Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500072

శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలి: ఏసీపీ శ్రీనివాసరావు

Jun 15, 2024 09:58:31
Hyderabad, Telangana

శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు ఆదేశించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎన్‌కెఎన్‌ఆర్ గార్డెన్‌లో బాచుపల్లి, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగలో ఇచ్చే కుర్బనిలో రక్తం రోడ్డుపై వేయకుండా, చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకునేలా చూడాలని మత పెద్దలను కోరారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 10:18:13
Hyderabad, Telangana:

Honor X80 Specifications Leak News: చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హానర్ అత్యంత తక్కువ ధరలోని ఎంతో శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ హానర్ X80 పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన 10,000 mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని మోస్ట్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్ కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఇటీవల సోషల్ మీడియాలో మీకైనా ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

హానర్ X80 స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్‌లో విడుదల చేసిన హానర్ X70 స్థానంలో అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇది చాలా ప్రత్యేకమైన 6.79-అంగుళాల 1.5K డిస్‌ప్లే కలిగి ఉండబోతోంది. దీంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్‌ల గరిష్ట బ్రైట్నెస్ సపోర్టును కలిగి ఉంటుంది. అయితే, చైనా మార్కెట్లో విడుదలైన.. స్మార్ట్ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇందులోని హైఎండ్  256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. 

అంతేకాకుండా ఇది మోస్ట్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా MagicOS 9.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఇది అదనంగా 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌లో చైనాలో విడుదలైంది. ఇప్పుడు ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇక ఈ Honor X80 స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 8,300mAh బ్యాటరీ 80W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 512GB వేరియంట్ 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే హై ఎండ్ వేరియంట్ మాత్రం 10,000mAh బ్యాటరీలతో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో చాలా ప్రత్యేకమైన బ్లూటూత్, వై-ఫై, NFC కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ఎన్నో రకాల కొత్త ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కంపెనీ గతంలో విడుదల చేసిన అన్ని మొబైల్స్ మోడల్స్ కంటే ఇందులో అద్భుతమైన కొత్త కలర్ ఆప్షన్స్‌లో తీసుకురాబోతోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Feb 08, 2026 10:03:06
1
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 10:01:41
Hyderabad, Telangana:

Nagamani Stone Video Watch Here: పాముల గురించి సమాజంలో ఉన్న అనేక అపోహాల్లో నాగమణి కూడా ఒకటి.. ఈ నాగమణి నాగుపాముల తలపై పెరుగుతుందని.. ఇది ఎంతో విలువైనదని చాలా వరకు పల్లె ప్రాంతాల్లో ఉండే కొంతమంది నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది అయితే దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని.. ఊళ్లో జనాలను నమ్మించి వారికి విక్రయిస్తూ ఉంటారు. ఇలా కొంతమంది లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. నిజానికి ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఇటీవలే ఒక స్నేక్ క్యాచర్ తన వీడియో ద్వారా సమాజానికి తెలిపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది.

ఈ వైరల్ అవుతున్న వీడియోలు స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ.. నాగుపాముల తల మీద అరుదైన వజ్రం ఉంటుందనేది కేవలం ఒక భ్రమ అని స్నేక్ క్యాచర్ కొట్టిపారేశారు. కొంతమంది గిరిజనుల్లో స్వార్ధపరులు అమాయక ప్రజలను నమ్మించి వారి నుంచి వేల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ సమయంలో వారు పాములను హింసిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పాము తలపై ఒక కత్తితో గాయం చేసి అందులో ఆ రాయిని ఉంచి.. జనాలను రత్నంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆ పామును వీడియోలో చూపిస్తూ.. తెలిపారు.

అంతేకాకుండా ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ మున్నా నాగమణి నాటకం కోసం కొంతమంది పాములను ఎంతగా హింసిస్తున్నారో కూడా వివరించారు. పాముల తల వెనుక భాగాన్ని కట్ చేసి.. అందులో  ఆ నలుపు రంగు రాళ్ళను ఉంచి.. ఒక రసాయన పదార్థంతో మళ్లీ ఆ గాయాన్ని మూసేసి.. కుట్లు వేస్తున్నారని తెలిపారు.. దీనివల్ల పాములు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురై చనిపోతున్నాయని వారు తెలిపారు.. డబ్బు కోసం ఇలాంటి మూడవ నమ్మకాలను ప్రచారం చేస్తూ పాములను బలి తీసుకుంటున్నారని ఆయన వీడియోలో వెల్లడించారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఈ వీడియోలో జనాలకు అవగాహన కల్పించడమే కాకుండా.. మున్నా తను పట్టుకున్న ప్రమాదకరమైన మూడు భారీ పాములను సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టడం మీరు చూడొచ్చు. ఇలా ప్రకృతి కోసం అతను దాదాపు రోజులోనే మూడు నుంచి నాలుగు పాములను పట్టుకుంటున్నారని వీడియోలో తెలిపారు. ఈ ప్రమాదకరమైన పాములు పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరమని.. వాటిని ఇంటి పరిసర ప్రాంతాల్లో చూస్తే సమాచారం అందించాలని ఆయన కోరారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 08, 2026 09:19:11
Sadashivpet, Telangana:

Harish Rao vs Revanth Reddy: రెండేళ్లలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. అన్నం పెట్టిన కేసీఆర్ కావాలా.. హామీల పేరుతో జనాలకు 'సున్నం' పెట్టిన రేవంత్ రెడ్డి కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి.. చెత్త సేకరణ కూడా చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు 5 ఎకరాల చొప్పున కేసీఆర్‌ ప్రభుత్వం శ్మశాన వాటికలు ఇచ్చింది' అని గుర్తుచేశారు. ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పాలని ప్రజలను అడిగారు. బస్సు తప్ప మిగతాదంతా తుస్సు అని రేవంత్‌ రెడ్డి పాలనను తీసిపడేశారు.

Also Read: KT Rama Rao: తెలంగాణకు కాంగ్రెస్‌, బీజేపీలు చేసిందేమీ లేదు: కేటీఆర్‌

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేటలో మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రెండున్నరేళ్లలో ఒక్కో అవ్వతాతకు రేవంత్‌ రెడ్డి రూ.52,000 బాకీ పడ్డాడు. మనకు అన్నం పెట్టిన కేసీఆర్ కు ఓటేద్దామా? లేక హామీల పేరుతో మోసం చేసి ప్రజలకు సున్నం పెట్టిన కాంగ్రెస్‌కు ఓటేద్దామా?' అని ప్రజలను మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పాలని కోరగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బస్సు తప్ప మిగతాదంతా తుస్సు అని.. భార్యకు ఫ్రీ టికెట్ అని, భర్తకు డబల్ రేట్లు బాదుతున్నారని గుర్తుచేశారు.

Also Read: World Cup 2026: చిచ్చరపిడుగులా చిరుతపులుల్లా.. అండర్‌ 19 ప్రపంచకప్‌ చాంపియన్‌ భారత్‌

'తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2000 పెన్షన్ ఇస్తే రేవంత్ రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రెండున్నరేళ్లలో ఒక్కో అవ్వకు, తాతకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 52,000 బాకీ పడింది. ఆ డబ్బులు ఇచ్చాకే ఓట్లు అడిగే హక్కు మీకు ఉంటుంది. ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ లక్ష ఇస్తే.. తులం బంగారం ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఒక్కరికైనా ఇచ్చాడా?' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. సదాశివపేటలో కేసీఆర్‌ ప్రభుత్వం మొత్తం రూ.284 కోట్లతో అభివృద్ధి చేసిందని వెల్లడించారు.

Also Read: YS Jagan: మూడేళ్లలో వచ్చేది మా ప్రభుత్వమే.. ఎవరినీ వదలి పెట్టబోం: వైఎస్‌ జగన్‌

'హామీల గురించి అడిగితే.. లాగుల తొండలు వదులుతా, పేగులు మెడలో వేసుకుంటా అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి చెత్త సేకరణ కూడా చేతకాని అసమర్థుడు. కేవలం మురికి మాటలు, చెత్త మాటలే. ఈ బూతుల ముఖ్యమంత్రికి 11వ తారీఖున పోలింగ్ బూత్‌లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలి' అని సదాశివపేట ప్రజలకు మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. 'బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు  కట్టింది కేసీఆర్. సంగారెడ్డిలో రూ.20 కోట్లతో మైనార్టీ స్కూల్  ఏర్పాటు చేసింది కేసీఆర్. షాదీ ముబారక్, ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చింది కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి రంజాన్ తోఫా బంద్ చేశాడు. ముస్లింలకు రూ. 4000 కోట్లు ఇస్తానని మోసం చేశాడు' అని తెలిపారు.

'సదాశివపేటలో హిందువులకు 5 ఎకరాలు, ముస్లింలకు 5 ఎకరాలు, క్రిస్టియన్లకు 5 ఎకరాల భూమిని శ్మశాన వాటికల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.50 కోట్లు ఉంటుంది. అన్ని వర్గాలను ఆదరించింది కేసీఆర్‌ ప్రభుత్వమే' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్‌ రావు ప్రకటించారు. 'కాంగ్రెస్ వాళ్లు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధులు రేవంత్ రెడ్డి జేబులో నుంచి ఇచ్చేవి కావు. అవి మీ హక్కు' అని స్పష్టం చేశారు.

'రెండేళ్ల తర్వాత మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి రాగానే చేప పిల్లలు బంద్, బతుకమ్మ చీరలు బంద్, కేసీఆర్ కిట్ బంద్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్.. అన్నీ బంద్ పెట్టి ప్రజలను గోస పెడుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి' అని ఓటర్లకు మాజీ మంత్రి హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 08, 2026 07:59:51
Nunna, Vijayawada, Andhra Pradesh:

Vellampalli Srinivas On Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని నిరూపించగలరా? అంటూ ఆయన ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు.

విజయవాడలో మీడియాలో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్, చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీబీఐ, సిట్ విచారణలో నిజాలు బయటపడినా ప్రభుత్వం ఇంకా బుకాయిస్తోందని ఆయన ఆరోపించారు.

రిపోర్టులపై క్లారిటీ ఏది?
సీబీఐ, సిట్ ఇచ్చిన నివేదికల్లో ఎక్కడా జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని తేలిందని వెల్లంపల్లి పేర్కొన్నారు. "చార్జ్ షీట్‌లో కూడా యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టంగా ఉన్నప్పుడు, పవన్ కల్యాణ్ ఎందుకు అంత యాగీ చేశారు?" అని ప్రశ్నించారు.

తప్పుడు ప్రచారంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.

కొత్త నాటకానికి తెరతీశారా?
జంతువుల కొవ్వు అంటే ప్రజలు నమ్మడం లేదని గ్రహించి, ఇప్పుడు లడ్డూలో యాసిడ్లు కలిపారంటూ కొత్త ప్రచారానికి తెరతీశారని వెల్లంపల్లి మండిపడ్డారు. "తినే పదార్థాల్లో యాసిడ్లు కలిపితే ఏమవుతుందో మీకే తెలియాలి" అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు ఇలాంటి 'డైవర్షన్' రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

అయోధ్య లడ్డూల గందరగోళం
అయోధ్యకు కల్తీ లడ్డూలు పంపారని ఆరోపించిన పవన్ కళ్యాణ్‌పై వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ లడ్డూలను ఎవరు తయారు చేశారు? ఎక్కడి నుంచి పంపారు? అనే కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడి అపహాస్యం పాలయ్యారని విమర్శించారు. వైసీపీ హయాంలో లడ్డూ నాణ్యతపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, అవే ట్యాంకర్లు మళ్లీ లోపలికి వెళ్లాయని వెల్లంపల్లి ఆరోపించారు. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారాలు చేయడం మంచిది కాదని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని వెల్లంపల్లి హెచ్చరించారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు ఆపి, పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.

తప్పు ఒప్పుకున్న టీటీడీ మాజీ ఛైర్మన్..!
వైసీపీ అధికారంలో చేపట్టిన తర్వాత టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడారు. కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయన స్పష్టం చేశారు. అయితే టీటీడీ మాజీ ఛైర్మన్ కల్తీని నిర్ధారించిన.. వైసీపీ అధినేత దగ్గర నుంచి స్థానిక నేతల వరకు కూటమి ప్రభుత్వాన్ని బుకాయించడం కొసమెరుపు.

Also REad: India Vs USA Match: టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం..పోరాడి ఓడిన యూఎస్ఏ!

Also REad: Pawan Kalyan Surender Reddy Movie: పవన్ కల్యాణ్ సరసన ప్రభాస్ హీరోయిన్..సురేందర్ రెడ్డి సినిమాతో మరో బ్లాక్‌బాస్టర్?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 05:43:50
Hyderabad, Telangana:

Siddhi Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే చంద్రుడు తులా రాశిలోకి సంచరించడం.. బుధుడు ఈ రోజే కదలికలు జరపడం వల్ల ఎంతో శక్తివంతమైన సిద్ధియోగం ఏర్పడింది. అన్ని యోగాలతో పోలిస్తే.. దీనిని ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తారు. కాబట్టి దీని ప్రభావం మొత్తం అన్ని  రాశుల వారిపై పడుతుంది. దీంతో ఆయా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదే సమయంలో సర్వార్ధ సిద్ధ యోగంతో పాటు ఎంతో శక్తివంతమైన రవి యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆయా రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలిగి అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
మేషరాశి 
ఈ ఆదివారం నుంచి మేష రాశి వారికి అంతా బాగుంటుంది. ముఖ్యంగా వీరికి నైపుణ్యం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు కూడా చాలా వరకు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని విశేషమైన ప్రతిభ కనబరిచితారు.. అలాగే స్నేహితులతో పాటు సహుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన చాలావరకు ఆదాయాన్ని పొందుతారు. ప్రేమ జీవితం కూడా ఎంతో లాభసాటిగా మారుతుంది. తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహకాలు కూడా పొందుతారు. అలాగే ప్రేమ జీవితం కూడా చాలా ఆనందంగా కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

మిథున రాశి 
ఈ ఆదివారం నుంచి మిథున రాశి వారికి ఎన్నో రకాల అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి కమ్యూనికేషన్ నైపుణ్యం విపరీతంగా పెరిగి సమాజంలో కీర్తి, ప్రతిష్ట లభిస్తాయి. అలాగే కుటుంబ జీవితంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలాకాలం పరిష్కారం కాని పనులు కూడా ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు. పిల్లలతో సమయం గడపడం వల్ల కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఇతర విలాసవంతాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

మకర రాశి 
మకర రాశి వారికి ఈ సమయంలో విపరీతంగా గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించబోతోంది. అలాగే కెరీర్ పరంగా అదృష్టం కూడా సహకరించబోతోంది. తెలివితేటలు విపరీతంగా పెరగడం వల్ల ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు పొందుతారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఎలాంటి కోరికలు కోరుకున్నప్పటికీ ఈ సమయంలో అవి నెరవేర్చుకునే దిశగా పనులు చేయగలుగుతారు. అలాగే ప్రేమ జీవితం కూడా చాలా లాభసాటిగా మారుతుంది. అద్భుతమైన పనులు చేసిన ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా కూడా చాలావరకు మెరుగుపడబోతోంది.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
AMAruna Maharaju
Feb 08, 2026 04:10:49
Hyderabad, Telangana:

PM Narendra Modi Malaysia Tour: ప్రధాని మోదీ రెండు రోజుల మలేషియా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆదివారం, ఫిబ్రవరి 8 రెండవ రోజు  పర్యటనలో భాగంగా.. కౌలాలంపూర్‌లో ప్రధాని మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, మంత్రులు, రెండు దేశాల ప్రతినిధులతో పెర్దానా పుత్ర భవనంలో సమావేశమయ్యారు. అంతకుముందు ప్రధాని మోదీకి గౌరవ గార్డుతో స్వాగతం పలికారు. తన పర్యటన మొదటి రోజున మోదీ రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు, పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మీరు నన్ను, నా ప్రతినిధి బృందాన్ని స్వాగతించిన తీరుకు, ఈ కొన్ని గంటల్లో సాంప్రదాయ ఆచారాలను పక్కనపెట్టి మలేషియా జీవితాన్ని చాలా అందంగా ప్రదర్శించిన తీరుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీరు నిర్వహించిన అద్భుతమైన విధానం ఎల్లప్పుడూ మా జ్ఞాపకాలలో నిలిచి ఉంటుందని.. దీనికి నేను మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోదీ అన్నారు.

అలాగే కౌలాలంపూర్‌లో వేలాది మంది భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. భారతదేశం-మలేషియా సంబంధాలు నమ్మకం, సంస్కృతి, ఆర్థిక ఆశయాల ద్వారా నడిచే కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాయని అన్నారు. భారతీయ ప్రవాసులను సజీవ వారధిగా ఆయన అభివర్ణించారు. శతాబ్దాల నాటి తమిళ మూలాలు, ఉమ్మడి సంప్రదాయాలు, సాంస్కృతిక కొనసాగింపుపై మలేషియా ప్రధాని మంత్రి అన్వర్ ఇబ్రహీంను మోదీ ప్రశంసించారు.

మలేషియా పర్యటనలో ద్వైపాక్షిక సహకారానికి మార్గనిర్దేశం చేసే ఇంపాక్ట్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వాణిజ్యం, స్టార్టప్‌ల నుండి రక్షణ, సాంకేతికత వరకు, భారతదేశ పురోగతి మలేషియా విజయంతో విడదీయరానిదని మోదీ అభివర్ణించారు. 800 మందికి పైగా నృత్యకారులు ప్రదర్శించిన ఈ రికార్డు స్థాయి సాంస్కృతిక ప్రదర్శన రాబోయే సంవత్సరాల్లో గుర్తుండిపోతుందని ప్రధానమంత్రి సాంస్కృతిక ప్రదర్శనను ప్రశంసించారు. కళాకారులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, తాను ప్రధానమంత్రి కాకముందు నుండే స్నేహితులమని మోదీ అన్నారు. ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సంస్కరణలపై దృష్టి పెట్టడం, ఆయన అద్భుతమైన అవగాహన, ఆసియాన్ 2025కు ఆయన సమర్థ అధ్యక్షత వహించడం పట్ల మోదీ ప్రశంసలు కురిపించారు. గత సంవత్సరం మలేషియాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాని ప్రధాని మోదీ, త్వరలో మలేషియాను సందర్శిస్తానని హామీ ఇచ్చానని, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానన్నారు.  

Also Read: Chandra Mangal Yoga: చంద్ర మంగళ యోగం వల్ల ఈ 4 రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..

Also Read: Shani Shukra Yuti: మీనరాశిలో శనిదేవుడి, శుక్ర గ్రహాల సంయోగంతో ఈ 3 రాశుల వారికి ఉజ్వల భవిష్యత్తు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 07, 2026 17:14:44
Hyderabad, Telangana:

India Vs USA T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు యూఏఎస్ గట్టి పోటీని ఇచ్చినా.. చివరికి విజయం భారత్‌ను వరించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన యూఎస్ఏ టీమ్.. భారత బౌలర్ల ధాటికి 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 

కానీ, టీమ్ఇండియా లాంటి బలమైన జట్టుతో యూఎస్ఏ పోరాడిన విధానానికి ప్రేక్షకుల నుంచి ఆదారాభిమానాలు లభించాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూఎస్ఏ.. భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో ఒకింత విజయం సాధించారు. అయితే టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించాడు. 

162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన యూఎస్ఏ టీమ్‌కు ఆదిలోనే భారత బౌలర్ల రూపంలో అడ్డు తగిలింది. గౌస్ (6), ఎస్ఆర్ ముక్కమల్ల (2), ఎండీ పటేల్ (0) (కెప్టెన్) వెంటనే వెనుదిరిగినా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మిలింద్ కుమార్ (34), కృష్ణమూర్తి (37) పోరాడి పెవిలీయన్ చేరారు.  ఆ తర్వాత వచ్చిన శుభమ్ (37) చివర్లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించినా అప్పటికే అమెరికా ఓటమికి చేరువైంది. 

యూఎస్ఏపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. సిరాజ్ 3 వికెట్లు.. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ వరుణ్ 1 వికెట్‌ పడగొట్టాడు.

భారత ఇన్నింగ్స్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్‌ఇండియాకు తొలి మ్యాచ్‌లోనే అమెరికా (USA) గట్టి పోటీని ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

తొలి మ్యాచ్‌లోనే భారత టాపార్డర్ తడబడటంతో బాధ్యత తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ (84)* మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆఖరి రెండు ఓవర్లలో గేర్ మార్చిన స్కై, వరుసగా 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) పర్వాలేదనిపించారు.

సూర్య ఒకవైపు నిలకడగా ఆడినా, మిగిలిన బ్యాటర్లు అమెరికా బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే ఇద్దరూ గోల్డెన్ డక్ (తొలి బంతికే అవుట్)గా వెనుదిరగడం అభిమానులను నిరాశకు గురిచేసింది. రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్య (5), అర్ష్‌దీప్ సింగ్ (4) వంటి ఫినిషర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. చివరి బంతికి వరుణ్ చక్రవర్తి రనౌట్ అవ్వడంతో భారత్ 9 వికెట్లు కోల్పోయింది.

పసికూనగా భావించిన అమెరికా జట్టు భారత బ్యాటర్లను బాగా వణికించింది. అమెరికా బౌలర్ షాడ్లీ అద్భుత స్పెల్‌తో 4 వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి భారత ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. హర్మీత్ సింగ్ 2 వికెట్లు తీయగా, అలీ ఖాన్, మొహ్సిన్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.

Also Read: Vaibhav Suryavanshi 175: వైభవ్‌ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి! ఆ దేశ క్రికెట్ బోర్డు సంచలన ట్వీట్!

Also Read: Pakistan Vs Netherlands: పాకిస్థాన్‌ను వణికించిన నెదర్లాండ్..పరమచెత్తగా ఆడిన పాక్ చివరికి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 07, 2026 13:18:33
Hyderabad, Telangana:

Imanvi In Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సురేందర్ రెడ్డి సిద్ధం చేయగా, ఈ సినిమా హీరోయిన్ ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2026 ఉగాది పర్వదినాన ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ వేట ముమ్మరంగా సాగుతోంది. ఈ రేసులో ఒక కొత్త పేరు బలంగా వినిపిస్తోంది.

రష్మిక కాదు.. ఇమాన్వీ?
మొదట్లో ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు వినిపించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఒక కొత్త బ్యూటీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' (Fauji) సినిమాతో ఇమాన్వీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. తన క్లాసిక్ లుక్స్ మరియు సోషల్ మీడియా క్రేజ్ దృష్ట్యా, పవన్ సరసన ఈమె అయితే ఫ్రెష్‌గా ఉంటుందని సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. పవన్ కల్యాణ్ తన రాజకీయ, ఇతర సినిమా కమిట్‌మెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రానికి డేట్స్ కేటాయించనున్నారు. 2026 మార్చిలో (ఉగాదికి) ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించి, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

సురేందర్ రెడ్డి మార్క్ స్టైలిష్ యాక్షన్, పవన్ కల్యాణ్ మాస్ అప్పీల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇప్పటికే కథా చర్చలు ముగియగా, ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది.

ఇమాన్వీ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ, చిత్ర నిర్మాణ సంస్థ నుండి గానీ, సురేందర్ రెడ్డి నుండి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇమాన్వీ కన్ఫర్మ్ అయితే, ప్రభాస్ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్‌తో ఛాన్స్ దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు మలుపు తిప్పే 'బంపర్ ఆఫర్' అనే చెప్పాలి.

Also Read: Student Attacks Teacher: నడిరోడ్డుపై దారుణం..టీచర్‌పై స్టూడెంట్ అఘాయిత్యం..ప్రేమించలేదని పెదవి కొరికి..!

Also Read: Vaibhav Suryavanshi 175: వైభవ్‌ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి! ఆ దేశ క్రికెట్ బోర్డు సంచలన ట్వీట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 07, 2026 12:13:39
Hyderabad, Telangana:

 Motorola G86 Power 5g Price Cut: అత్యంత తగ్గింపు ధరతోనే MOTOROLA G86 Power 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ వాలెంటైన్స్ డే ఆఫర్స్‌లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. ముఖ్యంగా దీనిపై ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఈ మొబైల్‌పై ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. వీటన్నిటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి చీప్ ధరకే మొబైల్ లభిస్తుంది. 

MOTOROLA G86 Power స్మార్ట్‌ఫోన్ దిమ్మ తిరిగే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది 6.7 అంగుళాల Super HD (1.5K) AMOLED/pOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 (4nm Octa-core) ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.  అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్‌తో ప్రారంభమవుతుంది. అయితే దీని వెనుక భాగంలో ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు అద్భుతమైన కెమెరా మాడ్యూల్ లభిస్తుంది. దీనికి ప్రత్యేకంగా 50MP మెయిన్ కెమెరా (Sony LYTIA 600 సెన్సార్, OIS) కెమెరా కలిగి ఉంటుంది. దీంతోపాటు అదనంగా 8MP అల్ట్రావైడ్, మాక్రో లెన్స్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. 

ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 6720mAh భారీ బ్యాటరీ, 33W TurboPower వేగవంతమైన ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది Android 15 (Hello UI) ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ బేస్ వేరియంట్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. దీని అసలు ధర మార్కెట్లో రూ.19,999 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 10 శాతం తగ్గింపుతో కేవలం రూ.17,999కే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,800 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో పాటు సాధారణ ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజి బోనస్ ఆఫర్ వినియోగించి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభించబోతోంది. దీని కోసం ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ ముందుగా ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే, రూ.17 వేల బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ.999కే పొందవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
PPINEWZ
Feb 07, 2026 12:00:31
Hyderabad, Telangana:

Motorola G96 5g Price In India: అత్యంత తగ్గింపు ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వాలెంటెన్స్ డే సందర్భంగా మోటరోలా బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మోడల్స్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అతి తక్కువ ధరలోనే మొబైల్స్ లభించబోతున్నాయి. అయితే ఈ వాలెంటెన్స్ డే సందర్భంగా అత్యంత తగ్గింపు ధరికే అందుబాటులో ఉన్న మొబైల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మోటోరోలా G96 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది మార్కెట్లోకి 6.67 అంగుళాల Full HD+ pOLED 3D కర్వ్‌డ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన క్వాల్‌కామ్ Snapdragon 7s Gen 2 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది.. అలాగే ఇది మార్కెట్లో 8gb ర్యామ్ బేస్ వేరియంట్‌తో ప్రారంభమవుతుంది. 

ఇక వెనక భాగంలో ఈ మోటోరోలా G96 5G (Motorola G96 5g) స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా మాడ్యూయల్ ని కలిగి ఉంది. ఇది 50MP మెయిన్ కెమెరా (Sony Lytia 700C సెన్సార్ తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అదనంగా 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఇందులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీ, ఇది 68W టర్బోపవర్ ఛార్జింగ్‌ సపోర్టును అందిస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత 'హలో UI' (Hello UI) ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఇందులో డాల్బీ అట్మోస్ (Dolby Atmos) సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మోటోరోలా G96 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో ఉంది.. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ.17,999 తో అందుబాటులో ఉంది. అయితే, దీనిని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించాలనుకునేవారు.. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కలిగి ఉండి.. ఈ కార్డుతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.1,800 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసినప్పటికీ రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మోటోరోలా G96 5G (Motorola G96 5g)స్మార్ట్‌ఫోన్‌ మరింత చీప్ ధరకే పొందాలనుకునేవారు.. ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ఎక్స్చేంజ్ ఆఫర్ ని వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే ఏకంగా రూ.16,000 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.2,000 లోపే పొందవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 07, 2026 11:02:26
Salat, Uttar Pradesh:

UP Student Attacks Teacher: ఉత్తరప్రదేశ్‌లో గురు-శిష్యుల పవిత్ర బంధానికే మాయని మచ్చ తెచ్చే అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రేమను నిరాకరించిందనే కక్షతో, ఒక 12వ తరగతి విద్యార్థి మహిళా ఉపాధ్యాయురాలిపై అమానవీయంగా దాడి చేసి, ఆమె పెదవిని కొరికి తీవ్రంగా గాయపరిచాడు.

మెయిన్‌పురి జిల్లాలోని సదర్ కొత్వాలి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం వేధింపులతో ఆగకుండా, ఆ విద్యార్థి ఉపాధ్యాయురాలిపై భౌతిక దాడికి దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

నిందితుడైన విద్యార్థి గత కొంతకాలంగా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని నిరంతరం వేధింపులకు గురిచేసేవాడు. విద్యార్థి ప్రవర్తనపై బాధితురాలు అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వేధింపులు భరించలేక ఆమె ఆ పాఠశాల నుండి తప్పుకుని, వేరే చోట ఉద్యోగంలో చేరారు. అయినప్పటికీ, ఆ విద్యార్థి ఆమెను వెంబడించడం మానలేదు.

దారి కాచి ఘాతుకం
ఉపాధ్యాయురాలు ప్రైవేట్ ట్యూషన్ చెప్పడానికి వెళ్తున్న సమయంలో, ఆ విద్యార్థి ఆమె దారిని అడ్డుకున్నాడు. మొదట వాగ్వాదానికి దిగి, ఆపై ఆమె మెడ పట్టుకుని బలవంతంగా లాగాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి, ఆమె పెదవిని బలంగా కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ భయంకర దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఆసుపత్రిలో చికిత్స.. నిందితుడు పరారీ
తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను ఆగ్రాకు తరలించారు. బాధితురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ఉన్మాద విద్యార్థి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మహిళల భద్రతపై ఆందోళన
విద్యాబుద్ధులు నేర్పే గురువులపైనే ఇలాంటి దాడులు జరగడం సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడికి కఠిన శిక్ష పడాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Pakistan Vs Netherlands: పాకిస్థాన్‌ను వణికించిన నెదర్లాండ్..పరమచెత్తగా ఆడిన పాక్ చివరికి!

Also Read: Gold Price Today: కిలో వెండి రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? బంగారం, వెండి ధరల భారీ పతనానికి కారణం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top