కొత్తగూడెం, పాల్వంచ కార్పొరేషన్ ఏర్పాటుపై పరిశీలిస్తాం: భట్టి
Manuguru (PT), Telangana:భద్రాద్రి కొత్తగూడెంలో రూ.124 కోట్లతో నిర్మించనున్న మంచినీటి సరఫరా ప్రాజెక్టుకు మంత్రులు భట్టి, తుమ్మల, కోమటిరెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్యే కూనంనేని శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం ప్రజల దాహార్తిని తీర్చేందుకుగాను ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని భట్టి పేర్కొన్నారు. కొత్తగూడెం, పాల్వంచ రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తామన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Black Ivory Coffee: ఏనుగు పేడతో ఖరీదైన కాఫీ..ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కాఫీ ఇది..కప్పు కేవలం రూ.4,720 మాత్రమే!
Hyderabad, Telangana:Black Ivory Coffee Price: కాఫీ ప్రియులకు ఉదయాన్నే ఒక కప్పు వేడి కాఫీ పడకపోతే రోజంతా ఏదో వెలితిగా ఉంటుంది. కానీ, ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన "బ్లాక్ ఐవరీ కాఫీ" గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే, ఈ కాఫీ తయారీ వెనుక ఉన్న కథ, దాని ధర సామాన్యులను ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. కొన్ని విలాసవంతమైన హోటళ్లు, రిసార్టులలో కేవలం ఒక కప్పు బ్లాక్ ఐవరీ కాఫీ ధర సుమారు 50 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.4,000 పైమాటే) పలుకుతుంది.
ఈ విచిత్రమైన విలాసవంతమైన కాఫీ విశేషాలేంటో తెలుసా..
1) ఏనుగుల మల విసర్జనతో కాఫీ తయారీ!
ఈ కాఫీ ప్రత్యేకత అంతా దాని తయారీ విధానంలోనే ఉంది. థాయ్‌లాండ్‌లో సంరక్షణలో ఉన్న ఏనుగులకు అత్యంత నాణ్యమైన అరబికా కాఫీ చెర్రీలను అరటిపండ్లు, బియ్యం వంటి ఆహారంతో కలిపి తినిపిస్తారు.
ఏనుగుల జీర్ణవ్యవస్థ గుండా ప్రయాణించిన ఈ కాఫీ గింజలు, వాటి విసర్జన (పేడ) ద్వారా బయటకు వస్తాయి. అలా వచ్చిన గింజలను కార్మికులు ఎంతో జాగ్రత్తగా చేతితో వేరు చేస్తారు. ఆ తర్వాత వాటిని అత్యంత పరిశుభ్రమైన పద్ధతుల్లో కడిగి, ఎండబెట్టి, రోస్ట్ చేసి తుది కాఫీ పొడిని తయారు చేస్తారు.
2) ఇంత ధర ఎందుకు?
బ్లాక్ ఐవరీ కాఫీ కిలో ధర వేల డాలర్లలో ఉండటానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. ఏనుగులు తిన్న కాఫీ గింజల్లో చాలా వరకు నమిలేటప్పుడు విరిగిపోతాయి లేదా జీర్ణమైపోతాయి. ఒక కిలో నాణ్యమైన కాఫీ గింజలు లభించాలంటే ఏనుగులకు సుమారు 33 కిలోల కాఫీ చెర్రీలను తినిపించాల్సి ఉంటుంది. ఇది భారీ స్థాయిలో లభించేది కాదు. ఏటా చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఏనుగు పేడ నుండి గింజలను వేరు చేయడం, శుభ్రపరచడం వంటి పనులకు అధిక శ్రమ, సమయం పడుతుంది.
3) చేదు లేని అద్భుతమైన రుచి!
"ఏనుగు జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్‌ల వల్ల కాఫీ గింజల్లోని ప్రొటీన్లు విచ్ఛిన్నమవుతాయి. కాఫీలో చేదుదనానికి ఈ ప్రొటీన్లే కారణం కాబట్టి, ఏనుగుల ద్వారా వచ్చే గింజల్లో చేదు చాలావరకు తగ్గిపోతుంది."
ఈ సహజ సిద్ధమైన ఫెర్మెంటేషన్ ప్రక్రియ వల్ల ఈ కాఫీకి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇది తాగేటప్పుడు చాక్లెట్, మాల్ట్, స్వల్పంగా నట్స్ (జీడిపప్పు/బాదం వంటివి) కలబోసిన అద్భుతమైన ఫ్లేవర్లు తెలుస్తాయని కాఫీ నిపుణులు చెబుతుంటారు.
4) జంతు సంరక్షణ
ఏనుగులను కాఫీ తయారీకి వాడటంపై జంతు ప్రేమికుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అయితే, తాము కేవలం రక్షిత ఏనుగులను మాత్రమే ఉపయోగిస్తామని, కాఫీ చెర్రీలు వాటి రోజువారీ ఆహారంలో ఒక చిన్న భాగం మాత్రమేనని తయారీ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ, ఇలాంటి లగ్జరీ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు సదరు కంపెనీల పారదర్శకతను, జంతు సంరక్షణ ప్రమాణాలను సరిచూసుకోవడం వినియోగదారుల బాధ్యత.
ఏనుగు విసర్జన నుండి సేకరించిన గింజలతో తయారవుతుందనే విషయం కొందరికి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ, కాఫీ ప్రపంచంలో దీనికున్న క్రేజ్ వేరు. ఇది కేవలం దాహాన్ని తీర్చుకునే రోజువారీ పానీయం కాదు.. సంపన్నులు, కాఫీ ప్రియులు ఆస్వాదించే ఒక విలాసవంతమైన అనుభూతి!
Also REad: ఏపీ ప్రజలకు తీరనున్న కష్టాలు..బంగారు గనిని ప్రారంభం..700 మంది ఉపాధి..
Also Read: అంగన్వాడీల్లో 15,982 ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు వచ్చినట్టే?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sai Krishna Case: సాయికృష్ణ మృతి విషయంలో సంచలనం.."లాకప్‌లోనే సాయికృష్ణ చనిపోయాడు!"
Nunna, Vijayawada, Andhra Pradesh:Gade Sai Krishna Case: పోలీస్ కస్టడీలో సాయికృష్ణ అనే యువకుడి మృతి చెందిన కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సాయికృష్ణ మరణానికి, సాక్ష్యాధారాల ధ్వంసానికి అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజే ప్రధాన కారణమని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు రిమాండ్ రిపోర్టు ద్వారా వెలుగులోకి వచ్చాయి.Bigg Boss 10 Agnipariksha: "బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారా?" మరో అవకాశం ఇచ్చిన కింగ్ నాగార్జున టీమ్!
Hyderabad, Telangana:Bigg Boss 10 Agnipariksha Audition: తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ క్రేజీ సంపాదించుకున్న రియలిటీ షో బిగ్ బాస్. త్వరలోనే సరికొత్త మైలురాయని అందుకుని పదవ సీజన్లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు 9 సీజన్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ మెగా షో ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈసారి షో మరింత ఎంటర్టైనింగ్గా మార్చేందుకు నిర్వాహకులు భారీ ప్లానింగ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా సామాన్లకు హౌస్ లోకి వెళ్లేందుకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించారు.
సాధారణంగా సెలబ్రిటీలతో నిండిపోయే బిగ్ బాస్ హౌస్ లో సామాన్యులకు చూడదగ్గ ఓ అద్భుతమైన విషయంగా మారుతుంది. గత సీజన్లో కామన్ మ్యాన్ కేటగిరీ కింద అడుగుపెట్టిన కంటెస్టెంట్ హౌస్ లోనే తన సత్తా చాటడం కాకుండా ప్రేక్షకుల ఆదరణతో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. దీంతో పదో సీజన్ కూడా కామన్ మ్యాన్ కు పెద్దపీట వేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
గత సీజన్లో సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి అవకాశం కల్పించేందుకు నిర్వహించిన అగ్నిపరీక్ష కాన్సెప్ట్ విజయవంతం కావడంతో ఈసారి మరింత పకడ్బందీగా 'బిగ్ బాస్ అగ్ని పరీక్షా సీజన్ 2' కూడా లాంచ్ చేశారు. ఆన్లైన్ ద్వారా ఇప్పటికే జూన్ 12 నుంచి జూన్ 20 వరకు గడువు ఇచ్చారు వచ్చిన వేలాది దరఖాస్తులను పరిశీలించిన డిజిటల్, ఆన్‌గ్రౌండ్ సెలెక్షన్లలో గెలిచిన దాదాపు 5 మంది సామాన్యులను మైల్ స్టోన్ సీజన్ 10 హౌస్ లోకి నేరుగా ఎంట్రీ లభించనుంది.
ఒకవేళ 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్స్ మిస్ అయినవారికి తాజాగా సర్ప్రైజ్ ఇచ్చారు నిర్వాహకులు. 'బిగ్‌బాస్ తెలుగు 10'కి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వైట్ గోల్డ్ సంస్థతో కలిసి ఈసారి కొత్త కాంటెస్ట్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రోమో ప్రముఖ యాంకర్ శ్రీముఖి విడుదల చేసింది.
"బిగ్‌బాస్ 10 అగ్ని పరీక్ష ఆడిషన్ వీడియో సబ్మిట్ చేయడం మిస్ అయ్యారా? మీకోసం మరో గోల్డెన్ ఛాన్స్" అంటూ ఆ వీడియో ప్రారంభం అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు వారు ఇచ్చిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ ఆడిషన్ వీడియోను సబ్మిట్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఇది అగ్ని పరీక్ష రౌండ్లోకి వెళ్లడానికా లేదా నేరుగా సామాన్యుడి కంటెస్టెంట్‌గా ఎంపిక చేయడానికా అనేది తెలియాల్సి ఉంది.
ఈ ప్రతిష్టాత్మక పదో సీజన్ కోసం సెలబ్రిటీలు, సామాన్యుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం తుదిదశకు చేరుకుతుంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే ఈ సరికొత్త సీజన్ ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో అత్యంత వైభవంగా ప్రారంభం కానట్లు సమాచారం. ఏదేమైనా ఒక సామాన్యుడిగా వచ్చి బిగ్ బాస్ ట్రోఫీ గెలవాలనుకునే మాత్రం ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం.
Also Read: "డబ్బు కోసం ఎంతమంది మొగుళ్లనైనా మారుస్తా!" స్టార్ హీరోయిన్ సంచలన ప్రకటన!
Also REad; నేడు కోర్టులో అల్లు అర్జున్ హాజరుపై సస్పెన్స్.. వెండాతున్న తొక్కిసలాట కేసు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Infinix Note 60 Pro: భారత మార్కెట్లోకి Infinix కొత్త సంచలనం.. సూపర్ కార్ డిజైన్‌తో కొత్త ఫోన్ లాంచ్!
Hyderabad, Telangana:Infinix Note 60 Pro Pininfarina Limited Edition: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) భారతీయ మొబైల్ ప్రియుల కోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్ను అందించేందుకు రెడీ అయ్యింది.. ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ కార్ డిజైనింగ్ సంస్థ Pininfarina భాగస్వామ్యంతో సరికొత్త Infinix Note 60 Pro Pininfarina Limited Edition స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం అధికారికంగా లాంచ్ చేసింది. ఇది రూ.40,000 లోపు బడ్జెట్ విభాగంలో ప్రీమియం లుక్‌తో పాటు అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడం విశేషం..
స్పార్ట్స్ కార్ తరహా డిజైన్..
ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని డిజైన్ అని భావించవచ్చు.. రేసింగ్ ట్రాక్‌లపై దూసుకెళ్లే లగ్జరీ స్పోర్ట్స్ కార్ల స్ఫూర్తితో దీని వెనుక ప్యానెల్‌ను కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ (Carbon Fibre Finish)తో తయారు చేసిన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఫోన్‌కు మరింత దృఢంగా ఉండేందుకు 360-డిగ్రీల ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కూడా అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది.. ఇది ఫోన్‌కు అత్యంత ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇది క్లాసీ టోరినో బ్లాక్ (Torino Black) కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రావడం విశేషం..
డిస్ప్లే, ప్రాసెసర్ అద్భుతం..
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ల్పేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఏకంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. దీనికి స్క్రీన్ ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 (Snapdragon 7s Gen 4) 4nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్‌కు అద్భుతంగా సరిపోతుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతున్నట్లు తెలుస్తోంది.
6500mAh భారీ బ్యాటరీ..
బ్యాటరీ పరంగా ఇన్ఫినిక్స్ ఎక్కడా రాజీ పడలేన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 6,500mAh గల భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు అలాగే 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు.. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో ఐస్‌కోర్ 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉంచచడం విశేషం..
కెమెరా, ఇతర స్పెషల్ ఫీచర్స్..
ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. దీని ద్వారా 4K నాణ్యతతో వీడియోలను రికార్డ్ చేసే అవకాశం కూడా లభిస్తోంది. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ వెనుక కెమెరా పక్కన నోటిఫికేషన్లు, యానిమేషన్ల కోసం ప్రత్యేకమైన యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే (Active Matrix Display)ను అందుబాటులో ఉంచడం విశేషం. అంతేకాకుండా ఫోన్ కుడి వైపున హెల్త్ మానిటరింగ్ సెన్సార్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ధర వివరాలు..
భారత మార్కెట్లో Infinix Note 60 Pro Pininfarina Limited Edition కేవలం 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ. 37,999తో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(Flipkart)తో పాటు ఇన్ఫినిక్స్ ఇండియా అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vemulawada: వేములవాడ రాజన్న క్షేత్రంలో అద్భుత ఘట్టం.. రైతులకు ఉచితంగా 200 కోడెల పంపిణీ!
Nampalli, Vemulawada, Telangana:Vemulawada Temple News: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది.. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ చేతుల మీదుగా తిప్పాపురం గోశాలలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. మొదటి విడతగా బుధవారం రోజున 200 కోడెలను అర్హులైన రైతులకు అందజేశారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ.. స్వామివారికి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించే కోడెలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా.. అత్యంత పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా.. ఏర్పాటు చేసి.. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నిజమైన.. అర్హులైన పేద రైతులను మాత్రమే ఎంపిక చేసినట్లు ఆమె వెల్లడించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకే ఈ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.
రాజన్న ప్రసాదంగా భావించండి: కలెక్టర్ పిలుపు..
రైతులకు కోడెలను అందజేసిన అనంతరం కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు.. రైతు సోదరులారా.. ఈ కోడెలను కేవలం పశువులుగా కాకుండా.. వేములవాడ రాజన్న ప్రసాదంగా.. స్వామివారి ఆశీస్సుల రూపంగా భావించాలని.. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర అవసరాలకు లేదా విక్రయించడానికి వీల్లేదని.. కేవలం మీ వ్యవసాయ పనులకు, సాగు ఉత్పాదకతను పెంచుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలని కోరారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ఉచితంగా కోడెలను అందుకున్న రైతుల ఆనందానికి అవధులు లేవు.. వేములవాడ రాజన్నను దర్శించుకుని, కోడెలను ఇంటికి తీసుకెళ్తుండటంతో తిప్పాపురం గోశాల పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.. ఎద్దులను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న తమకు, స్వామివారి కోడెలు వ్యవసాయానికి ఎంతో ఆసరాగా నిలుస్తాయని లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Viral News: కుళ్లిపోయిన సమోసాలకు రంగులు వేస్తున్న యువకుడు.. చూస్తే ఇంకెప్పుడూ తినరు!
Hyderabad, Telangana:Rotten Samosa Painting Video: ఎవరికైనా సమోసా... పేరు వింటేనే నోరూరుతుంది. సాయంత్రం పూట వేడివేడి టీతో కలిపి సమోసా తింటే ఆ మజానే వేరు.. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం.. మీరు జీవితంలో మళ్లీ సమోసా జోలికి వెళ్లాలంటేనే వణికిపోతారు.. అవును.. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అయిపోతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. ఒక యువకుడు పాతపడిపోయిన, కుళ్లిపోయిన సమోసాలకు రంగులు వేస్తూ కెమెరాకు చిక్కాడు. వైరల్ అవుతున్న వివరాల ప్రకారం... ఒక ఇరుకైన, అపరిశుభ్రమైన గదిలో ఒక యువకుడు కూర్చుని ఉండడం మీరు చూడొచ్చు.. పూర్తిగా పాడైపోయిన, బూజు పట్టిన సమోసాలు కుప్పగా పడి ఉండడం మీరు చూడొచ్చు.. అయితే, వాటిని పారేయడానికి బదులు.. ఆ యువకుడు ఒక బ్రష్‌తో వాటిపై పసుపు, ఎరుపు రంగుల మిశ్రమాన్ని పూయడం మీరు గమనించవచ్చు.. ఆ రంగు వేయగానే.. కుళ్లిపోయిన సమోసాలు కాస్తా.. ఇప్పుడే నూనెలో నుంచి తీసిన తాజా సమోసాల్లా మెరిసిపోవడం గమనార్హం..
ఈ విధంగా రంగులు పూసిన సమోసాలను మార్కెట్లోకి పంపి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో షేర్ అయిన కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్‌తో పాటు వేలాది కామెంట్లతో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన చాలా మంది డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో ఇంత దారుణంగా ఆడుకుంటారా? వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక నెటిజన్ కామెంట్ చేయగా... ఇకపై బయట సమోసాలు తినడమే బంద్. ఇంట్లోనే వండుకు తిందాం.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
ఫుడ్ సేఫ్టీ అధికారులకు సవాల్‌గా మారిన నకిలీ దందా..
ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల తయారీ వీడియోలు బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ కుళ్లిన నూనె వాడటంతో పాటు రసాయనాలు కలపడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమోసాల వీడియో ఎక్కడిది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి రహస్య తయారీ కేంద్రాలపై నిఘా పెట్టాలని.. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి కేటుగాళ్లను జైల్లో పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Jonnagiri Gold Mines: ఏపీలో భారీ బంగారు గని.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం..
Pagidirai, Andhra Pradesh:Jonnagiri Gold Mines News: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మైనింగ్ రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కరువు నేలగా పేరుగాంచిన రాయలసీమ ప్రాంతం ఇకపై బంగార పంటతో ఆంధ్ర కేజిఎఫ్ గా వెలువందనం ఉంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి అతి పెద్ద ప్రైవేట్ రంగా గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ఈ మైనింగ్ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక మైలురాయిగా నిలవనుంది.Sai Krishna Case: "బెజవాడ సాయికృష్ణ పోలీస్ కస్టడీలో చనిపోయాడు"..సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు!
Vijayawada, Andhra Pradesh:Gade Sai Krishna Case: పోలీస్ కస్టడీలో సాయికృష్ణ అనే యువకుడి మృతి చెందిన కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సాయికృష్ణ మరణానికి, సాక్ష్యాధారాల ధ్వంసానికి అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజే ప్రధాన కారణమని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు రిమాండ్ రిపోర్టు ద్వారా వెలుగులోకి వచ్చాయి.
కస్టడీలోనే మరణం.. ఎస్సై వాగ్మూలం
సిట్ విచారణలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్సై ఇచ్చిన వాగ్మూలం కీలక మలుపుగా మారింది. మే 6, 2026 నుండి మే 8, 2026 మధ్య కాలంలో సాయికృష్ణను తాను కృష్ణలంక పీఎస్ లో చూశానని, అతను మరణించిన తర్వాత మృతదేహాన్ని కూడా అక్కడే గమనించానని ఎస్సై సిట్‌కు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. జూన్ 2, 2026 కంటే ముందే సాయికృష్ణ మరణించి ఉంటాడని, కస్టడీలో ఉండగా జరిగిన తీవ్రగాయాల వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని అన్ని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
సాయికృష్ణ మరణించిన విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ, కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారాన్ని మేజిస్ట్రేట్‌కు చేరవేయకుండా దాచిపెట్టారు. కొడుకు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి స్టేషన్‌కు వెళ్లగా, సీఐ నాగరాజు ఆమెను తీవ్రంగా దూషించారు. ఆ తర్వాత బాధితురాలి తరఫున హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్ దాఖలైనప్పటికీ, పోలీసులు కోర్టు ముందు కూడా వాస్తవాలను వెల్లడించకుండా, తీవ్రంగా తప్పుదోవ పట్టించారని సిట్ పేర్కొంది.
సీసీటీవీ ఫుటేజ్, ఆధారాల ధ్వంసం
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సైంటిఫిక్ ఆధారాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు సీఐ నాగరాజు పథకం రచించారు. మే 1, 2026 నుండి జూన్ 1, 2026 వరకు ఉన్న కీలకమైన నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ డేటాను డీవీఆర్ (DVR) లలో లేకుండా మాయం చేశారు. సాక్ష్యాలను నాశనం చేయడం ద్వారానే సాయికృష్ణను హత్య చేశారనే కోణాన్ని సిట్ నిర్ధారించింది. ప్రస్తుతం ఈ ధ్వంసమైన డీవీఆర్‌లను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ దారుణ ఉదంతం వెనుక ఉన్న మరిన్ని అసలు నిజాలను, పూర్తి కుట్రను వెలికితీయాలంటే నిందితుడైన సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని సమగ్రంగా విచారించాల్సి ఉందని సిట్ తన రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది.
Also Read: Sai Krishna Case: "నా కొడుకు బతికే ఉన్నాడా లేదా చంపేశారా?".. రౌడీషీటర్ సాయికృష్ణ తల్లి ఆవేదన!
Also REad: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారం..రూ.500 దర్శనం టికెట్ల గోల్మాల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: ప్రాణాలతో చెలగాటం.. కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టిన యువతి.. నెటిజన్లు షాక్!
Hyderabad, Telangana:Woman Kisses King Cobra Viral Video Watch Here: సోషల్ మీడియా వరల్డ్‌లో రోజుకో రకమైన వింతలతో పాటు విశేషాలు వెలుగుచూస్తుంటాయి. కొందరు తమ ప్రతిభతో ఆకట్టుకుంటే.. మరికొందరు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి చేసే స్టంట్స్‌తో పాటు సాహసాలతో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది.. అందమైన చీరకట్టులో ఉన్న ఒక యువతి.. ఎంతో ప్రమాదకరమైన పాముతో చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చేతిలో కింగ్ కోబ్రా..
సాధారణంగా పాము కనిపిస్తేనే.. ఆమడ దూరం పరుగెత్తే వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటిది ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న యువతి మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తించడం మీరు చూడొచ్చు.. అద్భుతమైన పట్టుచీర కట్టుకుని.. సాంప్రదాయబద్ధంగా ఎంతో అందంగా తయారైన ఆ యువతి.. తన చేతుల్లో ఒక పెద్ద, ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకుని కనిపించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. ఆ పామును చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నప్పటికీ.. ఆమె ముఖంలో మాత్రం ఎలాంటి భయం కనిపించకపోవడం గమనార్హం..
ముద్దు పెట్టేందుకు ప్రయత్రించింది..
వీడియోలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైందని భావించవచ్చు.. పామును కేవలం పట్టుకోవడమే కాకుండా.. ఆ యువతి దానిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. ఆ విషసర్పం ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియని పరిస్థితిని కూడా మీరు ఇందులో గమనించవచ్చు.. యువతి తన ముఖాన్ని పాము నోటి దగ్గరకు తీసుకెళ్తున్న ప్రతిసారీ.. చూసే సోషల్ మీడియా వినియోగదారులకు గుండె ఆగినంత పనవుతుంది. పాము ఒక్కసారిగా దాడి చేస్తుందేమోననే భయంతో నెటిజన్లు ఊపిరి బిగబట్టి ఈ వీడియోను చూశారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
ఎట్టకేలకు సక్సెస్.. నెటిజన్లు షాక్..
ఆ యువతి పట్టు వదలకుండా ఎట్టకేలకు ఆ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టుకోవడం మీరు చూడొచ్చు.. ఆ తర్వాత ఎంతో క్యాజువల్‌గా కెమెరా వైపు చూస్తూ నవ్వింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్స్‌లో అప్లోడ్ అవ్వడమే ఆలస్యం.. నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది ఈ వీడియోకు లైక్స్ కూడా చేస్తున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Jonnagiri Gold Mines: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరనున్న కష్టాలు..బంగారు గనిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..700 మంది ఉపాధి..
Pagidirai, Andhra Pradesh:Jonnagiri Gold Mines News: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మైనింగ్ రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కరువు నేలగా పేరుగాంచిన రాయలసీమ ప్రాంతం ఇకపై బంగార పంటతో ఆంధ్ర కేజిఎఫ్ గా వెలువందనం ఉంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి అతి పెద్ద ప్రైవేట్ రంగా గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ఈ మైనింగ్ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక మైలురాయిగా నిలవనుంది.
జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా సుమారు 405 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించాయి. ప్రభుత్వం ఈ గోల్డ్ ఫిల్ కోసం మొత్తం 1500 ఎకరాల భూమిని కేటాయించగా మొదటి దశలో భాగంగా 6 ఎకరాల్లో తవ్వకాలు జరిపేలా అత్యాధునిక గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ సీఎం ప్రారంభించారు. ఈ పర్యటనలో ప్రాజెక్టు విస్తరణకు వీలుగా రెండో యూనిట్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
రాష్ట్రానికి ఆదాయం ఉపాధి
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ సుమారు 700 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందులో 80% పైగా ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారికి కేటాయించడం విశేషం. అంతేకాకుండా, ఇక్కడ ఉత్పత్తి అయిన బంగారం విలువపై నాలుగు శాతం రాయలసీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకరణం ఉంది. మొదటి ఏడాది 400 కేజీల ఉత్పత్తి ద్వారా 507 కోట్ల రూపాయలు ఆ తర్వాతి కాలంలో ఉత్పత్తి పెరిగిన కొద్దీ ఏటా 150 కోట్ల రూపాయలు వరకు రాయల్టీ రానుందని అంచనా.
జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో సుమారు 50 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గనుల శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2026 27 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని ఏడాదికి రెండు టన్నుల అంటే 2000 కేజీల బంగారాన్ని శుద్ధి చేసే స్థాయికి విస్తరించరున్నారు. ఈ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన నీటి కోసం హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుండి ప్రత్యేకంగా 18 కిలోమీటర్ల పైపులైను కూడా ఏర్పాటు చేశారు. ఈ సరికొత్త మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభంతో రాయలసీమ ప్రాంతంలో వలసలు తగ్గి, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also REad: AP Gold Mines: ఏపీలో భారీ బంగారు గని..టన్నుల కొద్దీ బయటపడుతున్న బంగారం నిల్వలు!
Also Read: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారం..రూ.500 దర్శనం టికెట్ల గోల్మాల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Redmi నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Redmi Note 17 సిరీస్!
Hyderabad, Telangana:Redmi Note 17 Series Leak News: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి (Xiaomi) సబ్‌బ్రాండ్ రెడ్మికి మంచి గుర్తింపు ఉంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్బుతమైన డిజైన్‌తో మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తుంది. అతి త్వరలోనే కంపెనీ మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కళ్లు చెదిరే బ్యాటరీ బ్యాకప్‌ను అందించేందుకు సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ రెడ్మి నోట్ 17 (Redmi Note 17) సిరీస్ పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలు కూడా లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రెడ్మి చరిత్రలోనే అతిపెద్ద బ్యాటరీ..
ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించి సమాచారం ప్రకారం.. రెడ్మి చైనా మార్కెట్లో ఒక సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ప్లాన్ చేసేందుకు సిద్ధమైందని.. ఇది ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేయబోతోందని తెలిపింది.. ఒకవేళ ఇదే నిజమైతే.. రెడ్మి మొబైల్స్ చరిత్రలోనే ఇంతటి భారీ బ్యాటరీతో రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుందని పేర్కొన్నారు.
కళ్లు చెదిరే డిస్ప్లే..
ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిస్ల్పేకి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఫ్లాట్ 1.5K రెజల్యూషన్ కలిగిన హై-క్వాలిటీ డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది.. మల్టీమీడియా ప్రియుల కోసం ఇందులో హై-వాల్యూమ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో సినిమాలు, గేమింగ్ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుందని సమాచారం.
స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్..
Redmi Note 17 సిరీస్ ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6-సిరీస్ (Qualcomm Snapdragon 6-series) ప్రాసెసర్‌ను వినియోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్సెట్తో రావచ్చని టెక్ నిపుణులు అంచానాలు వేస్తున్నారు. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ అత్యంత ధృడంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్లాగ్షిప్ స్థాయి వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో పాటు కింద పడినా పగలకుండా ఉండేలా మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్ ఫీచర్లను ఇందులో కంపెనీ అందిస్తోంది..
10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా..
కొన్ని కంపెనీలు గతంలో కేవలం 9,000mAh బ్యాటరీ మాత్రమే అందించాయి. కానీ ఈ సిరీస్‌లో రెడ్మి నోట్ 17 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం లుక్ కోసం మెటల్ ఫ్రేమ్‌తో పాటు అద్భుతమైన ఫోటోగ్రఫీ కోసం 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించనున్నట్లు ఇతర లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి..
లాంచ్ ఎప్పుడంటే?
ఈ రెడ్మి నోట్ 17 లైన్అప్ ఇప్పటికే యురేషియన్ ఎకనామిక్ కమిషన్ (EEC)తో పాటు GSMA డేటాబేస్‌లలో కనిపించిన సంగతి తెలిసిందే... దీనిని బట్టి చూస్తే మొదటగా చైనాలో అధికారికంగా విడుదలైన కొన్ని నెలలకే ఈ సిరీస్ గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iphone, సాంసంగ్‌లకు చెక్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో Motorola Edge 70 Max ఫోన్!
Hyderabad, Telangana:Motorola Edge 70 Max Price: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా గ్లోబల్ మార్కెట్లోకి సరికొత్త సంచలనానికి తెరలేపేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. తన ప్రతిష్టాత్మక ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ (Motorola Edge 70 Max)ను త్వరలోనే విడుదల చేయడానికి రెడీ అయ్యింది.. లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ మార్కెట్లో ఉన్న వివో, షావోమితో పాటు సాంసంగ్ వంటి దిగ్గజ బ్రాండ్ల ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందని సమాచారం..
కొత్త ఫ్లాట్ డిజైన్..
సాధారణంగా మోటోరోలా తన ప్రీమియం ఎడ్జ్ సిరీస్‌లో కర్వ్డ్ డిస్ప్లేలను అందిస్తుంది. కానీ, లీకైన తాజా డిజైన్ ప్రకారం.. ఈ కొత్త మాక్స్ మోడల్లో మొదటిసారిగా పూర్తి ఫ్లాట్ స్క్రీన్‌తో పాటు ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్ డిజైన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని అల్ట్రా-స్లిమ్ బెజెల్స్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. ఇది ఆనిక్స్ బ్లాక్, సేజ్ గ్రీన్‌తో పాటు గ్లేసియర్ బ్లూ వంటి ఎన్నో అద్భుతమైన రంగుల్లో అందుబాటులోకి రాబోతోంది.
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌హౌస్..
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని అద్భుతమైన ప్రాసెసర్.. ఇది క్వాల్కమ్కి సంబంధించిన అత్యంత శక్తివంతమైన చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5)తో ఈ స్మార్ట్‌ఫోన్ పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది అల్ట్రా-ఫాస్ట్ గేమింగ్‌తో పాటు అద్భుతమైన మల్టీటాస్కింగ్, మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మోటోరోలా సరికొత్త ఆన్-డివైస్ ఏఐ అసిస్టెంట్ Qiraను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రియల్-టైమ్ ట్రాన్స్లేషన్తో పాటు అడ్వాన్స్డ్ ఫోటో ఎడిటింగ్, టెక్స్ట్ సమ్మరైజేషన్ వంటి పనులను సులువుగా చేసే అవకాశాలు ఉన్నాయి.
సోనీ లైటియా కెమెరా..
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫోటోగ్రఫీ పరంగా చూస్తే.. ఇది ఓఐఎస్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా (Sony Lytia) ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకండా టెలిఫోటోతో పాటు అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది వెనక భాగంలో అద్బుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 8000mAh భారీ బ్యాటరీ, మ్యాగ్నెటిక్ Qi2 వైర్లెస్ చార్జింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి రాబోతోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ధరకి సంబంధించిన వివరాలు..
భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.54,999 నుంచి రూ.59,999 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇది అధునాతన సాంకేతికతతో పాటు సరికొత్త డిజైన్‌తో రాబోతున్న ఈ ఫోన్ ప్రీమియం ఫ్లాగ్షిప్ విభాగంలో వివో, శామ్సంగ్తో పాటు షావోమి బ్రాండ్ల ఆధిపత్యానికి గట్టి బ్రేక్ వేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Redmi బడ్జెట్ ధమాకా.. 5,160mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi 17C లాంచ్!
Hyderabad, Telangana:Redmi 17c Price: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Redmi మార్కెట్లోకి మరో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్‌ను విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన రెడ్మి 15Cకి సక్సెసర్‌గా ఈ సరికొత్త Redmi 17C మోడల్‌ను చైనా మార్కెట్లో మంగళవారం అధికారికంగా విడుదల చేసింది.. ఇది భారీ డిస్ప్లేతో పాటు అదిరిపోయే బ్యాటరీ లైఫ్, అధునాతన ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారీ డిస్ప్లే..
Redmi 17C మొబైల్ 6.88 అంగుళాల భారీ డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 240Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో వచ్చింది.. దీనివల్ల గేమింగ్, స్క్రోలింగ్ అనుభూతి చాలా స్మూత్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు కంటి ప్రొటక్షన్ కోసం TÜV Rheinland లో బ్లూ లైట్‌తో పాటు ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్‌ను కూడా ఇందులో అందించారని కంపెనీ క్లైమ్ చేస్తోంది.
పవర్ఫుల్ ప్రాసెసర్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హెలియో G81 ఆల్ట్రా (MediaTek Helio G81 Ultra) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు సంచారం. ఇది మల్టీటాస్కింగ్‌తో పాటు రోజువారి పనులను సులువుగా రన్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. కెమెరా విభాగ విషయానికి వస్తే.. వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
రోజంతా నడిచేలా 5,160mAh భారీ బ్యాటరీ..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీగా భావించవచ్చు.. ఇందులో ఎంతో శక్తివంతమైన 5,160 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని కంపెనీ అందించింది.. ఇది 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌తో లాంచ్ అయ్యింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సులభంగా రోజంతా ఎంతో సులభంగా వినియోగించవచ్చు.. సెక్యూరిటీ కోసం ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ధర వివరాలు ఇవే..
చైనాలో విడుదలైన ఈ ఫోన్ ధరలు వేరియంట్ల వారీగా అందుబాటులో ఉన్నాయి. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 11,200 అందుబాటులో ఉంటుంది. ఇక రెండవ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 12,600తో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, రెడ్‌తో పాటు బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే అధికారిక వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anganwadi Recruitment: అంగన్వాడీల్లో 15,982 ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు వచ్చినట్టే?!
Hyderabad, Telangana:Telangana Anganwadi Recruitment 2026: తెలంగాణలోని మహిళలకు ప్రభుత్వం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 టీచర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ శిశు సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఐసిడిఎస్ (ICDS) ప్రాజెక్టు పరిధిలో 177 పోస్టులను భర్తీకి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇతర జిల్లాల్లో కూడా వరుస నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈసారి అంగనవాడి నియామకాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కనీస విద్యార్హతను పెంచడంతోపాటు, ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 4 (ఇంటర్వ్యూ అనుమతి) జీవో నెంబర్ 6 (మార్కుల వెయిటేజీ) వంటి జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది.
జోన్లవారీగా ఖాళీల వివరాలు..
రాష్ట్రంలో రెండు మల్టీ జోన్ల పరిధిలో ఉన్న ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి. మల్టీ జోన్ 1లో మొత్తం 20,584 కేంద్రాలు ఉండగా.. అందులో 1,853 టీచర్ పోస్టులు.. 7,737 సహాయకులు (అసిస్టెంట్) పోస్టులు భర్తీకి రెడీ ఉన్నాయి. ఆ తర్వాత మల్టీ జోన్ 2లో 15,197 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. అందులో 1,247 టీచర్ పోస్టులు.. 5,145 అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ రెండు మల్టీజోన్లను కలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ముఖ్యమైన అర్హతలు నిబంధనలు..
విద్యా అర్హత: టీచర్, అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులులై ఉండాలి. ఒకవేళ సహాయకుల (అసిస్టెంట్) పోస్టుకు ఇంటర్ పాసైన అభ్యర్థులు లభించకపోతే అప్పుడు పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని పరిశీలిస్తారు.
స్థానికత: దరఖాస్తుదారులు సంబంధిత గ్రామము లేదా పట్టణ వార్డుకు చెందిన స్థానిక మహిళలై ఉండాలి.
ప్రత్యేక వర్గాలకు ప్రాధాన్యత..
గిరిజన, ఆదివాసి తండాలు/గూడాలలోని పోస్టులకు స్థానిక ఎస్టీ మహిళలు.. అలాగే ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం మార్పులు వెయిటేజ్..
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తుంది. మొత్తం ఎంపికలో మార్కులు వేయటం ఇలా ఉంటుంది.
ఇంటర్మీడియట్ మార్కులు: 70% వెయిటేజీ
ఇంటర్వ్యూ మార్కులు: 10 మార్కులు
అనాధలు : 10% వెయిటేజీ
వితంతువులు : 5% వెయిటేజీ
దివ్యాంగులు : 5% వెయిటేజీ
అర్హత కలిగిన స్థానిక మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తమ జిల్లాలు వారి విడుదలై ఐసిడిఎస్ నోటిఫికేషన్ వివరాలను గమనిస్తూ ఉండాలి.
Also Read: విద్యార్థులకు చుక్కలు చూపిన నీట్ రీ-ఎగ్జామ్..కటాఫ్ భారీగా తగ్గే ఛాన్స్ ఉందా?
Also Read: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..20 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు..ఆ రోజు నుంచే అమలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vyatipata Yogam Effect: జూలై 10న అరుదైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం, కాసుల వర్షం!
Hyderabad, Telangana:Rare Vyatipata Yogam Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల కదలికలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. గ్రహాల సంయోగంతో పాటు ప్రత్యేక స్థితుల వల్ల ఏర్పడే యోగాలు మానవ జీవితాలను ఎంతోగానో ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలోనే రాబోయే జూలై నెలలో ఒక అత్యంత అరుదైన, శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది.. జూలై 10న సూర్యుడు, చంద్రుల కలయిక వల్ల వ్యతీపాత యోగం ఏర్పడబోతోంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడిని గౌరవ మర్యాదలతో పాటు ఆత్మవిశ్వాసానికి కారకుడు భావిస్తారు.. ఇక చంద్రుడిని మనస్సుతో పాటు ఆనందానికి కూడా కారకుడిగా చెప్పకుంటారు. ఈ ఇద్దరి కలయికతో జూలై 10న ఉదయం 06:53 గంటలకు ఈ వ్యతీపాత యోగం ఏర్పడబోతోంది.. కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే ఉండే ఈ ప్రత్యేక యోగం ముఖ్యంగా నాలుగు రాశుల వారి జాతకాన్ని పూర్తిగా మార్చుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ఊహించని ధనలాభాలు కలుగుతాయి.
ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే:
వృషభ రాశి (Taurus):
మోస్ట్ పవర్ఫుల్ వ్యతీపాత యోగంతో వృషభ వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా నిలిపోయిన పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. అలాగే ఆఫీసుల్లో కష్టపడి పనులు చేసేవారికి ఊహించని ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతో పాటు అదృష్టం కూడా వెంట, వెంటనే లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు, ఆత్మవిశ్వాసం విపరీంగా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి.. ఆదాయ వనరులు గణనీయంగా లభిస్తాయి..
సింహ రాశి (Leo):
సింహ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా.. కుటుంబంలో ఉన్న విభేదాలు, సమస్యలు అన్నీ ఒక్కసారిగా నిలిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో మీ ప్రతిష్ఠలు కూడా విపరీతంగా పెరుగుతాయి.. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశాలు లభిస్తాయి.. సమాజంలో ఉన్నత వ్యక్తుల సపోర్ట్ లభించడం వల్ల మీ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
తులా రాశి (Libra):
ఈ అరుదైన యోగం ప్రభావంతో తులా రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా.. మీ జీవితం ఒక అద్భుతమైన దిశలో ముందుకు సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి చేతికి డబ్బు అందుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పైఅధికారుల నుంచి పూర్తి
సపోర్ట్ లభించి.. ప్రశంసలు లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో మధురంగా ఉంటుంది.. అయితే, ఈ సమయంలో అతి ఆత్మవిశ్వాసానికి పోకుండా జాగ్రత్త వహించడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Chanakya Niti: కుక్క నుండి మనుషులు నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణాలు ...
మకర రాశి (Capricorn):
మకర రాశివారికి ఈ సమయం గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుందని.. వ్యాపార రంగంలో ఉన్నవారికి దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి విస్తరణ అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఈ సమయంలో తప్పకుండా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఆందోళన వంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
(గమనిక: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అందించిన అంచనాలు మాత్రమే.. ఇంటర్నెట్లో లభించిన సమాచారం ఆధారంగా అందిచాము. దీనిని ఒక సాధారణ అవగాహన కోసం మాత్రమే చదువుకోవాల్సి ఉంటుంది.)
Also Read: Chanakya Niti: కుక్క నుండి మనుషులు నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణాలు ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
