Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Yadadri Bhuvanagiri508115

సైదాపూర్ లో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన బీర్ల ఐలయ్య

Nov 17, 2024 10:54:15
Yadagirigutta, Telangana
యాదగిరిగుట్ట మండలంలోని సైదాపూర్ చెరువులో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆదివారం గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి జలాలను సైదాపూర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఐలయ్యను  శాలువాలతో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Dec 22, 2025 05:39:36
Hyderabad, Telangana:

Mahalakshmi Smart Card Telangana: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల' పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఇకపై ఆధార్ కార్డులు చూపించి, జీరో టికెట్లు తీసుకోవాల్సిన శ్రమ తప్పుతుంది.

స్మార్ట్ కార్డుల అవసరం ఏంటి?
ప్రస్తుతం మహిళలు ఆధార్ కార్డు చూపించి కండక్టర్ వద్ద నుండి జీరో టికెట్ పొందుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ కార్డుల్లో పాత ఫోటోలు ఉండటంతో కండక్టర్లకు ప్రయాణికులను గుర్తించడం కష్టమవుతోంది. గుర్తింపు విషయంలో మహిళలకు, కండక్టర్లకు మధ్య రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల గొడవలు జరుగుతున్నాయి. 

ప్రతి ఒక్కరికీ టికెట్ కొట్టడం వల్ల రద్దీ సమయంలో కండక్టర్లపై పనిభారం పెరుగుతోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతోంది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రయాణం మరింత స్మార్ట్..
త్వరలో అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ద్వారా మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తారు. బస్సు ఎక్కినప్పుడు ఈ కార్డును చూపితే సరిపోతుంది. కండక్టర్ వద్ద నుండి ప్రత్యేకంగా జీరో టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం కార్డు ట్యాప్ చేయడం లేదా చూపించడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.

ఆర్టీసీకి లాభాల పంట..కొత్త బస్సుల రాక!
ఆదివారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఆర్టీసీకి రూ. 255 కోట్ల లాభం చేకూరిందని వారు తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 2,800, వరంగల్‌కు 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే తీసుకురానున్నారు. అర్హులైన మహిళలందరికీ వీలైనంత త్వరగా ఈ స్మార్ట్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎలా పొందాలి?
ఈ కార్డుల పంపిణీ ప్రక్రియ, దరఖాస్తు విధానంపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాలు లేదా ఆన్‌లైన్ ద్వారా వీటిని పొందే అవకాశం కల్పించనున్నారు.

Also Read: Asia Cup U19 Final: ఆసియా కప్ ఫైనల్..టీమ్ఇండియాపై పాకిస్థాన్ భారీ విజయం..191 రన్స్ తేడాతో భారత్ పరాజయం!

Also REad: Nara Brahmani Cricket: క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న మంత్రి నారా లోకేష్ భార్య..బర్త్‌డే రోజు బ్యాట్ పట్టిన నారా బ్రాహ్మణి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Dec 22, 2025 04:31:13
Secunderabad, Telangana:

How to get an Ayushman Card online A step By Step Guide: అనారోగ్య సమస్యలు చెప్పిరావు. ఎవరి జీవితంలోనైనా ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే అనివార్య పరిస్ధితి. అయితే నేటి కాలంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఆసుపత్రులకు వెళ్లాలంలే చేతిలో లక్షలు పట్టుకోని వెళ్లాల్సింది. దీంతో చాలా మంది పేద, మధ్య తరగతి కుటుంబాలు సరైన వైద్యం పొందలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలకు ఆర్థిక భారం లేకుండా మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేశ్యంతోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత కీలకమైన పథకం.. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ స్కీమ్ కింద భారతీయ పౌరులకు ఉచిత వైద్య చికిత్స అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఆయుష్మాన్ కార్డు జారీ:

ఈ స్కీమ్ కింద అర్హులైన వారికి ఆయుష్మాన్ భారత్ కార్డును జారీ చేస్తారు. ఈ కార్డు ఉన్నవారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏడాదికి రూ. 5లక్షల వరకు ఫ్రీగా చికిత్స పొందవచ్చు. అంటే ఆసుపత్రిలో అడ్మిషన్ నుంచి చికిత్స పూర్తయి డిశ్చార్జీ అయ్యేంత వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. వైద్య ఖర్చుల భారం నుంచి కుటుంబాలను విముక్తి చేయడమే ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం.

మీరు, మీ కుటుంబ సభ్యులు లేదా మీకు తెలిసిన వాళ్లు ఈ ఫ్రీ వైద్య సదుపాయాలను పొందాలంటే ముందుగా ఆయుష్మాన్ భారత్ కార్డును కలిగి ఉండాలి. అయితే చాలా మందికి ఈ కార్డును ఎలా పొందాలి? ఎవరు అర్హులు? దరఖాస్తు ప్రక్రియ ఏంటి? ఇలాంటి అనేకు విషయాల్లో వారికి స్ఫష్టమైన సమాచారం తెలియన అయోమయంలో ఉంటారు. కానీ నిజానికి ఈ కార్డును పొందడం చాలా సులభం. ఎలాగో చూద్దాం.

అసలు ఆయుష్మాన్ కార్డ్ అంటే ఏమిటి?

ఆయుష్మాన్ కార్డును ఆయుష్మాన్ భారత్ కార్డు లేదా ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కార్డు అని పిలుస్తుంటారు. ఇది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఒక జాతీయ ఆరోగ్య బీమా పథకం. ఆర్థికంగా బలహీనమైన, పేద వర్గాలకు చెందిన కుటుంబాలకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా కవరేజీని ఈ కార్డు అందిస్తుంది. తీవ్రమైన వ్యాధులు, శస్త్రచికిత్సలు, ఆసుపత్రి ఖర్చులు వంటి వాటిని ఈ పథకం కవర్ చేస్తుంది.

ఈ కార్డు ప్రత్యేకత ఏమిటంటే, లబ్ధిదారుడు చికిత్స సమయంలో నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా క్యాష్‌లెస్ విధానంలో వైద్యం పొందవచ్చు. ప్రభుత్వంతో పాటు అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ పథకం కింద చికిత్స అందిస్తున్నాయి. పేదరికం కారణంగా ఎవరూ ప్రాణాలను కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు.

Also Read: Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలు కలిగిన వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంది.

-దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు లేదా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారు

-2011 జనాభా లెక్కల (SECC డేటా)లో పేరు ఉన్న కుటుంబ సభ్యులు

-రోజువారీ కూలీ కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసే వారు

-షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)కు చెందిన కుటుంబాలు

-కుటుంబంలో వికలాంగులు ఉన్నట్లయితే వారికి అదనపు ప్రాధాన్యత

ఈ అర్హతల ఆధారంగా ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తుంది. ఆ జాబితాలో మీ పేరు ఉంటే, మీరు ఆయుష్మాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉన్నట్టే.

ఎలా దరఖాస్తు చేయాలి?

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆయుష్మాన్ కార్డు కోసం ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేక కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం లేదు.

-మొదటగా మీ స్మార్ట్ ఫోన్‌లో ఆయుష్మాన్ యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

-యాప్ ఓపెన్ చేసి లాగిన్ విభాగంలో ‘లబ్ధిదారుడు’ ఎంపికను సెలెక్ట్ చేయాలి.

-మీ మొబైల్ నంబర్ నమోదు చేసి క్యాప్చా పూరించాలి.

-తర్వాత ఈ స్కీము లిస్టులో ‘PMJAY’ని ఎంపిక చేసి, మీ రాష్ట్రం పేరు, జిల్లా పేరు వంటి పూర్తి వివరాలు ఇవ్వాలి.

-అనంతరం ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ కావాలి.

- మీ కుటుంబ సభ్యుల వివరాలు, అర్హత కు సంబంధించి కాలమ్ కనిపిస్తుంది.

-ఈ స్కీముకు మీరు అర్హులైతే ‘దరఖాస్తు’ బటన్‌పై క్లిక్ చేసి అక్కడున్న ఫారమ్ ను నింపాలి.

-అవసరమైన వివరాలు సరిగ్గా పూరించి ఫారమ్ సమర్పించిన తర్వాత, కొన్ని రోజుల్లో ఆయుష్మాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also Read:  Mudra Loan: ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

అవసరమైన పత్రాలు:

-ఆధార్ కార్డు

-ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్

-రేషన్ కార్డు లేదా SECC డేటా వివరాలు

-కుటుంబ సభ్యుల సమాచారం

-పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

కొన్ని రాష్ట్రాల్లో అదనపు గుర్తింపు పత్రాలు అడిగే అవకాశం కూడా ఉంటుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, ఆయుష్మాన్ కార్డు పొందడం ఈజీగా ఉంటుంది.

పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి:

-ఆధార్ కార్డు, రికార్డులో పేరు లేదా తండ్రి పేరు స్పెల్లింగ్‌లో తేడా ఉండకూడదు.

-తేదీ, నెల లేదా సంవత్సరంలో చిన్న లోపం కూడా ఉండకూడదు.

-లింగ అసమతుల్యత విషయంలో.

-మీ ప్రస్తుత చిరునామాకు, రికార్డులో ఉన్న చిరునామాకు మధ్య వ్యత్యాసం ఉండరాదు.

-NHA డేటా, ఆధార్ డేటా ప్రతి స్థాయిలో స్థిరంగా ఉండాలి.

ఈ విధంగా.. ఆయుష్మాన్ భారత్ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఒక పెద్ద వరంగా మారింది. ఆరోగ్యం కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వమే భరోసాగా నిలిచే ఈ పథకం నిజంగా కోట్లాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 22, 2025 03:37:38
Secunderabad, Telangana:

Pakistan Army Chief Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆపరేషన్ సింధూర్ పై మరోసారి వివాదాస్పద వ్యాక్యలు చేశారు. ఈసారి తాను చేసిన వ్యాఖ్యల్లో మతపరమైన ప్రస్తావనలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అల్లా సహాయం చేశాడంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించేందుకు సహాయం చేసింది.. చైనా ఆయుధాలు కావని.. అల్లాపై ఉన్న విశ్వాసమే తమకు బలం ఇచ్చిందని అసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు. భారత్ కు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ లో మాకు సహాయం చేసింది ఆయుధాలు కాదు.. అల్లా. అల్లాపై ఉన్న నమ్మకంతోనే దేవదూతలు కూడా పాకిస్తాన్ సైన్యానికి సహకరించారని పేర్కొన్నారు. బన్యన్ -ఎ-మర్సూస్ పేరుతో మునీర్ ఈ ఆపరేషన్ను ప్రస్తావించారు.

ఈ నెల ప్రారంభంలో జరిగిన జాతీయ ఉలామా, మషాయిక్ సమావేశంలో అసిమ్ మునీర్ ఈ కామెంట్స్ చేశారు. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తోపాటు పెద్ద సంఖ్యలో ఇస్లామిక్ మత పెద్దలు, పండితులు హాజరు అయ్యారు. ఆ సమావేశంలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ప్రస్తుతం అసిమ్ మునీర్ లిబియా పర్యటనలో ఉన్నారు.

వైరల్ అవుతున్న ఈ 40 సెకన్ల వీడియోలో అసిమ్ మునీర్ తన కామెంట్స్ మరింత రెచ్చగొట్టేలా చేశారు. మార్సూస్ యుద్ధంలో అల్లా సహాయం చేశాడని నా దేవుడు సాక్షి. ఆ సహాయాన్ని మేము స్వయంగా చూసి..అనుభవించాము అని అన్నారు. అదే సమయంలో దేశాన్ని సరైన దిశలో నడిపించాల్సిన అవసరం ఉందని, ప్రజల మార్గాలను సంస్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రసంగం మధ్యలో అరబిక్ భాషలో కొన్ని మతపరమైన శ్లోకాలను కూడా ఆయన పఠించారు.

Also Read: China Gold Reserve: రెండో అతిపెద్ద ఆవిష్కరణ.. ఆసియాలో భారీగా బంగారు సంపదను కనుగొన్న చైనా.. ఎక్కడంటే..?

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. భారత సాయుధ దళాలు 2025 మే 6న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పలు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సేనలు దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక శిబిరాలు ధ్వంసమయ్యాయి.

2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో పాకిస్తాన్ మద్దతుతో పనిచేసే ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతంలోకి చొరబడి, ప్రజలను వారి మతం గురించి ప్రశ్నించి, అనంతరం కాల్చి చంపారు. ఈ అమానుష ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి ప్రతీకారంగా, ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది.

Also Read:  Business Ideas: మోదీ సర్కారే కాదు..రేవంత్ సర్కార్ కూడా డబ్బు సంపాదించే ఐడియా చెబుతోంది.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ కోర్సు నేర్చుకుంటే చాలు నెలకు రూ. లక్ష పక్కా..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Dec 21, 2025 13:15:47
Hyderabad, Telangana:

IND vs PAK Asia Cup U19 Final: అండర్-19 ఆసియా కప్‌ 2025 టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు, ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేశారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన తుది పోరులో అన్ని రంగాల్లో విఫలమై 191 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూశారు. ఫలితంగా ఆసియా కప్ పాక్ వశమైంది.

టీమ్ ఇండియా బ్యాటింగ్ వైఫల్యం
పాక్ విధించిన 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా ఆడలేకపోయారు. టీమ్ ఇండియా కేవలం 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఆశ్చర్యకరంగా పదో స్థానంలో వచ్చిన దీపేశ్‌ దేవేంద్రన్ (36) జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

టాప్ ఆర్డర్ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ (26 రన్స్), ఖిలాన్ పటేల్ (19 రన్స్) మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లందరూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఒక దశలో భారత్ 120 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం అంచున నిలవగా, దీపేశ్ పోరాటంతో స్కోరు 150 మార్కును దాటింది. పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లతో విరుచుకుపడగా.. సయామ్, సుభాన్, హుజైఫా రెండేసి వికెట్లు పడగొట్టారు.

'సమీర్' సెంచరీ కారణం
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 113 బంతుల్లోనే 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 172 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు అహ్మద్ హుస్సేన్ (56) అర్ధ సెంచరీతో రాణించగా, ఉస్మాన్ ఖాన్ (35) కీలక పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్ 3 వికెట్లు తీయగా, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు.

Also REad: Nara Brahmani Cricket: క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న మంత్రి నారా లోకేష్ భార్య..బర్త్‌డే రోజు బ్యాట్ పట్టిన నారా బ్రాహ్మణి!

Also REad: Emmanuel Remuneration: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్..15 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 21, 2025 12:46:41
Hyderabad, Telangana:

Shani Dev Vakri 2026 In Meena Rashi: 2026 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని అత్యంత శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయడమే కాకుండా.. నక్షత్ర ప్రవేశం, తిరోగమనలు జరపబోతున్నాయి.  ఈ సమయంలోనే శని మార్పు కూడా ఉండబోతోంది. దీంతో 2026 సంవత్సరం మరింత ప్రత్యేక ప్రాముఖ్యతను అంతరించుకోబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని గ్రహాన్ని కర్మలకు ఫలాలు అందించే గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. శని కదలికలు అనేవి కొన్ని రాశుల వారికి శుభప్రదంగాను.. మరి కొన్ని రాశుల వారికి అశుభ్రంగాను ఉంటుంది. ఇవి వ్యక్తులు చేసే కర్మలను బట్టి కూడా మారుతుంది. జులై 26వ తేదీన శనిగ్రహం మళ్లీ వక్రస్థితిలోకి వెళ్ళబోతున్నాడు. దీనికి కారణంగా ఈ ఏడాది కొన్ని రాశుల వారికి చాలా కలిసి రాబోతోంది. శని గ్రహం ఆశీస్సులతో కొన్ని రాశులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా చాలావరకు మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, 2026 సంవత్సరంలో శని అనుగ్రహంతో అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులేవో తెలుసుకోండి.

మకర రాశి 
మకర రాశికి ఎల్లప్పుడూ శని అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి 2026 సంవత్సరంలో శని కదలికల కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఏదైనా పనుల్లో ఎక్కువ కాలం వస్తున్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగి ఊహించని స్థాయిలో లాభాలు కలుగుతాయి. తోబుట్టులతో సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చాలా లాభదాయకంగా మారుతాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు అన్ని పనుల్లో ఓపికతో ముందుకు సాగడం వల్ల అఖండ విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

వృషభరాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శని కదలికల కారణంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం మొత్తం కొత్త ఆదాయ మార్గాలు లభిస్తూ ఉంటాయి. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న అనేక సమస్యల నుంచి కాస్త పరిష్కారం కూడా లభించబోతోంది. కెరీర్ కూడా స్థిరత్వంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి సీనియర్ల నుంచి మంచి సపోర్టు లభించి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది. దీని కారణంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు కూడా చాలావరకు లాభసాటిగా మారుతాయి.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శని ప్రభావంతో క్రమశిక్షణ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎప్పుడు పొందలేని విజయాలు సొంతం చేసుకుంటారు. అలాగే కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మానసికంగా కూడా చాలా వరకు మెరుగుపడతారు. నమ్మకంతో ముందుకు సాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కుటుంబ జీవితంలో కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.

NOTE: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యుల నుంచి సేకరించింది. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధృవీకరించదు.. 

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Dec 21, 2025 06:12:13
Hyderabad, Telangana:

Banana For Pregnant Women: అరటిపండు.. అన్ని కాలాల్లో, అతి తక్కువ ధరలో, సులభంగా లభించే ఒక అద్భుతమైన పోషకాహారం. చాలా మంది దీనిని సాధారణ పండుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, సాధారణ ఆరోగ్యానికి అరటిపండు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

గర్భిణీ స్త్రీలకు, శిశువుకు కలిగే లాభాలు
గర్భధారణ సమయంలో సరైన పోషకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అరటిపండు తల్లికి, బిడ్డకు ఎలా సహాయపడుతుందంటే.. గర్భిణీలలో తరచుగా కనిపించే నీరసం, అలసటను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులోని ఫోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లు శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధికి తోడ్పడతాయి. గర్భధారణ సమయంలో మహిళల్లో వచ్చే మలబద్ధకం సమస్యను ఇందులోని ఫైబర్ నివారిస్తుంది.

ప్రయోజనం,ఎలా పనిచేస్తుంది?
తక్షణ శక్తి,ఇందులోని సహజ చక్కెరలు, ఫైబర్ రోజంతా మీకు కావాల్సిన శక్తిని ఇస్తాయి.
మానసిక ఉల్లాసం.. "ఇందులోని ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఒత్తిడిని తగ్గించి, మూడ్‌ని మెరుగుపరుస్తుంది."
రక్తహీనత నివారణ.."ఇనుము (Iron) పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ఎనీమియా నుండి రక్షిస్తుంది."
రోగనిరోధక శక్తి.. "విటమిన్ బి6, విటమిన్ సి వల్ల జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు."
చర్మం, జుట్టు.. "యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజ మెరుపును ఇచ్చి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి."

సూచన:
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అయినప్పటికీ, గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్నవారు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు తమ వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Nidhhi Agerwal In Bigg Boss: లూలూ మాల్ ఘటన తర్వాత తొలిసారి బయటకొచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్! ఎలా మారిపోయిందంటే?

Also Read: Nidhhi Agerwal In Bigg Boss: లూలూ మాల్ ఘటన తర్వాత తొలిసారి బయటకొచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్! ఎలా మారిపోయిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Dec 21, 2025 05:26:19
0
comment0
Report
HDHarish Darla
Dec 20, 2025 14:00:25
Hyderabad, Telangana:

Nidhhi Agerwal Lulu Mall: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, శనివారం నాటి ఎపిసోడ్ గెస్టుల రాకతో మరింత కలర్‌ఫుల్‌గా మారింది. ముఖ్యంగా 'రాజాసాబ్' హీరోయిన్ నిధి అగర్వాల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5 సభ్యులతో చేసిన హంగామా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇటీవలే హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో జరిగిన ప్రమోషన్లలో నిధి అగర్వాల్‌కు అభిమానుల వల్ల చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. జనం ఒక్కసారిగా మీద పడటంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. అయితే, బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన నిధి, అక్కడ టాప్ 5 కంటెస్టెంట్లతో కలిసి చాలా సరదాగా గడిపారు. బయట జరిగిన సంఘటన మర్చిపోయేలా హౌస్ మేట్స్ ఆమెను ఎంటర్టైన్ చేశారు.

నిధి అగర్వాల్ రాగానే ఇమ్మాన్యుయేల్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. "పాపలకే పాప.. నిధి పాప" అంటూ ఇమ్మాన్యుయేల్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. గోల్స్ ఆ.. గర్ల్స్ ఆ?: టైటిల్ గెలిస్తే ఏం చేస్తావని పవన్‌ను నిధి అడగ్గా.. "నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి" అని అతను సమాధానమిచ్చాడు. దానికి నిధి చిలిపిగా "గోల్స్ ఆ.. లేక గర్ల్స్ ఆ?" అని కౌంటర్ వేయడంతో అంతా నవ్వుల్లో మునిగిపోయారు.

ఇమ్మాన్యుయేల్ రొమాంటిక్ పంచ్
నిధి అగర్వాల్ హౌస్ మేట్స్ కోసం ఒక ఫన్నీ గేమ్ ప్లాన్ చేసింది. కళ్లకు గంతలు కట్టుకుని ఆడే ఈ గేమ్‌లో ఇమ్మాన్యుయేల్ మళ్ళీ తన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. "గేమ్ ఆడేటప్పుడు పొరపాటున మిమ్మల్ని టచ్ చేస్తే ఏమీ అనుకోవద్దు కదా" అంటూ నిధిని రొమాంటిక్‌గా అడగడం ఆ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.

ఫినాలే దిశగా టాప్ 5
ప్రస్తుతం హౌస్‌లో ఇమ్మాన్యుయేల్, సంజన, డిమాన్ పవన్, కళ్యాణ్, తనూజ టాప్ 5 రేసులో ఉన్నారు. నిధి అగర్వాల్ వీరిలో ఎనర్జీ నింపడమే కాకుండా, ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు. మరి ఈ ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి!

Also Read: Srisailam Sparsha Darshan: శ్రీశైల మల్లన్న భక్తులకు తీపికబురు! 'స్పర్శ దర్శనం' వేళలు పెంపు..పూర్తి వివరాలివే!

Also REad: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్..ఇది ఆలస్యమైతే రూ. 3.8 లక్షల వరకు నష్టం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 20, 2025 13:01:36
Hyderabad, Telangana:

8th Pay Commission Delay HRA Loss: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలులో జాప్యం జరిగితే, వారు భారీగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని తాజా విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం, రూపంలో ఈ నష్టం లక్షల్లో ఉండే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

అసలు సమస్య ఏమిటి?
సాధారణంగా కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు, ప్రభుత్వం పెరిగిన జీతాన్ని, కరువు భత్యాన్ని (DA) వెనుకటి తేదీ నుండి లెక్కగట్టి 'బకాయిల' రూపంలో చెల్లిస్తుంది. కానీ, HRA హౌస్ రెంట్ అలవెన్స్ విషయంలో ఈ వెసులుబాటు ఉండదు. అంటే, కొత్త వేతన సంఘం అమలు చేసే వరకు పాత రేట్ల ప్రకారమే HRA అందుతుంది. అమలు తర్వాతే కొత్త రేట్లు వర్తిస్తాయి తప్ప, గడిచిన కాలానికి బకాయిలు ఇవ్వరు.

కీలకమైన గడువు తేదీలు
7వ వేతన సంఘం కాలపరిమితి 2025 డిసెంబర్ 31న ముగియనుంది. 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి ప్రారంభం కానునట్లు అంచనా వేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా.. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 18 నుండి 24 నెలల సమయం పట్టవచ్చు.

నష్టం ఎలా ఉంటుంది?
ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం సుమారు రూ.76,500 ఉంటుంది అనుకుందాం. 8వ వేతన సంఘం అమలులో రెండేళ్లు (24 నెలలు) ఆలస్యం జరిగితే.. సవరించిన వేతనంపై పెరిగే HRA ప్రయోజనాన్ని ఆ రెండేళ్ల కాలానికి బకాయిల రూపంలో పొందలేరు. దీనివల్ల మెట్రో నగరాల్లో పనిచేసే ఉద్యోగులు గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. తక్కువ వేతన శ్రేణిలో ఉన్న వారు కూడా కొన్ని లక్షల రూపాయల మేర ప్రయోజనాన్ని కోల్పోతారు.

గమనించాల్సిన అంశాలు
ప్రస్తుతానికి 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

Also Read: KCR in Hyderabad: కేసీఆర్ ఇప్పుడెలా ఉన్నారో తెలుసా? చాలా కాలం తర్వాత హైదరాబాద్ చేరుకున్న గులాబీ బాస్!

Also Read; iPhone 15 Offer Price: ఐఫోన్ 15 కేవలం రూ.11,050లకే! ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్..ఎలా పొందాలో తెలుసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top