Back
VIJAY BHASKAR
Hyderabad500082

బి.జె.ఎం.సి హైదరాబాద్ అధ్యక్షురాలిగా శ్రీదేవి రమేష్

VBVIJAY BHASKARJun 25, 2025 15:33:22
Hyderabad, Telangana:
బడుగు బలహీన,కార్మిక వర్గాల కొరకు గత ఎనిమిది సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్న శ్రీదేవి రమేష్ ను బి.జె.ఎం.సి హైదరాబాద్ నగర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు.ఈ మేరకు సోమాజిగూడ,ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బి.జె.ఎం.సి జాతీయ చైర్మన్ బిశ్వ ప్రియ రాయ్ చౌదరి, జాతీయ అధ్యక్షులు అర్నబ్ చటర్జీ, తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ నాగార్జున్ లు శ్రీదేవి రమేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు. కార్మికులు, బాల కార్మికుల భవిష్యత్తు కొరకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు.
0
Report
Hyderabad500082

హైదరాబాద్‌లో అమేయ దాబ్లీ పాన్-ఇండియా ‘కృష్ణా’ టూర్‌ను ఘనంగా ప్రారంభించారు.

VBVIJAY BHASKARJun 24, 2025 17:14:05
Hyderabad, Telangana:
కేస్టోన్ ఉత్సవ్ ద్వారా అమేయ దాబ్లీ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా టూర్ — కృష్ణా: మ్యూజిక్, బ్లిస్ అండ్ బియాండ్ — జూన్ 28, 2025న శిల్పకళా వేదిక హాల్లో ప్రత్యేక కచేరీకి ముందు, ఇండోర్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌తో అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక సంగీత యాత్రకు ముందు అమేయ దాబ్లీ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఈ టూర్ ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.
1
Report
Hyderabad500041

Telangana News: క్లినికల్ ట్రయల్స్ పేరు మీద జంతువులను హింసించ రాదు

VBVIJAY BHASKARJun 11, 2025 09:44:27
Hyderabad, Telangana:
పీటా ఇండియా ఎన్జీవో వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు సైన్స్ పాలసీ అడ్వైజర్ అంజన అగర్వాల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణకి సంబంధించిన ఒక టెస్టింగ్ లేబరేటరీ లో అమాయకమైన కుక్కలను కోతులను మరియు ఇతర జంతువులను టెస్టింగ్ పేరిట హింసకు గురి చేస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు.
0
Report
Hyderabad500082

Telangana News: గోమాత రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి*

VBVIJAY BHASKARJun 06, 2025 15:37:39
Hyderabad, Telangana:
గోమాత రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జన్ ఊర్జా మంచ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నిషిత దీక్షిత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యువ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్, బాలస్వామి లు మాట్లాడారు. గోహత్య మహా పాపమని, గోవులను కిరాతకంగా హత్య చేసిన ఏ దేశము ఏ ప్రాంతము అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. గోవులను హత్య చేసిన మహా నేతలు సైతం నేలకొరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
0
Report
Advertisement
Hyderabad500041

జె ఎన్ ఏ ఎఫ్ ఏ యు టీచింగ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కృతజ్ఞత సమ్మేళం

VBVIJAY BHASKAROct 29, 2024 08:39:51
Hyderabad, Telangana:
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జే ఎన్ ఏ ఎఫ్ యు) కి స్థలాన్ని కేటాయించడం హర్షనీయమని జే ఎన్ ఏ ఎఫ్ ఏ యు టీచింగ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ పేర్కొంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడారు‌. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళలపై ఉన్న తన ఆసక్తిని ప్రత్యేకంగా ప్రదర్శించారని అన్నారు.
0
Report
Hyderabad500041

ఈబి5 వీసాతో అమెరికా గ్రీన్ కార్డ్ సులువుగా పొందవచ్చు- మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్

VBVIJAY BHASKARAug 03, 2024 16:48:08
Hyderabad, Telangana:

ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు మల్లెల ఆదిత్య సోమాజిగూడ, ఎంతో మంది భారతీయులు తమ విలువైన భవిష్యత్తు కోసం అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటున్నారని సూచించారు. ఇలాంటి వారికి ఈబీ5 వీసా ఎంతో అనువుగా ఉంటుందని, ఈ వీసా ద్వారా అమెరికాలో వర్క్ పర్మిట్, నిబంధనలతో కూడిన గ్రీన్ కార్డ్ పొందవచ్చని, వచ్చే ఐదేళ్లలోగా శాశ్వత గ్రీన్ కార్డ్ పొందవచ్చని తెలిపారు.

1
Report