Back
BHARATH MUNJAMరెబ్బెన మండలాన్ని వీడని తుఫాను వర్షాలు
Gollet, Telangana:
మొంత తుఫాను కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రెబ్బెన మండలాన్ని వీడటం లేదు. మండల కేంద్రమైన రెబ్బెనతో పాటు పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి, మండలంలోని పలు గ్రామాల్లో గత మూడు రోజుల నుంచి గంట గంటకు వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పత్తి సేకరించె సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి పంట వేస్తే అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2
Report
రెబ్బెన మండలం గోలేటిలో భారీ వర్షం
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన గోలేటిలో శుక్రవారం రాత్రి సుమారు ఏడు గంటలకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.అప్పటివరకు తేటగా ఉన్న వాతావరణం కొద్దిసేపట్లోనే మార్పు చెంది భారీ వర్షం కురిసింది. మండల కేంద్రమైన రెబ్బెనతో పాటు గోలేటి విలేజ్, గోలేటి క్రాస్ రోడ్,గోలేటి దుగ్గపూర్,కైరిగూడ,సోనాపూర్ తదితర ప్రాంతాలలో వర్షం పడింది.ఇలాంటి అకాల వర్షానికి పత్తి నల్లబడి ధరలు గణనీయన తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
2
Report
రెబ్బెన మండలంలో ఘనంగా దీపావళి పండుగ
Gollet, Telangana:
రెబ్బెన మండలంలో ప్రజలు సోమవారం దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి సందర్భంగా మహిళలు, బాలికలు నూతన వస్త్రాలు ధరించి మంగళ, లక్ష్మీ పూజ కార్యక్రమాలు నిర్వహించారు మండల కేంద్రమైన రెబ్బెన, పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు మండలంలోని ప్రతి గ్రామంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు పిల్లలు, పెద్దలు బాణాసంచా పేల్చారు. సోమవారం సాయంత్రం అందమైన ముగ్గులు వేసి పూలతో అలంకరించి దీపాలు వెలిగించారు
14
Report
రెబ్బెన మండలంలో అతి భారీ వర్షం
Gollet, Telangana:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో సోమవారం అతి భారీ వర్షం కురిసింది. మండల కేంద్రమైన రెబ్బెనతోపాటు పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లో ఉరుములు,మెరుపులతో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. భయంకరమైన ఉరుములు,మెరుపులతోపాటు ఈదురుగాలులతో ప్రజలు బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వాన తో మండలంలోని గంగాపూర్ వాగు, గోలేటి గుండాల వాగు,నంబల వాగు మండలంలోని చిన్నచితక ఒర్రెలు వేగంగా ప్రవహించాయి. అదేవిధంగా మండలంలోని పలు చెరువుల్లో మత్తడిదుంకి నీరు ప్రవహించింది.
12
Report
Advertisement
అర్హులైన ట్రాన్స్పోర్ట్ కార్మికులందరికీ ఇన్సెంటివ్ ఇవ్వాలి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాస్తారోకో
Gollet, Telangana:
అర్హులైన ట్రాన్స్పోర్ట్ కార్మికులకు,డ్రైవర్లు,క్లీనర్లకు వెంటనే 5500 ఇన్సెంటివ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిహెచ్పి వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు బోగే ఉపేందర్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే చాలామంది కార్మికులకు ఇన్సెంటివ్ రావడంలేదని మండిపడ్డారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. అధికారుల తప్పిదాల వల్లనే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని వెంటనే ఇన్సెంటివ్ చెల్లించాలన్నారు.
9
Report