Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kumuram Bheem Asifabad504292

రెబ్బెన మండలంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవం

Aug 15, 2025 08:02:34
Gollet, Telangana
రెబ్బెన మండలంలోని పలు గ్రామాలలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు మండల కేంద్రమైన రెబ్బెనతోపాటు గోలేటి గంగాపూర్ నంబాల ఎడవెల్లి కిష్టాపూర్ కొమరవెల్లి నారాయణపూర్ తదితర గ్రామాల్లో అధికారులు ప్రజలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గోలేటి టౌన్షిప్ లో సింగరేణి అధికారులతో పాటు పలు యూనియన్ల నాయకులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
11
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Aug 15, 2025 06:57:00
Penugonda, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా పెనుగొండమండలం ములపర్రు ది. హిందూ ముస్లిం వ్యవసాయ సహకార సంఘం త్రీ సభ్య కమిటి సభ్యులు, కమిటి చైర్మన్ గుత్తుల లోకేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేదికలు నిర్వహించారు. ఇకార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామస్తులు, సహకార సంఘం సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండా వందనం చేశారు.
12
comment0
Report
Aug 14, 2025 20:58:02
Tadepalligudem, Andhra Pradesh:
పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో అందరికీ స్థానం కల్పిస్తామని రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు.పెంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు దాసరి శ్రీనివాస్, దాసరి కోట సత్యం, సత్యనారాయణ రెడ్డి సహా 50 మందికి పైగా అనుచరులు జనసేనలో చేరారు.స్థానిక యలమపేటలో జరిగిన కార్యక్రమంలో బొలిశెట్టి కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి జనసైనికుని సుఖదుఖాల్లో పక్కన ఉంటామని అన్నారు.
14
comment0
Report
Aug 14, 2025 20:51:54
Palakollu, Andhra Pradesh:
రాష్ట్రంలో సాగునీటి సంఘాల ద్వారా జలవనరుల నిర్వహణపై సాగునీటి వినియోగదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుండి పాల్గొన్నారు ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..ఈసందర్భంగా మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జలవనరుల శాఖ పనితీరును వివరించారు.ఇటీవల ఏర్పాటైన్ నీటి సంఘాల్లో రైతుల్ని భాగస్వామ్యం చేశామని జలవనరుల శాఖకు కేటాయించిన నిధులు, జరిగిన, జరుగుతున్న పనులపై వర్షాలు నేపథ్యంలో తీసుకొంటున్న చర్యలు పై సిఎంకు వివరించారు.
14
comment0
Report
Aug 14, 2025 12:40:11
Gollet, Telangana:
భారతీయులందరూ రేపు ఎంతో కన్నుల పండుగగా జరుపుకునే 79వ స్వాతంత్ర దినోత్సవానికి సర్వం సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్ద జెండాల గద్దె చుట్టూ శుభ్రం చేస్తున్నారు. అదేవిధంగా సింగరేణి ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లోని పలు కార్మిక సంఘాల కార్యాలయాల వద్ద, సింగరేణి గనులు, డిపార్ట్మెంట్ల వద్ద పతాకావిష్కరణ గావించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కళాకారుల్ని సిద్ధం చేస్తున్నారు
14
comment0
Report
Aug 14, 2025 12:26:00
Gollet, Telangana:
ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు గత మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను గురువారం తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ సమక్షంలో కాంట్రాక్టర్లకు యూనియన్ నాయకులకు మధ్య జరిగిన చర్చల్లో పురోగతి సాధించినట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భో గే ఉపేందర్ తెలిపారు. ఈనెల 24వ అన్ని సమస్యలు పరిష్కరిస్తానని కాంట్రాక్టర్ శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు ఆయన తెలిపారు. సమ్మెకు సహకరించిన ప్రజా సంఘాల నాయకులకు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
14
comment0
Report
Aug 14, 2025 08:58:13
Tanuku, Andhra Pradesh:
తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షం దాటికి పశ్చిమగోదావరిజిల్లా తణుకులోని రెవిన్యూ కార్యాలయాన్ని వర్షపు నీరు ముంచేత్తింది. దింతోతహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు అనేక అవస్థలుఎదుర్కొన్నారు
14
comment0
Report
Aug 14, 2025 06:27:00
Gollet, Telangana:
ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించకుంటే అత్యవసర సేవలు నిలిపివేస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగె ఉపేందర్ హెచ్చరించారు. గురువారం నిరసనలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు.సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టిన అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, రెండు జతల దుస్తులు, గ్లౌజులు, టార్చ్ లైట్ లు ఇవ్వాలన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు
14
comment0
Report
Aug 13, 2025 17:01:43
Gollet, Telangana:
ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అదనపు కలెక్టరేకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం AITUC జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుద్య, పేసెంట్ కేర్, భద్రత సిబ్బందికి పెండింగ్ వీతనాలు చెల్లించాలని, PF, ESI వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
14
comment0
Report
Aug 13, 2025 16:02:58
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా ఉండి మండలం మహాదేవపట్నంలో మహిళా సమైక్య సభ్యులు నెలకొల్పిన స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. రూ.25 లక్షల వ్యయంతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీకి పీఎంఎఫ్ఎంఈ పథకం కింద రూ.8.75 లక్షల సబ్సిడీ లభించింది. మహిళలు పరిశ్రమలు స్థాపించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు సూచించారు.
14
comment0
Report
Aug 13, 2025 09:02:05
Palakollu, Andhra Pradesh:
ఎపిలో పలు జిల్లాల పేర్లు మార్పు, సరిహద్దుల మార్పులపై జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో సహచర మంత్రుల తో కలసి పాల్గొన్న ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు..
14
comment0
Report
Aug 13, 2025 08:17:55
Bhimavaram, Andhra Pradesh:
జరగనున్న 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..భీమవరం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో 400 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.దేశాభివృద్ధికి యువత కీలకమని, ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. స్వాతంత్రోద్యమంలో యువత పాత్రను గుర్తుచేశారు.
14
comment0
Report
Aug 13, 2025 08:03:08
Achanta, Andhra Pradesh:
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆచంట (మం)లో బిజెపి కార్యకర్తలు,నాయకులు ఆచంట కచేరి సెంటర్ నుండి వల్లూరు వరకు బిజెపి నాయకులు, కార్యకర్తలు తిరంగా ర్యాలీ చేపట్టారు మూడు రంగుల జెండా చేతబట్టి భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో ఈర్యాలీ జరిగింది.
14
comment0
Report
Aug 13, 2025 07:58:01
Palakollu, Andhra Pradesh:
కార్య కర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడుతెలిపారు...పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ము చిక్కాలకు చెందిన టీడీపీ కార్యకర్త కుంచర్లపాటి సోమరాజు ఇటీవల ప్రమాదంలో మరణించారు.ఆపదలో అండగా ఎపి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును అందజేశారు.నారా లోకేశ్ ప్రవేశపెట్టిన ఈ పథకం పార్టీ కార్యకర్తలకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
14
comment0
Report
Aug 13, 2025 07:49:15
Bhimavaram, Andhra Pradesh:
అమెరికా అధ్యక్షుడు భరత్ పై భారీ సుంఖాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు నుంచి నిరసన సెగ మొదలైంది...పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఆక్వా రైతులు వినూత్న నిరసన చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్ర పటానికి బ్లీచింగ్ చల్లి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఆక్వా రంగానికి ట్రంప్ వైరస్ల పట్టుకున్నాడని,అది త్వరగా విరగడ అయ్యి తొలిగి పోవాలని అమెరికా-భారత్ సంబంధాలు మెరుగుపడాలంటే ట్రంప్ అనే వైరస్ తొలగిపోవాలని ఆక్వా రైతులు నినాదాలు చేశారు.
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top