Back
Manohar
Followఖైరతాబాద్: మైసమ్మ ఆలయంలో డిప్యూటీ మేయర్ పూజలు
Hyderabad, Telangana:
ఆశాడ మాసం బోనాల సందర్భంగా మంగళవారం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని జీహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసి రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ నేత మోతె శోభన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
0
Report
బోయిన్ పల్లి: సాయిబాబా ఆలయంలో మల్లారెడ్డి పూజలు
Boyapalle, Telangana:
బోయిన్ పల్లి లోని జయ నగర్ లో ఉన్న సాయిబాబా ఆలయాన్ని గురుపౌర్ణమి సందర్భంగా మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.
0
Report
సికింద్రాబాద్: బోనాల జాతరకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వానం
Secunderabad, Telangana:
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, పూజారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 21, 22వ తేదీలలో అత్యంత వైభవంగా బోనాల జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు.
0
Report
యాకుత్ పుర: బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
Hyderabad, Telangana:
ఒరిస్సా ప్రమాద ఘటనలో ఛత్రినాకకు చెందిన ముగ్గురు చనిపోవడం అత్యంత బాధాకరమని యాకూత్ పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఇక్కడికి రప్పించనున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురికి ఎక్స్గ్రేషన్ ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు.
0
Report
గడ్డిఅన్నారం: త్వరగా పనులు పూర్తి చేయాలి
Hyderabad, Telangana:
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమల నగర్ లో కొనసాగుతున్న డ్రైనేజీ లైన్ పనులను డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. కమలానగర్ నుంచి నేతాజీ నగర్ వరకు ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు సహకరించాలన్నారు.
0
Report
సీతాఫల్మండి: వీక్లీ డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్
Secunderabad, Telangana:
సీతాఫల్మండి డివిజన్ లోని వైదిక్ విద్యాలయంలో నిర్వహించిన వీక్లీ డ్రైడే కార్యక్రమంలో డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దోమల వృద్ధిని అరికట్టే మార్గాలను వివరించారు. ప్రతి ఒక్కరు తప్పకుండా వారానికి ఒకసారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సమయం కేటాయించాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమల నివారణ రసాయనాలు చల్లాలని సూచించారు.
0
Report
సనత్ నగర్: ఆలయ కమిటీలకు బోనాల నిర్వహణ చెక్కులు పంపిణీ
Hyderabad, Telangana:
బోనాల జాతర నిర్వహణ కోసం ఆలయ కమిటీలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద పంపిణీ చేశారు. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి చెక్కులను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తరతకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
0
Report
సికింద్రాబాద్: దోమల నివారణకై జీహెచ్ఎంసి పటిష్టమైన చర్యలు
Secunderabad, Telangana:
దోమల నివారణకై జీహెచ్ఎంసి పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. తన క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఫ్రైడే-డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల నివారణ కోసం ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న నీటిలో దోమల నివారణ రసాయనాలు పిచికారి చేయాలని సూచించారు.
0
Report
కార్వాన్: శానిటేషన్ డ్రైవ్ పరిశీలించిన కార్పొరేటర్
Hyderabad, Telangana:
కార్వాన్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న శానిటేషన్ డ్రైవ్ ను డివిజన్ కార్పొరేటర్ స్వామీ యాదవ్ పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది సహకరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని తెలిపారు. ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరించాలని అన్నారు.
0
Report
బర్కత్ పుర లో అమ్మ పేరుతో మొక్క నాటిన కిషన్ రెడ్డి
Hyderabad, Telangana:
ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బర్కత్పురాలోని పార్టీ నగర కార్యాలయంలో ఒక మొక్కను నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ మొక్కలు నాటాలని కోరారు. డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, సి.నందకిషోర్ యాదవ్, ఏ.సూర్య ప్రకాశ్ సింగ్ పాల్గొన్నారు.
0
Report
కిషన్ బాగ్ లో విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు :ఎమ్మెల్యే
Hyderabad, Telangana:
కిషన్ బాగ్ డివిజన్ పరిధిలోని అసద్ బాబా నగర్, నజం నగర్ లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లను బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యలను లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హుస్సేని పాషా, అధికారులు పాల్గొన్నారు.
0
Report
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న డిప్యూటీ మేయర్
Hyderabad, Telangana:
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు.
0
Report
హిమాయత్ నగర్: తమ్మారెడ్డికి సీపీఐ నాయకులు నివాళులు
Hyderabad, Telangana:
సిపిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మారెడ్డి సత్యనారాయణ జయంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఐ సీనియర్ నాయకుడు కందిమల్ల ప్రతాపరెడ్డి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రమావత్ అంజయ్య నాయక్, మారుపాక అనిల్ కుమార్, ఆరుట్ల రాజ్ కుమార్, గోవింద్,శ్రీరాములు,దశరథ్, విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
0
Report
దూద్ బౌలి: అభివృద్ధి పనులు త్వరగా ప్రారంభించాలి
Hyderabad, Telangana:
దూద్ బౌలి డివిజన్ పరిధిలోని కామాటిపుర, ఉస్మాన్ బాగ్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ సలీం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు చాలాకాలంగా పెండింగ్లో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్ తెలిపారు. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
0
Report
సులేమాన్ నగర్: మొక్కలు నాటిన ఎంఐఎం ఎమ్మెల్సీ
Hyderabad, Telangana:
సులేమాన్ నగర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పాల్గొన్నారు. స్థానిక అధికారులతో కలిసి పార్కులో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ నవాజుద్దీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report
గడ్డిఅన్నారం: సీవరేజ్ పనులు ప్రారంభించిన కార్పొరేటర్
Hyderabad, Telangana:
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమలానగర్ లో సీవరేజ్ లైన్ పనులను డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.90 లక్షలతో పనులను చేపడుతున్నట్లు కార్పొరేటర్లు తెలిపారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. కమలానగర్ నుంచి నేతాజీ నగర్ చౌరస్తా వరకు పనులను చేపడుతున్నట్లు తెలిపారు.
0
Report
గోల్కొండలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
Hyderabad, Telangana:
గోల్కొండ డివిజన్ పరిధిలోని పార్కులో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహయుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు నాటడం తప్పనిసరి అని అన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్లు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report
మలక్ పేట: పార్కులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
Hyderabad, Telangana:
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అజాంపుర డివిజన్ పరిధిలో ఉన్న పార్కులో మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రతి కాలనీలో ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటి బాధ్యతగా పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ మొహిద్దిన్ అబ్రహం, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report
కార్వాన్: ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టండి
Hyderabad, Telangana:
శానిటేషన్ విభాగం సిబ్బందితో కార్వాన్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో మొహరం, బోనాల జాతరను పురస్కరించుకొని ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడ చెత్త లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని తెలిపారు. ఆలయాలు, అశుర్ కానా ల వద్ద ప్రత్యేక శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు. సిబ్బందికి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
0
Report
తార్నాక: వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు
Secunderabad, Telangana:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని తార్నాక లోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో INTUC రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ నేత మోతె శోభన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. పేద ప్రజల సీఎంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు పథకాలు తీసుకొచ్చారని అన్నారు.
0
Report
గడ్డిఅన్నారం: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
Hyderabad, Telangana:
సీజనల్ వ్యాధుల పట్ల డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. సోమవారం డివిజన్ పరిధిలోని కోదండరాం నగర్ లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారం ఆరుబయట వేయద్దని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
0
Report
నానల్ నగర్: సీవరేజ్ పనులు పరిశీలించిన కార్పొరేటర్
Hyderabad, Telangana:
నానల్ నగర్ డివిజన్ పరిధిలోని కాలా బంగ్లా వద్ద కొనసాగుతున్న సీవరేజ్ లైన్ పనులను డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ నసీరుద్దీన్ పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనుల్లో తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రాంత ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report
గోషామహల్: దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు
Hyderabad, Telangana:
గోషామహల్ డివిజన్ పరిధిలోని మూసినది పరివాహక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది దోమల నివారణ ముందు పిచికారి చేశారు. ఈ పనులను డివిజన్ బీజేపీ కార్పొరేటర్ లాల్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. డివిజన్ పరిధిలో దోమల వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
0
Report
రామంతపూర్: మొక్కలు నాటిన మంత్రి, యంత్రాంగం
Hyderabad, Telangana:
రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వనమహోత్సవం ప్రారంభించిందని, ప్రకృతిని కాపాడేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి వివరించారు
0
Report
నానల్ నగర్: రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేటర్
Hyderabad, Telangana:
నానల్ నగర్ డివిజన్ పరిధిలోని అల్-హస్నత్ కాలనీలో కొనసాగుతున్న రోడ్డు పనులను డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ నసీరుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. ఈ పనులు పూర్తయితే స్థానికంగా రాకపోకలకు ఎటువంటి అంతరాయాలు ఉండవన్నారు.
0
Report
హయత్ నగర్: సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్
Hyderabad, Telangana:
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని ద్వారకమయి నగర్ లో సెల్ టవర్ నిర్మాణాన్ని డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అడ్డుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన కార్పొరేటర్ స్థానికలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సెల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల స్థానిక పిల్లలకు, వృద్ధులకు హాని జరిగే అవకాశం ఉందన్నారు. సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని టౌన్ ప్లానింగ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
0
Report