Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500013

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2, 3 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు

Jun 20, 2024 13:15:24
Hyderabad, Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2, 3 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద వందలాది మంది నిరుద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, మాజీ అధ్యక్షుడు ఈరోళ్ల శ్రీనివాస్, గెలు శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 25, 2026 18:34:58
Sangareddy, Telangana:

Lavanya Catches In Drunk and Drive: యువ నటుడు రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లు రాజ్‌ తరుణ్‌తో తన ప్రేమ వ్యవహారాలతోపాటు డ్రగ్స్‌.. ఇతర వ్యవహారాలతో వార్తల్లో నిలిచిన ఆమె తాజాగా మద్యం సేవించి గ్రామస్తులను ఢీకొట్టింది. మద్యం సేవించి వాహనం నడుపుతుండగా అడ్డదిడ్డంగా కారు నడిపి పలువురిని ఢీకొట్టగా గ్రామస్తులు తిరగబడ్డారు. తాగి ఢీకొట్టడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: YS Jagan: ఇక రోజూ చంద్ర‌బాబుకు సినిమా చూపిస్తా..! పాద‌యాత్రపై వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన

మద్యం మత్తులో ఉన్న సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో వెళ్తూ ఓ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఢీకొట్టిన అనంతరం ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా మల్లేపల్లి గ్రామస్తులు ఆగ్రహంతో ఆమె కారును అడ్డగించారు. ఢీకొట్టడంతో క్షమాపణలు చెప్పాలని గ్రామస్తులు కోరగా.. వారితో లావణ్య వాగ్వాదానికి దిగింది. తాగి ఢీకొట్టడమే కాకుండా తమపైనే తిరగబడడంతో లావణ్యపై గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు.

Also Read: Petrol Shortage: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన

ఎంతకీ క్షమాపణలు చెప్పకుండా వాగ్వాదానికి దిగిన లావణ్యపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీశారు. అయితే పోలీసులతోనూ లావణ్య వాగ్వాదం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమెకు బ్రీత్‌ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆమె కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలిచారు. ఢీకొట్టిన సమయంలో లావణ్య కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

Also Read: Harish Rao: 'తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాడు': హరీశ్ రావు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో లావణ్య పట్టుబడడం వైరల్‌గా మారింది. గ్రామస్తులతో ఆమె వాగ్వాదం చేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. లావణ్య తీరుపై గ్రామస్తులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అయితే లావణ్య ఇలా వివాదాల్లో చిక్కడం తొలిసారి కాదు. గతంలో డ్రగ్స్‌ వ్యవహారంలో కూడా లావణ్య పేరు మార్మోగింది. అనంతరం రాజ్‌ తరుణ్‌తో ప్రేమ వ్యవహారం తీవ్ర రచ్చకు దారితీసిన విషయం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌తో వేరొకరితో సత్సంబంధాలు కలిగిన లావణ్య అనంతరం కొందరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరల్తో వాగ్వాదానికి దిగింది. ఆమె చేసిన రచ్చ మామూలుది కాదు. ఇప్పటికీ పలు టీవీ షోల్‌లో లావణ్యకు సంబంధించిన వ్యవహారాలు ట్రెండింగ్‌లో ఉంటాయి. ఇప్పుడు మద్యం సేవించి కారు నడుపుతూ గ్రామస్తులను ఢీకొట్టడం.. అనంతరం గ్రామస్తులు, పోలీసులతో గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1014
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 25, 2026 13:40:46
Hyderabad, Telangana:

Harish Rao vs Revanth Reddy: తలకిందకు పెట్టి కాళ్లు పైకి పెట్టి రేవంత్‌ రెడ్డి తపస్సు చేసినా.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి మళ్లీ సీఎం కావడం కలే అని తెలిపారు. సిద్దిపేటలో ఎవరో ఎందుకు? రేవంత్ రెడ్డే తనపై పోటీకి దిగాలని సవాల్‌ చేశారు. డీలిమిటేషన్ ఎప్పుడో జరగాలి. సీట్లు పెరిగి.. మహిళా రిజర్వేషన్ అమలు జరిగితే స్వాగతిస్తాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు తెలిపారు.

Also Read: Jeevan Reddy: కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం మీడియాతో బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు చిట్‌చాట్‌ చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతోనే తేటతెల్లమైందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అతితక్కువ నిధులు అంటే 2 శాతం నిధులు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది? అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచింది. గ్యారంటీలను తుంగలో తొక్కింది కనుకే బడ్జెట్ పేపర్లు చించేశాo. చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపాం' అని వివరించారు. రేవంత్‌ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

Also Read: YS Jagan: ఇక రోజూ చంద్ర‌బాబుకు సినిమా చూపిస్తా..! పాద‌యాత్రపై వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన

'ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించే వాళ్లం కదా. ఇంకో వారం పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పొడిగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అన్ని అంశాలపై చర్చ జరగాలంటే మరో వారం పాటు  అసెంబ్లీ జరగాలి. సభ జరుగుతున్న తీరు అస్సలు బాలేదు. ఈరోజు రెండు ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ అడిగిన ప్రశ్నకు, 16 నోటిఫికేషన్‌లు, 16,978 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం సమాధానం చెప్పిందని వెల్లడించారు.

Also Read: Petrol Shortage: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన

'కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు 50,785 మందికి నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటుంది. ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. 98 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి మళ్లించారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ , ఎస్టీలకు కేటాయించిన నిధులను 2 శాతం మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు.

అసెంబ్లీ నడిపించడంలో రేవంత్‌ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు మండిపడ్డారు. 'అసెంబ్లీ సభా నియమాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. చనిపోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు చెక్ ఇచ్చేందుకు 3 గంటలు సభను వాయిదా వేశారు. రోజు జీరో అవర్ తీసుకుంటామని చెప్పి, రెండు రోజుల నుంచి జీరో అవర్ తీసుకోవడం లేదు' వివరించారు.

'తల కింద పెట్టి కాలు పైకి పెట్టిన రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాలేడు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. దక్షిణ భారతదేశానికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ తక్కువగా వస్తున్నాయి. చిన్నచూపు ఉంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే బీఆర్ఎస్ పార్టీకి లాభమే' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

982
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 25, 2026 13:05:32
Hyderabad, Telangana:

 Snake Baba Viral Video Latest: ఆధ్యాత్మికతకు, వింతలకు పెట్టింది పేరు మన దేశం.. రోజుకో రకమైన బాబాలు పుట్టుకొస్తూ.. భక్తులను ఎంతగానో ఆశ్చర్యపరిస్తూ ఉంటారు.. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ బాబా తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా రాక తప్పదు.. ఈయన అందరి బాబాల్లాగా కాకుండా.. కుదురుగా ఒకే చోట కూర్చోడు.. పోనీ నడుచుకుంటూ వెళ్తాడా అంటే అది కూడా లేదు.. కేవలం పాములాగా పాకుతూ ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణిస్తూ ఉంటాడు.. ప్రస్తుతం ఈ పాము బాబాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి..

సాధారణంగా సాధువులతో పాటు బాబాలు కాషాయపు వస్త్రాలు ధరించి పాదయాత్రలు చేయడం లేదా ధ్యానంలో ఉండటం మనం తరచుగా అక్కడక్కడ చూస్తూ ఉంటాం.. కానీ ఈ సరికొత్త బాబా శైలి అందరికంటే భిన్నమే.. ఈయన నేలపై పడుకుని.. పాము ఏ విధంగా అయితే పాకుతూ వెళ్తుందో.. అదే రీతిలో అతను కూడా వేగంగా పాకతో వెళ్తాడు. దారిలో తనను చూసేవారు భయపడతారా లేదా నవ్వుతారా అనే సంబంధం లేకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోవడమే ఈ బాబా అసలైన స్పెషాలిటీ..

ఈ బాబా ఇలా పాకడం వెనక ఉన్న రహస్యం ఏంటని సోషల్ మీడియా వినియోగదారులు ఆరా తీస్తున్నారు.. కొంతమంది భక్తులు మాత్రం ఇది ఒక రకమైన తపస్సు అని... ఇలా చేయడం వల్ల లోకంలోని పాపాలు తొలగిపోతాయని నమ్ముతున్నారు.. అయితే, ఈ బాబా ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు! అనే వివరాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.. కానీ ఆయన వెళ్తున్న దారిలో జనాలు గుంపుగా చేరి..ఈ వింతను ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు..

 
 
 
 
 

ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు తమదైన శైలిలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.. మార్కెట్లోని కొత్త మోడల్ బాబా వచ్చాడు.. ఇక భక్తుల కష్టాలు తీరిపోయినట్లే.. కొందరు సర్కాస్టిగ్గా కామెంట్ చేయగా.. నడిచి వెళ్తే అలిసిపోతాడేమోనని.. ఇలా పాకుతూ వెళ్తున్నారేమో అని కొంతమంది ఫన్నీగా స్పందిస్తూ వస్తున్నారు.. మనుషులుగా పుట్టి ఇలా పాముల ప్రవర్తించడం.. కలికాలం అంటే ఇదే.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పాము బాబాకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతుంది..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1093
comment0
Report
HDHarish Darla
Mar 25, 2026 13:03:34
Hyderabad, Telangana:

Hardik Krunal Pandya Latest News: టీమ్ ఇండియా స్టార్ ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా సోదరుడు, ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు క్రునాల్ పాండ్యా పుట్టినరోజు సందర్భంగా (మార్చి 24) పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బర్త్‌డే రోజు సొంత తమ్ముడి వల్లే క్రునాల్ కలత చెందాడని అంటున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పాండ్యా బ్రదర్స్ తమ జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలెట్టేశారు. అయితే క్రునాల్ పాండ్యా పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు హార్దిక్ పాండ్యా శుభాకాంక్షలు తెలపకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని చర్చ జరుగుతోంది.

క్రునాల్ పాండ్యా పుట్టినరోజున, అతని భార్య పంఖురి శర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసి అతనికి శుభాకాంక్షలు తెలిపారు. "నీ మనసు, నీ ప్రేమ, అన్నీ నాకు తెలుసు. ఆ విషయాన్ని నీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. నువ్వు చాలా అందమైన జీవితాన్ని గడిపావు. కుటుంబం, క్రికెట్‌తో సహా ప్రతీదాన్నీ నువ్వు ప్రశాంతంగా, ధైర్యంగా నిర్వహిస్తావు," అని పంఖురి శర్మ పోస్ట్ చేసింది.

భార్య పంఖురి శర్మ పెట్టిన ఎమోషనల్ పోస్ట్‌కు భర్త కృనాల్ పాండ్యా కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ క్రమంలో కృనాల్ పాండ్యా సోదరుడు హార్దిక్ పాండ్యా అసలు ఎక్కడున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ప్రతి ఏటా కృనాల్ పాండ్యా పుట్టినరోజున అందరూ సంతోషంగా కలిసి ఉంటారు. కానీ ఈసారి హార్దిక్ పాండ్యా కనీసం విషెస్ చెప్పలేదని ఫ్యాన్స్ అంటున్నారు. 

హార్దిక్ పాండ్యా వదిన పంఖురి శర్మ పోస్ట్ చేసిన ఫోటో తర్వాత, 'హార్దిక్ పాండ్యా ఎక్కడ?', 'అతను క్రునాల్ పాండ్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదు?' వంటి ప్రశ్నలను అభిమానులు అడుగుతున్నారు. ఈలోగా, హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించగా, అతను క్రునాల్ పాండ్యాకు ఒక్క శుభాకాంక్షలు కూడా చెప్పలేదని స్పష్టమవుతోంది.

ఒకప్పుడు వాళ్లిద్దరూ తమ పుట్టినరోజులను కలిసి జరుపుకునేవారు. చాలా కార్యక్రమాలలో ఇద్దరూ కలిసే కనిపించేవారు. కానీ హార్దిక్ జీవితంలోకి మహికా శర్మ వచ్చినప్పటి నుండి, ఆ ఇద్దరు సోదరుల మధ్య మనస్పర్థలు వచ్చాయని వదంతులు వస్తున్నాయి. పాండ్యా సోదరుల మధ్య పెద్ద గొడవ జరిగిందని సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. కానీ ఈ గొడవకు ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. 

Also Read: Mahesh Babu Trisha Affair: విజయ్‌తో కాదు..మహేష్ బాబుతో హీరోయిన్ త్రిష అఫైర్! తెలుగు డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

ALso Read: Lockdown In India 2026: భారత్‌లో మరోసారి లాక్‌డౌన్! ప్రధాని మోదీ కీలక ప్రకటన..దేశంలో లాక్‌డౌన్ వస్తుందా? లేదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

989
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 25, 2026 12:56:11
Hyderabad, Telangana:

 Funny Video Watch Here: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఎక్కడో ఒకచోట వింత ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ కొరత భయంతో ప్రజలు బంకుల ముందు క్యూ కట్టిన తరుణంలో... ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను కడుపుబ్బ నవ్విస్తోంది. భవిష్యత్తులో పెట్రోల్ దొరకదేమో అన్న ఆందోళనతో అతని ఏకంగా ఒక పెద్ద ప్లాస్టిక్ బ్రాహ్మణు నెత్తిమీద పెట్టుకొని పెట్రోల్ బంకుకు చేరుకున్నాడు. ఇప్పుడు ఈ దృశ్యాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.

దేశంలో ఇంధన కొరత ఏర్పడబోతుందన్న ప్రచారంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.. బైకులతో పాటు కార్లతో రహదారులు కిక్కిరిసిపోయాయి. గంట తరబడి వేచి చూస్తున్న.. పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఉత్కంఠ భరిత వాతావరణం లో ఒక యువకుడు ఇచ్చిన ఎంట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా అక్కడే ఉన్న యువకులు ఈ ఘటన చూసి నవ్వుతూ ఉండిపోయారు..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

సాధారణంగా పెట్రోల్ కొరత ఉందంటే బాటిల్ లేదా చిన్న క్యాన్లతో రావడం చూస్తూ ఉంటాం కానీ ఈ యువకుడు ఒక అడుగు ముందుకేసి ఇంటి వద్ద ఉండే పెద్ద ప్లాస్టిక్ దమ్మును తీసుకువచ్చాడు బంకు వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో తన వంతు వచ్చే వరకు ఆ డ్రమ్మును తన తలపైనే పెట్టుకొని క్యూలో నిలబడ్డాడు పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి ఆ డ్రమ్ములోని పెట్రోల్ కొట్టాలని అడగడం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూశారు..

 
 
 
 
 

అక్కడే ఉన్న కొంతమంది వాహనదారులు ఈ వింత దృశ్యాన్ని చూసి తమ స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇంకేముంది గంటల వ్యవధిలోనే ఈ వీడియో మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుంది. ఇతని ముందుచూపు మామూలుగా లేదని కొంతమంది కామెంట్లు చేస్తూ వస్తుంటే.. మరి కొంతమంది తమ్ముడు ఆ డ్రమ్ము నిండా పెట్రోల్ కొట్టిస్తే దాన్ని నెత్తి మీద మోసుకెళ్తావా అని మరికొందరు ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1081
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 25, 2026 12:44:58
Tadepalli, Andhra Pradesh:

YS Jagan Padayatra: 'ఎన్నికల్లో ఏ హామీ నిలబెట్టుకోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. జగన్‌ పథకాలన్నింటినీ రద్దు చేశారు. సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ పథకాల్లోనూ పచ్చి మోసం. ఉన్న పలావూ పోయింది. బిర్యానీ మాట ఒట్టిదైంది' అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌‌ జగన్‌ ఎద్దేవా చేశారు. 'రెండేళ్లలోనే రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప. రూ.3.37 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి పథకాలు మాత్రం అమలు చేయలేదు. సంక్షేమం అంతకన్నా లేదు' అని చంద్రబాబు పాలనను విమర్శించారు. తెచ్చిన అప్పంతా ఏమై పోతోంది? అని సందేహం వ్యక్తం చేశారు.

Also Read: Petrol Shortage: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన

అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అనంతరం కీలక ప్రసంగం చేశారు. 'చూస్తుండగానే చంద్రబాబు పాలన రెండేళ్లు పూర్తయ్యింది. ఇంకా మూడేళ్లు ఉంది. ఒకటిన్నర సంవత్సరం ఎలాగోలా ముగుస్తుంది. ఆ తర్వాత నా పాద‌యాత్ర ప్రారంభమవుతుంది. పాద‌యాత్ర‌లో ప్ర‌తిరోజూ చంద్ర‌బాబుకు సినిమా చూపిద్దాం' అని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. రెడ్‌ బుక్‌కు,అన్యాయ‌ పాల‌న‌కు టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింది! చంద్రబాబుకు భయపడే రోజులు లేవు' అని స్పష్టం చేశారు.

Also Read: Jeevan Reddy: కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు

'ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడీ పర్వం సాగుతోంది. లిక్కర్‌ మాఫియా, ఇసుక, మట్టి, ల్యాటరైట్‌ ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అంతా దోపిడి. ఈ ప్రభుత్వంలో పాలన అనేది లేకుండా పోయింది' అని చంద్రబాబు పాలనపై వైఎస్‌ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. విద్య, వైద్యం, వ్యవసాయం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 'గవర్నమెంట్‌ స్కూళ్లలో గణనీయంగా తగ్గిన పిల్లలు. ఆరోగ్యశ్రీలో వైద్యం నిలిపివేసిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు. గిట్టుబాటు ధరల్లేక రైతుల, వ్యవసాయం విలవిల. కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ జోష్యం చెప్పారు.

Also Read: Gold Man: స్వర్ణాభరణాల్లో తిరుమల శ్రీవారితోనే పోటీ.. 25 కిలోల బంగారంతో గోల్డ్‌ మెన్‌ సందడి

మళ్లీ వచ్చే అధికారంలో జగన్‌-2లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. నియోజకవర్గాల పెంపు శుభవార్త అని సీట్ల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సీట్లు గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, ఎంపీ సీట్ల పెంపుతో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని ప్రకటించారు. గట్టిగా పని చేసే వారికి, పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం. నాయకులుగా ఎదిగేందుకు కార్యకర్తలకు అవకాశం. వారికి పూర్తి ప్రోత్సాహకారిగా ఉంటాం. అవకాశం ఇస్తాం' అని పార్టీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1032
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 25, 2026 12:37:21
Hyderabad, Telangana:

 Roti On Bike Silencer Video Watch Here: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనుషుల ఆలోచనలు కూడా వింతగా మారుతూ వస్తున్నాయి.. సాధారణంగా వంట చేయాలంటే పొయ్యి లేదా గ్యాస్ స్టవ్ అవసరం ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండా కేవలం బైక్ సైలెన్సర్ ఉపయోగించి ఓ మహిళ రొట్టెలు కాల్చడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది అక్షరాల నిజం.. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎల్పిజి కోరత కారణంగా చాలామంది ఇలాంటి వింత వింత ఆలోచనలతో ముందుకు వస్తున్నారు..

ప్రస్తుతం ఇంస్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్ వేదికలో ఈ వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక యువతి తన బైక్ పక్కనే పిండి ముద్దతో కూర్చుని ఉండడం మీరు చూడొచ్చు. ఆమె రొట్టెలను ఒత్తిన తర్వాత.. పక్కనే స్టార్ట్ చేసి ఉన్న బైక్ సైలెన్సర్ పై ఆ రొట్టెలను వేసింది. ఇంజన్ రన్ అవుతుండడంతో సైలెన్సర్ నుంచి వచ్చే విపరీతమైన వేడికి ఆ రొట్టె క్రమంగా కాలడం మీరు ఈ వైరల్ అవుతున్న వీడియోలో గమనించవచ్చు.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఆ రొట్టె రెండు వైపులా చక్కగా కాలిపోయింది..

ఆ యువతి కేవలం రొట్టె కాల్చడమే కాకుండా..తన ముందే ప్లేటు పట్టుకొని కూర్చున్న తన కుమారుడికి ఆ రొట్టెను వడ్డించింది.. ఆ బాలుడు కూడా ఏమీ తెలియనట్లు ఆ రొట్టెను తినడానికి సిద్ధం అవ్వడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే, ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు..ఇదేం ఐడియా రా బాబోయ్.. ఇలాంటివి ఎలా తడతాయని? కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపోతున్నారు..

 
 
 
 
 

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

అయితే ఈ వీడియో కేవలం వినోదం కోసం చేసిందా లేదా నిజంగానే వంట చేశారా అన్నది పక్కన పెడితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైలెన్సర్ నుంచి కార్బన్ మొనాక్సిడైడ్ వంటి విషపూరితమైన వాయువులు విడుదలవుతాయి.. అవి నేరుగా ఆహార పదార్థాలకు అంటుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. సైలెన్సర్ పై ఉండే ఇంధన అవశేషాలు ఆహారంలో కలిస్తే క్యాన్సర్ కారకంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వైద్యులు తెలుపుతున్నారు. 

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1047
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 25, 2026 12:25:42
Hyderabad, Telangana:

 Cobra In Crop Viral Video Watch: వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు ఊహించని షాక్ తగిలింది.. పొలంలో నాటు వేసేందుకు సిద్ధమైన సమయంలో ఒకటో రెండో కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో నాగుపాములు ప్రత్యక్షమై రైతులను భయాందోళన సృష్టించాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. చాలామంది ఈ వీడియో చూసిన వారంతా పాములు ఇలా వచ్చాయంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, అసలు పాములు పంట పొలంలోకి పదుల సంఖ్యలో ఎలా వచ్చాయో? రైతులు వాటిని ఏం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా పొలాల్లో పాములు కనిపించడం సహజమే అయినప్పటికీ..కానీ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం అత్యంత భయాందోళనకు గురి చేసేలా చేస్తున్నాయి. బురదతో కూడిన పంట పొలంలో నాటు వేసేందుకు రైతులు సిద్ధమవుతుండగా.. ఒక్కసారిగా అనేక నాగుపాములు అటు ఇటు పాకుతూ కనిపించాయి. నీటిపై తేలుతూ.. గట్లపై పడగ విప్పి తిరుగుతున్నట్లు మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. వీటిని చూసిన రైతులు కూలీలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.. ప్రాణ భయంతో అక్కడినుంచి కొంతమంది పరుగులు పెట్టేసారు..

రైతులు భయపడి పారిపోతుంటే మారి కొంతమంది ధైర్యం చేసి కర్రల సహాయంతో ఆ పాములను అదుపు చేసే ప్రయత్నం చేశారు.. అయితే ఆ సమయంలో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా మనుషులను చూడగానే పాములు పారిపోతూ ఉంటాయి.. కానీ ఇక్కడ మాత్రం పదుల సంఖ్యలో ఉన్న నాగుపాములు ఎదురుదాడికి దిగాయి.. బుసలు కొడుతూ.. పడగలు విప్పి కర్రెల పైకి.. మనుషులపైకి దూకేందుకు ప్రయత్నించాయి.. ఈ దృశ్యాలు చూస్తుంటే ఆ పొలం పాముల నిలయంగా మారిందనే సందేహం కలగక తప్పదు..

 
 
 
 
 

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతుల కష్టాలు పగవానికి కూడా రాకూడదని కొంతమంది కామెంట్లు చేస్తే.. ఇంత పెద్ద సంఖ్యలో పాములు ఒకేచోట ఉండటం చూస్తుంటే.. అక్కడ పాముల పుట్ట ఏదైనా ఉండొచ్చని.. మరి కొంతమంది కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. పన్య ప్రాణి ప్రేమికులు మాత్రం పాములను చంపకుండా సురక్షితమైన ప్రదేశాలకు తరలించేలా అడవి శాఖా సిబ్బందికి సమాచారం ఇయ్యాలని సూచిస్తున్నారు.. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు ఎండాకాలంలో పొలాల్లో పనులకు వెళ్లే రైతులు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1059
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 25, 2026 12:12:21
Hyderabad, Telangana:

 Cobra In Fridge Video Watch Now: సాధారణంగా ఫ్రిజ్ అంటేనే కూరగాయలతో పాటు పాలు చల్లని నీరు ఉంటాయని మనందరికీ తెలుసు.. కానీ ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ తీయగానే సాక్షాత్తు ఓ అత్యంత ప్రమాదకరమైన నాగుపాము దర్శనం ఇవ్వడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఆ పాము ఫ్రిడ్జ్ లోకి ఎలా వచ్చిందనేది తెలియనప్పటికీ.. ఓ పాము మాత్రం ఇప్పుడు దర్శనం ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. 

రోజువారి పనుల్లో భాగంగా ఒక వ్యక్తి తన ఇంట్లోని ఫ్రిడ్జ్ డోర్‌ను ఓపెన్ చేశాడు..లోపల ఏదో వస్తు తీసుకోవాలని చేయి పెట్టబోయే లోపే.. అక్కడ చుట్టుకొని ఉన్న ఒక చిన్న నాగుపాము చూసి ఒక్కసారి షాక్ కు గురయ్యాడు.. ఆ పాము కూడా ఊరికే ఉండకుండా.. డోర్ తీసిన వ్యక్తిపై ఒక్కసారిగా పడక విప్పి బుసలు కొడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వ్యక్తి మాత్రం ఎంతో చాకచక్యంగా తన చేతును ఆ ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసేసాడు..

వైరల్ అవుతున్న వీడియోలు ఆ నాగుపాము చాలా ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఫ్రిడ్జ్‌లోని అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా అది ఎంతో యాక్టివ్ గా ఉందో చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. యజమాని అప్రమత్తంగా ఉండి వెనక్కి తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కొంతమంది ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు. ఆ పాము ఫ్రిడ్జ్ వెనక ఉన్న ఇతర పైపుల నుంచి లోపలికి ప్రవేశించి ఉండచని కొంతమంది అంచనా వేస్తున్నారు. 

 
 
 
 
 

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. ఇకపై ఫ్రిజ్ డోర్ తీయాలన్నా భయం వేస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది పాములకు చల్లదనం అంటే ఇష్టమని విన్నాను కానీ.. ఇలా ఫ్రిడ్జ్ లోకి వస్తాయని అనుకోలేదని మరి కొంతమంది కామెంట్లు రాస్తూ వస్తున్నారు. మరి కొంతమంది అయితే.. ఎండాకాలం కావడంతో పాములు ఇలాంటి సురక్షితమైన ప్రదేశాల కోసం వెతుకుతుంటాయని.. అడవికి దగ్గరగా ఉండేవారు జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1070
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 25, 2026 12:01:17
Hyderabad, Telangana:

Sun Transit in Aries on April 14 Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా పిలిచే సూర్యుడు తన రాశిని మారినప్పుడల్లా ద్వాదశ రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతూ ఉంటుంది. 2026 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన చైత్ర సంక్రాంతి పర్వదినాన సూర్యుడు మీన రాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో మేష సంక్రాంతి కూడా అంటారు. అయితే, ఈ సంచారం రోజు నుంచి కొన్ని రాశుల వారికి గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆర్థికంగా వృత్తిపరంగా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే  కెరీర్ పరంగా కూడా ఊహించని పురోగతి లభించబోతోంది.

అదృష్టం వరించబోయే రాశులు ఇవే..
మేష రాశి 
మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం కారణంగా ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేసే వారికి లేదా ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా.. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తో పాటు జీతాల పెంపు కూడా ఉండబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

సింహరాశి 
సింహ రాశికి అధిపతి సూర్యుడు కావడం వల్ల.. ఈ సంచారం వీరికి కూడా అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారి కోరికను ఈ సమయంలో తప్పకుండా నెరవేరబోతున్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదరడమే కాకుండా.. భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సూర్యుడి సంచారం అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించబోతోంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు కూడా లభించబోతున్నాయి. సంతానం పరంగా అద్భుతమైన శుభవార్తలు వింటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది. నూతన పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే సరైన వ్యక్తులతో వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1098
comment0
Report
HDHarish Darla
Mar 25, 2026 11:35:06
Hyderabad, Telangana:

Mahesh Babu Trisha Affair News: తమిళనాడుతో పాటు ఇటు సినీ ఇండస్ట్రీలో హీరో విజయ్, హీరోయిన్ త్రిష అఫైర్ అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడిదే రూమర్ ఆ రాష్ట్రంతో పాటు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని కూడా ఊపేస్తుంది. అయితే హీరోయిన్ త్రిషకు విజయ్‌తో కాదని.. ఓ తెలుగు హీరోతో అఫైర్ ఉందని ఓ దర్శకనిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గత కొన్ని నెలలుగా రాజకీయ నాయకుడు, నటుడు విజయ్‌తో హీరోయిన్ త్రిష ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త తెలుగునాట సంచలనంగా మారింది. అయితే ఇదే ఆరోపణతో ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. సంగీత స్వర్ణలింగం కూడా విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. 

అలాగే విజయ్ ఓ హీరోయిన్ తో(ఆమె పేరు బయటపెట్టకుండా) ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపించింది. ఈలోగా త్రిష, తలపతి కలిసి కనిపించి కలకలం సృష్టించింది. ఇదే విషయమై టీవీకే అధినేత విజయ్ స్పందిస్తూ.. వ్యక్తిగత విషయాలను తాను సర్దుకోగలను అని కార్యకర్తలు చింతించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. 

అయితే విజయ్, త్రిష పేరుతో పాటు ఇప్పుడు ఆ బంధంలో మరో తెలుగు హీరో పేరు వినిపిస్తోంది. ఇదే విషయాన్ని టాలీవుడ్‌కు చెందిన ఓ దర్శకనిర్మాత గీతాకృష్ణ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. హీరో మహేష్ బాబు, త్రిషలకు అఫైర్ ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.

మహేష్, త్రిష రహస్య సంబంధం కలిగి ఉన్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నేరుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముంబైలోని ఓ రహస్యప్రాంతంలో వారిద్దరూ తరచూ కలుసుకునేవారని ఆయన తెలిపారు. మహేష్ బాబు భార్య నమ్రతకు ఈ విషయం తెలిశాక చాకచక్యంగా ఈ విషాయన్ని ఆమె కప్పిపుచ్చారని దర్శకుడు గీతాకృష్ణ స్పష్టం చేశారు. 

హీరో మహేష్ బాబు వ్యక్తిగత విషయానికొస్తే.. ఆయన హీరోయిన్ నమ్రతను ప్రేమించి పెళ్లాడారు. 'వంశీ' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ.. చాలా ఏళ్లుగా ప్రేమించుకుని, చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. భారీ బడ్జెట్ చిత్రమైన ఇందులో ప్రియాంక్ చోప్రా జోనస్ కథానాయికగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

ALso Read: Lockdown In India 2026: భారత్‌లో మరోసారి లాక్‌డౌన్! ప్రధాని మోదీ కీలక ప్రకటన..దేశంలో లాక్‌డౌన్ వస్తుందా? లేదా?

Also Read: OnePlus 15T launch Price: రేపే OnePlus 15T లాంఛింగ్.. 7500 బ్యాటరీతో మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్..ధర ఎంతంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1001
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 25, 2026 08:48:26
Balapur, Telangana:

Petrol And Diesel Shortage: రెండు రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా పెట్రోల్‌ బంక్‌లు వాహనదారులతో నిండిపోయాయి. భారీ స్థాయిలో క్యూ లైన్లు ఏర్పడి పరిస్థితి భయానకంగా మారడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ స్పందించారు. ఈ సందర్భంగా ప్రజలకు కొన్ని సూచనలు చేస్తూ ీలక ప్రకటన చేశారు. 'సోషల్ మీడియా వదంతులను నమ్మకండి. పెట్రోలు, డీజిల్ కొరత లేనేలేదు' అని ప్రకటించారు.

Also Read: Jeevan Reddy: కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు

'ఆయిల్ సంస్థల వద్ద అవసరానికి సరిపడ పెట్రోలు, డీజిల్ నిల్వలున్నాయని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆయిల్ సరఫరాలోనూ ఇబ్బందుల్లేవు. పెట్రోలు, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది' అని బండి సంజయ్‌ వివరించారు. మోదీ ప్రభుత్వం ఆయిల్ నిల్వలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని చెప్పారు. వదంతలు నమ్మి అవసరానికి మించి పెట్రోలు కొనడంవల్ల క్రుత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.

Also Read: Gold Man: స్వర్ణాభరణాల్లో తిరుమల శ్రీవారితోనే పోటీ.. 25 కిలోల బంగారంతో గోల్డ్‌ మెన్‌ సందడి

రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులు నమ్మవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజలకు విజ్ఝప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని.. కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. కృత్రిమ కొరత స్రుష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వాహనదారులు రోజువారీ అవసరాలకు తగ్గట్లుగానే క్రమశిక్షణతో పెట్రోలు, డీజిల్‌ను కొనుగోలు చేయాలని కోరారు.

Also Read: SBI Interest Rate: ఎస్‌బీఐ ఖాతాదారులకు పండుగే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ రేట్ల పెంపు

అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కొట్టిపారేశారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రకటించారు. ఇండియన్ ఆయిల్, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ వంటి అన్ని పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీల వద్ద అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉందని.. పెట్రోల్‌, డీజిల్ సరఫరాలో లోపం లేదని వివరించారు. 

పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే పుకార్లు, దుష్ప్రచారాన్ని నమ్మి పెట్రోలు బంకుల వద్దకు పరుగులు తీయరాదని బండి సంజయ్‌ సూచించారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో కొన్ని పెట్రోలు బంకుల్లో తాత్కాలిక స్టాక్ కొరత ఏర్పడిందని వివరించారు. ఎలాంటి కొరత లేదని.. పెట్రోల్ బంకుల్లో కృత్రిమ కొరత ఇబ్బందుల్లేకుండా యథావిధిగానే సరఫరా కొనసాగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1084
comment0
Report
HDHarish Darla
Mar 25, 2026 08:37:35
Hyderabad, Telangana:

Lockdown In India 2026 News: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత భారత్‌లోనూ ప్రభావం చూపనుందని పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం నాటి పరిస్థితులకు ప్రజలకు సిద్ధంగా ఉండాలని మోదీ పిలుపు మేరకు ప్రజల్లో మరోసారి కలవరం మొదలైంది. ఈ క్రమంలో దేశంలో మరోసారి లాక్‌డౌన్ రావొచ్చనే చర్చ విపరీతంగా జరుగుతోంది.  అయితే దేశంలో ఎలాంటి భయాందోళన పరిస్థితులు లేవని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 

కొన్ని జాతీయ నివేదికల ప్రకారం.. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రస్తుత పరిస్థితిని 'దశాబ్దాలలో అత్యంత తీవ్రమైన ఇంధన సంక్షోభం'గా అభివర్ణించారు. ప్రపంచంలో రోజుకు 11 మిలియన్ బ్యారెళ్ల చమురును లాస్ అవుతోందని గుర్తించారు. 1970 తర్వాత ఇంతటి భారీ నష్టం జరగడం ఇదే మొదటిసారి అని ఐఈఏ తెలిపింది. ఆ సంక్షోభ సమయంలో ప్రపంచం రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును కోల్పోయేది. పార్లమెంట్‌లో కూడా ఇలాంటి సంక్షోభమే తలెత్తవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

అయితే అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) హెచ్చరిక నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌ దేశంలో జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీని లాగే అనేక దేశాలు ఇదే బాట పట్టనున్నాయని సమాచారం. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు అత్యవసర చర్యగా 4 రోజుల పనివారాన్ని అమలు చేశాయి. అత్యవసరంగా కానీ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. అదే విధంగా ఇంధన పొదుపు నియమాలను పాటించాలని సూచించారు. అయితే మన దేశంలో ప్రస్తుతం 45 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. 

శ్రీలంక కొన్ని రంగాలకు ప్రభుత్వ సెలవులను తప్పనిసరి చేసింది. బంగ్లాదేశ్‌లో కూడా ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. అదే విధంగా నిర్దిష్ట సమయాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అదే విధంగా పాకిస్థాన్ కూడా వారంలో పని గంటలను తగ్గించింది. వియత్నాంలో వ్యాపారాలు ఇంటి నుంచే పనిచేయాలని సూచించారు.

భారత్ ప్లానింగ్స్ ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సమస్యలు తలెత్తుతున్న క్రమంలో భారత్ విధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్‌కు కావాల్సిన ముడిచమురు, గ్యాస్‌ను సుమారు 50 శాతం గల్ఫ్ నుంచి ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. ఇప్పుడు అదే శాతం సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం ఇప్పటికే దేశంలో కనిపిస్తోంది.

యుద్ధం నేపథ్యంలో భారతదేశం పారిశ్రామిక గ్యాస్ సరఫరాలను తగ్గించి, LPG ఉత్పత్తిని పెంచింది. గల్ఫ్ దేశాలతో పాటు, భారతదేశం ఇప్పుడు మరెన్నో దేశాల నుంచి చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ప్రధాని మోదీ చెప్పినట్లుగా, భారతదేశం గతంలో 27 దేశాల నుంచి చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకునేది. ఇప్పుడు ఈ సంఖ్య 41కి పెరిగింది.

భారతదేశం వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెట్రోలియం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అదనంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ కూడా చెప్పారు. గత 11 ఏళ్లలో భారతదేశం కూడా తన శుద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది.

భారత్‌లో లాక్‌డౌన్ ఉంటుందా?
మీడియా నివేదికల ప్రకారం.. భారతదేశం ప్రస్తుతం లాక్‌డౌన్‌లో లేదు. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే, పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో ఉంది ఇంధన కొరతే కానీ, కరోనా మహమ్మారి లాగా ప్రాణాంతమైన వైరస్ కాదు. కాబట్టి, లాక్‌డౌన్ ఉండకపోవచ్చు. ఆఫీసులు వర్క్‌ఫ్రమ్ హోమ్, అత్యవసర ప్రయాణాలు తప్పా మిగితా వాటిపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. 

ALso Read: 8th Pay Commission: ఉద్యోగులు మరో తీపికబురు..8వ వేతన సంఘం ద్వారా జీతాలు భారీగా పెంపు?! అకౌంట్లోకి జమ అప్పటి నుంచే!

Also Read: OnePlus 15T launch Price: రేపే OnePlus 15T లాంఛింగ్.. 7500 బ్యాటరీతో మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్..ధర ఎంతంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1094
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 25, 2026 08:06:44
Jagtial, Telangana:

Jeevan Reddy Resigned: ఎంత మంది బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు. తనకు జరిగిన అవమానంతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి అనుకున్నట్టుగానే కాంగ్రెస్‌ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై.. కాంగ్రెస్‌ తీరుపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. తన సిట్టింగ్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేను చేర్చుకుని తన ఉనికికే ప్రమాదంగా మారిన పరిస్థితుల్లో ఆయన ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీలో ఆయన చేరిక లాంఛనమే కానుంది. ఆయన రాజీనామాతో ఉమ్మడి కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా భావించవచ్చు.

Also Read: Gold Man: స్వర్ణాభరణాల్లో తిరుమల శ్రీవారితోనే పోటీ.. 25 కిలోల బంగారంతో గోల్డ్‌ మెన్‌ సందడి

తీవ్ర మనోవేదన
జగిత్యాలలో నిర్వహించిన తన అనుచరులు, అభిమానుల సమావేశంలో జీవన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రాజీనామా లేఖను విడుదల చేశారు. 'పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు.. జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదు. నేను, నా కార్యకర్తలు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాం. తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నా' అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.

Also Read: Telangana Assembly: 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్‌ చేసుడేంది?' అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించిన సంఘటన

కార్యకర్తల సమావేశంలో జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను కొంతమంది లాగా ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, కానీ మమ్మల్ని కూడా బతకనివ్వు' అని రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు. 'నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎంతమందిని తొక్కుతావయ్య నువ్వు రేవంత్ రెడ్డి. నీ తొక్కుడు కాదు రేవంత్ రెడ్డి.. ఈ జగిత్యాలలో ఏ శక్తి నన్ను ఆపలేదు. ఎవడయ్యా ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి? వాడికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? బతకడానికి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. వాడు ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం అయిన తర్వాత వాడు ఇచ్చిన సలహాలు ఏమైనా ఉన్నాయా?' అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

'వేం నరేందర్ రెడ్డి ఎవడు? ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంది?' అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిలదీశారు. 'రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా. నీతో అణగదొక్కబడటం కంటే పోరాటం చేస్తే నాకు పోయేది ఏముంది?' అని రేవంత్‌ రెడ్డికి సవాల్‌ చేశారు. 'రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెంట్ మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. చేవెళ్ల ఎంపీ స్థానానికి తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి.. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డిని తెచ్చి అతడికి ఇచ్చారు. దాని ప్రభావం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ స్థానం మహబూబ్ నగర్ అలానే చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది' అని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. 'దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ, కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడం దేనికి సంకేతం. అందుకే సికింద్రాబాద్ ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది' అని తెలిపారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

964
comment0
Report
Advertisement
Back to top