Rahul Gandhi PM Post Dream: 'రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సమావేశంలో సంకేతాలు ఇవ్వడం దేశంపై ఒక గ్రహణంలాంటిదే' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ప్రధానమంత్రి కుర్చీ అనేది కుటుంబ వారసత్వం కాదు. ఒక చిరునవ్వు, ఒక తలాడింపుతో బహుమతిగా ఇచ్చేది కాదు' అని స్పష్టం చేశారు. 'ఈ రాహుల్ గ్రహణం మూడు సార్లు భారతాన్ని చీకటిలో ముంచేందుకు ప్రయత్నించింది. కానీ నరేంద్ర మోదీ అభివృద్ధి కిరణాలు ప్రతీసారి వెలుగునిచ్చాయి. ఇది ప్రజాస్వామ్యం, నిజామ్ శైలి దర్బార్ కాదు' అని బండి సంజయ్ తెలిపారు.
Also Read: BR Naidu Resignation: బూతు రోత నాయుడు టీటీడీ చైర్మన్‌గా రాజీనామా చేయాలి: వైఎస్సార్‌సీపీ
కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేసిన సంభాషణపై ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్, రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు.. విమర్శలు చేశారు. 'ప్రధానమంత్రి పదవికి ఎలాంటి ఖాళీ లేదు. 140 కోట్ల భారతీయులు నరేంద్ర మోదీకి ఒకసారి కాదు మూడుసార్లు మద్దతు ముద్ర వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి పేదల ఓట్లతో ఎన్నికవుతాడు. హైదరాబాద్ కోర్టీయర్ల నోట్లతో కాదు' అని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Dog Eat Body: ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం.. మనిషి శవాన్ని పీక్కుతున్న కుక్క
'దేశం అభివృద్ధి రంగులతో హోలీ చేసుకుంటుంటే.. కాంగ్రెస్ మాత్రం అవినీతి మసితో మసకబారింది. మీ గ్యారంటీలు, యువరాజు ఆశలను దహనం చేయడానికి దేశ ప్రజలు రాజకీయ హోలికా దహనానికి సిద్ధంగా ఉన్నారు' అని బండి సంజయ్ ప్రకటించారు. ఎంత గులాల్ చల్లినా.. దేశం తిరస్కరించిన నాయకుడి వైఫల్యాన్ని దాచలేరని చెప్పారు. 'రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నవ్వు చూడాలనుకుంటున్నారు. కానీ ఆయన చూడలేకపోతున్నారు. హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చివేతలతో కన్నీరు పెట్టుకుంటున్న పేదల బాధ. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేతతో భవిష్యత్తు అడ్డుకుపోయిన విద్యార్థుల ఆవేదన' అని కాంగ్రెస్ మోసాలు, వైఫల్యాలను బండి సంజయ్ వివరించారు.
Also Read: Annaram Barrage: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్
'రైతు భరోసా ఖాళీ హామీలతో మోసపోయిన రైతుల కన్నీళ్లు. మూసీ పునరుజ్జీవన పేరుతో ఇల్లు కోల్పోతున్న కుటుంబాల వేదన. హామీలు నెరవేరక, పెన్షన్లు, లబ్ధులు కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు మరియు ప్రజల నిరాశ' అని రేవంత్ రెడ్డి తప్పిదాలను బండి సంజయ్ వెల్లడించారు. 'రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కాబట్టి భజన ఆపి.. తన బాధ్యతపై దృష్టి పెట్టాలి' అని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Iran Drone City Video Watch: మధ్య ప్రాచుర్యంలో ఉద్రుక్తతలు పెరుగుతున్న వేళ.. ఇరాన్ తన సైనిక శక్తిని ప్రపంచానికి చూపించేలా ఒక సంచలన వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. భూమికి వందల అడుగుల లోతులో ఉన్న రహస్య సొరంగాల్లో వరుసగా పేర్చిన ఆధ్యాధునిక ద్రోన్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఇరాన్ అంటేనే అద్భుతమైన టెక్నాలజీతో కూడిన డ్రోన్లకు ప్రసిద్ధి.. అయితే, ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించేందుకు డ్రోన్ల తయారీని ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లకు సంబంధించిన పూర్తి వీడియో చూస్తూ సమాచారం తెలుసుకుందాం.
ఇరాన్ అధికారిక వార్త సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం.. పర్వతాల లోపల నిర్మించిన సుదీర్ఘమైన కాంక్రీట్ సొరంగాల్లో వందలాది డ్రోన్లను సిద్ధంగా ఉంచినట్లు.. వీటిల్లో ప్రధానంగా అద్భుతమైన టెక్నాలజీ తో కూడిన సాహెద్ 136 వంటి కామికేజ్ డ్రోన్లను ప్రదర్శించడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఈ డ్రోన్లన్నీ ప్రత్యేకమైన లాకెట్ లాంచర్లపై అమర్చి ఉండడంతో పాటు.. ఎప్పుడైనా ప్రయోగించడానికి వీలుగా ఉంచినట్లు కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సొరంగాల గోడలపై ఇరాన్ జెండాలతో పాటు దేశ ఆధ్యాత్మికమైన నేతల ఫోటోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
ఇజ్రాయిల్ అమెరికా వంటి దేశాలతో ఘర్షణ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఇరాన్ ఈ వీడియో విడుదల చేయడం ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ఆయుధ సంపత్తిపై శత్రువులు దాడి చేయకుండా ఉండేందుకే ఈ పటిష్టమైన భూగర్భ స్థావరాలను నిర్మించినట్లు ఇరాన్ కు సంబంధించిన కొంతమంది అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ సొరంగాలు బాంబు దాడులను కూడా ఎంతో సులభంగా తట్టుకోగలుగుతాయి.
గత కొద్ది రోజులుగా ఇరాన్ డ్రోన్లతో పాటు క్షిపణులతో పచ్చిమాసియాలోని పలు ప్రాంతాలపై దిమ్మ తిరిగే దాడులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగానే తమ వద్ద అనేక సంఖ్యలో ఇటువంటి డ్రోన్లు, ప్రత్యేకమైన క్షిపణులు కూడా ఉన్నాయని.. ఏ క్షణమైనా శత్రువుల స్థావరాలపై విరుచుకు పడగలమని ఇరాన్ పరోక్షంగా ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తోంది. అయితే ఈ వీడియో విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే ఈ వీడియో ఎప్పుడు తీశారన్న దానిపై కూడా సరైన స్పష్టత లేదు. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో భూగర్భంలో ఉన్న డ్రోన్ సిటీ దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chery Icar V23 Price News: ప్రముఖ భారత పారిశ్రామిక దిగ్గజ జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ త్వరలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో అద్భుతమైన అధ్యయనానికి శ్రీకారం చుట్టపోతోంది.. ఇప్పటికే ఎంజి మోటార్స్ ఇండియాలో భాగస్వామిగా ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ చెరీ ఆటోమొబైల్ తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్ కి అధ్యయధునిక ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఇప్పటికే కొత్త తరహా ఈవీ కార్ల తయారీపై సంతకాలు కూడా చేసినట్లు తెలుస్తోంది.
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఒప్పందంలో భాగంగా ఐ కార్ v23 (iCar V23) ఎలక్ట్రిక్ ఎస్యూవీని భారత దేశంలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది చూడడానికి శక్తివంతమైన ల్యాండ్ రోవర్ డిపెండర్ డిజైన్ మాదిరిగా ఉంటుంది.. ఆఫ్ రోడ్ ప్రియులకు ఈ కార్ అంటే ఎంతో ఇష్టం.. అయితే దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లకు పైగా మైలేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎంత పెద్ద బ్యాటరీ ని కలిగి ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఇంత మైలేజీ ఇచ్చే కారు భారత్ మార్కెట్లోకి లాంచ్ అయితే సేల్స్ లో అద్భుతం సృష్టిస్తుంది.
ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో జేఎస్‌డబ్ల్యూభారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ద్వారా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతోపాటు సుమారు 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించే ఛాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకుంది..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ కంపెనీ కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా.. ఎస్‌డబ్ల్యూ మోటార్స్ పేరుతో సొంత బ్రాండ్ ను కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రత్యేకమైన సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం. 2026 సంవత్సరం చివరి వరకు ఈ కంపెనీకి సంబంధించిన మొదటి వాహనం రోడ్లపైకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో టాటా మోటార్స్ తో పాటు మహీంద్రా వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేలా జేఎస్ డబ్ల్యూ తన ప్రత్యేకమైన ప్లానింగ్స్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఈవీ విడిభాగాల తయారీని ప్రోత్సహించడం ద్వారా కార్ల ధర సామాన్యులకు అందుబాటులో ఉంటాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Edge 70 Fusion Launch Date In India: భారత మార్కెట్‌లోకి మోటరోలా కంపెనీ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అతిశక్తివంతమైన బ్యాటరీ సెటప్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, త్వరలో భారత మార్కెట్‌లోకి విడుదల కాబోయే మొబైల్ పేరేంటో? ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భారత మార్కెట్‌లోకి మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా Motorola Edge 70 Fusionను లాంచ్ చేయబోతోంది. ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఈ మొబైల్ 6.8-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ Extreme AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7s Gen 4 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. కాబట్టి మొబైల్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా గేమింగ్ చేసే యువతకు ఎంతగానో సహాయపడుతుందని సమాచారం. అలాగే మల్టీ టాస్కింగ్ చేసేవారికి స్మూత్ స్క్రోలింగ్ అందిస్తుంది. స్ట్రక్ అవడం అనే ముచ్చట కూడా ఉండదు.
ఈ Motorola Edge 70 Fusion మొబైల్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళితే.. ఇది చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా డిజైన్ పరంగా చాలా స్పెషల్‌గా ఉండబోతున్నట్లు ఫోటోలు చూస్తే తెలుస్తోంది. కెమెరా విషయానికి వెళ్తే.. ఇది చాలా ప్రత్యేకమైన Sony LYT-710 సెన్సార్, OIS సపోర్ట్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 13MP అల్ట్రా-వైడ్, మాక్రో లెన్స్ కెమెరా కూడా లభిస్తుంది. సెల్ఫీ కోసం మోటరోలా కంపెనీ ఫ్రంట్ భాగంలో అద్భుతమైన 32MP సెల్ఫీ కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన 7000mAh బ్యాటరీతో 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత Hello UI ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ Motorola Edge 70 Fusion స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ అద్భుతమైన IP68/IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ స్టీరియో వంటి ఫీచర్లను కూడా అందిస్తోంది. దీంతోపాటు మూడు ఆండ్రాయిడ్ వెర్షన్స్ అప్డేట్‌లతో పాటు ఐదేళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్లను కూడా అందిస్తుంది. ఇవే కాకుండా ఈ మొబైల్‌లో ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి కంపెనీ మార్చి ఆరవ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతోంది. అయితే, దీని ధర సుమారు రూ.24 వేల నుంచి ప్రారంభమై రూ.32 వేలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని మోటరోలా కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా మోటార్ల అధికారిక వెబ్సైట్‌తో పాటు ఆఫ్లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంచబోతోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BR Naidu Resignation: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. 'రంకు నేర్చిన అమ్మ బొంకు నేర్చదా? బీఆర్ నాయుడువా? లేక బూతు రోత నాయుడువా?' అని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ పుణ్యక్షేత్రం పదవిలో ఉండి అలా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఆయన టీటీడీ చైర్మన్‌గా వచ్చినప్పటి నుంచి తిరుమలలో అన్ని అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి వివరించారు.
Also Read: Dog Eat Body: ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం.. మనిషి శవాన్ని పీక్కుతున్న కుక్క
ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ, రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళను టీటీడీ చైర్మన్ 30 సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్ అంటాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే వారి ఇంటికి వెళ్లి భోజనం చేయాలని కానీ ఆమెను భోజనం చేస్తావా?' అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు.
Also Read: Annaram Barrage: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్
'పరాయి స్త్రీని బాహు బంధంలో బంధించావు. అంతటితో బీఆర్ నాయుడు తగ్గలేదు.. తగ్గేదేలే అంటున్నాడు. తిరుమల కొండపైన నివాసం ఉండేది నువ్వు బలహీనంగా చూస్తున్నావు. పదవికి తగిన న్యాయం చేసే అలవాటు నేర్చుకోవాలి' అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సూచించారు. 'భారతదేశంలో ప్రతి హిందువు బాధపడేలా భగవద్గీతలో ఏముంది అన్నాడు. గీతలో వాక్షాయా కామ సూత్రం ధర్మాలు ఉంటాయి' అని తెలిపారు.
'72 సంవత్సరాల వయసులో భక్తి పరవేశంలో తేలడం కాదు. కామ భక్తిలో తేలుతున్నాడు. బుద్ధి వస్తే తిరుమలకు వెళ్లి నిజం ఒప్పుకోండి. అపరాధం చేశామని ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది' అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సభ్య సమాజం సిగ్గు పడేలా గొప్ప పదవిలో ఉండి ఇలా చేయడం సమాజానికి చెడు సందేశం ఇస్తున్నావు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీటిని తెలుసుకోవాలి. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు అనర్హుడు. చంద్రబాబు నాయుడు ఓ మంచి వ్యక్తిని అతడి స్థానంలో పెట్టండి' వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bank Holiday on March 4 for Holi Check: ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకులు పనిచేస్తాయి. సాధారణంగా ఆర్‌బీఐ హాలిడేస్ లిస్ట్ ఆధారంగానే బ్యాంకులు బంద్ ఉంటాయి. కొన్ని స్థానిక పండుగలు, ప్రత్యేక దినాల్లో కూడా స్థానికంగా ఉండే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉంటాయి. అయితే మార్చి 3 తెలుగు రాష్ట్రాలలో ఈ హోలీ పండుగ వేడుకలు జరుపుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా రేపు మార్చి 4వ తేదీన హోలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కూడా ఈరోజు బంద్ ఉంది. అయితే రేపు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఎక్కడెక్కడ బ్యాంక్ బ్రాంచీలు బంద్ ఉండనున్నాయి? ఆర్‌బీఐ లిస్ట్ ప్రకారం ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ఆర్‌బీఐ బ్యాంక్ హాలిడే ఎప్పుడు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షెడ్యూల్ ప్రకారం మార్చి 3, 4 తేదీల్లో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. హోలీ సందర్భంగా ఈ సెలవు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదినా హోలీ మార్చి 3న జరుపుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్చి 4 అంటే రేపు ఈ వేడుక చేస్తున్నారు.
మార్చి 3న ఎక్కడ బంద్?
హోలీ వేడుకలు మంగళవారం మార్చి 3వ తేదీన 16 నగరాల్లో జరుపుకుంటున్నారు. ప్రధానంగా భోపాల్, డెహ్రాడూన్, బేలాపూర్, హైదరాబాద్, జైపూర్ కోల్ కతా, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, రాంచీ, గువాహటీ, తిరువనంతపురం, విజయవాడ, లక్నో ప్రాంతాల్లో ఈరోజే హోలీ వేడుకలు చేస్తున్నారు. కాగా ఆ ప్రాంతంలో బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉన్నాయి.
Also Read: పీఎం కిసాన్ నిధి బ్యాలెన్స్ చెక్ చేయాలా? మొబైల్‌లో ఇలా సింపుల్ చెక్ చేసుకోండి..!
రేపు ఎక్కడ బ్యాంకులు బంద్ ?
మార్చి 4వ తేదీ మొత్తంగా 18 నగరాల్లో ఈ బ్యాంకులు బంద్ ఉంటున్నాయి. అహ్మదాబాద్, ఐజ్వాల్, అగర్తలా, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్ టాక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ఢిల్లీ, పాట్నా, రాయపూర్ లో బంద్ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ముందుగా హోలికా దహనం సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 8:50 మధ్యలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇక మార్చ 4వ తేదీన హోలీ వేడుకలు ఈ ప్రాంతాల్లో జరుపుకోనున్నారు. బ్యాంకులు కూడా బంద్ ఉంటాయి
నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ధూలేటి అని కూడా పిలుస్తారు. రెండు రోజులపాటు ఈ వేడుక జరుపుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగు, గులాల్ చల్లుకొని వేడుకగా ఈ హోలీ నిర్వహిస్తారు. మణిపూర్ లో కూడా రెండు రోజులపాటు కొన్ని ప్రాంతాలను నిర్వహిస్తారు. పిల్లా పెద్దలు అందరూ కలిసి రంగులు చల్లుకుంటూ వేడుకగా జరుపుకునే పండుగ. సాధారణంగా బ్యాంకులు ఆర్‌బీఐ ప్రకారం బంద్ ఉంటాయి. ఇది కాకుండా ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. బ్యాంకులు బంద్ ఉన్నా కానీ డిజిటల్ చెల్లింపులో ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం లావాదేవీలు కూడా జరుపుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Biryani Thief Video: రైళ్లో అందరూ చూస్తుండగా బుట్టలో నుంచి బిర్యానీ కొట్టేసిన యువకుడు.. వీడియో ఇదే..
Biryani Thief On Train Video Watch: రైలు ప్రయాణాల్లో రకరకాల వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని నవ్విస్తే.. కొన్ని చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అయితే తాజాగా వైర్లు అవుతున్న వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. కేవలం ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం యువకుడు చేసిన పనిని చూసి ఇప్పుడు నేటిజెన్లు అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు? బిర్యానీ తిన్నాడా? అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక రైలు బోగీలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది.. ఒక యువకుడు అప్పర్ బెర్త్‌పై కూర్చొని మొబైల్లో సాంగ్స్ వింటూ ఉన్నాడు. అదే సమయంలో ఆహారాలను విక్రయించే ఒక వ్యక్తి కూడా ఎగ్ బిర్యానీ ప్యాకెట్లు పట్టుకొని.. బుట్టను తలపై పెట్టుకుని రైలు బోగీలో అటు ఇటు వెళ్తున్నాడు. అయితే ఆ యువకుడు ఉన్న బెర్త్ దగ్గరికి రాగానే. పైన కూర్చున్న యువకుడు మెల్లిగా.. ఆ బుట్టలో నుంచి ఒక బిర్యానీ ప్యాకెట్ ని దొంగలించేశాడు.. ఈ వీడియోను పక్కనే ఉన్న బెర్త్ ప్రయాణికుడు ఫోటో తీశాడు.
Later he ate the stolen biryani with great relish. pic.twitter.com/VHDfSABCdk
— Oppressor (@TyrantOppressor) February 22, 2026
అయితే ఆ యువకుడు అందులో నుంచి బిర్యానీ ప్యాకెట్ తీసిందని తెలియక.. ఆ బిర్యానీని అమ్మే వ్యక్తి పనిలో నిమగ్నమై ముందుకు సాగిపోయాడు.. యువకుడు కూడా ఏమీ తెలియనట్టుగా ఆ బిర్యాని ప్యాకెట్ను వేరే చోట దాచి పెట్టేసాడు.. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆ దొంగిలించిన బిర్యానిని ఎంతో ఇష్టంగా తింటూ కనిపించేసాడు. ఈ దృశ్యాలు అదే బోగీలో ఉన్న మరో ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అంతే ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది..
Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!
ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాలకి అన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. అయితే, దీనిని చూసిన కొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలను ఇలా మోసం చేయడం సరికాదని కొంతమంది కామెంట్లు పెడితే.. మరి కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఇలాగే ఉంటారు.. ఆకలి వేస్తే కొనుక్కొని స్తోమత లేదా? అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది..
Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Elephant Terror Viral Video Watch Here: కేరళలోని ఓ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో ఏనుగు బీభత్సం సృష్టించింది.. త్రిసూర్‌లోని అన్నామనాడ దేవాలయంలో జరుగుతున్న వలియావిలక్కు ప్రత్యేకమైన ఉత్సవాల సందర్భంగా ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయింది.. 26 ఏళ్ల యువకుడి పై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఆ ఏనుగు దాడి చేసిన తీరును చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూడాలనుకుంటున్నారా?
అన్నమనాడ దేవాలయానికి సంబంధించిన ఉత్సవాల్లో భాగంగా గజరాజును చాలా అందంగా ముస్తాబు చేసి ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నారు. పూజారులతోపాటు నిర్వాహకులు ఏనుగును అలంకరించే పనిలో పడ్డారు. ఒక వ్యక్తి ఏనుగు వీపుపై ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు కింద నిలబడి అలంకరణ సామాగ్రిని ఆ ఏనుగుపై ఎక్కే వ్యక్తికి అందిస్తూ ఉన్నారు.. అయితే ఈ సమయంలో ఏనుగు ఎంతో ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది..
అయితే, ఇదే సమయంలో ఏనుగు తన పక్కనే నిలబడిన ఒక యువకుడి కాలును తొక్కడమే కాకుండా..ఉన్నట్టుండి గాల్లోకి లేపేసింది.. అనంతరం అతడిని కిందికి విసిరి కొట్టేసింది.. ఆ సమయంలో అక్కడే ఉన్న భక్తులతో పాటు కొంతమంది నిర్వాహకులు భయాందోళనకు గురయ్యారు. మరి కొంతమంది భక్తులైతే అక్కడి నుంచి పరుగులు పెట్టేసారు.. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని వెంటనే అక్కడే ఉన్న స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
🎥WATCH | Temple priest injured after elephant attacks him in Thrissur, Kerala pic.twitter.com/dyDbV8bFME
— The Tatva (@thetatvaindia) February 26, 2026
Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!
ఈ ప్రమాద ఘటనతో ఆలయ కమిటీ ఉత్సవాలను తక్షణమే నిలిపివేసినట్లు తెలుస్తోంది.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని.. ఏనుగు మానసిక పరిస్థితి తో పాటు శారీరక స్థితిని పరీక్షించడానికి ప్రత్యేకమైన ఎలిఫెంట్ స్క్వాడ్ బృందాన్ని కూడా రప్పించినట్లు తెలుస్తోంది.. విపరీతమైన రద్దీతో పాటు పెద్ద శబ్దాల కారణంగానే గజరాజు ఇలా ప్రవర్తించి ఉంటుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా కేరళలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.
Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
PM Kisan 22nd Installment Status Check: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏడాది మూడు విడుదల రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ చేస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 21వ విడత నిధులు మంజూరు చేసింది. ఇక 22వ విడత రూ.2000 రైతుల ఖాతాలో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రతి ఏడాది మూడు దఫాల్లో రూ.2000 అలా మొత్తంగా రూ.6000 రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు సాగు ఖర్చులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధానంగా చిన్న కారు రైతులకు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే హోలీకి ముందుగానే ఈ 22వ విడత నిధులు మంజూరు అవుతాయని రైతులు ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ నెలలో 22వ విడత కచ్చితంగా విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈకేవైసీ..
ఈ విడత నిధులు పొందాలంటే ముందుగానే రైతులు ఈకేవైసీ పూర్తి కొని ఉండాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి కావాల్సిన అర్హత కూడా కలిగి ఉండాల్సిందే. లేకపోతే రైతులు ఈ పథకానికి అర్హులు కాదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలో రూ. 2000 జమ అవుతాయి. మీ బ్యాంకుకు వెళ్లి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చేసుకోవాలి. దీంతోపాటు ఈకేవైసీ ముందుగానే పూర్తి చేసుకోవాలి. ఇది ఆన్‌లైన్, ఆఫ్ లైన్ రెండు విధాలు అందుబాటులో ఉంది.
Also Read: మా సంగీత్ నైట్.. కాళ్ల నొప్పి, కన్నీళ్లు వచ్చే వరకు ఫుల్ ఎంజాయ్: VD
పీఎం కిసాన్ నీది బెనిఫిషరీ లిస్ట్ చెక్ చేసుకునే విధానం..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ అయిన https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. అందులో బెనిఫిషియరీ లిస్ట్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ మీ రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్ ,బ్లాక్, విలేజ్ ఎంపిక చేసుకొని చివరిగా సబ్మిట్ చేస్తే ఇందులో మీ పేరు ఉందా? లేదా? సులభంగా చెక్ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ నిధులు మిస్డ్ కాల్ ద్వారా చెక్ చేసుకునే విధానం..
ప్రధానమంత్రి కిసాన్ డబ్బులు మిస్డ్ కాల్ రూపంలో కూడా మీరు సులభంగా చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కచ్చితంగా ఉండాల్సిందే. అందులో నుంచి 155733 నెంబర్‌కు ఒక మిస్ కాల్ ఇవ్వాలి. అప్పుడు మీకు వెంటనే కాల్ బ్యాక్ వస్తుంది. అక్కడ మీ ఆధార్ నంబర్‌తో మీరు తెలుసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Human Dead Body: తెలంగాణలో ఘోరాతి ఘోర సంఘటన చోటుచేసుకుంది. బతికి ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం సక్రమంగా అందకపోగా.. చనిపోయినప్పుడు కూడా సరైన స్థితిలో భద్రపర్చడం లేదు. మరణించిన వ్యక్తి మృతదేహాలను ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచడానికి సరైన వసతులు లేవు. ఫ్రీజర్ లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని కింద ఉంచి వదిలేశారు. కొద్దిసేపటికి మృతదేహాన్ని కుక్క తినేసింది. ఈ సంఘటన జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Annaram Barrage: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల ప్రాంతానికి చెందిన భీమేష్(28) అనే యువకుడు రెండు రోజుల కిందట సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి అక్కడే ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల పాత ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతదేహాన్ని భద్రపర్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో కనీస వసతులు లేవు. రక్షణ లేక.. ఫ్రీజర్ ఉన్నా కూడా అది పనిచేయకపోవడంతో నేలపైనే మృతదేహాన్ని ఉంచారు. కింద ఉంచిన మృతదేహాన్ని వీధి కుక్క ఆహారంగా మారింది. మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటుండగా గమనించిన స్థానికులు వీడియోలు తీసి బయటపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ముందే చేతికి వచ్చిన యువకుడు చనిపోవడంతో దిగ్భ్రాంతికి లోనయిన ఆ కుటుంబం కుక్క తినడం మరింత కుంగదీసింది. లబోదిబోమంటూ యువకుడి కుటుంబసభ్యులు రోదించారు.
మార్చురీలో కుక్క మృతదేహం తింటున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న పరిస్థితులు ఈ సంఘటన అద్దం పడుతుండగా ఈ సంఘటనపై రాజకీయ పార్టీలు, ప్రముఖులు స్పందిస్తున్నారు. మానవత్వమే మంట కలిసేలా ఉన్న ఈ సంఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మృతదేహాలకు కూడా రక్షణ కరువైందని అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి సమస్యలు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్పత్రులు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Truck Viral Video Watch Now: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ హైవేపై ట్రక్కు ఊహించని బీభత్సం సృష్టించింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. అతివేగంతో వచ్చిన ఒక ట్రక్కు కారును ఢీకొనడమే... కాకుండా దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల మేర రోడ్డుపై ఈడ్చగలిగింది.. ఈ భయంకరమైన దృశ్యాలకు సంబంధించిన వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం షాక్ అవుతున్నారు. అయితే, ఆ ట్రక్కు అంత దూరం ఈడ్చి వెళ్లడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో లేంటో ఇప్పుడు మనం చూద్దాం..
మధ్యప్రదేశ్‌లోని దాబ్రా-గ్వాలియర్ రహదారిపై ఆదివారం ఉదయం ఊహించని ఘటన చోటుచేసుకుంది.. టేకాన్పూర్ సమీపంలోని ఓ గ్రామం వద్ద వేగంగా వస్తున్న ట్రక్కు ఎదురుగా వెళ్తున్న కారును బలంగా ఢీకొనడమే కాకుండా.. ఆ కారు ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో డ్రైవర్ ఆ ట్రక్కుతో పాటు కారును ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్ళాడు.. ఆ కారులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేస్తున్న..ట్రక్కు డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేకపోవడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ పాటు ఈడ్చుకుంటూ వెళ్లిన డ్రైవర్.. చివరికి రోడ్డు పక్కన ఉన్న గుంతలో కారును నెట్టేసి.. తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.. అయితే దీనిని గమనించిన అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు మోటార్ సైకిల్‌పై ట్రక్కును వెంబడించి ఓ ప్రాంతంలోని దానిని పట్టుకున్నారు. ఆగ్రహానికి గురైన స్థానికులు ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు..
Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!
The car was carrying three passengers, including an officer from the Special… pic.twitter.com/mRn0CwgVsm
— Hate Detector 🔍 (@HateDetectors) March 2, 2026
అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో దాదాపు ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.. కారు దాదాపు నుజ్జునుజ్జయినట్లు సమాచారం.. లోపల ఉన్న ముగ్గురు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడడం విశేషం.. ఈ కారులో ఉన్న వారిలో ఒకరు ఆర్మూర్ ఫోర్స్ అధికారని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే, ఘటన స్థలానికి వెంటనే ఉన్నత పోలీసు సిబ్బంది కూడా చేరుకున్నారు. ఈ ఘటనపై అన్ని వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం పై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా కోరారు..
Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
