icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Pinewz
502110
SRSilver RajeshFollow6 Sept 2025, 05:14 am

మెదక్ పట్టణంలోని సాయి నగర్ కాలనీ మణికంఠ గణేష్ మండలి ఆధ్వర్యంలో కాశీ తలపించిన నవరాత్రి ఉత్సవం.

Medak, Telangana:మెదక్ పట్టణంలో సాయి నగర్ కాలనీ మణికంఠ గణేష్ మండలిలో నవరాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వారణాసి బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ప్రత్యేకంగా సాయి నగర్ గణేష్ మండలిలో వీనుల విందైన అద్భుత మహత్తర హారతి ద్వారా పౌరాణిక సందేశాలను అందించాయి. ఈ ఉత్సవంలో, గణేష్ విగ్రహ నిమజ్జనం సమయంలో విశేషమైన పూజా విధానాలు జరుపబడ్డాయి. కాశీని తలపించిన ఈ వేడుకలు మెదక్ పట్టణానికి ఒక మకుటాయమానంగా నిలిచాయి.ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవం సాయి నగర్ మండలికి ప్రత్యేక స్థానం ఇచ్చింది.
0
0
Report
Pinewz
502110
SRSilver RajeshFollow3 Sept 2025, 03:02 pm

భారీవర్షలకు దెబ్బతిన్న పోచారం డ్యామ్ వరదకు నష్టపోయిన రైతులను పరామర్శించి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

Medak, Telangana:ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వలన వర్ష ఉధృతికి దెబ్బతిన్న పోచారం డ్యామ్ ను మరియు వరదకు నష్టపోయిన రైతులను పరామర్శించి మాట్లాడుతూ నేనున్నానని భరోసా తెలియజేస్తూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నష్టపోయిన రైతులకు మరియు వరద బాధితులకు ఈరోజు మరొకసారి నేనున్నాను అని చెప్పేసి మనోధర్యం తెలియజేశాడు. బాధితులు అందరికీ నష్టపరిహారం చెల్లిస్తానని నేను కూడా మీలో ఒకడ్ని అని బాధితులందరికీ తెలిపారు. ఈ సందర్భంగా మనోధైర్యం ఇచ్చినటువంటి ఎమ్మెల్యేకు ప్రజలు ఒక నమ్మకంతో ఆత్మస్వర్యం నింపుకున్నారు.
0
0
Report
Advertisement
Pinewz
502110
SRSilver RajeshFollow25 Aug 2025, 02:08 pm

మట్టి విగ్రహాలని పూజించాలని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపినారు.

Medak, Telangana:ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలని పూజించాలని వివిధ రంగులతో విష రసాయనాలతో తయారుచేసిన వినాయక ప్రతిమలను పూజకు వినియోగించరాదని రంగురంగుల విగ్రహాలు అత్యంత ప్రమాదకరమని నిమజ్జనంలో నీటిలోని జీవరాశులకు హాని చేస్తాయన్నారు. మట్టి ప్రతిమాలను పూజించి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములం అవుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి బాలకృష్ణ వారి బృందం తదితరులు పాల్గొన్నారు.
0
0
Report
Pinewz
502110
SRSilver RajeshFollow25 Aug 2025, 01:27 pm

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

Medak, Telangana:సోమవారం జిల్లా కలెక్టర్ తూప్రాన్ లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా రత్నాపూర్ గ్రామంలోని హల్దీ వాగు వంతెన నిర్మాణ పనులు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణపురోగతిని పరిశీలిస్తూ త్వరితగతిన ఇండ్లు నిర్మించుకోవాలని పేదవారి సొంతింటి కల నెరవేర్చుకోవాలని తెలిపారు. గ్రామ పరిసరాలను పరిశీలిస్తూ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0
0
Report
Advertisement
Back to top