icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Jonnagiri Gold Mines: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరనున్న కష్టాలు..బంగారు గనిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..700 మంది ఉపాధి..

Pagidirai, Andhra Pradesh:

Jonnagiri Gold Mines News: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మైనింగ్ రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కరువు నేలగా పేరుగాంచిన రాయలసీమ ప్రాంతం ఇకపై బంగార పంటతో ఆంధ్ర కేజిఎఫ్ గా వెలువందనం ఉంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి అతి పెద్ద ప్రైవేట్ రంగా గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ఈ మైనింగ్ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక మైలురాయిగా నిలవనుంది. 

జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా సుమారు 405 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించాయి. ప్రభుత్వం ఈ గోల్డ్ ఫిల్ కోసం మొత్తం 1500 ఎకరాల భూమిని కేటాయించగా మొదటి దశలో భాగంగా 6 ఎకరాల్లో తవ్వకాలు జరిపేలా అత్యాధునిక గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ సీఎం ప్రారంభించారు. ఈ పర్యటనలో ప్రాజెక్టు విస్తరణకు వీలుగా రెండో యూనిట్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. 

రాష్ట్రానికి ఆదాయం ఉపాధి 
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ సుమారు 700 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందులో 80% పైగా ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారికి కేటాయించడం విశేషం. అంతేకాకుండా, ఇక్కడ ఉత్పత్తి అయిన బంగారం విలువపై నాలుగు శాతం రాయలసీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకరణం ఉంది. మొదటి ఏడాది 400 కేజీల ఉత్పత్తి ద్వారా 507 కోట్ల రూపాయలు ఆ తర్వాతి కాలంలో ఉత్పత్తి పెరిగిన కొద్దీ ఏటా 150 కోట్ల రూపాయలు వరకు రాయల్టీ రానుందని అంచనా. 

జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో సుమారు 50 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గనుల శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2026 27 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని ఏడాదికి రెండు టన్నుల అంటే 2000 కేజీల బంగారాన్ని శుద్ధి చేసే స్థాయికి విస్తరించరున్నారు. ఈ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన నీటి కోసం హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుండి ప్రత్యేకంగా 18 కిలోమీటర్ల పైపులైను కూడా ఏర్పాటు చేశారు. ఈ సరికొత్త మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభంతో రాయలసీమ ప్రాంతంలో వలసలు తగ్గి, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also REad: AP Gold Mines: ఏపీలో భారీ బంగారు గని..టన్నుల కొద్దీ బయటపడుతున్న బంగారం నిల్వలు!

Also Read: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారం..రూ.500 దర్శనం టికెట్ల గోల్‌మాల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Redmi నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Redmi Note 17 సిరీస్!

Hyderabad, Telangana:

Redmi Note 17 Series Leak News: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ  షియోమి (Xiaomi) సబ్‌బ్రాండ్ రెడ్‌మికి మంచి గుర్తింపు ఉంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్బుతమైన డిజైన్‌తో మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తుంది. అతి త్వరలోనే కంపెనీ మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.  కళ్లు చెదిరే బ్యాటరీ బ్యాకప్‌ను అందించేందుకు సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ రెడ్‌మి నోట్ 17 (Redmi Note 17) సిరీస్‌ పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రెడ్‌మి చరిత్రలోనే అతిపెద్ద బ్యాటరీ..
ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించి సమాచారం ప్రకారం.. రెడ్‌మి చైనా మార్కెట్లో ఒక సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ప్లాన్ చేసేందుకు సిద్ధమైందని.. ఇది ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీతో లాంచ్‌ చేయబోతోందని తెలిపింది.. ఒకవేళ ఇదే నిజమైతే.. రెడ్‌మి మొబైల్స్ చరిత్రలోనే ఇంతటి భారీ బ్యాటరీతో రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుందని పేర్కొన్నారు.

కళ్లు చెదిరే డిస్‌ప్లే.. 
ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిస్ల్పేకి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది ఫ్లాట్ 1.5K రెజల్యూషన్ కలిగిన హై-క్వాలిటీ డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది.. మల్టీమీడియా ప్రియుల కోసం ఇందులో హై-వాల్యూమ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో సినిమాలు, గేమింగ్ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుందని సమాచారం.

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.. 
Redmi Note 17 సిరీస్ ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6-సిరీస్ (Qualcomm Snapdragon 6-series) ప్రాసెసర్‌ను వినియోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్‌తో రావచ్చని టెక్‌ నిపుణులు అంచానాలు వేస్తున్నారు. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ అత్యంత ధృడంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్లాగ్‌షిప్ స్థాయి వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో పాటు కింద పడినా పగలకుండా ఉండేలా మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్ ఫీచర్లను ఇందులో కంపెనీ అందిస్తోంది..

10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా..
కొన్ని కంపెనీలు గతంలో కేవలం 9,000mAh బ్యాటరీ మాత్రమే అందించాయి. కానీ ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 17 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం లుక్ కోసం మెటల్ ఫ్రేమ్‌తో పాటు అద్భుతమైన ఫోటోగ్రఫీ కోసం 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించనున్నట్లు ఇతర లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి..

లాంచ్ ఎప్పుడంటే?
ఈ రెడ్‌మి నోట్ 17 లైన్అప్ ఇప్పటికే యురేషియన్ ఎకనామిక్ కమిషన్ (EEC)తో పాటు GSMA డేటాబేస్‌లలో కనిపించిన సంగతి తెలిసిందే... దీనిని బట్టి చూస్తే మొదటగా చైనాలో అధికారికంగా విడుదలైన కొన్ని నెలలకే ఈ సిరీస్ గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Iphone, సాంసంగ్‌లకు చెక్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో Motorola Edge 70 Max ఫోన్‌!

Hyderabad, Telangana:

Motorola Edge 70 Max Price: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా గ్లోబల్ మార్కెట్‌లోకి సరికొత్త సంచలనానికి తెరలేపేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. తన ప్రతిష్టాత్మక ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ (Motorola Edge 70 Max)ను త్వరలోనే విడుదల చేయడానికి రెడీ అయ్యింది.. లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ మార్కెట్లో ఉన్న వివో, షావోమితో పాటు సాంసంగ్‌ వంటి దిగ్గజ బ్రాండ్‌ల ప్రీమియం ఫోన్‌లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందని సమాచారం..

కొత్త ఫ్లాట్ డిజైన్..
సాధారణంగా మోటోరోలా తన ప్రీమియం ఎడ్జ్ సిరీస్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లేలను అందిస్తుంది. కానీ, లీకైన తాజా డిజైన్ ప్రకారం.. ఈ కొత్త మాక్స్ మోడల్‌లో మొదటిసారిగా పూర్తి ఫ్లాట్ స్క్రీన్‌తో పాటు ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్ డిజైన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని అల్ట్రా-స్లిమ్ బెజెల్స్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. ఇది ఆనిక్స్ బ్లాక్, సేజ్ గ్రీన్‌తో పాటు గ్లేసియర్ బ్లూ వంటి ఎన్నో అద్భుతమైన రంగుల్లో అందుబాటులోకి రాబోతోంది.

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌హౌస్..
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని అద్భుతమైన ప్రాసెసర్.. ఇది క్వాల్కమ్‌కి సంబంధించిన అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5)తో ఈ స్మార్ట్‌ఫోన్ పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది అల్ట్రా-ఫాస్ట్ గేమింగ్‌తో పాటు అద్భుతమైన మల్టీటాస్కింగ్, మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మోటోరోలా సరికొత్త ఆన్-డివైస్ ఏఐ అసిస్టెంట్ Qiraను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్‌తో పాటు అడ్వాన్స్‌డ్ ఫోటో ఎడిటింగ్, టెక్స్ట్ సమ్మరైజేషన్ వంటి పనులను సులువుగా చేసే అవకాశాలు ఉన్నాయి.

సోనీ లైటియా కెమెరా..
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫోటోగ్రఫీ పరంగా చూస్తే.. ఇది ఓఐఎస్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా (Sony Lytia) ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకండా  టెలిఫోటోతో పాటు అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది వెనక భాగంలో అద్బుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 8000mAh భారీ బ్యాటరీ, మ్యాగ్నెటిక్ Qi2 వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి రాబోతోంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ధరకి సంబంధించిన వివరాలు..
భారత మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ.54,999 నుంచి రూ.59,999 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇది అధునాతన సాంకేతికతతో పాటు సరికొత్త డిజైన్‌తో రాబోతున్న ఈ ఫోన్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ విభాగంలో వివో, శామ్‌సంగ్‌తో పాటు షావోమి బ్రాండ్‌ల ఆధిపత్యానికి గట్టి బ్రేక్ వేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Redmi బడ్జెట్ ధమాకా.. 5,160mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Redmi 17C లాంచ్!

Hyderabad, Telangana:

Redmi 17c Price: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Redmi మార్కెట్‌లోకి మరో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్‌ను విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన  రెడ్‌మి 15Cకి సక్సెసర్‌గా ఈ సరికొత్త Redmi 17C మోడల్‌ను చైనా మార్కెట్లో మంగళవారం అధికారికంగా విడుదల చేసింది.. ఇది భారీ డిస్‌ప్లేతో పాటు అదిరిపోయే బ్యాటరీ లైఫ్, అధునాతన ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

భారీ డిస్‌ప్లే.. 
Redmi 17C మొబైల్‌ 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 240Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో వచ్చింది.. దీనివల్ల గేమింగ్, స్క్రోలింగ్ అనుభూతి చాలా స్మూత్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు కంటి ప్రొటక్షన్‌ కోసం TÜV Rheinland లో బ్లూ లైట్‌తో పాటు ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్‌ను కూడా ఇందులో అందించారని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హెలియో G81 ఆల్ట్రా (MediaTek Helio G81 Ultra) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు సంచారం. ఇది మల్టీటాస్కింగ్‌తో పాటు రోజువారి పనులను సులువుగా రన్ చేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. కెమెరా విభాగ విషయానికి వస్తే.. వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

రోజంతా నడిచేలా 5,160mAh భారీ బ్యాటరీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీగా భావించవచ్చు.. ఇందులో ఎంతో శక్తివంతమైన 5,160 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని కంపెనీ అందించింది.. ఇది 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌తో లాంచ్‌ అయ్యింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సులభంగా రోజంతా ఎంతో సులభంగా వినియోగించవచ్చు.. సెక్యూరిటీ కోసం ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తున్నారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ధర వివరాలు ఇవే..
చైనాలో విడుదలైన ఈ ఫోన్ ధరలు వేరియంట్ల వారీగా అందుబాటులో ఉన్నాయి. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్ 4GB RAM + 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 11,200 అందుబాటులో ఉంటుంది. ఇక రెండవ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ. 12,600తో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, రెడ్‌తో పాటు బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే అధికారిక వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Anganwadi Recruitment: అంగన్వాడీల్లో 15,982 ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు వచ్చినట్టే?!

Hyderabad, Telangana:

Telangana Anganwadi Recruitment 2026: తెలంగాణలోని మహిళలకు ప్రభుత్వం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 టీచర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ శిశు సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఐసిడిఎస్ (ICDS) ప్రాజెక్టు పరిధిలో 177 పోస్టులను భర్తీకి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇతర జిల్లాల్లో కూడా వరుస నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈసారి అంగనవాడి నియామకాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కనీస విద్యార్హతను పెంచడంతోపాటు, ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 4 (ఇంటర్వ్యూ అనుమతి) జీవో నెంబర్ 6 (మార్కుల వెయిటేజీ) వంటి జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది.

జోన్లవారీగా ఖాళీల వివరాలు.. 
రాష్ట్రంలో రెండు మల్టీ జోన్ల పరిధిలో ఉన్న ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి. మల్టీ జోన్ 1లో మొత్తం 20,584 కేంద్రాలు ఉండగా.. అందులో 1,853 టీచర్ పోస్టులు.. 7,737 సహాయకులు (అసిస్టెంట్) పోస్టులు భర్తీకి రెడీ ఉన్నాయి. ఆ తర్వాత మల్టీ జోన్ 2లో 15,197 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. అందులో 1,247 టీచర్ పోస్టులు.. 5,145 అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ రెండు మల్టీజోన్లను కలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

ముఖ్యమైన అర్హతలు నిబంధనలు..
విద్యా అర్హత:
టీచర్, అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులులై ఉండాలి. ఒకవేళ సహాయకుల (అసిస్టెంట్) పోస్టుకు ఇంటర్ పాసైన అభ్యర్థులు లభించకపోతే అప్పుడు పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని పరిశీలిస్తారు.

స్థానికత: దరఖాస్తుదారులు సంబంధిత గ్రామము లేదా పట్టణ వార్డుకు చెందిన స్థానిక మహిళలై ఉండాలి. 

ప్రత్యేక వర్గాలకు ప్రాధాన్యత.. 
గిరిజన, ఆదివాసి తండాలు/గూడాలలోని పోస్టులకు స్థానిక ఎస్టీ మహిళలు.. అలాగే ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు మాత్రమే అర్హులు. 

ఎంపిక విధానం మార్పులు వెయిటేజ్.. 
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తుంది. మొత్తం ఎంపికలో మార్కులు వేయటం ఇలా ఉంటుంది. 
ఇంటర్మీడియట్ మార్కులు: 70% వెయిటేజీ 
ఇంటర్వ్యూ మార్కులు: 10 మార్కులు 
అనాధలు : 10% వెయిటేజీ 
వితంతువులు : 5% వెయిటేజీ 
దివ్యాంగులు : 5% వెయిటేజీ
అర్హత కలిగిన స్థానిక మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తమ జిల్లాలు వారి విడుదలై ఐసిడిఎస్ నోటిఫికేషన్ వివరాలను గమనిస్తూ ఉండాలి.

Also Read: విద్యార్థులకు చుక్కలు చూపిన నీట్ రీ-ఎగ్జామ్..కటాఫ్ భారీగా తగ్గే ఛాన్స్ ఉందా?

Also Read: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..20 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు..ఆ రోజు నుంచే అమలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Vyatipata Yogam Effect: జూలై 10న అరుదైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం, కాసుల వర్షం!

Hyderabad, Telangana:

Rare Vyatipata Yogam Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల కదలికలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. గ్రహాల సంయోగంతో పాటు ప్రత్యేక స్థితుల వల్ల ఏర్పడే యోగాలు మానవ జీవితాలను ఎంతోగానో ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలోనే రాబోయే జూలై నెలలో ఒక అత్యంత అరుదైన, శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది.. జూలై 10న సూర్యుడు, చంద్రుల కలయిక వల్ల వ్యతీపాత యోగం ఏర్పడబోతోంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడిని గౌరవ మర్యాదలతో పాటు ఆత్మవిశ్వాసానికి కారకుడు భావిస్తారు.. ఇక చంద్రుడిని మనస్సుతో పాటు ఆనందానికి కూడా కారకుడిగా చెప్పకుంటారు. ఈ ఇద్దరి కలయికతో జూలై 10న ఉదయం 06:53 గంటలకు ఈ వ్యతీపాత యోగం ఏర్పడబోతోంది.. కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే ఉండే ఈ ప్రత్యేక యోగం ముఖ్యంగా నాలుగు రాశుల వారి జాతకాన్ని పూర్తిగా మార్చుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ఊహించని ధనలాభాలు కలుగుతాయి.

ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే:
వృషభ రాశి (Taurus):
మోస్ట్ పవర్‌ఫుల్ వ్యతీపాత యోగంతో వృషభ వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా నిలిపోయిన పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. అలాగే ఆఫీసుల్లో కష్టపడి పనులు చేసేవారికి ఊహించని ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతో పాటు అదృష్టం కూడా వెంట, వెంటనే లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు, ఆత్మవిశ్వాసం విపరీంగా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి.. ఆదాయ వనరులు గణనీయంగా లభిస్తాయి..

సింహ రాశి (Leo):
సింహ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా.. కుటుంబంలో ఉన్న విభేదాలు, సమస్యలు అన్నీ ఒక్కసారిగా నిలిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో మీ ప్రతిష్ఠలు కూడా విపరీతంగా పెరుగుతాయి.. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశాలు లభిస్తాయి.. సమాజంలో ఉన్నత వ్యక్తుల సపోర్ట్‌ లభించడం వల్ల మీ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

తులా రాశి (Libra):
ఈ అరుదైన యోగం ప్రభావంతో తులా రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా.. మీ జీవితం ఒక అద్భుతమైన దిశలో ముందుకు సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి చేతికి డబ్బు అందుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పైఅధికారుల నుంచి పూర్తి 
సపోర్ట్ లభించి.. ప్రశంసలు లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో మధురంగా ఉంటుంది.. అయితే, ఈ సమయంలో అతి ఆత్మవిశ్వాసానికి పోకుండా జాగ్రత్త వహించడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read:  Chanakya Niti: కుక్క నుండి మనుషులు నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణాలు ...

మకర రాశి (Capricorn):
మకర రాశివారికి ఈ సమయం గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుందని.. వ్యాపార రంగంలో ఉన్నవారికి దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి విస్తరణ అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఈ సమయంలో తప్పకుండా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఆందోళన వంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

(గమనిక: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అందించిన అంచనాలు మాత్రమే.. ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా అందిచాము. దీనిని ఒక సాధారణ అవగాహన కోసం మాత్రమే చదువుకోవాల్సి ఉంటుంది.)

Also Read:  Chanakya Niti: కుక్క నుండి మనుషులు నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణాలు ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Shiva Yogam Effect: పవర్‌ఫుల్ శివయోగం.. ఈ 6 రాశుల వారికి తిరుగులేని రాజయోగం, ఇక డబ్బే డబ్బు!

Hyderabad, Telangana:

Shiva Yogam Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలతో పాటు నక్షత్రాల కలయికల వల్ల ఏర్పడే శుభ యోగాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఇదిలా ఉంటే జూన్ 24 నుంచి అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన శివయోగం ప్రారంభమైంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.. జూన్ చివరి వారం నాటికి ఈ శివయోగ ప్రభావంతో ఏకంగా కొన్ని రాశుల వారికి గోల్డెన్ టైమ్ ప్రారంభం కాబోతోంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శివయోగం అంటే ఏమిటి?
జ్యోతిష్యపరంగా శివయోగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, సానుకూల ప్రభావంతో పాటు శక్తిని ఇచ్చే సమయంగా భావిస్తూ ఉంటారు.. ఈ సమయంలో చేసే పూజలతో పాటు జపాలు లేదా కొత్త పనులు నేరుగా పరమశివుని అనుగ్రహాన్ని పొందుతాయని ఒక నమ్మకం.. అలాగే ఈ సమయంలో గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ తిరిగి వేగంగా ప్రారంభం కావడానికి, జీవితంలో స్థిరత్వాన్ని సాధించడానికి ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుంది.

అదృష్ట రాశులు ఇవే:
మేష రాశి (Aries):

ఈ శక్తివంతమైన శివయోగం ప్రభావంతో మేష రాశి వారికి ఈ సమయం కొత్త ఉత్సాహాన్ని, శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు నిలిచిపోయిన ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి విషయాల్లో సానుకూల మార్పులు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..

మిథున రాశి (Gemini):
గతంలో కంటే ఇప్పుడు మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి పనిలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారిరి ఈ సమయంలో తప్పకుండా కొత్త ప్రాజెక్టులను పొందే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది.

సింహ రాశి (Leo):
శివయోగం ఎఫెక్ట్‌తో సింహ రాశివారికి నిర్ణయాత్మక శక్తి, మేధోసంపత్తి అద్భుతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంతటి కష్టమైన సవాళ్లనైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఆర్థికంగా భారీ లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి..

Also Read:  Chanakya Niti: కుక్క నుండి మనుషులు నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణాలు ...

తులా రాశి (Libra):
మోస్ట్ పవర్‌ఫుల్‌ శివయోగం ప్రభావంతో తులా రాశివారికి ఈ సమయంలో మనసిక ఒత్తిడి నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. పాత పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా వీరు జాక్‌ఫాట్ మనీ కూడా పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే భౌతికంగా కూడా సుఖాలు కూడా పెరుగుతాయి. 

ధనుస్సు రాశి (Sagittarius):
శివయోగం ప్రభావంతో ధనుస్సు రాశివారికి వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కలుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సమాజం నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థిక వనరులు కూడా రెట్టింపు అవుతాయి. దీంతో పాటు అనుకోకుండా వస్తున్న సమస్యలు కూడా సరిష్కారం అవుతాయి.

(గమనిక: ఈ సమాచారం సాధారణ జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలతో పాటు ఇంటర్నెట్ ఆధారంగా అందించారు. దీనిని కేవలం సమాచారం కోసమే చదవాల్సి ఉంటుంది.)

Also Read:  Chanakya Niti: కుక్క నుండి మనుషులు నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణాలు ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పాత పింఛన్‌ స్కీమ్‌ వర్తింపు

Nuzendla, Andhra Pradesh:

పాత పింఛన్‌ పథకంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు పాత పింఛన్‌ పథకం వర్తిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పింఛన్‌ విధానం (కాంట్రిబ్యూటరీ పింఛ్‌ స్కీమ్‌) వర్తింపు ఉన్న ఉద్యోగులకు పాత పింఛన్‌ అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత పింఛన్‌ పథకం అమలుకు నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞలు చెబుతున్నారు.

అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో రిటైర్మెంట్‌ వయస్సు పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. 60 నుంచి 62 ఏళ్ల వరకు పదవీ విరమణ వయస్సును కొన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం పెంచింది. ఇక పాత పింఛన్‌ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2004 సెప్టెంబర్‌ కంటే ముందు జారీ అయిన వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను వర్తింపచేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో 11 వేల మంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ స్కీమ్ పరిధిలోకి  తీసుకురానుంది. ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగుల ఆర్థిక, సామాజిక భద్రతకు ప్రభుత్వ నిర్ణయం భరోసా కల్పించనుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆమోదం పొందిన అంశాలతోపాటు గతంలోనూ ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 01-09-2004కు ముందు నోటిఫికేషన్లు జారీ అయ్యి.. అనంతరం ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌) నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్‌) పరిధిలోకి తీసుకురావాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం స్వాగతించింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సుమారు 11,000 మంది ఉద్యోగులు లబ్ధి పొందనుందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. వారి పదవీ విరమణ అనంతర జీవితానికి, కుటుంబానికి ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కల్పించే దిశగా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలుస్తుంది.

రాష్ట్రంలోని లక్షలాదిమంది సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా దేశంలోనే తొలిసారిగా గ్రాట్యుటీ, చనిపోయిన సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వంటి చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఏపీ సచివాలయ సంఘం గుర్తు చేసింది. ఉద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మిగిలిన సీపీఎస్‌ ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

0
0
Report

తుంగభద్రకు పునరుజ్జీవం.. ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో 25న తుంగభద్ర గేట్లు ప్రారంభం

Hosapete, Karnataka:

Tungabhadra Dam Gates Open: మూడు రాష్ట్రాల మధ్య పారుతున్న తుంగభద్ర నదిపై ఏర్పాటుచేసిన ప్రాజెక్టు గేట్లను ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నారు. ఎల్లుండి జరగనున్న తుంగభద్ర డ్యామ్‌ గేట్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది వచ్చిన వరదలకు తుంగభద్ర డ్యామ్‌ గేట్ కూలిపోవడంతో ఆ ప్రాజెక్టును కొత్తగా బిగించారు. డ్యామ్‌ గేట్ల పనులు పూర్తవడంతో తుంగభద్ర డ్యామ్‌ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు వర ప్రదాయినిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు తిరిగి పూర్వ వైభవం సంతరించుకోనుంది. కొత్తగేట్ల అమరికతో సరికొత్త రూపుదిద్దుకున్న తుంగభద్ర ప్రాజెక్టు ఎల్లుండి అంటే గురువారం ప్రారంభం కానుంది. రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తికాగా.. వీటిని ఈ నెల 25వ తేదీన కర్నాటక ముఖ్యమంత్రి శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తోపాటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 

ఏడు దశాబ్దాల కిందట నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. తెలంగాణలో కొన్ని వేలల్లో జీవనాడీగా నిలుస్తోంది. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. ఆ సమయంలో నీటి వృథాను అడ్డుకునేందుకు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలో తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేటును బిగించారు. స్పిల్ వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఇవ్వడంతో కొత్త గేట్లు అమర్చారు. 6 నెలల్లో కొత్త గేట్లను అమర్చడంతో ఏపీ-కర్నాటక రాష్ట్రాల్లో తుంగభద్ర ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోసుకుంది.

ఏపీలో లక్షల ఎకరాలకు నీరు
కృష్ణానది ఉప నది తుంగభద్ర నది కర్ణాటక నుంచి ఏపీతోపాటు తెలంగాణలో కొంత భాగం పారుతుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టు ఏపీ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు కీలకంగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు కింద ఏపీలో 1.46 లక్షల హెక్టార్లకు సాగునీరు లభిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగు నీరు అందుతోంది. 25వ తేదీన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని హోస్‌పేటలో జరిగే బహిరంగ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉంది.

0
0
Report
Advertisement

రేపే జొన్నగిరిలో గోల్డ్‌ మైనింగ్‌ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు 'బంగారం'లాంటి వార్త

Jonnagiri, Andhra Pradesh:

400 KGs Jonnagiri Gold Mines: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇది బంగారం లాంటి వార్త. బంగారం ధరలు భారీగా పెరుగుతుండగా.. ఇకపై అతి తక్కువకే ఏపీలో లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో ఒక అతి పెద్ద బంగారం గని ప్రారంభం కానుంది. కరువు ప్రాంతానికి కేరాఫ్‌గా నిలిచే రాయలసీమలోని కర్నూల్‌ జిల్లాల్లో జొన్నగిరి బంగారం గనుల తవ్వకాలకు కీలక ముందడుగు పడనుంది. జొన్నగిరిలోని బంగారు గనుల వద్ద గోల్డ్‌ మైనింగ్‌ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది.

బంగారు నిక్షేపాలు
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారు గనులు బయటపడిన విషయం తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సర్వేలు, పరీక్షలు చేసిన అనంతరం ఇక్కడ బంగారం తవ్వకాలకు అనువుగా ఉందని.. ఇక్కడ బంగారు నిక్షేపాలు భారీగా ఉన్నాయని గుర్తించారు. దీంతో జొన్నగిరిలో బంగారు గనులు త్వరలోనే ప్రారంభం కానుంది. జొన్నగిరి ప్రాంతం బంగారం ఉత్పత్తికి ప్రధాన వేదిక కానుండడ విశేషం.

అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు
దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జొన్నగిరిలోనే ఏర్పాటవుతోంది. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు రూ.405 కోట్లు పెట్టుబడి పెట్టి ఇక్కడ బంగారు నిక్షేపాలు వెలికితీయనున్నాి. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌కు ప్రభుత్వం 1,500 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు జరగనుండగా దీనికి తగ్గట్టు ప్రాసెసింగ్ ప్లాంట్లు నెలకొన్నాయి. తొలి ఏడాదికి 400 కిలోల బంగారం పసిడిని ఉత్పత్తి చేయనున్నారు. రెండో దశలో మిగిలిన ప్రాంతంలో ఈ ప్లాంట్‌ను విస్తరించనున్నారు. వచ్చే ఏడాది నుంచి 900 కిలోల బంగారం ఉత్పత్తి చేయడం లక్ష్యం.

రాష్ట్రానికి రాయల్టీ
ప్రతి సంవత్సరం బంగారం ఉత్పత్తి పెంచుతూ ఏడాదికి 2 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేయడం ప్రధాన లక్ష్యం. ఈ ప్లాంట్ ద్వారా 700 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బంగారం ధరలో 4 శాతం రాష్ట్రానికి రాయల్టీగా వస్తుండడంతో ఏపీలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. తొలిసారి తీసే 400 కిలోల బంగారానికి రూ.57 కోట్లు రాయల్టీ రూపేణా ఏపీ ప్రభుత్వానికి దక్కనుండగా.. తర్వాత వెలికితీసే 900 కిలోల బంగారానికి రూ.144 కోట్ల వరకూ రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం లభించే అవకాశం ఉంది.

రేపు ప్రారంభం
జొన్నగిరిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రేపటి నుంచి జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇక్కడ బంగారం తవ్వకంపై ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. బంగారం గనుల తవ్వకం చేపడుతుండడంతో రాయలసీమ ప్రాంతం అభివృద్ధిలో సింహ భాగం కానుంది.

0
0
Report

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు పెంపు.. 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం

Amaravathi, Andhra Pradesh:

Govt Employees Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వయస్సు పెంపు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కాకుండా గురుకులాలు, సొసైటీ ఉద్యోగులకు మాత్రమే పెంచారు. మరో రంగ ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మెమో.57 ప్రకారం 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 11 వేల మంది ఉద్యోగులకు సీపీఎస్‌ నుంచి పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా 85కి పైగా కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన , మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా మంత్రిమండలి సమావేశంలో పలు ప్రతిపాదనలను తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

పారిశ్రామిక రంగం ప్రోత్సాహం కోసం మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. నాయుడుపేటలో రూ.10 వేల కోట్లకు పైగా అంచనాతో ప్రీమియర్ ఎనర్జీ విస్తరణ, ప్రకాశం జిల్లాలో రూ.1,230 కోట్ల జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టు, తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాల సవరణలపై మంత్రిమండలిలో చర్చ జరిగింది. అనకాపల్లిలో రూ.2,788 కోట్లతో CtrlS డేటా సెంటర్, విశాఖలో సిఫీ డేటా సెంటర్‌కు అదనపు భూముల కేటాయింపు, విశాఖలో ఇన్ఫీక్స్‌ ఐటీ క్యాంపస్ ద్వారా 4 వేల ఉద్యోగాల కల్పన, విజయనగరంలో పతంజలి ఫుడ్ పార్క్‌కు 70 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. వాస్తవంగా పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేయడం లేదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు స్వాగతించడం లేదు. రిటైర్మెంట్‌ వయస్సును పెంచడంతో ఉద్యోగ వర్గాల్లో కొంత మంది అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పని ఒత్తిడితోపాటు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న తమకు పదవీ విరమణ వయస్సు పెంపుతో ఉద్యోగం భారంగా మారుతుందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. పదవీ విరమణ వయస్సు పెంపుతో తమకు అన్యాయం జరుగుతుందని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు ఉద్యోగులు విమరణ పొందుతుంటే తమకు అవకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్‌ వయస్సు పెంపుతో తమకు ఉద్యోగాలు ఎక్కడ? లభిస్తాయని ప్రశ్నిస్తున్నారు.

0
0
Report
Advertisement

సాయికృష్ణ కేసులో నిందితుల‌ను కాపాడ‌టమే ల‌క్ష్యంగా సిట్ విచార‌ణ‌: అంబటి రాంబాబు

Guntur, Andhra Pradesh:

Sai Krishna Case: కాపు యువ‌కుడు గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌కు గురయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వదిలిపెట్టడం లేదు. మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. నిందితులను కాపాడడమే లక్ష్యం సిట్‌ విచారణ జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే కృష్ణ‌లంక‌ పీఎస్ సీసీ టీవీ ఫుటేజ్‌లు మాయమయ్యాయని తెలిపారు.

గుంటూరు లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మంగళవారం మీడియాతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'సీఐ నాగ‌రాజును ఇంత‌వ‌ర‌కు ఎందుకు అరెస్ట్ చేయ‌లేదు? కేసు న‌మోదైన మ‌రుక్ష‌ణ‌మే ఆయ‌న్ను అరెస్ట్ చేయాలి క‌దా? సీఐ నాగ‌రాజును అరెస్ట్ చేయ‌కుండా జ‌న‌సేన అడ్డుకోవ‌డం ఏమిటి? నేర‌స్తుల‌ను నేర‌స్తులుగానే చూడాల‌ని చెప్పే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న‌దేమిటి? పోలీసులే నేర‌స్తుల‌ను చంపేస్తుంటే న్యాయ‌స్థానాలు ఉన్న‌ది దేనికి?' అని ప్రశ్నలు కురిపించారు.

'సీఐ నాగరాజుని అరెస్ట్ చేయ‌క‌పోతే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడ‌ని చెబుతూనే ఉన్నాం. చివ‌రికి మేం అనుమానించిన‌ట్టుగానే ఫుటేజ్‌లు మాయం చేశారు. సీబీఐ విచార‌ణ చేస్తే త‌ప్ప అస‌లైన నిందితుల‌కు శిక్ష ప‌డ‌దు' అని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. ఈ కేసులో ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న సీఐ నాగ‌రాజు మీద కేసు న‌మోదు చేసిన మ‌రుక్ష‌ణ‌మే అరెస్ట్ చేయ‌కుండా ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం పోలీస్ స్టేష‌న్‌ల‌లో 18 నెల‌ల పాటు సీసీటీవీ ఫుటేజీలను నిల్వ చేసి ఉంచాల‌నే నిబంధ‌న ఉల్లంఘించార‌ని తెలిపారు. 

'సీఐ నాగ‌రాజును అరెస్ట్ చేసి ఉంటే ఆ ఫుటేజీ మాయమయ్యేదే కాదు. ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం పోలీసుల‌ను పోలీసులే కాపాడే కుట్ర‌లో భాగంగా స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. లాక‌ప్‌డెత్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఐని కాపాడ‌టానికి ధ‌ర్నాలు చేస్తున్న జ‌నసేన నాయ‌కుల‌ను ఎందుకు అడ్డుకోలేదు' అని పవన్‌ కల్యాణ్‌ను మాజీ మంత్రి అంబి రాంబాబు ప్ర‌శ్నించారు. 'సాయికృష్ణ‌ను లాక‌ప్‌లో చంప‌డ‌మే కాకుండా శ‌వాన్ని ఇవ్వ‌కుండా కాల్చేసి బూడిద కూడా దొర‌క్కుండా మాయం చేయ‌డం, సీసీటీవీ ఫుటేజీలు తుడిచేయ‌డం, ఇలా వ‌రుస‌పెట్టి త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూనే ఉన్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు సీబీఐ విచార‌ణ చేస్తే త‌ప్ప నిందితుల‌కు శిక్ష పడ‌ద‌ని స్పష్టం చేశారు. 

'మొద‌ట్నుంచి పోలీస్ క‌మిష‌న‌ర్ పాత్ర‌పై అనుమానాలు వ్య‌క్తం  చేస్తున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. చివ‌రికి మేం చెప్పిందే జ‌రిగింది. కేసు న‌మోదు చేసిన మ‌రుక్ష‌ణ‌మే నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఐ నాగ‌రాజును అరెస్ట్ చేయాల్సింది' అని మాజీ మంతరి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నేర‌స్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, నేర‌స్తుల‌ను నేర‌స్తులుగానే చూడాల‌న్న ప‌వ‌న్ కల్యాణ్ వ్యాఖ్య‌లతో తాను క‌చ్చితంగా ఏకీభ‌విస్తున్నట్లు ప్రకటించారు. కాపు యువ‌కుడి లాక‌ప్ డెత్ కు కార‌ణ‌మైన సీఐ నాగరాజును అరెస్ట్ చేయొద్ద‌ని జ‌న‌సేన నాయ‌కులు ధ‌ర్నాలు చేయ‌డం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 'నేర‌స్తుడికి వంత‌పాడుతూ జనసేన పార్టీ నాయకులు క‌ల్లు తాగిన కోతులు మాదిరిగా డ్యాన్సులేస్తున్నారు. పోలీసుల అప్ర‌జాస్వామిక విధానాల‌కు వంత‌పాడుతున్నారు' అని విమర్శించారు.

సాయికృష్ణ కేసుకి మేక‌ప్ వేసే కార్యక్ర‌మం జ‌రుగుతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు. సాయికృష్ణ కేసులో తూతూమంత్రంగానే సిట్ విచార‌ణ జ‌రుగుతోందని.. కేసు నమోదు చేసిన నాటి నుంచే ఎక్క‌డా ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రించ‌డం లేదని అంబ‌టి రాంబాబు విమర్శలు చేశారు.

0
0
Report

Flipkartలో రూ.98 వేల TCL 55-ఇంచ్ 4K మినీ LED స్మార్ట్ టీవీ.. కేవలం రూ.39 వేలకే!

Hyderabad, Telangana:

TCL 55 inch Mini LED TV Flipkart Offers: ప్రస్తుతం భారత మార్కెట్‌లో కూడా TCL హవా కొనసాగుతూ వస్తుంది. అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌టీవీలను విక్రయించడంలో ఈ కంపెనీ ముందుంది. అలాగే ఈ స్మార్ట్‌టీవీలు చాలా తక్కువ ధరతో రావడంతో మిడిల్ క్లాస్ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు TCL కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో మంచి మంచి టీవీలను విడుదల చేస్తూ వస్తోంది. అయితే మీరు కూడా ఎప్పటినుంచో ఇదే బ్రాండ్‌కు సంబంధించిన టీవీ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 

55 అంగుళాలు కలిగిన TCL స్మార్ట్‌టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడే దీనిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే ఇది మార్కెట్లో ఇప్పుడు 55Q6CS మోడల్ నెంబర్‌తో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుందాం..

TCL 55Q6CS (55 ఇంచుల) Ultra HD (4K) Mini LED Smart గూగుల్ స్మార్ట్‌టీవీ ఫీచర్స్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..55 ఇంచులు (139 సెం.మీ) 4K Ultra HD (3840 x 2160 పిక్సెల్స్) డిస్ప్లేన్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది సాధారణ LED ల కంటే మెరుగైన బ్రైట్‌నెస్ తో కూడిన QD-Mini LED సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. 

అంతేకాకుండా ఇందులో 312+ లోకల్ డిమ్మింగ్ జోన్లు ఉండటం వల్ల స్క్రీన్‌పై లైటింగ్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది.  అలాగే కంపెనీ ఎంతో ప్రత్యేకమైన AiPQ Processor ను అందిస్తూ వస్తోంది. దీంతోపాటు Dolby Vision, HDR10+, HLG తో పాటు IMAX Enhanced సర్టిఫికేషన్ కలిగి ఉంది. దీనివల్ల థియేటర్ లాంటి అనుభూతి లభిస్తుంది.  అదేవిధంగా 40 Watts పవర్ఫుల్ ఆడియో సపోర్టు కూడా అందుబాటులో ఉంది. ఇందులో కంపెనీ సౌండ్ కోసం బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్ అందించడమే కాకుండా ONKYO 2.1 Hi-Fi స్పీకర్స్ సిస్టంను అందిస్తోంది. అలాగే చాలా ప్రత్యేకమైన Dolby Atmos, DTS ప్రీమియం సౌండ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది Google TV ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి వచ్చింది. దీని ఇంటర్ఫేస్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.

దీంట్లో కంపెనీ వాయిస్ కంట్రోల్ ఆప్షన్ కూడా అందిస్తోంది..హాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ (Google Assistant), బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే సపోర్ట్ కూడా అందుబాటులో ఉండడం విశే. అలాగే గేమింగ్ చేసే వాళ్ళకి కంపెనీ గేమింగ్ మాస్టర్ మోడ్ ను కూడా అందుబాటులో ఉంచింది.. ఇవే కాకుండా ఇందులో కంపెనీ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ వస్తుంది.. ఇక ఈ టీవీకి సంబంధించిన ధర, ఇతర వివరాల్లోకి వెళ్తే.. కంపెనీ మార్కెట్లో దీనిని MRP ధర రూ.98,9990 లకు విక్రయిస్తోంది. అయితే ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఏకంగా 54 శాతం వరకు స్పెషల్ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.45,990 లకే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఈ టీవీ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్‌అనుసంధాన యాక్సిస్ బ్యాంకుతో పాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.4,990 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించే వారికి రూ.3 వేల బోనస్ లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.39 వేల లోపే పొందవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Kondagattu: కొండగట్టు అంజన్న ఆలయంలో ఘోరం.. EO డ్రైవర్ చేతికి క్యాష్ కౌంటర్..

Hyderabad, Telangana:

Kondagattu Temple Controversy Latest News: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మరో వివాదం చెలరేగింది.. ప్రతిరోజు లక్షలాది రూపాయల ఆదాయం వచ్చే ఆలయ టికెట్ క్యాష్ కౌంటర్లు ఒక ప్రైవేటు వ్యక్తి తిష్ట వేసి నగదు లావాదేవీలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యక్తిగత కారు డ్రైవర్.. ఏకంగా అంజన్న ఆలయ అధికారిక క్యాష్ కౌంటర్లో కూర్చొని భక్తులకు టికెట్లు ఇస్తూ.. డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై భక్తులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

అధికారిక కౌంటర్‌లో ప్రైవేట్ వ్యక్తికి ఏం పని?
స్వామి వారి దర్శనంతో పాటు పూజ, ప్రసాదాల కోసం ప్రతిరోజు వేలాదిమంది భక్తులు కొండగట్టుకు తరలివస్తు ఉంటారు.  దీని ద్వారా ఆలయ కౌంటర్లకు భారీగా నగదు అందుతుంది.. అత్యంత పారదర్శకంగా.. కేవలం ప్రభుత్వం లేదా దేవస్థాన అధికారిక సిబ్బంది మాత్రమే నిర్వహించాల్సిన ఈ బాధ్యతయుతమైన సీట్ లో.. ఈవో సొంత డ్రైవర్ కూర్చోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దేవస్థాన నియమావళి ప్రకారం ఎలాంటి అర్హతలేని ఒక ప్రైవేటు వ్యక్తి. ప్రభుత్వం సొమ్ముతో కూడిన క్యాష్ కౌంటర్ లో ఎలా కూర్చుంటాడని.. దీనికి ఈవో పరోక్షంగా అనుమతి ఇచ్చారా? అని భక్తులతో పాటు కొంతమంది ఆలయ అధికారులు ప్రశ్నిస్తున్నారు..

క్రింది స్థాయి సిబ్బందిపై దురుసు ప్రవర్తన..
ఈవో అండా చూసుకొని.. సదర్ డ్రైవర్ ఆలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వెలువెత్తుతూ వస్తున్నాయి.. ఆలయంలో పనిచేసే ఇతర కిందిస్థాయి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల పట్ల అతను అత్యంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడని.. ప్రశ్నించిన వారిని ఈవో పేరు చెప్పి.. బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆలయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది..

బాధిత భక్తులు, స్థానికుల ఆగ్రహం..
భక్తులు సమర్పించే కానుకల తో పాటు టికెట్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడంలేదని.. ఒక ప్రైవేటు డ్రైవర్ చేతికి క్యాష్ కౌంటర్ అప్పగించడం ఏంటి? అక్కడ ఎంత పెద్ద కుంభకోణం జరుగుతుందో ఊహించవచ్చని.. దీని వెనకాల పెద్దల హస్తం కచ్చితంగా ఉందని భక్తులు అనుమాన పడుతున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్..
పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అక్రమాలపై హిందూ బంధువులతో పాటు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ ఉన్నత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి.. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారానికి బాధ్యుడైన సదరు డ్రైవర్ను ఆలయ ప్రాంగణం నుంచి తొలగించడమే కాకుండా.. అతనికి సహకరించిన అధికారులపై కూడా శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement
Advertisement
Back to top