Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500095

ఇటీవల స్టాక్ మార్కెటింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టాలంటే

Jun 15, 2024 13:07:48
Hyderabad, Telangana

స్టాక్ మార్కెటింగ్ పేరుతో సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని బిగ్ బుల్ ట్రేడింగ్ అకాడమీ సీఈవో హిమాన్షు పర్వాల్ అన్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి అవగాహన ముఖ్యం. నేడు డిజిటల్ యుగంలో, సైబర్ మోసగాళ్లు స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉన్నవారి ప్రయోజనాన్ని పొందుతున్నారు. స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉన్న వ్యక్తులకు స్టాక్ మార్కెట్ పెట్టుబడిపై సాంకేతిక విశ్లేషణ తరగతులు మరియు కోచింగ్ ఇవ్వబడుతుంది ఎందుకంటే చాలా మంది దాని గురించి అర్థం చేసుకోకుండా మోసపోతున్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Feb 06, 2026 12:01:24
Hyderabad, Telangana:

Rattlesnake Video Watch: సాధారణంగా అడవులకు దగ్గరగా జీవించేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక వన్యప్రాణులు జనాభాసాల్లో సంచారం చేసి దాడి చేసే అవకాశాలుంటాయి. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి పాములు విపరీతంగా జనాభాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ చాలామందికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి దాఖలాలు ఇప్పటివరకు ఎన్నో మనం చూసిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది.. ఈ వీడియోలో ఏముందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అత్యంత ప్రమాదకరమైన రాటిల్ స్నేక్ చూడొచ్చు.. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఒక వ్యక్తి తన శూలోపల ఏదో కదులుతున్నట్లు గమనించారు.. అయితే, దానిని అలాగే పరీక్షించి చూడగా అతడికి ఒక అత్యంత ప్రమాదకరమైన రాటిల్ స్నేక్ కనిపిస్తుంది. వెంటనే అతను ఒక స్నేక్ క్యాచర్ కి సమాచారం అందిస్తారు. వెంటనే అతను ఆ ఘటన స్థలానికి చేరుకొని పామును రెస్క్యూ చేపట్టేందుకు ప్రయత్నిస్తాడు..

ఇందులో భాగంగానే ఆ స్నేక్ క్యాచర్ మొదటగా ఒక షూను అటు ఇటు కదుపుతాడు. అయితే, అతనికి అందులో ఏది కనిపించదు. ఆ తర్వాత రెండవ దానిని ఒక స్నేక్ స్టిక్‌తో కదిపేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలోనే అత్యంత ప్రమాదకరమైన ఓ చిన్న పాము బయటికి రావడం కనిపిస్తుంది. అంతేకాకుండా అతనిపై ఆ పాము దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో దాదాపు మూడు నుంచి నాలుగు సార్లు ఆ పాము అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం మీరు చూడొచ్చు. అయితే ఈ పాము చాలా యాక్టివ్‌గా ఉంది. దానిని పట్టుకోవడం చాలా కష్టతరం అవుతోంది. 

అయితే ఆ పాము చాలా యాక్టివ్‌గా ఉండడం వల్ల.. దానిని పట్టుకోవడం కాస్త ప్రమాదకరమని భావించి.. అతను ఆ షూతో పాటు పామును కూడా ఒక బకెట్లో సురక్షితంగా తీసుకొని ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఈ పామును వదిలేస్తాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. అయితే,త ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. స్నేక్ క్యాచర్ తరపున అక్కడికి వెళ్లిన బృందం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 06, 2026 11:41:20
Hyderabad, Telangana:

Huge King Cobra Video Watch: సాధారణంగా ఎక్కడైనా అత్యంత ప్రమాదకరమైన పాములు కనిపిస్తే వెంటనే అందరూ స్నేక్ క్యాచర్ కి కాల్ చేస్తూ ఉంటారు. వార అక్కడికి చేరుకొని.. ప్రాణాలకు తెగించి మరి ఎంతో ప్రమాదకరమైన పాములను రెస్క్యూ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా వారు పాములు పట్టుకుంటున్న దృశ్యాలను మన తరచుగా చూస్తూ ఉన్నాం. అయితే, మనం వారిని ఎంతో ధైర్యవంతులుగా భావిస్తూ ఉంటాం.. కానీ వారి వెనక ఎన్నో సమస్యలు ఉంటాయి.. కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకరమైన పాముల కాటుకు గురై తీవ్ర సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు. కాబట్టి వీరు చేస్తున్న పనిని గుర్తించి వీరికి తగ్గ గౌరవం ఇవ్వడం చాలా మంచిది. 

ముఖ్యంగా సమాజంలో కొంతమంది స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రోజుకు దాదాపు నాలుగు నుంచి ఐదు అత్యంత ప్రమాదకరమైన పాములను పట్టుకొని రెస్క్యూ చేసేవారు కూడా ఉన్నారు. అందులో సర్పమిత్ర ఆకాష్ జాదవ్ ఒకరు. ఆయన దాదాపు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు ప్రమాదకరమైన పాములను పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయట.. అంతేకాకుండా ఒకేసారి ఆ రెండింటిని సురక్షితమైన ప్రదేశాల్లో వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయని అనేక వీడియోల్లో ఈయన పేర్కొన్నారు. తాజాగా కూడా ఆయన రెండు ప్రమాదకరమైన పొడవాటి నాగుపాములను వదిలిపెడుతున్న దృశ్యాలు కూడా వీడియోలో చూడొచ్చు..

ఇప్పటివరకు అతను వందలాది పాములను పట్టుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి లేదా ఇతర నాయకుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదని వీడియోలో తెలిపారు.. ఈ వృత్తి ఎంచుకున్న వారిలో 70 శాతం మంది నిరుపేదలే అని ఆయన వీడియోలో క్లియర్ గా చెప్పడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో పాములు కాటేసి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా ఆ చికిత్సకైనా ఖర్చులు వీరి జేబుల నుంచే పెట్టుకోవాల్సి వస్తుందట. ఇలా వీడియోలో చెబుతూ అతను పట్టుకున్న రెండు ప్రమాదకరమైన పాములను వదిలిపెట్టడం మీరు చూడొచ్చు. 

ఈ వీడియోలో అతను అడవికి దగ్గరగా ఉన్న ఓ సురక్షితమైన ప్రదేశంలో రెండు పాములను పట్టుకుని వచ్చి.. వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో అతను వీడియోలో మాట్లాడుతూ.. స్నేక్ క్యాచర్స్ ఎదుర్కొనే సమస్యల గురించి తెలిపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను అతని యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోయారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
IPInamdar Paresh
Feb 06, 2026 10:23:58
Hyderabad, Telangana:

Ap CM Chandrababu naidu Sensational comments on Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదం ఏపీరాజకీయాల్లో పెనుదుమాంగా మారాయి. ఇప్పటికే సిట్ నివేదికపై వైసీపీ వర్సెస్ కూటమి మధ్య మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల లడ్డు వివాదంను డైవర్ట్ చేసేందుకు అంబటి రాంబాబు,జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని వైసీపీ తీవ్ర మైన ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తిరుమల లడ్డు కల్తీపై చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీలో అగ్గిని రాజేశాయి. దీనిపై శ్రీవారి భక్తులు కూడా తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  కర్నూల్ లోని ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల లడ్డు తయారీలో అక్రమాలు జరిగాయన్నారు. లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్నారు. 2019 నుంచి 2024 ల మధ్య లడ్డుపై అనేక ఫిర్యాదులు అందాయన్నారు. కూటమి వచ్చాక దీనిపై సమగ్ర విచారణ చేపట్టామన్నారు. ఈవోను మార్చామన్నారు. సమర్థవంతమైన అధికారుల్ని విచారణకు రంగంలోకి దింపి సిట్ ఏర్పాటు చేశామన్నారు. ఎడీడీబీ రిపోర్ట్ తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని స్పష్టంగా పేర్కొందని గుర్తు చేశారు.

సిట్ నివేదికను తప్పుగా వైసీపీ ప్రచారం చేస్తున్నారన్నారు. తిరుమలలడ్డుపై విచారణ చేయిస్తున్న తనను సారీ చెప్పాలని అంటున్నారని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తిరుమల లడ్డులో బాత్రూమ్ లో ఉపయోగించే కెమికల్ ను వాడారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లు ఏపీలోని అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా  కల్తీ నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేశారని సీఎం చంద్రబాబు గత పాలకులపై మండిపడ్డారు. ఈ విషయంను స్వయంగా వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారన్నారు.

Read more: Rk Roja: అరచేతితో సూర్యుడ్ని ఆపడం సాధ్యమౌతుందా..?.. జగన్ పర్యటన వేళ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా..

తిరుమల శ్రీవారి పవిత్రతను దిగజార్చేలా గత పాలకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో తిరుమల లడ్డు వివాదం మరోసారి ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే దీని వెనకల ఉన్న వారిని పట్టుకుని కఠినంగా పనిష్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 06, 2026 08:11:46
Medaram, Telangana:

Sammakka Saralamma Hundi Calculation In Telugu: మనందరికీ మేడారం జాతర అనగానే కోట్లాదిమంది భక్తుల నమ్మకంతో పాటు ఆ తల్లి పై ఉన్న విశ్వాసం గుర్తుకొస్తుంది.. కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లుగా.. సమ్మక్క సారలమ్మలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు.. తాజాగా మేడారంలో జరిగిన ఒక ఘటన భక్తుల మనోవేదనకు.. అమ్మవార్లపై వారికి ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది. ఇంతకీ అదేంటి? ప్రస్తుతం ఆ అమ్మవారి హుండీలో లభించిన నోటిపై ఉన్న భక్తుడి మనోవేదన ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారక్క జాతర ముగిసిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులంతా సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది.. ఈ సమయంలో హుండీలో బంగారంతో పాటు నగదు వెండి వస్తువులతో పాటు భక్తుల తమ బాధలను విన్నవిస్తూ రాసిన లీకలు అప్పుడప్పుడు బయట పడుతూ ఉంటాయి. అయితే, తాజాగా కూడా ఒక వంద రూపాయల నోటుపై భక్తుడు రాసిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

సాధారణంగా మేడారం జాతరకు వచ్చిన భక్తులంతా హుండీలో తమకు ఉద్యోగాల్లో ప్రమోషన్ రావాలని, ఉద్యోగాలు లేనివారికి ఉద్యోగాలు కలగాలని, ఆర్థిక ఇబ్బందులు ఉంటే త్వరగా తొలగిపోవాలని, ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తమ మొక్కులను కానుకల రూపంలో చెల్లిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓ తండ్రి తన కొడుకు పెట్టే బాధను భరించలేక సాక్షాత్తు ఆ అమ్మవారిలను ఆశ్రయించడం సంచలనంగా మారింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వంద రూపాయల నోటుపై.. అమ్మ సమ్మక్క సారలమ్మ.. మా కొడుకు బారి నుండి మమ్మల్ని రక్షించండి" అని రాసి ఉంది. ఈ రాతలు చూస్తుంటే ఆ తల్లిదండ్రులు తమ ఇంట్లో ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారో? అర్థమవుతుంది. వృద్ధాప్యంలో ఎంతో అండగా ఉండాల్సిన తమ కుమారుడు కాలయముగా మారాడని.. పోలీసులకు చెప్పుకోలేక.. బయట బంధువులకి ఎవరికీ ముఖం చూపించలేక చివరకు ఆ దేవతలకు తమ గోడును ఇలా నోటుపై వెల్లబోశారు.

మారుతున్న సమాజంలో నైతిక విలువలు ఎంతల దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అక్కడ హుండీలోని కానుకలను లెక్కిస్తున్న అధికారులైతే ఈ నోటును చూసి ఆశ్చర్యపోయారు.. ఇది కేవలం ఒక వంద రూపాయల నోటు  మాత్రమే కాదు.. ఎందుకంటే ఒక ఒక కుటుంబం అనుభవిస్తున్న క్షోభకు  ప్రతిరూపమని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. ఆ అమ్మవారిని ఆ తల్లిదండ్రులకు ధైర్యాన్ని ప్రసాదించాలని సోషల్ మీడియా ముఖంగా చాలామంది నటిజన్స్ కోరుకుంటున్నారు..

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 06, 2026 04:50:17
Hyderabad, Telangana:

Mercury Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధ గ్రహాన్ని తెలివితేటలు జ్ఞానం తర్కం వాక్చాతుర్యానికి సూచికగా భావిస్తారు. అలాంటి ఈ గ్రహం కదలికలు జరిపినప్పుడు అన్ని రాశుల వారిపై చాలా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం తెల్లవారుజామున 12 గంటలకు బుధుడు ఉత్తరం వైపుగా వెళ్లబోతున్నాడు. ఇలా చాలా అరుదుగా బుధుడు కదలికలు చేస్తాడు. అయితే, ఇలా ఉత్తరం వైపుగా వెళ్లడం చాలా శుభప్రదమని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో నాలుగు రాశుల వారు అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే వ్యాపారం డబ్బు పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనుకుంటున్న పనుల్లో భారీ మొత్తంలో డబ్బు కూడా సమకూరుతుంది. దీంతో ఆయా రాసిన వారికి ఈ సమయం ఎంతో మేలు చేయబోతోంది.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మిథున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు బుధుడు ఉత్తరం వైపుగా కదలడం కారణంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు రావడం పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి అనుకుంటున్న మొత్తంలో డబ్బులు సమకూర్తాయి. అలాగే వ్యాపారాల్లో మీ ప్రత్యర్థులను అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శాంతి రెట్టింపవడమే కాకుండా.. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా అన్ని రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. 

సింహరాశి 
సింహరాశి వారికి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఒప్పందాలు కుదురుతాయి.. సామాజికంగా గౌరవం కూడా పెరిగే ఛాన్సులు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు కొన్ని రకాల ఆర్థిక అంశాల్లో కూడా అదృష్టం సహకరిస్తుంది. పాత స్నేహితుల నుంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా బాగుంటాయి. 

కన్యారాశి 
కన్య రాశి వారికి బుధుడు ఉత్తరం దిశగా సంచారం చేయడం వల్ల చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. విద్య ఆరోగ్యం పరంగా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్టపడి పని చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడమే కాకుండా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి విశ్వాసం కూడా పెరిగి.. కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

మీన రాశి 
మీన రాశి వారికి బుధుడు గమనంలో వచ్చే మార్పుల కారణంగా ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా మారుతాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు.. సంభాషణ కూడా ఆసక్తిగా మెరుగుపడుతుంది. పాత వివాదాలు ఎంతో సులభంగా పరిష్కారం అవ్వడమే కాకుండా.. దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో తొలగిపోతాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 05, 2026 16:16:04
Hyderabad, Telangana:

23rd Bio Asia Summit: మరో ప్రతిష్టాత్మక సదస్సుకు తెలంగాణ వేదిక కానుంది. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ప్రధానంగా చర్చించడానికి బయో ఆసియా సదస్సు-2026 నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బయో ఆసియా సదస్సుకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. కొత్త ఆవిష్కరణలు టెక్ బయోలో సరికొత్త ఆలోచనలకు కీలక వేదిక కానుంది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఫిబ్రవరి 17, 18వ తేదీల్లో రెండు రోజుల పాటు బయో ఏషియా సదస్సు జరగనుంది.

Also Read: Velama Community: రేవంత్‌ రెడ్డి జాతి వ్యాఖ్యలపై వెలమ సంఘాల సంచలన నిర్ణయం

ఈ సదస్సులో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్ చేయనుండగా.. 50 దేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ సదస్సుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న బయోఏషియా సదస్సును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. టెక్‌బయో అన్‌లీష్డ్: ఏఐ, ఆటోమేషన్ - బయాలజీ రివల్యూషన్ అనే థీమ్‌తో 2026 బయో ఆసియా స‌ద‌స్సు జ‌ర‌గనున్న‌ది.

Also Read: DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 19 శాతం డీఏ పెంపు

గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, ఆలోచనలకు రాష్ట్రాన్ని వేదిక చేసేందుకు హైదరాబాద్‌లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ రంగాలకు చెందిన నిపుణులు ఈ బయో ఏషియా సదస్సులో పాల్గొననున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో వరుసగా రెండు రోజుల పాటు 23వ ఎడిషన్ సదస్సుకు  రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.

లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సీఈఓలు, ప్రతినిధులు సంబంధిత రంగాల్లో  నిపుణులు, ఆవిష్కర్తలు బయో ఆసియా సదస్సులో జరిగే చర్చలు, సమావేశాల్లో  భాగం కానున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న సరికొత్త  మార్పులు, శాస్త్ర పురోగతి, ఏఐ ప్రభావం ఈ సదస్సులో చర్చించనున్నారు. హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ తదితర అంశాలను  ఎజెండా అంశాలుగా ప్రతినిధులు చర్చించనున్నారు. 

Also Read: KT Rama Rao: సంస్కారం నేర్చుకోని రేవంత్ రెడ్డి తోక ఎప్పటికీ వంకరే: కేటీఆర్‌

ప్రతిష్టాత్మక బయో ఆసియా సదస్సుతో బయో రంగంలో కొత్త ఆవిష్కరణలు, దేశ విదేశాల సహకారాలు, హెల్త్ కేర్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై తెలంగాణకు దోహదం చేయనుంది. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్స విధానాలు, అత్యాధునిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపై ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు చర్చించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

హాజరుకానున్న అతిథులు
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్
భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు (సైన్స్‌) ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్‌ రాజీవ్ సింగ్ రఘువంశీ
ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్
డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి
భారత్ బయోటెక్ ఎండీ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా
లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా
నోవార్టిస్ ఏషియా పసిఫిక్ రీజియన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్
లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెల్ టక్కర్ కాంక్లేవ్
అమెజాన్‌ చైర్మన్, సీఈవో రాబర్ట్ ఎ బ్రాడ్‌వే
జీనోమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  ప్రొఫెసర్ పాట్రిక్ టాన్
మెడ్ ట్రానిక్ సీటీవో డాక్టర్ కెన్ వాషింగ్టన్
మిల్టెనీ బయోటెక్ ఎండీ డాక్టర్ బోరిస్ స్టోఫెల్

పాల్గొననున్న కంపెనీలు
డాక్టర్ రెడ్డీస్, జైడస్, బయోకాన్, సిప్లా వంటి భారతీయ ప్రముఖ సంస్థల సీఈఓలు పాల్గొన‌నున్నారు.
నోవార్టిస్, రోష్, నోవో నార్డిస్క్, మెడ్ట్రానిక్, మెర్క్, అస్ట్రాజెనెకా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 05, 2026 13:07:35
Jagtial, Telangana:

Velama Community vs Revanth Reddy: రాజకీయాల్లో అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్న రేవంత్‌ రెడ్డి మరింత దిగజారి సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. సామాజిక వర్గాలను రా అంటూ సంభోదిస్తూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తమ సామాజికవర్గంపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెలమ సామాజిక వర్గం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు మాట్లాడాలని రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు.

Also Read: DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 19 శాతం డీఏ పెంపు

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి తన హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలని వెలమ సంక్షేమ సంఘం జగిత్యాల అధ్యక్షుడు అయిల్నేని సాగర్ రావు డిమాండ్‌ చేశారు. జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తూ 'ఎవనిది రా నీ జాతి' అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని వెలమ సంఘం నాయకులు ఖండించారు.

Also Read: KT Rama Rao: సంస్కారం నేర్చుకోని రేవంత్ రెడ్డి తోక ఎప్పటికీ వంకరే: కేటీఆర్‌

రాజకీయాల కోసం సామాజికవర్గంపై రేవంత్‌ రెడ్డి విరుచుకుపడడాన్ని వెలమ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సభలో వెలమ జాతిని కించపరిచేలా మాట్లాడారని అయిల్నేని సాగర్ రావు మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తో ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఒక జాతికి సంబంధించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని రేవంత్‌ రెడ్డిని హెచ్చరించారు. జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరంగా చర్యలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పద్మనాయక సంక్షేమ మండలి సభ్యులు వేణుగోపాల్ రావు, పురుషోత్తం రావు, దివాకర్ రావు, కమలాకర్ రావు, కృష్ణారావు, రవీందర్ రావు, ప్రశాంత్ రావు, అజయ్ రావు, సురేందర్ రావు, అనిల్ రావు, రాంప్రసాద్ రావు, విజయ రంగారావు, గంగారావు తప్పుబట్టారు.

Also Read:Chandrababu: తిరుమల పవిత్రతని తిరిగి నిలబెట్టేలా పని చేస్తాం: సీఎం చంద్రబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 05, 2026 12:30:33
Hyderabad, Telangana:

King Cobra Video News: ప్రకృతిలో ఆహారపు గొలుసులో భాగంగా ఒక  జీవి మరొక జీవిని వెంటాడి ఆహారంగా మలుచుకుని తినడం సాధారణమే. పాములు ఎలుకలను వేటాడితే పాములను డేగలు లేదా ఇతర పక్షులు వేటాడుతూ ఉంటాయి. ఇది ఆహార గొలుసులో భాగమే.. అంతేకాకుండా అప్పుడప్పుడు పాములను ముంగిసలు కూడా ఆహారంగా మలుచుకుంటాయి. ఇలాంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. తరచుగా మనం ముంగిస పాములపై దాడి చేయడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ముంగిస దాడి చేసిన తర్వాత తీసిన దృశ్యాలు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భారీగా దెబ్బతిన్న ఓ నాగుపాము జనాభాసాల మధ్యకు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది.. ఈ వీడియోలో అత్యంత విషపూరితమైన పాము పడగ భాగంలో కేవలం సగమే ఉండడం మీరు చూడొచ్చు.. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ముంగిసతో భీకర పోరాటం చేసిన తర్వాత పాము దెబ్బతిని.. దిక్కుతోచని స్థితిలో స్థానికులకు కనిపించడంతో వారు వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు..

ఆ ముంగిస ప్రమాదకరమైన నాగుపాము తలభాగంలో పదేపదే దాడి చేయడం వల్ల పూర్తిగా పాము తలభాగం దెబ్బతింది. అంతేకాకుండా ఆ పాము పడగ విప్పినప్పటికీ.. అది కేవలం సగమే కనిపిస్తోంది.. మిగతా కన్ను భాగం ఏమాత్రం లేకుండా పోయింది. అలాగే పాము పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది.. అయినప్పటికీ స్నేక్ క్యాచర్ ఆ పాము దగ్గరగా వెళ్తే అది.. భయపెట్టేందుకు బుసలు కొడుతూ పైపైకి రావడం మీరు గమనించవచ్చు.. స్నేక్ క్యాచర్ ఏమాత్రం భయపడకుండా ఆ పాముని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు..

సాధారణంగా కింగ్ కోబ్రాలు కనిపిస్తేనే భయంతో పరుగులు తీసే జనం.. ఈ పాము దయనీయస్థితిలో ఉందని తెలుసుకుని అయ్యో పాపం అని చూడడానికి అక్కడికి భారీ ఎత్తున తరలివచ్చారు.  అలాగే ముంగిస కూడా పదునైన పళ్ళను కలిగి ఉండడం వల్ల దీని తలభాగాన్ని భారీగా గాయం చేసింది. ఈ వీడియోలో పాము బాధతో విలవిలలాడటం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 05, 2026 12:18:02
Hyderabad, Telangana:

Chaturgrahi Raja Yogam In Maha Shivaratri Zodiac Sign Telugu: ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీన వస్తోంది. ఈ తేదీకి జ్యోతిష్య శాస్త్రం పరంగా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే శని పాలించే కుంభరాశిలో నాలుగు గ్రహాల కలయిక జరుగుతుంది. అయితే, ఇదే రోజు మహాశివరాత్రి కావడం విశేషం. ఈ రోజున కుంభరాశిలో సూర్యుడుతో పాటు శుక్రుడు బుధుడు రాహు సంయోగం జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి మహాశివరాత్రి వేళ చాలా చాలా శుభ ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సంపాదనపరంగా ఊహించని స్థాయిలో కలిసి వస్తుంది. ఆపదల్లో ఉన్నవారికి సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, ఈ మహాశివరాత్రి వేళ ఏ రాశుల వారికి ఆ శివుడి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశుల వారికి లాభాలే లాభాలు:
మేషరాశి 
మేష రాశి వారికి శివుడి అనుగ్రహంతో మహాశివరాత్రి నుంచి అంతా శుభంగానే ఉంటుంది.. వీరికి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారుతాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బు సులభంగా పొందుతారు. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి.. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు, వ్యాపారాలపరంగా కూడా రాణించగలుగుతారు. ముఖ్యంగా ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు అద్భుతమైన ప్రణాళికలతో భారీ లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఈ సమయం కలిసి వచ్చి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. సామాజికంగా ప్రతిష్ట కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కన్య రాశి 
కన్యా రాశి వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మకర శివరాత్రి నుంచి ఆస్తులు నుంచి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వీరు ఇండ్లతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తెలివితేటలు వినియోగించి పనులు చేయడం వల్ల భారీ ఆర్థిక సంపదను పొందుతాయి. అలాగే వ్యక్తిగత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యపరంగా చాలా వరకు సంతృప్తి చెందుతారు. 

మకర రాశి 
మకర రాశి వారికి ఆర్థికంగా మహాశివరాత్రి వేల కలిసి రాబోతోంది. కోర్టు సంబంధిత కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పులు ఏదైనా ఖర్చుల బాధతో ఉన్న వ్యక్తులకు కాస్త ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఖర్చులు తగ్గి పొదుపు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఈ సమయంలో బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన అన్ని రకాల పనులు సులభంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోతాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 11:26:32
Hyderabad, Telangana:

Mercury Transit Horoscope: ఫిబ్రవరి నెలలో జరగబోయే గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి సవాళ్లను తీసుకురానుంది. ముఖ్యంగా మేధస్సుకు, వ్యాపారానికి కారకుడైన బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదే సమయంలో అక్కడ ఇప్పటికే ఉన్న శని, రాహువులతో బుధుడు కలవబోతుండటం వల్ల "త్రిగ్రహ కూటమి" ఏర్పడనుంది.

ఈ గ్రహాల స్థితి మార్పు వల్ల ఈ మూడు రాశుల వారు వచ్చే కొన్ని వారాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావం ఈ క్రింది రాశులపై ఎక్కువగా ఉండనుందని సూచిస్తున్నారు.

1) కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సంచారం వల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోవద్దు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. అనవసర గొడవలకు దూరంగా ఉండటం మంచిది.

2) మీన రాశి (Pisces)
మీన రాశి వారు ఈ కాలంలో భవిష్యత్తు గురించి అనవసర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు అదుపు తప్పవచ్చు, కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం ఉత్తమం. కొత్త ప్రయత్నాలు ఇప్పుడే సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు, నిర్లక్ష్యం చేయకండి.

3) తుల రాశి (Libra)
తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం పెద్ద సవాళ్లను విసరనుంది. అనుకోని ఖర్చుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. చేపట్టిన ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోయే సూచనలు ఉన్నాయి. పై అధికారులతో లేదా సహోద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మానసిక ఒత్తిడి పెరగకుండా యోగా లేదా ధ్యానం వంటివి పాటించడం మంచిది.

పరిష్కార మార్గాలు..
గ్రహ దోష నివారణకు జ్యోతిష్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.  ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని, రాహువుల ప్రభావం తగ్గుతుంది. బుధుడి అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా విద్యా సామాగ్రిని దానం చేయండి. పక్షులకు ఆహారం, నీరు అందించడం శుభప్రదం.

(గమనిక: జ్యోతిష్య శాస్త్రం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రంలోని గ్రహ స్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. దీన్ని అనుసరించ ముందు సంబంధిత నిపుణుడి సలహా, సూచనలు తీసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Tirupati Laddu SIT Report: వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్.."క్లీన్ చిట్ రాలేదు..భారీగా కల్తీ జరిగింది!"

Also Read: Pakistan Boycott India Match: వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోం..పాక్ ప్రధాని సంచలన ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 05, 2026 10:54:02
Hyderabad, Telangana:

Govt Employees DA Hike: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండడంతోపాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెండింగ్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇంకా వేతన సవరణ కమిటీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఉద్యోగులకు డీఏ ప్రకటించింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగులకు ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించి డీఏ విడుదల చేసింది.

Also Read: KT Rama Rao: సంస్కారం నేర్చుకోని రేవంత్ రెడ్డి తోక ఎప్పటికీ వంకరే: కేటీఆర్‌

రాష్ట్రంలో పని చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో జనవరి, జూలై నెలకు సంబంధించి రెండు డీఏలు ప్రకటించే విషయం తెలిసిందే. ఇప్పటికే జూలై డీఏ ప్రకటించగా.. తాజాగా జనవరి 2026 నెలకు సంబంధించిన డీఏను ప్రభుత్వం ప్రకటించింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) 1.621 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:Chandrababu: తిరుమల పవిత్రతని తిరిగి నిలబెట్టేలా పని చేస్తాం: సీఎం చంద్రబాబు

డీఏ పెంపుతో దాదాపు 43 వేల మంది ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది. ప్రస్తుతం విద్యుత్‌ సంస్థల్లో దాదాపు 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారందరికీ లబ్ధి కలగనుంది. గతేడాది జులైలో ఖరారు చేసిన ప్రకారం డీఏ 17.651 శాతం ఉండగా.. తాజాగా సవరించిన డీఏ ప్రకారం 1.621 శాతం పెంచడంతో మొత్తం డీఏ 19.272 శాతానికి చేరుకుంది. ప్రకటించిన డీఏ తక్షణమే అమల్లోకి రానుంది. అంటే ఈ నెల వేతనంతో పెరిగిన డీఏ బకాయియి అందుతాయి. ప్రభుత్వం ప్రకటించిన డీఏతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం విరుస్తోంది.

Also Read: Harish Rao: కేసీఆర్ తెలంగాణ తీసుకురాకుంటే రేవంత్‌ రెడ్డి ఆంధ్రా మోచేతి నీళ్లు తాగేవాడు

విద్యుత్‌ ఉద్యోగులకు సరే కానీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం డీఏ ప్రకటించలేదు. దసరా సమయంలో ప్రకటించాల్సిన జూలై నెలకు సంబంధించిన డీఏను సంక్రాంతి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. టీచర్లు, ఉద్యోగులకు సంబంధించి డీఏలు ఇప్పటివరకు ఐదు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక వీటితోపాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెండింగ్‌ బిల్లులు, పీఆర్‌సీ ప్రభుత్వం బకాయిపడింది. విద్యుత్‌ ఉద్యోగులకు అన్నీ ప్రకటిస్తున్న ప్రభుత్వం ఇతర ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
AMAruna Maharaju
Feb 05, 2026 10:36:31
Hyderabad, Telangana:

Megastar Chiranjeevi New Record: మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ అనేక సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించి కలెక్షన్స్ వర్షం కురిపించి రికార్డ్స్ తిరగరాసారు. ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ చిరంజీవి పేరిట నిలిచింది.  

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా.. రీసెంట్‌గా సంక్రాంతికి రిలీజై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులకి, ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. చాలా రోజులు ఈ సినిమా హౌస్ ఫుల్స్‌తో నడిచింది. మెగాస్టార్ మ్యాజిక్ చాన్నాళ్ల తర్వాత కనిపించడంతో ఇంకేముంది కలెక్షన్ల వర్షం కురిసింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి రోజే ఏకంగా 84 కోట్ల గ్రాస్ వసూలు చేసి చిరంజీవి కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఏడు రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి సీజన్ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. దీంతో సంక్రాంతి హిట్ సినిమాలు ఇంకా థియేటర్‌లో నడుస్తున్నాయి.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజై 25 రోజులు పూర్తవ్వగా.. తాజాగా ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 375 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో టాలీవుడ్‌లో రీజనల్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా.. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. బాహుబలి, పుష్ప.. పలు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజై కలెక్షన్స్ కొల్లగొడితే.. మన శంకర వరప్రసాద్ గారు కేవలం తెలుగులోనే రిలీజై ఏకంగా రూ. 375 కోట్లతో టాలీవుడ్ రీజనల్ రికార్డ్ సెట్ చేసింది.

ఇక మొన్నటి వరకు ఈ రికార్డ్ 303 కోట్లతో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరు మీద ఉండగా.. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు దాన్ని బద్దలు కొట్టింది. ఈ సినిమాకు 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. హిట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 240 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. దానిని మించి 130 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్స్‌కి, నిర్మాతలకు ఫుల్ ప్రాఫిట్స్ వచ్చాయని టాలీవుడ్ సమాచారం.

Also Read: Bharat Taxi App: సామాన్యులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు.. ఇకపై తక్కువ ధరకే ప్రయాణం..!

Also Read: Meena: ఆ స్టార్ హీరోతో పీకల్లోతూ ప్రేమలో మీనా.. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానంటూ షాకింగ్ కామెంట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 10:15:33
Nunna, Vijayawada, Andhra Pradesh:

Pawan Kalyan Tirupati Laddu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మరోసారి నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ (SIT) తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తప్పు చేసిన వారు భగవంతుడికి క్షమాపణ చెప్పాల్సింది పోయి, బుకాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ లడ్డూ కల్తీ అంశంపై కీలక విషయాలను వెల్లడించారు.

రిపోర్టుల్లో నిజాలు ఏంటి?
నెయ్యి కల్తీపై నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) ఇచ్చిన నివేదికలను పవన్ గుర్తు చేశారు. ఒక రిపోర్టులో చేప నూనె, మరొకటిలో జంతు కొవ్వు (పంది, గొడ్డు కొవ్వు), ఇంకొకటిలో పామాయిల్, కెమికల్స్ కలిసినట్లు స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

"ఎక్కడా సిట్ గానీ, సీబీఐ గానీ వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు. పాల కొవ్వుతో రావాల్సిన నెయ్యిలో రసాయనాలు ఉన్నాయని రిపోర్టులు చెబుతుంటే, క్లీన్ చిట్ అని ఎలా చెప్పుకుంటారు?" అని పవన్ నిలదీశారు. వైసీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులను పవన్ ఏకిపారేశారు. రామతీర్థం, పిఠాపురం ఘటనలను 'పిచ్చోళ్లు చేశారని' నమ్మబలికారని ఆరోపించారు.

దుర్గగుడిలో వెండి విగ్రహాలు పోతే 'ఇంకోటి కొనుక్కోవచ్చు' అన్న అహంకారపూరిత వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 219 దేవాలయాలను అపవిత్రం చేసిన చరిత్ర వైసీపీదని మండిపడ్డారు. "సాధారణంగా మనుషులపై పగబడతారు, కానీ వైసీపీ వాళ్లు సాక్షాత్తూ భగవంతుడి మీదే పగబట్టారు" అని పవన్ వ్యాఖ్యానించారు.

మార్కెట్‌లో కేజీ నెయ్యి 400 రూపాయలకు పైగా ఉంటే, అంతకంటే తక్కువ ధరకే కొన్నారంటేనే అందులో కల్తీ ఉందనేది సామాన్య గృహిణికి కూడా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. తిరుమల నుండే అయోధ్యకు లడ్డూలు పంపారని, అక్కడ కూడా ఈ అపచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వివేకా హత్యతో పోలిక
వివేకా హత్య విషయంలో 'గుండెపోటు' అని ఎలాగైతే అబద్ధాలు ఆడారో, ఇప్పుడు నెయ్యి కల్తీ విషయంలో కూడా అలాగే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏడు కొండలు అక్కర్లేదు.. రెండు చాలు అన్న వాళ్లు ఏ స్థాయికైనా దిగజారుతారని పవన్ అన్నారు.

తప్పు చేసిన వారు భగవంతుడి ముందు మోకరిల్లి క్షమాపణ అడగాలని, లేనిపక్షంలో సర్వనాశనం అయిపోతారని పవన్ హెచ్చరించారు. కల్తీకి కారణమైన ప్రతి ఒక్కరినీ బాధ్యుల్ని చేస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ALso Read: TTD Ghee Testing Lab: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై కల్తీ చేస్తే దొరికిపోతారు!

Also Read: Sachivalayam Employees Promotion: ఏపీలో ఉద్యోగులకు ప్రమోషన్ల పండుగ..'స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు'లో కీలక మార్పులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top