icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

EPFO 3.0 Update: ఉద్యోగులకు ఊరట! ఏటీఎం నుంచి PF డబ్బులు విత్‌డ్రా..తాజాగా అప్‌డేట్ ఇదే..

Hyderabad, Telangana:

EPFO 3.0 Withdrawal Update: పీఎఫ్ (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించబోతోంది. ఇకపై మీ పీఎఫ్ డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. అత్యవసర సమయాల్లో నేరుగా ATM నుండి నగదు విత్ డ్రా చేసుకోవడం లేదా UPI ద్వారా డబ్బులు పొందడం ద్వారా సరికొత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది.

ప్రస్తుత పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం ఈపీఎఫ్ఓ ​​3.0ను తీసుకువస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం సేవలను వేగవంతం చేయడం. 2026 మే నెలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్లు రోజుల వ్యవధిలోనే పూర్తి కానున్నాయి.

ATM, UPI ద్వారా విత్‌డ్రా ఎలా?
పీఎఫ్ సభ్యుల కోసం EPFO ​​ప్రత్యేక కార్డులను జారీ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ఏటీఎం మెషిన్ల నుండి నేరుగా నగదు తీసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి UPI యాప్‌లను ఉపయోగించి కూడా పీఎఫ్ డబ్బును నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి పొందే సౌలభ్యం కలుగుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు ఈ పద్ధతిలో విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది.

కావాల్సిన అర్హతలు ఇవే..
ఈ డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలంటే సభ్యులకు కిందివి తప్పనిసరి. యాక్టివ్‌గా ఉన్న UAN (యూనివర్సల్ ఖాతా సంఖ్య).. UANతో లింక్ అయిన ఆధార్ కార్డు, పాన్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు.. అలాగే సరైన IFSC కోడ్ అప్‌డేట్ అయి ఉండాలి.

కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించిన ప్రకారం.. EPFO ​​వ్యవస్థలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 60.1 మిలియన్ క్లెయిమ్‌ల పరిష్కారంకాగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 83.1 మిలియన్ క్లెయిమ్‌లను పరిష్కరించారు.

పూర్తి పీఎఫ్ విత్‌డ్రా ఎప్పుడు?
సాధారణంగా 55 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తి పీఎఫ్ తీసుకోవచ్చు. అయితే శాశ్వత వైకల్యం, విదేశాలకు వలస వెళ్లడం లేదా ఉద్యోగం కోల్పోయిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూర్తి చేసి ఉపసంహరించుకోవచ్చు. ATM/UPI సేవలపై అధికారిక మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈ సేవలు అమల్లోకి వస్తే లక్షలాది మంది ఉద్యోగులకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. పీఎఫ్ డబ్బులు మీ జేబులో ఉన్నట్టే!

Also Read: 5వ తరగతి చదివి ఇండస్ట్రీనే షేక్ చేసిన నటి..కోట్ల రూపాయలు సంపాదిస్తుంది!

Also Read: బ్రహ్మంగారు చేసిన అద్భుతం! నరికిన చెట్టు తెల్లవారే సరికి లేచి నిల్చుంది..ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

West Bengal Next CM: బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి..డిప్యూటీ సీఎం పదవి ఆ ఇద్దరికే!

Chhotobainan, West Bengal:

West Bengal Next CM Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ఆరంభం కానుంది. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు స్వస్తి పలికి, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన భారతీయ జనతా పార్టీ (BJP) ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు దాదాపు ఖరారు కాగా, పాలనా సౌలభ్యం కోసం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

బెంగాల్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారిని శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకోనున్నారు. ఈ సాయంత్రం జరిగే ఎమ్మెల్యేల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఆయన పేరును ప్రతిపాదించారు.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బెంగాల్‌ పీఠంపై ఉప ముఖ్యమంత్రులు కొలువుదీరబోతున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ పదవులను భర్తీ చేయనున్నారు. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి విజయం సాధించిన అగ్నిమిత్ర పాల్ రేసులో ముందంజలో ఉన్నారు. ఆమె ఎంపికైతే బెంగాల్‌కు తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిస్తారు. ఉత్తర బెంగాల్ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌ను రెండో ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది.

ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీరిద్దరితో విడివిడిగా సమావేశమై చర్చలు జరపడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. రేపు కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. చారిత్రక విజయం తర్వాత భారీ జనసందోహం మధ్య ఈ వేడుకను నిర్వహించడం ద్వారా బీజేపీ తన రాజకీయ బలాన్ని చాటాలని భావిస్తోంది.

జ్యోతి బసు హయాంలో బుద్ధదేబ్ భట్టాచార్జీ చివరిసారిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈ పదవులను పునరుద్ధరిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రేపటితో బెంగాల్ క్యాబినెట్ కూర్పుపై పూర్తి స్పష్టత రానుంది.

Also Read: 5వ తరగతి చదివి ఇండస్ట్రీనే షేక్ చేసిన నటి..కోట్ల రూపాయలు సంపాదిస్తుంది!

Also Read; బాలయ్యపై మనసు పారేసుకున్న బాలీవుడ్ బ్యూటీ..'ఆయన వయసుతో పనేముంది' అంటున్న హీరోయిన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. హైదరాబాద్ ప్రజలకు పోలీస్‌ కమిషనర్‌ కీలక సూచన

Hyderabad, Telangana:

Former DGP Wife Killed Case: హైదరాబాద్‌ ప్రజలకు పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కీలక విజ్ఞప్తి చేశారు. ఇంట్లో పనివారు.. పనుల్లో సహాయకులుగా నియమించుకునే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనివాళ్లను ఎంచుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా నేపాలీ వారిని పనుల్లోకి తీసుకోరాదని పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో దారుణ హత్య చోటుచేసుకోవడంతో నేపాలీలను దూరం ఉంచాలని కీలక ప్రకటన చేశారు.

Also Read: Former DGP Wife: మాజీ డీజీపీ భార్య దారుణ హత్య.. డబ్బు, నగలతో నేపాల్‌ గ్యాంగ్‌ పరార్

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నివసించే ప్రాంతంలో మాజీ డీజీపీ భార్య దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సజ్జనార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేపాల్‌ దేశస్తులతో జాగ్రత్త. నేపాలి పని వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడతారు' అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హెచ్చరించారు.

Also Read: LSG vs RCB: హ్యాట్రిక్‌ ఓటముల నుంచి లక్నోకు ఊరట.. కీలక మ్యాచ్‌లో బెంగళూరు బోల్తా

'రాత్రి మాజీ డీజీపీ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పని చేసే కల్పన మరికొందరితో కలిసి ఈ నేరం చేసింది. ఘటన సమయంలో పిల్లలు ఇద్దరుపైన ఉన్నారు. తనుజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారు. ఇంట్లో ఉన్న కల్పనతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితులను అతి త్వరలో చ్చితంగా పట్టుకుంటాం' అని పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందరాదని.. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.

'నేపాలి మనుషులు ఇంట్లో సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసినా కూడా వారిపై నిఘా ఉండాలి. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసింది. ఎంత బంగారం నగదు పోయింది అనే అంశాలపై ఆరా తీస్తున్నాం. నిందితులు వెనుక గేట్ నుండి ఇంట్లోకి ప్రవేశించారు. క్రైమ్ అనంతరం వెనక నుంచి పారిపోయారు' అని పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

AP ECET 2026: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. 91.72 శాతం ఉత్తీర్ణత, మీ ర్యాంక్ కార్డ్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! కౌన్సెలింగ్‌ ఎప్పుడంటే?

Hyderabad, Telangana:

AP ECET 2026 Results: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET) 2026 సంబంధించి పరీక్ష ఫలితాలను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ స్కోర్ కార్డును అధికారిక వెబ్సైట్‌ నుంచి వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక డేటా ప్రకారం మొత్తంగా 91.72 శాతం మంది ఈ ప్రవేశ పరీక్షలో పాస్ అయ్యారు. ఈ ఏడాది ఏపీ ఈసెట్‌కు 33,751 అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా.. ఇందులో 32,434 మంది పరీక్ష రాశారు. అందులో 29,750 మంది క్వాలిఫై అయ్యారు.

 ఆంధ్రప్రదేశ్ ఈసెట్‌ 2026 పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ రెండు సెషన్‌లు, 14 స్ట్రీమ్స్ లో పరీక్ష నిర్వహించారు. ప్రధానంగా డిప్లొమా, బ్యాచిలర్ సైన్స్‌  పట్టాదారులకు ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంజినీరింగ్, ఫార్మసీ డిగ్రీ కోర్సుల్లో సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యే అవకాశం లభిస్తుంది.

ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
ఏపీ ఈసెట్‌ ఫలితాలు 2026 డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్
https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx ఓపెన్ చేసి అందులో 'ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు' లింకు పై క్లిక్ చేయాలి. అందులో మీ లాగిన్ క్రెడియన్షియల్ ఆధారంగా రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయండి. చివరిగా మీ వివరాలు సబ్‌మిట్ చేసిన తర్వాత స్కోర్ కార్డ్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.  ఇక అధికారిక డేటా ప్రకారం ఈ ఏడాది హజరు శాతం కూడా 96.09 నమోదయింది. ఇందులో అబ్బాయిలు 90.93%, అమ్మాయిలు 93.34% నమోదు చేశారు. ఏప్రిల్ 29న దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ కూడా విడుదల చేశారు. 

Also Read: నీట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. పరీక్షకు వెళ్లేముందు ఈ చెక్‌లిస్ట్ ఒకసారి చూసుకోండి!

Also Read: రేపు.. ఎల్లుండి తెలంగాణ ఈఏపీసెట్ ఎగ్జామ్స్‌, పరీక్ష రాయగానే మార్కుల డిస్‌ప్లే! 

ఏపీ ఈసెట్ ఫలితాలు అర్హత సాధించిన అభ్యర్థులకు వెంటనే జూన్ 2026లో కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా నిర్వహిస్తారు. క్వాలిఫై అయిన అభ్యర్థులకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ ఇయర్ బీటెక్ లేదా బీఫార్మసీలో అడ్మిషన్ అందిస్తారు. ఇది లెటరట్‌ ఎంట్రీ స్కీమ్ అని కూడా పిలుస్తారు. విద్యార్థులు దీనికి ముందుగానే తమ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఇందులో ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, డిప్లొమా సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం కూడా వెరిఫికేషన్ ప్రక్రియకు ఎంతో ముఖ్యం.ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డు రెండు మూడు డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది.  ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అతి త్వరలోనే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకి సంబంధించిన షెడ్యూల్ కూడా అధికారిక వెబ్సైట్లో పొందుపరచనుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Former DGP Wife: మాజీ డీజీపీ భార్య దారుణ హత్య.. డబ్బు, బంగారంతో నేపాల్‌ గ్యాంగ్‌ పరార్‌

Hyderabad, Telangana:

Tanaja Ranjan Killed By Lady Servant: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయి. సాధారణ ప్రాంతాలే కాకుండా అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్‌లో కూడా భద్రత గాల్లో ఉందని చెప్పడానికి తాజాగా మాజీ డీజీపీ సతీమణి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నివసించే ప్రాంతంలో పని మనుషులు దారుణానికి ఒడిగట్టారు. బంగారం, డబ్బు కోసం మాజీ డీజీపీ భార్యను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ సంఘటనపై పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

Also Read: LSG vs RCB: హ్యాట్రిక్‌ ఓటముల నుంచి లక్నోకు ఊరట.. కీలక మ్యాచ్‌లో బెంగళూరు బోల్తా

హైదరాబాద్ నగరంలో అత్యంత ధనవంతులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు నివాసం ఉండే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో దారుణం జరిగింది. ప్రశాసన్ నగర్‌లో నివాసం ఉంటున్న మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనజ రే (55) శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యారు. ఆమె ఇంట్లో నమ్మకంగా దాదాపు ఏడాదికాలంగా నేపాల్ దేశానికి చెందిన పని మనిషి కల్పన పని చేస్తోంది. మే 8వ తేదీ ఉదయం తనజ రే హత్యకు గురయిన విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌కు ఏడాది.. ఉదయం 1.05 గంటలకు ఏం జరిగిందో తెలుసా?

ప్రశాసన్ నగర్‌లోని ఐఏఎస్ క్వార్టర్ట్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఏదో పని మీద బెంగళూరుకు వినయ్‌ రంజన్‌ వెళ్లగా భార్య తనజ ఇంట్లో ఉంఇ. కొన్నాళ్లుగా ఎంతో నమ్మకంగా పని చేసిన కల్పన అదును చూసి ఈ ఘోరానికి పాల్పడింది. ఈ హత్యలో పని మనిషి కల్పనతోపాటు ఇంకెవరైనా ఉన్నారా..? నేపాల్ గ్యాంగ్ ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితురాలు కల్పన కోసం పోలీసులు  గాలింపు చర్యలు ముమ్మరం చేశారు . సంపన్నులు.. ఉన్నతాధికారులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో.. ఓ రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి ఇంట్లో ఈ ఘోరం జరగటం సంచలనంగా మారింది.

నేపాల్‌ దేశస్తులతో జాగ్రత్త
'రిటైర్డ్ డిజిపి భార్య తనూజ హత్యకు గురయ్యారు. మాజీ డీజీపీ భార్య తనూజాను రాత్రి రెండు గంటలకు దుండగులు హత్య చేశారు. నేపాలి గ్యాంగ్ పనిగా ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చాం. కొన్ని క్లూస్ లభించాయి ఆ క్లూస్ ఆధారంగా వర్కౌట్ చేస్తున్నాం. నేపాలి పని వారి పట్ల  అందరూ అప్రమత్తంగా ఉండాలి. నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడతారు' అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సూచించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Jagtial: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..

Hyderabad, Telangana:

Jagtial Farmers Protest Telugu News: 20 రోజులుగా మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నాం సారు.. అకాల వర్షంతో పంట తడిసిపోతోంది.. అప్పుల వాళ్ళ ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది.. దయచేసి మా మొక్కలను కోనేలా చూడండి.. అంటూ ఓ రైతు జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్ కాళ్లు నొక్కి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు నిలిచిపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

గత మూడు వారాలుగా జగిత్యాల మార్కెట్‌కు రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను తీసుకువచ్చారు. అయితే కొనుగోలు ప్రక్రియ బంధకోడిగా సాగుతూ ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి ముద్దవుతుందని.. నాణ్యత తగ్గిపోతే మద్దతు ధర రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము రాత్రింబగళ్లు మార్కెట్లోనే ఉండాల్సి వస్తోందని రైతులు ఈ సందర్భంగా కన్నీరు మున్నీరయ్యారు..

నిరసన నేపథ్యంలో ట్రాఫిక్ స్తంభించి పోవడంతో టౌన్ CI కరుణాకర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక రైతు బాగోదేగానికి గురై.. అందరూ చూస్తుండగానే సిఐ కాళ్లపై పడ్డాడు.. సారు 20 రోజులుగా ఇక్కడే పడుకుంటున్నాం.. తిండి సరిగ్గా లేదు.. నిద్ర అసలు లేదు.. మా సమస్య వినేవారు అస్సలు లేరు.. మీరు చొరవ తీసుకొని మొక్కలు కొనేలా చేయండి అని వేడుకోవడం అక్కడున్న వారి అందరిని కలచివేసింది..

Also Read: పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా.. వేములవాడ BRS భారీ ధర్నా!

రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.. పోలీసులు రైతులతో చర్చలు జరిపి.. సంబంధిత అధికారులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు పోరాడుతామని రైతులు ఈ సందర్భంగా హెచ్చరించారు. వెంటనే మొక్కలు కొనుగోలు చేయడమే కాకుండా పూర్తిస్థాయిలో కేంద్రాలను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తేమశాతం సాకుతో రైతులకు ధరలో కోత విధించకూడదని.. మద్దతు ధర తక్కువ కాకుండా వ్యాపారులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.

Also Read: పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా.. వేములవాడ BRS భారీ ధర్నా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Marella Village Tree: బ్రహ్మంగారు చేసిన అద్భుతం! నరికిన చెట్టు తెల్లవారే సరికి లేచి నిల్చుంది..ఎక్కడంటే?

Marella, Andhra Pradesh:

Marella Village Tree Miracle: ప్రకాశం జిల్లాలో ఒక అపూర్వమైన ఘట్టం జరిగింది. నరికివేసి, వేళ్లతో సహా పెకిలించి పక్కన పడేసిన రావిచెట్టు.. రాత్రికి రాత్రే తిరిగి నిలబడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది ప్రకృతి వింతానా లేక ఆ బ్రహ్మంగారి మహిమ భక్తులు వేల సంఖ్యలో మారెళ్ల గ్రామానికి తరలిస్తున్నారు.

వైరల్‌గా మారిన ఫొటోలు ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలో ఇటీవల శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మే 1న జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా హోమ కార్యక్రమాలకు రావి కలప అవసరమైంది. దీనికోసం సమీపంలోని ఒక రైతు పొలంలో ఉన్న పాత రావిచెట్టు కొమ్మలను గ్రామస్థులు నరికారు. కేవలం మోడు మాత్రమే మిగలడంతో, దాన్ని కూడా వేళ్లతో సహా పెకిలించి పక్కన పడేశారు.

రాత్రికి రాత్రే అద్భుతం
వేళ్లతో సహా నేలకొరిగిన ఆ చెట్టు, మరుసటి రోజు ఉదయానికి ఏ మనుషుల సాయం లేకుండానే యథావిధిగా నిటారుగా నిలబడటం చూసి గ్రామస్థులు విస్తుపోయారు. ఆలయ ప్రతిష్ఠ సమయంలోనే ఈ ఘటన జరగడంతో ఇది ముమ్మాటికీ వీరబ్రహ్మేంద్ర స్వామి మహిమని భక్తులు నమ్ముతున్నారు.

ఈ వార్త తెలియగానే మహిళలు మంగళవాయిద్యాల మధ్య 101 బిందెల నీటితో ఊరేగింపుగా తరలివచ్చారు. ఆ రావిచెట్టుకు జలాభిషేకం చేసి, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు.

సాధారణంగా భారీ వృక్షాలు నేలకూలితే తిరిగి నిలబడటం అసాధ్యమని, అది కూడా వేళ్లు బయటపడిన తర్వాత ఇలా జరగడం అద్భుతమని స్థానికులు చెబుతున్నారు. సైన్స్ పరంగా చెట్టులోని గురుత్వాకర్షణ బలం లేదా వేర్ల స్థితిస్థాపకత వంటి కారణాల వల్ల అయ్యిండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మారెళ్ల గ్రామం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. నరికినా ప్రాణం పోసుకున్న ఆ 'మహిమ' గల రావిచెట్టును చూసేందుకు జనసందోహం పోటెత్తుతోంది.

Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ప్రశాంత్ నీల్ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్..

Also Read: విజయ్ టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? రాజ్యాంగం ఏంచెప్తుంది

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Telangana: జైళ్ల సంస్కరణల్లో తెలంగాణ నంబర్ 1.. దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన మన రాష్ట్రం..!!

BBhoomi8h ago
Secunderabad, Telangana:

Telangana: 2024 సంవత్సరానికి సంబంధించిన ఎన్‌సిఆర్‌బి జైలు గణాంకాలు, జైలు సంస్కరణలు, ఖైదీల పునరావాసం,  జైలు పరిశ్రమ అభివృద్ధిలో తెలంగాణను అగ్రశ్రేణి పనితీరు కనబరిచిన రాష్ట్రాల సరసన నిలిపాయి. దిద్దుబాటు పరిపాలనకు సంబంధించిన అనేక జాతీయ విభాగాలలో రాష్ట్రం కనబరిచిన బలమైన పనితీరును ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం..  జైలు ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాలలో తెలంగాణ భారతదేశంలో మూడవ స్థానాన్ని పొందింది. 2024లో ఈ రాష్ట్రం రూ. 43.65 కోట్ల విలువైన జైలు ఉత్పత్తుల అమ్మకాలను నమోదు చేసి, కేరళ.. తమిళనాడుల తర్వాతి స్థానంలో నిలిచింది.

తెలంగాణలోని జైలు పరిశ్రమలు ఏళ్లుగా గణనీయంగా విస్తరించాయని.. ఇవి ఖైదీలకు వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవడానికి, విడుదలయ్యాక పునరావాస అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి ఖైదీకి రూ. 64,356 ఉత్పత్తి అవుతూ..  సగటు ఉత్పత్తి విలువలో తెలంగాణ జాతీయంగా రెండవ స్థానంలో ఉందని కూడా ఆ నివేదిక పేర్కొంది.ఖైదీల విద్యా కార్యక్రమాలలో కూడా రాష్ట్రం అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఈ సంవత్సరంలో సుమారు 3,338 మంది ఖైదీలు ప్రాథమిక విద్యను అభ్యసించి, ఖైదీల విద్యా కార్యక్రమాలలో తెలంగాణ దేశంలో నాల్గవ స్థానంలో నిలిచింది. పునరావాస చర్యలలో, తెలంగాణ తమిళనాడు తర్వాత రెండవ స్థానాన్ని దక్కించుకుంది. శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలు సమాజంలో తిరిగి కలిసిపోయేందుకు సహాయపడే ప్రయత్నాలలో భాగంగా, అధికారులు 2024 సంవత్సరంలో 244 మంది ఖైదీలకు పునరావాస సహాయాన్ని అందించారు.

ఇక శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదలైన ఖైదీల సంఖ్యలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని ఎన్‌సిఆర్‌బి డేటా వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 9,956 మంది ఖైదీలు విడుదలయ్యారు. అదే సమయంలో, ఈ నివేదిక కొన్ని ఆందోళనకరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. నేరాన్ని వృత్తిగా స్వీకరించినట్లు నివేదించిన  శిక్షపడిన ఖైదీల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఈ శాతం 4.4 శాతంతో ఇది జాతీయంగా మూడవ స్థానంలో నిలిచింది.

Also Read: 22నిమిషాల్లో మునీర్ తుస్సుమన్నది.. రఫేల్‌, బ్రహ్మోస్‌ దెబ్బకు పాక్‌ సుస్సుపోసుకుంది

శిక్ష పడిన ఖైదీలలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారి శాతంలో తెలంగాణ రెండవ స్థానంలో ఉందని.. ఇక్కడ 71.8 శాతం మంది దోషులు జీవిత ఖైదు అనుభవిస్తున్నారని కూడా ఈ నివేదిక వెల్లడించింది. మహిళా జైళ్లలో, 107 మంది శిక్ష పడిన మహిళా ఖైదీలతో ఈ రాష్ట్రం జాతీయ స్థాయిలో నాల్గవ స్థానంలో నిలిచింది. కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, జైళ్లను విద్య,  సామాజిక పునరేకీకరణ కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో, తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి..  పునరావాస కార్యక్రమాలపై పెరుగుతున్న దృష్టిని ఈ తాజా ర్యాంకింగ్‌లు ప్రతిబింబిస్తున్నాయని అధికారులు,  జైలు సంస్కరణల నిపుణులు తెలిపారు.

Also Read: పసిడి ధరలు 20శాతం డౌన్.. నేడు మే 8వ తేదీ ధరలివే..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

0
0
Report

NTR Dragon Movie Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ప్రశాంత్ నీల్ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్..

Hyderabad, Telangana:

NTR Dragon Movie Glimpse: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్న గ్లింప్స్ కోసం చిత్ర బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ వీడియో గ్లింప్స్‌ను అనుకున్న టైమ్‌కు ఫ్యాన్స్‌కు అందించాలని టీమ్ ఎంతోగానో కృషి చేస్తోంది.

మ్యూజిక్‌పై రవి బస్రూర్ ఫోకస్
ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లకు సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతోనే రుజువైంది. ఇప్పుడు 'డ్రాగన్' గ్లింప్స్ కోసం ఆయన గత మూడు రోజులుగా ఏకధాటిగా వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, వినేటప్పుడు వెన్నులో వణుకు పుట్టించేలా ఒక పవర్‌ఫుల్ అండ్ యూనిక్ సౌండ్ ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిన్న గ్లింప్స్‌ను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన గత చిత్రాల టీజర్ల రికార్డులను తిరగరాసేలా దీనిని రూపొందించారట. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమా బ్యాక్ డ్రాప్‌ను పరిచయం చేస్తూనే ఎన్టీఆర్ లుక్‌ను వెరీ పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్‌‌ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో Jr.ఎన్టీఆర్ ప్రధానపాత్ర పోషిస్తుండగా.. రుక్మిణి వసంత హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే #Dragon అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌ను ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. 

Also Read: TVK Vijay Oath: సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై వీడని సందిగ్ధత..కుర్చీలాటలో గెలుపు ఎవరిది?

Also Read: విజయ్ టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? రాజ్యాంగం ఏంచెప్తుంది

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Giant Python Video: భారీ కొండచిలువపై పిల్లల సవారీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే! వీడియో..

Hyderabad, Telangana:

  Giant Python Viral Video Watch: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగులు తీస్తూ ఉంటారు. అలాంటిది తొమ్మిది గజాల భారీ కొండచిలువ కనిపిస్తే.. గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ కొందరు పిల్లలు మాత్రం ఆ రాకాసి కొండచిలువ పామును బొమ్మల భావించి.. దాని వీపుపై కూర్చుని ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ భయంకరమైన దృశ్యాలు చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో.. ఒక భారీ పరిమాణంలో ఉన్న కొండచిలువ జనాభాసాల మధ్య చాలా నిమ్మలంగా పాక్కుంటూ వెళ్తోంది.. అది ఎంతటి ప్రమాదమైనదో తెలియని చిన్నారులు.. దాన్ని ఒక ఆట వస్తువుగా భావించారు.. ఆ కొండచిలువపై ముగ్గురు నుంచి నలుగురు పిల్లలు ఒకరి వెనక ఒకరు కూర్చొని రైలు బండి ఆట ఆడుతున్నారు. ఆ పాము కదులుతుంటే.. తమ ప్రయాణం చేస్తున్నామన్న ఆనందం వారి ముఖాల్లో కనిపిస్తోంది.. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి.

ఆ కొండచిలువ తల ఎత్తితే ఒక దెబ్బకు మనిషిని మింగేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అది ఏ క్షణమైనా తిరగబడే అవకాశం ఉన్నప్పటికీ.. పిల్లలు ఏమాత్రం భయం లేకుండా దానితో ఆడుకోవడం చూస్తుంటే సోషల్ మీడియా వినియోగదారులు ఊపిరి దిగబట్టుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న పెద్దలు కూడా వారిని ఆపకుండా వీడియో తీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా అక్కడున్న ఒక పెద్దాయన ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ ఉండడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు..

 
 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది ధైర్యం కాదు.. నిర్లక్ష్యం.. ఒక్క సెకను తేడా జరిగిన ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.. అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారో స్పష్టంగా తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇది అన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఇది చూసిన మరి కొంతమంది వన్యప్రాణులతో ఇలాంటి ప్రయోగాలు ప్రాణాపాయమని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఆ భారీ కొండచిలువ పిల్లలకు ఎలాంటి హాని తల పెట్టకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

  

0
0
Report
Advertisement

Vemulawada: పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా.. వేములవాడ BRS భారీ ధర్నా!

Nampalli, Vemulawada, Telangana:

Brs Protest Vemulawada Telugu News: తెలంగాణ రాష్ట్రంలోని BRS నాయకుల పై వరసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ గులాబీ శ్రేణులు ప్రత్యేకమైన ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని టిఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.  ఇందులో భాగంగా రాష్ట్రంలో BRS నాయకులపై జరుగుతున్న దాడులను ఖండించారు.

వేములవాడలోని ప్రధాన కూడలి అయిన తెలంగాణ చౌకు వద్ద BRS ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి గుండాల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తెలంగాణ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం దాడి మాత్రమే కాదని ఆయనను చంపేందుకు జరిగిన కుట్ర అని నేతలు ఆరోపించారు..

ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడికి రక్షణ లేకపోతే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిజెపిలో కుమ్మక్కై బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ పై BRS  నేతలతో పాటు కార్యకర్తలు తీవ్ర విమర్శలు  చేశారు. కరీంనగర్ నడిబొడ్డున గంతో దొంగతనాలు జరుగుతున్న కేంద్రమంత్రి పట్టించుకోవడంలేదని.. పైగా రౌడి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ చర్చలు అభివృద్ధిపై జరగాలి తప్ప.. భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హెచ్చరించారు..

Also Read: BRS వర్సెస్ BJP.. కరీంనగర్‌లో భారీగా పోలీసుల మోహరింపు!
 
అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి వాహనంతో పాటు క్యాంపు కార్యాలయం పై జరిగిన దాడికి బాధ్యులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. BRS నాయకురాలు పావని గౌడ్ పై దాడికి ప్రయత్నించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని.. ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించడంలో వైఫల్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని  డిమాండ్ చేశారు.. శాంతియుత తెలంగాణలో హింసకు తావు లేదని.. దాడులు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వేములవాడ BRS శ్రేణులు హెచ్చరించారు.

Also Read: BRS వర్సెస్ BJP.. కరీంనగర్‌లో భారీగా పోలీసుల మోహరింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report

TVK MLA Resign: విజయ్ టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? భారత రాజ్యాంగం ఏం చెబుతోంది?

Nagalapuram, Tamil Nadu:

TVK MLA Resignation: తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక అపూర్వమైన రాజ్యాంగ సంక్షోభానికి తెరలేపాయి. నటుడు విజయ్‌ని తమిళగ వెట్రి కజగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడానికి, స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో TVK ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా హెచ్చరికలు, డీఎంకే-అన్నాడీఎంకే పొత్తు వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుత బలాలు - మ్యాజిక్ ఫిగర్ 
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాలు 234 ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన మ్యాజిక్ మార్క్ 118 స్థానాల్లో అధికారం చేయాల్సిన పార్టీ నెగ్గాల్సి ఉంది. అయితే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి 107 స్థానాల్లో గెలుపు వరించింది. కానీ, అధికారానికి మరో 11 సీట్ల మద్దతు కావాల్సి ఉంది. 

మరోవైవు డీఎంకే కూటమికి 73 సీట్లు రాగా.. అన్నాడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలుపొందింది. ఒకవేళ బద్ధశత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే కలిస్తే వారి బలం 126కి చేరుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇస్తున్న క్రమంలో కాంగ్రెస్‌కు దక్కిన 5 సీట్లను మినహాయిస్తే.. ఆ కూటమి మెజారిటీ 121కి చేరుతుంది. ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. విజయ్ TVK పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంది.

టీవీకే 'రాజీనామా' అస్త్రం..
గవర్నర్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే పరిణామాలు ఇలా ఉండవచ్చు. 107 మంది ఒకేసారి రాజీనామా చేస్తే, అసెంబ్లీలో సభ్యుల సంఖ్య భారీగా తగ్గుతుంది. ఇది సంక్షోభానికి (రాజ్యాంగ విచ్ఛిన్నం) దారి తీస్తుంది.

ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన)
ఏ పార్టీ కూడా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పక్షంలో, గవర్నర్ నివేదిక ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ టీవీకే పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే, సభను రద్దు చేసి ఆరు నెలల లోపు ఎన్నికలకు మళ్లీ వెళ్లడమే ఏకైక మార్గం. గతంలో కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. మెజారిటీని రాజ్‌భవన్‌లో కాకుండా అసెంబ్లీలోనే (ఫ్లోర్ టెస్ట్) నిరూపించుకోవాలి. కాబట్టి గవర్నర్ ముందుగా అతిపెద్ద పార్టీని ఆహ్వానించే అవకాశం ఉంటుంది. 

మరోవైపు డీఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్ అనూహ్యంగా విజయ్‌కు అవకాశం ఇచ్చే సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అదేవిధంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇది జరిగితే  టీవీకే సులభంగా మెజారిటీ సాధిస్తుంది. అలాగే కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు విజయ్‌కు మద్దతు తెలపడం TVK నైతిక బలాన్ని పెంచింది.

చివరిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రాజ్యాంగం ప్రకారం అతిపెద్ద పార్టీగా ఉన్న విజయ్ టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి, సభలో మెజారిటీ నిరూపించుకోమని కోరే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ తెరవెనుక రాజకీయాలతో డీఎంకే-అన్నాడీఎంకే జట్టు కడితే మాత్రం, తమిళనాడు మరోసారి మధ్యంతర ఎన్నికల దిశగా వెళ్లే ప్రమాదం ఉంది. 2026 మే నాటికి అందుతున్న సమాచారం ప్రకారం.. రాజీనామా హెచ్చరికలు కేవలం రాజకీయ ఒత్తిడి పెంచడానికే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతిమంగా ప్రజా తీర్పును గౌరవిస్తూ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు.

Also REad: TVK Vijay Oath: సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై వీడని సందిగ్ధత..కుర్చీలాటలో గెలుపు ఎవరిది?

Also Read: టీమ్ఇండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ తొలగింపు!! కొత్త కెప్టెన్ అతనే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Python Video: మెడలో కొండచిలువతో బైక్ రైడ్‌.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

Hyderabad, Telangana:

Python Bike Ride Viral Video Watch: నేటి కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చి యువతను ప్రమాదకరమైన దారుల వైపు నడిపిస్తూ వస్తోంది. లైకులతో పాటు షేర్ల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడడం లేదు.. తాజాగా ఒక యువకుడు చేసిన పని చూస్తే  ఎవరికైనా ఆశ్చర్యం కలగక తప్పదు.. అత్యంత ప్రమాదకరమైన కొండచిలువ ను మోడలో వేసుకొని.. దర్జాగా బైక్ నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి..

సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తే.. ఈరోజుల్లో ఒక యువకుడు మాత్రం ఏకంగా ఒక కొండచిలువ పిల్లను తన మెడలో ఒక గొలుసులాగా వేసుకున్నాడు. అలా వేసుకోవడమే కాకుండా రద్దీగా ఉన్న రహదారిపై మోటార్ సైకిల్ ను వేగంగా నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆ పాము అతని మెడ చుట్టూ కదులుతున్న.. ఏమాత్రం భయం లేకుండా స్వేచ్ఛగా బైకు నడపడం చూసి అటు వెళ్తున్న ప్రయాణికులు సైతం షాక్ అయిపోవడం మీరు చూడొచ్చు..

అదే సమయంలో కారులో వెళుతున్న కొందరు వ్యక్తులు ఈ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే తమ స్మార్ట్‌ఫోన్స్‌ను తీసి ఆ యువకుడి సాహసాన్ని వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దీ సేపటికే వైరల్ అవ్వడం ప్రారంభమైంది. అంతేకాకుండా లక్షలాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది. పోస్ట్ చేసిన కొద్ది రోజులకు ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

 
 
 
 
 
 

ఇది సాహసం కాదు.. ఆత్మహత్యతో సమానం.. ఒకవేళ ఆ పాము ఒక్కసారిగా బిగిస్తే పరిస్థితి ఏంటి? అని ఒకరు కామెంట్ చేయగా.. ఇలాంటి వారి వల్ల రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమే అని మరికొందరు మండిపడుతున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కొండచిలువలను పట్టుకోవడంతోపాటు వాటిని వేధించడం, ప్రదర్శించడం కూడా చాలా నేరం.. అడవిలో ఉండాల్సిన మూగజీవాలను ఇలా రోడ్లపైకి తీసుకురావడం అటు పాముకు.. ఇటు ప్రజలకు ప్రమాదకరమని జంతువు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ వీడియోను ఆధారంగా తీసుకొని సదరు యువకుడి పై కేసు నమోదు చేయాలని సోషల్ మీడియా వినియోగదారులు సైతం అంటున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

0
0
Report
Advertisement
Advertisement
Back to top