Back

వాగులో చిక్కిన విద్యార్థులను ట్రాక్టర్ తో ఓడ్డుకు చేసిన గ్రామస్తులు..
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో కురిసిన భారీ వర్షానికి సోమారం-సోమారం తండా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బతుకమ్మ వాగు ఉదృతంగా ప్రవాహించడంతో వాగు అవతల సుమారు 20 మంది విద్యార్థులు, 30మంది రైతులు చిక్కుకున్నారు.
సోమారం తండాకు చెందిన విద్యార్థులు సోమారం గ్రామంలో గల స్కూల్ కు వెళ్లి తిరిగి సాయంత్రం వస్తుండగా భారీ వర్షం కురియడంతో ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు తిరిగి సాయంత్రం వస్తుండగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు అవతలీ వైపు చిక్కుకున్నారు. ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు తరలించారు.
14
Report
కామారెడ్డి జిల్లా అక్కాపూర్ లో చిరుత పులి సంచారం.
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్, ఇసాయిపేట అటవీ ప్రాంతంలో చిరుత సంచారం. అక్కాపూర్ కు చెందిన అరిగె నర్సయ్య కు చెందిన లేగదూడ పై దాడి చేసిన చిరుత పులి.అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని లేగదూడను పరిశీలించి దాడి చేసింది చిరుతగా అనుమానం వ్యక్తం చేస్తూ ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు.
పశువులను అటవీ ప్రాంతంలో మేపవద్దని, ఒంటరిగా అటవీ శివారు ప్రాంతం కు వెళ్లొద్దని సూచించిన అటవీ అధికారులు.
14
Report
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన గాంధారి ఎస్ఐ
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరవరం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 32 క్వింటల్ల రేషన్ బియ్యం తో ఉన్న బొలెరో వాహనం పట్టుకొని సీజ్ కేసు నమోదు చేసిన గాంధారి పోలీసులు. ప్రభుత్వము పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్న వారిపై నిఘా పెట్టామని,అక్రమంగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న కోటగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ ఉమేర్ కేసు నమోదు చేశారు.సంబంధిత అధికారులకు పీడీఎస్ రేషన్ బియ్యం అప్పగించినారు,
14
Report
కాలేశ్వరం పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి . హరీష్ రావు
Adloor, Telangana:
కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ ప్రజెంటేషన్ పాయింట్ ( PPP ) ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంప గోవర్ధన్ పార్టీ ఆఫీస్ లో LED స్క్రీన్ పెట్టి జిల్లా ముఖ్యనాయకులు సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విక్షించారు.
ఇట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలు వీక్షించారూ
16
Report
Advertisement
20 రోజులు గడిచిన పెద్దపులి జాడేది..?
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గోకుల్ తాండ అటవీ ప్రాంతంలో ఆవుపై పెద్ద పులి దాడి చేసి ఇప్పటికి 18 రోజులు గడుస్తుంది.ఫారెస్ట్ అధికారులు ఐదు బృందాలతో డ్రోన్ కెమెరాలతో ఫారెస్ట్ మొత్తం జల్లెడ పట్టిన ఇప్పటికీ జాడలేదు. అవును చంపిన పెద్దపులిపై రైతు విష ప్రయోగం చేశాడని, విష ప్రయోగానికి సహకరించిన వారితోపాటు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. పెద్ద పులి విష ప్రయోగం జరిగిన ఈపాటికి గుర్తించేవాళ్లం అని DFO నికిత అన్నారు, లేక పెద్దపులి మన ఫారెస్ట్ క్రాస్ అయ్యి ఉంటుందని తెలిపారు..Dfo
16
Report