే ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతకీ అతను ఎవరు? ఏం జరిగిందనే విశేషాలను తెలుసుకుందాం.
2017లో తమిళంలో తొలిసారిగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో, 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు తాజాగా 10వ సీజన్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో కూడా సెప్టెంబర్ 6, 2026న ప్రారంభమైంది. ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.
గోడ దూకిన అన్సర్..
తమిళంలో 'కుక్ విత్ కోమాలి' అనే బుల్లితెర కార్యక్రమంతో పాటు అనేక ఇతర ప్రముఖ టెలివిజన్ షోల ద్వారా భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న అన్సర్.. ఇప్పుడు అదే క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. అయితే బిగ్‌బాస్ షోలోకి ప్రవేశించిన రెండు రోజులకే అతను గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
గతంలో తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో, నటుడు భరణి గోడ ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. ఇప్పుడు అన్సర్ కూడా అదే విధంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
అయితే బుల్లితెర సెలబ్రిటీ అన్సర్ హఠాత్తుగా హౌస్ నుండి పారిపోవడానికి చేసిన ప్రయత్నం వెనుక అసలు కారణం తెలియరాలేదు.అయితే, బిగ్ బాస్ హౌస్ మేనేజ్మెంట్తో జరిగిన చర్చలు,తోటి కంటెస్టెంట్స్ జేసన్‌తో జరిగిన వాగ్వాదం తర్వాత అతను మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
ఈ బిగ్‌బాస్ తమిళం 10వ సీజన్ గత సీజన్ల కంటే చాలా భిన్నంగా ఉండబోతోంది. మొదటి వారంలో సీరియల్ నటి సత్విక 'హజ్మాట్స్' జట్టుకు నాయకురాలిగా ఎంపిక కాగా.. పోటీదారులను రెండు వేర్వేరు జట్లుగా విభజించారు. దీనికి తోడు 'డెమోక్రసీ రూమ్' వంటి కొత్త ప్రయోగాలతో ఈ సీజన్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితమైన మలుపులు తీసుకుంటోంది. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read: బిగ్‌బాస్‌లో రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా? వారానికి లక్షల్లో సంపాదన!
Also Read: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒలింపిక్స్ బాక్సింగ్ ఛాంపియన్..రియాలిటీ షో చరిత్రలో తొలిసారిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party: తెలంగాణకు రేవంత్ రెడ్డి అనే చీడ తగిలింది.. దాని పీడ విరగడవ్వాలి'
Baddipadaga, Telangana:Desapathi Srinivas: తెలంగాణకు రేవంత్ రెడ్డి చీడ అనేది తగిలిందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ తెలిపారు. 'సభ ప్రారంభం కాగానే మా సభ్యులను సస్పెండ్ చేయాలని తీర్మానం పెట్టారు. మెజారిటీగా మేము ఉన్నాం తీర్మానం వీగిపోతుంది. కేవలం ఒక్క నిమిషంలోనే ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేశారు. ఇది చట్ట విరుద్ధమైన సస్పెండ్' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌ను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శాసనమండలి మీడియా పాయింట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభ బయట జరిగిన దానికి సస్పెండ్ చేసే అధికారం చైర్మన్‌కి లేదని స్పష్టం చేశారు. సభలో జరిగిన దానికి మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని తెలిపారు. ఏ రూల్ ప్రకారం సస్పెండ్ చేశారో అడిగితే మమ్మల్ని మార్షల్స్‌ను పెట్టీ బయటకు పంపారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మా సభ్యుల మీద దాడులు చేస్తున్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కామన్ అయింది. పోలీసులు భౌతిక దాడులు చేస్తున్నారు. ఇది నీచమైన పద్దతి' అని రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. 'జుట్టు పట్టుకు లాగుతున్నారు. మా మహిళ ఎమ్మెల్యేలు కన్నీరు పెట్టుకున్నారు. మా ఎమ్మెల్యేల కన్నీటికి విలువ లేదా?' అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులను ఏకపక్షంగా ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు.
'హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారు ఇక్కడ మమల్ని బుల్డోజ్ చేస్తున్నారు బుల్డోజర్ ప్రభుత్వం. ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం అణచివేతకు గురిచేస్తుంది. పాలిటెక్నిక్ పిల్లల పీకలు నొక్కుతున్నారు. ఇక్కడ ప్రతిపక్ష సభ్యుల పీకలు నొక్కుతున్నారు' అని రేవంత్ రెడ్డి పాలనలో పోలీసుల దౌర్జన్యాలు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వివరించారు. 'రాహుల్ గాంధీ నల్ల డ్రెస్ మీద మోదీ, అదానీ క్యారికేచర్ ఉంది. నినాదాలు ఉన్నాయి రాహుల్ గాంధీకి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా?' అని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు మమల్ని సభలోకి రాకుండా అడ్డుకున్నారని నిలదీశారు. 'రేవంత్ రెడ్డి భాష మీద చర్చ జరగాలి అంటున్నారు. రేవంత్ రెడ్డి భాష గురించి మాట్లాడే హక్కు లేదు. నిండు అసెంబ్లీలో బడివే అంటారు దానిమీద ఏం చర్యలు ఉండవా?' అని స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ దమనకాండ నడవదు ప్రతిఘటిస్తాం మీ దమనకాండ ప్రజల ముందు బట్ట బయలు అవుతుందని హెచ్చరించారు.
