ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్3 పరీక్ష
Mahabubabad, Telangana:ఖమ్మం జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష ఉండగా మద్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్2 పరీక్ష కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలు ఉండగా 27,984 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. నిమిషం నిభందన అమల్లో ఉండడంతో పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
బెస్ట్ స్వాతంత్ర దినోత్సవ వీడియో విషెస్..
Hyderabad, Telangana:80వ స్వాతంత్య్ర దినోత్సవ గ్రీటింగ్స్..
Hyderabad, Telangana:Happy 80th Independence Day: మత, భాష, సాంస్కృతులలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ.. భారతీయులమంతా ఒక్కటే అని ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండగ ఇది.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విజయవంతంగా కొనసాగుతోందని ఈ వేడుకలే ప్రత్యక్ష నిదర్శనం.. కాబట్టి ఇలా స్వాతంత్ర వేడుకలు ఎల్లప్పుడూ కులమత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరుకుంటూ.. దేశభక్తిని పెంపొందించడానికి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇలా 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ ను పంపండి..
అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
Hyderabad, Telangana:Happy 80th Independence Day Telugu: స్వేచ్ఛ వాయువుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను గుండెల్లో గుడిగా మలుచుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది.. 80 ఏళ్ల స్వేచ్ఛ ప్రస్థానంలో సాధించిన విజయాలను స్మరించుకుంటూ.. నవభారత నిర్మాణానికి పునరంకితమవుదాం.. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజున.. ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని నింపేందుకు ఈ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పంపండి..Independence Day 2026: 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా ఏర్పాట్లు..
Nunna, Vijayawada, Andhra Pradesh:80th Independence Day 2026: మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేశారు.Karur Stampede Govt Job: కరూర్ తొక్కిసలాట బాధితులకు సుప్రీంకోర్టులో ఊరట..ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం పట్ల హర్షం!
Karur, Tamil Nadu:Karur Stampede Govt Job News: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో జరిగిన కరూర్ తొక్కిసలాట యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఇటీవలే ఆ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సమావేశం అయ్యారు. ఈ విషాదాన్ని మానని గాయంగా అభివర్ణించిన ఆయన..బాధితుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను మద్రాసు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఇదే విషయాన్ని దేశంలోని అత్యున్నత ధర్మాసనం సుముఖత వ్యక్తం చేసింది. తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం పట్ల తప్పేమి లేదని అభిప్రాయపడింది.'డెడ్ డ్రాప్' కేసులో సంచలన విషయాలు.. అమ్మాయిలపై లైంగిక దాడి, సొంతంగా అబార్షన్
Hyderabad, Telangana:Dead Drop Marijuana Case: గంజాయి మత్తులో ఘోరాలకు పాల్పడుతున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. డెడ్ డ్రాప్ విధానంలో గంజాయి విక్రయిస్తూ.. పోలీసులు దాడి చేస్తే వారిపై ఓ కుక్కతోపాటు తుపాకీతో ఎదురుదాడి చేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. అయితే హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలానగర్‌లో ఆన్లైన్ పద్ధతిలో ఆరేళ్ల నుంచి గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. బొల్లా బ్రదర్స్ ఈ గంజాయి దందా చేస్తున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బొల్లా కిరణ్ దారుణాలకు పాల్పడ్డాడని తెలిసింది. అమ్మాయిలతో కూడా అతడు వ్యాపారాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
డెడ్ డ్రాప్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రోజుకు డెడ్ డ్రాప్ ద్వారా 25 సార్లు గంజాయిని బొల్లా బ్రదర్స్ విక్రయిస్తున్నారు. గంజాయి ముఠా బొల్లా బ్రదర్స్‌తో ఐదు మంది కానిస్టేబుల్స్, ఎస్ఐతో ప్రయివేటు పార్టీలు ఈ ముఠా చేసుకుంది. కేసుల్లో నిందితులను పట్టుకొని రావడానికి కారును బొల్లా బ్రదర్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన బొల్లా బ్రదర్స్ ఇంట్లోనే పోలీసులతో కలిసి పార్టీలు చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇక కృష్ణవేణి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ఈ గంజాయి దందా చేస్తోందని పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా కృష్ణవేణికి అబార్షన్ అయ్యేలా బొల్లా కిరణ్ అనైతికంగా ప్రవర్తించాడు. ఈ కేసులో నిందితులతో కలిసి పార్టీలు చేసుకున్న ఎస్సైను పోలీస్ శాఖ హెడ్ క్వాటర్స్‌కు అటాచ్ చేసింది. ఒరిస్సా నుంచి 31 మంది రోజు బొల్లా బ్రదర్స్‌కి గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిసింది.
మొత్తం 203 కస్టమర్లకి డెడ్ డ్రాప్ ద్వారా బొల్లా బ్రదర్స్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గంజాయి విక్రయాలతో వచ్చిన డబ్బులతో అమ్మాయిలపై బొల్లా కిరణ్ పెట్టుబడి పెట్టాడు. వరంగల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి మైనర్ అమ్మాయిలను హైదరాబాద్ తీసుకొచ్చి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. వారు గర్భం దాలిస్తే సొంతంగా అబార్షన్ చేయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
గర్భం దాల్చిన అమ్మాయిలపై బొల్లా కిరణ్ దాడులకు తెగబడ్డాడు. గర్భం దాల్చిన అమ్మాయి కడుపులపై దాడులు చేసి అబార్షన్ అయ్యేలా క్రూరంగా బొల్లా కిరణ్ వ్యవహరించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా సొంతంగా అమ్మాయిలకు అబార్షన్ చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. డబ్బులకు ఆశపడి కిరణ్ అఘాయిత్యాలను బాధిత అమ్మాయిలు బయటకు చెప్పలేదు. అమ్మాయిల పేరుతో సిమ్‌లు తీసుకుని ఆ నంబర్లతో గంజాయి దందాకు వాడుతున్నాడు.
ఒక మహిళ ఖాతాలో లక్షల రూపాయల లావాదేవీలు అధికారులు గుర్తించారు. అమ్మాయిల తల్లిదండ్రులను కూడా ట్రాప్ చేసి తన దగ్గర పెట్టుకోవడం గమనార్హం. పోలీసులపై దాడులు చేసేందుకు ఏకంగా రెండు కుక్కల్ని బొల్లా కిరణ్ పెంచాడు. పోలీసులను బెదిరించడానికి ఒక తుపాకీ కూడా ఉంది. ఆరు సంవత్సరాల నుంచి డెడ్ డ్రాప్ ద్వారా బొల్లా కిరణ్ గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. అతడికి కస్టమర్లుగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. బొల్లా కిరణ్ కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Uber Rapido Merger: ఉబర్-ర్యాపిడో విలీన చర్చలపై అర్ధాంతర బ్రేక్..మేనేజ్మెంట్ విభేదాలే కారణమా?
Hyderabad, Telangana:Uber Rapido Deal: అమెరికాకు చెందిన ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఉబర్, భారతీయ స్టార్టప్ రాపిడోతో కలిసి పనిచేసేందుకు జరిపిన చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దేశీయంగా తమ కార్యకలాపాలను విలీనం చేసుకునే దిశగా అడుగులు వేసినప్పటికీ, యాజమాన్య నియంత్రణ విషయంలో ఇరు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ డీల్‌కు బ్రేక్ పడింది.
చర్చల వెనుక అసలు కథ
ఉబర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోస్రోషాహి ఈ ఏడాది మే నెలలో ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. దేశంలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణ ప్రణాళికలపై ఆయన వరుస సమీక్షలు జరిపారు. ఈ క్రమంలోనే రాపిడోతో విలీనం అంశం తెరపైకి వచ్చింది.
ఉబర్ ప్రతిపాదన ఏమిటంటే?
క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ సేవలందిస్తున్న ఇరు సంస్థలు కలిసి పనిచేయాలని ఉబర్ తొలుత ప్రతిపాదించింది. అంతేకాకుండా, దేశీయంగా తమ కార్యకలాపాలన్నింటినీ రాపిడో బృందమే నిర్వహించాలని సూచించింది.
అయితే, రాపిడో మాత్రం అందుకు భిన్నమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఉబర్ భారత వ్యాపారాన్ని పూర్తిగా తమకు క్యాష్-స్టాక్ లావాదేవీ రూపంలో విక్రయించాలని, రాపిడోలో ఉబర్ కేవలం మైనారిటీ వాటాదారుగా మాత్రమే ఉండాలని కోరింది.
డీల్‌కు ఎందుకు బ్రేక్ పడింది?
భారత్‌లో తమ వ్యాపారాన్ని పూర్తిగా వేరే సంస్థకు విక్రయించడం ఇష్టం లేని ఉబర్.. రాపిడో ప్రతిపాదనను తిరస్కరించింది. మేనేజ్మెంట్ కంట్రోల్ తమ చేతుల్లోనే ఉండాలని ఉబర్ భావించగా, రాపిడో పూర్తి స్థాయి యాజమాన్యాన్ని కోరడంతో ఈ చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు ఎవరికి వారుగా స్వతంత్రంగానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. రాపిడోకు గట్టి పోటీనిచ్చేందుకు ఉబర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తన బైక్ ట్యాక్సీ సేవలను కొత్తగా మరో 100 నగరాలకు విస్తరించగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 220 నగరాల్లో ఉబర్ బైక్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Also Read: ఆగస్టు 15న వినియోగదారులకు స్పెషల్ ఆఫర్.. రూ.1 రీఛార్జ్ ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చింది
Also Read: ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్..పీఎం ఈ-డ్రైవ్ పథకంతో రూ.5,000 డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Teacher Hair: విద్యార్థితో దర్జాగా జడ వేయించుకున్న ఇంగ్లీష్ టీచరమ్మ.. వీడియో వైరల్
Kesamudram, Telangana:KGBV Teacher Hair Video: విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయులు తమ సొంత పనులు చేపించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ విద్యార్థులతో జుట్టు వేయించుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థిని తో జడలు వేయించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా మిగతా విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించారు. మరికొందరు విద్యార్థులతో గుంజీలు తీయించారు. ఈ సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులో కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు అర్చన ఉన్నారు. ఆమె పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినితో జడలు వేయించుకున్నారు. ఆ దృశ్యాలు ఎవరో ఫోన్లో చిత్రీకరించారు. అంతేకాకుండా మరో విద్యార్థి కూర్చుని ఉండగా ఏమైంది? అంటూ దురుసుగా ప్రవర్తించారు. 20 గుంజీలు తీయించారు అని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆమె మాత్రం విద్యార్థినితో దురుసుగా మాట్లాడారు. ఈ వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది.
టీచర్ చేసిన పనికి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన ఆమె ఇలా తన సొంత పనులు చేయించుకోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ఇది ఇల్లా లేక ఆ పిల్లలు పనిమనుషులా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహార శైలి ఎప్పుడూ ఇలానే ఉంటుందని.. విద్యార్థులను వేధింపులకు గురి చేస్తోందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఇంగ్లీష్ టీచర్ అర్చనను సస్పెండ్ చేయాలని కేజీబీవీలోని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా కేజీబీవీలో మరికొందరు పాఠశాల ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సరైన ఆహారం పెట్టడం లేదని.. తమ గురుకులంలో మౌలిక వసతులు కరువయ్యాయని విద్యార్థులు వాపోతున్నారు. కేజీబీవీపై ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయ. వెంటనే కేజీబీవీ విద్యాలయాన్ని సందర్శించి ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Midnight Independence: భారతదేశానికి అర్ధరాత్రే స్వాతంత్ర్యం ఎందుకు వచ్చింది? ఆగస్టు 15 వెనుక దాగున్న జోతిష్య రహస్యం!
Hyderabad, Telangana:Midnight Independence Astrology: 1947, జూన్ 4వ తేదీ ఉదయం.. కలకత్తాలోని ఓ ఇంట్లో రేడియో వింటున్న ప్రముఖ జ్యోతిష్కుడు స్వామి మదనానంద్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆల్ ఇండియా రేడియో వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. 1948 జూన్ వరకు ఉన్న గడువును ముందుకు జరిపి, 1947 ఆగస్టు 15నే భారత్‌కు పూర్తి స్వాతంత్ర్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. దేశమంతా పండగలా భావించే ఈ వార్త మదనానంద్ను అపారమైన భయాందోళనలోకి నెట్టింది.
వెంటనే ఆయన తన జ్యోతిష్య పటాలను, గ్రహాల చక్రాలను పరిశీలించగా.. ఆయన గుండె ఆగిపోయినంత పనైంది. "గ్రహాల స్థితి దారుణంగా ఉంది.. ఆ రోజు భారత్ జన్మించకూడదని" ఆయన అంతరాత్మ ఘోషించింది.
జ్యోతిష్కుల హెచ్చరికలు - అశుభ ముహూర్తం
మదనానంద్ ఒక్కరే కాదు.. కలకత్తా, బెనారస్, దక్షిణ భారతదేశంలోని దిగ్గజ జ్యోతిష్కులందరూ ఖగోళ చక్రాలను పరిశీలించగా అందరి లెక్కింపుల ముగింపు ఒక్కటే అయింది. భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి నిర్ణయించిన 'ఆగస్టు 15' అత్యంత అశుభకరమైన రోజు!
ఆ రోజు శుక్రవారం కావడం, మకర లగ్నంలో శని, రాహువుల ప్రభావం ఉండటం, గురు, శుక్ర గ్రహాలు అత్యంత అపశకున స్థానాల్లో కొలువై ఉండటం దేశానికి పెను ముప్పు తెస్తుందని వారు నమ్మారు. ఈ తేదీని మార్చకపోతే వరదలు, కరువులు, దారుణమైన మారణకాండలు ముంచెత్తుతాయని హెచ్చరిస్తూ మదనానంద్ స్వయంగా మౌంట్‌బాటన్‌కు లేఖ రాశారు. "భగవంతుడి మీదొట్టు.. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వకండి" అని వేడుకున్నారు. మరోవైపు ప్రముఖ జ్యోతిష్కులు జవహర్లాల్ నెహ్రూతో సహా ప్రధాన నాయకులను కలసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మౌంట్‌బాటన్ పట్టుదల వెనుక కారణం
బ్రిటీష్ వారు వేలాది ఏళ్లుగా వస్తున్న జ్యోతిష్య సాంప్రదాయాన్ని, ఖగోళ నమ్మకాలను అస్సలు పరిగణనలోకి తీసుకోకుండా ఈ తేదీని ప్రకటించారు. నిజానికి దీని వెనుక మౌంట్‌బాటన్ వ్యక్తిగత ఉద్దేశం ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం మిత్రరాజ్యాలకు లొంగిపోయి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతున్న సందర్భం ఆగస్టు 15. తన అధికారానికి, విజయానికి గుర్తుగా ఆయన హఠాత్తుగా ఈ రోజును ఎంచుకున్నారు.
రాజకీయ వేగం పుంజుకున్న ఆ సమయంలో బ్రిటీష్ వారు ప్రకటించిన తేదీని మార్చడం అసాధ్యంగా మారింది. అలాగని కోట్ల మంది నమ్మకాలను, జ్యోతిష్కుల హెచ్చరికలను తోసిపుచ్చడం నాయకులకు ఇష్టం లేదు. దేశ విభజన, రాజకీయ ఉద్రిక్తతలతో రగిలిపోతున్న వేళ.. కొత్త దేశానికి అశుభ ముహూర్తం ఉందనే భయం ప్రజల్లో ఉండకూడదని భావించారు.
నెహ్రూ చతురత - అర్ధరాత్రి పరిష్కారం
సరిగ్గా ఇక్కడే జవహర్లాల్ నెహ్రూ ఒక అద్భుతమైన, వినూత్నమైన పరిష్కారాన్ని ఆలోచించారు. పాశ్చాత్య కాలమానం ప్రకారం రాత్రి 12 గంటలు దాటగానే కొత్త రోజు (ఆగస్టు 15) ప్రారంభమవుతుంది. కానీ, హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంతోనే కొత్త రోజు మొదలవుతుంది. అంటే అర్ధరాత్రి 12 గంటల సమయం ఇంకా పాత రోజు (ఆగస్టు 14) కిందకే వస్తుంది.
జ్యోతిష్య బలం..
వైదిక జ్యోతిష్యం ప్రకారం పగలు, రాత్రి కలిసే సంధ్యా సమయం లేదా అభిజిత్ ముహూర్తం, రాజ్య స్థాపనకు అత్యంత అనుకూలమైన 'పుష్య నక్షత్రం' ప్రభావం ఆ అర్ధరాత్రి వేళ అందుబాటులో ఉన్నట్లు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త కేఎన్ రావు పేర్కొన్నారు.
ఈ చిక్కుముడిని విప్పడానికి నెహ్రూ ఒక మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు. ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నామే రాజ్యాంగ పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, దానిని రాత్రి వరకు కొనసాగించారు. సరిగ్గా రాత్రి 12 గంటలు కొట్టే సమయానికి స్వాతంత్ర్య ప్రకటన చేశారు.
దీనివల్ల పాశ్చాత్యుల లెక్కల ప్రకారం ఆగస్టు 15 ప్రారంభమైనట్లూ అయింది, భారతీయ జ్యోతిష్య లెక్కింపుల ప్రకారం అశుభకరమైన ఆగస్టు 15 సూర్యోదయానికి ముందే అనుకూలమైన ముహూర్తంలో దేశం పురుడు పోసుకున్నట్లూ అయింది. ఈ తెలివైన పరిష్కారానికి మౌంట్‌బాటన్ కూడా అంగీకరించారు.
అలా జ్యోతిష్కుల హెచ్చరికలు, లార్డ్ మౌంట్‌బాటన్ పట్టుదల, నెహ్రూ చతురతల కలనేతగా భారత్ 'అర్ధరాత్రి' వేళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. "ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారత్ సజీవంగా, స్వతంత్రంగా మేల్కొంటుంది" అంటూ నెహ్రూ ఇచ్చిన చారిత్రాత్మక పిలుపు వెనుక ఉన్న అసలు రహస్యం ఈ ఖగోళ, ముహూర్తాల విచిత్ర సంగ్రామమే!
Also Read: స్వాతంత్ర్య దినోత్సవం 2026 వేడుకల తర్వాత జాతీయ జెండాతో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
Also Read: ఆగస్టు 15న వినియోగదారులకు స్పెషల్ ఆఫర్.. రూ.1 రీఛార్జ్ ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Independence Day 2026: స్వాతంత్ర్య దినోత్సవాల వేళ 1,057 మందికి సర్వీస్ మెడల్స్..ముగ్గురికి మరణాంతరం ప్రకటన!
Hyderabad, Telangana:Independence Day Medals 2026: 2026 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోమ్ గార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్ (జైలు శాఖ) విభాగాలకు చెందిన మొత్తం 1,057 మంది సిబ్బందికి శౌర్య, సేవా పతకాలు దక్కినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు పోలీసు సిబ్బందికి మరణానంతరం శౌర్య పతకాలు లభించడం విశేషం.
మరణానంతరం శౌర్య పతకాలు పొందిన వారు
దివంగత నితేష్ ఎక్కా (కానిస్టేబుల్, ఛత్తీస్‌గఢ్ పోలీస్)
దివంగత రమేష్ కోరేటి (కానిస్టేబుల్, ఛత్తీస్‌గఢ్ పోలీస్)
దివంగత సునీల్ కుమార్ (ఇన్స్పెక్టర్, ఉత్తరప్రదేశ్ పోలీస్)
పతకాల వివరాలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 1,057 పురస్కారాలను ప్రకటించగా.. ఏ పురస్కారానికి ఎంతమంది ఎంపికయ్యారనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
శౌర్య పతకాలు (గ్యాలెంటరీ ఆఫ్ మెడల్ అవార్డ్స్) కోసం 301 మందిని ఎంపిక చేశారు. విశిష్ట సేవలకు రాష్ట్రపతి పతకాలకు (ప్రెసిడెంట్ మెడల్స్) దాదాపుగా 92 మందిని ఎంపిక చేయగా.. ప్రశంసనీయ సేవలకు పతకాలు (మెడల్ ఆఫ్ మెరిటోరియస్ సర్వీస్) విభాగంలో 664 మందికి పురస్కారాలను బహుకరించనున్నారు.
శౌర్య పతకాల కేటాయింపు విశేషాలు
ప్రకటించిన 301 శౌర్య పతకాలలో వివిధ ప్రాంతాల వారీగా ప్రాధాన్యత లభించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుంచి 197 మందిని.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి 51 మంది.. ఈశాన్య రాష్ట్రాల నుంచి 12 మందితో పాటు ఇతర ప్రాంతాల నుంచి 41 మందిని ఎంపిక చేశారు.
ఈ శౌర్య పతకాలను పొందిన వారిలో 272 మంది పోలీసు సిబ్బంది, 29 మంది అగ్నిమాపక శాఖ సిబ్బంది ఉన్నారు. ప్రాణాలు, ఆస్తుల రక్షణలో, నేరాల నివారణలో లేదా నేరస్తుల అరెస్టులో అత్యంత సాహసోపేతమైన చర్యలు చేపట్టిన సిబ్బందికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
సేవా పతకాల విభజన
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాల కోసం 92 మందిని ఎంపిక చేయగా.. అందులో పోలీసు శాఖ (83), అగ్నిమాపక శాఖ (4), పౌర రక్షణ, హోమ్ గార్డ్ (3), కరెక్షనల్ సర్వీస్/జైలు శాఖ (2)లో వారు ఉన్నారు. మెరిటోరియస్ సేవా పతకాల కోసం 664 మందికి ప్రదానం చేయనుండగా.. వారిలో పోలీసు శాఖ నుంచి 606 మంది.. అగ్నిమాపక శాఖలో 28 మంది, పౌర రక్షణ- హోమ్ గార్డ్ నుంచి 18 మంది, కరెక్షనల్ సర్వీస్ 12 మంది ఉన్నారు.
సేవలో అత్యుత్తమ విశిష్టతను కనబరిచిన వారికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాన్ని, అంకితభావంతో విలువైన సేవలు అందించిన వారికి మెరిటోరియస్ సేవా పతకాన్ని ప్రదానం చేస్తారు.
Also Read: స్వాతంత్ర్య దినోత్సవం 2026 వేడుకల తర్వాత జాతీయ జెండాతో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
Also Read: యూపీఐ లావాదేవీలపై భారీగా ఛార్జీలు?! అదనపు ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP SIR Electoral Roll: 'సర్' సర్వేలో ఓటు పోయిందా? అయితే ఆగస్టు 30లోపు ఈ పని చేస్తేనే మీకు ఓటు ఉంటుంది!
Vijayawada, Andhra Pradesh:AP SIR Electoral Roll News: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (AP SIR)లో భాగంగా ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. అనంతరం అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. అయితే ఈ జాబితాల్లో పలువురి పేర్లు కనిపించకపోవడంతో ఓటర్లలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గతంలో ఉన్న ఓట్లకు, ప్రస్తుత ఓట్లకు మ్యాపింగ్ జరగని కారణంగా కొందరి పేర్లు ముసాయిదా జాబితాలో నమోదు కాలేదు. దీంతో తమ ఓటు హక్కు కోల్పోతామేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముసాయిదా జాబితాలో పేరు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మూడు రకాల మార్గాలను, ప్రత్యేక పోర్టళ్లను అందుబాటులో ఉంచింది. వివరాల నమోదు లేదా సవరణల కోసం వివిధ దరఖాస్తు ఫారాలను ఉపయోగించవచ్చు.
1) కొత్త ఓటరు నమోదు కోసం ఫామ్-6.
2) విదేశీ నివాసితుల కోసం ఫామ్-6A.
3) సవరణలు, తొలగింపులు లేదా అభ్యంతరాల కోసం ఫామ్-7.
4) చిరునామా మార్పుల కోసం ఫామ్-8.
ఈ దరఖాస్తులను అధికారిక Voters' Service Portal ద్వారా లేదా ECI Net మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల అనంతరం సంబంధిత బూత్ స్థాయి అధికారులు (BLO), ఈఆర్వో లేదా ఏఈఆర్వోల ద్వారా పరిశీలన ప్రక్రియ పూర్తి చేయబడుతుంది.
నిర్దేశిత గడువులోపు ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లు తగిన ఫారాలను సమర్పించి తమ ఓటు హక్కును పునరుద్ధరించుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరింత సమాచారం, అధికారిక మార్గదర్శకాలను తెలుసుకోవడానికి Chief Electoral Officer Andhra Pradesh పోర్టల్‌ను సందర్శించవచ్చు.
Also Read: కర్నూలు పర్యటనలో వైఎస్ జగన్‌కు తీవ్ర అవమానం?! జైలులో మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం!
Also Read: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..జనసేనలోకి ఎమ్మెల్యే రాజాసింగ్..అసలు ట్విస్ట్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan Kurnool Tour: కర్నూలు పర్యటనలో వైఎస్ జగన్‌కు తీవ్ర అవమానం?! జైలులో మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం!
Pattikonda, Andhra Pradesh:YS Jagan Kurnool Jail Visit: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా జైలులో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు ఆయన ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి భారీ ప్రదర్శనగా పంచలింగాలలోని జిల్లా జైలుకు చేరుకున్నారు. ఈ ములాఖత్ అనంతరం జైలు అధికారుల తీరుపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
జగన్ చేసిన ఆరోపణలు
జైలులో తనను అవమానించేలా అధికారులు వ్యవహరించారని జగన్ ఆరోపించారు. సాధారణంగా ములాఖత్‌కు వచ్చేవారిని లోపల కూర్చోబెట్టి ఫొటో తీస్తారని, కానీ తన విషయంలో మాత్రం నిబంధనలు మార్చారని తెలిపారు. తనను గ్రిల్ వెలుపల నిలబెట్టి ఫొటో తీశారని చెప్పారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా.. అందరినీ కూర్చోబెడతామని, కానీ మీరు కాబట్టి నిలబెట్టి ఈ విధంగా చేయాలని తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని సమాధానం ఇచ్చినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి.
జైలు సూపరింటెండెంట్ వివరణ
జగన్ చేసిన ఆరోపణలపై కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టతనిచ్చారు. జైలు నిబంధనల ప్రకారమే అన్ని చర్యలు తీసుకున్నామని, మాజీ సీఎం హోదాకు గానీ, ఆయన గౌరవానికి గానీ ఎక్కడా భంగం కలిగించలేదని ఆయన స్పష్టం చేశారు. ములాఖత్‌కు వచ్చే ప్రతి ఒక్కరి ఫొటో తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు.
'ఇ-ప్రిజన్స్' సాఫ్ట్వేర్ నిబంధనల ప్రకారం.. ఎంతమంది ముద్దాయిలను కలవాలనుకుంటే అన్నిసార్లు తప్పనిసరిగా ఫొటో తీయాలని ఆయన వివరించారు. ఈ నిబంధన మేరకే జగన్ ఫొటోను రెండుసార్లు తీశామని వెల్లడించారు. జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తమ్ముడు శ్రీరాములను కలిసేందుకు జగన్ వచ్చారని, ఆ సమయంలో ఏ అధికారికీ, సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. పూర్తి నిబంధనల ప్రకారమే ములాఖత్ నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు.
Also REad: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్..వైఎస్ జగన్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!
Also Read: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..జనసేనలోకి ఎమ్మెల్యే రాజాసింగ్..అసలు ట్విస్ట్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
80th Independence Day Speech: 80వ స్వాతంత్ర దినోత్సవ స్పెషల్ స్పీచ్.. బహుమతి గెలవడం ఖాయం!
Hyderabad, Telangana:80th Independence Day Speech In Telugu: ఈరోజు మనమంతా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.. ఈ స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడానికి వెనక ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎంతోమంది నాయకుల కష్టాలున్నాయి. వారి త్యాగాలను కష్టాలను స్మరించుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి.. ముఖ్యంగా అన్ని స్కూళ్లలో రెండు రోజుల ముందు నుంచే ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన స్పీచ్ పోటీలు కూడా ఉంటాయి. ఇందులో భాగంగా దేశభక్తిని పెంపొందించే ప్రసంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలామంది స్టేజ్ పైన దేశ స్వాతంత్రానికి సంబంధించిన స్పీచ్ లు కూడా ఇస్తారు. మీరు కూడా బహుమతి గెలుచుకోవడానికి మంచి స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇది మీకోసమే..
నా ప్రియతమైన విద్యార్థులకు, ముఖ్యంగా యువతి యువకులకు.. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ. మనం ఈరోజు 8వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దానికి ఏకైక కారణం మన స్వాసంత్ర సమరయోధుల నిస్వార్ధమైన త్యాగ ఫలితాలే.. ఆ రోజుల్లో వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన ఈ స్వేచ్ఛను.. సుసంపన్నమైన దేశ అభివృద్ధికి పునాదిగా మార్చాల్సిన బాధ్యత నేటి యువత భుజాలపైనే వంద శాతం ఉంది.. దేశానికి అసలైన సంపద ఇప్పటి యువతే.. మీరు ఈ దేశానికి వెన్నుముక లాంటి వారు.. మీ ఆలోచనలతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు, మీ ఆశయాలే రేపటి నవ భారత దేశ రూపురేఖలను నిర్ణయిస్తూ ఉంటాయి..
ఈ ఆధునిక డిజిటల్ యుగంలో సాంకేతికతను ఆయుధంగా మల్చుకోండి.. అయితే, అది కేవలం వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా సమాజ శ్రేయస్సుకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడేలా చూడాల్సిన అవసరం ఎంతగానో ఉంది.. దేశం ముందున్న అసమానతలతో పాటు నిరుద్యోగం, వాతావరణం లో వస్తున్న ఊహించని మార్పుల వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి మీ నైపుణ్యాలకు పదును పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఉపాధి కోసం ఎదురుచూసేవారుగా కాకుండా.. పదిమందికి ఉపాధి కల్పించే కొత్త కొత్త ఆవిష్కర్తలుగా.. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలుగా మీరు తప్పకుండా ఎదగాల్సిన అవసరం మున్ముందు ఉంది.. కులమత ప్రాంతీయ భేదాలను పక్కనపెట్టి.. నువ్వు నేను భారతీయులం అనే ఏకతాటిపైకి వచ్చి గర్వంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది..
Also Read: 80th Independence Day Speech: రోమాలు నిక్కబొడుచుకునే 80వ స్వాతంత్ర దినోత్సవ స్పీచ్..
గత ఎనిమిది దశాబ్దాల్లో మనం సాధించిన విజయాలను చూసి గర్వపడుతూనే.. ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే దిశగా వేగంగా ప్రతి ఒక్క యువత అడుగులు వేయాలి.. పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలకు సంబంధించిన సాధికారత, అంతరిక్ష పరిశోధనలు వంటి ప్రతి రంగంలో మన యువత అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. 80 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ ప్రయాణంలో యువత వంతు చెరగని ముద్ర వేయడానికి ఇది సరైన సమయం.. మీ అద్భుతమైన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచితే చాలు.. మీ కలలను సులభంగా సహకారం చేసుకోవచ్చు.. దేశ అభివృద్ధిలో భాగం కూడా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్క యువత ఎంతో కష్టపడి దేశ అభివృద్ధిలో భాగం కావాలని కోరుకుంటూ సెలవు.. జైహింద్ జై భారత్..
Also Read: 80th Independence Day Speech: రోమాలు నిక్కబొడుచుకునే 80వ స్వాతంత్ర దినోత్సవ స్పీచ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Best Independence Day Speech: స్టేజ్ దద్దరిల్లేలా 80వ స్వాతంత్ర దినోత్సవ స్పీచ్..
Hyderabad, Telangana:80th Independence Day Speech In Telugu: భారతదేశ వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసుకుంటున్న భారతదేశం.. భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో కష్టాలు వచ్చినా ముందుకు సాగుతూనే ఉంది.. అద్భుతమైన నాయకత్వంతో దేశ యువత మంచి మంచి లక్ష్యాలతో ఉన్నత స్థానాల్లోకి ఎదుగుతున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ ఎన్నో విజయాలు సాధించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని.. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప్రతి ఒక్క యువతకు గుండెల్లో దేశభక్తి నిండేలా అద్భుతమైన ప్రసంగాన్ని జీ తెలుగు న్యూస్ మీ ముందుకు తీసుకువచ్చింది..
దేశభక్తి ప్రసంగం ప్రారంభం..
నా ప్రియమైన ప్రజలారా.. ముఖ్యంగా దేశ యువతి యువకులారా.. అందరికీ 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా.. మన దేశం సాధించిన ప్రగతిని చూసి మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు వనరుల సమస్యలతో ఇబ్బంది పడి.. ఎన్నో కష్టాలను అనుభవించిన మన దేశం.. ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల్లో.. ఐటీ రంగాల్లో ప్రపంచ దేశాలకు దీటుగా నిలిచింది. సాంకేతిక విప్లవంతో పాటు డిజిటల్ ఇండియా, మౌలిక సదుపాయాల కల్పనలో మనం అభివృద్ధి చెందిన దేశాలకు సవాల్ విసురుతూ వెళ్తున్నాం..
అయితే.. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా మన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదని భావించవచ్చు.. మనం అధిరోహించాల్సిన శిఖరాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆర్థిక అసమానతలతో పాటు నిరుద్యోగం, పేదరికం లాంటి సవాళ్లను మనమంతా సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని సభాముఖంగా చెబుతున్నాను. దేశంలో గొంతుకలేని ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యంతో పాటు విద్య అందినప్పుడే మన స్వాతంత్రానికి సార్థకత చేకూరుతుంది.
ప్రపంచంలో మరే దేశానికి లేని అతిపెద్ద బలం ఇప్పుడున్న మన యువత. ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేస్తూ.. ఆవిష్కరణలతో ముందుకొస్తే రాబోయే కొన్నేళ్లలోనే మన భారతదేశం 100% అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోగలుగుతాం.. కుల మత వర్గ ప్రాంతీయ విభేదాలను తొలగించి.. జాతీయ సమైక్యతను చాటితేనే దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ స్వయం సమృద్ధి భారత్ కలను నిజం చేస్తే తప్పకుండా భారత్ అభివృద్ధి చెందుతుంది.. అంతేకాకుండా మనమంతా కలిసికట్టుగా అడుగులు వేస్తే అసాధ్యం అన్నది ఏది ఉండదు.. జై హింద్, జై భారత్..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IND Vs SL 1st Test: శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ఇండియా ప్లేయింగ్ 11 ఇదే! బెంచ్ మీద నలుగురు ఆటగాళ్లు!
Galle, Southern Province:IND Vs SL 1st Test 2026: శ్రీలంకతో గాలే వేదికగా శనివారం (ఆగష్టు 15) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం భారత జట్టు తుది కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్లేయింగ్ 11పై కీలక హింట్లు ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్‌లను ఒకే మ్యాచ్‌లో ఆడించడం జట్టుకు ఎలాంటి సమస్య కాదని మోర్కెల్ స్పష్టం చేశారు.
స్పిన్ త్రయంపై మోర్కెల్ వ్యూహం
గాలే పిచ్ స్వభావాన్ని బట్టి మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లకు విపరీతమైన సహకారం లభించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ద్వారా లంక బ్యాటర్లపై మరింత ఒత్తిడి తెవచ్చని మేనేజ్మెంట్ భావిస్తోంది.
కుల్దీప్ యాదవ్ అటాకింగ్ బౌలర్ కాగా, రవీంద్ర జడేజా కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టడి చేయగలరు. ఇక మానవ్ సుతార్ బంతిని ఎక్కువగా టర్న్ చేయగలగడం జట్టుకు అదనపు బలం. వీరు ముగ్గురి బౌలింగ్ శైలి వేర్వేరుగా ఉండటం వల్ల ప్రత్యర్థికి సవాల్‌గా మారుతుందని మోర్కెల్ తెలిపారు. విభిన్న స్పిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండటం వల్ల లంక బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టి 20 వికెట్లు పడగొట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు.
పేస్ దళంపై అంచనాలు
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో మహ్మద్ సిరాజ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నారు. కొత్త బంతిని పంచుకునే రెండో పేసర్ స్థానం కోసం ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ మధ్య పోటీ నెలకొంది. లంకలో ఉండే తీవ్రమైన వేడి, అధిక తేమతో కూడిన వాతావరణంలో కూకాబుర్రా బంతితో పేసర్లు ఎలా రాణిస్తారనేది కీలకమని మోర్కెల్ అభిప్రాయపడ్డారు.
అంచనా వేస్తున్న తుది జట్టు (Playing 11)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.
బెంచ్‌కే పరిమితం కానున్న నలుగురు..
ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు యువ ఆటగాళ్లు ఆకిబ్ నబీ, సారాంశ్ జైన్లు బెంచ్‌కే పరిమితం కానున్నారు. దీంతో వీరిద్దరి అంతర్జాతీయ అరంగేట్రం మరోసారి వాయిదా పడినట్లయింది.
Also Read: టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? బీసీసీఐలో కీలక పదవికి హైదరాబాదీ సై!
Also REad: ఆర్సీబీ ఆటగాడిపై కన్నేసిన కావ్యా పాప..ఐపీఎల్ ట్రేడ్ డీల్‌లో అతడే కావాలని పట్టు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
