గడ్డిఅన్నారం: త్వరలో రోడ్డు పనులు ప్రారంభం
Hyderabad, Telangana:గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కోదండరాం నగర్ లో త్వరలో రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు డివిజన్ బిజెపి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం పనులు చేపట్టే ప్రాంతాలను అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
సింహరాశిలో సూర్య-కేతువుల కలయిక.. ఆగస్టు 17 నుంచి ఈ 3 రాశులవారికి బంపర్ జాక్‌పాట్!
Hyderabad, Telangana:Sun-ketu Conjunction Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలతో పాటు నక్షత్రాల మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఆగస్టు 17వ తేదీన జ్యోతిష్య శాస్త్రంలో ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన సంఘటన చోటుచేసుకోబోతోంది. నవగ్రహాల అధిపతిగా భావించే సూర్యభగవానుడు తన సొంత రాశి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్కడ ఇప్పటికే ఉన్న కేతువుతో సూర్యుడు కూడా కలయిక జరపుతాడు. చాలా సంవత్సరాల తర్వాత సింహరాశిలో సూర్య-కేతువుల ఈ అరుదైన కలయిక జరగడం విశేషం.
జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. సూర్యుడు తన సొంత రాశిలో ఉన్నప్పుడు అత్యంత బలంగా, శక్తివంతంగా ఉంటాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాంటి సూర్యుడితో కేతువు కలయిక.. ఈ గ్రహ మార్పును మరింత ప్రాధాన్యత కలిగించేలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అరుదైన సంయోగం వల్ల ఆగస్టు 17 నుంచి ప్రధానంగా మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. హోదాతో పాటు గౌరవం, పదోన్నతితో పాటు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వీరు ఊహించని విజయాలు పొందే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారి మేలు జరుగుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ జాక్‌ఫాట్..
కన్యా రాశి (Virgo)
కన్యారాశివారికి ఈ గ్రహ సంయోగం ఆర్థికంగా, వ్యాపారపరంగా ఎంతో లబ్ధి చేకూరుస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి కొత్త ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. అనుకోకుండా ఆకస్మిక ధనలాభం లభించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడటంతో ఇల్లు, వాహనం లేదా ఇతర విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు గత అనుభవాలు బాగా కలసివచ్చే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది..
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి సూర్య, కేతువుల కలయిక కారణంగా ఈ సమయం అత్యంత సానుకూలమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి సుదీర్ఘకాలంగా స్వంత ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారి కల ఈ సమయంలో నెరవేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయిద. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. మొండిబాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. కుటుంబ సభ్యుల పూర్తి సపోర్ట్ లభిస్తుంది. ఆధ్యాత్మికతో పాటు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
సింహ రాశి (Leo)
సింహరాశి అధిపతి స్వయంగా సూర్యుడే కావడం.. ఈ సంయోగం కూడా సింహరాశిలోనే ఏర్పడడం కారణంగా ఈ రాశి వారికి అత్యంత శ్రేష్ఠమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో తప్పకుండా నిర్ణయాధికారం, ధైర్యం విశేషంగా పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్, జీతం పెరుగుదల సూచనలు ఉన్నాయి. సమాజంతో పాటు కుటుంబంలో మీ ప్రతిష్ట మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి. నిలిచిపోయిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Vivo S2 గ్రాండ్ ఎంట్రీ.. చీప్ ధరకే 3D కర్వ్డ్ డిస్ప్లే, Sony 50MP కెమెరా!
Hyderabad, Telangana:Vivo S2 India Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియుల అద్భుతమైన శుభవార్త.. టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుతమైన టైమ్ రానే వచ్చేసింది. ప్రముఖ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. తన అత్యంత ప్రతిష్టాత్మక ఫోన్ Vivo S2ను ఆగస్టు 6న గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.. ఇది 6.83 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌తో కంటికి చెప్పలేనంత ఇంపుగా కనిపిస్తుందని తెలుస్తోంది.. ఏకంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎంతో ఎండలో కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది. కళ్లకు ఏమాత్రం శ్రమ కలగకుండా SGSలో-బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి తీసుకు రావడం విశేషం..
ఈ డివైజ్‌లో MediaTek Dimensity 7360 Turbo శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఆంటోటూ (AnTuTu) బెంచ్‌మార్క్‌లో ఏకంగా 9.70 లక్షలకు పైగా స్కోర్ సాధించిన్నట్లు తెలుస్తోంది. ఇక గేమర్స్ కోసం ఏకంగా 7,050 mAh భారీ బ్యాటరీని ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ మందం కేవలం 7.99 mm మాత్రమే ఉండటం నిజంగా ఒక అద్భుతంగా భావించవచ్చు.
ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడేవారికి వివో అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.. బ్యాక్ సెటప్‌ను 50 మెగాపిక్సెల్ Sony IMX852 ప్రధాన కెమెరాతో పాటు ఫ్రాంట్ భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రెండు కెమెరాలూ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
అధునాతన OriginOS 6, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో పాటు డ్యూయల్ సిమిట్రికల్ స్పీకర్లతో రాబోతున్న ఈ ఫోన్ సిల్క్ వైట్, శాఫైర్ బ్లూతో పాటు రీగల్ బ్రాంజ్ కలర్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.. 8GB+128GB వేరియంట్ ధర సుమారు రూ.51,999తో.. 8GB+256GB వేరియంట్ ధర రూ. 55,999తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది అమెజాన్‌తో పాటు వివో ఈ-స్టోర్లతో పాటు ప్రముఖ రిటైల్ షాపుల్లో ఇది అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
పుష్య నక్షత్రంలో గురు మార్పులు.. ఆగస్టు 19 వరకు ఈ రాశుల జాతకం అమాంతం మారబోతోంది!
Hyderabad, Telangana:Jupiter Transit In Pushya Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో అదృష్టం, సంపద, వివాహంతో పాటు జ్ఞానానికి కారకుడిగా భావించే దేవగురు బృహస్పతి నక్షత్ర సంచారంలో కీలక మార్పు చోటుచేసుకుంది. గురు గ్రహం పుష్య నక్షత్రంలోని నాలువ పాదంలోకి సంచారవ చేసింది. ఆగస్టు 3 సోమవారం రాత్రి 11 గంటలకు గురుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించగా.. ఆగస్టు 19 వరకు ఇదే స్థానంలో కొనసాగుతాడు. ఈ అద్భుతమైన నక్షత్ర పద సంచారం వల్ల ప్రధానంగా 4 రాశుల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరగడమే కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగే అవకాశాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. అయితే ఏయే రాశులవారికి ఈ సమయం ఎంత బాగుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు
కన్యా రాశి (Virgo)
గురు నక్షత్ర పద సంచారం కన్యా రాశి వారికి అపారమైన విజయాలను అందిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు అమాంతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కెరీర్లో బంపర్ పురోగతి సాధిస్తారు. గురు గ్రహ అనుగ్రహంతో అదృష్టం తోడై.. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడమే కాకుండా.. రాబోయే కొన్ని నెలల్లో వీరి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్లో పెద్ద ఎత్తున విజయం సాధించడమే.. కాకుండా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడతాయి. సంపాదనకు సరికొత్త మార్గాలు సుగమం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు వచ్చి.. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.. దీర్ఘకాలిక సమస్యలతో పాటు వివాదాల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.
మకర రాశి (Capricorn)
మకర రాశి జాతకులకు గురుడి నక్షత్ర సంచారం అత్యంత శుభ సమయాన్ని అందిస్తుంది.. వ్యాపారంలో భారీ డీల్స్ కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సమాజంలో హోదా విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో ఇన్నాళ్లూ ఉన్న ఆందోళనలతో పాటు మానసిక అశాంతి తొలగిపోతాయి. ఆర్ధిక ఇబ్బందులు తీరిపోయి.. నూతన మార్గాల నుంచి లభించే ఆదాయంతో బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది.
మీన రాశి (Pisces)
మీన రాశి వారికి కూడా ఈ సంచారం అత్యంత సానుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సంపాదనకు కొత్త అవకాశాలు కూడా కలుగుతాయి.. ధన సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సామాజిక స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగార్థులకు నూతన ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, పెద్ద ఆఫర్లు లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి.. ఆడపిల్లలకు ఆ వ్యాక్సిన్ ఎంతో ముఖ్యం.. ఆ టీకాపై ఎందుకీ అపోహలు?
Secunderabad, Telangana:HPV: భారతదేశంలో మహిళల ప్రాణాలను తీస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) ఒకటి. ప్రతి ఏటా వేలాది మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఈ క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకోగల అత్యంత శక్తివంతమైన హెచ్పివి (HPV - Human Papillomavirus) వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సైన్స్ ఇంత పురోగమించినా.. మనదేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ టీకా వేయించడానికి ఇప్పటికీ వెనుకంజ వేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరణాలలో దాదాపు 4వ వంతు భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. అయితే, ఈ క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకోగల అత్యంత శక్తివంతమైన హెచ్పివి (HPV - Human Papillomavirus) వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయినప్పటికీ, తప్పుడు సమాచారం.. సరైన అవగాహన లేకపోవడం, ఆడపిల్లల లైంగికత గురించి మాట్లాడటానికి ఉన్న అసౌకర్యం వంటి కారణాల వల్ల భారతీయ తల్లిదండ్రులలో ఈ వ్యాక్సిన్ పై ఎన్నో అనుమానాలు, అపోహలను కలిగి ఉన్నారు. వాస్తవానికి ఈ వ్యాక్సిన్ ఏమి చేస్తుంది? ఆడపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎందుకంత సంకోచిస్తున్నారు. ఈ సంకోచం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
HPV అనేది లైంగికంగా సంక్రమించే వైరస్ అనే విషయాన్ని తల్లిదండ్రులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిన్న వయస్సులోనే ఈ టీకా ఇస్తే పిల్లల ప్రవర్తన మారిపోతుందేమోననే భయం కొందరు తల్లిదండ్రుల్లో ఉంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి, ఈ వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు..గర్భాశయ క్యాన్సర్‌ను ఒక టీకాతో పూర్తిగా నివారించవచ్చనే ప్రాథమిక అవగాహన మెజారిటీ ప్రజలకు లేదు. HPV 16 , HPV 18 అనే రెండు రకాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులకు కారణమవుతున్నాయి. క్వాడ్రివాలెంట్ టీకా (గార్డాసిల్) బైవాలెంట్ టీకా (సెర్వారిక్స్) రెండూ ఈ రకాలను లక్ష్యంగా చేసుకుంటాయి. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన, భారతదేశంలో దేశీయంగా ఉత్పత్తి చేసిన సెర్వావాక్ టీకా, అధిక ప్రమాదం ఉన్న HPV 16 , HPV 18 రెండు రకాలను కవర్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ 2022లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందింది.
అయితే పెళ్లికి ముందే ఈ టీకాను ఇచ్చినట్లయితే.. గర్భశాయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అందుకే దీనిని 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు సిఫార్సు చేస్తున్నారు వైద్యులు. ది లాన్సెట్ ఆంకాలజీలో ప్రచురించిన 2020 నాటి ఒక అధ్యయనంలో, స్వీడన్లో 11 సంవత్సరాల పాటు 16 లక్షల మందికి పైగా మహిళలను పరిశీలించగా, 17 ఏళ్లలోపు టీకా తీసుకున్న బాలికలకు, టీకా తీసుకోని మహిళలతో పోలిస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదం 88 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్స్‌ను మూడు డోసులుగా ఇచ్చేవారు. 15 ఏళ్లలోపు అమ్మాయిలకు, ఇప్పుడు ఆరు నెలల వ్యవధిలో ఇచ్చే రెండు డోసులు సమానమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే ఈ HPV వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది. ఆడపిల్లలకు 9 నుండి 14 ఏళ్ల వయస్సు మధ్యలో (లైంగిక జీవితం ప్రారంభం కాకముందే) ఈ టీకా ఇవ్వడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 90శాతం కంటే ఎక్కువ తగ్గుతుంది. ఈ వ్యాక్సిన్ కేవలం క్యాన్సర్ కణాలకు కారణమయ్యే వైరస్‌ను మాత్రమే అడ్డుకుంటుంది తప్ప, పిల్లల శరీర వ్యవస్థపై లేదా భవిష్యత్తు సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని వైద్యులు తెగేసి చెప్తున్నారు.
మార్పు ఎక్కడ రావాలి?
మన పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి మూఢనమ్మకాలను పక్కనబెట్టాలి.
స్కూల్ లెవల్ అవగాహన: పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్‌ల ద్వారా ఈ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించాలి.
ప్రభుత్వ ప్రోత్సాహం: జాతీయ టీకాల పట్టికలో దీనిని చేర్చి, సామాన్యులకు ఉచితంగా లేదా తక్కువ ధరకు అందేలా చూడాలి.
సరైన సమయంలో ఆడపిల్లలకు HPV వ్యాక్సిన్ వేయించడమే మనం వారికి ఇచ్చే అతిపెద్ద ఆరోగ్య రక్షణ.
Also Read: ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో నో ఫ్యూయల్! కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..!!
Also Read: పీఆర్సీ పై టీచర్ల పోరు బాట.. సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉపాధ్యాయుల మహా ధర్నా.. డిమాండ్లు ఇవే..!!
Also Read: టీచర్లకు డెడ్‌లైన్ ఫిక్స్.. టెట్ అర్హత తప్పనిసరి
Also Read: ఆ బడుల్లో ఒకే టీచర్.. దేశంలో ఇలాంటి పాఠశాలలు లక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Vizag Rains: జలమయమైన కాలనీలు.. విశాఖ నగరాన్ని వణికించిన భారీ వర్షం
Visakhapatnam, Andhra Pradesh:Heavy Rain In Vizag: ఎల్‌నినో ప్రభావం తీవ్ర ప్రభావం చూపిస్తున్న సమయంలో విశాఖపట్టణం నగరంలో చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభమైన రెండు నెలల తర్వాత కుండపోత వాన పడింది. పగటిపూట మొత్తం ఎండ వేడిమి ఉండగా.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అనంతరం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వాన పడడంతో విశాఖవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆకస్మికంగా కురిసిన వర్షంతో విశాఖపట్టణం నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ప్రధాన రహదారులపై భారీగా వరద నిలిచింది. కుండపోత వర్షంతో డ్రైనేజీల్లో ఉద్ధృతంగా వరద ప్రవహించింది. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా.. భారీ వరద కారణంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులతోపాటు పాదచారులు అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో నీటిలోనే ప్రయాణం సాగించారు.
కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. ఎక్కడా ఇంకుడుగుంతలు కనిపించకుండా పోవడంతో నగరంలో వర్షపు నీటి సంరక్షణపై మళ్లీ చర్చ జరిగింది. వర్షపు నీరంతా డ్రైనేజీల ద్వారా సముద్రంలోకి వృథాగా చేరుతోంది. భారీ వర్షాలతో నగర డ్రైనేజీ వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. వర్షపు నీటి నిల్వ, ఇంకుడు గుంతల ఏర్పాటుపై నిపుణుల సూచనలు చేసినా అధికార యంత్రాంగం పెడచెవిన పెట్టింది. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రేపు కూడా వర్షాలు
విశాఖపట్టణంలో గురువారం భారీ వర్షం పడగా రేపు కూడా వర్షం హెచ్చరికలు ఉన్నాయి. మరో 24 గంటల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వరద
ఎగువ కురుస్తున్న వర్షాలతో ఏపీలోని పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో ఆ ప్రాజెక్టులో నీటి నిల్వ 66 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర డ్యామ్‌కు 50,726 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. భారీ వరద వస్తుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. భారీ వరద కొనసాగుతున్నా కూడా డ్యామ్ నుంచి నీటి విడుదల స్వల్పంగా ఉంది. 1,423 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. తుంగభద్రలో పెరుగుతున్న నీటి నిల్వలతో కృష్ణా నదీ పరివాహక ప్రాంత రైతులు.. రాయలసీమ ప్రాంత సాగుకు సానుకూల సంకేతాలుగా భావిస్తున్నారు. వచ్చే రోజుల్లో ఎగువ ప్రాంతాల్లో వర్షాలపై నీటి లభ్యత ఆధారపడి ఉండనుంది.
తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిల్వల లెక్కలు
డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం 1,621.52 అడుగులు
మొత్తం నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ 66 టీఎంసీలు
ముల్తానీ మిట్టీతో మచ్చలేని అందం.. ట్యాన్, పింపుల్స్ తగ్గించే సింపుల్ హోమ్ రెమిడీస్!
Hyderabad, Telangana:Multani Mitti Face Packs: ఆరోగ్యకరమైన చర్మం అందరికీ కావాలి, అలాగే స్కిన్ టోన్ కూడా మెరుగుపడాలి. ప్రతిరోజూ ఎండలో బయటకు వెళ్లడం వల్ల సూర్యకిరణాల ప్రభావంతో స్కిన్ ట్యాన్ అవుతుంది. అయితే, మన డైలీ బ్యూటీ రొటీన్లో ముల్తానీ మట్టిని చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇది ఓపెన్ పోర్స్ సమస్యను నియంత్రించడమే కాకుండా, సహజమైన గ్లోను అందిస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముల్తానీ మట్టిని వాడటం వల్ల ముఖంపై ఉన్న టాన్ కూడా తగ్గిపోతుంది. దీనిని 'ఫుల్లర్స్ ఎర్త్' అని కూడా పిలుస్తారు. కొన్ని శతాబ్దాలుగా దీనిని సౌందర్య సాధనంగా వాడుతున్నారు. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, సిలికా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి చర్మాన్ని సహజంగా క్లెన్స్ చేస్తాయి. దీనివల్ల మీ ముఖం రోజంతా తాజాదనంతో మెరుస్తూ కనిపిస్తుంది.
అయితే, ముల్తానీ మట్టితో సహా ఏదైనా కొత్త ఉత్పత్తిని ఉపయోగించే ముందు, అది మీ స్కిన్‌కు సరిపోతుందో లేదో ప్యాచ్ టెస్ట్ చేయడం ముఖ్యం. ముల్తానీ మట్టి ముఖ్యంగా ఆయిలీ, యాక్నే సమస్యలు ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఇది అదనపు నూనెను గ్రహించి ఓపెన్ పోర్ట్స్‌ను శుభ్రం చేస్తుంది. కాంబినేషన్ స్కిన్ ఉన్నవారు కూడా దీనిని కేవలం టీ జోన్ (T-zone) ప్రాంతంలో వాడటం వల్ల అదనపు నూనెను తగ్గించుకోవచ్చు. సాధారణంగా ముల్తానీ మట్టిని ఫేస్‌కు అప్లై చేసిన తర్వాత సుమారు 20 నిమిషాల పాటు ఉంచి, సాధారణ నీటితో కడిగేయాలి. మట్టి సుమారు 80 శాతం వరకు ఆరిన తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. పూర్తిగా ఎండిపోయి ముఖంపై క్రాక్స్ వచ్చే వరకు ఉంచకూడదు. దీని తర్వాత వెంటనే మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి, తద్వారా ముఖం త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది.
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ తయారీ విధానం..
మన బిజీ లైఫ్, డైలీ రొటీన్లో ఈ ఫేస్ ప్యాక్‌ను చేర్చుకోవాలంటే, రెండు చెంచాల ముల్తానీ మట్టికి ఒక చెంచా పచ్చి పాలు, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇది ముఖంపై ఉన్న అదనపు నూనె, దుమ్ము , ధూళిని తొలగిస్తుంది. దీనివల్ల ముఖం తాజాదనంతో కనిపిస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య కూడా తగ్గుతాయి.
ట్యాన్ తగ్గిస్తుంది..
బ్యూటీ రొటీన్లో ముల్తానీ మట్టిని చేర్చుకోవడం వల్ల ముఖంపై ఉన్న టాన్ కూడా తగ్గుతుంది. ముల్తానీ మట్టికి చిటికెడు పసుపు, రోజ్ వాటర్ కలిపి అప్లై చేస్తే మంచి గ్లో వస్తుంది. పాలు వాడలేని వారు పెరుగును కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మానికి మంచి పోషణను, సహజమైన మెరుపును అందిస్తుంది. ముల్తానీ మట్టిలో చర్మాన్ని సహజంగా ప్రకాశింపజేసే గుణాలు ఉండటం వల్ల లోతైన క్లెన్సింగ్ లభిస్తుంది.
Also Read: వర్షాకాలంలో కుండీల్లోనే పెంచుకోగలిగే 7 మొక్కలు.. ఇంట్లోనే ఫ్రెష్ కూరగాయలు!
Also Read: తీవ్రమైన ఒత్తిడితో రాత్రులు నిద్రపట్టడం లేదా?
పిగ్మెంటేషన్‌కు చెక్..
ముఖంపై మచ్చలు లేదా పిగ్మెంటేషన్ ఉంటే, రెండు చెంచాల ముల్తానీ మట్టికి కొంచెం నిమ్మరసం, పసుపు కలిపి అప్లై చేయవచ్చు. ఇందులో చందనం పొడిని కూడా కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకుని, 20 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి. ఆ తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది.
అయితే, పైన పేర్కొన్నట్లుగా కొత్త ఉత్పత్తులను వాడే ముందు టెస్ట్ చేయడం చాలా ముఖ్యం. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు చర్మం త్వరగా డ్రై అయ్యే అవకాశం ఉన్నందున ముందుగా పరీక్షించి వాడటం మంచిది. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉన్నవారు డెర్మటాలజిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. వారానికి రెండు సార్లు ముల్తానీ మట్టిని వాడటం వల్ల మీ చర్మం ఎల్లప్పుడూ తాజాదనంతో మెరుస్తూ ఉంటుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే ప్రొఫెసర్ జయశంకర్‌కు నిజమైన నివాళి: కేటీఆర్
Hyderabad, Telangana:Professor Jayashankar: 'తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీ చేతుల్లో బందీ అయ్యింది. యాచించి కాదు.. శాసించే నాయకత్వమే తెలంగాణకు అవసరం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు దిక్సూచి జయశంకర్.. యాచించి కాదు.. శాసించి తెలంగాణ జయశంకర్ బోధించారని గుర్తుచేశారు. తెలంగాణను మళ్లీ కేసీఆర్ చేతిలో పెట్టడమే ప్రొఫెసర్ జయశంకర్‌కు నిజమైన నివాళి అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. జయశంకర్ ఆశయాలే బీఆర్ఎస్ పార్టీకి మార్గదర్శకం అని తెలిపారు. కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని జయశంకర్ గట్టిగా నమ్మారని గుర్తుచేశారు.
కేసీఆర్‌కు తెలంగాణ పట్ల ఉన్న దక్షత, కమిట్మెంట్,
తెలంగాణను సాధించడంలో కేసీఆర్‌కి మించి మొండితనం ఉన్న నాయకుడు మరొకరు లేరు! pic.twitter.com/lVMJxWoAyi
— BRS Party (@BRSparty) August 6, 2026
ఢిల్లీ చుట్టూ రేవంత్ రెడ్డి ప్రదక్షిణలతో తెలంగాణకు దక్కిందేమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ సామంతులు కాదు.. తెలంగాణ స్వతంత్రులు కావాలని పేర్కొన్నారు. 75 ఢిల్లీ టూర్లు.. తెలంగాణకు తెచ్చిందేమిటి? అని నిలదీశారు. ఢిల్లీకి సామంతుల్లా మారొద్దు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రజలకు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు.
'ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రతి 13 రోజులకు ఒకసారి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీకి సామంతులు కాకుండా స్వతంత్రులు కావాలి అని జయశంకర్ చెప్పేవారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆయన ఎప్పుడూ చెప్పేవారు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని, జీఆర్ఎంబీ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ఆధారాలతో వివరించారని వెల్లడించారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందని, తెలంగాణ కోసం పుట్టిన నిఖార్సయిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు.
జీవితంలో ఒక్కసారి కూడా ‘జై తెలంగాణ’ అనని జైపాల్ రెడ్డి మేధావా? 😡
మా ఉద్యమకారుల పేర్లు చెప్పకపోతివి..
నీ పక్కన ఉన్న కోదండరాం పేరు కూడా చెప్పవా రేవంత్? 🥹ఇంత భావ దారిద్య్రమా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/iicfpKohey
— BRS Party (@BRSparty) August 6, 2026
పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చినా, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ స్పందించలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, అప్పులు, అభివృద్ధి అంశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని బీపీఆర్ విఠల్ అధ్యయనాలు నిరూపించాయని నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం వాటిని వినియోగించలేకపోతోందని వివరించారు. కాంగ్రెస్ తెలంగాణకు శాశ్వత శత్రువని జయశంకర్ చెప్పేవారని గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ప్రకటించారు.
జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి.. కేసీఆర్‌తోనే రాష్ట్ర సాధన సాధ్యమైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధనే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
రేపే ఏపీలో కొత్త సంక్షేమ పథకం ప్రారంభం.. ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.25 వేలు
Chirala, Andhra Pradesh:Nethanna Sevalo Scheme: మరో కొత్త సంక్షేమ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయనుంది. ఒక్కొక్క కుటుంబంలో రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించే పథకానికి రేపు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. చేనేతలకు అండగా నిలువాలనే ఉద్దేశంతో ప్రారంభిస్తున్న పథకం పేరు 'నేతన్న సేవలో’ పథకం. చేనేత కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందిస్తున్నారు.
నేత వృత్తి చేసే చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తుండగా తాజాగా చేనేతల సంక్షేమానికి మరో పథకానికి శ్రీకారం చుట్టింది. నేతన్న సేవలో పేరుతో ప్రారంభిస్తున్న ఈ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
నేతన్న సేవలో పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి నేతన్న కుటుంబానికి రూ.25 వేల సాయం దక్కనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేయనుండగా.. రూ.179 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ పథకమే కాకుండా ఇప్పటికే కొన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం తెలిసిందే.
==> ఉచిత విద్యుత్‌తో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్లూమ్ యూనిట్లకు ప్రయోజనం దక్కుతోంది. దీనికి ఏటా రూ.150 కోట్లు ఖర్చవుతోంది.
==> ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చుచేసి 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున ఏపీ ప్రభుత్వం చెల్లిస్తోంది.
==> 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్లు అందించింది.
==> ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటు
==> విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు
రేపు నేతన్న సేవలో పథకం ప్రారంభోత్సవ షెడ్యూల్
రేపు నేతన్న సేవలో పథకం ఏపీ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. చీరాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి ఉదయం 10.50 గంటలకు చేరుకుంటారు. 11.05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగం చేస్తారు. మధ్యాహ్నం 01.35 గంటలకు జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
ఆగస్టు 17న శక్తివంతమైన వైధృతి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక ధనవర్షమే!
Hyderabad, Telangana:Vaidhriti Yog 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల స్థితిగతులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల కలయిక వల్ల ఏర్పడే వివిధ యోగాలు మానవ జీవితంపై విశేషమైన ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలుసు. జ్యోతిష్య ప్రకారం.. ఆగస్టు 17న మధ్యాహ్నం 01:54 గంటలకు సూర్యుడితో పాటు చంద్రుల ప్రత్యేక మార్పుల కారణంగా అత్యంత ప్రభావవంతమైన వైధృతి యోగం (Vaidhriti Yog) ఏర్పడబోతోంది.
ఈ వైధృతి యోగం కారణంగా ముఖ్యంగా నాలుగు రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయి.. ఇన్నాళ్లూ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆటంకాలు తొలగిపోయి అదృష్టం తలుపు తట్టనుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు..
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇతరులకు ఇచ్చిన అప్పులు.. మొండి బాకీలు ఊహించని విధంగా తిరిగి చేతికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు. పని ప్రదేశంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలంతో పాటు గుర్తింపు కూడా ఊహించని స్థాయిలో లభిస్తుంది. జీవితంలో ఉన్న ప్రతికూలతలు, ఆటంకాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది.
మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ వైధృతి యోగం నూతన అవకాశాలను అందిస్తుంది. ఇన్నాళ్లుగా వెంటాడుతున్న ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పురోగతి కూడా ఊహించని స్థాయిలో లభిస్తుంది.. నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ వేగం పుంజుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడమే కాకుండా.. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి చాలా కాలంగా అగిపోయిన పనులు తిరిగి తప్పకుండా పూర్తవుతాయి.. వైధృతి యోగం ప్రభావంతో ధనలాభం కలిగి.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కూడా సులభంగా లభిస్తుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
సింహ రాశి (Leo)
సింహ రాశి జాతకులకు ఆర్థిక పరంగా తిరుగులేని పురోగతి కూడా లభిస్తుంది.. రాబడి పెరిగేందుకు కొత్త మార్గాలు సుగమం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు జీతాల పెంపు లేదా ప్రమోషన్ పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత, కుటుంబ జీవితంలో ఉన్న వివాదాలు కూడా సులభంగా తొలగిపోతాయి.. అనవసర ఒత్తిడికి స్వస్తి చెప్పి సంతోషంగా ముందుకు సాగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
కుటుంబం కోసం.. నాగుపామును చంపి, ప్రాణాలు వదిలిన కుక్క!
Hyderabad, Telangana:Venomous Cobra VS Dog Viral Video: మనుషుల్లో విశ్వాసం తగ్గుతున్న ఈ రోజుల్లో.. కుక్కలు మనుషుల కంటే ఎంత మంచివి అని నిరూపించే హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో వెలుగుచూసింది. తాము పెంచుకున్న పెంపుడు కుక్క.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుటుంబంపైకి ఒక భయంకరమైన విషనాగు దూసుకొస్తుండగా.. ప్రాణాలకు సైతం వెనుకాడకుండా పోరాడి ఆ పామును అంతమొందించింది. అయితే, దురదృష్టవశాత్తూ ఆ పోరాటంలో విషపూరితమైన పాము కాటుకు గురై ఆ కుక్క కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా పరిధిలోని ఒక గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. యజమాని కుటుంబ సభ్యులు ఇంట్లో తమ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో.. ఒక భారీ అత్యంత విషపూరితమైన నాగుపాము ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. ఇంట్లోని వారిపై దాడి చేసేందుకు అది వేగంగా ముందుకు వస్తున్న సమయంలో ఇంటి ముందు కాపలాగా ఉన్న పెంపుడు కుక్క దానిని గమనించింది.
అపాయాన్ని ముందే పసిగట్టిన ఆ కుక్క.. కుటుంబ సభ్యులకు ఏమాత్రం హాని కలగకుండా పామును అడ్డుకుంది. ఎంతమాత్రం వెనకడుగు వేయకుండా నాగుపాముతో భీకర పోరాటానికి దిగింది.. పాము దానిపైకి దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. తన ప్రాణాలను లెక్కచేయకుండా పామును గట్టిగా పట్టుకుని కొరికి చంపేసింది.
ఈ భీకర పోరాటంలో పాము చనిపోయినప్పటికీ.. అంతకంటే ముందే అది పెంపుడు కుక్కను పలుమార్లు కాటేసింది.. పాము విషం ఒళ్లంతా వ్యాపించడంతో ఆ కుక్క తీవ్ర అనారోగ్య సమస్యకు గురైంది. పాముపై దాడి చేసిన చంపిన కొద్దిసేపటికే అది యజమాని కళ్లముందే కుప్పకూలి కన్నుమూసింది. తన శ్వాస విడిచే వరకు కుటుంబాన్ని రక్షించాలనే తపనతో పోరాడిన ఆ పెంపుడు కుక్క విశ్వాసాన్ని చూసి యజమాని కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కుక్క కంటే నమ్మకమైన మిత్రుడు ఈ లోకంలో మరొకరు ఉండరని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. తన ప్రాణాలను త్యాగం చేసి యజమాని కుటుంబాన్ని కాపాడిన ఆ మూగజీవి త్యాగానికి ప్రతి ఒక్కరూ జోహార్లు చెబుతున్నారు..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం.. చిన్న కుమారుడు అబాన్ మృతి!
Hyderabad, Telangana:Atiq Ahmad Son Telugu News: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో మాఫియా డాన్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ (21) ప్రాణాలు కోల్పోయారు. ఝాన్సీ-కాన్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అబాన్‌తో పాటు ఆయన స్నేహితుడు సోనూ కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కార్లో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్ నుంచి ఝాన్సీ వైపు హ్యుందాయ్ క్రెటా వాహనంలో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఝాన్సీ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను పరామర్శించడానికి అబాన్ అహ్మద్ తన మిత్రులతో కలిసి వెళ్తుండగా పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవేపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
అతివేగమే ప్రమాదానికి కారణం?
వాహనం రోడ్డుపై చాలా వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో.. అకస్మాత్తుగా ఒక జంతువు రహదారిపైకి వచ్చింది. దానిని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. కారు అత్యంత వేగంతో వెళ్లి సెంట్రల్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పూంచ్ పోలీసులు క్షతగాత్రులను బయటకు తీసి.. చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర గాయాలైన అబాన్ అహ్మద్, సోనూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గాయపడిన ఇతర ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
గతంలో అతీక్ అహ్మద్ మరొక కుమారుడు అసద్ అహ్మద్ ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
విమానాశ్రయంలో 10 అడుగుల కొండచిలువ.. ఎలా పట్టుకున్నారో చూడండి..
Hyderabad, Telangana:10-foot Python Viral Video Watch: మహారాష్ట్రలోని అమరావతి బేలోరా విమానాశ్రయ (Amravati Belora Airport) ప్రాంగణంలో రాత్రి ఓ పాము తీవ్ర కలకలం రేపింది. రాత్రి సమయంలో సుమారు 10 అడుగులు కలిగిన భారీ కొండచిలువ ఎయిర్పోర్ట్ కాంపౌండ్‌లో ప్రత్యక్షమవ్వడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ భారీ కొండచిలువ తిరుగుతున్నట్లు సమాచారం ఉంది. అయితే, రాత్రి సమయంలో కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే, దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళవారం ఆలస్యంగా రాత్రి వేళ విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటిలాగే కాంపౌండ్ దగ్గర గస్తీ కాస్తున్నారు. ఆ సమయంలో నేలపై నెమ్మదిగా పాకుతున్న భారీ కొండచిలువ వారి కంటపడింది. ఎంతో భద్రత కలిగిన ఎయిర్పోర్ట్ ప్రాంతంలో అంత పెద్ద పామును చూసిన సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక వైల్డ్‌లైఫ్ రెస్క్యూవర్లతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే నిపుణులైన స్నేక్ క్యాచర్స్ బృందం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ 10 అడుగుల కొండచిలువను పట్టుకుని సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఈ ఆపరేషన్ చూసేందుకు ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటు స్థానికులు ఆసక్తితో పాటు ఫోన్లలో సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే, రెస్క్యూ టీమ్ వెంటనే వారిని సురక్షిత దూరంలో ఉండాలని హెచ్చరించింది.
*Belora airport Amravati Maharashtra pic.twitter.com/vSlZyhFeHD
— Modi bhakt (@0424f57afce940b) August 5, 2026
పట్టుబడిన కొండచిలువ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం, స్నేక్ క్యాచర్స్ దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మానవ నివాసాలకు దూరంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో దానిని క్షేమంగా విడిచిపెట్టనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, స్నేక్స్ క్యాచర్స్ పట్టుకుంటున్న సమయంలో తీసిన వీడియోలు కొంతమంది సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడంతో.. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మహబూబాబాద్ Govt ఆస్పత్రిలో ఘోరం.. 4 ఏళ్ల చిన్నారికి ఎక్స్పైరీ మందులు!
Hyderabad, Telangana:Mahabubabad Latest News: ప్రాణాలు నిలపాల్సిన ఆస్పత్రులే.. నిర్లక్ష్యానికి నిలయాలుగా మారుతున్నాయి. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన్నట్లుగా తయారైంది ప్రభుత్వ ఆస్పత్రుల తీరు.. చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడుతూ.. గడువు ముగిసిన మందులను పంపిణీ చేసిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన మురళీ.. తన 4 సంవత్సరాల కుమారుడు రాజ్ తీవ్ర వాంతులు, విరోచనాలతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం స్థానిక మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. OP విభాగంలో బాబును పరీక్షించిన వైద్యులు రెండు రకాల సిరప్‌లను ప్రిస్క్రిప్షన్‌లో రాశారు. అందులో ఒక సిరప్‌ను ఆసుపత్రిలోని ఫార్మసీలోనే ఇచ్చి.. మరొకటి బయట మెడికల్ షాప్‌లో కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రెండు టానిక్‌లు వాడితే ఉపశమనం లభిస్తుందని.. ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని చెప్పి పంపించివేశారు.
వైద్యుల సూచన మేరకు మరో సిరప్‌ను బయట మెడికల్ షాప్‌లో కొనుగోలు చేసిన మురళీ ఇంటికి వెళ్లాడు. బాబుకు మందు పోసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అనుమానం వచ్చి.. ఆస్పత్రిలో ఇచ్చిన సిరప్ బాటిల్‌ను పరిశీలించాడు. దాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.. ఆ మందు ఎక్స్పైరీ డేట్ గతేడాది జూన్ 2026 సంవత్సరానికే ముగిసిపోయింది. ఏమాత్రం గమనించకుండా ఆ మందును బాబుకు తాగించి.. ఉంటే పరిస్థితి అత్యంత విషమంగా మారేది.
విషయం తెలుసుకున్న వెంటనే మురళీ.. ఆయన బంధువులు ఆస్పత్రికి చేరుకుని సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీశారు. అయితే, మొదటిగా తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించిన ఆస్పత్రి సిబ్బంది.. మేము ఈ మందు ఇవ్వలేదు అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితులకు, సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బాధితులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయిన బాధితులను తిరిగి పిలిపించారు.. ఆస్పత్రి ఫార్మసీ సిబ్బంది పొరపాటున.. గమనించకుండా గడువు ముగిసిన సిరప్‌ను ఇచ్చారని అంగీకరిస్తూ.. అధికారికంగా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు ప్రశాంతంగా ఇంటికి వెళ్లిపోయారు..
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8,580mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Redmi K100 సిరీస్ లాంచ్.. గేమింగ్ లవర్స్‌కి పండగే!
Hyderabad, Telangana:Redmi K100 Series Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి సబ్-బ్రాండ్ రెడ్మి మార్కెట్లోకి మరో సరికొత్త సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెడ్మి K100 పేరుతో అందుబాటులోకి రాబోతున్న Redmi K100 Proతో పాటు Redmi K100 Pro Max అనే రెండు పవర్ఫుల్ మోడళ్లు విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. చైనా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో (Weibo) ద్వారా కంపెనీ ఈ ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా వెల్లడించింది. వీటిని ఆగస్టు 11న ఈ సిరీస్ చైనా మార్కెట్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సిద్ధమైంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే ప్రధాన ఫీచర్ దీని బ్యాటరీగా భావించవచ్చు. Redmi K100 Pro మోడల్లో ఏకంగా 8,580mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 26 శాతం సిలికాన్ మెటీరియల్ వాడటం వల్ల బ్యాటరీ సైజ్ పెరగకుండానే ఎక్కువ రోజూ పనిచేస్తుందని సమాచారం.. ఇక ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 50W వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, 22.5W వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం..
గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు తెలుస్తోంది.. ఇందులో కస్టమ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 V ప్రాసెసర్‌తో పాటు ప్రత్యేకమైన AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. AnTuTu బెంచ్‌మార్క్ పరీక్షలో ఈ ఫోన్ ఏకంగా 40,95,000 కంటే ఎక్కువ స్కోర్ సాధించి రికార్డు సృష్టించింది. ఫోన్ వేడెక్కకుండా 3D సర్క్యులేటింగ్ కోల్డ్ పంప్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉండడం విశేషం..
ఇక దీనికి సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళితే.. ఇది 6.59-అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంటుంది. ఇది 185Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 4,800Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో లభిస్తోంది.. ఇది గరిష్టంగా 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ఫ్లాట్ ప్యానెల్, అద్భుతమైఊన కెమెరా మాడ్యూల్‌ను కూడా అందించారు. వెనకాలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ప్రత్యేకంగా అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం కెమెరా ఐలాండ్‌పై Sound by Bose బ్రాండింగ్‌ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్పెషిఫికేషన్స్..
ఈ సిరీస్‌లోని టాప్ మోడల్ అయిన K100 Pro Max స్మార్ట్‌ఫోన్‌లో 6.9-అంగుళాల భారీ OLED డిస్ప్లేను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అలాగే 200MP కెమెరాతో పాటు మైండ్ బ్లోయింగ్ 9,000 mAh బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనాలో ఈ స్మార్ట్ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మహిళపై కొండచిలువ దాడి.. పామును చంపి ఆస్పత్రికి తీసుకొచ్చిన బంధువులు!
Hyderabad, Telangana:12ft Python Attacks: జనగామ జిల్లా కంచనపల్లి గ్రామంలో గురువారం ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో ఓ మహిళపై భారీ కొండచిలువ ఒక్కసారిగా దాడి చేయడంతో స్థానికులు, గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కంచనపల్లి గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ గురువారం ఉదయం తమ మొక్కజొన్న, వరి పొలం పనులకు వెళ్లింది.. పైరు మధ్యలో పని చేసుకుంటుండగా.. అక్కడ ఉన్న సుమారు 12 అడుగుల భారీ కొండచిలువ ఒక్కసారిగా స్వప్నపై దాడి చేసింది. ఆమె కాళ్లను చుట్టుముట్టి ఆహారంగా మలుచుకునేందుకు ప్రయత్నించింది. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన స్వప్న గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది..
ఆమె కేకలు విన్న సమీప రైతులతో పాటు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి పరుగులు తీసిన్నట్లు సమాచారం. స్వప్న ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తీవ్రంగా పోరాడి స్వప్నను కొండచిలువ పట్టు నుంచి విడిపించారు. అనంతరం ఆ భారీ కొండచిలువ ఎవరికైనా ప్రమాదం చేసే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో దానిని అక్కడే కొట్టి చంపిన్నట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన స్వప్నను కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విచిత్రంగా, ఎంత పెద్ద పాము దాడి చేసిందో వైద్యులకు చూపించడానికి, ఘటన తీవ్రతను వివరించడానికి వారు చనిపోయిన 12 అడుగుల కొండచిలువను కూడా ఆటోలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆ భారీ కొండచిలువను చూసిన రోగులతో పాటు, బంధువులు ఒక్కసారిగా భయాందోళనకు గురైన్నట్లు తెలుస్తోంది.
జనగామ ఏరియా ఆసుపత్రి వైద్యులు స్వప్నకి తక్షణమే అత్యవసర చికిత్స అందిచిన్నట్లు తెలుస్తోంది.. కొండచిలువ విషపూరితమైనది కాకపోయినప్పటికీ.. దాని దాడి వల్ల స్వప్నకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని.. ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
