Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Yadadri Bhuvanagiri508277

కోతుల భయంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు

Nov 18, 2024 02:42:23
Mothkur, Telangana
మోత్కూర్ పట్టణ కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజల బెంబేలెత్తిపోతున్నారు. కోతులు గుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వీరంగం సృష్టిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. బయటికి వెళ్లాలంటే కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 31, 2026 07:17:00
Hyderabad, Telangana:

Kevin Warsh Gold Price Crash: గడిచిన రెండు రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడం పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేస్తోంది. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న ధరలు ఒక్కసారిగా కుప్పకూలడానికి అమెరికాలోని తాజా పరిణామాలు ఎలా కారణమయ్యాయో తెలుసుకుందాం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కెవిన్ వార్ష్ బాధ్యతలు చేపడతారనే సంకేతాలు వెలువడటమే బులియన్ మార్కెట్ క్రాష్ అవ్వడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

కెవిన్ వార్ష్ ప్రభావం ఏమిటి?
కెవిన్ వార్ష్ గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన వడ్డీ రేట్ల విషయంలో చాలా కఠినంగా (Hawkish) ఉంటారని మార్కెట్ నిపుణుల నమ్మకం. ఆయన విధానాల వల్ల వడ్డీ రేట్లు సుదీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంటాయని, ఫలితంగా డాలర్ మరింత బలపడుతుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం ప్రారంభమైంది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి.

భారీగా అమ్ముతున్న ఇన్వెస్టర్లు
డాలర్ పుంజుకోవడంతో, గ్లోబల్ ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో విక్రయాలు (Sell-off) జరగడం వల్ల బంగారం తన మెరుపును కోల్పోయి నేలచూపులు చూస్తోంది.

వెండిపై కూడా అదే దెబ్బ
కేవలం బంగారమే కాకుండా, పారిశ్రామిక అవసరాలకు కీలకమైన వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వెండి ధరను కూడా అధఃపాతాళానికి తొక్కింది.

భారతీయ మార్కెట్లపై ప్రభావం
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయంగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో ధరలు భారీగా తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అత్యధిక ధరలు ఉన్నప్పుడు బంగారం కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుత పతనంతో నష్టాలను చవిచూస్తున్నారు.

కెవిన్ వార్ష్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చే ప్రకటనల మీదనే బులియన్ మార్కెట్ తదుపరి గమనం ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గించే సంకేతాలు వస్తే తప్ప, బంగారం ధరలు మళ్లీ పుంజుకోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ALso Read: Bank Strike February: ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె! మీ పనులు ముందే ప్లాన్ చేసుకోండి!

Also Read: MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ వర్సెస్ వీణ..ఔను వాళ్లిద్దరూ కనిపించడం లేదు..అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 31, 2026 07:04:28
Hyderabad, Telangana:

Medaram Traffic Jam Today 2026 Telugu: ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తుల కష్టాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిలను దర్శించుకోవాలనే తపనతో వచ్చే భక్తులకు మార్గం మధ్యలోనే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి ములుగు జిల్లాల్లో ట్రాఫిక్ కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గురు శుక్రవారాల నుంచి ట్రాఫిక్ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మేడారంలో ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉన్నాయి? భక్తులు ఎలాంటి అవస్థలు పడుతున్నారో తెలుసుకుందాం..

ప్రస్తుతం మేడారానికి వెళ్లే దారులని వాహనాలతో ఊహించని స్థాయిలో కిక్కిరిసిపోయాయి. పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నా.. మేడారంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి చూస్తే.  అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పస్రా నుంచి మేడారం వరకు ప్రయాణం ఒక పెద్ద నరకప్రాయంగా మారిందని అక్కడున్న భక్తులు చెబుతూ వస్తున్నారు.. అంతేకాకుండా ఈ రోడ్డు గుండా వెళ్లే వారికి సాధారణంగా 10 గంటల సమయం పడుతుందని వారు అంటున్నారు..

అలాగే పస్రా - తాడ్వాయి  మధ్య ఉన్న స్వల్ప దూరానికే సుమారు 4 గంటల పాటు సమయం పడుతుందని భక్తులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తాడ్వాయి - మేడారం మధ్య పరిస్థితి అంత మెరుగ్గా లేదని.. వాహనాలు ఈ రెండు ప్రాంతాలకు చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల పాటు సమయం పడుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా రాత్రి నుంచి కొన్ని వాహనాలు ఇక్కడే నిలిచిపోయాయని వారు చెబుతున్నారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

ఈసారి అధికారిక యంత్రాంగం జాతరలో భాగంగా అన్ని రకాల సమస్యలను నియంత్రించేందుకు ఆధునిక టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియన్ ఇంటిలిజెన్సీ పరిజ్ఞానాన్ని వాడుతున్నామని భారీగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పరిజ్ఞానం ఏమాత్రం ఫలితాలను అందించలేకపోయింది. ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లించడంతోపాటు రద్దీని ముందే అంచనా వేయడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది.  ఉన్నత అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే వేలాదిమంది భక్తులు అడవి బాటలో గంటల తరబడి చిక్కుకుపోయారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఒకవైపు భక్తులంతా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడం వల్ల అవస్థలు పడుతుంటే.. మరోవైపు మేడారంలోని గద్దెల వద్ద ఉన్న క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అంతేకాకుండా రాత్రి సమయాల్లో తాగునీరుతో పాటు ఆహారం దొరకక వృద్ధులతో పాటు కొంతమంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 31, 2026 06:33:05
Hyderabad, Telangana:

Bank Strike February 12 2026: వచ్చే నెలలో బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. వివిధ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన బ్యాంక్ యూనియన్లు ఫిబ్రవరి 12న ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.

సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్లు
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) వంటి శక్తివంతమైన సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. వీరికి 10 ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.

సమ్మెకు ప్రధాన కారణాలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త కార్మిక చట్టాలు ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. 300 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న సంస్థల్లో అధికారుల అనుమతి లేకుండానే యాజమాన్యాలు ఎవరినైనా తొలగించే వెసులుబాటు కల్పించడాన్ని సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యూనియన్ల రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలను కఠినతరం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

'5 రోజుల పని' డిమాండ్
ప్రస్తుతం ఆర్‌బీఐ (RBI), ఎల్‌ఐసీ (LIC) వంటి ఆర్థిక సంస్థల్లో వారానికి 5 రోజుల పనిదినాలే అమల్లో ఉన్నాయి. కానీ బ్యాంకు ఉద్యోగులు మాత్రం ప్రత్యామ్నాయ శనివారాల్లో పనిచేయాల్సి వస్తోంది. బ్యాంకులకు కూడా వారానికి 5 రోజుల పనిదినాలను వర్తింపజేయాలని, శనివారాలన్నీ సెలవు దినాలుగా ప్రకటించాలని యూనియన్లు కోరుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం పని గంటలను పెంచాలని చూస్తోందని, దీనివల్ల 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' దెబ్బతింటుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఈ సమ్మె కారణంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలకు అంతరాయం కలగవచ్చు. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యధావిధిగా కొనసాగవచ్చు.

బ్యాంకు పనులు ఉన్నవారు సమ్మె తేదీని దృష్టిలో ఉంచుకుని తమ లావాదేవీలను ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం. ప్రభుత్వం ఈ లోపు చర్చలు జరిపి సమ్మెను విరమింపజేస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read: MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ వర్సెస్ వీణ..ఔను వాళ్లిద్దరూ కనిపించడం లేదు..అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు?

Also Read: Varanasi Release Date: 'వారణాసి' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది! 2027 శ్రీరామనవమి కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 16:57:28
Nizamabad, Telangana:

Municipal Tax Dues: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రూపేణా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులు తమకు సంబంధించిన అన్నీ పన్ను బకాయిలు చెల్లించారు. దీంతో కోట్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నోడ్యూ సర్టిఫికెట్ కచ్చితంగా పొందాల్సి ఉండడంతో తమ పన్ను బకాయిలు చెల్లించారు. ఒక్క రూపాయి ఆస్తి పన్ను బకాయి ఉన్నా నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే నిబంధన ఉంది. ఎన్నికల సంఘం నిబంధనతో ఓ కార్పొరేటర్ అభ్యర్థి కాదు కాదు మేయర్ అభ్యర్థి ఏకంగా రూ.7.42 కోట్లకు పైగా చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓ అభ్యర్థి ప్రముఖ మూడు నక్షత్రాల హోటల్ యజమాని ఏకంగా రూ.7.42 కోట్లకు పైగా మున్సిపల్ పన్ను బకాయిలు చెల్లించారు. అనంతరం నేడు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం నిజామాబాద్‌ నగరంలోని తీవ్ర చర్చనీయాశంగా మారింది. వాస్తవానికి సదరు అభ్యర్థి రూ.8 కోట్ల 16 లక్షల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. సుమారు 75 లక్షల రూపాయల వరకు డీడీల రూపంలో ఇదివరకే పన్ను చెల్లించారు. మిగతా 7.42 కోట్ల రూపాయల బకాయిల మినహాయింపు కోసం కోర్టును ఆశ్రయించారు. కేసు పెండింగ్‌లో ఉంది. ఏళ్ల తరబడిగా ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అంటూ ఈ మొండి బకాయిలు వసూలై నిజామాబాద్ కార్పొరేషన్‌కు ఖజానా నింపింది.

Also Read: DK Aruna: ప్రజలను మోసం చేయడానికి రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ డ్రామా: డీకే అరుణ

మున్సిపల్ ఎన్నికల వేళ పుర పాలక సంస్థ ఖజానా ఒక్కసారిగా కళకళలాడుతోంది. ఏళ్ల తరబడి అధికారులు నోటీసులిచ్చినా.. జరిమానాలు వేసినా ససేమిరా చెప్పిన బకాయిదారులు ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచేందుకు క్యూ కట్టి మరీ పన్నులు చెల్లించారు. తాజాగా నిజామాబాద్‌ నగరంలోని ఒక డివిజన్ అభ్యర్థి ఏకంగా రూ.8 కోట్ల ఆస్తిపన్ను బకాయిలను చెల్లించాడు. ఈ పరిణామం కార్పొరేషన్ వర్గాల్లోనే కాదు.. నిజామాబాద్‌ మొత్తం చర్చనీయాంశమైంది.

Also Read: Medaram Prices: మేడారంలో జేబులు చిల్లు.. ఒక బీర్‌ రూ.300, మటన్‌ రూ.1500, చికెన్‌ రూ.500

మున్సిపల్ బరిలో నిలవాలంటే అభ్యర్థులు కచ్చితంగా 'నోడ్యూ సర్టిఫికెట్' సమర్పించాల్సి ఉండడంతో ఆశావహులంతా కొన్ని రోజులుగా ఆస్తిపన్ను శాఖాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క రూపాయి బకాయి ఉన్నా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండడంతో.. ఇన్నాళ్లుగా అటకెక్కించిన బకాయిల లెక్కలన్నీ ఇప్పుడు బయటకు తీస్తున్నారు. మూడు రోజులుగా మున్సిపల్ కార్యాలయాలు పన్ను చెల్లింపుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. వందలాది మంది అభ్యర్థులు తమ పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తుండడంతో కార్పొరేషన్ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది. అధికారుల విజ్ఞప్తులకు లొంగని వారు ఎన్నికల నిబంధనల దెబ్బకు దారిలోకి వచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మొండి బకాయిలు కూడా ఇప్పుడు వసూలవుతుండడం గమనార్హం. మొత్తానికి ఎన్నికల సమరం మొదలవ్వకముందే మున్సిపాలిటీకి పన్నుల రూపంలో 'విజయం' దక్కినట్లయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 16:13:09
Medaram, Telangana:

Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బంగారం సమర్పించడానికి.. పూజలు, విందు వినోదాలతో పెద్ద ఎత్తున భక్తులు ఆనందంలో ఉన్నారు. అయితే అక్కడకు వెళ్లిన భక్తుల జేబులకు మాత్రం చిల్లు పడుతోంది. మేడారంలో ప్రతీ వస్తువు భారీ ధరకు లభిస్తున్నాయి. ఇక మొబైల్ నెట్ వర్క్ కూడా తీవ్ర సమస్యగా ఉంది.

Also Read: Padi Kaushik Reddy: పోలీసులతో వివాదంపై వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి

మేడారం జాతరలో ధ‌ర‌లు భక్తులకు చుక్క‌లు చూపిస్తున్నాయి. అక్కడ చికెన్‌, మటన్‌.. ఆఖరకు మద్యం కొనాల‌న్నా భ‌క్తులు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మార్కెట్‌లో ఉన్న ధరల కన్నా డబుల్‌, త్రిబుల్‌ రేట్లు ఉన్నాయి. ప్రస్తుతం మ‌ట‌న్ ధ‌ర బయట రూ.900 నుంచి రూ.వెయ్యి ఉండ‌గా.. మేడారం ప్రాంతంలో మాత్రం డబుల్‌ ధర ఉంది. అక్కడ రూ.1500ల‌కు కిలో మటన్‌ లభిస్తోంది. ఇక కోడి మాంసం విషయానికి వస్తే లైవ్ కోడి బ‌య‌ట రూ.170 ఉండ‌గా మేడారంలో రూ.350 పైన ఉంది.

Also Read: TTD: హిందూ సమాజానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ క్షమాపణ చెప్పాలి: టీటీడీ

మద్యం ధరల విషయానికి మ‌ద్యం ధ‌ర‌లు కూడా భారీగా ఉన్నాయి. పెద్ద ఎత్తున రేట్లు పెంచేసి అక్కడ విక్రయిస్తున్నారు. సాధారణ బీర్‌ల విషయానికి వస్తే రూ.180 ఉండ‌గా మేడారంలో మాత్రం రూ.280 నుంచి రూ.300ల‌కు అక్కడి వ్యాపారులు అమ్ముతున్నారు. ప్రతి మద్యం బాటిళ్ల‌పై రూ.100 ఎక్కువ తీసుకుంటున్నారు. తాగునీళ్ల సీసాలు కూడా అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇక అక్కడ సేద తీరడానికి.. వంటలు వండడానికి టెంటులు కూడా భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇక విచిత్రమేమంటే.. చెట్టుకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. చెట్టు కింద ఉండేందుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు అద్దెలు వ‌సూలు చేస్తున్నారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

నెట్‌వర్క్‌ సమస్య
మేడారం జాతర ప్రాంతంలో సిగ్నల్‌ సమస్య తీవ్రంగా ఉంది. జాతర ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్య కన్నా ఎక్కువైంది. మొబైల్‌ నెట్‌వర్క్‌లు దాదాపుగా అన్నీ తక్కువ కెపాసిటీతో వస్తున్నాయి. అత్యధిక యూజర్లు ఉన్న జియో కూడా పనిచేయకపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎయిర్‌టెల్ సిగ్నల్స్ ఉన్నా నెట్‌వర్క్‌ మాత్రం రావడం లేదు. డేటా కనెక్ట్‌ కాకపోవడం, కాల్స్ రాకపోవడంలో సమస్య ఎదురవుతోంది. ఫోన్లు చేసిన వెంటనే డ్రాపవడం, ఫోన్‌ కాల్‌ సరిగా వినపడకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ కారణంగా యూపీఐ పేమెంట్లు పని చేయడం లేదు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 14:27:15
Koduru, Andhra Pradesh:

Women Employee: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వివాదం ఊహించని మలుపు తిరిగింది. అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిని అదృశ్యమైంది. తనకు సంబంధించిన వీడియో కాల్స్‌, స్క్రీన్‌షాట్‌లు విడుదల చేయడంతోపాటు.. మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిని కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యిందని చెప్పారు.

Also Read: Padi Kaushik Reddy: పోలీసులతో వివాదంపై వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగి హర్ష వీణ తన కొడుకు రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఈనెల 7వ తేదీన అతడి తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై రైల్వే కోడూరు అర్బన్  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో హర్ష వీణ కాల్ డేటా, ఇతర సాంకేతిక అంశాలపై దృష్టిపెట్టారు. కొన్ని వీడియోలు, ఆడియోలు, ఫొటోలు, ఇతర సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు. దీంతో కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: TTD: హిందూ సమాజానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ క్షమాపణ చెప్పాలి: టీటీడీ

ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న హర్ష వీణ ఇంకా పోలీసులకి అందుబాటులోకి రాలేదని రైల్వేకోడూరు అర్బన్ సీఐ చంద్ర శేఖర్ ప్రకటించారు. హర్ష వీణ స్థానికంగా లేనట్లు తెలుస్తోందని.. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని తెలిపారు. ఈ కేసులో ఎమ్మెల్యే స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేస్తామని చెప్పారు. హర్ష వీణ నేరుగా విచారణకు హాజరైనా.. లేకపోతే తమను రమ్మని పిలిచినా వెళ్లి విచారిస్తామని వివరించారు. త్వరలోనే దర్యాప్తు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

'స్థానిక విలేకరి శంకర్ రాజుపై నిర్బంధించి దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశాం. హర్ష వీణ నిర్బంధించి దాడి చేసి.. గాయపరిచిన దానిపై ఆధారాలు ఉన్నాయి. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న హర్ష వీణ పై రెండు కేసులు నమోదు చేశారు. రెండు కేసుల్లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు  చేసినట్లు రైల్వేకోడూరు అర్బన్ సీఐ చంద్ర శేఖర్ వెల్లడించారు. ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో జనసేన పార్టీలో తీవ్ర కలకలం రేపింది. అరవ శ్రీధర్ కు సంబంధించి రోజుకో వివాదం రాజుకుంటుండడంతో జనసేన పార్టీ అతడిని దూరం పెట్టింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 30, 2026 13:47:15
Hyderabad, Telangana:

Big King Cobra Video Watch Now: గత కొద్ది రోజుల నుంచి ప్రకృతిలో నివసించే అడవి జంతువులతో పాటు విశసర్పాలు మానవ వివాసాల మధ్యకి రావడం సర్వసాధారణమైపోయింది.. ఇప్పుడు ఇలా వచ్చిన పాములను కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు ప్రకృతిపై ఉన్న ప్రేమతో వాటిని పట్టుకొని సురక్షితమైన ప్రదేశాల్లో వదిలేస్తున్నారు. ఇలా కీలక పాత్ర పోషిస్తున్న వారిలో ఒకరు మున్న స్నేక్ క్యాచర్.. ఇతను గత కొద్ది రోజుల నుంచి జనావాసాల్లోకి సంచారం చేస్తున్న పాములను పట్టుకొని రెస్క్యూ చేస్తున్నారు. తాజాగా ఇతడు రెస్క్యూ చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ వీడియోను తీసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ ఒక పామును జనావాసాల దగ్గరగా ఉన్న ఓ ఎండిన పొలంలోకి అత్యంత ప్రమాదకరమైన నాగుపాము సంచారం చేయడంతో వెంటనే అక్కడికి వెళ్లి దానిని పట్టుకుంటాడు. అయితే, ఆ పాము దాని శరీరం భాగంపై ఉన్న కుబుసం విడిచే దశలో ఉండడం మీరు చూడొచ్చు. అయితే, ఈ సమయంలో పాములు అనేక సమస్యలను ఎదుర్కొంటాయి. ముఖ్యంగా ఈ కుబుసం కళ్ళను పూర్తిగా కప్పేస్తుంది. దీని కారణంగా ఈ పాములు ఎక్కడికి వెళ్తాయనేది వాటికి కనిపించదు. అయితే ఆ స్నేక్ క్యాచర్ ఇలా పట్టుకున్న పామును.. తన చేతులతో చర్మాన్ని పూర్తిగా తొలగించడం మీరు చూడొచ్చు.

ఈ వీడియోలో.. ఆ వ్యక్తి పామును ఒక చేతితో పట్టుకొని.. మరో చేతితో దాని చర్మ పైభాగంలోని పొరను సులభంగా తొలిచేయడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి పాముకు ఎలాంటి హాని కలగకుండా చాలా నెమ్మదిగా జాగ్రత్తగా తొలగిస్తూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే, ఈ వీడియోలో ఆ స్నేక్ క్యాచర్ ని ఒకరు అన్న ఇది పామా అని ప్రశ్న అడిగితే.. అతను ఒక విషపూరితమైన నాగుపామని.. దీనిని ఎంతో సురక్షితంగా రక్షించారని ఆయన తెలిపారు. నిజానికి ఇలాంటి ప్రమాదకరమైన పాముల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

సాధారణంగా కింగ్ కోబ్రా లు ఒక్కొక్క సమయంలో సంవత్సరానికి రెండుసార్లు దాని కుబుసాన్ని విడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మరికొన్ని జాతులకు సంబంధించిన పాములు మూడుసార్లు కుబుసాన్ని వదిలిపెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో పాములు తీవ్ర సమస్యలకు గురవుతూ.. మరణిస్తూ ఉంటాయి.. కాబట్టి కుబుసం పెడితే సందర్భంలో ఉన్న పామును చాలా జాగ్రత్తగా వదిలిపెట్టడం మంచిది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 25వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 30, 2026 13:37:19
Hyderabad, Telangana:

Huge Cobra Under Bike Video Viral: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా క్రేజ్ ఎంత ఉందంటే.. ప్రాణాలు మీదికి వచ్చిన సరే చాలామంది లైకులు, షేర్ల కోసం దేనికైనా తెగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది సాహసోపేతమైన చర్యలకు పాల్పడుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో ఒక పల్సర్ బైక్ వెనక టైర్, సీట్ మధ్యలో దాదాపు ఆరడుగుల పొడవు కల భారీ నాగుపాము చిక్కుకుపోవడం, ప్రాణాలకు తెగించి ఒక యువకుడు దానిని రెస్క్యూ  చేయడం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. 

సాధారణంగా చాలామంది పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు.. ఇక్కడ మాత్రం వింతగా ప్రవర్తించారు. అయితే ఈ సమయంలో బైక్ వెనక భాగంలో ఆ అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పడగ విప్పి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. ఇలా ప్రత్యక్షమైన ఆ కింగ్ కోబ్రా దగ్గరికి ఒక యువకుడు వెళ్లి ఫోటోలు తీయడమే కాకుండా.. నేరుగా ఆ పాము దగ్గరికి వెళ్లి, దానితో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ సమయంలో ఆ పాము దూకుడు స్వభావం కలిగి ఉండడం మీరు చూడొచ్చు.

అయితే, అక్కడే ఉన్న కొంతమంది వెంటనే స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు. వెంటనే మున్నా అనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని.. ఆ పాముని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అది బుసలు కొడుతూ ఆగ్రహంగా ఉండడం మీరు గమనించవచ్చు. ఆ స్నేక్ క్యాచర్ ఏమాత్రం భయపడకుండా వెంటనే ఆ పాముని పట్టుకొని.. ఒక సంచిలో బంధించాడు.. ఇలా బంధించిన పాములు సురక్షితమైన ప్రదేశాల్లో వదిలిపెట్టాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే వైరల్‌గా మారాయి.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

తరచుగా సోషల్ మీడియాలో జనావాసాల్లోకి సంచారం చేసే ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనాలు కూడా ఇలాంటి వీడియోలు ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేలమందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను మున్నా స్నేక్ క్యాచర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేశారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 30, 2026 13:25:31
Hyderabad, Telangana:

Snake Video Watch Here: నేటి కాలంలో సోషల్ మీడియాలో వింతలు విశేషాలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని వీడియోలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది.. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా దీనికి సంబంధించిందే. ఇప్పుడు ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది. మున్నా స్నేక్ రెస్క్యూయర్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వీడియోను ఒక వ్యక్తి నేలపై పడక విప్పి పడుకొని ఉన్న.. అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను చేతులతో నిమరటం మీరు చూడొచ్చు.. సాధారణంగా నాగుపాము అంటేనే భయపడిపోతూ ఉంటారు. కొంతమంది అయితే, ఆమడ దూరంగా ఉన్న పామును చూసి అక్కడి నుంచి కేకలు వేస్తూ భయపడి పారిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ సదరు వ్యక్తి ఏ మాత్రం భయం లేకుండా ఆ పాము తలభాగం మీద.. చేతుపెట్టి ప్రశాంతంగా నిమురుతుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో సర్వత్రా చర్చనీయంగా మారింది. ఈ వీడియోను చూస్తుంటే ఆ పాము ఎప్పుడు ఆ వ్యక్తిని కాటేస్తుందో తెలియని పరిస్థితి.. 

అయితే, ఈ వీడియోలో ఆ వ్యక్తి తన చేతితో పాము పడక భాగాన్ని నిమ్మిరినప్పటికీ.. అది ప్రశాంతంగా అలాగే ఉండిపోయింది.. ఆ వ్యక్తి ఆ పాము తలభాగం నుంచి తోక భాగం వరకు అలాగే నిమురుతూ ఉండిపోయాడు. అయితే చివరి సమయంలో మాత్రం ఆ పాము ఒక్కసారిగా తన పడగలను పైకి లేపి.. కాటి వేయడానికి సిద్ధమైనట్లు  కనిపించడం మీరు చూడొచ్చు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను 46 లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. 

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

అంతేకాకుండా ఈ వీడియోను సుమారు 61,000 మందికి పైగా లైక్ చేశారు.. అయితే, ఈ వీడియో చూసిన చాలామంది.. పాముతో ఇలా సాహసోపేతమైన చర్యలకు పాల్పడడం ప్రమాదమని చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం ఇది తన పెంపుడు పామని.. అందుకే తల భాగంలో నిమురుతున్నప్పటికీ.. ఏమాత్రం అతడి పై దాడి చేయలేకపోయిందని వారు అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 12:40:10
Huzurabad, Telangana:

Sammakka Sarakka Jatara 2026: సమ్మక్క సారక్క జాతరలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డితో పోలీసులు వ్యవహరించిన తీరు తెలంగాణలో తీవ్ర వివాదాస్పదమైంది. ఒక ఎమ్మెల్యేను పట్టుకుని లాగిపడేయడం.. ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. అయితే తోపులాట సమయంలో తాను పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులకు క్షమాపణలు చెప్పారు.

Also Read: TTD: హిందూ సమాజానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ క్షమాపణ చెప్పాలి: టీటీడీ

తన హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక సమ్మక్క సారక్క జాతరలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఉద్దేశ్యపూర్వకంగా చేసిన మాటలు కాదు. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు. రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం. కానీ కొందరు మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆవేశంలో, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారా. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసిన మాటలు కావు' అని పాడి కౌశిక్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

'నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నా. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నా' అని హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించడాన్ని మాత్రం ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తీవ్రంగా తప్పబడుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ప్రివిలేజ్‌ మోషన్‌ దాఖలు చేసి తనపై అనుచితంగా వ్యవహరించిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని.. ఒక ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వలేరా? అని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కోరారు.

Also Read: DK Aruna: ప్రజలను మోసం చేయడానికి రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ డ్రామా: డీకే అరుణ

కాగా ఈ ఘర్షణ సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీస్‌ ఉన్నత అధికారుల సంఘం తప్పుబట్టింది. పోలీసులను అలా దూషించడం తగదని పేర్కొంది. ఈ మేరకు పోలీస్‌ అధికారుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డితో ఈ వివాదం ముగిసిపోయింది. అయితే తనతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాత్రం ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వారిపై చర్యలు తీసుకునేదాకా ఉపేక్షించే అవకాశం లేనట్టు కనిపిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 12:19:56
Mahbubnagar, Telangana:

Municipal Elections: 'ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ప్రజలను మోసం చేయడానికి రేవంత్‌ రెడ్డి ఏదో ఒకటి తెరపైకి తేవడం అలవాటుగా మారింది. ఫోన్ ట్యాపింగ్‌లో సిట్ నోటీసులు ఎన్నికల స్టంట్ మాత్రమే' అని మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డీకే అరుణ కొట్టిపారేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తెచ్చారని తెలిపారు. ఎన్నికల తర్వాత ఏం ఉండదని చెప్పారు. సిట్ నోటీసులు ఎన్నికల వేళ మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చిందని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు.

Also Read: TTD: హిందూ సమాజానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ క్షమాపణ చెప్పాలి: టీటీడీ

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల స్టంట్‌లకు ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. 'గద్వాల ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నాడని స్పీకర్ చెబుతుంటే అతడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి నిలబడి గెలవండి' అని సూచించారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

స్పీకర్ కూడా కోర్టులను మోసం చేయడం, ఇంతకన్నా దారుణం ఇంకా ఏం ఉంటుంది? అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ఫిరాయింపులపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి వాటివల్లే రాజకీయాలకు విలువలు లేకుండా మారిపోతుందని తెలిపారు. విద్య, వైద్యం, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు కేవలం కేంద్రం నుంచి మాత్రమే వస్తున్నాయని ఎంపీ అరుణ చెప్పారు.

Also Read: AP Assembly Session: నెల రోజుల పాటు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు?

'మహబూబ్‌నగర్ చుట్టుపక్కల బైపాస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధి  కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యం. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరుతున్నా' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మహబూబ్‌నగర్ మేయర్‌గా బీజేపీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ తుంగలో తొక్కిందని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికలు రాగానే.. శంకుస్థాపనలు చేయడం కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 12:00:15
Hyderabad, Telangana:

Varanasi Movie Release Date: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'వారణాసి'. ఈ సినిమా రిలీజ్‌పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. 

సోషల్ మీడియా వేదికగా రాజమౌళి ప్రకటించిన వివరాల ప్రకారం, 'వారణాసి' చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇది 2027లో రాబోయే అతిపెద్ద అంతర్జాతీయ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.

అద్భుతమైన తారాగణం
ఈ సినిమాలో భారతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటీనటులు నటిస్తున్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా 'రుద్ర' పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ 'మందానికి'గా.. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర 'కుంభ'గా వెండితెరపై కనిపించనున్నారు. 

కథా నేపథ్యం - ఖండాలు దాటే అడ్వెంచర్
ఈ సినిమా కథ వేల సంవత్సరాల నాటి పురాతన రహస్యాల చుట్టూ అల్లుకుంది. కథ అంటార్కిటికా మంచు ఖండం నుండి ఆఫ్రికా అడవుల వరకు, చివరకు భారతీయ పుణ్యక్షేత్రమైన వారణాసి వరకు అనేక దేశాలు, ఖండాలను దాటుతున్నట్లు ఇటీవలే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో తెలిసింది. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఐమ్యాక్స్ కోసం స్పెషల్‌గా చిత్రీకరిస్తున్నారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. "నాటు నాటు" తర్వాత రాజమౌళి-కీరవాణి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

2022లో విడుదలైన "RRR" ప్రపంచవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఇది ఐదవ స్థానంలో నిలిచింది. ఆ సినిమా సాధించిన ఆస్కార్ విజయం, ఇప్పుడు 'వారణాసి'పై ప్రపంచ మార్కెట్ దృష్టి పడేలా చేసింది.

మహేష్ బాబు కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రం. నవంబర్‌లో విడుదలైన ఫస్ట్ లుక్ ఫుటేజ్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుండగా, 2027 ఏప్రిల్ కోసం సినీ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Also Read: Mood Of The Nation Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? తాజా సర్వేలో సంచలన నిజాలు!

Also Read: T20 World Cup 2026 Schedule: T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..ఫిబ్రవరి 7 నుంచి సమరం షురూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 11:32:56
Tirupati Urban, Andhra Pradesh:

YS Jagan Apology: 'వైఎస్సార్‌సీపీ హయాంలో తిరుమలలో వేల అరాచకాలు చేశారు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అబద్దాలు చెబుతున్న వారికి బుద్ది ఉండాలి. యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు? హిందూ సమాజానికి వైఎస్‌ జగన్‌తో పాటు మిగిలిన వారు క్షమాపణ చెప్పాలి' టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు డిమాండ్‌ చేశారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో హిందువులపై దాడి జరిగిందని ఆరోపించారు. టీటీడీ నిబంధనలను ఎందుకు మార్చారని ప్రశ్నించారు.

Also Read: Janasena Party: జనసేన పార్టీ కీలక పరిణామం.. పిఠాపురం నుంచే ప్రారంభం

తిరుమల లడ్డూ వ్యవహారం సిట్‌ నివేదికపై రాజకీయ దుమారం రేపడంతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌సీపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ' సామర్థ్యం లేని డైరీలకు నెయ్యి సరఫరా చేయమని చెప్పారు. 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారు. జంతు కొవ్వు లేదని చెప్పడం చెప్పడం సిగ్గుచేటు' అని మండిపడ్డారు. 'కెమికల్స్‌తోనే నెయ్యి సరఫరా చేశారని స్పష్టంగా సిట్ చార్జ్‌షీట్‌లో ఉంది. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్‌ను నెయ్యి తయారీకి వాడారు. హిందువుల ప్రాణాలు తీసేలా వ్యవహరించారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read: AP Assembly Session: నెల రోజుల పాటు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు?

'కల్తీనెయ్యితో 20 కోట్ల లడ్డూలను తయారు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మహాపాపం చేశారు. జంతుకొవ్వు ఉందని ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చింది. సిట్ నిర్థారించింది. నెయ్యిని ల్యాబ్‌లకు పంపించి తమకు అనుకూలంగా రిపోర్ట్‌లు తెప్పించుకున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డారు' అని వైఎస్సార్‌సీపీ నాయకులపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. ఏ నిబంధనల ప్రకారం బోలేబాబా డైరీకి టెండర్‌ అప్పగించారు? జగన్, వైవీ సుబ్బారెడ్డి ప్రమేయం లేకుండానే పీఏ చిన్నప్పన్న ఇదంతా చేస్తాడా? అని నిలదీశారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

'వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి ఎందుకు సిట్‌కు బ్యాంకు వివరాలు ఇవ్వలేదు? తిరుమల వాటికన్ సిటీని దాటిపోయింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రణాళిక ప్రకారమే తిరుమలపై స్కెచ్ వేశారు. టీటీడీలో ప్రతి విషయంలోను నిబంధనలను తూట్లు పొడిచారు. టీటీడీని భ్రష్టుపట్టించి కోట్లు సంపాదించాడు' అని వైవీ సుబ్బారెడ్డిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. 'తల వెయ్యి ముక్కలు అవుతుందని భూమన మృత్యుంజయ యాగం చేస్తున్నాడు. భూమనకు అంత ప్రాణభయం ఎందుకు? తప్పు చేసి తప్పించుకోవాలనుకుంటే సాధ్యం కాదు భూమన' అని హెచ్చరించారు. 

'కల్తీనెయ్యిలో పెద్దవారి పాత్రను సిట్‌ పూర్తిగా వెలికితీయాలి. సిట్ గతంలో ఇచ్చింది చివరి ఛార్జ్‌షీట్ కాదు. ఇంకా ఉంది' అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. దుర్మార్గుల నుంచి తిరుమలను కాపాడుకోవాలని.. హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కల్తీ కేటుగాళ్లపై కేసులు పెట్టాలి.. జైలుకు పంపించాలని సూచించారు. 'వైఎస్సార్‌సీపీ పెద్దలకు హిందువులంటే చులకన భావం. హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను తరిమి తరిమి కొట్టే సమయం దగ్గరపడింది' అని తెలిపారు. నూటికి నూరు శాతం నెయ్యి కల్తీ అయ్యిందని స్పష్టం చేశారు.

Back to top