Back
అల్లాదుర్గ్ లో భారీ వర్షం
Bhahirandibba, Telangana
అల్లాదుర్గ్ లో భారీ వర్షం కారనంగా భారీ పంట నష్టం వాటిలింది బహిరందిబ్బ గ్రామంలో తలారి నర్సింలు అనే రైతు పత్తి పంట వేశారు అది వర్షం పడటంతో బాగ వరదనీరు రావడం జరిగింది అ వరద నీరుకు పంట కొట్టుకు పోయిన్ది
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Gollet, Telangana:
రెబ్బన మండలం దుగ్గాపూర్లో శనివారం ఉదయం భారీ వర్ష కురిసింది. మండలంలోని రెబ్బన, గోలేటి క్రాస్ రోడ్డు, గోలేటి విలేజి, గోలేటి టౌన్షిప్, ఖైర్గుడా, సోనాపూర్, తదితర ప్రాంతాలలో భారీ వాన కూటిసింది. పత్తి చేన్లకు ఈ వర్షం ఉపయోగకరంగా ఉందని రైతులు అభిప్రా యపడుతున్నారు. అయితే రాఖీ పండగకు వచ్చిన మహిళలు మాత్రం ఇబ్బది పడ్డారు
14
Report
Gollet, Telangana:
శుక్రవారం వరలక్ష్మి వ్రతం, శనివారం రాఖీ పండగ ల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు బస్టాండ్లు బస్సులు కిటకిటలాడుతున్నాయి. వరుసగా వస్తున్న ఈ పండుగల వేళ అధిక సంఖ్యలో మహిళలు రాకాపోకలు సాగిస్తూ షాపింగ్ చేయడంతో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో మహిళల సందడి కనిపిస్తుంది.బస్సులలోనైతే నిలబడి వెళ్ళాడనికి కూడా స్థలం దొరకడంలేదని మహిళలు వా పోతున్నారు. స్వంత కార్లు, బైకులు, ఆటోలు సరిపోవడం లేదు. "ఉచిత బస్సు " పథకంద్వారా మహిళలు అధిక సంఖ్యలో ప్రయానిస్తున్నారు.
14
Report
Bhahirandibba, Telangana:
అల్లాదుర్గం రేగోడ్ టేక్మాల్ మండలాలను చార్మినార్ జోన్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చెప్పటారు. శుక్రవారం అల్లాదుర్గ్ ఐబి చౌరాస్తా వద్ద ఈ దీక్ష జరిగింది. జిల్లా కౌన్సిలర్ సభ్యుడు కృష్ణ మాట్లాడుతూ ఈ మూడు మండలాలు సిరిసిల్ల జోన్ లో ఉండడం వలన నిరుద్యోగులు ఉద్యోగులు కోల్పోతున్నారని అందుకే చార్మినార్ జోన్ లో విలీనం చేయాలని అన్నారు
14
Report
Bellampalle, Telangana:
బెల్లంపల్లి మండలం మాల గురిజాల గ్రామంలో 3 గుంటల భూమికి బదులు 13 గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న గ్రామానికి చెందిన కామెర నారాయణపై అధికారులు చర్యలు తీసుకోని, అక్రమ పట్టా రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి తమ భూమిని గుర్తించి తమకు దక్కేలా చేయాలని వేడుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న గోమాస శ్రీకాంత్ పై స్థానిక నేతకాని నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని నేతకాని మహర్ జిల్లా అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు మండిపడ్డారు.
15
Report
Mutyampet, Telangana:
ఒకవైపు పచ్చని ప్రకృతి, మరోవైపు పిల్లగాలులకు వయ్యారంగా తలలు ఊపే వరి పొలాల అందం వెరసి భూమికి ఆకుపచ్చని రేంగేసినట్టు ఉన్నాయి ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లా అడవుల అందాలు. ఉమ్మడి జిల్లాలోని జన్నారం, దండేపల్లి, ఖానాపూర్, నిర్మల్, తపాలాపూర్ తదితర ప్రాంతాలలో కనిపించిన మనోహర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. MNCL-Nirmal రహదారికి ఇరువైపుల ఉన్న వివిధ రకాల చెట్లు, వరి పొలాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాక్కుండా అక్కడక్కడా గలగలా పారాతున్న వాగులు, వంకలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
14
Report
Bellampalle, Telangana:
బెల్లంపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధానకార్యదర్శిగా హనుమాన్ బస్తీకి చెందిన జన్నం సత్యనారాయణ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణలు సంఘటితంగా తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు వారి అభివృద్ధికి కృషి చేస్తానని,సంఘం అభివృద్ధిలో తన వంతు పాత్ర ఉంటుందని తెలిపారు.
15
Report
Madapur, Telangana:
శుక్ర,శనివారాల్లో జరుగనున్న వరలక్ష్మివ్రతం,రాఖీ పండగలను పురస్కరించుకుని మహిళలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. బుధవారం నుంచే రాఖీలు, స్వీట్లు,వరలక్ష్మి వ్రతానికి సంబందించిన పూజ సామాగ్రి నూతన వస్త్రాలు, వివిధ రకాల పండ్లు ఫలాలు కొనుగోల చేస్తుడదంతో మార్కెట్లు సందడిగా మారాయి. ఇదే ఆదనుగా భావించిన వ్యాపారులు వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నారు. గత సంవత్సరంకంటే ఈ యేడు 50 శాతం కంటే అధిక ధరలకు అమ్ముతున్నారని వినియోగదారులు లబోదిబో మంటున్నారు.
14
Report
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో కురిసిన భారీ వర్షానికి సోమారం-సోమారం తండా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బతుకమ్మ వాగు ఉదృతంగా ప్రవాహించడంతో వాగు అవతల సుమారు 20 మంది విద్యార్థులు, 30మంది రైతులు చిక్కుకున్నారు.
సోమారం తండాకు చెందిన విద్యార్థులు సోమారం గ్రామంలో గల స్కూల్ కు వెళ్లి తిరిగి సాయంత్రం వస్తుండగా భారీ వర్షం కురియడంతో ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు తిరిగి సాయంత్రం వస్తుండగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు అవతలీ వైపు చిక్కుకున్నారు. ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు తరలించారు.
14
Report
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్, ఇసాయిపేట అటవీ ప్రాంతంలో చిరుత సంచారం. అక్కాపూర్ కు చెందిన అరిగె నర్సయ్య కు చెందిన లేగదూడ పై దాడి చేసిన చిరుత పులి.అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని లేగదూడను పరిశీలించి దాడి చేసింది చిరుతగా అనుమానం వ్యక్తం చేస్తూ ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు.
పశువులను అటవీ ప్రాంతంలో మేపవద్దని, ఒంటరిగా అటవీ శివారు ప్రాంతం కు వెళ్లొద్దని సూచించిన అటవీ అధికారులు.
14
Report
Gollet, Telangana:
పారిశ్రమిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్లో పారిశుధ్యం మీద ద్రుష్టి పెట్టిన సింగరేణి అధికారులు మురికి గుంతల నిర్మూలన మర్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాలనీ శివారు ప్రాంతాలలో మురికి నీరు నిలువ ఉండి అందులో ప్రా నాంతకమైన దోమలు, ఈగలు అభివృద్ధి చెంది మలేరియా, టైపాయిడ్, డెంగి వంటి వ్యాదుల ప్రభలుతున్నాయి. ముఖ్యంగా టౌన్షిప్లోని డ్రైనేజి నీరు గుంతలలొ నీరు నిలువ ఉండిదుర్గంధం వెదజల్లడం తోపాటు రకరకాల రోగాలు రావడానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోలాని జనం కోరుతున్నారు.
14
Report
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరవరం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 32 క్వింటల్ల రేషన్ బియ్యం తో ఉన్న బొలెరో వాహనం పట్టుకొని సీజ్ కేసు నమోదు చేసిన గాంధారి పోలీసులు. ప్రభుత్వము పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్న వారిపై నిఘా పెట్టామని,అక్రమంగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న కోటగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ ఉమేర్ కేసు నమోదు చేశారు.సంబంధిత అధికారులకు పీడీఎస్ రేషన్ బియ్యం అప్పగించినారు,
14
Report
Adloor, Telangana:
కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ ప్రజెంటేషన్ పాయింట్ ( PPP ) ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంప గోవర్ధన్ పార్టీ ఆఫీస్ లో LED స్క్రీన్ పెట్టి జిల్లా ముఖ్యనాయకులు సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విక్షించారు.
ఇట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలు వీక్షించారూ
16
Report
Kamareddy, Telangana:
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గోకుల్ తాండ అటవీ ప్రాంతంలో ఆవుపై పెద్ద పులి దాడి చేసి ఇప్పటికి 18 రోజులు గడుస్తుంది.ఫారెస్ట్ అధికారులు ఐదు బృందాలతో డ్రోన్ కెమెరాలతో ఫారెస్ట్ మొత్తం జల్లెడ పట్టిన ఇప్పటికీ జాడలేదు. అవును చంపిన పెద్దపులిపై రైతు విష ప్రయోగం చేశాడని, విష ప్రయోగానికి సహకరించిన వారితోపాటు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. పెద్ద పులి విష ప్రయోగం జరిగిన ఈపాటికి గుర్తించేవాళ్లం అని DFO నికిత అన్నారు, లేక పెద్దపులి మన ఫారెస్ట్ క్రాస్ అయ్యి ఉంటుందని తెలిపారు..Dfo
16
Report
Gollet, Telangana:
మండలకేంద్రమైన రెబ్బేనతో పాటు గంగాపూర్, నంబాల, నారాయణపూర్, గోలేటి విలేజి, గోలేటి టౌన్షిప్, గోలేటి క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాలలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచి కొట్టింది. ఉదయంనుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వాన ఊరటనిచ్చింది. పత్తి, కంది పంటలకు ఈ వాన ఎంతో మేలు చేస్తుందని రైతులు సంబరపడుతున్నారు. ఐతే వరి పంటకు ఈ వానలు సరిపోవని, మరిన్ని వర్షాలు పడాలని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
14
Report