ఖమ్మంలో ప్రత్యక్షమైన లేడీ ఆఘోరీ
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Phone Tapping Case Latest News: గత కొద్దిరోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు సృష్టిస్తూ వస్తోంది. నిన్న మొన్నటి వరకు కొంతమంది అధికారుల చుట్టూ తిరిగిన ఈ కేసు.. ప్రస్తుతం గులాబీ పార్టీలోని అగ్రనేతల ఇంటి గడప తొక్కుతోంది.. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు, కేటీఆర్, జోగినపల్లి సంతోష్ రావులకు నోటీసులు అందగా.. ఇప్పుడు అందరి దృష్టి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పడింది.. మరో రెండు రోజుల్లో కవితకు సిట్ (SIT) నోటీసులు అందే చాన్స్ ఉందన్న వార్త రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతూ వస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే.. విచారణలో భాగంగా అసలు కవిత ఏం చెప్పబోతున్నారు? సొంత సోదరుడిపై ఆమె చేసిన ఆరోపణల అంతరార్థం ఏమిటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
గత కొన్ని రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు.. సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ.. ఈ క్రమంలోనే కవిత భర్త అనిల్ కుమార్ ఫోన్ కూడా టాపింగ్‌కు గురైనట్లు.. స్వయంగా కవిత గతంలోనే బాంబు పేల్చిన సంగతి తెలిసిందే.. "నా భర్త ఫోను కూడా వదలట్లేదు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో బిఆర్ఎస్ పార్టీలో కొంత చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే..
ఇది ఇలా ఉంటే ఈ ట్యాపింగ్ వ్యవహారం వెనుక గులాబీ ప్రధాన లీడర్ కేటీఆర్ హస్తం ఉందన్న కోణంలో కవిత చేస్తున్న పరోక్ష విమర్శలు ఇప్పుడు సిట్ అధికారులకు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. బాధితురాలిగా కవిత ఇచ్చే స్టేట్మెంట్ ఈ కేసులో ఎవరి మేడకు చుట్టుకుంటుందో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర వుడ్ కంట నెలకొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికలవేళ ఈ కేసు మళ్లీ తెరపైకి రావడం వెనక రాజకీయ కుట్ర ఉందని కవిత ఆరోపిస్తున్నారు.. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు హరీష్ రావు కలిసి ఆడుతున్న డ్రామా అని ఆమె ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఇక సిట్ అధికారులు మాత్రం అరిష్టైన పోలీస్ అధికారుల వాంగ్మూలం ఆధారంగానే నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కవిత విచారణకు హాజరైతే.. ఆమె తన భర్త ఫోన్ ట్యాపింగ్‌పై ఇచ్చే ఆధారాలు పార్టీలో అంతర్గత పోరును మరింత బయటపెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. SIT నోటీసులు అందితే కవిత విచారణకు వెళ్తారా? లేక దీనిపై న్యాయపోరాటం చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా.. ఈ ఫోన్ ట్యాపింగ్ భూతం తెలంగాణ రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mercury Retrograde 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని జ్ఞానంతో పాటు తెలివితేటలు తీర్పుకు చిహ్నంగా చెప్పుకుంటారు. ఇలాంటి గ్రహం తిరోగమనంలోకి మారినప్పుడు అన్ని రాశుల వారిపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు పాత నిర్ణయాలను పునరాలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా డబ్బు పరంగా కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. బుధ గ్రహం తిరోగమన ప్రభావంతో ఈ సమయంలో ఊహించని స్థాయిలో శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 26వ తేదీ నుంచి బుధుడు తిరోగమన స్థితిలోకి మారబోతున్నాడు. అప్పటినుంచి రాబోయే నెల మార్చి వరకు కొన్ని రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆందోళన కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ తిరోగమన ప్రభావంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకోండి.
ఈ రాశులవారికి బంపర్ జాక్‌ఫాట్!
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా జీవితంలో వీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. బుధుడి ప్రభావంతో పాత వ్యాపారాలనుంచి డబ్బులు కూడా పొందగలుగుతారు. దీంతోపాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి చాలాకాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. కొత్త వరంగల్ కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. డబ్బు మీ చేతుల్లోకి వస్తుంది. ముఖ్యంగా ఖర్చులు కూడా ఊహించని స్థాయిలో తగ్గిపోతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కన్యరాశి
కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకు జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. విద్యతోపాటు తెలివితేటలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఎలాంటి పనులు చేసిన కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఆందోళన కూడా పూర్తిగా తగ్గిపోయి.. మానసికంగా మెరుగుపడే అవకాశాలున్నాయి. జీవితంలో ఊహించని స్థాయికి ఎదుగుతారు.
తులారాశి
తులారాశి వారికి ఆలోచన స్థాయి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మరిచిపోయిన పనులు తిరిగి మళ్లీ చేయగలుగుతారు. కొంత మొత్తంలో డబ్బు కూడా లభించే అవకాశాలున్నాయి. దీనివల్ల కొన్ని రకాల ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వ్యక్తులకు కాస్త పరిష్కారం లభిస్తుంది.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ పరంగా మంచి ప్రణాళికలు కూడా పొందుతారు. ఐటి డేటా రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు దిగుమతులు క్రమంగా పెరిగి.. డబ్బు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rahu And Mercury Conjunction Effect On Zodiac News: ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తప్పకుండా రాశి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లోనే మొత్తం 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతూ ఉంటుంది. కొన్ని అరుదైన గ్రహాలు సంచారం చేసినప్పుడు అనేక రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయి. ఇదిలా ఉంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత రాహువు బుధుల మహా సంయోగం ఏర్పడబోతోంది.. కుంభ రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారు గొప్ప సమయాన్ని అనుభవించబోతున్నారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో అద్భుతమైన ధన లాభాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో సంపాదన కూడా పెరుగుతుంది. అనుకున్న ప్రయోజనాలు కూడా పొందగలుగుతారని వారు అంటున్నారు నిజానికి ఈ సమయంలో అత్యంత లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి ఊహించని జాక్‌పాట్:
మిథున రాశి
రాహువు, బుధ గ్రహాల కలయిక కారణంగా మిథున రాశి వారి పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి భారీ మొత్తంలో డబ్బు లభిస్తుంది. అలాగే ఎప్పుడు పొందనంత డబ్బును కూడా పొంది.. అద్భుతమైన సంపాదన సొంతం చేసుకుంటారు. పెట్టుబడిదారుల నుంచి ప్రత్యేకమైన లాభాలు కూడా పొందుతారు. ఈ సమయంలో వ్యాపారాలతో పాటు పెద్దపెద్ద వాణిజ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు.. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహువు, బుధుడి కలయిక కారణంగా ఈ సమయంలో ఇష్టమైన వారితో అద్భుతమైన క్షణాలు గడిపే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఊహించని డబ్బు పొందడమే కాకుండా.. గతంలో నిలిచిపోయిన పనులు కూడా కాస్త ప్రారంభమై.. భారీ మొత్తంలో డబ్బులు లభిస్తాయి. అంతేకాకుండా వ్యక్తులు ఈ సమయంలో పొదుపు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడి.. భారీ మొత్తంలో ఖర్చు కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా ఊహించని స్థాయిలో అనుకున్న పనులు చేయగలుగుతారు.
మేషరాశి
మేష రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన క్షణాలు రాబోతున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా మారడమే కాకుండా ఊహించని స్థాయిలో డబ్బు లభిస్తుంది. దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు మునుపాటి కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ఈసారి వ్యాపారాల్లో కూడా భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. గతంలో చిక్కుకుపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. అలాగే భాగస్వామ్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద ధన లాభాలు పొందడమే కాకుండా అనుకున్న స్థాయిలో డబ్బు కూడా సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వీరికి సమాజంలో అనుకున్నంత స్థాయిలో గౌరవం పెరుగుతుంది..
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anti Aging Superfood Diet: వయసు పెరిగినా చర్మం ముడతలు పడకుండా, ముఖంపై సహజమైన కాంతి తగ్గకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారమే అత్యంత కీలకం. కొన్ని రకాల 'సూపర్ ఫుడ్స్' వృద్ధాప్య ప్రక్రియను (Aging process) నెమ్మదింపజేసి, మిమ్మల్ని మీ వయసు కంటే యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండటానికి ఖరీదైన క్రీముల కంటే, సరైన పోషకాహారం తీసుకోవడమే ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బెర్రీలు (బ్రైట్ స్కిన్ & షార్ప్ బ్రెయిన్)
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడి, సహజమైన కాంతిని ఇస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని సలాడ్స్ రూపంలో లేదా నేరుగా తీసుకోవచ్చు.
నట్స్, డ్రై ఫ్రూట్స్ (గుండె ఆరోగ్యం)
వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రధాన సమస్య గుండె జబ్బులు. బాదం, వాల్నట్స్ వంటివి శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులను (Healthy fats) అందిస్తాయి. ఇవి రక్త నాళాలను దృఢంగా ఉంచి.. కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. తద్వారా మీరు రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా యవ్వనంగా కనిపిస్తారు.
చేపలు (ఒమేగా-3 పవర్)
వృద్ధాప్యాన్ని అడ్డుకోవడంలో చేపల పాత్ర అమోఘం. ముఖ్యంగా సాల్మన్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను (Inflammation) తగ్గించి కీళ్ల నొప్పులను నివారిస్తాయి. చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి అవయవాలు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడతాయి.
యవ్వనంగా కనిపించడం అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, లోపలి నుండి ఆరోగ్యంగా ఉండటం కూడా. పైన పేర్కొన్న ఆహార పదార్థాలతో పాటు తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీరు మీ వయసు కంటే చిన్నవారుగా కనిపిస్తారు.
Also Read: Padma Awards Benefits: పద్మ అవార్డుల పవర్ ఇదే! పురస్కార గ్రహీతలకు లభించే రాచమర్యాదలు ఇవే!
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Municipal Elections: 'మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. రెండోసారి మోసపోతే మనం తప్పు చేసిన వాళ్లం అవుతాం. అమెరికాలాంటి దేశంలో ఇప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి. ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన సమస్యలు పరిష్కారమవుతాయి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్!
చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఆహ్వానించిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 'చేవెళ్లలో కాలె యాదయ్య కేసీఆర్ మనిషి అనుకుని గెలిపస్తే కాంగ్రెస్ గూటికి వెళ్లాడు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయి వేటు వెయ్యమంటే స్పీకర్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెబుతున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాలె యాదయ్య చిన్ననాటి దోస్తులు. ఇద్దరు కలిసి ఒకే బండిపై తిరిగేవారు. మహా భారతంలో ధృతరాష్ట్రుడు ఏం కనపడనట్లు నటించినట్లు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు విషయంలో స్పీకర్ అలానే ఉంటున్నాడు' అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుబట్టారు.
Also Read: HIV Injection: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు
'చేవెళ్లలో ఐదేళ్ల అబ్బాయిని అడిగినా కాలె యాదయ్య పార్టీ మారాడని చెబుతాడు. కానీ స్పీకర్ మాత్రం కాలె యాదయ్య బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, మేము పార్టీ మారామని చెప్పే దమ్ము లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'ఎన్నికల సమయంలో మల్లికార్జున్ ఖర్గే చేవెళ్లలో దళితులకు అనేక హామీలు ఇచ్చాడు. ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు కాదు కదా 12 పైసలు ఇవ్వలేదు. వృద్ధులకు పింఛన్లు పెంచుతామని చెప్పి మోసం చేశారు' అని కేటీఆర్ గుర్తుచేశారు.
Also Read: Pamda Awards 2026: పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఎవరెవరికి ఇచ్చారంటే..?
'మోసగాడి చేతిలో తెలంగాణ బందీ అయిందని. సబితా ఇంద్రారెడ్డి రోజు బాధ పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అందరినీ కడుపులో పెట్టుకొని చూసేవాడు. నాట్లు వేసే సమయంలో టింగ్ టింగ్ మని రైతుల అకౌంట్లో రైతు బంధు పడేది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పై నిలదీస్తుంటే మా పై కేసులు, బూతులు. బూతులు మాకు వచ్చు కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది' అని రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఆడ బిడ్డలు, ప్రజలు బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Padma Awards 2026 Benefits: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ పురస్కారాలు దేశంలో అత్యంత గౌరవప్రదమైనవి. భారతరత్న తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ అవార్డుల వెనుక ఉన్న పవర్ ఏంటి? గ్రహీతలకు ప్రభుత్వం కల్పించే మర్యాదలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాలు, వివిధ రంగాల్లో నిరుపమాన సేవలు అందించిన వ్యక్తులకు దేశం ఇచ్చే అత్యున్నత గుర్తింపు ఈ పురస్కారాలు.
మూడు విభాగాలు - మూడు మెట్లు
పద్మ అవార్డులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది:
పద్మ విభూషణ్: దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం. అసాధారణ, విశిష్ట సేవలకు దీనిని ఇస్తారు.
పద్మ భూషణ్: మూడవ అత్యున్నత పురస్కారం. ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు గుర్తింపు.
పద్మశ్రీ: నాల్గవ అత్యున్నత పురస్కారం. ఏ రంగంలోనైనా ప్రతిభ చాటిన వారికి, ముఖ్యంగా సామాన్యులకు ఇచ్చే గౌరవం.
ఎంపిక ప్రక్రియ
గతంలో ప్రభుత్వమే పేర్లను సూచించేది, కానీ ఇప్పుడు ప్రక్రియ పూర్తిగా మారింది. సామాన్య ప్రజలు కూడా తమకు తెలిసిన అర్హులను నామినేట్ చేయవచ్చు. చివరికి ఎవరికి వారు 'సెల్ఫ్ నామినేషన్' చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతి ఏటా ప్రధానమంత్రి ఏర్పాటు చేసే ఈ కమిటీ, వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుంది.
చాలామంది ఈ అవార్డుతో పాటు డబ్బు వస్తుందని అనుకుంటారు. కానీ, పద్మ అవార్డులతో ఎటువంటి నగదు బహుమతి లేదా నెలవారీ భత్యాలు ఉండవు. వీరికి లభించే మర్యాదలు ఇవే.
సనద్ & మెడల్: రాష్ట్రపతి సంతకంతో కూడిన ప్రశంసా పత్రం (సనద్), ఒక పతకం ఇస్తారు.
ప్రభుత్వ అతిథులు: వీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని 'స్టేట్ గెస్ట్స్'గా పరిగణించి వసతి, రక్షణ కల్పిస్తాయి.
రైల్వే పాస్‌లు: నిబంధనల మేరకు భారతీయ రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.
ముఖ్య వేడుకలు: గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతాయి.
ముఖ్యమైన నిబంధన..
పద్మ అవార్డు అనేది ఒక గుర్తింపు మాత్రమే, అది బిరుదు (Title) కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం.. గ్రహీతలు తమ పేరుకు ముందు లేదా వెనుక (ఉదాహరణకు: పద్మశ్రీ రాము) అని వాడుకోకూడదు.
విజిటింగ్ కార్డులు లేదా లెటర్ హెడ్లపై దీనిని ముద్రించుకోవడం నిబంధనలకు విరుద్ధం. దుర్వినియోగం చేస్తే అవార్డును వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
'అన్సంగ్ హీరోస్'కు అరుదైన గౌరవం
ప్రస్తుతం ఈ అవార్డుల విధానంలో గొప్ప మార్పు వచ్చింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండి నిస్వార్థంగా సేవ చేస్తున్న 'అన్సంగ్ హీరోస్' (గుర్తింపు లేని వీరులు) ను వెతికి పట్టుకుని ప్రభుత్వం గౌరవిస్తోంది. ఇది కేవలం ఒక పతకం కాదు, భారత గడ్డపై ఆ వ్యక్తి ముద్రించిన అంకితభావానికి నిదర్శనం.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Redmi 14C 5G Offer Price: బడ్జెట్ ధరలో శక్తివంతమైన 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే అవకాశం. షావోమీకి చెందిన పాపులర్ మోడల్ Redmi 14C 5G పై కనీవినీ ఎరుగని ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అన్ని ఆఫర్లు కలిపితే ఈ ఫోన్‌ను సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫర్ ఎలా పొందాలి?
అసలు ధర: రూ.12,999
ఫ్లాట్ డిస్కౌంట్: ప్రముఖ షాపింగ్ వెబ్సైట్లలో ప్రస్తుతం 27% తగ్గింపును అందిస్తోంది. దీనివల్ల ఫోన్ ధర రూ.9,499 కి తగ్గుతుంది.
బ్యాంక్ ఆఫర్: మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి EMI లావాదేవీ ద్వారా కొనుగోలు చేస్తే, అదనంగా రూ.3,000 తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్లన్నీ కలిపితే, దాదాపు రూ.6,500 తగ్గింపుతో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.6,500 కే ఇంటికి తీసుకెళ్లవచ్చు.
Redmi 14C 5G టాప్ ఫీచర్లు..
డిస్ప్లే: ఇందులో 6.88-అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.
పవర్ఫుల్ ప్రాసెసర్: వేగవంతమైన పనితీరు కోసం Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గేమింగ్‌కు కూడా సహకరిస్తుంది.
కెమెరా క్వాలిటీ: వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా కలదు.
కళ్ల రక్షణ: దీని డిస్ప్లేకు TÜV Rheinland సర్టిఫికేషన్ ఉంది. అంటే ఫోన్ ఎక్కువసేపు చూసినా కళ్లపై ఒత్తిడి పడదు.
బ్యాటరీ బ్యాకప్: 5,160mAh భారీ బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
స్టోరేజ్: ఈ బేస్ వేరియంట్లో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి.
తక్కువ ధరలో బ్రాండెడ్ 5G ఫోన్ కావాలనుకునే వారికి, ముఖ్యంగా విద్యార్థులు, సామాన్యులకు ఇది బెస్ట్ డీల్. స్టాక్ ముగిసేలోపు విజయ్ సేల్స్ వెబ్సైట్లో ఈ ఆఫర్‌ను తనిఖీ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Spitting Cobra Video Viral News: ప్రకృతి అనేక రకాల జీవరాశులకు ఒక ప్రపంచం.. ఈ పంచంలో వివిధ రకాల కోట్ల జాతులకు సంబంధించిన జీవులు జీవిస్తున్నాయి. ముఖ్యంగా ఆయా జీవరాశులు తమ ఆత్మరక్షణలో కోసం వివిధ పద్దతులను అనుసరిస్తూ ఉంటాయి. వీటిల్లో అత్యంత ప్రమాదకరమైనది, ఆశ్చర్యపరిచేది స్పిట్టింగ్ కోబ్రా.. మనందరకీ తెలిసిందేంటంటే ప్రమాదకరమైన పాములు కరిచినప్పుడే మానవ శరీరంలోకి విషం చేరుతూ ఉంటుంది. కానీ కొన్ని రకాల కోబ్రాలు కరవాల్సిన అవసరం లేకుండానే శత్రువులను తన విషంతో హతమార్చగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. అంతేకాకుండా దీని విషం శాశ్వతంగా అందులను చేస్తుంది. ఇంతకీ ఆ పామేంటి? ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఏముంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అత్యంత ప్రమాదకరమైన స్పిట్టింగ్ కోబ్రా చూడొచ్చు. ఈ పాము దాదాపు 5 అడుగులకు పైగా దూరం విషాన్ని చిమ్మే సమార్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది కేవలం గాలిలో విషాన్ని చిమ్మడమే కాకుండా అత్యంత ఖచ్చితంగా శత్రువులనూ దాడి చేస్తుంది. ముఖ్యంగా ఇది ఎదుటివారి కళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఇది విషాన్ని చిమ్ముతుంది. అంతేకాకుండా ఇది కళ్లలోకి విషం చిమ్మిన తర్వాత అత్యంత సులభంగా కూడా దాడి చేస్తుంది. ఇప్పుడు ఈ కోబ్రాకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఈ పాము విషం చిమ్మితే ఆ తీవ్రతకు కళ్లు వెంటనే మంటలను పుట్టిస్తాయి. దీంతో కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా సకాలంలో చికిత్స అందకపోతే.. శాశ్వతంగా అంధులవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పాములు తనను తాను రక్షించుకోవడానికి లేదా వేటాడడానికి ఈ అద్భుతమైన శక్తిని వినియోగిస్తాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.
ఈ పాములలోని ప్రత్యేకమైన రకం గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా అడవులకు వెళ్లే క్రమంలో లేదా ఇలాంటి పాములను చూసినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని.. కనీసం దాదాపు 5 నుంచి 10 అడుగుల దూరం ఉండాలని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. అలాగే ఇతర పాములు కనింపినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kavya Maran Celebration SA20: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన SA20 (2025-26) సీజన్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆదివారం కేప్ టౌన్లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి, సన్‌రైజర్స్ జట్టు నాలుగేళ్లలో మూడవసారి ఛాంపియన్‌గా నిలిచింది.
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు SA20 చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా తన రికార్డును సుస్థిరం చేసుకుంది. ఓటమి అంచున ఉన్న స్థితి నుంచి అద్భుత విజయాన్ని అందుకుని అభిమానులను ఉర్రూతలూగించింది.
SA20 ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా జట్టు 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (56 బంతుల్లో 101 పరుగులు) ఒంటరి పోరాటం చేసి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 159 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. కేవలం 48 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్నట్లు కనిపించింది.
కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ (63*), మాథ్యూ బ్రీట్జ్కే (68*) ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు విడదీయరాని 114 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, 4 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో జట్టును గెలిపించారు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా, స్టబ్స్ వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు.
She’s still laughing at yu for 3 Fcking timesss ra benchodddd https://t.co/eQReB5Ez7D pic.twitter.com/puGIxKxIHG
— Yash😊🏏 (@YashR066) January 25, 2026
కావ్య మారన్ సెలబ్రేషన్స్..
సన్‌రైజర్స్ విజయం ఖరారు కావడంతో టీమ్ ఓనర్ కావ్య మారన్ ఆనందానికి అవధులు లేవు. గ్యాలరీలో తన సీటులోంచి లేచి గెంతుతూ, తన జట్టు సాధించిన మూడవ టైటిల్‌ను సూచిస్తూ వేళ్లతో '3' అని సంజ్ఞ చేస్తూ ఆమె చేసుకున్న సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్లో నిరాశ ఎదురైనా, సౌత్ ఆఫ్రికా లీగ్‌లో మాత్రం కావ్య మారన్ సేన వరుస విజయాలతో దూసుకుపోతుండటం విశేషం.
కెప్టెన్ స్టబ్స్ స్పందన..
"ఈ విజయం కలిగించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఒత్తిడిలో ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. నేను, మ్యాటీ క్రీజులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాం. 16వ ఓవర్ తర్వాత మాకు ఊపు వచ్చింది, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు" అని స్టబ్స్ వ్యాఖ్యానించాడు.
Also REad: Raviteja Irumudi: హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా: 'ఇరుముడి'తో భక్తి మార్గంలో రవితేజ..ఈసారి హిట్ పక్కా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Post GDS Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారత తపాలా శాఖ (India Post) అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది.
భారత తపాలా శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల: జనవరి 31, 2026.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 31, 2026.
చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2026.
ఫీజు చెల్లింపు గడువు: ఫిబ్రవరి 16, 2026.
ఎంపికైన వారి జాబితా (Merit List): ఫిబ్రవరి 28, 2026.
ఖాళీల వివరాలు..
మొత్తం 28,740 పోస్టులలో తెలుగు రాష్ట్రాల వాటా ఇలా ఉంది.
ఆంధ్రప్రదేశ్: 1,060 పోస్టులు.
తెలంగాణ: 609 పోస్టులు.
తమిళనాడు: 2,009 పోస్టులు.
కర్ణాటక: 1,023 పోస్టులు.
అర్హతలు & వయోపరిమితి..
భారత తపాలా శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుల భర్తీకి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థికి స్థానిక భాషపై పట్టు ఉండాలి. సైకిల్ లేదా ద్విచక్ర వాహనం నడపడం తెలిసి ఉండాలి.
వయస్సు: 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం & జీతం..
అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల (మెరిట్) ఆధారంగానే ఎంపిక చేస్తారు.
జీతం: BPM: ₹12,000 నుండి ₹29,380 వరకు.
ABPM: ₹10,000 నుండి ₹24,470 వరకు.
దరఖాస్తు ఎలా చేయాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31 నుండి అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
(గమనిక: తక్కువ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. మరిన్ని వివరాల కోసం జనవరి 31న విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌ను గమనించగలరు. పైన పేర్కొన్న సమాచారం కేవలం కొంత అంచనా మాత్రమే. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Raviteja Irumudi: హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా: 'ఇరుముడి'తో భక్తి మార్గంలో రవితేజ..ఈసారి హిట్ పక్కా?
Also Read: EPS 95 Pension Budget: ఉద్యోగులకు బడ్జెట్ ధమాకా! కనీస పెన్షన్ రూ.7,500 పక్కా?! ఎప్పటి నుంచి అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Raviteja Irumudi: హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా: 'ఇరుముడి'తో భక్తి మార్గంలో రవితేజ..ఈసారి హిట్ పక్కా?
Ravi Teja Irumudi Movie Announcement: మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు (జనవరి 26) సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ, తన 77వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పవర్ ఫుల్ 'బౌన్స్ బ్యాక్' ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
రవితేజ కెరీర్లో 'ధమాకా' తర్వాత సరైన కమర్షియల్ సక్సెస్ లేక ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇటీవల వచ్చిన 'భర్తమహాశయులకు విజ్ఞప్తి'తో కాస్త ఊపిరి పీల్చుకున్న రవితేజ, ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో RT77 ప్రాజెక్టును పట్టాలెక్కించారు.
పవర్ ఫుల్ టైటిల్..'ఇరుముడి'
ఈ సినిమాకు 'ఇరుముడి' అనే వైవిధ్యమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సనాతన ధర్మంలో, ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులకు 'ఇరుముడి' ఎంత పవిత్రమైనదో మనకు తెలిసిందే. రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆయన అయ్యప్ప మాల ధరించి, భక్తుల కోలాహలం మధ్య ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
ఎమోషనల్ స్టోరీ
దర్శకుడు శివ నిర్వాణ అంటేనే భావోద్వేగాలకు పెట్టింది పేరు. ఈ చిత్రం కూడా ఒక తండ్రి – కూతుళ్ల మధ్య సాగే హృద్యమైన ఎమోషనల్ డ్రామా అని సమాచారం. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు గుండెకు హత్తుకునే సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతోంది.
టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ ఈ చిత్రానికి బాణీలు కడుతున్నారు. రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తోంది.
రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతారా?
'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు', 'మిస్టర్ బచ్చన్' వంటి సినిమాలు వరుసగా నిరాశపరిచిన నేపథ్యంలో రవితేజకు ఈ సినిమా విజయం చాలా కీలకం. భక్తి, ఎమోషన్, మాస్ అంశాల మేళవింపుగా వస్తున్న 'ఇరుముడి' రవితేజను మళ్లీ రూ.100 కోట్ల క్లబ్లో చేరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Vijay Shanthi Husband: నటి, MLC విజయశాంతి భర్తని చూశారా..ఆయన ఏం చేస్తారో తెలుసా..?
Also Read: Bank Strike 2026: తెలుగు ప్రజలకు అలర్ట్..రేపు అంతా బంద్..ఇప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees Civil Services Rules: తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా.. నిబంధనలు ఉల్లంఘించినా ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగం పటిష్టంగా నిర్వహించాల్సి ఉండగా.. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీసుకువచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలతో ఉద్యోగుల మెడపై కత్తి వేలాడనుంది.
Also Read: HIV Injection: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు
ప్రభుత్వ ఉద్యోగుల అనధికారిక గైర్హాజరుపై కఠిన నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు గైర్హాజరు కావడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (నియమావళి, నియంత్రణ, అప్పీల్) రూల్స్-1991కి సవరణలు చేసింది. కొత్త నిబంధనలు తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన సవరణల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి పలు కారణాల రీత్యా విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తారు.
Also Read: Pamda Awards 2026: పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఎవరెవరికి ఇచ్చారంటే..?
అనుమతి లేకుండా గైర్హాజరు: ప్రభుత్వ ఉద్యోగానికి ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెడితే ఉద్యోగం కోల్పోతారు. అది ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
దీర్ఘకాలిక గైర్హాజరు: సెలవు మంజూరైనా లేదా కాకపోయినా.. వరుసగా 5 సంవత్సరాలు విధులకు దూరంగా ఉండే ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తారు.
విదేశీ సేవలు: ప్రభుత్వం అనుమతించిన గడువు దాటిన తర్వాత కూడా ఫారిన్ సర్వీస్‌లో కొనసాగితే ఆ ఉద్యోగులను తీసేస్తారు. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటన చేసినా చర్యలు తీసుకుంటారు.
సవరించిన నిబంధనల కింద చర్యలు తీసుకునే ముందు సంబంధిత ఉద్యోగికి వివరణను ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. షోకాజ్ నోటీస్‌కు వారి సమాధానాన్ని పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో కీలక మార్పులు తీసుకురావడంతో ఉద్యోగులు ఇకపై సెలవు పొందాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయేలా నిబంధనలు తీసుకువచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల నిబంధనల్లోని సివిల్ సర్వీసెస్ రూల్స్‌లో రూల్ 9, రూల్ 25కి సవరణలు చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి రావడంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lakshmi Narayana Yoga 2026 Effect On Zodiac: 2026 సంవత్సరం ఫిబ్రవరిలో శుక్రుడు సంచారం చేయబోతోంది. ముఖ్యంగా శని రాశిగా భావించే కుంభంలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారం శుక్రుడు ఫిబ్రవరి 6వ తేదిన చేయబోతోంది. అలాగే అంతకంటే ముందే బుధుడు ఫిబ్రవరి 3న కుంభ రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా శని పాలించే కుంభంలో ఈ రెండు గ్రహాల సంయోగం జరగబోతోంది. ముఖ్యంగా ఇదే సమయంలో ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ రాజయోగం కూడా ఏర్పడబోతోంది. ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశులవారికి ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా మారబోతున్నాయి. అంతేకాకుండా సౌకర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ సంచారంతో సంబంధాల్లో అద్భుతమైన మాధుర్యం కూడా పెరుగుతుంది. వివాహ జీవితంలో సమతుల్యత కూడా లభిస్తుంది. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి:
శుక్రుడి సంచారంతో ఏర్పడే యోగంతో మేష రాశివారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు భారీ మొత్తంలో డబ్బు కూడా పొందుతారు. వ్యాపారాలు కూడా లాభసాటిగా మారుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీరు భవిష్యత్‌లో అద్భుతమైన విజయాలు సాధించే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సమయంలో ఆదాయాన్ని భారీ మొత్తంలో పొందుతారు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న గొడవలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ప్రేమ సంబంధాలు కూడా సమతుల్యంగా మారుతాయి.
కర్కాటక రాశి:
శుక్రుడి సంచారంతో కర్కాటక రాశివారికి స్థానికంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి మతపరమైన అంశాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు రావడం ప్రారంభమవుతాయి. జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. అలాగే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
సింహరాశి:
ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ రాజయోగంతో జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే సింహ రాశివారికి ఇంట్లో ప్రశాంత వాతావరణం కూడా నెలకొంటుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన పదోన్నతులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. పొదుపు చేయాలి అనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. ఆలాగే తీవ్ర సమస్యలతో బాధపడేవారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
మకర రాశి:
శుక్రుడి సంచారంతో మకర రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి వ్యక్తుత్వం కూడా ఆకర్షణీయంగా మారుతుంది. దీంతో పాటు ప్రేమ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. భావోద్వేగాలు కూడా మెరుగుపడతాయి. దీర్ఘకాలిక కోరికలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం సాధారణంగా మారుతుంది. వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి. ఉన్నతాధికారులు మీ పనితో సంతృప్తి కూడా చెందుతారు. అలాగే కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijayashanthi Husband Name: లేడీ అమితాబ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తన సినీ, రాజకీయ ప్రయాణంలో వెన్నంటి నిలిచిన తన భర్త గురించి, తన జీవితంలో ఎదురైన భావోద్వేగ సంఘటనల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
విజయశాంతి కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఎన్నో పోరాటాలు చేశారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెకు, తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ కొండంత అండగా నిలిచారు.
మర్చిపోలేని విషాదం..
విజయశాంతి జీవితంలో మర్చిపోలేని విషాదం ఆమె తండ్రి మరణం. 'దేవాలయం' సినిమా షూటింగ్ సమయంలో, తండ్రి చితికి నిప్పు పెట్టే సన్నివేశంలో ఆమె నటిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో చెన్నైలో ఆమె తండ్రి కన్నుమూశారు. షూటింగ్ పూర్తయ్యాక దర్శకుడు టి.కృష్ణ ఈ విషయాన్ని చెప్పడంతో ఆమె కుప్పకూలిపోయారు. ఏడాది వ్యవధిలోనే తల్లి కూడా మరణించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా అంధకారమైంది.
తల్లిదండ్రుల మరణం తర్వాత ఒంటరితనం వెంటాడుతున్న సమయంలో శ్రీనివాస్ ప్రసాద్ ఆమె జీవితంలోకి వచ్చారు. పెద్దల అండ లేకపోయినా, ఆమెకు తోడుగా నిలిచి వివాహం చేసుకున్నారు. తన భర్తను దేవుడు పంపిన బహుమతిగా విజయశాంతి అభివర్ణించారు.
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ ముగుస్తుందని భావిస్తారు, కానీ విజయశాంతి విషయంలో అది రివర్స్ అయింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన శ్రీనివాస్ ప్రసాద్, స్వయంగా సినిమాలు నిర్మించి ఆమెను ప్రోత్సహించారు. ఆమెకు నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన 'కర్తవ్యం' సినిమా నిర్మాణంలో ఆయన పాత్ర కీలకం. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా డూప్ లేకుండా ఫైట్స్ చేసేలా ఆమెను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేసింది ఆయనే.
సినిమాల్లో హీరోలకు సమానమైన ఇమేజ్ సంపాదించడమే కాకుండా, రాజకీయాల్లోకి ఆమె అడుగుపెట్టినప్పుడు కూడా శ్రీనివాస్ ప్రసాద్ సరైన దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ప్రయాణంలోనూ ఆయన మద్దతు కొనసాగుతోంది.
విజయశాంతి భర్త గురించి క్లుప్తంగా:
పేరు: శ్రీనివాస్ ప్రసాద్.
వృత్తి: సినీ నిర్మాత (గతంలో పలు చిత్రాలను నిర్మించారు).
ప్రస్తుత స్థితి: ఆయన లైమ్ లైట్ (ప్రచారానికి) దూరంగా ఉండటాన్ని ఇష్టపడతారు. అందుకే ఆయన తాజా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్దగా కనిపించవు.
Also Read; Bank Strike 2026: తెలుగు ప్రజలకు అలర్ట్..రేపు అంతా బంద్..ఇప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోండి!
ALso Read: EPS 95 Pension Budget: ఉద్యోగులకు బడ్జెట్ ధమాకా! కనీస పెన్షన్ రూ.7,500 పక్కా?! ఎప్పటి నుంచి అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook