Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
West Godavari534203

భీమవరంలో తీరంగా ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్..

Aug 11, 2025 16:29:13
Bhimavaram, Andhra Pradesh
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కాలేజ్ నందు అజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 2 వేల మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో 200 మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని ఎస్ ఆర్ కె ఆర్ కళాశాల నుండి సాగిన భారీ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభీంచి పాల్గొన్నారు.
14
comment
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Aug 11, 2025 18:10:42
Penugonda, Andhra Pradesh:
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో రైతులు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మార్టేరు నుండి పెనుగొండ వరకు భారీ ట్రాక్టర్ల ర్యాలీనిర్వహించారు..నియోజకవర్గం లోని పెనుమంట్ర మండలం మార్టేరు నుండి పెనుగొండ వరకు ట్రాక్టర్లతో రైతుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది.మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొని ట్రాక్టర్ నడిపి నేను రైతు బిడ్డ నేనంటూ ర్యాలీలో ముందుకు సాగారు.
11
comment
Report
Aug 11, 2025 16:43:35
Tanuku, Andhra Pradesh:
తణుకు నియోజకవర్గం అత్తిలి ఎఎంసి చైర్మన్ మరియు నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ మరియు ఎపి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈసందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం హయాంలో రైతులను అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని రైతాంగానికి మేలు చేసే విధానాలు అవలంబిస్తుందని మంత్రి అన్నారు.
14
comment
Report
Aug 11, 2025 11:31:24
Gollet, Telangana:
ప్రభుత్వ దవఖానాల్లో పని చేస్తున్న సానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. సంబంధిత కార్మికులతో కలిసి సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినానంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని డీఎంఈ, టి వి వీ పి, సిహెచ్పి కాంట్రాక్టు సిబ్బందికి సంబంధించిన ఈఎస్ఐ, పిఎఫ్ కట్టని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు సంబంధించిన అన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
15
comment
Report
Aug 11, 2025 11:13:28
Eleti Padu, Andhra Pradesh:
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ తో నటించిన నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెంత నటించిన హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో సందడి చేశారు.రాష్ట్ర పీఏసీ చైర్మన్, జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి నిధి అగర్వాల్ ఏకాది సిల్వర్ జ్యువెలరీ షాపు ప్రారంభించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం షూటింగ్ జరుగుతుందని ఈ సినిమాను హిట్ చేయాలని ఆమె
14
comment
Report
Aug 10, 2025 10:06:25
Gollet, Telangana:
పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ శివారు ప్రాంతాలలో మురుగు నీరు పారుతూ దుర్గంధం వెదజలుతుంది. ముఖ్యంగా భగత్సింగ్ నగర్ సమీపంలోని ప్రజలు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడు తున్నారు.చాలా కాలం క్రితం ఏర్పాటు చేసిన భూగర్భ పైప్ లైను పైపులు వివిధ కారణాలతో పగిలిపోయి మురికి నీరు బైటికి చేరి దుర్వాసన వెద జల్లడం తోపాటు ప్రాణాంతక వ్యాధులు ప్రభలడానికి కారణం అవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
14
comment
Report
Aug 10, 2025 00:46:19
Eleti Padu, Andhra Pradesh:
అన్నాచెల్లెళ్ల రాఖీ పండుగ పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చిన్నారులు జిల్లా ఎస్పీనయీం అస్మీ కి రాఖీలు కట్టారు. ఇసందర్భంగా ఆయన చిన్నారులను అశ్విరదిస్తూ స్వీట్స్ పంచారు.. అన్న, చెల్లెలు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి అని జిల్లా ఎస్పీ నయీం అస్మీ అన్నారు...భారతీయ సంప్రదాయంలో సోదరీ ప్రేమకు వెలకట్టలేని ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు..
13
comment
Report
Aug 09, 2025 16:39:37
Gollet, Telangana:
రెబ్బెన మండలంలో రాఖీ పండగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలనుంచి మహిళలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు తరలి వచ్చి సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. సోదరుల కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. అదేవిదంగా సోదురులు కూడా వారి స్థోమత మేరకు అక్కా చెల్లెళ్లకు నూతన వస్త్రాలు సమర్పించడంతోపాటు వివిధరకాల కానుకలు అందించారు. రాఖీ పండగ నేపథ్యంలో ఉదయంనుంచే మహిళలు షాపింగ్ చేయడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
14
comment
Report
Aug 09, 2025 13:43:48
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో బోద్దున శంకర్ కు చెందిన ఇంటి గోడ శనివారం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. ఎటువంటి నిలువ నీడ లేని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో వాపోయారు. వెంటనే మాజీ కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ తహసీల్దార్ కి సమాచారం అందించారు. సోమవారం RI ని పంపి పంచనామా చేయిస్తామని తహసీల్దార్ తెలిపారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు.
15
comment
Report
Aug 09, 2025 04:55:06
Gollet, Telangana:
రెబ్బన మండలం దుగ్గాపూర్లో శనివారం ఉదయం భారీ వర్ష కురిసింది. మండలంలోని రెబ్బన, గోలేటి క్రాస్ రోడ్డు, గోలేటి విలేజి, గోలేటి టౌన్షిప్, ఖైర్గుడా, సోనాపూర్, తదితర ప్రాంతాలలో భారీ వాన కూటిసింది. పత్తి చేన్లకు ఈ వర్షం ఉపయోగకరంగా ఉందని రైతులు అభిప్రా యపడుతున్నారు. అయితే రాఖీ పండగకు వచ్చిన మహిళలు మాత్రం ఇబ్బది పడ్డారు
14
comment
Report
Aug 09, 2025 03:45:53
Bhahirandibba, Telangana:
అల్లాదుర్గ్ లో భారీ వర్షం కారనంగా భారీ పంట నష్టం వాటిలింది బహిరందిబ్బ గ్రామంలో తలారి నర్సింలు అనే రైతు పత్తి పంట వేశారు అది వర్షం పడటంతో బాగ వరదనీరు రావడం జరిగింది అ వరద నీరుకు పంట కొట్టుకు పోయిన్ది
14
comment
Report
Aug 08, 2025 18:32:08
Gollet, Telangana:
శుక్రవారం వరలక్ష్మి వ్రతం, శనివారం రాఖీ పండగ ల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు బస్టాండ్లు బస్సులు కిటకిటలాడుతున్నాయి. వరుసగా వస్తున్న ఈ పండుగల వేళ అధిక సంఖ్యలో మహిళలు రాకాపోకలు సాగిస్తూ షాపింగ్ చేయడంతో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో మహిళల సందడి కనిపిస్తుంది.బస్సులలోనైతే నిలబడి వెళ్ళాడనికి కూడా స్థలం దొరకడంలేదని మహిళలు వా పోతున్నారు. స్వంత కార్లు, బైకులు, ఆటోలు సరిపోవడం లేదు. "ఉచిత బస్సు " పథకంద్వారా మహిళలు అధిక సంఖ్యలో ప్రయానిస్తున్నారు.
14
comment
Report
Aug 08, 2025 14:34:15
Bhahirandibba, Telangana:
అల్లాదుర్గం రేగోడ్ టేక్మాల్ మండలాలను చార్మినార్ జోన్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చెప్పటారు. శుక్రవారం అల్లాదుర్గ్ ఐబి చౌరాస్తా వద్ద ఈ దీక్ష జరిగింది. జిల్లా కౌన్సిలర్ సభ్యుడు కృష్ణ మాట్లాడుతూ ఈ మూడు మండలాలు సిరిసిల్ల జోన్ లో ఉండడం వలన నిరుద్యోగులు ఉద్యోగులు కోల్పోతున్నారని అందుకే చార్మినార్ జోన్ లో విలీనం చేయాలని అన్నారు
14
comment
Report
Aug 08, 2025 11:59:38
Bellampalle, Telangana:
బెల్లంపల్లి మండలం మాల గురిజాల గ్రామంలో 3 గుంటల భూమికి బదులు 13 గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న గ్రామానికి చెందిన కామెర నారాయణపై అధికారులు చర్యలు తీసుకోని, అక్రమ పట్టా రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి తమ భూమిని గుర్తించి తమకు దక్కేలా చేయాలని వేడుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న గోమాస శ్రీకాంత్ పై స్థానిక నేతకాని నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని నేతకాని మహర్ జిల్లా అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు మండిపడ్డారు.
15
comment
Report
Aug 08, 2025 09:32:51
Mutyampet, Telangana:
ఒకవైపు పచ్చని ప్రకృతి, మరోవైపు పిల్లగాలులకు వయ్యారంగా తలలు ఊపే వరి పొలాల అందం వెరసి భూమికి ఆకుపచ్చని రేంగేసినట్టు ఉన్నాయి ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లా అడవుల అందాలు. ఉమ్మడి జిల్లాలోని జన్నారం, దండేపల్లి, ఖానాపూర్, నిర్మల్, తపాలాపూర్ తదితర ప్రాంతాలలో కనిపించిన మనోహర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. MNCL-Nirmal రహదారికి ఇరువైపుల ఉన్న వివిధ రకాల చెట్లు, వరి పొలాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాక్కుండా అక్కడక్కడా గలగలా పారాతున్న వాగులు, వంకలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
14
comment
Report
Advertisement
Back to top