Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500072

కూకట్ పల్లిలో ఏబీవీపీ విద్యార్థుల ధర్నా.. విద్యార్థుల అరెస్ట్

Sept 16, 2025 07:29:41
Hyderabad, Telangana
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు ఫీజు రియంబర్మెంటు చెల్లింపు విషయంలో విఫలం అయిందని ఏబీవీపీ విద్యార్థి నేతలు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు కూకట్ పల్లి లోని ముంబై జాతీయ రహదారి పైన రాస్తారోకో నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ జాయింట్ సెక్రెటరీ భరత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శించారు . రెండు విడుదల లో 1200 కోట్లను రాష్ట్రప్రభుత్వం విడుదల చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థినేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 6000 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేదంటే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 03, 2026 19:22:00
Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Temple: కలియుగ వైకుంఠవాసుడు కొన్ని గంటల పాటు అదృశ్యమయ్యారు. భక్తులకు దర్శనమివ్వకుండా తలుపులు మూసుకుపోయిన శ్రీవారి.. ఎట్టకేలకు పదిన్నర గంటల తర్వాత పునఃదర్నం ఇచ్చాడు. దేవ దేవుడి ఆలయం తిరిగి తెరచుకుంది. చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేయగా.. గ్రహణం అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆలయాన్ని తిరిగి తెరిచారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు మళ్లీ శ్రీవారు దర్శనమిచ్చారు.

Also Read: YS Jagan: మహిళలని చూడకుండా లాఠీఛార్జీ చేయిస్తావా? చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. చంద్ర గ్ర‌హ‌ణం ముగియడంతో శ్రీవారి ఆలయంతోపాటు ఉప ఆలయాలు కూడా తెరచుకున్నాయి. ఇక రాత్రి 8.30 నుంచి యథావిధిగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌ కేంద్రం కూడా తెరచుకుంది. శ్రీ‌వారి ఆల‌యంలో మంగళవారం రాత్రి 8 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైందని టీటీడీ అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 3.26 నుంచి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఉదయం 9 గంట‌ల‌కు తిరుమల శ్రీవారి ప్రధాన ఆల‌య త‌లుపులు మూశారు. దాదాపు 10.30 గంట‌ల అనంత‌రం మంగళవారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తిరిగి తెరుచుకున్నాయి. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు వేదమంత్రోచ్చరణాల మధ్య నిర్వ‌హించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

Also Read: War Effect: కువైట్‌లో యుద్ధ భయాలు.. బెదిరిపోయి గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి

అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభం
చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా మంగళవారం ఉదయం 9 గంట‌లకు మూసివేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌ను రాత్రి 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం రాత్రి 8.30 గంట‌ల నుంచి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి. వీటితోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలు కూడా తిరిగి తెరుచుకున్నాయి. దీంతో ఆలయాల్లో యథావిధిగా పూజా కార్యక్రమాలు, భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 03, 2026 18:05:32
Tadepalli, Andhra Pradesh:

YSR Congress Party: ఆంధ్రప్రదశ్‌లో తమ వేతనాలు పెంచాలని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. నిరవధికంగా నిరసన చేపడుతుండడంతో అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చిన పోలీసులు అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లను అరెస్ట్‌ చేశారు. నిద్రలోనే వారిని ఎత్తుకుని వెళ్లిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఖండించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: War Effect: కువైట్‌లో యుద్ధ భయాలు.. బెదిరిపోయి గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి

అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై ఎక్స్‌ వేదికగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. 'ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా?' అని చంద్రబాబును ప్రశ్నించారు. రెండేళ్లు అవుతున్నా ఆ హామీలకు దిక్కూమొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా?' అని నిలదీశారు.

Also Read: Bandi Sanjay: రాహుల్ గాంధీ ప్రధాని అయితే భారతదేశానికి గ్రహణం: బండి సంజయ్‌

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేస్తూ, పోలీసుల చేత బలప్రయోగం చేస్తూ, ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి, వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారని పోలీసుల తీరును ఖండించారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. 'ప్రజాస్వామ్యయుతంగా.. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, ఈ ఉదయం చర్చలకు పిలుస్తామనిచెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా?' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: BR Naidu Resignation: బూతు రోత నాయుడు టీటీడీ చైర్మన్‌గా రాజీనామా చేయాలి: వైఎస్సార్‌సీపీ

'ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో, ప్రజలంతా గమనిస్తున్నారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఒక్క అంగన్‌వాడీలకే కాదు, రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. దీనికి తప్పకుండా చంద్రబాబు ప్రభుత్వం మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 03, 2026 17:38:19
Palakollu, Andhra Pradesh:

AP Youth Dead In Kuwait: ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని నిద్రపోనివడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆయా దేశాల్లో బతుకుతున్న ఇతర దేశాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో కువైట్‌లో నివసిస్తున్న ఏపీ యువకుడు ప్రాణభయం పట్టుకుంది. యుద్ధ భయంతో గుండెపోటుకు గురయి ప్రాణం పోయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Bandi Sanjay: రాహుల్ గాంధీ ప్రధాని అయితే భారతదేశానికి గ్రహణం: బండి సంజయ్‌

పాలకొల్లు మండలం యాళ్లవాని గరువు పంచాయతీ డాంపేట గ్రామానికి చెందిన కందికట్ల శ్రీను, రమణ దంపతుల చిన్న కుమారుడు రాకేశ్‌ (26) తొమ్మిది నెలల కిందట ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లాడు. రాకేష్ తల్లి రమణ కూడా కొన్నేళ్లుగా అక్కడే పని చేస్తోంది. కొన్ని రోజులుగా కువైట్‌లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర భయాందోళనగా మారింది. అక్కడ బాంబుల మోతలతో భయంకరంగా మారడంతో రాకేశ్‌ భయకంపితుడయ్యాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కావడంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాడు.

Also Read: BR Naidu Resignation: బూతు రోత నాయుడు టీటీడీ చైర్మన్‌గా రాజీనామా చేయాలి: వైఎస్సార్‌సీపీ

యుద్ధ శబ్దాల మధ్య రాకేశ్‌ అనారోగ్యానికి గురయ్యాడు. ఈ ఘటన ఏపీలో.. స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో 'ఇక్కడ బాంబులు పడుతున్నాయి. నేను ఇంటికి వచ్చేస్తా' అంటూ రాకేష్ తన తండ్రి, బంధువులకు ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే 'యుద్ధ పరిస్థితులు సద్దుమణిగాక రా' అని కుటుంబసభ్యులు ధైర్యం చెప్పారు. అయితే ఇంతలో రాకేష్‌కు ఛాతీలో నొప్పి (గుండెపోటు) రావడంతో స్నేహితులు సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చి పంపించారు. కానీ ఆదివారం మళ్లీ తీవ్రమైన నొప్పి రావడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Also Read: Dog Eat Body: ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం.. మనిషి శవాన్ని పీక్కుతున్న కుక్క

ఈ విషాదంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడి పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

గుంటూరులో అగ్నిప్రమాదం
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానిక పోలీసులు, ఫైర్‌ సేఫ్ట్‌ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 03, 2026 17:08:16
Narsingi, Telangana:

Ex MLC Kavitha Get Injury: పేదల భూములపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ ఒడ్డున నిర్మిస్తున్న ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్సీ కవిత నిరసన చేపట్టగా.. ఉద్రిక్తతకు దారి తీసింది. కొన్ని గంటల పాటు నిరసన ప్రదర్శన కొనసాగడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ సమయంలో తోపులాట.. వాగ్వాదం జరగడంతో తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కవిత చేయికి గాయమైంది.

Also Read: Bandi Sanjay: రాహుల్ గాంధీ ప్రధాని అయితే భారతదేశానికి గ్రహణం: బండి సంజయ్‌

హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ఆందోళన చేపట్టారు. సాయంత్రం దాదాపు 4 గంటలు నిరసనకు దిగారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. హైడ్రా కమిషనర్‌ రావాలని.. ఈ భవన నిర్మాణాన్ని వెంటనే అడ్డుకోవాలని జాగ్రృతి శ్రేణులు డిమాండ్‌ చేశారు.

వారు ఎంతకు నిరసన విరమణ చేయకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కవితతో పాటు పలువురు జాగృతి నాయకుల అరెస్ట్ చేయగా.. నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. 'పోలీసులు బలప్రయోగంతో మమ్మల్ని అరెస్ట్ చేయడం అన్యాయం. మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదవాళ్ల బిల్డింగులు కూలగొడుతున్నారు' అని తెలిపారు. 'బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లకు లొంగి పెద్దల పక్షాన్నే నిలుస్తోందని చెప్పడానికి ఇదే నిదర్శనం. మూసీ రివర్ బెడ్డులో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదు. అదే ఖమ్మం వెలుగుమట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా కూల్చేశారు' అని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 'హైదరాబాద్ శివారుల్లో పేదల ఇండ్లను కూల్చేసినందుకు రేవంత్‌ రెడ్డి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' అని హెచ్చరించారు.

'రేపు అయినా హైడ్రా బుల్‌డోజర్లు ఇక్కడికి వస్తే.. హైడ్రా కమిషనర్‌ స్పందించి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని మేం భావిస్తాం' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇతర నిర్మాణాలకు మూసీ బెడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్న అనుమతులు ఇస్తున్నారంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో తేలిపోతున్నది' అని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుందని కవిత ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
Mar 03, 2026 14:43:20
Gollet, Telangana:బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు, హెల్పర్ల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే ఈ నెల 17 నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు భోగి ఉపేందర్ స్పష్టం చేశారు. మంగళవారం యాజమాన్యం ప్రతినిధి టిటిసి సుదీర్ కు వినతిపత్రం, సమ్మె నోటీసు ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. డ్రైవర్లకు 32000, క్లీనర్లకు 18000 వేతనం చెల్లించాలని అన్నారు ప్రతినెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 50 లక్షల ప్రమాద బీమా ఎవరైనా కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులతో శ్రమ దోపిడీ చేయించకుండా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను డ్రైవర్లకు క్లీనర్లకు కేటాయించాలని వర్షాకాలంలో రవాణా సౌకర్యం కల్పించాలని, కార్మికుల హక్కులు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్రైవర్లు క్లీనర్లు పాల్గొన్నారు
0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 03, 2026 12:47:20
Karimnagar, Telangana:

Rahul Gandhi PM Post Dream: 'రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సమావేశంలో సంకేతాలు ఇవ్వడం దేశంపై ఒక గ్రహణంలాంటిదే' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. ప్రధానమంత్రి కుర్చీ అనేది కుటుంబ వారసత్వం కాదు. ఒక చిరునవ్వు, ఒక తలాడింపుతో బహుమతిగా ఇచ్చేది కాదు' అని స్పష్టం చేశారు. 'ఈ రాహుల్ గ్రహణం మూడు సార్లు భారతాన్ని చీకటిలో ముంచేందుకు ప్రయత్నించింది. కానీ నరేంద్ర మోదీ అభివృద్ధి కిరణాలు ప్రతీసారి వెలుగునిచ్చాయి. ఇది ప్రజాస్వామ్యం, నిజామ్‌ శైలి దర్బార్ కాదు' అని బండి సంజయ్‌ తెలిపారు.

Also Read: BR Naidu Resignation: బూతు రోత నాయుడు టీటీడీ చైర్మన్‌గా రాజీనామా చేయాలి: వైఎస్సార్‌సీపీ

కాంగ్రెస్‌ శిక్షణ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి చేసిన సంభాషణపై ఎక్స్‌ వేదికగా బండి సంజయ్‌ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌, రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు.. విమర్శలు చేశారు. 'ప్రధానమంత్రి పదవికి ఎలాంటి ఖాళీ లేదు. 140 కోట్ల భారతీయులు నరేంద్ర మోదీకి ఒకసారి కాదు మూడుసార్లు మద్దతు ముద్ర వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి పేదల ఓట్లతో ఎన్నికవుతాడు. హైదరాబాద్ కోర్టీయర్ల నోట్లతో కాదు' అని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Dog Eat Body: ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం.. మనిషి శవాన్ని పీక్కుతున్న కుక్క

'దేశం అభివృద్ధి రంగులతో హోలీ చేసుకుంటుంటే.. కాంగ్రెస్ మాత్రం అవినీతి మసితో మసకబారింది. మీ గ్యారంటీలు, యువరాజు ఆశలను దహనం చేయడానికి దేశ ప్రజలు రాజకీయ హోలికా దహనానికి సిద్ధంగా ఉన్నారు' అని బండి సంజయ్‌ ప్రకటించారు. ఎంత గులాల్ చల్లినా.. దేశం తిరస్కరించిన నాయకుడి వైఫల్యాన్ని దాచలేరని చెప్పారు. 'రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నవ్వు చూడాలనుకుంటున్నారు. కానీ ఆయన చూడలేకపోతున్నారు. హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చివేతలతో కన్నీరు పెట్టుకుంటున్న పేదల బాధ. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేతతో భవిష్యత్తు అడ్డుకుపోయిన విద్యార్థుల ఆవేదన' అని కాంగ్రెస్‌ మోసాలు, వైఫల్యాలను బండి సంజయ్‌ వివరించారు.

Also Read: Annaram Barrage: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్‌

'రైతు భరోసా ఖాళీ హామీలతో మోసపోయిన రైతుల కన్నీళ్లు. మూసీ పునరుజ్జీవన పేరుతో ఇల్లు కోల్పోతున్న కుటుంబాల వేదన. హామీలు నెరవేరక, పెన్షన్లు, లబ్ధులు కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు మరియు ప్రజల నిరాశ' అని రేవంత్ రెడ్డి తప్పిదాలను బండి సంజయ్‌ వెల్లడించారు. 'రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని రేవంత్‌ రెడ్డికి కూడా తెలుసు. కాబట్టి భజన ఆపి.. తన బాధ్యతపై దృష్టి పెట్టాలి' అని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 03, 2026 11:04:17
Hyderabad, Telangana:

Iran Drone City Video Watch: మధ్య ప్రాచుర్యంలో ఉద్రుక్తతలు పెరుగుతున్న వేళ.. ఇరాన్ తన సైనిక శక్తిని ప్రపంచానికి చూపించేలా ఒక సంచలన వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. భూమికి వందల అడుగుల లోతులో ఉన్న రహస్య సొరంగాల్లో వరుసగా పేర్చిన ఆధ్యాధునిక ద్రోన్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఇరాన్ అంటేనే అద్భుతమైన టెక్నాలజీతో కూడిన డ్రోన్లకు ప్రసిద్ధి.. అయితే, ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించేందుకు డ్రోన్ల తయారీని ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లకు సంబంధించిన పూర్తి వీడియో చూస్తూ సమాచారం తెలుసుకుందాం.

ఇరాన్ అధికారిక వార్త సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం.. పర్వతాల లోపల నిర్మించిన సుదీర్ఘమైన కాంక్రీట్ సొరంగాల్లో వందలాది డ్రోన్లను సిద్ధంగా ఉంచినట్లు.. వీటిల్లో ప్రధానంగా అద్భుతమైన టెక్నాలజీ తో కూడిన సాహెద్ 136 వంటి కామికేజ్ డ్రోన్లను ప్రదర్శించడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఈ డ్రోన్లన్నీ ప్రత్యేకమైన లాకెట్ లాంచర్లపై అమర్చి ఉండడంతో పాటు.. ఎప్పుడైనా ప్రయోగించడానికి వీలుగా ఉంచినట్లు కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సొరంగాల గోడలపై ఇరాన్ జెండాలతో పాటు దేశ ఆధ్యాత్మికమైన నేతల  ఫోటోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇజ్రాయిల్ అమెరికా వంటి దేశాలతో ఘర్షణ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఇరాన్ ఈ వీడియో విడుదల చేయడం ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ఆయుధ సంపత్తిపై శత్రువులు దాడి చేయకుండా ఉండేందుకే ఈ పటిష్టమైన భూగర్భ స్థావరాలను నిర్మించినట్లు ఇరాన్ కు సంబంధించిన కొంతమంది అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ సొరంగాలు బాంబు దాడులను కూడా ఎంతో సులభంగా తట్టుకోగలుగుతాయి. 

Read more: Monkey Video: అద్భుతం.. రెప్పపాటులో వ్యక్తిని రోడ్డు ప్రమాదం నుంచి కాపాడిన వానరం.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

గత కొద్ది రోజులుగా ఇరాన్ డ్రోన్లతో పాటు క్షిపణులతో పచ్చిమాసియాలోని పలు ప్రాంతాలపై దిమ్మ తిరిగే దాడులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగానే తమ వద్ద అనేక సంఖ్యలో ఇటువంటి డ్రోన్లు, ప్రత్యేకమైన క్షిపణులు కూడా ఉన్నాయని.. ఏ క్షణమైనా శత్రువుల స్థావరాలపై విరుచుకు పడగలమని ఇరాన్ పరోక్షంగా ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తోంది. అయితే ఈ వీడియో విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే ఈ వీడియో ఎప్పుడు తీశారన్న దానిపై కూడా సరైన స్పష్టత లేదు. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో భూగర్భంలో ఉన్న డ్రోన్ సిటీ దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Read more: Monkey Video: అద్భుతం.. రెప్పపాటులో వ్యక్తిని రోడ్డు ప్రమాదం నుంచి కాపాడిన వానరం.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 03, 2026 10:47:20
Hyderabad, Telangana:

Chery Icar V23 Price News: ప్రముఖ భారత పారిశ్రామిక దిగ్గజ జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ త్వరలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో అద్భుతమైన అధ్యయనానికి శ్రీకారం చుట్టపోతోంది.. ఇప్పటికే ఎంజి మోటార్స్ ఇండియాలో భాగస్వామిగా ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ చెరీ ఆటోమొబైల్ తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్ కి అధ్యయధునిక ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఇప్పటికే కొత్త తరహా ఈవీ కార్ల తయారీపై సంతకాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. 

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఒప్పందంలో భాగంగా ఐ కార్ v23 (iCar V23) ఎలక్ట్రిక్ ఎస్యూవీని భారత దేశంలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది చూడడానికి శక్తివంతమైన ల్యాండ్ రోవర్ డిపెండర్ డిజైన్ మాదిరిగా ఉంటుంది.. ఆఫ్ రోడ్ ప్రియులకు ఈ కార్ అంటే ఎంతో ఇష్టం.. అయితే దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లకు పైగా మైలేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎంత పెద్ద బ్యాటరీ ని కలిగి ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఇంత మైలేజీ ఇచ్చే కారు భారత్ మార్కెట్లోకి లాంచ్ అయితే సేల్స్ లో అద్భుతం సృష్టిస్తుంది.

ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో జేఎస్‌డబ్ల్యూభారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ద్వారా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతోపాటు సుమారు 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించే ఛాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకుంది..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ కంపెనీ కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా.. ఎస్‌డబ్ల్యూ మోటార్స్ పేరుతో సొంత బ్రాండ్ ను కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రత్యేకమైన సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం. 2026 సంవత్సరం చివరి వరకు ఈ కంపెనీకి సంబంధించిన మొదటి వాహనం రోడ్లపైకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో టాటా మోటార్స్ తో పాటు మహీంద్రా వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేలా జేఎస్‌ డబ్ల్యూ తన ప్రత్యేకమైన ప్లానింగ్స్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఈవీ విడిభాగాల తయారీని ప్రోత్సహించడం ద్వారా కార్ల ధర సామాన్యులకు అందుబాటులో ఉంటాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 03, 2026 10:18:53
Hyderabad, Telangana:

Motorola Edge 70 Fusion Launch Date In India: భారత మార్కెట్‌లోకి మోటరోలా కంపెనీ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అతిశక్తివంతమైన బ్యాటరీ సెటప్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, త్వరలో భారత మార్కెట్‌లోకి విడుదల కాబోయే మొబైల్ పేరేంటో? ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

భారత మార్కెట్‌లోకి మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా Motorola Edge 70 Fusionను లాంచ్ చేయబోతోంది. ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఈ మొబైల్ 6.8-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ Extreme AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7s Gen 4 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. కాబట్టి మొబైల్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా గేమింగ్ చేసే యువతకు ఎంతగానో సహాయపడుతుందని సమాచారం. అలాగే మల్టీ టాస్కింగ్ చేసేవారికి స్మూత్ స్క్రోలింగ్ అందిస్తుంది. స్ట్రక్ అవడం అనే ముచ్చట కూడా ఉండదు.

ఈ Motorola Edge 70 Fusion మొబైల్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళితే.. ఇది చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా డిజైన్ పరంగా చాలా స్పెషల్‌గా ఉండబోతున్నట్లు ఫోటోలు చూస్తే తెలుస్తోంది. కెమెరా విషయానికి వెళ్తే.. ఇది చాలా ప్రత్యేకమైన Sony LYT-710 సెన్సార్, OIS సపోర్ట్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 13MP అల్ట్రా-వైడ్, మాక్రో లెన్స్ కెమెరా కూడా లభిస్తుంది. సెల్ఫీ కోసం మోటరోలా కంపెనీ ఫ్రంట్ భాగంలో అద్భుతమైన 32MP సెల్ఫీ కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన 7000mAh బ్యాటరీతో 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత Hello UI ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ Motorola Edge 70 Fusion స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ అద్భుతమైన IP68/IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ స్టీరియో వంటి ఫీచర్లను కూడా అందిస్తోంది. దీంతోపాటు మూడు ఆండ్రాయిడ్ వెర్షన్స్ అప్డేట్‌లతో పాటు ఐదేళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్లను కూడా అందిస్తుంది. ఇవే కాకుండా ఈ మొబైల్‌లో ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి కంపెనీ మార్చి ఆరవ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతోంది. అయితే, దీని ధర సుమారు రూ.24 వేల నుంచి ప్రారంభమై రూ.32 వేలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని మోటరోలా కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా మోటార్ల అధికారిక వెబ్సైట్‌తో పాటు ఆఫ్లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంచబోతోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 03, 2026 09:14:45
Proddatur, Andhra Pradesh:

BR Naidu Resignation: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి డిమాండ్‌ చేశారు. 'రంకు నేర్చిన అమ్మ బొంకు నేర్చదా? బీఆర్‌ నాయుడువా? లేక బూతు రోత నాయుడువా?' అని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ పుణ్యక్షేత్రం పదవిలో ఉండి అలా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఆయన టీటీడీ చైర్మన్‌గా వచ్చినప్పటి నుంచి తిరుమలలో అన్ని అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి వివరించారు.

Also Read: Dog Eat Body: ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం.. మనిషి శవాన్ని పీక్కుతున్న కుక్క

ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వచ్చిన తర్వాత తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ, రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళను టీటీడీ చైర్మన్ 30 సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్ అంటాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే వారి ఇంటికి వెళ్లి భోజనం చేయాలని కానీ ఆమెను భోజనం చేస్తావా?' అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు.

Also Read: Annaram Barrage: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్‌

'పరాయి స్త్రీని బాహు బంధంలో బంధించావు. అంతటితో బీఆర్‌ నాయుడు తగ్గలేదు.. తగ్గేదేలే అంటున్నాడు. తిరుమల కొండపైన నివాసం ఉండేది నువ్వు బలహీనంగా చూస్తున్నావు. పదవికి తగిన న్యాయం చేసే అలవాటు నేర్చుకోవాలి' అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సూచించారు. 'భారతదేశంలో ప్రతి హిందువు బాధపడేలా భగవద్గీతలో ఏముంది అన్నాడు. గీతలో వాక్షాయా కామ సూత్రం ధర్మాలు ఉంటాయి' అని తెలిపారు.

'72 సంవత్సరాల వయసులో భక్తి పరవేశంలో తేలడం కాదు. కామ భక్తిలో తేలుతున్నాడు. బుద్ధి వస్తే తిరుమలకు వెళ్లి నిజం ఒప్పుకోండి. అపరాధం చేశామని ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది' అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సభ్య సమాజం సిగ్గు పడేలా గొప్ప పదవిలో ఉండి ఇలా చేయడం సమాజానికి చెడు సందేశం ఇస్తున్నావు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీటిని తెలుసుకోవాలి. టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు అనర్హుడు. చంద్రబాబు నాయుడు ఓ మంచి వ్యక్తిని అతడి స్థానంలో పెట్టండి' వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RGRenuka Godugu
Mar 03, 2026 08:21:14
Hyderabad, Telangana:

Bank Holiday on March 4 for Holi Check: ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకులు పనిచేస్తాయి. సాధారణంగా ఆర్‌బీఐ హాలిడేస్ లిస్ట్ ఆధారంగానే బ్యాంకులు బంద్ ఉంటాయి. కొన్ని స్థానిక పండుగలు, ప్రత్యేక దినాల్లో కూడా స్థానికంగా ఉండే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉంటాయి. అయితే మార్చి 3 తెలుగు రాష్ట్రాలలో ఈ హోలీ పండుగ వేడుకలు జరుపుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా రేపు మార్చి 4వ తేదీన హోలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కూడా ఈరోజు బంద్ ఉంది. అయితే రేపు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి.  ఎక్కడెక్కడ బ్యాంక్ బ్రాంచీలు బంద్‌ ఉండనున్నాయి? ఆర్‌బీఐ లిస్ట్ ప్రకారం ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం. 

ఆర్‌బీఐ బ్యాంక్ హాలిడే ఎప్పుడు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షెడ్యూల్ ప్రకారం మార్చి 3, 4 తేదీల్లో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. హోలీ సందర్భంగా ఈ సెలవు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదినా హోలీ మార్చి 3న జరుపుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్చి 4 అంటే రేపు ఈ వేడుక చేస్తున్నారు. 

 మార్చి 3న ఎక్కడ బంద్‌? 
 హోలీ వేడుకలు మంగళవారం మార్చి 3వ తేదీన 16 నగరాల్లో జరుపుకుంటున్నారు. ప్రధానంగా భోపాల్, డెహ్రాడూన్, బేలాపూర్, హైదరాబాద్, జైపూర్ కోల్ కతా, ముంబై, నాగ్‌పూర్‌, పాట్నా, రాంచీ, గువాహటీ, తిరువనంతపురం, విజయవాడ, లక్నో ప్రాంతాల్లో ఈరోజే హోలీ వేడుకలు చేస్తున్నారు. కాగా ఆ ప్రాంతంలో బ్యాంకు బ్రాంచీలు బంద్‌ ఉన్నాయి. 

Also Read: పీఎం కిసాన్‌ నిధి బ్యాలెన్స్‌ చెక్‌ చేయాలా? మొబైల్‌లో ఇలా సింపుల్‌ చెక్‌ చేసుకోండి..!

Also Read: లారీ డ్రైవర్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరిక.. ప్రియుడినే హత్య చేసిన ప్రముఖ టీవీ నటి ఊర్మిళ, 12 రోజుల తర్వాత..!

 రేపు ఎక్కడ బ్యాంకులు బంద్ ?
మార్చి 4వ తేదీ మొత్తంగా 18 నగరాల్లో ఈ బ్యాంకులు బంద్ ఉంటున్నాయి. అహ్మదాబాద్, ఐజ్వాల్, అగర్తలా, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్ టాక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ఢిల్లీ, పాట్నా,  రాయపూర్ లో బంద్ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ముందుగా హోలికా దహనం సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 8:50 మధ్యలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇక మార్చ 4వ తేదీన హోలీ వేడుకలు ఈ ప్రాంతాల్లో జరుపుకోనున్నారు. బ్యాంకులు కూడా బంద్ ఉంటాయి 

నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ధూలేటి అని కూడా పిలుస్తారు. రెండు రోజులపాటు ఈ వేడుక జరుపుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగు, గులాల్ చల్లుకొని వేడుకగా ఈ హోలీ నిర్వహిస్తారు. మణిపూర్ లో కూడా రెండు రోజులపాటు కొన్ని ప్రాంతాలను నిర్వహిస్తారు. పిల్లా పెద్దలు అందరూ కలిసి రంగులు చల్లుకుంటూ వేడుకగా జరుపుకునే పండుగ. సాధారణంగా బ్యాంకులు ఆర్‌బీఐ ప్రకారం బంద్ ఉంటాయి. ఇది కాకుండా ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. బ్యాంకులు బంద్ ఉన్నా కానీ డిజిటల్ చెల్లింపులో ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం లావాదేవీలు కూడా జరుపుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 03, 2026 08:01:37
Hyderabad, Telangana:

Biryani Thief On Train Video Watch: రైలు ప్రయాణాల్లో రకరకాల వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని నవ్విస్తే.. కొన్ని చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అయితే తాజాగా వైర్లు అవుతున్న వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. కేవలం ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం యువకుడు చేసిన పనిని చూసి ఇప్పుడు నేటిజెన్లు అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు? బిర్యానీ తిన్నాడా? అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక రైలు బోగీలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది.. ఒక యువకుడు అప్పర్ బెర్త్‌పై కూర్చొని మొబైల్లో సాంగ్స్ వింటూ ఉన్నాడు. అదే సమయంలో ఆహారాలను విక్రయించే ఒక వ్యక్తి కూడా ఎగ్ బిర్యానీ ప్యాకెట్లు పట్టుకొని.. బుట్టను తలపై పెట్టుకుని రైలు బోగీలో అటు ఇటు వెళ్తున్నాడు. అయితే ఆ యువకుడు ఉన్న బెర్త్ దగ్గరికి రాగానే.  పైన కూర్చున్న యువకుడు మెల్లిగా.. ఆ బుట్టలో నుంచి ఒక బిర్యానీ ప్యాకెట్ ని దొంగలించేశాడు.. ఈ వీడియోను పక్కనే ఉన్న బెర్త్ ప్రయాణికుడు ఫోటో తీశాడు. 

Later he ate the stolen biryani with great relish. pic.twitter.com/VHDfSABCdk

అయితే ఆ యువకుడు అందులో నుంచి బిర్యానీ ప్యాకెట్ తీసిందని తెలియక.. ఆ బిర్యానీని అమ్మే వ్యక్తి పనిలో నిమగ్నమై ముందుకు సాగిపోయాడు.. యువకుడు కూడా ఏమీ తెలియనట్టుగా ఆ బిర్యాని ప్యాకెట్ను వేరే చోట దాచి పెట్టేసాడు.. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆ దొంగిలించిన బిర్యానిని ఎంతో ఇష్టంగా తింటూ కనిపించేసాడు.  ఈ దృశ్యాలు అదే బోగీలో ఉన్న మరో ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అంతే ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది..

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాలకి అన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. అయితే, దీనిని చూసిన కొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలను ఇలా మోసం చేయడం సరికాదని కొంతమంది కామెంట్లు పెడితే.. మరి కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఇలాగే ఉంటారు.. ఆకలి వేస్తే కొనుక్కొని స్తోమత లేదా? అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది..

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

 

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top