Back
500041
జె ఎన్ ఏ ఎఫ్ ఏ యు టీచింగ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కృతజ్ఞత సమ్మేళం
Hyderabad, Telangana
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జే ఎన్ ఏ ఎఫ్ యు) కి స్థలాన్ని కేటాయించడం హర్షనీయమని జే ఎన్ ఏ ఎఫ్ ఏ యు టీచింగ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ పేర్కొంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడారు. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళలపై ఉన్న తన ఆసక్తిని ప్రత్యేకంగా ప్రదర్శించారని అన్నారు.
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ నూతన కూరగాయల మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు పెట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మల్లేష్ పేరు పెట్టని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, కార్యాలయాల ముట్టడి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు.
0
Share
Report
Khammam, Telangana:
రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలని ఖమ్మం కలెక్టర్ వద్ద రైతు సంఘాలు ధర్నా చేసాయి. రుణమాఫీ కాకపోవడంతో రైతాంగం నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నట్లు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఒక క్లారిటీతో లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాగం హేమంతరావు, మౌలానా పాల్గొన్నారు.
0
Share
Report
Khammam, Telangana:
ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ డేకు ప్రజలు పెద్దసంఖ్యలో తమ సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదు తనీఖీ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కలెక్టర్ కు సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో భారీగా బాధితులు గ్రీవెన్స్ కు తరలివస్తున్నారు.
1
Share
Report
Khammam, Telangana:
ఖమ్మం జిల్లా మధిరలో నూతనంగా మంజూరైనా సబ్ కోర్టు(సీనియర్ సివిల్ జడ్జి కోర్టు) భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జిలు జస్టిస్ శ్రీ సుధ,కాజ శరత్,భీమపాక నగేష్ లు భూమి పూజచేశారు.
అనంతరం తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసిన సబ్ కోర్టు ను హైకోర్టు జడ్జిలు ప్రారంభించారు. ప్రజలకు న్యాయ సేవలు విసృతపరచడం కోసం నూతన కోర్టులకు శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో పాటు మధిర న్యాయవాదులు పాల్గొన్నారు.
1
Share
Report
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన బెల్లంపల్లి సివిల్ జడ్జి గృహాన్ని శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇ.వి వేణుగోపాల్ ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. గుస్సాడీ నృత్యాలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన కోర్టు ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జడ్జి నివాస గృహానికి ప్రారంభోత్సవం చేశారు.
1
Share
Report
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి శివారు పరిధిలో ఒక ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి సిద్ధంగా ప్రవహిస్తున్న వాగుపై కాంక్రీట్ సహాయంతో పర్మినెంట్ వంతెన నిర్మించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారుల అనుమతి లేకుండా వాల్టా చట్టం ఉల్లంఘించి వంతెన నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు.
0
Share
Report
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో అడ్డ కూలీల కష్టాలు తీర్చాలని, లేబర్ సైట్ ను వెంటనే పునరుద్ధరించాలని శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గత 2 నెలలుగా కార్మిక శాఖకు చెందిన ఆన్లైన్ సైట్ పనిచేయక పోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చాలా మంది కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని తెలిపారు.
0
Share
Report
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన కూరగాయల సముదాయానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ నామకరణం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి నాయకులు మెమోరాండం అందజేశారు. బెల్లంపల్లి అభివృద్ధి కొరకు తన జీవితాంతం కృషిచేసిన గుండ మల్లేష్ పేరు పెట్టడమే సరైన నిర్ణయం అన్నారు. అప్పుడే పట్టణ ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.
0
Share
Report
Khammam, Telangana:
చింతకానిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అరెస్టు చేసారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పులంటూ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం చేసారు. ఈక్రమంలో పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. ఈ నేపాథ్యంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి కనిపించింది. అనంతరం బలవంతంగా పుల్లయ్య ను స్టేషన్ కు తరలించారు. ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
1
Share
Report