జె ఎన్ ఏ ఎఫ్ ఏ యు టీచింగ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కృతజ్ఞత సమ్మేళం
Hyderabad, Telangana:జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జే ఎన్ ఏ ఎఫ్ యు) కి స్థలాన్ని కేటాయించడం హర్షనీయమని జే ఎన్ ఏ ఎఫ్ ఏ యు టీచింగ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ పేర్కొంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడారు. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళలపై ఉన్న తన ఆసక్తిని ప్రత్యేకంగా ప్రదర్శించారని అన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Telangana Weather: తెలంగాణలో భారీ వడగాలుల హెచ్చరిక..హైదరాబాద్‌లో భారీ వర్షం!
Hyderabad, Telangana:Telangana Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భానుడి అగ్నిప్రవేశంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరగనుంది. అదే విధంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.IPL Business: కావ్య మారన్ బిజినెస్ మైండ్ మామూలుగా లేదుగా.. రూ. 85 కోట్ల నుంచి రూ. 13 వేల కోట్లకు SRH వాల్యూ..సక్సెస్ మ్యాజిక్ ఏంటంటే?
Lakshmapur, Telangana:Kavya Maran IPL Business: భారత్ లో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత క్రికెట్ చరిత్రను మార్చిందే ఐపీఎల్. బీసీసీఐ ఐపీఎల్ దెబ్బకు ఒక్కసారిగా ప్రపంచంలోనే రిచ్చెస్ట్ స్పోర్ట్స్ బోర్డుల్లో ఒకటిగా నిలిచింది. ఐపీఎల్ ను ఏ ముహూర్తంలో ప్రారంభించారో తెలియదు కానీ.. అప్పటి నుంచి ఒక రేంజ్ లో అదరగొడుతోంది. ఐపీఎల్ ను నమ్ముకున్న ఫ్రాంచైజీలు కూడా వందల కోట్ల లాభాలను అందుకుంటున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం తమ తప్పిదాలతో కనుమరుగవుతున్నాయి. మరికొన్ని ఫ్రాంచైజీలు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ వందల కోట్ల లాభాలను తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. అందులో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్.
ఒక్కప్పుడు హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ పేరు డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ గా ఉండేది. 2008లో జర్నీ ప్రారంభించిన ఈ ప్రాంచైజీ 2009లో టోర్నీ విన్నర్ గా నిలిచి సంచలనం రెకెత్తించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే కప్పు కొట్టి అందరికీ షాకిచ్చింది. కానీ ఆ క్రేజ్ ను ఫ్రాంచైజీ ఓనర్స్ నిలుపుకోలేకపోయారు. దీంతో దివాలా దీశారు. బీసీసీఐ.. హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టును వేలం వేశారు.
అప్పుడే మాస్ ఎంట్రీ ఇచ్చింది సన్ నెట్ వర్క్. చెన్నైకు చెందిన ఈ మీడియా సంస్థ ఎలాగైనా ఐపీఎల్లో ఒక టీమ్ గా ఉండాలని కంకణం కట్టుకుని మరీ ఎంట్రీ ఇచ్చింది. అయితే హైదరాబాద్ ఫ్రాంచైజీ కోసం జరిపిన వేలంపాటలో మొదట పీవీపీ వెంచర్స్ ఒక సంవత్సరానికి 69కోట్లు ఆఫర్ చేసింది. ఎందుకంటే అప్పట్లో ఐపీఎల్ ఇంకా అంత బ్రాండ్ వాల్యూను పొందలేదు. కానీ సన్ నెట్ వర్క్ సంస్థ ఏకంగా రూ. 85కోట్ల బిడ్ వేసి 5ఏళ్లకు గాను రూ. 424 కోట్ల ఫైనాన్షియల్ కమిట్ మెంట్ తో హైదరాబాద్ ఫ్రాంచైజీని తన సొంతం చేసుకుంది.
ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా కంటెంట్:
ఇక్కడే అసలు మజా షురూ అయ్యింది. నిజానికి ఫ్రాంచైజీని కొన్న మొదట్లో సన్ రైజర్స్ జట్టులో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేరు. ఒకరిద్దరు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. ఉరుములు, మెరుపులు మెరిపించే ప్లేయర్స్ ఎవరూ లేరు.. అయినా సన్ రైజర్స్ టీమ్ మేనేజ్ మెంట్ ఒక కొత్త మార్కెటింగ్ విధానంతో ప్రమోషన్స్ ను ప్రారంభించింది. జట్టులో ఏదో అద్బుతం చేశారు. అంటూ ఓ సరికొత్త థీమ్ సాంగ్ ను తీసుకువచ్చారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా కంటెంట్ ఇవ్వడం.. సోషల్ మీడియాను పక్కాగా వాడుకుంది.
ఒక్కొక్క సీజన్ లో సరికొత్త మార్కెటింగ్ విధానాలతో బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది. ప్రస్తుతం సన్ రైజర్స్ మార్కెట్ వ్యాల్యూ 13వేల కోట్ల భారీ బిజినెస్ సామ్రాజ్యంగా ఎదిగింది. కేవలం 85కోట్లతో ప్రారంభించిన సన్ రైజర్స్ ప్రయాణం 13వేల కోట్ల కు చేరిందంటే మామూలు విషయం కాదు. ఇదంతా 13ఏళ్లలోనే జరిగింది. నిజానికి ఐపీఎల్ జట్లకు కేవలం మ్యాచులు గెలిస్తే డబ్బులు వస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. దీని వెనక ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది.
2023లో అద్భుతం జరిగింది:
ప్రసార హక్కుల ద్వారా రెవెన్యూలో ఎక్కువ భాగం ప్రాంచైజీలకు కూడా ఇస్తుంది. 2023లో అద్భుతం జరిగింది. 4ఏళ్లకు సంబంధించి మీడియారైట్స్ వయాకామ్ 18, స్టార్ స్పోర్ట్స్ సంస్థలు 48వేల కోట్లకు బ్రాడ్ కాస్టింగ్ హక్కులు దక్కించుకున్నాయి. ఈ మీడియా రైట్స్ లో వచ్చిన ఆదాయం అంతకు ముందు సీజన్ తో పోల్చితే దాదాపు 129 శాతం పెరిగిందని చెప్పాలి. దీంతో ఫ్రాంచైజీలకు భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి. సాధారణంగా ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల కొనుగోలు, స్టేడియం ఖర్చులు, లాజిస్టిక్స్ తోపాటు ఇతర ఖర్చులు పోను సుమారు 330కోట్ల రూపాయల వరకు సర్ ప్లస్ మిగులుతుంది.
సన్ రైజర్స్ జట్టు అడ్వర్టైజింగ్ ఇంజిన్:
సన్ నెట్ వర్క్ వ్యూహం.. కంపెనీ యజమాని కావ్య మారన్ తమ జట్టును కేవలం ఆట కోసమే కాకుండా.. కార్పొరేట్ అడ్వాంటేజ్ కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. సన్ రైజర్స్ జట్టు వీరికి ఒక అడ్వర్టైజింగ్ ఇంజిన్ అని చెప్పాలి. సాధారణంగా పలు బ్రాండ్లు టీవీల్లో యాడ్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ సన్ నెట్ వర్క్ మాత్రం తమ ఎంటర్టైన్ మెంట్ ఛానల్స్ లో ఐపీఎల్ ప్లేయర్స్, హైదరాబాద్ ఫ్రాంచైజీని మొత్తం ఉపయోగించుకుంటుంది. దీంతో పెద్ద మొత్తంలో ప్రమోషన్లు చేయించుకుంటుంది.
కావ్య మారన్ నిర్ణయాలకు తిరుగుండదు:
ఇక కావ్యమారన్ తీసుకునే నిర్ణయాలకు తిరుగుండదనే చెప్పాలి. ఆమెకు బిజినెస్ వర్గాల్లోనూ మంచి పేరుంది. పైకి ఎమోషనల్ గా కనిపిస్తున్నప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. డేటా, ఫెర్ఫార్మెన్స్ ఈ రెండు విషయాలనే ఎక్కువగా నమ్ముతుంటారు. సాధారణ ఎమోషన్స్ ను పెద్దగా పట్టించుకోరని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. 2016 జట్టుకు కప్ అందించిన డేవిడ్ వార్నర్ ను తొలగించి మేనేజ్ మెంట్ తో కయ్యం కూడా పెట్టుకున్నారు. వార్నర్ ను తొలగించి బాస్ ఈజ్ రైట్ అనే సూత్రాన్ని ఫాలో అయ్యారు కావ్య.
గ్లోబల్ క్రికెట్ ఫ్రాంచైజీపై కన్ను:
ఐపీఎల్ తో నే సన్ రైజర్స్ ప్రస్థానం ఆగలేదు. గ్లోబల్ క్రికెట్ ఫ్రాంచైజీపై కూడా కన్నేసింది. సౌతాఫ్రికాలో జరిగే లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరుతో ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. 2023, 2024 ,2026లో వరుసగా మూడుసార్లు చాంపియన్ గా నిలిచింది. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ లీగ్ లో కూడా సుమారు 100 మిలియన్ బ్రిటిష్ పౌండ్స్ అంటే 1050 కోట్ల రూపాయల ఖర్చుతో టీంను సొంతం చేసుకుని క్రికెట్ ప్రపంచంలో సన్ నెట్ వర్క్ గ్రూప్ బలంగా దూసుకుపోతుందని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Silver Rate Today: వెండి ధరల్లో భారీ మార్పులు.. మే 27వ తేదీ బుధవారం ధరలు ఇవే..!!
Lakshmapur, Telangana:Silver Rate Today: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈరోజు మార్కెట్ ప్రారంభం కావడానికి ముందు, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో వెండి ఫ్యూచర్స్ ధర 0.13%, అంటే రూ. 358 తగ్గి, కిలోకు రూ. 2,70,270కి చేరింది. గత ట్రేడింగ్ రోజున ఇది కిలోకు రూ. 2,70,628 వద్ద ముగిసింది. జనవరి 29న వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ. 4,20,048 వద్ద సర్వకాలీన గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, వెండి ధర కిలోకు రూ. 2,73,000 కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ వెండి ధర ఔన్సుకు US$ 76.49కి పడిపోయింది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం, వెండి ధర కిలోకు రూ. 2,85,000గా ఉంది. కాగా, ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, వెండి ధర రూ. బుధవారం ఉదయం నాటికి కిలోకు 2,66,213 రూపాయలుగా ఉంది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, జాతీయ రాజధానిలో వెండి ధరలు కిలోగ్రాముకు ₹2,000 పెరిగి ₹273,000 కు చేరుకున్నాయి. సెషన్లో ఇది కిలోగ్రాముకు ₹271,000 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర 2 శాతానికి పైగా తగ్గి ఔన్సుకు $76.49 కు పడిపోయింది.బలహీనమైన స్పాట్ డిమాండ్ మధ్య వ్యాపారులు తమ డీల్స్ పరిమాణాన్ని తగ్గించడంతో, మంగళవారం ఫ్యూచర్స్ ట్రేడ్‌లో వెండి ధరలు కిలోకు రూ. 4,947 మేర తగ్గి రూ. 2,71,769కి చేరాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో జూలై డెలివరీకి సంబంధించిన వెండి కాంట్రాక్ట్ ధర కిలోకు రూ. 4,947 లేదా 1.79 శాతం తగ్గి రూ. 2,71,769కి చేరింది. వెండి ఫ్యూచర్స్ ధరల తగ్గుదలకు ప్రధాన కారణం వ్యాపారులు అమ్మకాలు జరపడమేనని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, న్యూయార్క్‌లో వెండి ధరలు 2.01 శాతం తగ్గి ఔన్సుకు $76.51కి చేరాయి.
ఒక సంభావ్య ఒప్పందం దిశగా ఏదైనా పురోగతి సాధిస్తే అది ఇంధన మార్కెట్లోని ఉద్రిక్తతలను తగ్గించి, ద్రవ్యోల్బణ ఆందోళనలను ఉపశమింపజేస్తుందని, తద్వారా విలువైన లోహాలకు మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చర్చలు విఫలమైతే, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ తలెత్తవచ్చని, ఇది కఠినమైన ద్రవ్య విధానంపై అంచనాలను మరింత బలపరిచి, బంగారం, వెండి ధరలపై అదనపు ఒత్తిడిని పెంచుతుందన్నారు.
రాబోయే యూఎస్ కోర్ పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్స్ (పీసీఈ), ద్రవ్యోల్బణం జీడీపీ డేటా కోసం పెట్టుబడిదారులు ఇప్పుడు ఎదురుచూస్తున్నారని, ఇవి సమీప భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ అంచనాలను బులియన్ కదలికలను గణనీయంగా ప్రభావితం చేయగలవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్ పొందేందుకు లైన్ క్లియర్..!!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Unite8 Sports Channels: క్రీడా రంగంలోకి 'జీ'.. యునైట్8 పేరిట నాలుగు ఛానల్స్ ప్రారంభం
Wadgaon, Maharashtra:Unite8 Sports Channels: వినోదం... వార్తా ప్రసారాలతోపాటు ఓటీటీలతో కుటుంబాలను మొత్తం సంతోషంతో నింపుతున్న జీ మీడియా ఇప్పుడు మరో గొప్ప ముందడుగు వేసింది. భారతీయ మీడియా రంగంలో ప్రముఖ కంటెంట్, టెక్నాలజీ సంస్థగా అగ్రస్థానంలో ఉన్న 'జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్' ఇప్పుడు స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇన్నాళ్లు ప్రేక్షకుల విశేష ఆదరణ, తన ముద్రను చూపించిన జీ మీడియా ఇకపై క్రీడారంగంలో కూడా మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త ఛానళ్లను ప్రారంభించింది.
జీ మీడియా క్రీడలకు సంబంధించి 'యునైట్8 స్పోర్ట్స్' (Unite8 Sports) పేరుతో సరికొత్త క్రీడా ఛానళ్ల పోర్ట్‌ఫోలియోను ప్రారంభించబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. క్రీడారంగంలోని సరికొత్త ఫార్మాట్లు, ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు, ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో క్రీడాభిమానులకు అత్యుత్తమ వినోదం, అనుభూతిని అందించడమే లక్ష్యంగా జీ మీడియా క్రీడా ఛానళ్లను ప్రారంభించనుంది.
దశాబ్దాలుగా జీ సంస్థ వినోద ఛానళ్లలలోనే ముఖ్యమైన క్రీడా ఈవెంట్లను ప్రసారం చేస్తూ స్పోర్ట్స్ రంగంలో విశేష గుర్తింపు సాధించింది. ప్రత్యక్ష ప్రసారాలపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను ఉపయోగించుకుని భారీ ప్రేక్షకాదరణ (వ్యూయర్షిప్)ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బలమైన పునాదితో క్రీడా రంగంలో మరింత విస్తరించడానికి భారీ ప్రణాళికతో జీ మీడియా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సంస్థ ఒకేసారి నాలుగు ప్రత్యేక స్పోర్ట్స్ ఛానళ్లను తీసుకురానుంది.
సరికొత్త ఛానళ్లు ఇవే
హిందీలో: యునైట్8 స్పోర్ట్స్ 1 (Unite8 Sports 1), యునైట్8 స్పోర్ట్స్ 1 HD (Unite8 Sports 1 HD)
ఇంగ్లీష్‌లో: యునైట్8 స్పోర్ట్స్ 2 (Unite8 Sports 2), యునైట్8 స్పోర్ట్స్ 2 HD (Unite8 Sports 2 HD)
క్రీడా రంగం అంటే ఒక్క క్రికెట్ కాదు అంతకుమించిన ఆటలు ఉన్నాయి. కొత్త ప్రారంభించనున్న ఈ ఛానళ్లలో ఫుట్‌బాల్, కబడ్డీ, క్రికెట్, బాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, కాంబాట్ స్పోర్ట్స్ (మార్షల్ ఆర్ట్స్) వంటి ప్రముఖ క్రీడలను ప్రసారం చేయనున్నారు. ఈ ఛానళ్ల ప్రారంభానికి అవసరమైన దరఖాస్తులను సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్లు జీ మీడియా తెలిపింది. జీ సంస్థలోని మానవ వనరుల నైపుణ్యాలను, మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ పనిచేస్తున్న భావేష్ జనావ్లేకర్క్కు క్రీడారంగంలో స్పోర్ట్స్ అందించనుంది. జీ సంస్థకు చెందిన మరాఠీ మూవీస్ క్లస్టర్ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం. యునైట్8 స్పోర్ట్స్ ఛానళ్లకు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సీబీఓ)గా వ్యవహరిస్తారు. బిజినెస్‌పై ఉన్న ఆయన అవగాహన, వ్యూహాత్మక చొరవతో జీ స్పోర్ట్స్ విభాగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లనున్నారు.
ఈ సందర్భంగా భావేష్ జనావ్లేకర్ మాట్లాడుతూ.. "భారత్‌లాంటి సువిశాల దేశంలో ప్రపంచవ్యాప్త ఆదరణతో పాటు స్థానిక మూలాలు ఉన్న క్రీడలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో లైవ్ కంటెంట్ చూడాలనే ఆసక్తి, విభిన్న క్రీడా ఫార్మాట్లపై ఉన్న క్రేజ్‌తో స్పోర్ట్స్ వ్యూయర్షిప్ వేగంగా దూసుకుపోతోంది. మా కంటెంట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి, వృద్ధి చెందుతున్న అవకాశాలను అందుకోవడానికి ఈ నాలుగు లీనియర్ స్పోర్ట్స్ ఛానళ్ల ప్రారంభం ఎంతగానో దోహదపడుతుంది' అని ధీమా వ్యక్తం చేశారు.
జీ ఛానళ్లలో ఫిఫా వరల్డ్ కప్?
క్రీడా విభాగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇచ్చేందుకు జీ సంస్థ భారీ ప్రణాళిక వేసింది. యునైట్8 పేరిట ప్రారంభించే ఈవెట్ల సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారతదేశంలో టీవీల్లో, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేసేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA)తో చర్చలు చేస్తోంది. ప్రత్యేకంగా లీనియర్ స్పోర్ట్స్ ఛానళ్లను తీసుకురావడంతో వేగంగా వృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను అందుకోవడానికి.. సరికొత్త ఆవిష్కరణలతో ప్రేక్షకులను అలరించడానికి 'జీ' గ్రూప్ సిద్ధమైంది.
Siddaramaiah: రేపు సిద్ధరామయ్య రాజీనామా.. తదుపరి కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్?
Doni, Karnataka:Siddaramaiah Resign: పొరుగు రాష్ట్రం కర్ణాటకలో సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఎప్పటి నుంచో కొనసాగుతున్న వివాదానికి తెరపడనుంది. అధికార మార్పు అనేది కర్ణాటకలో చోటుచేసుకోనుందని తెలుస్తోంది. సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారని.. రాజ్యసభకు వెళ్తున్నారని అధికారికంగా తెలుస్తున్న సమాచారం. అధిష్టానంతో జరిపిన చర్చల్లో ఈసారి డీకే శివకుమార్ మొండిగా ఉండడంతో ఇక పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా నేడు చివరి రోజు అని.. రేపు రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
Also Read: Gold Treasure: భూమిని తవ్వితే బంగారం నాణేలు ప్రత్యక్షం.. విలువ ఎన్ని కోట్లంటే?
కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాలపై మంగళవారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ పెద్దలు కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలా సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చలు నడిచాయని తెలుస్తోంది. కర్ణాటక నాయకత్వ వివాదానికి ముగింపు పలకాలని.. అధికార బదిలీ కావాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.
అయితే సమావేశం ముగిసిన అనంతరం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ చుట్టూ నెలకొన్న విబేధాల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక ఎన్నికలపైనే సమావేశం జరిగిందని వివరణ ఇచ్చారు. పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పు లేదని ఖండించినప్పటికీ ఇదంతా పైపై మాటలు అని అర్థమవుతోంది.
Also Read: Pawan Kalyan: నన్ను రెచ్చగొట్టవద్దు.. మేం ఎదురుదాడి చేస్తాం: పవన్ కల్యాణ్
అధిష్టానంతో జరిగిన సమావేశంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టడంతో.. సిద్ధరామయ్య మెత్తబడిపోయాడని వార్తలు వచ్చాయి. రాజ్యసభ ఎన్నికల వేళ సీఎంగా రాజీనామా చేయించి సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆయన రాజీనామాతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం లాంఛనంగా కనిపిస్తోంది.
సమావేశం ప్రారంభం.. ముగిసిన అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తోపాటు ఆయన వర్గాలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం పదవీ మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రెండున్నర సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సిద్ధరామయ్యను దించడం ఖాయంగా తెలుస్తోంది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని విడతలవారీగా ఇస్తామని హామీ ఇచ్చినట్లు డీకే వర్గం గుర్తుచేస్తోంది.
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకు ఇచ్చిన రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిందని తదుపరి డీకే శివకుమార్ అని ఆయన వర్గం వారు చెబుతున్నారు. తరచూ ఇదే అంశంతో కర్ణాటక కాంగ్రెస్ తలపట్టుకుంది. దీంతో కర్ణాటకలో నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకుని ఈసారి అధికార మార్పిడికి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మరి రానున్న రెండు రోజుల్లో కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొంది.
RCB vs GT Highlights: గుజరాత్ భారీ ఓటమి.. ఐపీఎల్ 2026 ఫైనల్లోకి బెంగళూరు
mathura, Dharamshala, Himachal Pradesh:RCB Into IPL 2026 Finals: ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైన 17 ఏళ్ల తర్వాత తొలి ట్రోఫీని దక్కించుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలనే కసితో ఆడి గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. సీజన్లో అత్యధిక స్కోర్ బాదడమే కాకుండా గుజరాత్‌ను బౌలింగ్‌తో ఘోరంగా దెబ్బతీసి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతూ ఆడుతున్న బెంగళూరు మొదట ప్లేఆఫ్స్‌లో బెర్త్‌ను దక్కించుకోవడమే కాకుండా టాప్‌లో నిలిచింది. రజత్ పాటిదార్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు ట్రోఫీ సాధించేందుకు ఒక్కడుగు దూరంలో నిలిచింది.
Also Read: Gold Treasure: భూమిని తవ్వితే బంగారం నాణేలు ప్రత్యక్షం.. విలువ ఎన్ని కోట్లంటే?
భారీ తేడాతో విజయం
ధర్మశాల వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక గుజరాత్ టైటాన్స్ చేతులెత్తేసింది. 19.3 ఓవర్లకు 162 పరుగులు చేసి గుజరాత్ ఆటను ముగించింది. ప్రత్యర్థి ఏమాత్రం పోటీనివ్వకపోవడంతో బెంగళూరు జట్టు 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ తరఫున రాహుల్ తెవాటియా మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీస పోరాటం చేయలేకపోయారు. తెవాటియాకు తోడు జోస్ బట్లర్ కొంత రాణించినా.. మిగతా బ్యాటర్లందరూ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు.
పరువు కాపాడిన రాహుల్ తెవాటియా
అద్భుత ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ 14 పరుగులకే ఔటవగా.. కెప్టెన్ శుభమన్ గిల్ రెండే పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔటవడంతో గుజరాత్ ఓటమి వైపు అడుగులు వేసింది. బట్లర్ కొద్దిసేపు నిలబడి 11 బంతుల్లో 29 పరుగులు చేశాడు. నిశాంత్ సింధూ (5), వాషింగ్టన్ సుందర్ (8), జేసన్ హోల్డర్ (0), రషీద్ ఖాన్ (8), రబడా (9), మహ్మద్ సిరాజ్ (5), ప్రసిద్ కృష్ణ (6) పరుగులు చేయలేకపోయారు. ఫైనల్‌పై కన్నేసిన బెంగళూరు జట్టు బ్యాటర్లు భారీ స్కోర్ చేయగా.. తామేమీ తక్కువ కాదని బౌలర్లు నిరూపించారు. ఆఖరులో వచ్చిన రాహుల్ తెవాటియా గొప్ప ప్రదర్శన చేశాడు. ఓటమి ఖరారైనా కూడా నిలబడి పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు గొప్పగా పోరాడాడు. నిలకడగా ఆడుతూ.. 43 బంతుల్లో 68 పరుగులు చేయగా.. 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరంభం నుంచి వికెట్లు తీయడమే పనిగా పెట్టుకున్నారు. బెంగళూరు బౌలింగ్ దెబ్బకు గుజరాత్ బ్యాటర్లు తట్టుకోలేక నిమిషాల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు మైదానం వీడారు. జాకబ్ డఫీ, రషీఖ్ సలామ్ రెండేసి వికెట్లతో విజృంభించగా.. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలా ఒక్కో వికెట్ తీసి గుజరాత్ బ్యాటింగ్ దళాన్ని కుప్పకూల్చారు.
Also Read: Pawan Kalyan: నన్ను రెచ్చగొట్టవద్దు.. మేం ఎదురుదాడి చేస్తాం: పవన్ కల్యాణ్
ధనాధన్ ఇన్నింగ్స్
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 19 పరుగులకు ఔటవగా. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడినా మోస్తరు పరుగులు చేశారు. కోహ్లీ 25 బంతుల్లో 43 పరుగులు చేసి ఒక సీజన్లో 600 పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పడిక్కల్ 30 పరుగులు చేయగా.. కృనాల్ పాండ్యా అద్భుతంగా ఆడి 43 పరుగులు నమోదు చేశాడు. బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టును ఫైనల్లోకి తీసుకెళ్లాలనే కసితో విధ్వంసం సృష్టించాడు. భారీ స్కోర్ చేస్తే విజయం సాధ్యమని నమ్మిన పడిక్కల్ బ్యాట్‌తో విజృంభించి 33 బంతుల్లో అత్యంత వేగంగా 93 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 9 సిక్సర్లతో రజత్ చెలరేగి ఆడడమే కాకుండా నాటౌట్‌గా నిలిచాడు. టిమ్ డేవిడ్ (4) నిరాశపర్చగా.. పాటిదార్‌తో కలిసి జితేశ్ శర్మ కూడా బ్యాట్‌తో మెరిసి 15 పరుగులు జోడించి గుజరాత్‌కు భారీ లక్ష్యాన్ని విధించాడు.
బౌలర్లు ఘోరంగా విఫలం
ఫైనల్లోకి అడుగుపెట్టాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ఏమాత్రం ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయారు. వికెట్లు ఆలస్యంగా తీయడంతో అప్పటికే బ్యాటర్లు విజృంభించారు. కగిసో రబాడా, జేసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన సిరాజ్ ఈ మ్యాచ్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వికెట్ తీయకపోవడమే కాకుండా పరుగులు కూడా భారీగా సమర్పించుకున్నాడు. ఫలితంగా మూడు ఓవర్లు మాత్రమే వేశాడు.
బెంగళూరు ఒకే ఒక్క అడుగు
క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్‌కు చాంపియన్‌గా నిలిచేందుకు మరో అవకాశం ఉంది. బెంగళూరు చేతిలో ఓడిపోయిన గుజరాత్.. ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలపడనుంది. రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో గుజరాత్ ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది. మరి గుజరాత్‌తో తలపడేందుకు ఏ జట్టు వస్తుందనేది రేపు తెలియనుంది.
Gold Treasure: భూమిని తవ్వితే 'చక్రవర్తుల' నాటి బంగారం నాణేలు ప్రత్యక్షం.. గుప్తనిధి విలువ ఎన్ని కోట్లు తెలుసా?
Schieren, Diekirch:Ground Unearths 141 Gold Coins: రాజుల కాలం నాటి బంగారం బయటపడింది. మట్టిని తవ్వుతుండగా బంగారం నిధి వెలుగులోకి వచ్చింది. భూమి నుంచి బంగారు నాణేలు బయటపడడంతో అక్కడి స్థానికులు ఆసక్తిగా గమనించారు. అయితే ఆ బంగారం ఇప్పటిది కాదని కొన్ని వేల సంవత్సరాల కిందటిదని తేలింది. బయటపడిన గుప్తనిధిలో బంగారు నాణేలు ఉన్నాయి. ఆ నాణేల విలువ కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆ బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
లక్సెంబర్గ్ దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న హోల్జ్థమ్ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో సుమారు 1,700 సంవత్సరాలుగా భూమిలో పాతిపెట్టి ఉన్న బంగారం బయటపడింది. బయటపడిన బంగారు నాణేలు 141 ఉన్నాయి. అవి రోమన్ చక్రవర్తుల కాలానికి సంబంధించినవని తెలిసింది. ఆ బంగారానికి అత్యంత విలువ ఉంటుంది. వీటి విలువ లక్షల యూరోలు (లక్సెంబర్గ్ కరెన్సీ) ఉండవచ్చని సమాచారం.
Also Read: Harish Rao: పెట్రోల్, డీజిల్‌పై రేవంత్ రెడ్డి వ్యాట్ తగ్గించాలి.. హరీశ్ రావు లేఖ
ఇది తెలుసుకున్న చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు వెంటనే హోల్జ్థమ్ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. మొదట్లో ఇది కేవలం ఒక చిన్న లోహపు ముక్క అని భావించినా.. తర్వాత పరిశోధన చేయగా చివరి రోమన్ సామ్రాజ్యానికి చెందిన బంగారం నాణేలు అని గుర్తించారు. ఆ బంగారానికి డబ్బు విలువ కంటే చారిత్రక విలువ అంతకన్నా ఎక్కువ ఉంది. రోమన్ చక్రవర్తుల పాలనకు సంబంధించిన భౌతిక ఆధారాలు లభించడం చాలా అరుదు.
Also Read: Pawan Kalyan: నన్ను రెచ్చగొట్టవద్దు.. మేం ఎదురుదాడి చేస్తాం: పవన్ కల్యాణ్
బంగారం లోహపు నాణేలు రోమన్ చక్రవర్తులకు సంబంధించినది లభించడంతో చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారులు ప్రాముఖ్యత అంతకంటే చాలా ఎక్కువ. లభించిన 141 నాణేలు విడివిడిగా లేకుండా ఒకే చోట జాగ్రత్తగా భద్రపరచి ఉండడం గమనార్హం. ఈ నిధిలో 'సోలిడి' అని పిలిచే 141 బంగారు నాణేలు ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యం అంతమవుతున్న సమయంలో క్రీస్తు శకం 4వ, ఐదో శతాబ్దాల మధ్య వీటిని ముద్రించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
భూగర్భంలోనే బంగారం
రోమన్ చక్రవర్తుల కాలం అంతమిస్తున్న సమయంలో దండయాత్రలు, ఆర్థిక సంక్షోభం ఎదురవడంతో ఆ గ్రామంలోని ఒక ధనిక కుటుంబం, లేదా ఎవరైనా అధికారి తమ అమూల్యమైన సంపదను భూగర్భంలో భద్రపరచి ఉంటారని పురావస్తు అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడు దాచిన బంగారం వేల సంవత్సరాల తర్వాత బయటపడడం విశేషం. శతాబ్దాల పాటు భూగర్భంలోనే ఉండిపోయిన ఈ బంగారం కరిగిపోకపోవడం గమనార్హం.
గతంలోనే తవ్వకాలు
నాణేలపై రోమన్ చక్రవర్తుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఒక చక్రవర్తి కాకుండా పలువురి చిత్రాలు నాణేలపై ఉండడంతో ఆ కాలంలో రాజకీయ అస్థిరత కారణంగా తరచూ చక్రవర్తులు మారిన విషయాన్ని నాణేలు చెబుతున్నాయి. గతంలో కూడా పలుచోట్ల బంగారం నిల్వలు బయటపడ్డాయి. పలుచోట్ల దాచి ఉంచిన గుప్తనిధులు బయటపడ్డాయి. 2019లో ప్రస్తుతం బయటపడిన ప్రాంతంలోనే ఒక పొలంలో బంగారు నాణెం గుర్తించారు. ఆ ఆధారంతో తవ్వకాలు చేపట్టగా తాజాగా 141 బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో భారీగా చారిత్రక ఆధారాలు బయటపడుతుండడంతో భవిష్యత్‌లో మరిన్ని తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది.
TDP Mahanadu 2026: టీడీపీ శ్రేణుల్లో జోష్.. రేపటి నుంచే పసుపు పండుగ
Amaravathi, Andhra Pradesh:Telugu Desam Party Mahanadu 2026: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పసుపు పండుగ జరగనుంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చే మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో జరగనుంది. తొలిసారి మహానాడు డిజిటల్ పద్ధతిలో జరగనుండడంతో కొంత విశేషంగా నిలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు కార్యక్రమాన్ని ప్రతియేటా నిర్వహిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు 3 రోజుల పాటు నిర్వహించుకుంటూ వస్తోంది. పార్టీతోపాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు, పార్టీ బలోపేతం వంటి వాటిపై చర్చించడం మహానాడు లక్ష్యం.
టీడీపీ డిజిటల్ అడుగులు
నెల్లూరు వేదికగా మహానాడు కార్యక్రమాన్ని 3 రోజులు నిర్వహించాలని ప్రణాళిక వేసుకోగా రద్దు చేసింది. డిజిటల్ వేదికగా హైబ్రిడ్ విధానంలో జరగనున్న మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలందరిని భాగస్వామ్యం చేయనున్నారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలతో భౌతికంగా మహానాడు నిర్వహిస్తారు. దానికి అనుసంధానంగా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి.. పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంతో అనుసంధానం చేస్తారు.
Also Read: Harish Rao: పెట్రోల్, డీజిల్‌పై రేవంత్ రెడ్డి వ్యాట్ తగ్గించాలి.. హరీశ్ రావు లేఖ
ఎంపిక చేసిన నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలతోపాటు నాయకులతో మాట్లాడిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,848 క్లస్టర్ల ద్వారా డిజిటల్ పద్ధతిలో మహానాడు జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడించడం ద్వారా కార్యకర్తల్లో జోష్ తీసుకురానున్నారు. నేరుగా పార్టీ సిద్ధాంతాలపై మరింత చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. స్త్రీశక్తిలో భాగంగా మహిళా సంక్షేమం కోసం పార్టీ చేసిన కృషి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహానాడులో కీలకంగా చర్చించనున్నారు.
హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న మహానాడులో రోజు 6 గంటల పాటు పార్టీ తీర్మానాలు, రాష్ట్రాభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిజిటల్ మహానాడు జరగబోతుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి క్లస్టర్ వేదిక వద్ద ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,848 క్లస్టర్లలో నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడు ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరిశీలిస్తున్నారు.
Telangana MSME Summit: MSMEలే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక...రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధన కోసం గ్రీన్ మానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు: మంత్రి శ్రీధర్ బాబు
Lakshmapur, Telangana:Telangana MSME Summit: సుస్ధిరత అలాగే ఆర్థిక అభివృద్ధి కలిసి నడిచేలా ఒక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను తెలంగాణ నిర్మిస్తోందని.. MSMEలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అని సగర్వంగా ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబు. గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ వైపు మార్పు రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధనకు కీలకమని ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ MSME గ్రీనింగ్ సమ్మిట్ – ఎ ర్యాంప్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
వివరాల్లోకి వెళితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), అలాగే హైదరాబాద్ ఎస్ అండ్ టి క్లస్టర్ సంయుక్తంగా తెలంగాణ MSME గ్రీనింగ్ సమ్మిట్ – ఎ ర్యాంప్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని HITEX Exhibition Centre లో అంగరంగ వైభవంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం MSMEల పనితీరును మెరుగుపరచడానికి కేంద్ర MSME మంత్రిత్వ శాఖ చేపట్టిన RAMP – రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ స్కీం కింద నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించడం విశేషం.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరు కాగా, తెలంగాణ పరిశ్రమల శాఖ, TGSPDCL, MSME DFO, TGIIC వంటి కీలక ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో తెలంగాణ MSME గ్రీనింగ్ పోర్టల్, MSME అసెస్మెంట్ టూల్‌కిట్‌ను ఆవిష్కరించారు. MSMEలు ర్యాంప్ కార్యక్రమంపై సమాచారం తెలుసుకోవడానికి, ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి ఇవి ఒకే డిజిటల్ వేదికగా పనిచేయనున్నాయి.
ముఖ్యంగా తెలంగాణలోని MSME పరిశ్రమలను పర్యావరణహిత దిశగా మార్చేందుకు ఇండస్ట్రియలిస్టులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల సంఘాలు, బ్యాంకులు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్‌లు, ఎనర్జీ నిపుణులు, పరిశోధనా సంస్థలు ఒకే వేదికపై చర్చలు జరిపాయి. సమ్మిట్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశాల్లో MSME పారిశ్రామిక వేత్తలు తమ గ్రీన్ ఇనిషియేటివ్ ప్రయాణంలో అనుభవాలను పంచుకున్నారు. విద్యుత్ ఆదా టెక్నాలజీలు, శుభ్రమైన తయారీ విధానాలు, డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్స్ అమలులో ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించారు.
ఈ సందర్భంగా తెలంగాణ పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి మాట్లాడుతూ.. RAMP – రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ కార్యక్రమం MSMEల పోటీ సామర్థ్యం, స్థిరత్వం, వ్యాపారాలను పెంచే మంచి అవకాశం అని పేర్కొన్నారు. ర్యాంప్ కార్యక్రమం ద్వారా మార్కెట్ యాక్సెస్ పెంపుదల చేయడం, నాణ్యత ప్రమాణాలు, సస్టైనబిలిటీ, క్లస్టర్ అభివృద్ధి, టెక్నాలజీ అడాప్టేషన్, MSMEల సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణను దేశంలోనే గ్రీన్, బాధ్యతాయుత పరిశ్రమల అభివృద్ధికి ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టడమే ఈ కార్యక్రమం తుది లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసే MSME ఎకోసిస్టమ్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పలువురు అధికారులు ఈ సందర్భగా తెలిపారు.
Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్ పొందేందుకు లైన్ క్లియర్..!!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Business Ideas: కేవలం ఒక మిషిన్ కొనుక్కుంటే చాలు...ఆడుతూ పాడుతూ రోజుకు రూ. 5000 సంపాదించే అవకాశం..ఏం చేయాలంటే..?
Lakshmapur, Telangana:Business Ideas: నిరుద్యోగ యువత వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నారా? ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఉన్న ఊరిలోనే చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కనీసం 5000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి బిజినెస్ గురించి తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆ కార్లను శుభ్రం చేయడం అనేది ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. కారు శుభ్రం చేయించడానికి కార్ సర్వీస్ సెంటర్లకు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కానీ దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. హ్యాండీ కార్ వాషర్ ఉపయోగించి డోర్‌స్టెప్ కార్ క్లీనింగ్ సర్వీస్ (Doorstep Car Cleaning Service) ప్రారంభించడం ద్వారా అద్భుతమైన బిజినెస్ చేసుకోవచ్చు. ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలను అందించేందుకు చక్కని అవకాశంగా చెప్పవచ్చు.
కస్టమర్ల ఇళ్లకు లేదా ఆఫీసులకు వెళ్లి, వారు ఉన్న చోటే వారి కార్లను ప్రొఫెషనల్‌గా క్లీన్ చేయడం ఈ వ్యాపారంలో అసలు సీక్రెట్. దీని వల్ల కస్టమర్ సమయం ఆదా అవ్వడం, తక్కువ నీటితో క్లీనింగ్, కస్టమర్ కళ్ల ముందే సర్వీస్ లభిస్తుంది. దీని కోసం బ్యాటరీతో నడిచే లేదా పోర్టబుల్ హై-ప్రెజర్ వాషర్ కోసం సుమారు రూ. 10 వేలు ఉంటుంది. కార్ ఇంటీరియర్ క్లీనింగ్ కోసం వాక్యూమ్ క్లీనర్ కొనాలి. దీని ధర రూ. 5000 ఉంటుంది. కార్ షాంపూ, డాష్‌బోర్డ్ పాలిష్, టైర్ పాలిష్, గ్లాస్ క్లీనర్ కారుపై గీతలు పడకుండా తుడవడానికి మైక్రోఫైబర్ క్లాత్స్ ఇలా మొత్తం పెట్టుబడి సుమారు రూ. 25000 వరకూ ఖర్చు అవుతుంది. మీరు ఒక టూ వీలర్, లేదా చిన్న కారులో ఈ సెటప్ అంటే ఏర్పాటు చేసుకొని బిజినెస్ ప్రారంభించవచ్చు.
Also Read: ప్రగతినగర్,నిజాంపేట్‌లో అమ్ముడుపోని ప్లాట్లు
ఇక ధరల విషయానికి వస్తే బేసిక్ ఎక్స్టీరియర్ వాష్ ధర హై ప్రెజర్ వాటర్ వాష్, షాంపూ, టైర్ క్లీనింగ్ కోసం రూ. 200 నుంచి రూ. 350 వరకూ చార్జ్ చేయవచ్చు. డీప్ ఇంటీరియర్ క్లీనింగ్ అంటే వాక్యూమ్ క్లీనింగ్, డాష్‌బోర్డ్ పాలిషింగ్, మ్యాట్ క్లీనింగ్ కోసం రూ. 300 నుంచి రూ. 500 వరకూ చార్జ్ చేయవచ్చు. ప్రీమియం ఫుల్ కార్ వాష్ కింద కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్, కలిపి వాక్సింగ్ , పాలిషింగ్ సర్వీసులతో రూ. 500 నుంచి రూ. 800 వరకూ చార్జ్ చేయవచ్చు.
నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కింద వారానికి ఒకసారి చొప్పున నెలలో 4 వాష్‌లకు గానూ 1800 నుంచి 2000 వరకూ వసూలు చేయవచ్చు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, బిజీ ప్రొఫెషనల్స్ టార్గెట్ కస్టమర్లు గా ఎంపిక చేసుకొని విజిటింగ్ కార్డులు, లేదా పాంప్లెట్స్ పంచడం ద్వారా మీరు కస్టమర్లను పొందవచ్చు. పండగల సమయంలో ఆఫర్స్, డిస్కౌంట్స్ అందుబాటులో ఉంచితే మరింత మంది కస్టమర్లు లభిస్తారు.
Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్ పొందేందుకు లైన్ క్లియర్..!!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial: గంజాయి కేసులో కోర్టు సంచలన తీర్పు.. ఏడేళ్ల జైలు, భారీ జరిమానా!
Jagtial, Telangana:Jagtial Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంజాయి సాగు తో పాటు అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు కోర్టు ఏడేళ్ల పాటు కఠిన కారాకార శిక్షతో పాటు పదివేల చొప్పున జరిమానా విధించినట్లు జగిత్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
కొడిమ్యాల పరిధిలో కొద్ది రోజుల క్రితం నిషేధిత గంజాయిని అక్రమంగా సాగు చేస్తూ.. ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకొని..ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు పకడ్బందీగా విచారించిన కొడిమ్యాల పోలీసులతో పాటు నిందితులకు వ్యతిరేకంగా పక్క సాక్షాధారాలను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు..
సాక్షాలను పరిశీలించిన గౌరవ న్యాయస్థానం.. నిందితులపై మోపిన నేరం రుజువు కావడంతో వారికి ఏడు సంవత్సరాల పాటు కఠిన జైలు శిక్షతో పాటు తల పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తుది తీర్పును వెల్లడించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. యువత భవిష్యత్తును నాశనం చేస్తే సహించేది లేదని.. మారకద్రవ్యాల రవాణా తో పాటు విక్రయాల ద్వారా యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. గంజాయి ముఠాలపై నిరంతరం నిఘా ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విద్యాసంస్థల పరిసరాలతో పాటు మారుమూల గ్రామాల్లో గంజాయి సరఫరా కాకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజానికి విఘాతం కలిగించేలా ఎవరైనా మారకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిందితులకు శిక్షపడేలా శ్రమించిన కొడిమ్యాల పోలీసు సిబ్బందిని.. ప్రాసిక్యూషన్ విభాగాన్ని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Liquor Price: లిక్కర్ ధరలు పెంచొద్దు బాబోయ్.. కలెక్టరేట్‌కు మందుబాబుల వినూత్న లేఖ..
Hyderabad, Telangana:Telangana Liquor Price Hike News: రాష్ట్రంలోని జూన్ రెండవ తేదీ తర్వాత మద్యం ధరలు పెరుగుతున్నాయని ప్రచారం జోరుగా సాగుతూ ఉండడంతో.. మద్యం ప్రియులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న తాము.. ఇప్పుడు లిక్కర్ రేట్లు కూడా పెంచితే భరించే స్థితిలో లేమంటూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.. మద్యం ధరలను పెంచవద్దంటూ.. స్థానిక మద్యం ప్రియులు ఏకంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు ఓ బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్‌కు పంపిన లేఖలు మద్యం ప్రియులు తమ అభ్యర్థనను వినూత్నంగా.. ఎంతో ఆవేదనతో కూడిన స్వరంతో వ్యక్తపరచినట్లు తెలుస్తోంది.. పరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్రలతో పోలిస్తే ఇప్పటికే తెలంగాణలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. మధ్యతరగతి.. శ్రామిక వర్గాల ప్రజలు తమ రోజంతా పడ్డ కష్టాన్ని మర్చిపోవడానికి, కాస్త ఉపశమనం కోసం మద్యంపై ఆధారపడుతూ ఉంటారని.. అలాంటిది మళ్లీ ధరలను పెంచితే ఆ అదనపు భారాన్ని మేము మోయలేమని.. లేఖలో పేర్కొన్నారు..
ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని వారు కలెక్టర్ ను కోరారు.. ప్రస్తుతం ఉన్న ధరలనే.. యధాతధంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి కూడా చేసినట్లు తెలుస్తోంది. కాక కలెక్టరేట్ కార్యాలయానికి అందిన ఈ వినూత్న లేక కు సంబంధించిన స్క్రీన్షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు కూడా దీనిపై రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. మద్యం ప్రియులు కూడా తమ హక్కుల కోసం ఈ స్థాయిలో స్పందించడం విచిత్రంగా ఉన్న.. వారి బాధలోనూ నిజం ఉందని కొంతమంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
మరోవైపు ప్రతి ఏట జూన్ నెలలో బడ్జెట్ అంచనాలతో పాటు ప్రభుత్వ ఆదాయ వనరుల సమీక్ష నేపథ్యంలో మద్యం ధరల పెంపుపై ప్రచారం జరగడం సర్వసాధారణమే అయినప్పటికీ.. ఈసారి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఈ లేక పై అటు జిల్లా యంత్రాంగం.. ఇటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. గతంలో కూడా ఇలా చాలామంది మందుబాబులు కలెక్టర్లతో పాటు ఇతర అధికారులకు కూడా లేఖలు రాసిన సంగతి తెలిసిందే.. కానీ ఈ లేక వాటన్నిటికంటే చాలా భిన్నంగా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Sekhar Master: తిరుమల శ్రీవారి సేవలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్
Dharmavaram, Andhra Pradesh:Star Choreographer Sekhar Master Tirumala Temple Darshan Along With His Family Watch VideoJaya Prada: శ్రీకాళహస్తీశ్వర స్వామి సేవలో హీరోయిన్ జయప్రద
Srikalahasti, Mitta Kandriga, Andhra Pradesh:Actress Jaya Prada Visits Srikalahasti Temple And Offers Rahu Ketu Pooja Watch VideoCobra Shed Video: వామ్మె.. నాగుపాము కుబుసాన్ని చేతులతో వలిచేసిన యువకుడు.. వీడియో..
Hyderabad, Telangana:Cobra Shed Video Watch Here: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే వస్తోంది. ముఖ్యంగా వన్యప్రాణులు, విషసర్పాలకు సంబంధించిన వీడియోలకైతే నెట్టింట ఊహించని స్థాయిలో క్రేజ్ లభిస్తూ వస్తోంది. తాజాగా ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా పాముల పేర్లు చెబితేనే అడుగు వెనక్కి వేసే జనాలు ఉన్న ఈ రోజుల్లో.. ఒక యువకుడు ఏకంగా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా కుబుసాన్ని చేతులతో వలిచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన పాములు తమ చర్మాన్ని మార్చుకునే క్రమంలో పాత చర్మాన్ని వీడుతుంటాయి. ఈ సమయంలో అవి తీవ్రమైన ఒత్తిడితో పాటు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాయి. అందుకే ఆ సమయంలో వాటికి దూరంగా ఉండడం మంచిదని వన్యప్రాణి నిపుణులు చెబుతుంటారు. కానీ, వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్‌లో ఉందని భావించవచ్చు.. ఒక భారీ నాగుపాము యువకుడు పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు..
అతను ఏమాత్రం భయం లేకుండా.. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆ నాగుపాము తల భాగం నుంచి కుబుసాన్ని తన చేతులతో మెల్లగా తొలగించడం ప్రారంభించాడు. పాము కళ్లపై ఉన్న తెల్లటి పొరను సైతం అతను చాలా సున్నితంగా విడదీశాడు.. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆ యువకుడు అంత సాహసం చేస్తున్నా.. ఆ విషసర్పం అతడిపై దాడి చేయడానికి అస్సలు ప్రయత్నించడంలేదు.. ఎదురు తిరగకుండా..తల దించుకుని అతను చేస్తున్న పనికి సహకరించినట్లుగా ప్రశాంతంగా ఉండిపోవడం మీరు చూడొచ్చు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో అప్లోడ్ అయిన కొద్దిసేపట్లోనే లక్షలాది వ్యూస్, వేలాది షేర్లతో దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు కూడా రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అయితే, చాలా మంది ఆ యువకుడి ధైర్యానికి హ్యాట్సాఫ్.. పాముకు ఎంతటి ఉపశమనాన్ని అందించాడో! అని కామెంట్లు పెడుతుంటే.. మరికొంతమంది ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్. కాస్త తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
