ఖమ్మంలో శిక్షణపూర్తి చేసుకున్న ఏఆర్, సివిల్ కానిస్టేబుల్స్ అభ్యర్థులు
Khammam, Telangana:శిక్షణపూర్తి చేసుకున్న సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థుల అవుట్ పాసింగ్ ఖమ్మంలో జరిగింది. రామగుండం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 263 అభ్యర్థులు తొమ్మిది నెలల పాటు నగరంలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో అవుట్ పాసింగ్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి మల్టీజోన్_1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, సిపి సునీల్ దత్ తదితరులు హాజరయ్యారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
KTR Speech: చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు.. ప్రజలే బుద్ధి చెబుతారు: కేటీఆర్
Ibrahimpatnam, Telangana:Ibrahimpatnam Politics: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. రేవంత్ అహంకారానికి ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని జోష్యం చెప్పారు. ఇంకో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ మళ్లీ తిరిగి అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతా అంటున్నాడు. ఏఐ ఫోటోలతో ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్నారు. ఫోర్త్ సిటీ ఒక పెద్ద డ్రామా. తన కుటుంబసభ్యులకు భూములు కట్టబెట్టేందుకు కుట్ర. నిషేధిత భూముల జాబితాతో బ్లాక్మెయిల్ రాజకీయాలు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
ఇబ్రహీంపట్నంలో గెలిచిన నూతన బీఆర్ఎస్ సర్పంచ్‌లు, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను శనివారం సన్మానించారు. విజేతలను సన్మానించిన అనంతరం అభినందించి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అన్యాయాల ఫలితంగా మల్లో 50 సంవత్సరాల దాకా తిరిగి అధికారంలోకి రాదు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతాను ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఏఐ చిత్రాలతో గ్రాఫిక్స్‌తో ఫ్యూచర్ సిటీ అని కొత్త కుట్రకి రేవంత్ రెడ్డి తెరలేపాడు. ఫ్యూచర్ సిటీ పూర్తిగా తన కుటుంబసభ్యులు, అనుచరుల భూమి కుంభకోణాల కోసమే' అని ఆరోపించారు.
Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్‌తో జీవన్ రెడ్డి
అన్ని వర్గాలను మోసం చేస్తూ.. తన కుటుంబసభ్యులు, అనుచరుల కోసం పేదవాళ్ల భూములను అరాచకంగా గుంజుకుంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయి. రేవంత్ రెడ్డి పదవి దిగిపోయిన తర్వాత కనీసం పలకరించే నాథుడు కూడా ఉండడు' అని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు.
Also Read: IPL 2026 LSG vs KKR: ఓటమి నుంచి లక్నో విజయం.. బౌలర్ల వైఫల్యంతో కలకత్తా హ్యాట్రిక్ ఓటమి
'మున్సిపల్ ఎన్నికల అనంతరం దాదాపు 2 నెలల పాటు అన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరిందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంచి నాయకత్వం, మొండితనం ఉన్న నాయకత్వం ఉంటే కచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ఈ ఎన్నికల్లో సాధించిన విజయం నిరూపించిందని పేర్కొన్నారు.
'ఫార్మా సిటీ పేరుతో రేవంత్ రెడ్డి భూముల దందా చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల ఫార్మా సిటీ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకొని.. ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మోసం చేస్తున్నాడు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఒకవైపు కోర్టులో ఫార్మా సిటీ ఉందని చెబుతూ బయటకు వచ్చి అవే భూముల్లో ఫోర్త్ సిటీ కడతామని రేవంత్ రెడ్డి చెప్పి మోసానికి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'భూమిని రైతుల నుంచి గుంజుకొని ఫోర్త్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని కడతానని నాటకాలు ఆడుతున్నారు. భూములు పొందడం కోసమే ఈ ఫ్యూచర్ సిటీ డ్రామాను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఉన్న సిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదు. ఉన్న సిటీలో దోమలు కుట్టి జనం చనిపోతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు, అలాంటిది ఫ్యూచర్ సిటీ కడతానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఫ్యూచరే లేని నాయకుడు మళ్లీ ఫ్యూచర్ సిటీ కడతా అంటే ప్రజలు నవ్వుతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KCR Jeevan Reddy Meeting: మరోసారి కలవనున్న జీవన్ రెడ్డి, కేసీఆర్.. త్వరలోనే పబ్లిక్ మీటింగ్!
Hyderabad, Telangana:KCR Jeevan Reddy Public Meeting: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, జీవన్ రెడ్డి కలయిక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ పబ్లిక్ మీటింగ్‌లో కలవనున్నారట.Chhattisgarh: మైనర్లు స్వచ్ఛందంగా వెళ్తే అది కిడ్నాప్ కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు!
Hyderabad, Telangana:Chhattisgarh HC Verdict Latest News: ప్రేమ వ్యవహారాల్లో మైనర్ బాలికలు తమకు తాముగా.. స్వచ్ఛందంగా ఎవరితోనైనా వెళ్ళిపోయినప్పుడు వారిపై కిడ్నాప్ లేదా పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేయడం చెల్లదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కి అగర్వాల్, జస్టిస్ రాధాకృష్ణన్ అగర్వాల్ లతో కూడిన ధర్మాసనం నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను కొట్టివేసింది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2022 సంవత్సరంలో చతిస్గఢ్కు చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక.. 24 ఏళ్ల యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది.. వీరిద్దరూ సుమారు నెల రోజులపాటు విజయవాడ తో పాటు హైదరాబాదు నగరాల్లో కలిసి నివసించారు. బాలిక కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి రంగంలోకి దిగి.. మైనర్ బాలికతో పాటు 24 ఏళ్ల యువకుడిని గుర్తించి.. యువకుడిపై కిడ్నాప్ కేస్ తో పాటు పోక్సో చట్టం, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఈ కేసును విచారించిన స్థానిక ట్రయల్ కోర్టు హిందీతుడిని దోషిగా నిర్ధారిస్తూ దాదాపు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది..
ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.. ఈ సందర్భంగా హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావిస్తూ జడ్జిమెంట్ అందించింది. బాలిక తన వాంగ్మూలంలో నిందితుడు తనను బలవంతంగా తీసుకెళ్లలేదని.. ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లానని స్పష్టం చేసింది.. నెల రోజుల పాటు బహిరంగ ప్రదేశాలతో పాటు.. రద్దీగా ఉండే నగరాల్లో తిరిగినప్పుడు ఎక్కడ ఆమె ప్రతిఘటించలేదని కోర్టు గుర్తించింది. నిందితుడు ఎటువంటి హింసకు కూడా పాల్పడలేదని.. బాలిక స్వచ్ఛందంగానే అతనితో కలిసి జీవించిందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఒక మైనర్ బాలిక తన ఇష్టంతో.. ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు.. అది కిడ్నాప్ కిందికి రాదని.. చట్టం ప్రకారం మైనర్ల రక్షణ ముఖ్యమే అయినప్పటికీ.. వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి అని ధర్మాసనం పేర్కొంది. బాధితురాలు స్వయంగా నిందితుడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పడంతో.. అతనిపై మోపిన సెక్షన్లు చెల్లవని తీర్పునిస్తూ నిందితుడిని తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.. ఈ తీర్పు ప్రస్తుతం న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lemon Prices: అమ్మో నిమ్మకాయ! ధర చూస్తే గుండె గుభేల్.. చుక్కలు చూపిస్తున్న పులుపు!
Hyderabad, Telangana:Lemon Prices Hike Latest News: వేసవి సూర్యుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్నాడు.. ఎండలు ముదురుతుండడంతో అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు.. దాహం తీర్చుకునే పానీయాల వరకు దేనికైనా నిమ్మకాయ ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం నిమ్మకాయల ధరలు చూస్తుంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంతో తక్కువ ధరల్లో లభించే నిమ్మకాయలు.. ఇప్పుడు వాటి ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కేవలం మూడు వారాల వ్యవధిలోనే ధరలు ఆకాశాన్ని తాకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఇప్పుడు మార్కెట్లో కేజీ నిమ్మకాయ ఎంత ధరల్లో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి మాసంలో నిమ్మకాయ ధరలు కేజీ రూ.10 మాత్రమే ఉండేవి.. ఫిబ్రవరి చివరి వారంలో రూ.30 పలికిన ధరలు.. ఇప్పుడు మార్కెట్లో ఏకంగా రూ.135 వరకు పలుకుతోంది. అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగింది. రిటైల్ మార్కెట్లో ఒక్కొక్క నిమ్మకాయ ధర దాదాపు 8 నుంచి 10 రూపాయల మధ్యలో ఉంది. అయితే ఒక్కసారిగా నిమ్మకాయలు ఇంత ధరలకు అమ్మడంతో సామాన్యులు కొనాలంటేనే జంకుతున్నారు.. అలాగే కొన్ని చోట్ల అయితే ఒక్కొక్క నిమ్మకాయను 15 రూపాయలకు పైగా విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ధరలు పెరిగిన రైతుల్లో మాత్రం సంతోషం కనిపించడం లేదు.. వాతావరణ మార్పుల కారణంగా నిమ్మ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎకరాకు సగటున 40 నుంచి 50 బస్తాలు వస్తూ ఉండేవట.. కానీ వాతావరణ మార్పుల కారణంగా 15 బస్తాలు రావడం కూడా గగనమైందని కొంతమంది రైతులు చెబుతూ ఉన్నారు. చీడపీడల నివారణకు మందులు కొట్టడం.. సాగు ఖర్చులు పెరగడం వల్ల వచ్చే ఆదాయం వీటికి సరిపోవడం లేదని వాపోతున్నారు..
అకాల వర్షాలతో పాటు పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పూత రాలిపోవడం దిగుబడిని తగ్గించడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వేసవిలో శరీరానికి చలువచేసే నిమ్మరసం తాగాలనుకుంటున్న వారికి పెద్ద షాకే అని చెప్పొచ్చు. హోటళ్లతోపాటు జ్యూస్ సెంటర్లలో యజమానులు కూడా ధరలు పెరగడం వల్ల నష్టపోతున్నామని.. కస్టమర్ల వద్ద ఆనందంగా వసూలు చేయలేకపోతున్నామని ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్మకాయ ధరలు ఇలాగే పెరిగితే వేసవిలో నిమ్మరసం తాగడం సామాన్యుడికి కలగానే మిగిలిపోయేలా ఉంది.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Solar Eclipse 2027: ఆగస్టులో సుదీర్ఘ సూర్యగ్రహణం..పగటిపూట సూర్యుడ్ని మింగేసే చంద్రుడు.. చీకటి పడే రోజు అతిదగ్గర్లోనే!
Hyderabad, Telangana:Solar Eclipse 2027 Time: ఖగోళ సంఘటనల పరంగా 2026 సంవత్సరానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పరిగణిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం సంభవించాయి. ఇక ఇదే ఏడాది మరో రెండు గ్రహణాలు ఉన్నాయి. అయితే 2027లో సంభవించే సూర్యగ్రహణం సుదీర్ఘకాలం పాటు కొనసాగడం వల్ల గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిని 'శతాబ్దపు గ్రహణం' అని పిలుస్తున్నారు. అందువల్ల 2027లో సంభవించే సూర్యగ్రహణం గురించి ప్రజలలో మరికొంత ఆందోళన, ఇంకొంత ఆసక్తి నెలకొంది.
2026 సూర్య-చంద్ర గ్రహణం ఎప్పుడు?
2026వ సంవత్సరపు ప్రధాన సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం సుదీర్ఘంగా ఉన్నా.. ఇది భారతదేశంలో నేరుగా కనిపించదు. అలాగే ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఆగస్టు 27, 28 తేదీల రాత్రి సంభవిస్తుంది.
గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఈ సూర్యగ్రహణం ప్రధానంగా గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, ఆర్కిటిక్ ప్రాంతం, యూరప్‌లోని కొన్ని భాగాలలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి అక్కడ దీని ప్రభావం పరిమితంగా ఉంటుందని అంచనా. చంద్రగ్రహణం మాదిరిగా ఉత్తర, దక్షిణ అమెరికా.. యూరప్, ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతాలైన తూర్పు పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలలో కనిపిస్తుంది.
భారత్‌లో సూతక కాలం ఉంటుందా?
ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన ప్రజలు సూతకాలం వర్తించదు, అలా సూతకం పాటించాల్సిన అవసరమే లేదు. అంటే ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ దైనందిన కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఆచారాలు నిర్వహించుకోవడంతో పాటు శుభకార్యాలు చేసుకోవచ్చు.
2027 సూర్యగ్రహణం ఎందుకు ప్రత్యేకమైనది?
ఇక 2027 విషయానికి వస్తే.. ఆగస్టు 2, 2027న సంభవించే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. దీని మొత్తం వ్యవధి సుమారు 6 నిమిషాల 23 సెకన్ల పాటు ఉండవచ్చని అంచనా. దీంతో ఇది సుదీర్ఘ కాలం పాటు నడిచే సూర్యగ్రహణంగా పరిగణిస్తారు. ఈ గ్రహణం సమయంలో చాలా ప్రదేశాలలో పగటిపూట చీకటిగా ఉండవచ్చు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకున్నప్పుడు ఇది జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఆకాశమంతటా సూర్యాస్తమయం లాంటి ఒక ప్రత్యేకమైన దృశ్యం ఏర్పడుతుంది.
భారతదేశంలో ఈ 2027లో ఏర్పడనున్న గ్రహణం పూర్తిగా కాకుండా పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. అంటే సూర్యునిలోని కొంత భాగం అస్పష్టంగా కనబడుతుందట. దీనివల్ల ఇది ఒక ప్రత్యేకమైన దృశ్యంగా ఉంటుంది, కానీ పూర్తిగా చీకటిగా ఉండదు.
అయితే ఇంతటి సుదీర్ఘ కాలం పాటు కొనసాగే సంపూర్ణ సూర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుందట. శాస్త్రవేత్తల ప్రకారం.. ఇంతటి అరుదైన సంఘటన ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పడుతుందట. అందుకే దీనిని శతాబ్దపు గ్రహణం అని పిలుస్తారట. 2027లో సంభవించనున్న ఈ సుదీర్ఘ సూర్యగ్రహణం సమయంలో ఒక ఆసక్తికరమైన ఖగోళ అద్భుతం ఏర్పడనుందట. ఆ సమయంలో చంద్రుడు భూమికి ఎంతో దగ్గరకు ఉంటాడట. అయితే సూర్యుడు సాపేక్షంగా దూరం కారణంగా.. చంద్రుడు ఆకాశంలో పెద్దగా కనిపించి.. సూర్యుడిని పూర్తిగా కప్పివేసే విధంగా కనిపిస్తాడట. దీని ఫలితంగా భూమధ్యరేఖకు చాలా దూరంలో నీడలా ఏర్పడుతుందట. దీని వల్ల పగటి పూట దాదాపుగా 6 నిమిషాల పాటు చీకటి అలుముకుంటుందట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Poco M8s Launch: త్వరలోనే Poco M8s విడుదల.. 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో అదుర్స్!
Hyderabad, Telangana:Poco M8s Hit Indian Market: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో తమ వినియోగదారులకు మరో అద్భుతమైన శుభవార్త అందించబోతోంది. మార్కెట్లో ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్న M సిరీస్‌లో భాగంగా సరికొత్త మోడల్ పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఇది Poco M8s మోడల్ పేరుతో అందుబాటులోకి. ముఖ్యంగా ఈ మొబైల్‌కు సంబంధించిన కొన్ని వివరాలు థాయ్‌లాండ్‌కు చెందిన నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ (NBTC) డేటాబేస్‌లో కనిపించినట్లు సమాచారం. దీంతో ఈ ఫోన్ త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు స్పష్టమైంది. అయితే, దీనిని కంపెనీ మొదట భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలుస్తోంది.
NBTC వెబ్సైట్ సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 26067PC09G అని మోడల్ నెంబర్‌తో లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ అయినా మార్కెట్లో వచ్చేముందు ఇటువంటి సర్టిఫికేషన్లు పొందడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ మొబైల్ కూడా ప్రత్యేకమైన సర్టిఫికేషన్ పొందడం విశేషం.. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన విడుదల తేదీని Poco కంపెనీ కొన్ని వారాల్లోనే ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ మొబైల్ గతంలో విడుదలైన Poco M8కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ కూడా లీకైన సంగతి తెలిసిందే..
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ చాలా అద్భుతమైన 6.77 అంగుళాల Full HD+ అమోలెడ్ డిస్ప్లేతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో విడుదల కాబోతోంది. ఇక ఈ మొబైల్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 చిప్సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని వెనక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా ఉంటున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీ కోసం ఇందులో కంపెనీ 20MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించింది.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
అంతేకాకుండా ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5,520mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. ఈ మొబైల్ భారత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే దీని ధర రూ.18 వేల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది వివిధ రకాల బ్రాండ్లతో ఇటీవల విడుదలైన మొబైల్స్‌తో పోటీ పడే అవకాశాలున్నాయి. అయితే, పోకో కంపెనీ అతి త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Maternal Uncle: బాలికపై అఘాయిత్యం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన మేనమామ కాటేశాడు
Hyderabad, Telangana:POCSO Case: శారీరక వాంఛ తీర్చుకునేందుకు కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. వావివరసలు చూడడం లేదు.. తమ కోరికలు తీర్చుకోవడానికి ఎవరినైనా కాటేయడానికైనా సిద్ధమవుతున్నారు. అలా మేనమామ అని ప్రేమగా ఉండే మేన కోడలిపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పలుమార్లు బాలికపై దాడి చేసి తన కోరికలు తీర్చుకున్నాడు. ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Birthday As Death Day: బర్త్‌డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో కోడిరెక్క నాగేంద్రకు మేన కోడలు ఉంది. బాలిక (మైనర్) అయిన మేన కోడలితో నాగేంద్ర అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. కొద్దిరోజులకు బాలికపై అఘాయిత్యం చేయడం ప్రారంభించాడు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఆమెపై వరుసగా అఘాయిత్యాలకు పాల్పడుతుండడంతో మేన కోడలు ఎవరికీ చెప్పుకోలేకపోయింది. మేనమామ కావడంతో అతడికి భయపడా కుటుంబసభ్యుల ముందు నోరు విప్పలేదు. అయితే తాజాగా ఎలాగోలా కుటుంబసభ్యులు అతడి అఘాయిత్యం తెలియడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
ఇక మేనమామ వేధింపులు తాళలేక ఆ మేన కోడలు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించింది. ఘటన వేములపల్లి పరిధి కావడంతో ఎల్బీనగర్ నుంచి కేసు అక్కడికి బదిలీ చేశారు. నిందితుడు కోడిరెక్క నాగేంద్రపై పోక్సో చట్టం కింద కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితుడు నాగేంద్రను అరెస్ట్ చేసి వేములపల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోదాడలోని డీ మార్ట్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మందికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బస్సు ఏలూరుకు బయలుదేరింది. ఎగ్జిట్ డోర్ వద్ద ప్రమాదం జరగడంతో వెనక ఉన్న అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు బస్సు దిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Thieves Video: పిల్ల దొంగల చేతివాటం చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వీడియో..
Hyderabad, Telangana:Child Thieves Video Watch Here: నేటి కాలంలో నేరగాళ్లు ఏ వయసులో వారైనా సరే.. తమ తెలివితేటలతో సామాన్యులను ఇబ్బందుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతూ వస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తుంటే.. దొంగతనానికి వయస్సుతో సంబంధం లేదని గుర్తు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతు వస్తోంది. ఈ వీడియోకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక సాధారణ వ్యక్తి షాప్ దగ్గర నిలబడి వస్తువులను కొనుగోలు చేయడంలో మునిగిపోయాడు.. అతను షాపు యజమానితో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు బాలురు సాధారణంగా అలవాటుగా దుకాణం దగ్గరికి వచ్చినట్లు నటించారు.. అందులో ఒక బాలుడు సదరు వ్యక్తికి అతి సమీపంలోకి వెళ్లి.. ఎంతో చాకచక్యంగా వెనక జేబులో ఉన్న పర్సును బయటికి తీశాడు. అయితే అతను ఆ షాపు యజమానితో మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగింది..
కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే.. అతని జేబులో నుంచి పర్సును తీయడం మీరు గమనించవచ్చు. ఆ పరీక్షలు తీసిన వెంటనే మరో బాలుడు కూడా అలర్ట్ అయిపోయాడు. దీంతో వారిద్దరు ఏమి ఎరగనట్లుగా అక్కడి నుంచి మెల్లగా జారిపోయారు.. బాధితుడు తన పనిలో తాను ఉండడంతో.. తన పర్సు పోయిందన్న విషయం కూడా అతనికి వెంటనే అర్థం కాలేదు.. ఈ మొత్తం దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలు రికార్డు అయింది.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూ వస్తుంది..
ఈ వీడియో ఇంస్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా షేర్ అవుతోంది. వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ పిల్లల వేగాన్ని చూసి ఊహించని స్థాయిలో ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీరు పిల్లల లేక వృత్తిపరమైన దొంగలా? అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే పిల్లలను ఇలాంటి నేరాల్లోకి దింపుతున్న ముఠాలపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Gudivada Amarnath Jail: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు జైలుశిక్ష ఖరారు.. 6 నెలలు జైలు, రూ.5 వేలు జరిమానా..ఎందుకంటే?
Visakhapatnam, Andhra Pradesh:Gudivada Amarnath Jail News: వైసీపీ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు కోర్టు షాక్ ఇచ్చింది. పదేళ్ల క్రితం అనగా 2016 ఏప్రిల్‌లో నమోదైన ఓ కేసులో వాదనలు తాజాగా పూర్తవ్వగా విశాఖపట్నంలోని రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. నిందితుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను పరిగణించిన కోర్టు.. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇదే విషయమై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను సత్వరమే అమలు చేయాలని అప్పట్లో వైసీపీ నేతగా ఉన్న మాజీ మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ఆందోళనలు చేపట్టారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2016లో నిరసనలు చేశారు. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నాలుగు రోజుల పాటు ఆమరణ నిరాహర దీక్ష చేపట్టగా దీనిపై టూటౌన్లో కేసు నమోదయ్యింది.
ఆ క్రమంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించగా.. దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. దీక్షను భగ్నం చేసి వెంటనే కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. అయితే నిరాహార దీక్ష పేరుతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని ప్రయత్నించారనే ఆరోపణలతో వైజాగ్ టూటైన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు గత ఎనిమిదేళ్లుగా కోర్టులో వాయిదాలు నడుస్తూ ఉంది.
తాజాగా ఈ కేసుపై తుది విచారణ పూర్తి చేసిన తర్వాత విశాఖపట్నం రెండో అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. అమర్నాథ్పై చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారించగా.. మాజీ మంత్రి అమర్నాథ్ను దోషిగా తేల్చిన కోర్టు.. అతనికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించని పరిస్థితుల్లో అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
వైజాగ్ అదనపు కోర్టు విధించిన జైలు శిక్షపై స్పందించిన వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ప్రజా ప్రయోజనం కోసం అప్పట్లో రైల్వే జోన్ ఏర్పాటు సాధనే థ్యేయంగా చేసిన పోరాటాన్ని తప్పుగా చిత్రీకరించారని అమర్నాథ్ ఆరోపించారు. తమ పోరాటాల వల్లే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చిందని ఆయన చెబుతున్నారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే.. న్యాయసలహా మేరకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral Video: చేపకు సిగరెట్ తాగించిన వ్యక్తి.. నెటిజన్ల ఆగ్రహం.. వీడియో!
Hyderabad, Telangana:Fish Viral Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నిత్యం ఏదో ఒక వింత వైరల్ అవుతూనే వస్తోంది. అయితే, కొన్ని వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులకు నవ్వు తెప్పించితే.. మరికొన్ని మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా అటువంటి కోవాకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఒక చేపకు సిగరెట్ తాగించిన వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశానికి దారితీస్తోంది. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా చేపలు నీటిలో ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాయి. కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తను పట్టుకున్న చేపలను నేలపై ఉంచి.. దానికి సిగరెట్ తాగించడం మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి వెలిగించిన సిగరెట్లు చేప లోపల పెట్టగా.. అది గాలి కోసం నోరు తెరిచిన ప్రతిసారి సిగరెట్ పొగను లోపలికి పీల్చుకుంటూ మళ్లీ వదులుతోంది. నీటిలో ఉండాల్సిన జీవిని బయటపడేటమే కాకుండా.. దానికి ఇలా పొగను అలవాటు చేయడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో పై సోషల్ మీడియాలో నేటిజల్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ వస్తున్నారు..నోరులేని జీవుల పట్ల ఎలాంటి చర్యలు ఏంటని కొంతమంది ప్రశ్నిస్తూ వస్తే.. మరి కొంతమంది కేవలం న్యూస్ తో పాటు లైక్స్ కోసం ఇలా మూగజీవులను హింసించడం నేరమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చేపకు సిగరెట్ తాగించడం ఎంటర్టైన్మెంట్ కాదు.. అదొక రకమైన జంతు హింస అని జంతు ప్రేమికుల అభిప్రాయపడుతున్నారు..
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!
సిగరెట్లు నికోటితోపాటు ఇతర రసాయనాలు మనుషులకే కాకుండా జలచరాలకు కూడా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి నుంచి బయటికి తీసినప్పుడే చేపలు ప్రాణాపాయ స్థితిలో ఉంటాయని.. అటువంటి సమయంలో ఇలా పొగను పీల్చడం వల్ల అవి త్వరగా చనిపోయే అవకాశం ఉందని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్‌తో పాటు ట్విటర్లో విపరీతంగా వైరల్ అవుతుంది. మూగ జీవులను ఇలా హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు..
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Gudivada Amarnath Jail: వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్కు జైలుశిక్ష..6 నెలల జైలు, రూ.5 వేలు జరిమానా!
Visakhapatnam, Andhra Pradesh:Gudivada Amarnath Jail News: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్కు విశాఖ అదనపు కోర్టు షాక్ ఇచ్చింది. పదేళ్ల క్రితం అనగా 2016 ఏప్రిల్‌లో జరిగిన ఓ సంఘటనపై కేసు నమోదవ్వగా.. తాజాగా కేసు వాదనలు పూర్తవ్వడంతో మాజీ మంత్రి అమర్నాథ్ను దోషిగా తేలుస్తూ 6 నెలల జైలు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.Kcr Public Meeting: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ భారీ బహిరంగ సభ.. జీవన్ రెడ్డి ఏమన్నారంటే..?..
Hyderabad, Telangana:kcr public meeting in jagtial on 20 th of these month: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జగిత్యాల జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో మరింత రచ్చ రాజుకుంది. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ లు ఇస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి,కేసీఆర్ రాక నేపథ్యంలో ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. గులాబీ దళపతి కేసీఆర్ సమక్షంలో BRS పార్టీ కండువాను మాజీ మంత్రి జీవన్ రెడ్డి కప్పుకొనున్నారు. జిల్లా కేంద్రంలోని మోతె రోడ్ లో బహిరంగ సభ ... ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతుంది . కేసీఆర్ సభ కోసం బహిరంగ సభ స్థలాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో పాటు, ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ నేతలు పరిశీలించారు
జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్, మోతే రోడ్డు, కాలేజీ గ్రౌండ్ స్థలాలను నాయకులు పరిశీలించారు. జగిత్యాల లో కేసీఆర్ సభ స్థలాలను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపు రెడ్డి లు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లు ఉన్నారు. ఈ క్రమంలో సభకు భారీగా కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్న నేపథ్యంలో వివిధ స్థలాలను నేతలు పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. BRS జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20 న జగిత్యాల మోతె రోడ్ లో కెసిఆర్ బహిరంగా సభ ఉంటుందన్నారు. కేసీఆర్ కోసం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సుమరు ఒక లక్ష మంది తో సభ ఏర్పాటు చేస్తామన్నారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏమన్నారంటే..?..
జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తన శేష జీవితంలో కేసీఆర్ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి రేవంత్ రెడ్డి పోవాలని మరోసారి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
Read more: Aadi Srinivas: కేసీఆర్ విషకౌగిలిలోకి జీవన్ రెడ్డి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Realme Narzo 100 Lite 5G: ఆరేళ్ల వరకు బ్యాటరీ గ్యారెంటీ! రియల్మీ నార్జో 100 లైట్ 5G లాంచ్ డేట్ ఫిక్స్..
Hyderabad, Telangana:Realme Narzo 100 Lite 5g To Launch On April 14: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ రియల్ మీ తన నార్జో సిరీస్‌లో మరో అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని రియల్ మీ కంపెనీ రియల్మీ నార్జో 100 లైట్ 5G (Realme Narzo 100 Lite 5G) పేరుతో ఏప్రిల్ 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్స్ కొనుగోలు చేసేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Realme Narzo 100 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది 7000mAh టైటాన్ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరంగా పనిచేయడమే కాకుండా సినిమాలు చూసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్యాటరీ ఆరేళ్లపాటు అద్భుతమైన హెల్త్ కండిషన్ తో పనిచేస్తుందని రియల్ మీ కంపెనీ భరోసా కూడా అందిస్తూ వస్తోంది. ఇందులో కంపెనీ ప్రత్యేకమైన రివర్సల్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు దీనిని పవర్ బ్యాంకులో వాడుకునేందుకు వివిధ రకాల పరికరాలతో చార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
ముఖ్యంగా ఈ Realme Narzo 100 Lite 5G స్మార్ట్‌ఫోన్ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ చేసే వారికి చాలా బాగా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల భారీ ఎల్సీడీ డిస్ప్లేను అందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన కూలింగ్ సిస్టం కూడా ఇందులో అందించినట్లు తెలుస్తోంది.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
ఈ Realme Narzo 100 Lite 5G ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ఇందులో ఎంతో శక్తివంతమైన ప్రధాన కెమెరా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ ఫ్లాష్ కూడా లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ ప్రతిష్టంగా ఉండేందుకు Armorshell ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది మొత్తం రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ ధర రూ.13 వేల నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి దీనిపై ఎన్నో రకాల అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉండబోతున్నాయి.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Macherla ASI: పల్నాడులో ఎఎస్సై బాగోతం.. ఏకాంతంగా ఉన్న జంటల వీడియోలు తీసి.. డిపార్ట్ మెంట్ లో దుమారం..
Hyderabad, Telangana:Palnadu Asi blackmail couple after secretly filming photos: సాధారణంగా ఎవరికైన అన్యాయం జరిగితే వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్తారు. తమకు జరిగిన అన్యాయంపై వారికి ఫిర్యాదు చేస్తారు. ఎలాగైన న్యాయం చేయాలని పోలీసుల్ని ప్రాధేయ పడతారు. చాలా మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రజలకు మేలు చేసే పనులుచేస్తారు. బాధితులకు అండగా నిలబడతారు. మరోవైపు కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. వేసుకున్న ఖాకీ దుస్తుల పరువు తీసేలా ప్రవర్తిస్తారు. ఏదైన సమస్య ఉందని పీఎస్ కు వస్తే వేధింపులకు గురిచేస్తారు. అంతే కాకుండా లంచం ఇవ్వాలని, లైంగికంగా కూడా టార్చర్ చేస్తారు. ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తుంటాం.
పల్నాడులోని మాచర్ల నియోజక వర్గంలో ఒక ఏఎస్సై మొత్తంగా డిపార్ట్ మెంట్ పరువు తీసేలా ప్రవర్తించాడు. ఏకంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసుకుని వేధింపులకు గురిచేశాడు.ఈ ఘటన ఏపీలో దుమారంగా మారింది. పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలో ఒక ఏఎస్సై నియోజక వర్గం పరిధిలో పర్యాటక ప్రాంతంలలో తరచుగా తిరిగే జంటలను టార్గెట్ చేశాడు. దీనికి జమ్మల మడుగుకు చెందిన ఆటో డ్రైవర్ సాయం తీసుకున్నాడు. ఇతనిలో వారి ఏకంతంగా , రొమాన్స్ చేసుకుంటుండగా వీడియోలు, ఫోటోలు తీయాలని చెప్పేవాడు.
ఆ తర్వాత వారిని ఏఎస్సై బ్లాక్ మెయిల్ చేస్తు డబ్బులు ఇవ్వాలని, తనతో లైంగికంగా కలవాలని వారిని వేధింపులకు గురిచేశాడు. ఇటీవల ఒక వ్యాపారి, మహిళతో రొమాన్స్ చేసుకుంటుండగా వీడియో తీశాడు. అతడ్ని కూడా ఇదే విధంగా వేధింపులకు గురిచేశాడు. దీంతో డబ్బులు ఇచ్చిన వేధింపులు ఆగక పోవడంతో బాధితుడు ఎస్పీకి తన బాధను చెప్పుకున్నాడు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు పీఎస్ పరిధిలో ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ సైతం ఇదే విధంగా ఏకతంగా ఉండే జంటలను టార్గెట్ చేసుకుని వేధించారని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఏకంగా స్థానిలకు ఎస్పీని కలిశారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటనపై మహిళ కమిషన్ రంగంలోకి దిగింది.
దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మహిళల భద్రతపై రాజీపడేదిలేదని స్పష్టం చేశారు. మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Singer Mangli Case: టాలీవుడ్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు..చంపేస్తామని మంగ్లీ సోదరుడు, డైరెక్టర్ వేణు బెదిరింపులు?!
Hyderabad, Telangana:Singer Mangli Case News: టాలీవుడ్ సింగర్, ప్రముఖ జానపద గాయని మంగ్లీ (సత్యవతి చౌహాన్)పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఆమెతో పాటు ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఊడుగుల (విరాటపర్వం డైరెక్టర్)పై ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు. పెట్టుబడి డబ్బును మోసం చేయడం సహా హత్యాయత్న బెదిరింపుల నేపథ్యంలో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వీరు ముగ్గురు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు.
బాధితుని లాయర్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. వ్యాపార పెట్టుబడులపై అధిక రాబడి ఇస్తామని వాగ్దానం చేసి నిందితులు దాదాపు 100 మంది బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని.. ఇన్నేళ్లు గడిచినా.. లాభాలను గానీ, అసలు పెట్టుబడులను గానీ తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్ని రోజుల గడిచినా తన డబ్బు తిరిగి రావడం లేదనే ఆవేదనతో బాధితులు న్యాయం కోసం ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల నుంచి డబ్బు అడిగేందుకు వెళ్లిన బాధితుడ్ని చంపుతామని బెదిరించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదులో సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి బెదిరించారని.. దీంతో తన క్లైయింట్‌కు ప్రాణహాని ఉందని బాధితుని తరఫు లాయర్ ఆరోపించారు.
ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ.. పంజాగుట్ట పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిధులను అక్రమంగా సేకరించారా, ఈ ఆరోపిత మోసంలో ఏదైనా పెద్ద నెట్వర్క్ ప్రమేయం ఉందా అనే విషయాలను అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. సింగర్ మంగ్లీకి పాపులర్ అయిన కారణంగా ఆమె పేరు ప్రముఖంగా ఈ కేసులో వినిపిస్తోంది.
అయితే ఫిర్యాదులో పేర్కొన్న ఇతరుల ప్రమేయం ఏ మేరకు ఉందో, అలాగే వాపసు కోరిన వారిని అణచివేయడానికి నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారో లేదో కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పెట్టుబడులు పథకం నిజమైనదా లేక అమాయక వ్యక్తులను మోసం చేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారా అనేది విచారణలో తేలుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
