Back
కామారెడ్డి జిల్లా అక్కాపూర్ లో చిరుత పులి సంచారం.
Kamareddy, Telangana
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్, ఇసాయిపేట అటవీ ప్రాంతంలో చిరుత సంచారం. అక్కాపూర్ కు చెందిన అరిగె నర్సయ్య కు చెందిన లేగదూడ పై దాడి చేసిన చిరుత పులి.అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని లేగదూడను పరిశీలించి దాడి చేసింది చిరుతగా అనుమానం వ్యక్తం చేస్తూ ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు.
పశువులను అటవీ ప్రాంతంలో మేపవద్దని, ఒంటరిగా అటవీ శివారు ప్రాంతం కు వెళ్లొద్దని సూచించిన అటవీ అధికారులు.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో కురిసిన భారీ వర్షానికి సోమారం-సోమారం తండా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బతుకమ్మ వాగు ఉదృతంగా ప్రవాహించడంతో వాగు అవతల సుమారు 20 మంది విద్యార్థులు, 30మంది రైతులు చిక్కుకున్నారు.
సోమారం తండాకు చెందిన విద్యార్థులు సోమారం గ్రామంలో గల స్కూల్ కు వెళ్లి తిరిగి సాయంత్రం వస్తుండగా భారీ వర్షం కురియడంతో ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు తిరిగి సాయంత్రం వస్తుండగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు అవతలీ వైపు చిక్కుకున్నారు. ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు తరలించారు.
14
Report
Gollet, Telangana:
పారిశ్రమిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్లో పారిశుధ్యం మీద ద్రుష్టి పెట్టిన సింగరేణి అధికారులు మురికి గుంతల నిర్మూలన మర్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాలనీ శివారు ప్రాంతాలలో మురికి నీరు నిలువ ఉండి అందులో ప్రా నాంతకమైన దోమలు, ఈగలు అభివృద్ధి చెంది మలేరియా, టైపాయిడ్, డెంగి వంటి వ్యాదుల ప్రభలుతున్నాయి. ముఖ్యంగా టౌన్షిప్లోని డ్రైనేజి నీరు గుంతలలొ నీరు నిలువ ఉండిదుర్గంధం వెదజల్లడం తోపాటు రకరకాల రోగాలు రావడానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోలాని జనం కోరుతున్నారు.
14
Report
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరవరం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 32 క్వింటల్ల రేషన్ బియ్యం తో ఉన్న బొలెరో వాహనం పట్టుకొని సీజ్ కేసు నమోదు చేసిన గాంధారి పోలీసులు. ప్రభుత్వము పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్న వారిపై నిఘా పెట్టామని,అక్రమంగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న కోటగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ ఉమేర్ కేసు నమోదు చేశారు.సంబంధిత అధికారులకు పీడీఎస్ రేషన్ బియ్యం అప్పగించినారు,
14
Report
Adloor, Telangana:
కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ ప్రజెంటేషన్ పాయింట్ ( PPP ) ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంప గోవర్ధన్ పార్టీ ఆఫీస్ లో LED స్క్రీన్ పెట్టి జిల్లా ముఖ్యనాయకులు సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విక్షించారు.
ఇట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలు వీక్షించారూ
16
Report
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గోకుల్ తాండ అటవీ ప్రాంతంలో ఆవుపై పెద్ద పులి దాడి చేసి ఇప్పటికి 18 రోజులు గడుస్తుంది.ఫారెస్ట్ అధికారులు ఐదు బృందాలతో డ్రోన్ కెమెరాలతో ఫారెస్ట్ మొత్తం జల్లెడ పట్టిన ఇప్పటికీ జాడలేదు. అవును చంపిన పెద్దపులిపై రైతు విష ప్రయోగం చేశాడని, విష ప్రయోగానికి సహకరించిన వారితోపాటు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. పెద్ద పులి విష ప్రయోగం జరిగిన ఈపాటికి గుర్తించేవాళ్లం అని DFO నికిత అన్నారు, లేక పెద్దపులి మన ఫారెస్ట్ క్రాస్ అయ్యి ఉంటుందని తెలిపారు..Dfo
16
Report
Gollet, Telangana:
మండలకేంద్రమైన రెబ్బేనతో పాటు గంగాపూర్, నంబాల, నారాయణపూర్, గోలేటి విలేజి, గోలేటి టౌన్షిప్, గోలేటి క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాలలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచి కొట్టింది. ఉదయంనుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వాన ఊరటనిచ్చింది. పత్తి, కంది పంటలకు ఈ వాన ఎంతో మేలు చేస్తుందని రైతులు సంబరపడుతున్నారు. ఐతే వరి పంటకు ఈ వానలు సరిపోవని, మరిన్ని వర్షాలు పడాలని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
14
Report
Hyderabad, Telangana:
నాలుగు గంటల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషా ముల్లపూడి ప్రధాన రహదారి తో పాటు తులసి వనం వద్ద భారీ వర్షానికి వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో విషయం తెలుసుకున్న ఆల్బం కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ హుటాహుటిన అక్కడికి చేరుకొని జిహెచ్ఎంసి, మాన్సూన్ సిబ్బందితో నీటిని క్లియర్ చేసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
14
Report
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నియోజకవర్గ హమాలీ సంఘాల సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జీ. సామ్రాజ్యం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న హమాలీలను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు హమాలీ సభ్యుల సంక్షేమం కోసం హమాలీ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నాయకులు గెల్లి రాజలింగు, హమాలీ సభ్యులు పాల్గొన్నారు.
15
Report
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం, హనుమాన్ బస్తి 33వ వార్డులో నెలకొన్న నీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు పోలు శ్రీనివాస్, బస్తీ ప్రజలు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ నీటీ సమస్యతో వార్డ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం బోర్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా డ్రైనేజీ, రోడ్ లు నిర్మించాలని కోరారు.
15
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలం గోలేటి విలేజిలో శనివారం జోరు వాన కురిసింది.సుమారు 4:30 గంటలకు కైరిగూడలో మొదలైన వాన గోలేటి టౌన్ షిప్, దుబ్బగూడ, భగత్ సింగ్ నగర్, గాతమ్ నగర్, అంబెడ్కర్ నగర్ల మీదుగా గోలేటి క్రాస్ రోడ్డు వరకు దంచి కొట్టింది.వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, రైతు కూలీలు అర్ధంతరంగా చేన్ల నుంచి వానలోతడుస్తూ ఇండ్లకు చేరుకున్నారు. ఈ వాన వ్యవసాయదారులకు మంచే చేస్తుందని రైతులు అభిప్రాయం పడుతున్నారు.
14
Report
Shadnagar, Telangana:
శ్రీశైలం పాతాళ గంగకు విహారయాత్రకు వెళ్లిన నలుగురు స్నేహితులు కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా, ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడిని మత్స్యకారులు చాకచక్యంగా కాపాడారు. యువకుడు కొట్టుకుపోతుండటం గమనించిన మత్స్యకారులు వెంటనే పడవలో వెళ్లి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన మత్స్యకారులను పలువురు అభినందించారు.
14
Report
Gollet, Telangana:
మండల కేంద్రమైన రెబ్బేనతో పాటు పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి, ఖైరిగూడ, సోనాపూర్, దుగ్గాపూర్, తదితర గ్రామాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. గత వారంలో ఆకాశం మేఘావృతమై తేలికపాతీ వర్షాలు కురువగా వాతావరణం చల్లగా ఉండగా,ఈ వారంలో రెండు మూడు రోజులనుంచి ఉస్నోగ్రతలు 35కు పెరిగి ప్రతాపం చూపిస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు చేన్లకు వెళ్లే రైతులు, రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 5నుంచి అల్పపీ డనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ సూచనలు ఉన్నా ప్రస్తుతం ఎండలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయి.
14
Report
Medak, Telangana:
3/8/2025 ఆదివారం శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ*అభిషేకం హారతి దివ్య దర్శనంఆదివారం శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ*అభిషేకం హారతి దివ్య దర్శనం
15
Report
Nerpalle, Telangana:
గత కొద్ది రోజులుగా పారిశుద్యంపై అంతగా పట్టింపు లేని అధికారులు ప్రస్తుతం వేగం పెంచారు అధికంగా సింగరేణి కార్మికులు నివాసం ఉండే గోలేటి టౌన్షిప్లో ఆరు పోర్షన్లు, రెండు పోర్షన్లు, ప్రధాన రహదారి ప్రాంతాలలో పిచ్చి మొక్కల తొలగింపు, మురికి కాలువల్లో పూడిక తీయడం, చెత్తకుండిల వద్ద బ్లీచింగ్ పౌడర్ వేయడంలాంటి పనులు చేస్తున్నారు. అదే విదంగా విద్యుత్ సరపరాలో అంతరాయం కలుగకుండా విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మలు తీస్తున్నారు. కొన్నిచోట్లా మురికి గుంటలు ఉన్నాయని, నీరు నిలువకుండా చూడాలని జనం కోరుతున్నారు.
14
Report