Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Tirupati Rao
Bhadradri Kothagudem507301

పెద్దవాగు ప్రాజెక్ట్ కి భారీగా చేరిన వరద నీరు

Tirupati RaoTirupati RaoJul 15, 2024 08:43:15
Aswaraopeta, Telangana:
గత మూడు రోజులుగా వాతావరణం మేఘావృతమై సన్నని జల్లులు పడటంతో అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి పంచాయితీ పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్ట్ లో సోమవారం జలకల సంతరించుకుంది.ఈ వర్షానికి అశ్వారావుపేట మండలాల్లోని పలు వాగులు,కాలువలు పొంగి పొర్లడంతో పెద్దవాగు ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు చేరింది.రాత్రి నుండి ఇప్పటి వరకు అశ్వారావుపేలో 24.8 మి.మీ,దమ్మపేటలో 20.0 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
1
comment0
Report
Bhadradri Kothagudem507301

టీచర్స్ కావాలంటూ రోడ్డెక్కిన విద్యార్థులు

Tirupati RaoTirupati RaoJul 11, 2024 10:42:11
Aswaraopeta, Telangana:
అశ్వారావుపేట మండల గుమ్మడవల్లి ప్రభుత్వ పాఠశాలలో రెండు వందల మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉండటంతో బుధవారం విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ విద్యాసంవత్సరం వృధా చేయద్దంటూ ఫ్లగ్ కార్డులు పట్టుకుని రోడ్డుపై భైఠాయించారు. మొత్తం పిల్లలు రెండొందలు వరకూ ఉండగా 36 మంది పదవతరగతి విద్యణార్థులున్నారు. తమ పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను రిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు
0
comment0
Report
Bhadradri Kothagudem507301

దొంతికుంటలో దారుణం

Tirupati RaoTirupati RaoJul 11, 2024 10:40:23
Aswaraopeta, Telangana:

అశ్వారావుపేటలో ఓ రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం జరగడంతో ఓ స్నేహితుడు మరొకరిపై ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఘర్షణ చోటు చేసుకుంది.ఘర్షణ అనంతరం రామాలయం వద్ద ఉన్న తిరుపతయ్య పై ముళ్లగిరి కార్తీక్ అనే యువకుడు కత్తితో విచక్షణ రహితంగా గాయపరిచాడు.

0
comment0
Report
Bhadradri Kothagudem507115

సీతారామ ప్రాజెక్టు పూసుకుంట వద్ద నిర్మిస్తున్న పంపు హౌస్ నిర్మాణ పనులను పరిశీలన

Tirupati RaoTirupati RaoJul 10, 2024 12:54:05
Mulakalapalle, Telangana:
సీతారామ ప్రాజెక్టును త్వరితగతన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించే క్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజకవర్గం లోని ములకలపల్లి మండలంలో మంత్రి ఈ రోజు పర్యటించారు.మంత్రి వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు.
1
comment0
Report
Advertisement
Bhadradri Kothagudem507306

ఆయిల్ ట్యాంకర్ బోల్తా

Tirupati RaoTirupati RaoJul 05, 2024 07:46:02
Dammapeta, Telangana:

దమ్మపేట- మద్దులగూడెంలోని పోతులమ్మ దేవాలయం వద్ద బోల్తా అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపు అతివేగంతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.

ట్యాంకర్‌ నుంచి ఆయిల్‌ లీక్‌ కావడాన్ని చూసిన ప్రజలు ఇళ్ల నుంచి బకెట్లు తీసుకుని ట్యాంకర్‌ వద్దకు చేరుకున్నారు. ట్యాంకర్‌లోని ఆయిల్‌ను పట్టుకునేందుకు లారీలు దూసుకెళ్లడంతో స్వల్ప ఘర్షణ కూడా చోటు చేసుకుంది. వంట నూనెల ధరలు మండిపోతుండటంతో దొరికినంత ఆయిల్‌ నింపుకునే ప్రయత్నం చేశారు స్థానికులు.

1
comment0
Report
Independence Day
Advertisement
Back to top