icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

YS Jagan: జూడాల సమ్మెపై అహంకారం వీడాలని సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి

Nuzendla, Andhra Pradesh:

Junior Doctors Strike: ప్రజల ప్రాణాలు కాపాడే జూనియర్‌ డాక్టర్లను రోడ్డెక్కించి.. పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. జూడాల స్టైపెండ్‌ సవరణను ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. 'జూనియర్‌ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్‌ రూమ్‌ వంటి అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి మీ మొండివైఖరే కారణం కాదా చంద్రబాబు? అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

రెండు వారాలుగా జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేపట్టగా.. వారి డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో 'ఎక్స్‌' వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. 'రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్‌లు, పీజీలు, సూపర్‌ స్పెషాలిటీ, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు 2 వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు?' అని చంద్రబాబును వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

'జూనియర్‌ డాక్టర్లకు జీవో నంబర్‌ 287 నిర్దేశించిన 15శాతం కంటే అధికంగా మా హయాంలో 42.4 శాతం పెంచాం. సూపర్‌ స్పెషాల్టీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్‌ రెసిడెంట్స్‌గా గురిస్తూ, వారి విజ్ఞప్తినికూడా పరిగణలోకి తీసుకుని నిర్దేశించిన దానికంటే పెంచి మొత్తంగా 77శాతం వారికి పెంచాం' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. ఆయుష్‌ విభాగానికి చెందిన జూనియర్‌ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్‌ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచినట్లు తెలిపారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్‌ డాక్టర్లు కోరుతుంటే కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా? అని చంద్రబాబును వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

'బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవంక ప్రభుత్వ వైద్యరంగాన్ని మీరు దారుణంగా దెబ్బతీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను తీసుకొచ్చి.. ఐదింటిని పూర్తిచేసి క్లాసులుకూడా ప్రారంభిస్తే, మరో కాలేజీని క్లాసులకు సిద్ధంచేసి, మొత్తంగా ఆరు అందుబాటులోకి తెచ్చాం' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. మిగిలిన వాటిని పూర్తిచేయాల్సిందిపోయి, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మందులు లేక ప్రభుత్వ ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయని.. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారని చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శలు చేశారు. 

'వైద్యరంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానానికి గండికొట్టారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్లను తొలగించారు. విలేజ్‌, అర్బన్‌ క్లినిక్‌లను నిర్వీర్యం చేశారు' అని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారని ఆరోపించారు. ప్రజారోగ్య వ్యవస్థలో చంద్రబాబు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు అహంకారం వీడి.. జూనియర్‌ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలవాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. జూనియర్‌ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.. తగిన స్థాయిలో స్టైపెండ్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు.

0
0
Report
Advertisement

Revanth Reddy Resign: ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్‌

Hyderabad, Telangana:

KPHB Lands Auction: భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ డిమాండ్ చేశారు. 'ఊర్లలో తాతల ఆస్తులు అమ్ముకుని తిరిగేవాన్ని తిరుగుబోతు అనేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నారు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది పేదలకు ఇళ్ల జాగాలు ఇవ్వడానికి అని.. వ్యాపారం చేయడానికి కాదు' అని స్పష్టం చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలో ఏర్పాటుచేసిన వేలం పాటను రద్దు చేయాలని రేవంత్‌ రెడ్డికి డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో వేలానికి పెట్టిన ప్లాట్లను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులు విక్రయించడం ఆపకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. రూ.20 వేల కోట్ల విలువైన భూములు హానర్ హోమ్స్‌కి కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. తాను వస్తే వెనక్కి తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవడం లేదు?' అని ప్రశ్నించారు. 22ఏ ద్వారా రూ.10 లక్షల కోట్ల ఆదాయం రేవంత్ రెడ్డి లక్ష్యం. దానిలో ముప్పై శాతం వీళ్ల వాటా. పేదలను ఇబ్బంది పెడుతున్న వీరికి శిక్ష తప్పదు' రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరిక జారీ చేశారు.

'హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చడానికి తప్ప వ్యాపారం చేయడానికి కాదు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-06లో కూకట్‌పల్లిలో భూముల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ భూముల విక్రయంతో వచ్చిన రూ.1,200 కోట్లు హౌసింగ్ బోర్డ్ ఖాతాలో నిల్వ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని తీసేసుకున్నాడు' అని ఎంపీ ఈటల రాజేందర్‌ వివరించారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పరిధిలో ఖాళీగా ఉన్న జాగాలను విక్రయించరాదని విజ్ఞప్తి చేశారు.

హౌసింగ్ బోర్డ్ చట్టం ప్రకారం పేదవారికి ఇళ్ల జాగాలు ఇవ్వాలి తప్ప ఇలా అమ్ముకోవడానికి హక్కు లేదని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఎంపీ ఈటల రాజేందర్‌ గుర్తుచేశారు. 'కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలం లేకుండా చేస్తున్నారు. భూములు అమ్ముకొని జీతాలు ఇస్తున్నారు. ఆస్తులు విక్రయించడం ఆపకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రాజీనామా చేయాలి' అని ఎంపీ ఈటల రాజేందర్‌ డిమాండ్ చేశారు.

'పేదవారికి కట్టించడానికి మనసు రావడం లేదా?  పేదవారి కోసమైతే బడ్జెట్ లేదా? ఇందిర రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్నది కేవలం నినాదంగానే మిగిలిపోయింది. రూ.6 లక్షలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది' అని ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. '22ఏ తీసుకొచ్చి రూ.10 లక్షల కోట్లు ప్రభుత్వానికి డబ్బులు వచ్చేలా చేయాలి. స్వామికార్యం స్వకార్యంలా 30 శాతం కొట్టేయాలని చూస్తున్నారు' అని ఆరోపించారు. అర్బన్ సీలింగ్ ల్యాండ్లను ప్రైవేటు వారికి కట్టబట్టే ప్రయత్నం కూడా ఆపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు వేసి కూర్చోబెట్టిన ఖర్మకు తమ ఉసురు పోసుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు.

0
0
Report

Konda Surekha Issue: మంత్రి కొండా సురేఖ అంశంపై తొలిసారి నోరు విప్పిన రేవంత్‌ రెడ్డి

Baddipadaga, Telangana:

Konda Surekha vs Revanth Reddy: అవినీతి, అక్రమాలు అంటూ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయాలు హాట్‌టాహాట్‌గా ఉన్నాయి. రేవంత్‌ రెడ్డిపై కొండా కుటుంబం తిరుగుబాటు చేసిందనే చర్చ జరుగుతోంది. ఈ అంశంలో కొండా సురేఖ క్రమశిక్షణా కమిటీ నోటీసులు అందుకోవడం.. దానికి బదులివ్వడం వంటివి చకాచకా జరిగిపోయాయి. అయితే తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అంశంపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి స్పందించారు.

హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తన అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంపై మాట్లాడిన రేవంత్‌ రెడ్డి ఈ క్రమంలో మీడియా అంతా ఎదురుచూస్తున్న కొండా సురేఖ ఎపిసోడ్‌పై స్పందించకుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి కొండా సురేఖ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో రెండు మాటలు మాట్లాడి రేవంత్‌ రెడ్డివ వెళ్లిపోయారు.

బంతి అధిష్టానం కోర్టులో..
'కొండా సురేఖ అంశం కాంగ్రెస్‌ పార్టీ చూసుకుంటుంది. ఆ అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడను' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఊహాజనితమైన విషయాలను ప్రస్తావించరాదని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కొండా సురేఖ వ్యవహారం అధిష్టానం కోర్టులో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. కొండా సురేఖ వ్యవహారంలో ఇప్పటికే పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి తన అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఆమెను సహించేది లేదని.. ఓపిక పట్టలేమని తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే కొండా సురేఖను సస్పెండ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోకవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాగా కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని చర్చ జరుగుతండగా.. అనూహ్యంగా ఆమె తన శాఖకు సంబంధించిన కార్యక్రమంలో మునిగారు. మంత్రి ప‌ద‌వి నుండి ఉద్వాస‌న‌, బ‌ర్త‌ర‌ఫ్ ఇలా వార్తలు వస్తుండగా కొండా సురేఖ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన అనంతరం కొండా సురేఖ పూర్తి ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ‌ఆయనను కలిసి వచ్చిన అనంతరం కొండా సురేఖ ఇక రాజకీయ వివాదాల జోలికి వెళ్లకుండా తన మంత్రిత్వ శాఖ పనుల్లో నిమగ్నమయ్యారు. మంత్రిగా సమీక్షలు.. క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశాలు నిర్వహించారు.

0
0
Report
Advertisement

Revanth Reddy: కొండా సురేఖ, అమెరికా పర్యటన రద్దుపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hyderabad, Telangana:

Hyderabad: విదేశీ పర్యటన రద్దు.. కాంగ్రెస్‌ పార్టీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్‌ నిర్వహించి కీలక విషయాలు వెల్లడిచారు. కొండా సురేఖ వ్యవహారంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. తన అమెరికా పర్యటన రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తన పర్యటనకు అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు. ఆ పర్యటనపై కీలక విషయాలు వెల్లడించారు.

నిరాకరించడం బాధాకరం
హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక విషయాలు తెలిపారు. 'రాష్ట్రాల కలయికనే దేశం. విదేశీ పర్యటన ద్వారా తెలంగాణ రైజింగ్‌తో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని కార్యాచరణతో ముందుకెళుతున్నాం. దురదృష్టవశాత్తు ఇంగ్లాండ్ పర్యటనకు అంగీకరించి అమెరికాకు అనుమతి నిరాకరించడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఎంతోమంది తీవ్రంగా ఖండించారు. అయితే బీజేపీ వాళ్లు మాత్రం మాపై ఆరోపణలు చేస్తున్నారు' అని తెలిపారు.

'పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేపట్టాం. విద్యా, క్రీడా రంగంలో పెట్టుబడులతో ముందుకు వెళ్లాలన్నది మా ఆలోచన. ఇంగ్లండ్‌ పర్యటనకు అనుమతిచ్చి అమెరికా పర్యటనకు తిరస్కరించారు. కేంద్రం వైఖరిని ఖర్గే ఖండించారు. కోట్లాది మంది కేంద్రం వైఖరిని తప్పుపట్టారు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

ఎందుకు అనుమతి ఇవ్వలేదు?
'నేను పర్యటనకు దరఖాస్తు చేస్తే ప్రొసీజర్ ప్రకారం మేము వెళితే పొలిటికల్ యాంగిల్ పేరుతో తిరస్కరిస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులకు ఇస్తారు. మాకు ఎందుకు ఇవ్వరో చెప్పు?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్ ముఖ్యమంత్రి కెనడా, ఇతర దేశాల పర్యటనకు ఎలా అనుమతి ఇచ్చారని అడిగారు. 'పెట్టుబడులకు సంబంధించి క్రీడలకు, విద్యా అవసరాలను దృష్టిలో పర్యటనకు వెళ్తున్నట్లు వివరించాం. రాజకీయపరమైన నిర్ణయాలతో పర్యటనను రద్దు చేస్తున్నట్లు కేంద్రం చెపుతుంది. విదేశీ పర్యటనలో విషయం లేదు అంటే మరీ ఇంగ్లాండ్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారు. అమెరికాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నలు సంధించారు.

0
0
Report

మాజీ మంత్రి జోగి రమేశ్‌ కీలక వ్యాఖ్యలు.. 'నా కోడలు మేఘన కూతురుతో సమానం'

Jaggaiahpeta, Andhra Pradesh:

Jogi Ramesh Family Issue: తన కుమారుడు రాజీవ్‌, కోడలు మేఘన వివాదంపై మాజీ మంత్రి జోగి రమేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కోడలు మేఘన తన కూతురుతో సమానం అని ప్రకటించారు. 'ఉన్న కొన్ని రోజులైనా కూతురు కన్నా ఎక్కువగా చుసుకున్నాం. వారి మధ్య వచ్చిన చిన్న సమస్యలకు 11 మందిపై ఫిర్యాదు చేశారు. కోర్టుకు లోబడి కొన్ని విషయాలు చెప్పలేను. నెల రోజులుగా కొన్ని యూట్యూబ్, టీవీ ఛానల్స్ వారు మితిమీరి ప్రచారం చేశారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నా భార్య కన్న కూతురిలా చూసుకొని కోడలు మేఘనకు గోరుముద్దలు తినిపించింది. నా భార్య బైబిల్ చదివితే తప్ప? తిరుమల వెళ్తాం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తాం. అసత్యాలను ప్రచారం చేస్తూ నెల రోజులపాటు మా కుటుంబాన్ని మానసికంగా వేధించారు' అని మాజీ మంత్రి జోగి రమేశ్‌ తెలిపారు. 'ఐ టీడీపీ ద్వారా కొన్ని ఛానల్స్‌ను పెట్టుకొని వ్యాపారం చేశారు. కల్తీ కేసు పెట్టి 3 నెలలు జైలు తిప్పావు.. అయినా భయపడాల?' అని ప్రశ్నించారు.

'నా గొంతు నొక్కేందుకు ఈ పరిణామాలు జరుగుతున్నాయి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని ఎవరో చేస్తున్నారో తెలుసు. 83 రోజులపాటు జైలులో పెట్టిన జడవలేదు. ఇంటిపై యాసిడ్ దాడి చేసినా భయపడలేదు' అని మాజీ మంత్రి జోగి రమేశ్‌ వెల్లడించారు. రాజీవ్‌, మేఘన ఇప్పటికీ కలిసి ఉండాలని కోరుంటామని తెలిపారు. 'టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ఏనాడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. రాజకీయంగా మాత్రమే ఎదుర్కొన్నాం' అని గుర్తుచేశారు.

తాను ఎప్పటికీ తప్పు చేయనని.. విలువలతో కూడా రాజకీయాలు చేస్తానని మాజీ మంత్రి జోగి రమేశ్‌ ప్రకటించారు. 'ఎమ్మెల్యే వసంత కార్యాలయం నుంచి డ్రామాలు జరిగాయి. నెల రోజులపాటు మా కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టు కన్నా ముందే ఓ టీవీ ఛానల్‌లో అసత్యాలను ప్రచారం చేశారు. దేవుడు చూస్తున్నాడు' అని తెలిపారు. 'ఐ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్‌ నా స్థానంలో ఉండి ఆలోచించు. మీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో నా కుటుంబంపై అనేక దాడులు చేశారు. ప్రాణం పోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కట్టుబడి ఉంటా' అని జోగి రమేశ్‌ ప్రకటించారు.

'కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని టీవీలో ముందే తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని తప్పుడు ఛానల్స్, యూట్యూబ్ చానల్స్ ప్రసారాలు చాలా దారుణం. టీడీపీ వారిలో కొందరు ఐ టీడీపీని అసహ్యించుకుంటున్నారు' అని మాజీ మంత్రి జోగి రమేశ్‌ తెలిపారు. 'ఎప్పుడు ఒకరే పరిపాలన చేయరు.. మహామహులే మట్టి కరిచారు. నాకు ఒక సమయం వస్తుంది. రెడ్ బుక్ నేడు డెడ్ బుక్‌గా మారింది' అని ఆరోపించారు. తాను జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతామని ప్రకటించారు.

'అధికార మదంతో వ్యవహరించిన చంద్రబాబు. ఇద్దరు వ్యక్తులు కలవాలని కోరుకోవాలి తప్ప విడగొట్టేందుకు రాజకీయాలు చేయకూడదు. కుటుంబపరమైన విషయాలను రాజకీయ జోక్యంతో ఎలా వ్యవహరించారు. తమ కుటుంబ విషయాన్ని ఇంతటితో ముగించితే మంచిది' అని ప్రత్యర్థులకు మాజీ మంత్రి జోగి రమేశ్‌ సూచించారు.

0
0
Report
Advertisement

Telangana New Brands: మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!

Hyderabad, Telangana:

Telangana International Brands: తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న తరుణంలో, ఇక్కడి ప్రజల జీవనశైలి (లైఫ్ స్టైల్), వీకెండ్ పార్టీల సంస్కృతి కూడా వేగంగా మారుతోంది. దీనికి అనుగుణంగా ఎలైట్, ప్రీమియం విదేశీ మద్యం బ్రాండ్లకు నగరంలో డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో విదేశీ మద్యం ప్రియుల కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL) ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే మద్యం ఏదైనా అది ఆరోగ్యానికి హానికరమనే నిజాన్ని గ్రహించాలని కూడా అధికారులు గుర్తుచేస్తున్నారు.

121 కొత్త బ్రాండ్ల రాక.. 
తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోకి కొత్తగా 121 రకాల నూతన లిక్కర్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 18 ప్రముఖ సరఫరా సంస్థలు (suppliers) ఈ 121 బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకురావడానికి దరఖాస్తు చేసుకోగా, ప్రాథమిక పరిశీలన పూర్తి చేసిన తర్వాత, ఈ బ్రాండ్ల వివరాలను అధికారుల అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజల పరిశీలనార్థం ఉంచారు.

అందుబాటులోకి రానున్న ఎలైట్ బ్రాండ్లు..
ఈ నూతన నిర్ణయం ద్వారా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అత్యంత ఖరీదైన గ్లెన్ఫెడిక్ (Glenfiddich), ది మెకాలన్ సింగిల్ మాల్ట్ విస్కీ (The Macallan Single Malt Whisky), లూయిస్ థర్టిన్ కాగ్నాక్ (Louis XIII Cognac) వంటి ప్రీమియం బ్రాండ్లు ఇకపై స్థానిక వైన్ షాపుల్లోనే నేరుగా లభించనున్నాయి. వీటితో పాటు మంకీ షోల్డర్, హెండ్రిక్స్ జిన్, టైగర్ లాగర్, చీతా, రెడ్ హార్స్ వంటి అంతర్జాతీయ బీర్లు, వోడ్కా, బ్రాందీ, టకీలా బ్రాండ్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించేందుకు TSBCL మేనేజింగ్ డైరెక్టర్ హరికిరణ్ ఒక కీలక ప్రకటన చేశారు. కొత్త సప్లయర్లు, వారి బ్రాండ్ల వివరాలను అధికారిక వెబ్‌సైట్ tgbcl.telangana.gov.inలో ప్రదర్శించామని తెలిపారు. ఈ బ్రాండ్ల ఆమోదంపై ప్రజలకు లేదా ఇతర మద్యం వ్యాపారులకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే, సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు.

ఆ అభ్యంతరాల పరిష్కారం తర్వాతే వీటికి తుది ఆమోదం లభిస్తుంది. ఈ అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్లు అధికారికంగా మార్కెట్లో లభించడం వల్ల నకిలీ మద్యం బెడద, బ్లాక్ మార్కెట్ విక్రయాలు తగ్గుతాయి. పరోక్షంగా ఇది రాష్ట్ర పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలకు తోడ్పడటమే కాకుండా, ప్రభుత్వ ఎక్సైజ్ ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచే అవకాశం ఉంది.

Also Read; మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి పీసీసీ నివేదిక..మంత్రివర్గ మార్పులపై చర్చ!

Also Read: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Rahul Gandhi Kiss Video: రాహుల్ గాంధీకి లైవ్‌లో ముద్దుపెట్టిన యువతి..సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ రచ్చ!

Pune, Maharashtra:

Rahul Gandhi Kiss Viral Video: పూణెలో నిర్వహించిన ఒక విద్యార్థి సదస్సు వేదికపై అత్యంత ఆసక్తికరమైన, ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఫోటో దిగడానికి ఒక యువతి వేదికపైకి వచ్చింది. అయితే, కెమెరాకు ఫోజు ఇస్తున్న తరుణంలో ఆమె హఠాత్తుగా రాహుల్ గాంధీ బుగ్గపై ముద్దుపెట్టి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ అనాలోచిత సంఘటనకు రాహుల్ గాంధీ ఏమాత్రం తత్తరపాటుకు గురికాకుండా, ఎంతో ప్రశాంతంగా మరియు సరదాగా స్పందించారు. ఈ ఆత్మీయ హావభావానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన కొద్ది సేపట్లోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి వైరల్‌గా మారింది.

ఈ సంఘటన యువతలో రాహుల్ గాంధీకి ఉన్న విశేషమైన ఆదరణను స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా దేశంలో అగ్రశ్రేణి రాజకీయ నాయకులతో ప్రజలు ప్రవర్తించే విధానానికి భిన్నంగా, యువ మద్దతుదారులు ఆయనతో ఎంతటి బలమైన అనుబంధాన్ని, స్వేచ్ఛను, చొరవను అనుభవిస్తున్నారో ఈ ఉదంతం నిరూపించింది. నాయకుడి పట్ల యువతలో ఉన్న విశ్వాసానికి ఈ దృశ్యం అద్దం పట్టింది.

కానీ, ఈ వ్యక్తిగత ఆత్మీయ స్పందన కేవలం ఒక వైరల్ వీడియోతో ముగిసిపోలేదు. సాంప్రదాయ సామాజిక నిర్మాణాలు, విలువలపై రాహుల్ గాంధీ చేసే విమర్శలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రత్యర్థి పార్టీలు రంగంలోకి దిగడంతో ఇది పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ (BJP) నేతల మధ్య తీవ్రమైన విమర్శలు, ప్రతివిమర్శలు నడిచాయి. పబ్లిక్ పర్సెప్షన్ (ప్రజా అభిప్రాయం), ఇరు పార్టీల రాజకీయ వ్యూహాలకు సంబంధించిన చర్చలకు ఈ చిన్న ఘటన ఒక పెద్ద ఫ్లాష్‌పాయింట్‌గా మారింది. ఒక స్వచ్ఛందమైన వ్యక్తిగత స్పందన కాస్తా, దేశంలో విస్తృత రాజకీయ సిద్ధాంతాల మధ్య ఘర్షణకు దారితీయడం గమనార్హం.

Also Read: భర్తను చంపి, పేగులు బయటకు తీసిన భార్య..కురుక్షేత్రలో ఘోర హత్యోదంతం!

Also Read: స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ స్నానం..వీడియో వైరల్ కావడంతో సస్పెండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Eshwar Sai Video: "మీ అందరికి దండం పెడతా..నన్ను వదిలేయండి" ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి రిక్వెస్ట్!

Hyderabad, Telangana:Eshwar Sai On Madhuri Rathod: ఇటీవల వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో ఇటీవలే వైరల్‌గా మారింది. ఈ ఘటనను భార్య వీడియో తీస్తు రెడ్ హ్మాండెడ్ గా పట్టుకుంది. మాధురిని చెంప మీద కొట్టి నానా బూతులు తిట్టింది. ఈ రచ్చను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త విపరీతంగా వైరల్గా మారింది. కొంత మంది ఈశ్వర్ సాయి భార్యకు సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం మాధురీ రాథోడ్ కు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై ఈశ్వర్ సాయి స్పందించాడు. తప్పు జరిగిపోయిందని.. తనను వదిలిపెట్టాలని అందర్ని వేడుకుంటున్నానని ఈశ్వర్ సాయి తాజాగా మరో వీడియోతో స్పందించాడు.
0
0
Report

Konda Surekha Episode: మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి పీసీసీ నివేదిక.. మంత్రివర్గ మార్పులపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ!

Hyderabad, Telangana:

Konda Surekha Episode AICC Report: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేసిన ఎపిసోడ్ తర్వాత పార్టీలో వివాదం ముదిరింది. 

కుమార్తె చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించకపోవడం పార్టీ శ్రేణుల్లోనూ, నేతల్లోనూ తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు స్పందిస్తూ, తనకు మరియు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదని సురేఖ సమాధానం ఇచ్చారు. ఆపై తనపై కుట్ర జరుగుతోందంటూ లేఖ రాయడం వంటి వరుస పరిణామాలు ఆమెను మరింతగా వివాదాల్లోకి లాగి టార్గెట్ అయ్యేలా చేశాయి.

దీంతో కొండా సురేఖ ప్రవర్తనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ)లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆమె పార్టీ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వివాదాలను మరింత పెంచేలా ప్రవర్తిస్తున్నారని పీసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఆదివారం నాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీకి ఒక తాజా నివేదికను పంపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై సుస్మిత చేసిన అసత్య ఆరోపణలను సురేఖ ఖండించకపోవడం పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.

సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను సమర్థించడం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో తీవ్ర అసమ్మతిని కలిగించింది. ఆ తర్వాత 'తనపై కుట్ర జరుగుతోంది' అంటూ ఆమె రాసిన లేఖ కూడా పార్టీ ప్రతిష్టకు పెద్ద ఇబ్బంది కలిగించేలా మారిందని పీసీసీ అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రతిష్టను భంగపరిచేలా సుస్మిత మాట్లాడినప్పటికీ సురేఖ దానిని ఖండించకపోగా, సహచర పార్టీ నేతలపై అభాండాలు వేయడం ఏమాత్రం సరికాదని పీసీసీ, క్రమశిక్షణ కమిటీ గట్టిగా భావిస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు, ఏఐసీసీకి పీసీసీ కూలంకషంగా వివరించింది.

ఈ పీసీసీ నివేదికలు, వరంగల్ ఎమ్మెల్యేల మీడియా సమావేశాలు, కొండా సురేఖ రాసిన లేఖల ఆధారంగా ఏఐసీసీ ప్రస్తుతం అంతర్గత విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో అధిష్టానం చర్చించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంది. అయితే వీరందరూ కూడా కొండా కుటుంబ వ్యవహార శైలిపై ప్రతికూలంగానే అధిష్టానానికి వివరించినట్లు సమాచారం.

గతంలో కూడా కొండా సురేఖ ఇటువంటి ఆరోపణలు చేసిన చరిత్ర ఉన్నందున, వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమెతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తే జిల్లా అభివృద్ధి పనులకు ఎలా సహకరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహారశైలి ప్రతిపక్షాలకు అనుకూలంగా మారినట్లు ఉందని, కాబట్టి ఆమెను మంత్రివర్గం నుండి తొలగించాలని, అవసరమైతే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖపైనా, చిన్నారెడ్డిపైనా అధిష్టానం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Also REad; వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!

Also Read: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులు, దూసుకెళ్లింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Raksha Bandhan 2026: ఆగస్టు 27న రాఖీ ఎందుకు కట్టకూడదు? రాఖీ కట్టడానికి శుభముహూర్తాలు ఇవే!

Hyderabad, Telangana:

Raksha Bandhan 2026 Muhurat: రక్షాబంధన్ పండుగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏడాది శ్రావణ మాస పూర్ణిమ తిథి నాడు వచ్చే ఈ పర్వదినాన్ని ఆగస్టు 28న జరుపుకోనున్నారు. ఈ రోజున శతభిషా నక్షత్రం, సుకర్మ యోగంతో పాటు మీన రాశిలో చంద్రుడి సంచారం వంటి అద్భుతమైన జ్యోతిష్య సంయోగాలు ఏర్పడుతున్నాయి. శుక్రవారం, సుకర్మ యోగాల కలయిక వల్ల ఈ పండుగ మరింత పవిత్రతను, శ్రేయస్సును సంతరించుకోనుంది. ఈ ఏడాది పండుగ రోజున భద్రా ప్రభావం ఏమాత్రం లేకపోవడం అత్యంత విశేషం.

ఆగస్టు 27న రాఖీ ఎందుకు కట్టకూడదు? 
సాధారణంగా ప్రతి సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రా కాలం ఛాయ పడుతుంటుంది. శాస్త్రాల ప్రకారం భద్రా కాలంలో రాఖీ కట్టడం అశుభం. ఈ ఏడాది భద్రా తిథి పండుగకు ఒక రోజు ముందే, అంటే ఆగస్టు 27వ తేదీ గురువారం ఉదయం 9:09 గంటలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 9:25 గంటలకు ముగిసిపోతుంది.

గురువారం పూర్ణిమ తిథి ప్రారంభమైన క్షణం నుంచే భద్ర ప్రభావం కూడా మొదలవుతుంది. అందుకే పూర్ణిమ తిథి ఉన్నప్పటికీ, శాస్త్ర నియమాల ప్రకారం 27న రాఖీ కట్టకూడదు. ఆగస్టు 28న పండుగ రోజున భద్రా దోషం ఏమాత్రం ఉండదు

చంద్రగ్రహణ ప్రభావం ఉందా?
ఆగస్టు 28న ఈ ఏడాది చివరి పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఈ గ్రహణ సమయం ఉదయం 6:53 గంటల నుంచి మధ్యాహ్నం 12:31 గంటల వరకు ఉంటుంది. అయితే, ఇది భారతదేశంలో కనిపించదు. అందువల్ల ఎలాంటి సూతక నియమాలను పాటించాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు.

రాఖీ కట్టడానికి శుభ ముహూర్తాలు (ఆగస్టు 28): సోదరులకు దీర్ఘాయువు, ఐశ్వర్యం కలగడం కోసం ఆగస్టు 28న కింది శుభ సమయాల్లో రాఖీ కట్టాలని పండితులు సూచిస్తున్నారు.

అమృత ఘడియలు (అత్యంత శ్రేష్టం): తెల్లవారుజామున 6:08 నుండి ఉదయం 10:53 వరకు

అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:53 వరకు

శుభ ఘడియలు: మధ్యాహ్నం 12:28 నుండి మధ్యాహ్నం 2:03 వరకు

అపరాహ్న కాల ముహూర్తం: మధ్యాహ్నం 1:44 నుండి సాయంత్రం 4:16 వరకు

చర ఘడియలు: సాయంత్రం 5:13 నుండి సాయంత్రం 6:48 వరకు

రాఖీ కట్టే సమయంలో సోదరుడు తూర్పు లేదా ఈశాన్య దిశ వైపు ముఖం ఉండేలా కూర్చోవాలి. పూజా పళ్లెంలో కుంకుమ, చందనం, అక్షింతలు, దీపం, తీపి పదార్థాలను అమర్చుకోవాలి. ముందుగా సోదరుడి నుదుట తిలకం దిద్ది, తలపై అక్షింతలు చల్లి, హారతి ఇచ్చిన తర్వాతే కుడిచేతికి రక్షా సూత్రాన్ని (రాఖీ) కట్టాలి.

Also Read: ఏల్నాటి శని సమయంలో అసలు చేయకూడని 5 తప్పులు..! చేస్తే అంతే సంగతులు..

Also Read: ఈ 6 రాశులకు సెప్టెంబర్ నెలంతా లక్ష్మీదేవి అనుగ్రహం.. కలలో సైతం ఊహించని లాభాలు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top