Back
కాంట్రాక్టు కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా
Gollet, Telangana
ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు గత మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను గురువారం తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ సమక్షంలో కాంట్రాక్టర్లకు యూనియన్ నాయకులకు మధ్య జరిగిన చర్చల్లో పురోగతి సాధించినట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భో గే ఉపేందర్ తెలిపారు. ఈనెల 24వ అన్ని సమస్యలు పరిష్కరిస్తానని కాంట్రాక్టర్ శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు ఆయన తెలిపారు. సమ్మెకు సహకరించిన ప్రజా సంఘాల నాయకులకు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Gollet, Telangana:
భారతీయులందరూ రేపు ఎంతో కన్నుల పండుగగా జరుపుకునే 79వ స్వాతంత్ర దినోత్సవానికి సర్వం సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్ద జెండాల గద్దె చుట్టూ శుభ్రం చేస్తున్నారు. అదేవిధంగా సింగరేణి ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లోని పలు కార్మిక సంఘాల కార్యాలయాల వద్ద, సింగరేణి గనులు, డిపార్ట్మెంట్ల వద్ద పతాకావిష్కరణ గావించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కళాకారుల్ని సిద్ధం చేస్తున్నారు
13
Report
Tanuku, Andhra Pradesh:
తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షం దాటికి పశ్చిమగోదావరిజిల్లా తణుకులోని రెవిన్యూ కార్యాలయాన్ని వర్షపు నీరు ముంచేత్తింది. దింతోతహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు అనేక అవస్థలుఎదుర్కొన్నారు
14
Report
Gollet, Telangana:
ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించకుంటే అత్యవసర సేవలు నిలిపివేస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగె ఉపేందర్ హెచ్చరించారు. గురువారం నిరసనలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు.సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టిన అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, రెండు జతల దుస్తులు, గ్లౌజులు, టార్చ్ లైట్ లు ఇవ్వాలన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు
14
Report
Gollet, Telangana:
ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అదనపు కలెక్టరేకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం AITUC జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుద్య, పేసెంట్ కేర్, భద్రత సిబ్బందికి పెండింగ్ వీతనాలు చెల్లించాలని, PF, ESI వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
14
Report
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా
ఉండి మండలం మహాదేవపట్నంలో మహిళా సమైక్య సభ్యులు నెలకొల్పిన స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. రూ.25 లక్షల వ్యయంతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీకి పీఎంఎఫ్ఎంఈ పథకం కింద రూ.8.75 లక్షల సబ్సిడీ లభించింది. మహిళలు పరిశ్రమలు స్థాపించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు సూచించారు.
14
Report
Palakollu, Andhra Pradesh:
ఎపిలో పలు జిల్లాల పేర్లు మార్పు, సరిహద్దుల మార్పులపై జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో సహచర మంత్రుల తో కలసి పాల్గొన్న ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు..
14
Report
Bhimavaram, Andhra Pradesh:
జరగనున్న 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..భీమవరం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో 400 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.దేశాభివృద్ధికి యువత కీలకమని, ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. స్వాతంత్రోద్యమంలో యువత పాత్రను గుర్తుచేశారు.
14
Report
Achanta, Andhra Pradesh:
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆచంట (మం)లో బిజెపి కార్యకర్తలు,నాయకులు ఆచంట కచేరి సెంటర్ నుండి వల్లూరు వరకు బిజెపి నాయకులు, కార్యకర్తలు తిరంగా ర్యాలీ చేపట్టారు మూడు రంగుల జెండా చేతబట్టి భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో ఈర్యాలీ జరిగింది.
14
Report
Palakollu, Andhra Pradesh:
కార్య కర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడుతెలిపారు...పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ము చిక్కాలకు చెందిన టీడీపీ కార్యకర్త కుంచర్లపాటి సోమరాజు ఇటీవల ప్రమాదంలో మరణించారు.ఆపదలో అండగా ఎపి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును అందజేశారు.నారా లోకేశ్ ప్రవేశపెట్టిన ఈ పథకం పార్టీ కార్యకర్తలకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
14
Report
Bhimavaram, Andhra Pradesh:
అమెరికా అధ్యక్షుడు భరత్ పై భారీ సుంఖాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు నుంచి నిరసన సెగ మొదలైంది...పశ్చిమగోదావరి జిల్లా
ఉండి మండలం యండగండిలో ఆక్వా రైతులు వినూత్న నిరసన చేపట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్ర పటానికి బ్లీచింగ్ చల్లి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఆక్వా రంగానికి ట్రంప్ వైరస్ల పట్టుకున్నాడని,అది త్వరగా విరగడ అయ్యి తొలిగి పోవాలని అమెరికా-భారత్ సంబంధాలు మెరుగుపడాలంటే ట్రంప్ అనే వైరస్ తొలగిపోవాలని ఆక్వా రైతులు నినాదాలు చేశారు.
14
Report
Gollet, Telangana:
ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగె ఉపేందర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టు వ్యవస్థ రద్దుచేసి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని అన్నారు. ప్రతి నెల ఒకటవ తారీఖున వేతనాలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ వివరాలు తెలుపాలని తెలుపాలని డిమాండ్ చేశారు
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలలోని పలు ఇండ్లు కూలిపోగా, వీధులు ఒర్రెలను తలపించాయి. వర్షం దాటికి గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని రేకుల గూడాలో టేకం స్వరూప,గోలేటి టౌన్షిప్ లోని భోగారపు రవి ఇండ్లు కూలిపోయాయి. దుబ్బ గూడెం చెరువు నిండి మత్తడి దుంకడంతో దిగువన ఉన్న రేకుల గూడెం, అంబేద్కర్ నగర్ లలో ఇండ్లలోకి నీరు చేరింది. వర్షానికి పూరి గుడిసె వాసులు రాత్రంతా బిక్కు బిక్కు మంటూ గడిపారు. అధికారులు స్పందించి ఇల్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన గోలేటిలో సోమవారం రాత్రి ఉరూములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.హటాత్తుగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు విద్యుత్ సరపరాలో అంతరాయం ఏర్పడింది. గోలేటితో పాటు ఖైరిగూడ, సోనాపూర్ దుగ్గాపూర్, గోలేటి క్రాస్ రోడ్డు, దేవులగూడ, రెబ్బెన తదితర ప్రాంతాలో జోరు వాన కురిసింది. దీంతో వాగులు, వంకలు, చిన్నా పెద్ద కాలువలు ఉదృతంగా పారాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షలు పడే అవకాశలు ఉన్నాయని, అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు
14
Report
Penugonda, Andhra Pradesh:
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో రైతులు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మార్టేరు నుండి పెనుగొండ వరకు భారీ ట్రాక్టర్ల ర్యాలీనిర్వహించారు..నియోజకవర్గం లోని పెనుమంట్ర మండలం మార్టేరు నుండి పెనుగొండ వరకు ట్రాక్టర్లతో రైతుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది.మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొని ట్రాక్టర్ నడిపి నేను రైతు బిడ్డ నేనంటూ ర్యాలీలో ముందుకు సాగారు.
14
Report