Back

ఖమ్మం: సెప్టెలిక్ ట్యాంకులతో ధర్నా
Dhamsalapuram, Telangana:
ఖమ్మం నగర కార్పోరేషన్ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో వారు సెప్టిక్ ట్యాంక్ వాహనాలతో కార్పోరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేసారు. వ్యర్థాలను డంప్ చేయడానికి ఖమ్మం చుట్టుప్రక్కల సుమారు 20 కిలో మీటర్ల మేర ఎక్కడ డంప్ చేయనివ్వడం లేదని వారు ఆవేధన వ్యక్తం చేసారు. వరదలు వచ్చిన తరువాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందన్నారు. తక్షణమే అధికారులు సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నారు.
1
Report
ఖమ్మంలో శిక్షణపూర్తి చేసుకున్న ఏఆర్, సివిల్ కానిస్టేబుల్స్ అభ్యర్థులు
Khammam, Telangana:
శిక్షణపూర్తి చేసుకున్న సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థుల అవుట్ పాసింగ్ ఖమ్మంలో జరిగింది. రామగుండం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 263 అభ్యర్థులు తొమ్మిది నెలల పాటు నగరంలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో అవుట్ పాసింగ్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి మల్టీజోన్_1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, సిపి సునీల్ దత్ తదితరులు హాజరయ్యారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
1
Report
ఖమ్మంలో ప్రత్యక్షమైన లేడీ ఆఘోరీ
Mahabubabad, Telangana:
ఖమ్మం జిల్లా మధిరలో లేడీ ఆఘోరీ ప్రత్యేక్షం అయింది. ఓ ప్రవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె చేరుకుని ప్రత్యేక పూజలు చేసింది. ఇదే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని హాజరైయ్యారు. ఈ క్రమంలో ఆఘోరీ కాళ్లు మొక్కిన నందిన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నేపాథ్యంలో స్థానికులు ఆఘోరీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
1
Report
ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్3 పరీక్ష
Mahabubabad, Telangana:
ఖమ్మం జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష ఉండగా మద్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్2 పరీక్ష కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలు ఉండగా 27,984 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. నిమిషం నిభందన అమల్లో ఉండడంతో పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు.
1
Report
Advertisement
రుణమాఫీ చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
Khammam, Telangana:
రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలని ఖమ్మం కలెక్టర్ వద్ద రైతు సంఘాలు ధర్నా చేసాయి. రుణమాఫీ కాకపోవడంతో రైతాంగం నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నట్లు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఒక క్లారిటీతో లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాగం హేమంతరావు, మౌలానా పాల్గొన్నారు.
1
Report