Back
అకస్మాత్తుగా భారీ వర్షం
Gollet, Telangana
బుధవారం ఎండ కాసినందుకు సంతోష పడిన ప్రజలకు నిరాశే ఎదురైంది. మండలంలోని గోలేటి, కైరిగూడ, సోనాపూర్, దుర్గాపూర్, గోలేటి క్రాస్ రోడ్, పులి కుంట, దేవుల గూడా, రెబ్బెన తదితర ప్రాంతాలలో సాయంత్రం సుమారు ఏడు గంటల నుండి అరగంట పాటు భారీ వర్షం కురిసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, పంటచేళ్లలోకి నీరు చేరి ప్రజలు బాగా నష్టపోయారు. ఇకనైనా కొంతకాలం పాటు వర్షాలు రాకుంటే బాగుంటుందని ప్రజల అభిప్రాయపడుతున్నారు.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Penugonda, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం లో సచివాలయం -2
అసాంఘిక కార్యకలాపాలు కు అడ్డాగా తయారైంది.
గ్రామంలో సచివాలయం వ్యవస్థ ను సరిగా పట్టించుకొనే నాథుడే లేక సచివాలయం ఎదుటనే మధ్యం సీసాలతో పాటు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగామారిపోయింది.లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజా ప్రయోజనార్ధం నిర్మించిన గ్రామ సచివాలయం బూత్ బంగ్లాను తలపిస్తోంది.కనీసం పారిశుద్యానికి నోచుకోక అస్థవ్యస్తమై సచివాలయం 2వద్ద అద్వాన్న దుస్థితి నెలకొంది..
7
Report
Undi, Andhra Pradesh:
పశ్చిమగోదావరి జిల్లా
ఉండి (మం)వాండ్రం గ్రామంలో హరిజన పేటకు చేర్చిఉన్న పంట బోధి ప్రక్షాళన అంటూ..గత కొన్ని నెలల నుంచి అధికారులు కొంతమంది రైతులు కలసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.
సుమారు శతాబ్ద కాలం నుంచి నివాసముంటున్నమని ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల సుంకాలను చెల్లిస్తున్నామని, గ్రామ కంఠం భూమిని కానీ ఏ ఇతర భూములను ఆక్రమించుకోలేదని
వాస్తవాలను తెలుసుకొనుటకు ఎమ్మెల్యే గ్రామంలో పర్యటచేసి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
6
Report
Gollet, Telangana:
రుతుపవనాలు, అల్పపీడనాల ప్రభావంతో గత వారం రోజుల నుండి భారీ వర్షాలు,చల్లని ఈదురుగాలులు ముసురు వానలు చవిచూసిన ప్రజలకు బుధవారం ఎర్రని ఎండ కాయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం వర్షాల లేమితో దిగులు పడిన అన్నదాతలకు ఈ వారంలో కురిసిన వర్షాలు ఎంతో మేలు చేశాయి. కొద్ది రోజులు మాత్రం తీవ్ర మైన వానల వల్ల జన జీవితం స్తంభించింది రోజువారి కూలీలు, రైతు కూలీలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏదేమైనా విస్తారంగా కురిసిన వర్షాలతో చెరువులు కుంటలు నిండి అన్నదాతలకు ఆనందం మిగిల్చాయి .
14
Report
:
కామారెడ్డి జిల్లా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కార్లను అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్ చేశారు.ఇయాజ్ అనే వ్యక్తి అతని అనుచరులైన ఆరుగురితో కార్లను కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులకు అమ్ముతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపిన ఎస్పీ రాజేష్ చంద్ర.
గత జులై నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేయడంతో పై విషయాలు బయటపడ్డట్టు వెల్లడించారు.ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు,పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు తెలిపిన ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.వీరివద్ద నుండి ఇన్నోవా,ఎర్టిగా,బలేనో స్వాధీనం
14
Report
Eleti Padu, Andhra Pradesh:
అసాంఘిక కార్యకలాపాలు కు అడ్డాగా తయారైంది అక్కడి గ్రామంలో సచివాలయం. పట్టించు కొనే నాథుడే లేక సచివాలయం-2 ఎదుటనే మధ్యం సీసాలతో పాటు పారిశుద్యానికి నోచుకోక అస్థవ్యస్తా మైఅద్వాన్నమైన అపరిశుభ్రమైన దుస్థితినెలకొంది...పశ్చిమగోదావరిజిల్లా పెనుగొండ మండలం వడలి పంచాయతీ కార్యదర్శి పని తీరుపై తీవ్ర విమర్శలు వెళువెత్తుతున్నాయి .సచివాలయం -2వద్ద అనేక అసాంఘిక జరుతున్న కార్యదర్శి భాద్యత రాహిత్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.గ్రామ కార్యదర్శి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వంటి విషయం వెలులోకి.
14
Report
Hyderabad, Telangana:
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, డిసేబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత మెగా శస్త్రచికిత్స మరియు వైద్య శిబిరం సోమాజిగూడలోని సంస్కృతి రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రత్యేక అతిథిగా రాష్ట్ర మంత్రి శ్రీ అడలూరి లక్ష్మణ్ గారు, హైదరాబాద్ కలెక్టర్ శ్రీమతి హరీ చందనా గారు ఈ సందర్భాన్ని అలంకరించారు.
14
Report
Gollet, Telangana:
అసలే వానా కాలం, భారీ వర్షాలు, బురదమయమైన రోడ్లు...పగలైతే పర్లేదు కాని రాత్రి వీది దీపాలు వెలుగ కుంటే నడిచేదెలా... అచ్చం ఇలాంటి పరిస్తితినే ఎదుర్కోంటున్నారు గోలేటి గ్రామపంచాయతీ పరదిలోని భగత్ సింగ్ నగర్ వాసులు.గతంలో సింగరేణి మాజ మాన్యం రోడ్డుకు ఇరు వైపులా వీది దీపాలు ఏర్పాటు చేయడంతో ఈ రోడ్డు కు కొత్తకల వచ్చింది. కానీ అప్పుడప్పుడు ఒకవైపు వీది దీపాలు మాత్రమే వెలగడం, కొన్ని మిలుక్ మిలుక్ మంటూఉండటం ఇబ్బందిగా మారింది.ఇప్పటికైనా అదికారులు వీరి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
14
Report
Maruteru, Andhra Pradesh:
పాలకొల్లు నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు..
రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలవరం కాపర్ డ్యాం ,తుంగభద్ర గేట్లు విజయవాడ ముంపు అంటూ అసత్య ప్రచారాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని
గత వైసీపీ పాలనలో నీటిపారుదల రంగాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తుందనిరాజకీయ దురుద్దేశంతోనే వైసీపీ పోలవరం, తుంగభద్ర ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు..ఎపి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల
14
Report
Gollet, Telangana:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలోని ప్రతి మండలంలో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ఎడతెరిపిలేని వర్షాలతో రోజు కూలి నాలు చేసి పొట్ట పోసుకునే పేదలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. జిల్లాలోని చిన్న చిన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటం అక్కడక్కడ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుండి నీరు పారడం వర్షాల తీవ్రతకు అద్దం పడుతుంది. BT, సిమెంటు రోడ్లు లేని గ్రామాలన్ని బురదమయంగా మారాయి.
14
Report
Gollet, Telangana:
ఆదివారం రాత్రి కాస్త తెరిపినిచ్చిన వర్షం సోమవారం ఉదయాన్నే మళ్ళీ మొదలైంది గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో సతమవుతున్న రెబ్బెన మండల ప్రజలకు ఎడతెరిపి లేని వర్షాలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోవడం, ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సోమవారం నుంచైనా వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయేమోనని ఎదురుచూస్తున్న రైతన్నలకు నిరాశ ఎదురవుతుంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని చెరువులు కుంటలు పూర్తిగా నిండిపోయాయి.
14
Report
Gollet, Telangana:
ఈ నెల 23, 24 తేదీలలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గోటేటిలో నిర్వహిచనున్న అంతర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పురుషులు, మహిళా జట్ల క్రీడాకారులకు నేటి నుంచి ఈ నెల 21 వరకు శిక్షణా శిభిరం నిర్వహిస్తున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామనీ,క్రీడాకారులు ఈ శిభిరాన్ని ఉపయోగించుకొనిరాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలనిఅన్నారు.
14
Report
Gollet, Telangana:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ మహిళా జట్టును శనివారం గోలేటి టౌన్షిప్ లో ఎంపిక చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతి తెలిపారు. ఏ. స్వప్న,కే.అంజలి,డి.శ్రావణి, జి.అనూష,ప్రజ్వల, కారుణ్య, పీ. శ్రావ్య, యం. సహస్ర,ఎస్.సాయిశ్రీ,వర్షిని,సుజాత సాయి దీక్ష,సంజన,అర్చన, వైష్ణవి,హారిక ఎంపికైనట్లు తెలిపారు
14
Report
Gollet, Telangana:
క్రీడా గ్రామమైన గోలేటి టౌన్షిప్ లో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పురుషుల జట్టును ఎంపిక చేసినట్టు ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతి తెలిపారు. పురుషుల జట్టు కే. సిద్ధార్థరాజ్, ఏం. తిరుపతి, పి.పవన్ కుమార్,కే.అరుణ్,జి.గోపాల్,పి.శ్రీకాంత్,టి. దిలీప్ కుమార్, పి.దేవరాజ్,ఎం. సూర్య కుమార్, ప్రేమ్ కుమార్, సిహెచ్ గోపాలకృష్ణ, సిహెచ్.వరుణ్ ఎంపిక అయ్యారు.
14
Report
Gollet, Telangana:
ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలోని పలు మండలాలలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ తో పాటు పలు గ్రామాలలోని దేవాలయాల్లో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మహిళలు తమ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటూ పూజ కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ మహత్యం గురించి వివరిస్తూ భక్తి గీతాలాపన, భజన కార్యక్రమాలు చేపట్టారు. పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లోని కోదండ రామాలయంలో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
14
Report