Back

యువకుడిని కాపాడిన మత్స్యకారులు
Shadnagar, Telangana:
శ్రీశైలం పాతాళ గంగకు విహారయాత్రకు వెళ్లిన నలుగురు స్నేహితులు కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా, ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడిని మత్స్యకారులు చాకచక్యంగా కాపాడారు. యువకుడు కొట్టుకుపోతుండటం గమనించిన మత్స్యకారులు వెంటనే పడవలో వెళ్లి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన మత్స్యకారులను పలువురు అభినందించారు.
14
Report