Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
West Godavari534122

వైసీపీ తీరు పై మంత్రి నిమ్మల ఘాటైన వ్యాఖ్యలు..

Aug 18, 2025 14:44:17
Maruteru, Andhra Pradesh
పాలకొల్లు నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.. రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలవరం కాపర్ డ్యాం ,తుంగభద్ర గేట్లు విజయవాడ ముంపు అంటూ అసత్య ప్రచారాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని గత వైసీపీ పాలనలో నీటిపారుదల రంగాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తుందనిరాజకీయ దురుద్దేశంతోనే వైసీపీ పోలవరం, తుంగభద్ర ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు..ఎపి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Aug 18, 2025 15:17:03
Gollet, Telangana:
అసలే వానా కాలం, భారీ వర్షాలు, బురదమయమైన రోడ్లు...పగలైతే పర్లేదు కాని రాత్రి వీది దీపాలు వెలుగ కుంటే నడిచేదెలా... అచ్చం ఇలాంటి పరిస్తితినే ఎదుర్కోంటున్నారు గోలేటి గ్రామపంచాయతీ పరదిలోని భగత్ సింగ్ నగర్ వాసులు.గతంలో సింగరేణి మాజ మాన్యం రోడ్డుకు ఇరు వైపులా వీది దీపాలు ఏర్పాటు చేయడంతో ఈ రోడ్డు కు కొత్తకల వచ్చింది. కానీ అప్పుడప్పుడు ఒకవైపు వీది దీపాలు మాత్రమే వెలగడం, కొన్ని మిలుక్ మిలుక్ మంటూఉండటం ఇబ్బందిగా మారింది.ఇప్పటికైనా అదికారులు వీరి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
13
comment0
Report
Aug 18, 2025 05:25:20
Gollet, Telangana:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలోని ప్రతి మండలంలో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ఎడతెరిపిలేని వర్షాలతో రోజు కూలి నాలు చేసి పొట్ట పోసుకునే పేదలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. జిల్లాలోని చిన్న చిన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటం అక్కడక్కడ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుండి నీరు పారడం వర్షాల తీవ్రతకు అద్దం పడుతుంది. BT, సిమెంటు రోడ్లు లేని గ్రామాలన్ని బురదమయంగా మారాయి.
14
comment0
Report
Aug 18, 2025 02:28:49
Gollet, Telangana:
ఆదివారం రాత్రి కాస్త తెరిపినిచ్చిన వర్షం సోమవారం ఉదయాన్నే మళ్ళీ మొదలైంది గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో సతమవుతున్న రెబ్బెన మండల ప్రజలకు ఎడతెరిపి లేని వర్షాలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోవడం, ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సోమవారం నుంచైనా వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయేమోనని ఎదురుచూస్తున్న రైతన్నలకు నిరాశ ఎదురవుతుంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని చెరువులు కుంటలు పూర్తిగా నిండిపోయాయి.
14
comment0
Report
Aug 16, 2025 19:31:38
Gollet, Telangana:
ఈ నెల 23, 24 తేదీలలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గోటేటిలో నిర్వహిచనున్న అంతర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ లో పాల్గొనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పురుషులు, మహిళా జట్ల క్రీడాకారులకు నేటి నుంచి ఈ నెల 21 వరకు శిక్షణా శిభిరం నిర్వహిస్తున్నట్లు బాల్‌ బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామనీ,క్రీడాకారులు ఈ శిభిరాన్ని ఉపయోగించుకొనిరాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలనిఅన్నారు.
14
comment0
Report
Aug 16, 2025 16:52:18
Gollet, Telangana:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ మహిళా జట్టును శనివారం గోలేటి టౌన్షిప్ లో ఎంపిక చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతి తెలిపారు. ఏ. స్వప్న,కే.అంజలి,డి.శ్రావణి, జి.అనూష,ప్రజ్వల, కారుణ్య, పీ. శ్రావ్య, యం. సహస్ర,ఎస్.సాయిశ్రీ,వర్షిని,సుజాత సాయి దీక్ష,సంజన,అర్చన, వైష్ణవి,హారిక ఎంపికైనట్లు తెలిపారు
14
comment0
Report
Aug 16, 2025 16:41:21
Gollet, Telangana:
క్రీడా గ్రామమైన గోలేటి టౌన్షిప్ లో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పురుషుల జట్టును ఎంపిక చేసినట్టు ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతి తెలిపారు. పురుషుల జట్టు కే. సిద్ధార్థరాజ్, ఏం. తిరుపతి, పి.పవన్ కుమార్,కే.అరుణ్,జి.గోపాల్,పి.శ్రీకాంత్,టి. దిలీప్ కుమార్, పి.దేవరాజ్,ఎం. సూర్య కుమార్, ప్రేమ్ కుమార్, సిహెచ్ గోపాలకృష్ణ, సిహెచ్.వరుణ్ ఎంపిక అయ్యారు.
14
comment0
Report
Aug 16, 2025 15:55:10
Gollet, Telangana:
ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలోని పలు మండలాలలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ తో పాటు పలు గ్రామాలలోని దేవాలయాల్లో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మహిళలు తమ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటూ పూజ కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ మహత్యం గురించి వివరిస్తూ భక్తి గీతాలాపన, భజన కార్యక్రమాలు చేపట్టారు. పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లోని కోదండ రామాలయంలో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
14
comment0
Report
Aug 16, 2025 13:45:26
Pallantla, Andhra Pradesh:
కొవ్వూరు : 15-08-2025: కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం వద్ద "79 వ స్వాతంత్ర దినోత్సవం"లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, వేడుకలు జరుపుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాయత్రి వెంకటేశ్వరావు గారి ఆధ్వర్యంలో, పార్టీ పాలకవర్గ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు, శ్రేయోభిలాషులు మొదలగు వారు.
15
comment0
Report
Aug 16, 2025 13:12:02
Pallantla, Andhra Pradesh:
జనసేన పార్టీ సీనియర్ నాయుకులు మెగా కుటుంభ అభిమాని, కొవ్వూరు మున్సిపాల్టీ జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో ధైర్యంగా నిలబడ్డ కొటే చంద్రరావు గార్కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
15
comment0
Report
Aug 16, 2025 10:23:06
Gollet, Telangana:
గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని రేకులగూడెంలో వరదలు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి మానేపల్లి కుంట నిండి మత్తడి దుంకడంతో భారీ వరద వచ్చింది ప్రభావిత ప్రాంతాలైన దుబ్బ గూడెం, అంబేద్కర్ నగర్, రేకులగూడెం తదితర ప్రాంతాలలో వరద ప్రభావం అధికంగా ఉంది రేకులగూడెం పెట్రోల్ బంకు, స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద వరద నీరు ముంచెత్తింది. ఇటీవల వచ్చిన వరదలతో అక్కడి టేకం స్వరూప ఇల్లు కూలిపోయింది. అధికారులు సర్వే చేసి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
15
comment0
Report
Aug 16, 2025 04:47:03
Gollet, Telangana:
రెబ్బెన మండలంలో గత రాత్రి సుమారు పది గంటలకు ప్రారంభమైన ముసురు వాన నిరవదికంగా కూరుస్తూనే ఉంది. ఉదయం పూట వివిధ పనులకు వె ళ్లే వారికి ముసురు వాన ఆటంకంగా మారింది. భారీ వర్షంతో మండలంలో ని వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. గత మూడు రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షానికి మండలంలోని పలువురి ఇండ్లు దెబ్బు తిన్నాయి. అలాగే గోలేటి కి చెందిన యన్నం . శ్రీ నివాస రావు కు చెందిన పశువులు మృతి చెందాయి. ఎడ తెరిపి లేని వానలలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని మండల వాసులు భయ పడుతున్నారు.
15
comment0
Report
Aug 15, 2025 16:50:21
Tadepalligudem, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల పరిధిలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల పోరాట పటిమను భావితరం పౌరులు నాటి త్యాగధనులను స్మరించుకోవాలన్నారు.
14
comment0
Report
Aug 15, 2025 16:36:42
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..ఈసందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం స్వాతంత్ర సమరయోధులను సత్కరించారు మంత్రి..ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్మాన్ నయిం అస్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
14
comment0
Report
Aug 15, 2025 16:28:22
Bhimavaram, Andhra Pradesh:
నేడు శ్రావణమాసం నాల్గవ ఆఖరి శుక్రవారం కావడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందిక మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతం పూజలు భక్తి శక్తులతో నిర్వహించారు.
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top