ఓల్డ్ బోయిన్ పల్లిలో భారీగా తీరంగా ర్యాలీ
స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, ఓల్డ్ బోయిన్పల్లి లో 400 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని ఊరేగించడం జరిగింది. అస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం నుండి బోయిన్పల్లి వార్డు ఆఫీసు వరకు స్థానిక ప్రజలతో కలిసి జాతీయ జెండా పట్టుకుని స్కూల్ చిన్నారులతో కలసి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్, కర్రే జంగయ్య, ఇజాజ్, హరినాథ్, మక్కల నరసింగ్ రావు, ఇతర నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలకు ఉచిత ఆటో శిక్షణ తరగతులు
తెలంగాణ మహిళ సహకారక అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, కూకట్ పల్లి లోని దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రంలో ఉచిత ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు ఈ శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందగలరని, కుటుంబానికి అండగా నిలబడగలరని చెప్పారు. మహిళలు కొన్ని రంగాల్లో మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి రంగంలోనూ ప్రతిభ చూపించాలి అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల క్రాంతి వెస్లీ పాల్గొన్నారు.
KPHB కాలనీ లో అగ్నిప్రమాదం
కూకట్ పల్లికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంకాళి నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఆ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, అప్పటికే ఆ యువకుడితో అమ్మాయి కుటుంబీకులు గొడవ పడ్డారు. సోమవారం రాత్రి బాలిక నిజాంపేట రోడ్డులోని వైన్స్‌కు స్నేహితులతో కలిసి వెళ్తుండగా.. అన్నయ్య బీరు బాటిల్‌తో దాడి చేశాడు. విద్యార్థిని ఇంటికి వెళ్లి రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రియల్ ఎస్టేట్ మోసంలో కోట్ల వసూలు, నిందితుడు అరెస్ట్
KPHB పోలీసులు షణ్ముఖ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరిట మోసాలకు పాల్పడుతున్న గిద్దలూరి నాగేంద్ర చారిని అరెస్ట్ చేశారు. నిందితుడు వికారాబాద్ జిల్లాలో 17 ఎకరాల్లో ప్లాట్లు అమ్ముతానని చెప్పి, బాధితుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. సుజాత, సరిత మరియు మరొకరి నుండి రూ.1.5 కోట్లు తీసుకొని, రిజిస్ట్రేషన్ చేయకుండా మాయమయ్యాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు పట్టుబడ్డాడు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం, నిరసన
బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపుతో బాలాజీ నగర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొమ్మిది నెలల పాలనలో ప్రభుత్వం ఏమీ సాధించలేదని, ముఖ్యమంత్రి కేవలం ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని ఆరోపించారు. క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వచ్చిన లారీ
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కేపి.హెచ్.బి నుండి కూకట్ పల్లి కి వెళ్తున్న లారీ ఒక్కసారి వివేకానంద నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ పైకు దూసుకుని వెళ్ళింది దీనితో అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
ఆలయ నిర్వాహకులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
అవగాహన ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్
అవినీతి ప్రొఫెసర్ల పై చర్యలు తీసుకోండి
కూకట్ పల్లి లో ఘనంగా ప్రారంభమైన శ్రీజగన్నాథ స్వామి రథయాత్ర
కూకట్‌పల్లి ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో హైదర్‌నగర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కూకట్‌పల్లిలోని బాలానగర్‌కు చేరుకుంటుంది. భక్తులు, మహిళలు, యువకుల ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలతో రథయాత్ర ఘనంగా సాగింది. హిందూ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా ఈ జగన్నాథ రథయాత్ర కొనసాగుతుందని వేలాదిగా పాల్గొన్న భక్తులు నృత్యాలు చేస్తూ కోలంటాళ్లు ఆడుతూ ఆటపాటలతో కన్నుల పండుగగా కొనసాగుతుందని వారు తెలిపారు
KPHB లో హత్యాచారం చేయడానికి ప్రయత్నించిన నిందితుడు అరెస్ట్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి
KPHB లో సైబరాబాద్ సీపీ ఆకస్మిక తనిఖీలు
కూకట్ పల్లిలో బీజేవైఎం నాయకులు నిరసన తెలిపారు
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేస్తోందని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్ ఘాటుగా అన్నారు. ఈరోజు కూకట్ పల్లి MMRO కార్యాలయంలో రాష్ట్ర BJYM శాఖ అధ్యక్షులు చేవెళ్ల మహేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో మెగా డీఎస్సీలు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలన్నారు.
KPHB లో రోడ్డు ప్రమాదం బైక్ ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ 658వ నెంబరులో ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో చిన్నారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హైదర్‌నగర్ నుంచి తప్పుడు మార్గంలో అవతల వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన చిన్నారావును మియాపూర్ నుంచి కేపీహెచ్‌బీకి వస్తున్న ఏపీ25 జెడ్ 3620 నెంబరు గల బస్సు ఢీకొట్టడంతో చికిత్స నిమిత్తం వెంటనే మృతి చెందాడు.
JNTU వర్సిటీలోని క్యాంటీన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూకట్ పల్లి ఎమ్మెల్యే భేటి
లార్వా పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం: GHMC అధికారులు
కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ లో ఉన్నటువంటి ప్రగతి నగర్ చెరువులో దోమల లార్వా పెరగకుండా నివారించేందుకు ఎంట్రమాలజీ అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక కాలనీ వాసులతో కలిసి చెరువులో MOL ఆయిల్ బాల్స్ వేసి లార్వా పెరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు . అనంతరం చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్క పై మందును పిచికారి చేశారు.
కేపీహెచ్‌బీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు
కె.పి.హెచ్. బి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు మాల్స్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నెక్సస్ మాల్, లులు మాల్ లలో తనిఖీలు నిర్వహించారు. ప్రజలు పెద్దఎత్తున గుమికూడే మాల్స్‌లో బాంబు నిర్వీర్య స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. దీంతో అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి సెక్యూరిటీ సమస్య గురించి తెలియజేశారు.
పెండింగ్ పనులలో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్ పల్లి నియోజకవర్గనికి సంబంధించి అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి తో పాటు, మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ ఈటెల రాజేందర్ ని కలిసేందుకు తాను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను అని వెల్లడించారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రభుత్వాలు మారిన ప్రజలకు చేసే అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
పీజీ ఈ సెట్ పరీక్ష ఫలితాలు విడుదల
వర్షం వస్తే ప్రగతి నగర్ లో నరకమే
ఆర్ఓబి పై నిలిచిన వర్షపు నీరు తొలగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్
KPHB ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్వామి, ట్రాఫిక్ పోలీసులు చురుగ్గా వ్యవహరించడమే కాకుండా డ్రైవర్ల ప్రయాణం సాఫీగా సాగేందుకు అన్ని విధాలా కృషి చేస్తారని నిరూపించారు. భారీ వర్షాల కారణంగా ROB ఫ్లైఓవర్‌పై వరద నీరు వచ్చి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మునిసిపల్ కార్మికుల కోసం ఎదురుచూడకుండా వరద నీటిని తొలగించి, ట్రాఫిక్ అంతరాయాన్ని అదుపు చేస్తూ స్వామి తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ప్రయాణిస్తున్న డ్రైవర్లు స్వామివారి పనిని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు.