Back
Naresh
Followకోతుల భయంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు
Mothkur, Telangana:
మోత్కూర్ పట్టణ కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజల బెంబేలెత్తిపోతున్నారు. కోతులు గుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వీరంగం సృష్టిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. బయటికి వెళ్లాలంటే కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.
1
Report
సైదాపూర్ లో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన బీర్ల ఐలయ్య
Yadagirigutta, Telangana:
యాదగిరిగుట్ట మండలంలోని సైదాపూర్ చెరువులో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆదివారం గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి జలాలను సైదాపూర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఐలయ్యను శాలువాలతో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
0
Report
మూసి పైన బిజెపి నేతలు కొత్త డ్రామాలు : బీర్ల ఐలయ్య
Yadagirigutta, Telangana:
మూసి పైన బిజెపి నేతలు బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్త డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట కార్యాలయంలో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజు నిద్ర చేస్తాననడం సిగ్గుచేటని, ఒక్కరోజు నిద్రలో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఒక రాత్రి షో చేయడానికి మీడియా ప్రచారం కోసం కిషన్ రెడ్డి వెళ్తున్నారని తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా అనేక బాధలను అనుభవిస్తూ నిరుపేదల నివసిస్తున్నారని తెలిపారు.
1
Report
కుటుంబ సమేతంగా అంజన్న గట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐలయ్య
M.Turkapally, Telangana:
తుర్కపల్లి మండలంలోని వీరరెడ్డి పల్లి గ్రామ సమీపంలోని అంజన్న గట్టు ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలలో భాగంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా రామలింగేశ్వర స్వామి వారిని, సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు.కార్తీక మాస ఉచారుల భాగంగా శివ పార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు.ఆలయ నిర్వాహకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.
0
Report
అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే బిజెపి లక్ష్యం : ఎంపీ చామల
Bhuvanagiri, Telangana:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బిజెపి ప్రవర్తిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.మూసి ప్రక్షాళనను రాజకీయం చేయకుండా,గంగా నది, సబర్మతి నది ప్రక్షాళన కోసం మోడీకి సహకరించిన విధంగానే ఇక్కడ మూసీ నదికి కూడా సహకరించి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు.మిమ్ములను ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం మీరు పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
1
Report