Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kumuram Bheem Asifabad504292

చకచకా పారిశుధ్య పనులు -శుభ్రం అవుతున్న కార్మికుల కాలనీలు

Aug 02, 2025 19:22:06
Nerpalle, Telangana
గత కొద్ది రోజులుగా పారిశుద్యంపై అంతగా పట్టింపు లేని అధికారులు ప్రస్తుతం వేగం పెంచారు అధికంగా సింగరేణి కార్మికులు నివాసం ఉండే గోలేటి టౌన్షిప్లో ఆరు పోర్షన్లు, రెండు పోర్షన్లు, ప్రధాన రహదారి ప్రాంతాలలో పిచ్చి మొక్కల తొలగింపు, మురికి కాలువల్లో పూడిక తీయడం, చెత్తకుండిల వద్ద బ్లీచింగ్ పౌడర్ వేయడంలాంటి పనులు చేస్తున్నారు. అదే విదంగా విద్యుత్ సరపరాలో అంతరాయం కలుగకుండా విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మలు తీస్తున్నారు. కొన్నిచోట్లా మురికి గుంటలు ఉన్నాయని, నీరు నిలువకుండా చూడాలని జనం కోరుతున్నారు.
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Aug 03, 2025 04:28:02
Gollet, Telangana:
మండల కేంద్రమైన రెబ్బేనతో పాటు పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి, ఖైరిగూడ, సోనాపూర్, దుగ్గాపూర్, తదితర గ్రామాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. గత వారంలో ఆకాశం మేఘావృతమై తేలికపాతీ వర్షాలు కురువగా వాతావరణం చల్లగా ఉండగా,ఈ వారంలో రెండు మూడు రోజులనుంచి ఉస్నోగ్రతలు 35కు పెరిగి ప్రతాపం చూపిస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు చేన్లకు వెళ్లే రైతులు, రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 5నుంచి అల్పపీ డనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ సూచనలు ఉన్నా ప్రస్తుతం ఎండలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయి.
4
Report
Aug 03, 2025 03:20:01
Medak, Telangana:
3/8/2025 ఆదివారం శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ*అభిషేకం హారతి దివ్య దర్శనంఆదివారం శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ*అభిషేకం హారతి దివ్య దర్శనం
14
Report
Aug 02, 2025 18:34:40
Gollet, Telangana:
పారిశ్రమిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్, గోలేటి విలేజ్ బస్టాండ్ ల పరిసరాల్లో రాత్రి పూట పశువులు తిరుగడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిత్యం KHA OC నుంచి ఈ రోడ్డు మార్గం ద్వారానే వందలాది బొగ్గు లారీలు వెళుతుంటాయి. ప్రధాన రోడ్డుతోపాటు టౌన్షిపులోని అంతర్గత రోడ్ల పైనే పశువులు తిరగడం,విశ్రాంతి తీసుకోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.ఇప్పటికైనా పశువుల యజమానులు తమ పశువులను కొట్టాలలో కట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
14
Report
Aug 01, 2025 02:31:40
Maheshwaram, Telangana:
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెల్లి (గ్రీన్ ఫార్మా సీటీ) కందుకూరు ఫారెస్ట్ రేంజ్  నిర్వహించిన  సీడ్ బాల్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ. ఈ సందర్భంగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... సీడ్ బాల్ పద్ధతి పురాతనమైనది  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. సీడ్ బాల్ కార్యక్రమం ద్వారా పెద్ద పెద్ద అడవిలో మనుషులు వెళ్లలేని ప్రాంతాలలో కూడా మొక్కలను పెంచే అవకాశం ఉంటుందన్నారు. శుభ సందర్భ సమయాలలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
14
Report
Jul 30, 2025 12:24:26
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇందిరా మహిళ శక్తి సంబరాలు అంటూ సభ పెట్టి అందులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణం అని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మసాడి శ్రీదేవి విమర్శించారు. బుధవారం మాట్లాడుతూ మహిళా సంబరాలలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకుండా వెనుక వరుసలో కూర్చోబెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి మహిళను త్వరగా నియమించాలన్నారు. మహిళా సమైక్య భవనాలు నిర్మించకుంటే MLA క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామన్నారు
14
Report
Jul 28, 2025 08:37:56
Hyderabad, Telangana:

గత కొన్ని సంవత్సరాల్లో నడుస్తూ తిరుగుతూ మరణించిన చాలా ఘటనలు బయటకి వచ్చాయి. ఇలాంటి మరో లైవ్ మరణం హైదరాబాదులో చోటు చేసుకుంది. 25 ఏళ్ల రాకేష్ అనే యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతుండగా అకస్మాత్తుగా పడిపోయి మళ్లీ లేచలేకపోయాడు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. కొన్ని రోజులుగా ఇలాంటి ఎన్నో సంఘటనలు सामनेకి వచ్చాయి. ప్రజలు నడుస్తూ, మిత్రులతో మాట్లాడుతూ అనుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు వేడెక్కాయి.

14
Report
Jul 19, 2025 12:02:15
Bellampalle, Telangana:
రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి మండల కేంద్రం లో నిర్వహించిన CPI మండల కౌన్సిల్ సమావేశానికి అయన హాజరయ్యారు. అయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి, కూలీల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి బొంతల లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
13
Report
Jun 25, 2025 15:33:22
Hyderabad, Telangana:
బడుగు బలహీన,కార్మిక వర్గాల కొరకు గత ఎనిమిది సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్న శ్రీదేవి రమేష్ ను బి.జె.ఎం.సి హైదరాబాద్ నగర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు.ఈ మేరకు సోమాజిగూడ,ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బి.జె.ఎం.సి జాతీయ చైర్మన్ బిశ్వ ప్రియ రాయ్ చౌదరి, జాతీయ అధ్యక్షులు అర్నబ్ చటర్జీ, తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ నాగార్జున్ లు శ్రీదేవి రమేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు. కార్మికులు, బాల కార్మికుల భవిష్యత్తు కొరకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు.
0
Report
Jun 24, 2025 17:14:05
Hyderabad, Telangana:
కేస్టోన్ ఉత్సవ్ ద్వారా అమేయ దాబ్లీ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా టూర్ — కృష్ణా: మ్యూజిక్, బ్లిస్ అండ్ బియాండ్ — జూన్ 28, 2025న శిల్పకళా వేదిక హాల్లో ప్రత్యేక కచేరీకి ముందు, ఇండోర్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌తో అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక సంగీత యాత్రకు ముందు అమేయ దాబ్లీ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఈ టూర్ ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.
1
Report
Jun 24, 2025 14:14:50
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారు సర్వేనెంబర్ 64 లో తమ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో మాజీ జడ్పీటీసీ కారుకూరి రామచందర్ అతని అనుచరులు తమపై కక్షగట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పనాస గణేష్ ఆరోపించారు. మంగళవారం మాట్లాడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే తానే ఎమ్మెల్యే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. ఎమ్మెల్యే స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రామచందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.
0
Report
Jun 18, 2025 13:43:40
Hyderabad, Telangana:
ఉద్యోగం కోల్పోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన గోపికృష్ణ (26) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ నెల రోజుల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. దీనితో మనస్థాపానికి గురై రెండు రోజులు ఊరికి వెళ్లి వచ్చిన తర్వాత బుధవారం తాను నివసిస్తున్నారు ఫ్యానుకూరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను భయంతో చనిపోవట్లేదు బాధ భరించలేక చనిపోతున్నానంటూ సూసైడ్ లెటర్ రాసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన పైన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టారు
0
Report
Jun 11, 2025 09:44:27
Hyderabad, Telangana:
పీటా ఇండియా ఎన్జీవో వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు సైన్స్ పాలసీ అడ్వైజర్ అంజన అగర్వాల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణకి సంబంధించిన ఒక టెస్టింగ్ లేబరేటరీ లో అమాయకమైన కుక్కలను కోతులను మరియు ఇతర జంతువులను టెస్టింగ్ పేరిట హింసకు గురి చేస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు.
0
Report
Jun 06, 2025 15:37:39
Hyderabad, Telangana:
గోమాత రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జన్ ఊర్జా మంచ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నిషిత దీక్షిత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యువ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్, బాలస్వామి లు మాట్లాడారు. గోహత్య మహా పాపమని, గోవులను కిరాతకంగా హత్య చేసిన ఏ దేశము ఏ ప్రాంతము అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. గోవులను హత్య చేసిన మహా నేతలు సైతం నేలకొరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
0
Report
Jun 05, 2025 15:00:07
Bhimavaram, Andhra Pradesh:
సామాజిక బాధ్యత,సేవా స్పూర్తితో జిల్లా పోలీస్ శాఖకు హై-టెక్ డ్రోన్ ను అందించిన శాసనసభ ఉపసభాపతి శ్రీ కనుమూరు రఘు రామ కృష్ణ రాజు. జిల్లా పోలీసు శాఖకు మౌలిక వసతులు కల్పనకై విశేష కృషి చేస్తున్న రఘు రామ కృష్ణ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా ఎస్పీ. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నయీం అస్మి తో కలిసి మొక్కలు నాటారు రఘురామకృష్ణరాజు.
0
Report
Advertisement
Back to top