Mathura - खुलेआम लड़ते रहते हैं आवारा गोवंश, कई लोग हुए घायल
Kosikalan Rural, Uttar Pradesh:कोसीकला में आवारा गौवंशो का आतंक के दिन व दिन बढ़ता ही जा रहा है। यहां सड़कों, तिराहे, चौराहों पर आवारा गोवंश खुलेआम लड़ते हुए दिखाई देते हैं । इन सांडों की लड़ाई में अनेकों बार स्थानीय नागरिक एवं राहगीर इनकी चपेट में आकर घायल हो चुके हैं । और कुछ की तो मौत भी हो चुकी है । ऐसा नहीं है कि नगर पालिका तथा प्रशासन को इसका पता नहीं है वह यह सब जानते हुए भी मुक बना हुआ है ।हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Messi Retirement: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గుడ్‌బై.. అర్జెంటీనా జట్టు నుంచి స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్!
Hyderabad, Telangana:Lionel Messi Retirement: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే సార్వకాలిక గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా పరిగణించబడే అర్జెంటీనా సాకర్ దిగ్గజం, బిలియనీర్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి తన రిటైర్మెంట్ను ప్రకటించారు. ప్రస్తుతం ఇంటర్ మయామి ఫార్వర్డ్‌గా కొనసాగుతున్న మెస్సీ, అర్జెంటీనా జాతీయ జట్టు తరపున అంతర్జాతీయంగా పోటీ చేయడం నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం తెలిపారు. ఈ నిర్ణయం తనను "లోతుగా బాధిస్తోంది" అని, కానీ జాతీయ జట్టు నుండి వైదొలగడానికి "సమయం ఆసన్నమైంది" అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అభిమానులకు ధన్యవాదాలు
జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతూ మెస్సీ అభిమానులను ఉద్దేశించి భావోద్వేగ సందేశం ఇచ్చారు. అభిమానులకు ఆనందాన్ని అందించడానికి, ఫుట్‌బాల్ ద్వారా అర్జెంటీనా వాసులుగా గర్వపడేలా చేయడానికి తాను ఎల్లప్పుడూ జాతీయ జెర్సీ కోసం పోరాడానని చెప్పారు. "నేను ఎల్లప్పుడూ నా సర్వస్వం ఇచ్చానని మీకు ప్రమాణం చేస్తున్నాను. నా దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ మిగల్లేదు. అంతేకాకుండా తమ స్థానాలకు అర్హులైన ఎంతో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు వస్తున్నారు" అని ఆయన వెల్లడించారు. ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తండ్రి మరణం, భవిష్యత్తుపై ఆలోచన..
తన తండ్రి జార్జ్ మెస్సీ మరణించిన కొద్దికాలానికే మెస్సీ ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. తండ్రి మరణం బార్సిలోనా, పారిస్ సెయింట్-జెర్మైన్ మాజీ ఆటగాడైన ఆయనను తన భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించేలా చేసింది.
అంతర్జాతీయ విజయాలు, 2026 ప్రపంచ కప్
క్లబ్ స్థాయిలో దాదాపు అన్నింటినీ గెలిచినప్పటికీ, 2022 వరకు మెస్సీకి ప్రపంచ కప్ ట్రోఫీ చేజారిపోయే ప్రమాదంలో కనిపించింది. అయితే ఖతార్‌లో ఫ్రాన్స్‌పై జరిగిన ఉత్కంఠభరిత పెనాల్టీ షూటౌట్ విజయంతో ఆయన ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడారు. అలాగే 2021, 2024లలో వరుసగా కోపా అమెరికా టైటిళ్లను గెలవడంలోనూ అర్జెంటీనాకు సహాయపడ్డారు.
అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగిన 2026 ప్రపంచ కప్ ఎడిషన్‌లో అర్జెంటీనాను ఫైనల్ వరకు నడిపించి, మెస్సీ తన ప్రపంచ కప్ ట్రోఫీల సంఖ్యను దాదాపు రెట్టింపు చేశారు. తుది పోరులో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓడిపోయి అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. ఈ చారిత్రక ప్రస్థానం తర్వాత మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి అధికారికంగా తప్పుకున్నారు.
Also Read: ఆర్సీబీ టీమ్‌లోకి రోహిత్ శర్మ? రెడ్ జెర్సీలో హిట్‌మ్యాన్ ఫొటో వైరల్..ఏం జరుగుతోంది?
Also Read: మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..57 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్..సెంచరీ జస్ట్ మిస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vaibhav Sooryavanshi: మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..57 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్..సెంచరీ జస్ట్ మిస్!
Hyderabad, Telangana:Vaibhav Sooryavanshi Duleep Trophy: బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ తరపున బరిలోకి దిగిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన దూకుడు కనబరిచిన ఈ టీనేజ్ బ్యాటర్, కేవలం 42 బంతుల్లోనే సిక్సర్‌తో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తద్వారా 15 ఏళ్ల 175 రోజుల వయసులోనే దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
అక్కడితో ఆగకుండా దూకుడుగా ఆడుతూ 81 బంతుల్లో 92 పరుగులు సాధించి, కేవలం 8 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో 1969లో లక్ష్మణ్ సింగ్ (16 ఏళ్ల 23 రోజులు) నెలకొల్పిన 57 ఏళ్ల నాటి రికార్డును సూర్యవంశీ అధిగమించాడు. అంతేకాకుండా 2005లో 16 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన పియూష్ చావ్లా రికార్డును సైతం బద్దలు కొట్టాడు.
దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కులు..
వైభవ్ సూర్యవంశీ - 15 ఏళ్లు, 175 రోజులు
లక్ష్మణ్ సింగ్ - 16 ఏళ్లు, 23 రోజులు
పియూష్ చావ్లా - 16 ఏళ్లు, 307 రోజులు
బ్యాటింగ్‌తోనే కాకుండా మైదానంలోనూ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తొలి రోజు ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కుడి మణికట్టు గాయంతో మైదానం వీడటంతో, భోజన విరామానికి ముందు, తర్వాత కలిపి సుమారు గంటపాటు సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అలాగే, ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ప్రత్యర్థి ఓపెనర్ ఆర్యన్ జుయల్ (46) క్యాచ్-బిహైండ్పై ఈస్ట్ జోన్ చేసిన విఫల అప్పీల్‌ను DRS ద్వారా రివ్యూ చేయాల్సిందిగా సమర్థించి, కీలక వికెట్ దక్కడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతకుముందు ముఖేష్ కుమార్, అభిజిత్ సర్కార్ చెరో 3 వికెట్లు తీయడంతో సెంట్రల్ జోన్ 266 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Also Read: శ్రీలంక జట్టు అద్భుత పోరాటం..భారత్‌తో రెండో టెస్టు డ్రా..సిరీస్ టీమ్ఇండియా కైవసం!
Also Read: ఆర్సీబీ టీమ్‌లోకి రోహిత్ శర్మ? రెడ్ జెర్సీలో హిట్‌మ్యాన్ ఫొటో వైరల్..ఏం జరుగుతోంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Botsa Satyanarayana KA Paul: బొత్స సత్యనారాయణపై కేఏ పాల్ ఆగ్రహం..బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్!
Vijayawada, Andhra Pradesh:Irumudi Collection: రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోన్న 'ఇరుముడి'..బాక్సాఫీసు వద్ద రవితేజ సినిమా సరికొత్త రికార్డు!
Hyderabad, Telangana:Irumudi 200 Crore Collection: సరైన కంటెంట్ పడితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'ఇరుముడి' చిత్రం మరోసారి రుజువు చేసింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిత్రంలోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో థియేటర్ల వద్ద అభిమానుల తాకిడి కొనసాగుతోంది. విడుదలైన రెండు వారాలు కావస్తున్నా సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు అనే తేడా లేకుండా అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్..
గతంలో రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'మాస్ జాతర', 'ఈగల్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో కథల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించిన రవితేజ, పూర్తి కసితో 'ఇరుముడి' సినిమాను ఎంచుకున్నారు. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ, ఈ చిత్రం రవితేజ సినీ ప్రస్థానంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన బిగ్గెస్ట్ హిట్‌గా, అలాగే అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు
ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' పరాజయం పాలవడంతో, ఆ ప్రభావం 'ఇరుముడి'కి బాగా కలిసొచ్చింది. ఇతర సినిమాల వైఫల్యంతో ఈ చిత్రానికి థియేటర్లలో స్క్రీన్స్, వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకుపైగా రాబట్టగా, కేవలం నైజాం ఏరియా నుంచే రూ.50 కోట్ల వరకు కలెక్షన్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే జోరు కొనసాగితే అతి త్వరలోనే ఈ చిత్రం రూ.200 కోట్ల మైలురాయిని చేరుకోవడం లాంఛనమేనని స్పష్టమవుతోంది.
టికెట్ సేల్స్‌లో సరికొత్త సంచలనం..
ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లైన బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లలో కలిపి ఇప్పటికే 55 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం ఈ సినిమా ప్రభంజనానికి అద్దం పడుతోంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్లో రవితేజ తోటి స్వాములతో కలిసి నల్లటి వస్త్రాలు, మెడలో మాలలు ధరించి, ఒంటికాలిపై నిలబడి భక్తిపారవశ్యంతో కనిపిస్తున్న తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లాంగ్ రన్లో ఈ చిత్రం ఇంకెన్ని కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తుందోనని చిత్రసీమలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Also Read: 'ఇరుముడి'లో 'మల్లెపూల పల్లకి' సెన్సేషన్.. సింగర్ డప్పు శ్రీనుకు భారీ రెమ్యునరేషన్..
Also Read: 'దశావతారం' థీమ్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10..సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంఛ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kavitha Emotional: ఇందూరు గడ్డపై కవిత భావోద్వేగం.. కన్నీళ్లతో నిజమాబాద్ ప్రజలకు కీలక విజ్ఞప్తి
Nizamabad, Telangana:Kavitha Tears: అసలు తాను ఏం తప్పు చేశానని బీఆర్ఎస్ పార్టీలో నుంచి వెళ్లగొట్టారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నిలదీశారు. ఎలాంటి కారణంగా లేకుండా తనను తీహార్ జైల్లో పెట్టారని చెబుతూ ఆమె భావోద్వేగానికి గురయి కొన్ని నిమిషాలు రోదించారు. సుప్రీంకోర్టు జడ్జి కూడా తన నిజాయితీని గుర్తించి.. తనపై కేసు పెట్టిన సీబీఐ అధికారినే జైల్లో పెట్టాలని చెప్పారని గుర్తు చేశారు. తన సొంత ప్రజలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తాను పిరికిదాన్ని కాదని ప్రకటించారు.
నిజామాబాద్ కోడలిగా ఇక్కడి ప్రజలకు తానేంటో తెలుసని మాజీ ఎమ్మెల్ఈ కవిత తెలిపారు. 'పార్టీ పెట్టిన తర్వాత సొంత గడ్డకు రావడం ఆనందంగా ఉంది. స్వరాష్ట్రం వచ్చినా మన బతుకులు మారలేదు. సంపాదన పెరిగిందా? కాళేశ్వరం నుంచి ఒక్క ఎకరంలో అయినా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పారిందా..?' అని ప్రశ్నించారు. 'నేను కూడా ఆ పార్టీలోనే ఉన్నా. ప్రయత్నం చేశాం. కానీ సాధ్యం కాలేదు. కొత్త తాళం చెవి కావాలి. కొత్త శక్తి కావాలి' అని తెలిపారు. 'మిమ్మల్ని (ప్రజలు) చూసే ముందుకు వెళ్తున్నా. మీరంతా నాకు ధైర్యం ఇవ్వాలి' అని నిజామాబాద్ ప్రజలను కవిత కోరారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన అనంతరం తొలిసారి కవిత తొలిసారి నిజామాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా ‘పాంచజన్యం’ పేరుతో ఐదు పథకాలను వివరించారు.
Nurse Sirisha Case: నర్సు శిరీష కేసులో కీలక పరిణామం.. నిందితుడు సైనా ఉల్లా అరెస్ట్!
Hyderabad, Telangana:Thukkuguda Nurse Case: ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు శిరీషపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా అతి దారుణంగా దాడి చేసి ఆమెను కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం రేపింది. శాంతిభద్రతలు హైదరాబాద్‌లో లోపించాయని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనమని చెప్పవచ్చు. నర్సు శిరీశపై అత్యాచారం, హతమార్చిన సంఘటనపై తీవ్ర రాజకీయ వివాదం రాజుకుంది. ప్రజలంతా నిందితుడిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తుండగా.. ఎట్టకేలకు శిరీషను హతమార్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నర్సు శిరీష అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సైనా ఉల్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ వెల్లడించారు. 'తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్ ఆస్పత్రి సమీపంలో నర్సు శిరీష దారుణ హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా తాము స్థలానికి చేరుకున్న దర్యాప్తు చేశాం' అని తెలిపారు. 'హత్య కేసు నమోదు చేసి తర్వాత నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీల పరిశీలనకు 5 ప్రత్యేక టీమ్స్‌ను నియమించాం. దర్యాప్తులో నలుగురు, ఐదుగురు అనుమానితులను గుర్తించాం' అని శంషాబాద్ డీసీపీ రాజేష్ వివరించారు.
'విచారణలో సైనా ఉల్లాపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నాం. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. శిరీష గదికి సమీపంలోని మెకానిక్ షాపులో సైనా ఉల్లా పనిచేస్తున్నాడు. షాప్ వెనుక కిటికీ నుంచి శిరీషను గమనించేవాడు. అలా కన్నేసి సెలవు రోజు శిరీషపై దాడి చేసి అత్యాచారంతోపాటు హత్య చేశాడు' అని శంషాబాద్ డీసీపీ రాజేష్ వెల్లడించారు. నిందితుడి ఫోన్లో ఇతర నర్సుల ఫొటోలు కూడా పోలీసులు గుర్తించారు. సైనా ఉల్లా అడల్ట్ కంటెంట్‌కు అలవాటు పడి.. లైంగిక వాంఛ తీర్చుకునేందుకు శిరీషపై దాడికి పాల్పడ్డాడు.
'శిరీషతో పాటు గదిలో ఉండే కేరళకు చెందిన మరో నర్సు ఓనం పండుగకు స్వగ్రామానికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించి శిరీష గదిలోకి అతడు చొరబడ్డాడు. శిరీషపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేశాడు' అని శంషాబాద్ డీసీపీ రాజేష్ వివరించారు. శిరీష హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా స్పీడ్ ట్రయల్ జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ ప్రారంభం..కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు!
Yeguva Cherlo Palli, Andhra Pradesh:Veligonda Project Inauguration News: ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల చిరకాల వాంఛ అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల సొరంగాల నుంచి పరవళ్లు తొక్కుతూ వచ్చిన కృష్ణా జలాలకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, చీర సమర్పించి జలహారతి ఇచ్చారు. కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.Weather Report: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు..బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలకు హెచ్చరిక!
Vijayawada, Andhra Pradesh:Rain Forecast Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్ష సూచనను వాతావరణ కేంద్రం తెలిపింది. గ్యాంగెటిక్ పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడనం 31 ఆగస్టు 2026 ఉదయం 08:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో కొనసాగుతోందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది.
ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా - గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి అమృత్సర్, పాటియాలా, నజీబాబాద్, బస్తీ, అల్పపీడన కేంద్రం మీదుగా తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.
తెలంగాణలో రాగల 3 రోజుల వాతావరణం
ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన జారీ చేసింది. వర్షాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని తెలిపింది.
ఏపీలో వర్షాలు, బలమైన గాలుల తీవ్రత..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా, రానున్న కొద్ది రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అమరావతి వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
ప్రజలకు హెచ్చరికలు
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో రోడ్లపై ఉండే భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ మరియు విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని స్పష్టం చేశారు. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
Also Read: ఎట్టకేలకు వెలిగొండ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభం..30 ఏళ్ల నాటి కల సాకారం..
Also Read: బొత్స సత్యనారాయణ Vs విజయసాయిరెడ్డి..బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kakinada Elections: కాకరేపుతున్న కాకినాడ ఎన్నికలు.. ఈసారి జరుగుతాయా లేదా అనేది ఉత్కంఠ
Kakinada, Andhra Pradesh:AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. వచ్చే నెల లేదంటే అక్టోబర్‌లో స్థానిక సంస్థలతోపాటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక నిర్వహణపై మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠతో ఉంటాయి. ఈసారి జరుగుతాయా? సాధారణ ఎన్నికలతోపాటు జరుగుతాయనేది చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం కాకినాడలో 3 లక్షల 12 వేలు జనాభా ఉన్నారు. రస్తుత జనాభా నాలుగు లక్షలు దాటిందని అంచనా. 2017లో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు అప్పటి టీడీపీ హయాంలో జరిగాయి. ఆ తర్వాత 2022 ఆగస్టుతో మేయర్ పదవీకాలం ముగిసింది. అప్పటినుంచి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థ కునారిల్లుతోంది. 2010 నుంచి 2017 మధ్య కూడా కాకినాడకు ఎన్నికలు జరగలేదు. ఇలా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు దాదాపు రూ.110 కోట్ల నిధులు రాకుండా పోయాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కోర్టులో వివాదం ఉంది. ఈ వివాదం తేలితే గాని ఎన్నికలు జరిగే అవకాశాలు లేవంటున్నారు న్యాయ నిపుణులు.
ప్రస్తుతం కోర్టు కేసుల్లో ఉన్న పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల వివాదాలు పరిష్కరించి ఎన్నికలకు వెళ్తామని గతంలోనే పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ వెల్లడించారు. అయితే ఎన్నికలకు సంబంధించి రెండు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కోర్టు కేసులు ఉన్న వాటిని పక్కన పెట్టి కేసులు లేని వాటికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా జరిగితే మరోసారి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే 23 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు సంబంధించిన వివాదాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. కాకినాడ కార్పొరేషన్ లో ప్రస్తుతం 50 వార్డులు ఉండగా కేవలం 48 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. 42వ వార్డుకు సంబంధించి రూరల్ పరిధిలోని గంగనాపల్లి, 48వ వార్డుకు సంబంధించి స్వామి నగర్ పంచాయతీలలో కొంతభాగం వివాదం కోర్టులో ఉండడంతో ఈ రెండు డివిజన్లకు ఎన్నికలు పెట్టకుండా 48 డివిజన్ లకు ఎన్నికలు జరుపుతున్నారు.
ఇక కార్పొరేషన్ లో దాదాపు 17 సంవత్సరాలుగా విలీనమైన ఆరు గ్రామాలకు ఎన్నికలు జరపలేదు. రూరల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తూరంగి, వాకలపూడి, ఇంద్రపాలెం, రమణయ్యపేట, చీడిగ, వలసపాకల పంచాయతీలకు విలీన సాంకేతిక కారణాలతోఎన్నికలు జరపడం లేదు.17 ఏళ్లుగా ఈ ఆరు పంచాయతీలు ఎన్నికలకు నోచుకోలేదు. ఎన్నికలు లేకపోవడంతో ఇప్పటివరకు 170 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను ఈ పంచాయతీలు కోల్పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పంచాయతీ ఎన్నికలు లేవు. ఇటు కార్పొరేషన్ లో కలపలేదు. పూర్తిగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉండిపోయి అభివృద్ధికి నోచుకోక కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు మహిళలు వాపోతున్నారు.
మరోవైపు కార్పొరేషన్ కు సంబంధించి కోర్టులో 5 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తూరంగి, వాకలపూడి పంచాయతీలకు సంబంధించి అప్పటి పాలకవర్గాలు విలీనానికి అనుకూలంగా తీర్మానాలు ఇచ్చాయి. మిగిలిన నాలుగు పంచాయితీలకు ప్రత్యేక అధికారులు అంగీకారం తెలిపారు. కానీ ఇవి చెల్లవని కోర్టులో కేసులు వేశారు. దీంతో కోర్టు వివాదాలు ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వివాదాలు రాకుండా ఎవరూ కోర్టుల్లో కేసులు వేయకుండా సెక్షన్ 3 చట్టం అమలులోకి తెచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అమల్లోకి తెచ్చింది. దీంతో ఎన్నికలు జరగకుండా ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో కేసులు వేసే అవకాశాలు లేవు. దీనిని అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేస్తే వాటికి కూడా ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ మాజీ కౌన్సిలర్ దూసర్లపూడి రమణ రాజు తెలిపారు. ప్రభుత్వం ఇలా చేయకపోవడంతో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. అయితే గ్రామాల విలీనం కోసం పట్టించుకోకుండా ఎన్నికలు జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవల రెండు డివిజన్లకు సంబంధించిన కేసులు విత్ డ్రా అవ్వడంతో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు వెసులుబాటు కలిగింది. మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, పురపాలక సంఘాలలో డివిజన్లు, వార్డుల సంఖ్య పెంచారు. కాకినాడ కార్పొరేషన్ లో డివిజన్ ల సంఖ్య 66 కు పెంచాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు వీటిపై అధికారులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే దీనిపై స్పష్టత ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సెక్షన్ 3 చట్టం గురించి హైకోర్టుకు తెలియజేయడంతో పాటు మిగిలిన ఆరు గ్రామాల విలీన సాంకేతిక ప్రక్రియ చేసేసి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. అయితే ఆరు గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరపాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇతమిద్దంగా ఏ విషయం తేల్చలేక పోతోంది. ప్రస్తుతానికి తెలుగుదేశం, జనసేన, వైసిపి పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ కూడా బిజెపి బలహీనంగానే కనిపిస్తోంది. అయితే పోటీకి ఉత్సుకత చూపిస్తున్న వారు ఎన్నికలు జరుగుతాయని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ స్మార్ట్ సిటీకి ఎన్నికలు జరుగుతాయా.. జరగవా.. జరిపితే 48 డివిజన్లకే జరుగుతాయా.. 50 డివిజన్లకు నిర్వహిస్తారా.. విలీనమైన రూరల్ లోని ఆరు గ్రామాల పరిస్థితి ఏమిటి.. అన్నది తేలాల్సి ఉంది. ఇప్పుడు దీనిపైనే టాక్ ఆఫ్ ది టౌన్ నడుస్తోంది.
BJP Office: రెచ్చిపోయిన కాంగ్రెస్ నాయకులు.. బీజేపీ కార్యాలయానికి నల్ల రంగు
Hyderabad, Telangana:NSUI Attack On BJP Office: తెలంగాణలో మరోసారి తీవ్ర రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆకస్మికంగా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు దూసుకువచ్చి బీజేపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. నల్ల రంగు పూసి బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ నాయకుల తీరుపై కమలం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై సోమవారం మధ్యాహ్నం యూత్ కాంగ్రెస్ నాయకులు దూసుకొచ్చారు. జెండాలు, ఫ్లెక్సీలతో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అమిత్ షా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అమిత్ షా డౌన్ డౌన్ అంటూ అక్కడే యూత్ కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోం శాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒక్కసారిగా యూత్ కాంగ్రెస్ నాయకులు రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలిసే లోపు యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ గేటుపై నల్ల రంగు పూశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, బీహార్‌లో విద్యార్థులపై కాల్పులు జరిగినందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నివాసానికి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ నాయకులు ఇంటిని ముట్టడిస్తారనే సమాచారం మేరకు హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న అతడి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. రామచంద్రరావు ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రామచంద్రరావు నివాసం వైపు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. దీంతో రామచంద్రరావు నివాసం వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. తమ ఇంటిని ముట్టడిస్తే.. రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని బీజేపీ శ్రేణులు హెచ్చరించారు.
Dappu Srinu Remuneration: 'ఇరుముడి'లో 'మల్లెపూల పల్లకి' సెన్సేషన్.. సింగర్ డప్పు శ్రీనుకు భారీ రెమ్యునరేషన్..ఎన్ని లక్షలంటే?
Hyderabad, Telangana:Mallepoola Pallaki Dappu Srinu Remuneration: భక్తి, ఫ్యామిలీ సెంటిమెంట్ నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా విడుదలైన 'ఇరుముడి' చిత్రం వందల కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. 105 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో సైలెంట్ హిట్లు ఉన్నప్పటికీ, ఎలాంటి హంగులు లేని ఒక భక్తి ప్రధాన చిత్రం ఈ స్థాయిలో ట్రెండ్ క్రియేట్ చేయడం విశేషం.
సినిమాను మించిన 'మల్లెపూల పల్లకి' పాట క్రేజ్
సినిమాల్లో పాటలు అసందర్భం అనే వాదనలకు చెక్ పెడుతూ, సందర్భోచితంగా వచ్చే పాట సినిమా విజయానికి ఎంతలా దోహదపడుతుందో 'ఇరుముడి'లోని "మల్లెపూల పల్లకి" పాట నిరూపించింది. చిత్రానికి వచ్చిన పేరు కంటే కూడా ఈ పాటకు వచ్చిన ఆదరణ రెట్టింపు స్థాయిలో ఉంది. ప్రస్తుతం థియేటర్లలో, పూజల్లో, సక్సెస్ మీట్లలో సైతం ఈ పాటే మార్మోగుతోంది.
థియేటర్లలో పాట వస్తున్నప్పుడు రవితేజ ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు హారతులు ఇస్తూ స్టెప్పులు వేస్తున్నారు. ఆడియో పరంగా ఇప్పటికే 24 మిలియన్ల వ్యూస్ సాధించగా, అయ్యప్ప మాల సీజన్ సమయానికి కోట్ల వ్యూస్ దాటే అవకాశముంది.
డప్పు శ్రీను ప్రతిభకు దర్శకుడి గౌరవం
ఈ పాటను జానపద గాయకుడు డప్పు శ్రీనివాస్ (డప్పు శ్రీను) సొంతంగా రాసుకొని, కంపోజ్ చేసుకున్నారు. సినిమాలో ఉపయోగించుకునేందుకు దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఆయన్ను కలిసి అడగ్గానే వెంటనే ఇచ్చేశారు. సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం డప్పు శ్రీను అని, ఆయనకు తగిన గౌరవం ఇవ్వడానికే ఈ పాటను సినిమాలో ఉంచామని దర్శకుడు శివ నిర్వాణ వేదికపైనే వెల్లడించారు.
ఒక్క పాటకు అక్షరాల రూ.9 లక్షల పారితోషికం..
సినిమాలో పాడిన ఏకైక పాట కోసం చిత్ర నిర్మాతలు డప్పు శ్రీనుకు రూ.9 లక్షల భారీ పారితోషికం అందించారు. ఒక డెబ్యూ సింగర్‌కి ఈ స్థాయిలో గుర్తింపుతో పాటు భారీ రెమ్యునరేషన్ లభించడం చాలా అరుదు. సోషల్ మీడియాలో సినిమా సక్సెస్ క్రెడిట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వంద కోట్ల సినిమాలో అవకాశం దక్కడంతో పాటు రూ.9 లక్షల పారితోషికం, విశేష ఆదరణ లభించి ఆయనకు సరైన న్యాయమే జరిగిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: 'దశావతారం' థీమ్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10..సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంఛ్..
Also Read: మంత్రి నారా లోకేష్ వద్దకు 'ఇరుముడి' పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha: కొండా సురేఖ ఫొటో, పేరు మాయం.. మంత్రిగా అనధికారికంగా తొలగించారా?
Kesamudram, Telangana:Warangal Politics: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమెను త్వరలో మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె పేరు, ఫొటో కనిపించడం లేదు. మంత్రివర్గం నుంచి అనధికారికంగా తొలగించారా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల తొర్రూరు మండలంలోని గూడూరులో మంత్రి కొండా సురేఖ పేరు కనిపించలేదు. మరోసారి అధికారిక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చిత్రపటం, పేరు మాయమైంది.
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫ్లెక్సీ రగడ రాజుకుంది. అధికారిక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఫ్లెక్సీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శంకుస్థాపన ఫలకాలపై కూడా మంత్రి కొండా సురేఖ పేరు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కార్యక్రమంలో ఏర్పాటుచేసిన సీట్లపై మంత్రి పేరు కనిపించకపోవడం విశేషం. కొద్దిరోజులుగా కొండా సురేఖ వ్యవహారంపై చర్చ కొనసాగుతుండగా.. తాజాగా ఫ్లెక్సీ వివాదం మరువకముందే మరో ఘటన ఇలా జరిగింది.
మహబూబాబాద్ జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కేసముద్రం మండల కేంద్రంలో 1 కోటి 90 లక్షల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్‌కు ప్రారంభోత్సవం చేశారు. 4 కోట్ల 60 లక్షల రూపాయలతో మున్సిపల్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇనుగుర్తి , దంతాలపల్లి, సీరోలు మండల కేంద్రాల్లో రూ.2.25 కోట్లతో తహసీల్ కార్యాలయాల భవనాల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
కేసముద్రం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో కొండా సురేఖ కనిపించలేదు. బహిరంగ సభలో నారాయణపురం గ్రామానికి చెందిన 780 మంది రైతులకు భూ ఆధార్ పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కేసముద్రం మండల కేంద్రంలో జరిగే అధికారిక కార్యక్రమంలో కొండా సురేఖ ఫ్లెక్సీ లేకపోవడం, శంకుస్థాపన ఫలకాలు, సీట్లపై కూడా మంత్రి కొండా సురేఖ పేరు లేకపోవడం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె చిత్రపటం, ఫొటో వినియోగించకూడదని అధికార యంత్రాంగానికి అనధికారిక ఆదేశాలు వెళ్లడంతో ఇలా వ్యవహారిస్తున్నారని సమాచారం.
Bigg Boss 10 Telugu: 'దశావతారం' థీమ్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10..సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంఛ్..కంటెస్టెంట్ల వివరాలివే!
Hyderabad, Telangana:Bigg Boss 10 Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న టాప్ రియాలిటీ షో 'బిగ్‌బాస్ తెలుగు' పదవ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. గత తొమ్మిది సీజన్లుగా బుల్లితెర వీక్షకులను ఎంతగానో అలరించిన ఈ షో, ఇప్పుడు 10వ సీజన్‌తో సరికొత్త అనుభూతిని పంచేందుకు ముస్తాబవుతోంది.
ఈ షో ప్రయాణాన్ని గమనిస్తే.. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆ తర్వాత మూడో సీజన్ నుండి కింగ్ అక్కినేని నాగార్జున తనదైన శైలిలో షోను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక 10వ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
'దశావతారం' థీమ్.. వినూత్న వ్యూహం
ఈసారి పదవ సీజన్ కావడంతో నిర్వాహకులు దీనిని 'దశావతారం' కాన్సెప్ట్‌తో ప్రత్యేకంగా రూపొందించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం.. షో ప్రారంభంలో కేవలం 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఇంట్లోకి అడుగుపెడతారు.
ఆ తర్వాత షో ముందుకు సాగే కొద్దీ వినోదాన్ని రెట్టింపు చేసేందుకు మిడ్-వీక్ ఎంట్రీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఇతర సెలబ్రిటీలను ఇంట్లోకి పంపించేలా నిర్వాహకులు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సీజన్లో ప్రధానంగా సీరియల్ నటీనటులు ఎక్కువగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
హౌస్‌లోకి 'కామన్ మ్యాన్' ఎంట్రీ..
ఈ సీజన్లో మరో ప్రధాన ఆకర్షణగా 'కామన్ మ్యాన్' కేటగిరీని చేర్చారు. సాధారణ ప్రజల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన టాలెంట్ హంట్ రౌండ్స్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ ఆడిషన్స్ ద్వారా ఎంపికైన ఇద్దరు లేదా ముగ్గురు సాధారణ వ్యక్తులు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ప్రచారంలో ఉన్న కంటెస్టెంట్ల జాబితా
ఈ 10వ సీజన్లో పాల్గొనబోయే సెలబ్రిటీల గురించి మీడియా వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో ఉన్న ప్రముఖుల పేర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1) జబర్దస్త్ ఫేమ్ రాంప్రసాద్
2) నరేష్
3) కమెడియన్ కృష్ణుడు
4) నటుడు అదిత్ అరుణ్
5) 'టెంపర్' వంశీ
6) ప్రముఖ నటి/యాంకర్ వర్షిణి సౌందరరాజన్
7) ముకేష్ గౌడ
8) దేబ్జానీ మోదక్
9) చైత్రా రాయ్
10) యూట్యూబర్ సుధీర్ రెడ్డి
సెప్టెంబర్ 6న గ్రాండ్ ఓపెనింగ్
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో ప్రారంభం కానుంది. నాగార్జున గ్రాండ్ ఎంట్రీ, కంటెస్టెంట్ల పరిచయ కార్యక్రమాలతో బిగ్‌బాస్ హౌస్ సందడిగా మారనుంది. వినూత్నంగా డిజైన్ చేసిన ఈ 'దశావతారం'
థీమ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.
Also Read: బిగ్‌బాస్ ఆఫర్‌ను రెండుసార్లు తిరస్కరించిన క్రేజీ సీరియల్ హీరో..ఈసారి వస్తాడంట!
Also Read: ప్రియుడితో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్..ఎంగేజ్మెంట్ ఫొటోలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Veligonda Project: ఎట్టకేలకు వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. 30 ఏళ్ల నాటి కల సాకారం.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!
Yeguva Cherlo Palli, Andhra Pradesh:Veligonda Project Inauguration: వెనుకబడిన ప్రాంతాల దాహార్తిని, సాగునీటి కొరతను తీర్చేందుకు ఉద్దేశించిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల సుమారు 30 ఏళ్ల నిరీక్షణకు కూటమి ప్రభుత్వం తెరదించింది. శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి నల్లమల కొండలను చీల్చుకుంటూ రెండు జంట సొరంగాల ద్వారా వచ్చిన కృష్ణా జలాలు గంటవానిపల్లె ఆక్విడెక్టును దాటుకుని నల్లమల సాగర్ కాలువల్లోకి పరుగులు తీశాయి. ఈ తొలిదశ పూర్తితో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది.
కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం..
దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని ఫీడర్ కెనాల్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక గిరిజన మహిళలు తమ సాంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం స్వయంగా నీటిలోకి దిగి కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీర సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాలువల్లోకి పరవళ్లు తొక్కిన నీటిపై మహిళలు పుష్పాలు చల్లి స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం తీవ్ర భావోద్వేగానికి గురై, కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి పవిత్ర జలాలను మంత్రులు, అధికారులపై సీఎం చల్లగా, వేద పండితులు ఆయనకు శ్రీశైలం మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని బహూకరించారు.
పండుగ వాతావరణం..
తమ ప్రాంతానికి కృష్ణా జలాలు రావడంతో మార్కాపురం రైతులు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సీఎం సాష్టాంగ ప్రణామం చేయడంతో సభా ప్రాంగణంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. అనంతరం సీఎం వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని (పైలాన్) ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి, కందుల దుర్గేష్, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సాగు, తాగునీటి ప్రయోజనాలు
ఈ తొలిదశ విజయవంతంగా పూర్తి కావడంతో ప్రాంతీయ కరవు నివారణకు మార్గం సుగమమైంది. ప్రాజెక్టు ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి సదుపాయం లభించనుంది.
Also Read: వైసీపీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుడ్‌బై?! వచ్చే ఎన్నికల్లో పోటీకి అభ్యంతరం!
Also Read: మంత్రి నారా లోకేష్ వద్దకు 'ఇరుముడి' పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chilakaluripet Accident: చిలకలూరిపేట ఘోర రోడ్డు ప్రమాదం..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేత!
Chilakaluripet, Andhra Pradesh:Chilakaluripet Road Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేట వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ రోడ్డు ప్రమాద దుర్ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది దళిత వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయక చర్యలు చేపట్టింది.
సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ రోడ్డు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు, ఈ ఘటనపై అధికారుల నుంచి తక్షణ నివేదికను తెప్పించుకుని పూర్తి వివరాలు పరిశీలించారు.
రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం..
ప్రమాద ఘటనపై నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వేలూరు గ్రామానికి చెందిన 8 మంది దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సాయాన్ని కేవలం ప్రకటించడమే కాకుండా, బాధిత కుటుంబాలకు వెంటనే ఆ పరిహారం అందేలా నేడే చెక్కుల పంపిణీ పూర్తి చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
బాధిత కుటుంబాలకు నేరుగా చెక్కుల పంపిణీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వేగంగా స్పందించి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. నేడు అనగా స్థానక పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి, మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారం చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.
Also Read: ఎట్టకేలకు వెలిగొండ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభం..30 ఏళ్ల నాటి కల సాకారం..
Also Read: బొత్స సత్యనారాయణ Vs విజయసాయిరెడ్డి..బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
