Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
WEST GODAVARI DISTRICT
West Godavari534102

తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే

WEST GODAVARI DISTRICTWEST GODAVARI DISTRICTAug 15, 2025 16:50:21
Tadepalligudem, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల పరిధిలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల పోరాట పటిమను భావితరం పౌరులు నాటి త్యాగధనులను స్మరించుకోవాలన్నారు.
14
comment0
Report
West Godavari534203

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుల్లో పాల్గొన్న ఎపి మంత్రి నిమ్మల..

WEST GODAVARI DISTRICTWEST GODAVARI DISTRICTAug 15, 2025 16:36:42
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..ఈసందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం స్వాతంత్ర సమరయోధులను సత్కరించారు మంత్రి..ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్మాన్ నయిం అస్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
14
comment0
Report
West Godavari534203

భీమవరం మావుళ్ళఆలయంలో శ్రావణ మాస సామూహిక వరలక్ష్మి వ్రతాలు..

WEST GODAVARI DISTRICTWEST GODAVARI DISTRICTAug 15, 2025 16:28:22
Bhimavaram, Andhra Pradesh:
నేడు శ్రావణమాసం నాల్గవ ఆఖరి శుక్రవారం కావడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందిక మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతం పూజలు భక్తి శక్తులతో నిర్వహించారు.
14
comment0
Report
West Godavari534320

దేశభక్తిని పెంపొందించే విధంగా పెనుగొండ వాసవి మాత అలంకరణ..

westgodavariwestgodavariAug 15, 2025 16:12:02
Eleti Padu, Andhra Pradesh:
79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి శాంతి ధామ్ నందు 92 అడుగుల పంచలోహ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు తివర్ణ పతాకంతో భారతమాతగా భక్తులకు దర్శనమిచ్చిచారు. అటు శ్రావణమాసం ఆఖరి శుక్రవారం ఇటు స్వాతంత్ర దినోత్సవం కావడంతో ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని భక్తితో పాటు దేశభక్తిని కూడా పెంపొందించే విధంగా అలంకరణ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
14
comment0
Report
Advertisement
West Godavari534230

భీమవరంలో స్త్రీ శక్తి పథకం ప్రారంభం..

westgodavariwestgodavariAug 15, 2025 15:14:20
Manchili, Andhra Pradesh:
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు "స్త్రీ శక్తి పథకం" ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. శుక్రవారం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో "స్త్రీ శక్తి" కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top