మూసి పైన బిజెపి నేతలు కొత్త డ్రామాలు : బీర్ల ఐలయ్య
Yadagirigutta, Telangana:మూసి పైన బిజెపి నేతలు బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్త డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట కార్యాలయంలో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజు నిద్ర చేస్తాననడం సిగ్గుచేటని, ఒక్కరోజు నిద్రలో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఒక రాత్రి షో చేయడానికి మీడియా ప్రచారం కోసం కిషన్ రెడ్డి వెళ్తున్నారని తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా అనేక బాధలను అనుభవిస్తూ నిరుపేదల నివసిస్తున్నారని తెలిపారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
KTR Flag Host: తెలంగాణ భవన్లో స్వాతంత్య్ర వేడుకలు.. కేటీఆర్ జెండావిష్కరణ
Hyderabad, Telangana:BRS Party Working President KT Rama Rao Flag Host In BRS Party Office On The Occasion Of Independence DayKavitha: జెండావిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్సీ కవిత
Hyderabad, Telangana:Former MLC Kavitha Attends To Independence Day Celebrations At Hyderabad Watch VisualsPawan Kalyan Fever: పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం..మరోసారి అస్వస్థతకు గురైన డిప్యూటీ సీఎం!
Hyderabad, Telangana:Tirupati: స్వాతంత్య్ర వేడుకల్లో స్పృహ తప్పి పడిపోయిన మంత్రి ఆనం
Tirupati, Andhra Pradesh:Minister Anam Ramanarayana Reddy Falls Ill In Independence Day Celebrations At TirupatiHarish Rao: పథకాలు, గ్యారంటీలపై బహిరంగ చర్చకు సిద్ధమా..! రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్!
Siddipet, Telangana:Harish Rao vs Revanth Reddy: స్వాతంత్య్ర దినోత్సవం రోజు అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి చిల్లర మాటలతో పచ్చి అబద్ధాలు ఆడడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి రోత మాటలు మాట్లాడి ఉండరు. గాంధీ, పటేల్, నెహ్రూ లాంటి మహనీయులను తలచుకోవాల్సిన రోజున రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు తెరలేపాడు' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సంగారెడ్డిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి కరెక్టుగా సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి పూర్తిగా 420 మాటలే మాట్లాడారు' అని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15వ తేదీ రోజున సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా మాట్లాడలేదు. సంగారెడ్డి జిల్లా సాగునీటి కోసం కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మూలకు పడేసిందని ఆరోపించారు. వాటి గురించి కనీసం ఒక్క ముక్క కూడా రేవంత్ రెడ్డి మాట్లాడలేదని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
'బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరైన మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రోడ్లు తప్ప కాంగ్రెస్ వచ్చాక కొత్తగా ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదు. రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అబద్ధాలు ఆడుతున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మనిషికి 4 కిలోల బియ్యం, కుటుంబానికి 20 కిలోల సీలింగ్ ఉండేదని కేసీఆర్ వచ్చాక సీలింగ్ ఎత్తివేసి మనిషికి 6 కిలోల చొప్పున ఎంత మంది ఉంటే అంత మందికి బియ్యం ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని ప్రకటించారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని నిండు అసెంబ్లీలో చెప్పారు. కానీ సభలో మాత్రం రేవంత్ రెడ్డి 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి' బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ రాహుల్ గాంధీ పత్తాలేడని విమర్శించారు.
దమ్ముంటే గన్మెన్లను వదిలేసి అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఓయూ దగ్గరికి వస్తారా? అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పెట్టిపోయిన బకాయిలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. 'కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ రైతుబంధు ఇచ్చానని రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడు రేవంత్ రెడ్డి అని' అని తీవ్ర విమర్శలు చేశారు. 'నా ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే గన్మెన్లు లేకుండా నీ ఊరికి వస్తావా రేవంత్ రెడ్డి అని. నీ ఊళ్లో అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే నేను అక్కడే రాజీనామా చేస్తా. లేదంటే నువ్వు చేస్తావా?' అని సవాల్ విసిరారు.
Devdutt Padikkal: రెండేళ్ల తర్వాత దేవదత్ పడిక్కల్ అద్భుత రీఎంట్రీ.. శ్రీలంక తొలి టెస్టులో సెంచరీ
Galle, Southern Province:Devdutt Padikkal Century: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టాడు. తొలి రోజు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 288/2తో ఆటను ముగించింది. రీఎంట్రీతో పడిక్కల్ అద్భుతంగా ఆడి 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ భారీగా దంచికొట్టినా రిటైర్డ్ ఔటవగా.. కెప్టెన్ శుభమన్ గిల్ తక్కువ స్కోర్ ఔటయి నిరాశపర్చాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రత్యర్థి గడ్డపై ఆడిన భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. 73 ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవగా.. వర్షం అడ్డంకిగా నిలిచింది. పలుసార్లు వర్షం అంతరాయంతో మ్యాచ్‌కు బ్రేక్ ఇచ్చి మళ్లీ కొనసాగించారు. టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుని తొలి రోజు ఆటను రెండు వికెట్లకు 288 పరుగులతో ముగించింది. రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ 134 బంతుల్లో అద్భుత సెంచరీతో తన మొదటి అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. మొత్తం 178 బంతులు ఆడిన దేవదత్ 131 పరుగులు చేయగా.. 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అదరగొట్టాడు. సాయిసుదర్శన్ గాయం కారణంగా లంకతో సిరీస్‌కు పడిక్కల్‌కు జట్టులో స్థానం లభించింది. చాలాకాలం తర్వాత తనకు లభించిన అవకాశాన్ని పడిక్కల్ సద్వినియోగం చేసుకున్నాడు.
ఓపెనర్‌గా దిగిన యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 32 పరుగులు చేయగా.. వాటిలో ఐదు ఫోర్లు ఉన్నాయి. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 77 పరుగులతో రాణించాడు. 162 బంతులు ఆడిన రాహుల్ 9 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కుడి చేయి నొప్పి రావడంతో ఇబ్బంది పడిన రాహుల్‌కు ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేసినా తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. కెప్టెన్ శుభమన్ గిల్ 28 ంతుల్లో 16 పరుగులు చేసి ఔటవగా.. క్రీజులో 27 పరుగులతో రిషబ్ పంత్ ఉన్నాడు. శ్రీలంక బౌలర్లు వికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలి రోజు దెబ్బతీసేందుకు ప్రయత్నించగా అతి కష్టం మీద రెండు వికెట్లు తీశారు.
వరుణుడు ఆటంకం
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. లంచ్ బ్రేక్ సమయంలో వర్షం పడడంతో ఆటగాళ్లు ఆలస్యంగా మైదానంలోకి అడుగుపెట్టారు. వర్షం కారణంగా గంటన్నర సమయం వృథా అయ్యింది.
Prabhas Fauzi New Poster: ప్రభాస్ 'ఫౌజీ' కొత్త పోస్టర్..ఒకవైపు గాంధీ, మరోవైపు మాస్‌లుక్‌లో డార్లింగ్!
Hyderabad, Telangana:Prabhas Fauzi Poster News: ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ'. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మొహం చూపించకుండానే ప్రభాస్ సృష్టించిన విధ్వంసం, బ్యాక్‌డ్రాప్‌లో మహాత్మా గాంధీని చూపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
పోస్టర్ విశేషాలు, కథా నేపథ్యం..
చార్మినార్ బ్యాక్‌డ్రాప్: తాజా పోస్టర్లో చార్మినార్ నేపథ్యంగా భారీ మారణహోమం జరిగినట్లు చూపించారు. దోతి ధరించి, రక్తంతో తడిచిపోయి, రెండు చేతుల్లో పిస్టల్స్ పట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
గాంధీజీ - ప్రభాస్ విభిన్న ధ్రువాలు: ఒకవైపు అహింసా మార్గాన్ని బోధించిన మహాత్మా గాంధీ వెనక్కి వెళ్తుంటే.. మరోవైపు తుపాకులు పట్టుకుని ప్రభాస్ హింసా మార్గంలో ముందుకు వెళ్తున్నట్లు ఈ పోస్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. "ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్" అనే క్యాప్షన్ ఈ సినిమా కథాంశం ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో స్పష్టం చేస్తోంది.
ఫ్యాన్స్ రియాక్షన్, అంచనాలు
ఇప్పటివరకు విడుదలైన రెండు పోస్టర్లలోనూ ప్రభాస్ ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయనప్పటికీ, విపరీతమైన బ్లడ్ బాత్ (రక్తపాతం) ఉంటుందనే హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Before freedom became a celebration, it was a battle!
Saluting the spirit of every Fauzi who fought for our tomorrow 🙏🏼
Happy Independence Day 🇮🇳
– Team #FAUZI#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3
Rebel Star #Prabhas#Imanvi @hanurpudi… pic.twitter.com/1jTbifIcQB
— Fauzi (@FauziTheMovie) August 15, 2026
సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్' సైనికుడి నేపథ్యంలో ఈ కథ సాగనుందని సమాచారం. ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుండగా.. జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై. రవి శంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'కల్కి 2' సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందా? మేకర్స్ అధికారిక ప్రకటన!
Also REad: మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Weight Loss Diet: ఉదయం పూట అరటిపండు, గుడ్డు తింటే నిజంగా బరువు తగ్గవచ్చా? అసలు విషయాలు ఇవే!
Hyderabad, Telangana:Weight Loss With Egg Banana: ఉదయం చేసే అల్పాహారం మన రోజంతా శక్తిని, ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'అరటిపండు, గుడ్డు' కాంబినేషన్‌ను అల్పాహారంగా తీసుకుంటే రోజంతా శక్తి అందడంతో పాటు పొట్టలోని కొవ్వు ఇట్టే కరిగిపోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది? దీనివల్ల ఆరోగ్యానికి నిజంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
అరటిపండు - గుడ్డు: పోషకాల సమ్మేళనం
ఈ రెండు ఆహార పదార్థాలు వేర్వేరు రూపాల్లో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
అరటిపండ్లు: కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ బి6, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.
గుడ్లు: శరీరానికి కావాల్సిన అధిక నాణ్యత గల ప్రోటీన్‌తో పాటు విటమిన్ బి12, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కండరాల బలానికి, ఆకలిని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. నూనె వాడకుండా ఉడికించిన గుడ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మరింత శ్రేయస్కరం.
బరువు తగ్గడంలో ఈ అల్పాహారం పాత్ర ఎంతవరకు?
కేవలం అరటిపండ్లు, గుడ్లు మాత్రమే తినడం ద్వారా ఎలాంటి మ్యాజిక్ జరిగి బరువు తగ్గడం సాధ్యం కాదు. బరువు తగ్గడానికి అసలైన సూత్రం కేలరీల సమతుల్యత (మనం తీసుకునే కేలరీల కంటే ఖర్చు చేసే కేలరీలు ఎక్కువగా ఉండటం).
ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఈ ఆహారాలు ఆకలిని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి కాబట్టి, వీటిని మీ ఆరోగ్యకరమైన డైట్లో భాగం చేసుకోవచ్చు. అయితే రోజంతా తీసుకునే మిగతా ఆహారంలో అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక చక్కెరలు ఉంటే మాత్రం కేవలం ఈ బ్రేక్‌ఫాస్ట్‌తో ఫలితం ఉండదు.
వ్యాయామం చేసేవారికి ఎలా ఉపయోగపడుతుంది?
వర్కౌట్‌కు ముందు.. ఉదయం వ్యాయామం చేసేవారికి అరటిపండులోని కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే వర్కౌట్ తర్వాత గుడ్లలోని ప్రోటీన్ కండరాల కోలుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.
కేవలం అరటిపండు, గుడ్డు మాత్రమే కాకుండా మీ బ్రేక్‌ఫాస్ట్‌ను మరింత బ్యాలెన్స్డ్గా మార్చుకోవడానికి ఈ క్రింది మార్పులు చేయవచ్చు. గుడ్లతో పాటు తక్కువ నూనెతో కూడిన వెజిటబుల్ ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. ఉడికించిన గుడ్డు, అరటిపండుతో పాటు చక్కెర లేని పెరుగు లేదా కొన్ని తృణధాన్యాలను జోడించడం ద్వారా శరీరానికి వివిధ రకాల విటమిన్లు అందుతాయి.
గమనించాల్సిన ముఖ్యాంశాలు..
గుడ్లు లేదా అరటిపండ్ల పట్ల అలెర్జీ ఉన్నవారు వాటికి దూరంగా ఉండాలి. దీన్ని బరువు తగ్గించే ఎలాంటి "అద్భుత ఔషధం"గా భావించకూడదు. సరైన పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితోనే శాశ్వత బరువు నియంత్రణ సాధ్యమవుతుంది.
(గమనిక: ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. మీకు ప్రత్యేక అనారోగ్య సమస్యలు లేదా అలెర్జీలు ఉంటే నిపుణులైన డైటీషియన్ లేదా వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ఉత్తమం.)
Also Read: Dates Benefits: ఖర్జూర తింటే స్వర్గమే..కూసాలు కదిలిపోయే రహస్యం!
Also Read: Heart Attack Prevention: ఈ గింజలు తింటే గుండెపోటుకు అడ్డుకట్ట వేయోచ్చా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IND Vs SL Test: టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే వార్త..భారత్ - శ్రీలంక తొలి టెస్టు రద్దు అవ్వొచ్చు!
Galle, Southern Province:IND Vs SL 1st Test Weather: భారత్, శ్రీలంక జట్ల మధ్య లాంగ్ ఫార్మాట్ పోరు ప్రారంభమైంది. శ్రీలంకలోని చారిత్రాత్మక గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌కు సర్వం సిద్ధమైనా, వరుణుడి రూపంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయినా మొదటి రోజు ఆటకు అంతరాయం ఏర్పడినా.. రేపటి నుంచి వర్షం మరింతగా విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గాలే వేదికగా తొలి టెస్టు వాతావరణం..
భారత్ - శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గాలే స్టేడియం వేదికగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ ఐదు రోజుల టెస్టులో ఏకంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో వర్షం పరిస్థితి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు.
మ్యాచ్‌కు ముందు రోజు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండటంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ తీవ్రంగా దెబ్బతింది. ఆటగాళ్లు మైదానంలో పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోయారు. ఉదయం వర్షం తగ్గినప్పటికీ, రోజంతా అప్పుడప్పుడు కురిసిన చినుకులు ఆటకు అడ్డంకిగా మారాయి.
వరుణుడి కరుణపైనే మ్యాచ్ భవితవ్యం
ఐదు రోజుల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్‌లో నాలుగు రోజులు వర్షం పడే ఛాన్స్ ఉండటంతో, మ్యాచ్ ఫలితం కేవలం ఆటగాళ్ల ప్రదర్శనపైనే కాకుండా వాతావరణంపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. వరుణుడు శాంతిస్తేనే ఈ హోరాహోరీ పోరును పూర్తిస్థాయిలో చూసే అవకాశం లభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
తొలిరోజు ఆట సాగిందిలా..
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (32 పరుగులు) దురదృష్టవశాత్తూ రన్ ఔట్ రూపంలో వెనుదిరిగారు. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను బాధ్యతాయుతంగా ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు విలువైన 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లంక బౌలర్ల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న పడిక్కల్, 81 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో తన అద్భుత అర్ధశతరాన్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 2 వికెట్ల నష్టానికి 269 పరుగులు రాబట్టింది.
Also Read: Rohit Sharma West Indies: రిటైర్మెంట్ వార్తలకు చెక్..రోహిత్ శర్మ మరోసారి వన్డేల్లో!
Also Read; శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ఇండియా ప్లేయింగ్ 11 ఇదే! బెంచ్ మీద నలుగురు ఆటగాళ్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Allu Arjun Flag Controversy: మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే?
Hyderabad, Telangana:Allu Arjun Independence Flag Controversy: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
వివాదానికి కారణం ఏమిటి?
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్లుగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. అయితే, ఆ జెండా మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం అందులో కనిపించలేదు.
దీంతో బాధ్యత గల ప్రముఖ నటుడిగా జాతీయ పతాకాన్ని సరిచూసుకోకుండా పోస్ట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలో చక్రం లేకపోయినా, అల్లు అర్జున్ తన సొంత లోగోను మాత్రం స్పష్టంగా వేసుకున్నారని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు పెరుగుతుండటంతో బన్నీ వెంటనే ఆ పోస్టును తొలగించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
🚨 BREAKING:
Allu Arjun deletes his Independence Day tweet after facing backlash for posting an image of the Indian flag without the Ashoka Chakra.#AlluArjun #IndependenceDay pic.twitter.com/swXi9iymgi
— The Telugu Daily (@TheTeluguDaily_) August 15, 2026
అల్లు అర్జున్ లైనప్ ప్రాజెక్ట్స్
మరోవైపు, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ 'రాకా' భారీ బడ్జెట్‌తో వస్తోంది. గిరిజన, పురాణ నేపథ్యం, సమకాలీన కాలం అనే రెండు విభిన్న ప్రపంచాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. 2027 సెకండాఫ్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆ తర్వాత అట్లీ సినిమాతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనూ బన్నీ ఒక సినిమా చేయనున్నారు. ఆ వెంటనే బన్నీ లైనప్‌లో సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'పుష్ప 3' సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది.
Also Read: బిగ్ బాస్ 10లోకి క్రేజీ యాంకరమ్మ.. అల్లు అరవింద్ మెచ్చిన హీరోయిన్ బ్యూటీ ఎంట్రీ ఖాయం
Also Read: "బిగ్‌బాస్ 'అగ్నిపరీక్ష' అంతా బోగస్" శ్రీముఖిని పొగడలేదని షో నుంచి బయటకు పంపించేశారట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan: మళ్లీ అస్వస్థతకు గురయిన పవన్ కల్యాణ్.. వెంటనే హైదరాబాద్‌కు పయనం
Pithapuram, Andhra Pradesh:Pawan Kalyan High Fever: ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఆయన బిజీ బిజీగా గడిపారు. కానీ వెంటనే అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం బారిన పడడంతో ఆయన గవర్నర్ మర్యాదపూర్వకంగా నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరమయ్యారు. వెంటనే హైదరాబాద్‌కు బయల్దేరారు.
రాజమండ్రి పర్యటనకు వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గంలో రాజమండ్రికి చేరుకున్నార. ధవళేశ్వరం ప్రభుత్వ కలప డిపో వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఆ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నారు. కాసేపు విశ్రాంతి అనంతరం రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
ఇటీవల కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న పవన్ కల్యాణ్ ఇవాళ పర్యటన సందర్భంగా చేతికి సంబంధించిన ఇబ్బంది ఏర్పడినట్లు కనిపించింది. ఫిజియోథెరపీ వైద్య నిపుణుల సూచనలు తీసుకుంటారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటనలో తెలిపారు. ధవళేశ్వరంలో క్రాఫ్ట్ ఉడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా ఉన్నారు. అనారోగ్యం బారినపడినప్పటి నుంచి పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి ఉంటున్నారు.
తీవ్ర జ్వరం కారణంగా లోక్ భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దూరమయ్యారు. ఈ విషయాన్ని లోక్ భవన్ అధికారులకు డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రముఖులకు కార్యాలయంలో తేనిటి విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఇతర రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారు.
జనసేనలో ఆందోళన
తమ అధినేత, అభిమాన నటుడు పవన్ కల్యాణ్ తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో జనసేన పార్టీ శ్రేణులతోపాటు పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సర్జరీతో భయపడిన అభిమానులు.. ఇప్పుడు మరోసారి ఆయన తీవ్ర జ్వరం బారినపడడంతో అభిమానులు, పార్టీ శ్రేణుల్లో కలవరం ఏర్పడింది. తమ నాయకుడు త్వరగా కోలుకుని.. ఆరోగ్యంతో ఉండాలని పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.
Sabarimala Temple Schedule: రేపు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం..ప్రత్యేక ఏర్పాట్ల షెడ్యూల్ విడుదల!
Sabarimala, Kerala:Sabarimala Temple Schedule 2026: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం మరోసారి తెరుచుకోనుంది. మలయాళ కేలండర్ ప్రకారం పవిత్రమైన 'చింగం' మాస పూజా కార్యక్రమాల నిమిత్తం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఈ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయం తెరిచి, మూసివేసే షెడ్యూల్ తాజాగా విడుదలైంది.
ఆలయ తెరిచే సమయం, షెడ్యూల్
కేరళంలోని శబరిమల అయ్యప్ప ఆలయం ఆదివారం అనగా ఆగస్టు 16న సాయంత్రం సరిగ్గా 5:00 గంటలకు ప్రధాన పూజారి ఆలయ గర్భగుడి తలుపులను తెరుస్తారు. మలయాళ నూతన సంవత్సరం ప్రారంభం కానున్న ఈ నెల 17వ తేదీ ఉదయం 5:00 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
చింగం మాస పూజల ముగింపు సందర్భంగా అనగా ఈ నెల 21వ తేదీ రాత్రి 10:00 గంటలకు చింగం మాస పూజలు ముగియనుండటంతో ఆలయ గర్భగుడిని మూసివేస్తారు. చింగం మాస పూజల అనంతరం, ఆ రాష్ట్రంలో పెద్దఎత్తున జరుపుకొనే ఓనం పండుగ ప్రత్యేక పూజల కోసం ఆగస్టు 24వ తేదీన శబరిమల అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకోనుంది.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ప్రత్యేక పూజా సమయాల్లో శబరిమలకు విచ్చేసే అయ్యప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీడీబీ అధికారులు, కేఎస్ఆర్టీసీ (KSRTC) సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల రద్దీకి తగినట్లుగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. యాత్రికులకు మెరుగైన వసతులు, భద్రతా చర్యలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు.
భక్తుల రద్దీ అంచనాలకు తగినట్లుగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామని, యాత్రికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ శబరిమల యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
Also Read: మరికొద్ది గంటల్లో సూర్యగ్రహణం ప్రారంభం..ఈ రాశుల వారికి తస్మాత్ జాగ్రత్త!
Also REad: అరుదైన రాజయోగం..ఈ నాలుగు రాశులకు రాజయోగాలతో అదృష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral Video: ఎలుగుబంట్లకు పార్లేజీ బిస్కెట్లు తినిపించిన పూజారి.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Wild Bears Video Watch: ఆధారంగా అడవి జంతువులతో పాటు ముఖ్యంగా ఎరుగుబంట్లు వంటి క్రూర మృగాల పేర్లు వింటేనే భయంతో అందరూ ఎంతో వణికిపోతూ ఉంటారు. అలాంటిది.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక పూజారి ఏకంగా అడవి ఎలుగుబంటలకు చేతులతో పార్లేజీ బిస్కెట్లను తినిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆయన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక హనుమంతుడి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన అడవి ఎలుగుబంట్లకు పూజారి ఎలాంటి భయం లేకుండా అక్కడే కూర్చుని.. ఆ మూడింటికి పార్లేజీ బిస్కెట్లు చేతులతో తినిపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో రెండు ఎలుగుబంట్లు అతడు అందించిన బిస్కెట్లను అద్భుతంగా తింటున్నాయి. అంతేకాకుండా మరో చిన్న ఎలుగుబంటి మాత్రం.. ఆ పూజారి తలభాగం పైకి ఎక్కి.. అతను ఇచ్చిన బిస్కెట్‌ను తినడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.. వాటికి ఆ పూజారి ఎంతో ఆప్యాయంగా బిస్కెట్లు పెట్టడం చూసిన చాలామంది.. ఆశ్చర్యపోతూ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు..
అయితే, ఈ వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు సైతం.. సోషల్ మీడియా వినియోగదారులకు, అడవిలో జీవించే వారికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు తెలుపుతున్నారు.. ఈ తరహా అలవాట్లు మూగజీవాలకే కాకుండా మానవాళికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. అడవి జంతువులకు మనుషులకు పట్ల సహజంగా ఉండే భయం పోయి.. ఆహారం కోసం పూర్తిగా మనుషులపై ఆధారపడే ప్రమాదం ఉందని వారంటున్నారు.. అంతేకాకుండా క్రమంగా ఈ జంతువులు జనావాసాల్లోకి రావడం మొదలవుతాయని.. ఈ సమయంలోనైనా ఆహారం దొరకకపోతే.. ప్రజలపై దాడి చేసే అవకాశాలు విపరీతంగా పెరుగుతాయని వారు చెబుతున్నారు..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
అలాగే ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌తో పాటు పంచదార అధికంగా ఉండే, ఇలాంటి బిస్కెట్లు వంటి మానవ ఆహారాలు అడవి జంతువుల ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయని వారు తెలుపుతున్నారు. జంతువులు తమ సహజ ఆహారాన్ని వెతుక్కోవడం మానేస్తే స్థానిక పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ఛాన్స్ కూడా ఉందట... వన్యప్రాణులను ప్రేమించడం మంచిదే అయినప్పటికీ.. వాటిని వాటి సహజ ఆవాసాల్లో స్వేచ్ఛగా బ్రతకనివ్వడమే అసలైన పరిరక్షణ అని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఎలుగుబంట్లకు సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rohit Sharma West Indies: రిటైర్మెంట్ వార్తలకు చెక్..రోహిత్ శర్మకు మరోసారి వన్డేల్లో అవకాశం!
Hyderabad, Telangana:Rohit Sharma West Indies Series: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇంగ్లండ్ పర్యటనలోని చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో మెరిసిన 'హిట్‌మ్యాన్', తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్ సిరీస్‌తో కీలక అడుగు
బీసీసీఐ, సెలెక్టర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్‌లోపు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సిరీస్ రోహిత్‌కు అత్యంత కీలకం కానుంది.
ఊహాగానాలకు కారణాలేంటి?
ఇంగ్లండ్ పర్యటన సమయంలో రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఆడించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. లార్డ్స్ వేదికగా జరిగిన వన్డేనే రోహిత్‌కు ఆఖరి మ్యాచ్ కావచ్చని ప్రచారం జరిగింది. అయితే, అదే మ్యాచ్‌లో రోహిత్ అబాధ్యతాయుతమైన శతకంతో చెలరేగి, రిటైర్మెంట్పై ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
సిరీస్వారీగా ప్రదర్శనల సమీక్ష
తన వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన రోహిత్‌కు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఇకపై ఆయన ప్రదర్శనను సిరీస్వారీగా సమీక్షించనున్నారు. దీంతో వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన ఎలా ఉండబోతుందనే దానిపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
అజిత్ అగార్కర్ భవిష్యత్తు..
మరోవైపు బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలంపై కూడా సందిగ్ధత కొనసాగుతోంది. వరుస ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు రాణించడంతో ఆయన ఒప్పందాన్ని 2027 ప్రపంచకప్ వరకు పొడిగిస్తారని భావించారు. అయితే, శ్రీలంక టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత జరిగే బీసీసీఐ కీలక సమావేశంలో అగార్కర్ భవిష్యత్తుపై స్పష్టత రానుంది.
బీసీసీఐ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్టర్లు, బోర్డు పెద్దల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. జట్టులో ప్రక్షాళన జరగాలని సెలెక్టర్లు భావిస్తుంటే, బోర్డు మాత్రం రోహిత్ అందుబాటులో ఉన్నంత కాలం ఆడాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైనా, ఇంగ్లండ్‌లో సెంచరీతో తన సత్తా చాటిన రోహిత్.. వెస్టిండీస్ సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తే 2027 వరల్డ్‌కప్ రేసులో ముందుండటం ఖాయం.
Also Read: శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ఇండియా ప్లేయింగ్ 11 ఇదే! బెంచ్ మీద నలుగురు ఆటగాళ్లు!
Also Read: టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? బీసీసీఐలో కీలక పదవికి హైదరాబాదీ సై!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సర్కార్ బడుల్లో ప్రపంచస్థాయి చదువులు.. ఈనెల 17 నుంచి ఫిన్లాండ్లో టీచర్ల స్పెషల్ ట్రైనింగ్..!!
Lakshmapur, Telangana:Teachers Finland Training: ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. 'ఏపీ విద్యా నమూనా'ను దేశానికి ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో, ఉత్తమ ఉపాధ్యాయులకు విదేశాలలో శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్‌లో ఇప్పటికే 37 మంది ఉపాధ్యాయులను సింగపూర్‌కు పంపిన ప్రభుత్వం, ఇటీవల మరో 29 మంది అగ్రశ్రేణి ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపే ఏర్పాట్లను ఖరారు చేసింది. ఈ బృందం ఆగస్టు 17 నుంచి 26 వరకు ఎనిమిది రోజుల పాటు పర్యటిస్తుంది.
ప్రపంచంలోనే అగ్రగామి విద్యాసంస్థ అయిన ఫిన్లాండ్లో 'అంతర్జాతీయ వృత్తిపర అభివృద్ధి కార్యక్రమం' కింద ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేయడమే ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం. ఉపాధ్యాయులు టుర్కు విశ్వవిద్యాలయంలో ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ కార్యక్రమం ద్వారా, ఉపాధ్యాయులు అంతర్జాతీయ విద్యా వ్యవస్థ వినూత్న బోధనపై ప్రత్యక్ష అనుభవాన్ని పొంది, రాష్ట్రంలో బోధన నాణ్యతను మరింత బలోపేతం చేస్తారు.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేసేందుకు రూపొందించారు. మొదటి దశ. నలుగురు ఫిన్నిష్ నిపుణులతో నాలుగు రోజుల ఓరియెంటేషన్ కార్యక్రమం ఇప్పటికే విజయవాడలో పూర్తయింది. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులకు ఫిన్నిష్ విద్యా వ్యవస్థ, బోధనా పద్ధతులపై ప్రాథమిక అవగాహనను అందించింది.
రెండవ దశ: ఆగస్టు 17 నుండి 26 వరకు ఫిన్లాండ్లోని టుర్కు, రౌమాలో ఎనిమిది రోజుల ప్రత్యక్ష శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో తరగతి గదుల పరిశీలన, పాఠశాలల సందర్శన, స్థానిక విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు ఉంటాయి. బాలల-కేంద్రీకృత అభ్యసనం, ఆనందకరమైన బోధనా పద్ధతులు, ఆట-ఆధారిత విద్య వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు.
మూడవ దశ: శిక్షణ తర్వాత, ఆన్లైన్ మార్గదర్శక సెషన్లు నిర్వహిస్తారు. టుర్కు విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు మన ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తారు. వారి పాఠశాలల్లో అమలు చేయాల్సిన ప్రాజెక్టుల విషయంలో వారికి సహాయం చేస్తారు.
ఫిన్లాండ్ పర్యటన నుండి తిరిగి వచ్చిన ఉపాధ్యాయులు మన రాష్ట్రంలోని పాఠశాల వాతావరణంలో ఫిన్నిష్ బోధనా పద్ధతులను అమలు చేయడానికి ఒక మార్గసూచిని రూపొందిస్తారు. వారు తమ జిల్లాల్లోని తోటి ఉపాధ్యాయులకు వనరుల వ్యక్తులుగా.. మార్గదర్శకులుగా సేవ చేస్తారు. వారు ఆటలతో సరదాగా నేర్చుకోవడానికి నమూనా తరగతి గదులను సృష్టిస్తారు. వారు నేర్చుకున్న విజయవంతమైన బోధనా పద్ధతులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పాఠశాలల్లోనూ ప్రచారం చేస్తారు.
ఈ కార్యక్రమం ఉపాధ్యాయులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, డిజిటల్ సాధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, అంతిమంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందించడం అనే ప్రభుత్వ ఆశయానికి ఈ కార్యక్రమం గణనీయంగా దోహదపడుతుంది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అలర్ట్...OPSపై కేంద్రం పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
Also Read: స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
