Back
KASARLA RAMESHరేపు ప్రధమ మండల పూజకు హాజరుకానున్న మంత్రి వివేక్
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న ప్రధమ మండల పూజా కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి,స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు కోడి రమేష్ ఆదివారం తెలిపారు.ఆయన మాట్లాడుతూ ప్రథమ మండల పూజకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పూజకు నియోజకవర్గం వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు
47
Report
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల దృవపత్రాలు అందజేత
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ అదేశాల మేరకు 31వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు లెంకల శ్రావణ్ ,లెంకల.శ్రీనివాస్ ,బుకాల రంజిత్ కుమార్, మాజి కౌన్సిలర్ రాజలింగుల అద్వర్యంలో ప్రొసీడింగ్ కాపీలను శనివారం అందజేశారు.వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. ఈ సందర్బంగా లబ్దిదారులు ఎమ్మెల్యేకి దాన్యవాదాలు తెలిపి సంతోషం వ్యక్తం చేసారు.
0
Report
కాల్ టెక్స్ లో భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో బోద్దున శంకర్ కు చెందిన ఇంటి గోడ శనివారం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. ఎటువంటి నిలువ నీడ లేని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో వాపోయారు. వెంటనే మాజీ కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ తహసీల్దార్ కి సమాచారం అందించారు. సోమవారం RI ని పంపి పంచనామా చేయిస్తామని తహసీల్దార్ తెలిపారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు.
15
Report
అక్రమంగా చేసుకున్న పట్టా రద్దు చేయాలి
Bellampalle, Telangana:
బెల్లంపల్లి మండలం మాల గురిజాల గ్రామంలో 3 గుంటల భూమికి బదులు 13 గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న గ్రామానికి చెందిన కామెర నారాయణపై అధికారులు చర్యలు తీసుకోని, అక్రమ పట్టా రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి తమ భూమిని గుర్తించి తమకు దక్కేలా చేయాలని వేడుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న గోమాస శ్రీకాంత్ పై స్థానిక నేతకాని నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని నేతకాని మహర్ జిల్లా అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు మండిపడ్డారు.
15
Report
Advertisement
విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధానకార్యదర్శిగా జన్నం సత్యనారాయణ
Bellampalle, Telangana:
బెల్లంపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధానకార్యదర్శిగా హనుమాన్ బస్తీకి చెందిన జన్నం సత్యనారాయణ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణలు సంఘటితంగా తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు వారి అభివృద్ధికి కృషి చేస్తానని,సంఘం అభివృద్ధిలో తన వంతు పాత్ర ఉంటుందని తెలిపారు.
15
Report