icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

రాఖీ హబ్‌గా పెద్దపల్లి.. తెలంగాణలోనే తొలి అతిపెద్ద యూనిట్‌గా రికార్డు..

Hyderabad, Telangana:

Wholesale Rakhi Market: అక్కచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకే రాఖీ పండుగ.. ఇక ఈ పండగకు వేళైంది.. ఒకప్పుడు రాఖీల కోసం కలకత్తా, గుజరాత్, రాజస్థాన్ వైపు చూసిన తెలంగాణ రాఖీ డిస్టీబ్యూటర్స్‌.. ఇప్పుడు ఉత్తరాదికే గట్టి పోటీనిస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాఖీ ప్రొడక్షన్ యూనిట్ రాష్ట్రంలోనే తొలి అతిపెద్ద రాఖీ హబ్‌గా అవతరించి రికార్డు సృష్టించింది. పండగకు ముందే ఈ ప్రాంతంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇది ఇప్పుడు దక్షిణ భారతంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.  

ఒకప్పుడు కేవలం వ్యవసాయ పనులు, బీడీ కార్మిక రంగానికే పరిమితమైన స్థానిక మహిళలు.. ఇప్పుడు నైపుణ్యం కలిగిన రాఖీ డిజైనర్లుగా మారి తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. ఈ ఎస్‌ఆర్‌ఆర్ కేంద్రం ద్వారా దాదాపు 2,500 నుంచి 3,000 మంది మహిళలు ప్రత్యక్షంగా.. పరోక్షంగా గౌరవప్రదమైన జీవనోపాధి పొందుతున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించని ఈ పని ద్వారా సొంత ఊరిలోనే ఉంటూ ఆర్థికంగా బాగా ఎదుగుతున్నారని ఇక్కడి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

లక్ష రకాల డిజైన్లు.. 
ఈ ఏడాది పండుగ సీజన్ కోసం సుమారు లక్షకు పైచిలుకు సరికొత్త డిజైన్లతో లక్షలాది రాఖీలు సిద్ధమయ్యాయి. రూపాయి మొదలుకుని వేల రూపాయల విలువ చేసే డిజైనర్, ట్రెండీతో పాటు సాంప్రదాయక రాఖీలు కొలువుదీరాయి. వ్యాపారులను ఆకట్టుకునేలా భారీ డిస్ ప్లే సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు కొనుగోళ్ల కోసం ఇక్కడికి క్యూ కడుతున్నారు. 

గతంలో మేం రాఖీల కోసం కలకత్తా వెళ్లేవాళ్లం.. కానీ ఇప్పుడు మన పెద్దపల్లిలోనే అంతకంటే అద్భుతమైన డిజైన్లు హోల్‌సేల్ ధరలకే లభిస్తున్నాయి. నాణ్యత, మోడల్స్ చాలా బాగున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న పెద్దపల్లి ఎస్.ఆర్.ఆర్ రాఖీ తయారీ కేంద్రం, జిల్లా పేరును జాతీయ స్థాయిలో మారుమోగేలా చేస్తోంది. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఈ రాఖీ హబ్.. తెలంగాణ పారిశ్రామిక నైపుణ్యానికి ఒక అద్భుతంగా మారింది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

12 ఏళ్ల బంధం.. ఒక్క మోసంతో రోడ్డుకెక్కిన సంసారం.. వీడియో..

Hyderabad, Telangana:

 Wife Caught Red-handed With Lover Video: నమ్మకం.. ఏ సంబంధానికైనా అసలైన పునాది.. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒక్కటిగా నిలబెట్టేది ఆ నమ్మకమే.. కానీ, ఒక్క చిన్న మోసం.. 12 సంవత్సరాల నాటి సుదీర్ఘ అనుబంధాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఒక ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో వెలుగుచూసింది. 12 ఏళ్ల పాటు కలసి ప్రయాణించిన ఒక జంట.. దారుణమైన పరిస్థితిలో రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

అసలేం జరిగింది?
స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. అయితే, తన భాగస్వామి తనను మోసం చేస్తోందనే అనుమానంతో ఇంటి దగ్గరే సీక్రెట్‌గా అక్కడే ఉండి చూశాడు.. అనుమానం కాస్త నిజమవుతూ.. ఆ భాగస్వామి వేరొక వ్యక్తితో బహిరంగంగా దొరిపోయింది.. గత కొంత కాలంగా భర్తకు తెలియకుండానే వేరే ఒకరిని ప్రేమించింది. అంతేకాకుండా ఈ ప్రేమ కాస్త ఇంటి వరకు వచ్చేలా చేసింది. అయితే, భర్తలేని సమయంలో ఆ మహిళ ఇంటి వద్దకే రావడంతో తన భర్త వారి ఇద్దిరినీ పట్టుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడు నడిరోడ్డుపైనే వారిని నిలదీశారు.. ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సిన సమస్య కాస్తా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. చూస్తుండగానే చుట్టుపక్కల జనాలు గుమిగూడడంతో పాటు ఒకరినొకరు నిందించుకోవడంతో పాటు కొట్టుకోవడం వల్ల వీధులు ఆందోళనకరంగా మారాయి. 12 ఏళ్ల కాలంలో పెంచుకున్న ప్రేమాభిమానాలు, పంచుకున్న జ్ఞాపకాలు అన్నీ ఆ ఒక్క క్షణంలో తుడిచిపెట్టుకుపోయాయి.

 
 
 
 
 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

సుదీర్ఘమైన బంధాలు కూడా ఎంత ఇంత త్వరగా విచ్ఛిన్నమవుతున్నాయో ఇది స్పష్టం చేస్తోంది. సంబంధాలలో విశ్వాసం లోపిస్తే.. ఎంతటి సుదీర్ఘ అనుబంధమైనా ఒక్క క్షణంలో కూలిపోతుందనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమని భావించవచ్చు. ఎలాంటి బంధంలోనైనా మనస్పర్థలు రావడం సహజం.. భాగస్వామి ప్రవర్తనలో తేడా అనిపించినా.. లేదా బంధం నుంచి బయటకు రావాలనుకున్నా ప్రత్యక్షంగా మాట్లాడుకోవడమే ఉత్తమమైన మార్గం.. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

CWG 2026 Boxing: కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్‌కు చేరిన మరో భారత అథ్లెట్..బంగారు పతకం వేటలో బాక్సర్ ప్రీతి పవార్!

Hyderabad, Telangana:

CWG 2026 Boxing Final Match: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. టోర్నమెంట్‌లో తొమ్మిదవ రోజు జరిగిన ఉత్కంఠభరితమైన సెమీఫైనల్ బౌట్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టగా, మహిళల 54 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ 3 బాక్సర్ ప్రీతి పవార్ అద్భుత విజయంతో ఫైనల్‌లోకి ప్రవేశించారు.

ఏకపక్ష పోరులో ఘన విజయం
కామన్వెల్త్ గేమ్స్ మహిళల 54 కేజీల విభాగం సెమీఫైనల్ పోరులో ప్రీతి పవార్ జాంబియాకు చెందిన కేథరీన్ మ్వాపెతో తలపడ్డారు. అత్యుత్తమ టెక్నిక్ కనబరిచిన ప్రీతి 5-0 ఏకగ్రీవ నిర్ణయంతో ఘన విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. U-22, ఎలైట్ స్థాయిలలో రెండుసార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన ప్రీతి, ఈ మ్యాచ్‌లోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

మొదటి రౌండ్‌ ప్రారంభంలో ఇద్దరూ హోరాహోరీగా పంచ్‌లు విదిలించినా.. ప్రీతి తన అద్భుతమైన బ్యాక్‌హ్యాండ్, ఓవర్‌హ్యాండ్ లెఫ్ట్, పదునైన జాబ్‌లతో పట్టు సాధించారు. దీంతో జాంబియా క్రీడాకారిణి తొలి స్టాండింగ్ ఎయిట్-కౌంట్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత రెండో రౌండ్‌లో మ్వాపె దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసినా, ప్రీతి తన అద్భుతమైన ఫుట్‌వర్క్, వేగవంతమైన కాంబినేషన్‌లు, లెఫ్ట్ అప్పర్‌కట్‌తో విజృంభించారు. ఈ రౌండ్‌లో మ్వాపెకు మరో రెండు స్టాండింగ్ కౌంట్లు లభించాయి.

చివరిగా మూడో రౌండ్‌లో రింగ్‌ను ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకున్న ప్రీతి, ప్రత్యర్థి దూకుడికి తగినట్లుగా ఆడుతూ గట్టి బాడీ షాట్‌తో మెప్పించారు.

ఐదుగురు న్యాయనిర్ణేతలు (జడ్జీలు) మూడు రౌండ్లలోనూ ప్రీతికే పూర్తి మార్కులు కేటాయించారు. జడ్జీల స్కోర్లు వరుసగా 30-25, 30-25, 30-26, 30-24, 30-25గా నమోదయ్యాయి.

ఫైనల్ పోరు ఎవరితో?
సెమీఫైనల్‌లో అజేయ ప్రదర్శనతో విజయం సాధించిన భారత క్రీడాకారిణి ప్రీతి పవార్, స్వర్ణ పతకం కోసం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో కెనడా క్రీడాకారిణి స్కార్లెట్ డెల్గాడోతో తలపడనున్నారు.

Also Read: కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన నీరజ్ చోప్రా..ఫైనల్లో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు!

Also REad; రహానే కెప్టెన్సీలో భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు..కానీ, చివరికి అతడ్ని పక్కన పెట్టారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

ఆఫీస్‌లో స్కూటీ నడిపిన CEO.. ఇప్పుడు ఈ బాస్ ఫుల్‌ వైరల్..

Hyderabad, Telangana:

CEO Rides Scooty Video Watch: సాధారణంగా కార్పొరేట్ కంపెనీల్లో టార్గెట్లు పూర్తయినప్పుడు కేక్ కట్ చేయడం.. గ్రాండ్ పార్టీ ఇవ్వడం లేదా ఆఫీస్ మెయిల్ ద్వారా అభినందనలు తెలపడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. అయితే, ప్రముఖ రియల్ ఎస్టేట్, హోమ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ నోబ్రోకర్ (NoBroker) CEO మాత్రం తమ సక్సెస్‌ను ఎవరూ ఊహించని రీతిలో జరుపుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

ఆఫీస్ లోపలే స్కూటీ రైడ్..
నోబ్రోకర్ కో-ఫౌండర్‌తో పాటు సీఈఓ అమిత్ కుమార్ అగర్వాల్ (Amit Kumar Agarwal) తన ఆఫీస్ కారిడార్‌లోనే ఒక న్యూ స్కూటీపై జాలీ రైడ్ చేస్తూ కనిపించారు. కంపెనీకి చెందిన ప్యాకేర్స్ అండ్ మూవర్స్ (Packers And Movers) విభాగం ఊహించిన దానికంటే అద్భుతమైన క్వార్టర్లీ టార్గెట్‌ను సాధించినందుకు ఈ ప్రత్యేక వేడుకను జరుపుకుంటారు. ఆఫీస్‌లోనే సీఈఓ స్వయంగా స్కూటీ నడుపుతుంటే.. అక్కడే ఉన్న ఉద్యోగులు ఆనందంతో ఈలలు వేస్తూ.. చప్పట్లతో ఆనందంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను CEO స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకోగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

When people invest their time, effort… pic.twitter.com/VrlZbCIdBx

ఈ మూడు నెలల్లో బాగా వర్క్‌ చేసిన ఉద్యోగులకు గిఫ్ట్స్‌ అందించినప్పటికీ.. ఈ స్కూటీ రైడ్‌ మాత్రం ఆకర్షణగా నిలిచింది. టార్గెట్ సాధించిన స్టార్ పెర్ఫార్మర్‌కు ఈ స్కూటీని ప్రధాన బహుమతిగా అందించారు. కేవలం వేదికపై బహుమతి ఇవ్వడం కంటే.. CEO స్వయంగా దానిని ఆఫీస్‌లో నడిపి ఉద్యోగులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా CEO అమిత్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ శ్రమను, సమయాన్ని చాలా వరకు ఆఫీసుల్లోనే గడిపి.. అద్భుతమైన సక్సెస్‌ సాధించినప్పుడు.. ఆ సంతోషాన్ని కేవలం ఒక ఫార్మల్ అవార్డు వేడుకకే పరిమితం చేయకూడదని.. సరదాగా ఉద్యోగులతో కలసిపోతూ వారిని ప్రోత్సహించడమే నిజమైన గుర్తింపు అని పేర్కొన్నారు. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

నెటిజన్ల ప్రశంసల వర్షం..
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా.. కొద్ది రోజుల్లోనే వేలాది వ్యూస్‌తో పాటు కామెంట్లు వచ్చాయి. ఇలాంటి ప్రాక్టికల్, ఫ్రెండ్లీ సీఈఓ ఉంటే ఉద్యోగులకు పని చేయడం భారం అనిపించదని.. లీడర్‌షిప్ అంటే ఇలాగే ఉండాలి.. ఇది కదా ఉద్యోగులకు ఇచ్చే నిజమైన బూస్టప్.. అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

మీ ఓటు గాల్లో కలిసిపోయిందా?.. తెలంగాణలో 40 లక్షల ఓట్లు ASD లిస్ట్‌లోకి, చెక్ చేసుకోండిలా..!!

BBhoomi2h ago
Secunderabad, Telangana:

 Election Commission 40 Lakh Votes Removal: తెలంగాణలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ప్రక్రియలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల ఓట్లను సేకరించేందుకు వీలు లేనివిగా అంటే అన్ కలెక్టబుల్ గా నిర్దారిస్తూ.. వాటిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 

ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన సర్వేలో భాగంగా 100శాతం ఓట్ల లెక్కింపు పత్రాలను పంపిణీ చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే, కొన్ని పత్రాలు ఇంకా తిరిగి రాలేదు. వాటిని వసూలు చేయలేనివిగా పరిగణిస్తున్నారు. ఓట్ల లెక్కింపు పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియకు గడువు ఇంకా ముగియకపోయినా, వసూలు చేయలేనివిగా గుర్తించిన ఓట్లను అధికారులు ముందుగానే ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తూ ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరసన తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం 33,826,448 ఓటర్లలో సుమారు 76.72శాతం (25,950,506) ఓట్లను ఇప్పటివరకు డిజిటలైజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏఎస్డీ (గైర్హాజరు, బదిలీ, మరణం) కేటగిరీ కింద తొలగించిన ఓట్ల సంఖ్యలో ఆకస్మిక పెరుగుదల అనేక ఆందోళనలను రేకెత్తించింది. రెండు వారాల క్రితం, ఏఎస్డీ కింద కేవలం 13 లక్షల ఓట్లు మాత్రమే నమోదైనట్లు ఈసీ డాష్‌బోర్డ్ చూపించగా, కేవలం రెండు వారాల్లోనే ఈ సంఖ్య 40 లక్షలకు పెరిగింది.

అనేక కీలక నియోజకవర్గాల్లో 20శాతం నుంచి 28శాతం ఓట్లు వసూలు చేయలేని జాబితాలోకి వెళ్లడం గమనార్హం. 

ఉప్పల్: అత్యధికంగా 28శాతం ఓట్లు

పశ్చిమ వరంగల్: 26శాతం ఓట్లు

సికింద్రాబాద్: 24శాతం ఓట్లు  

మంచిర్యాల: 23శాతం ఓట్లు  

సికింద్రాబాద్ కంటోన్మెంట్: 22శాతం ఓట్లు   

కుత్బుల్లాపూర్: 21శాతం ఓట్లు  

కరీంనగర్: 20శాతం ఓట్లు  

చాలా మంది ఓటర్లకు ఇంకా వారి ఓట్ల లెక్కింపు పత్రాలు అందలేదని, వారిని ఓటు వేయడానికి అర్హులు కానివారిగా నమోదు చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. పూర్తిస్థాయి ధృవీకరణ లేకుండా ఏఎస్డీ జాబితా ఆధారంగా ఓట్లను తొలగించడానికి బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ) సంతకం అవసరం ఉంటుంది. అయితే, అధికారులు తప్పుడు సమాచారంతో బీఎల్ఏలపై ఒత్తిడి తెస్తున్నారని, ఓటర్లు ఆ చిరునామాలో లేరని పేర్కొంటూ పత్రాలపై సంతకాలు చేయమని బలవంతం చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.

Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి

Also Read:  ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా

Also Read:  ఆ పరిచయమే కొంపముంచిందా?

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

గ్యాస్ ఆదా చేసేందుకు పాకిస్తానీ కుర్రాడి మైండ్ బ్లోయింగ్ ఐడియా.. వీడియో..

Hyderabad, Telangana:

 Pakistani Tea Vendor Viral Video Watch: సాధారణంగా వీధి వ్యాపారులు తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న ఆలోచనలు సోషల్ మీడియాలో నెటిజన్లను తరచూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఒక టీ వ్యాపారి చేసిన వింత ప్రయోగం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. వేర్వేరుగా గ్యాస్ పొయ్యిలను ఉపయోగించకుండా.. కేవలం ఒకే కడాయిలో ఒకే సమయంలో పకోడీలతో పాటు వేడి వేడి టీ తయారు చేస్తూ అందరినీ షాక్‌కి గురిచేశాడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఒక వ్యాపారి.. ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. సాయంత్రం పూట వేడి వేడి పకోడీలు తింటూ.. కప్పు అల్లం టీ తాగడం చాలామందికి అలవాటు. అయితే, వీటిని తయారు చేయడానికి సాధారణంగా రెండు వేర్వేరు స్టవ్‌లతో పాటు గ్యాస్ సిలిండర్ అవసరమవుతాయి. కానీ ఈ వ్యాపారి గ్యాస్ ఆదా చేయడంతో పాటు సమయాన్ని ఆదా చేసేందుకు ఒక సరికొత్త మార్గాన్ని వెతికాడు..

పెద్ద కడాయిలో నూనె పోసి.. పకోడీలను వేయిస్తున్న సమయంలో.. ఆ కాగుతున్న నూనె మధ్యలో టీ తయారు చేసే ఒక చిన్న పాత్రను పెట్టి... నూనె నుంచి వచ్చే విపరీతమైన వేడికి టీ పాత్రలోని పాలతో పాటు టీ పొడి క్షణాల్లో మరిగిపోవడం మీరు చూడొచ్చు.. ఒక్క చుక్క నూనె కూడా టీలో పడకుండా.. అటు పకోడీలు వేగుతుండగానే.. ఇటు వేడి టీ సిద్ధమైపోయింది.

 
 
 
 
 

సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
ఈ వింత దృశ్యాన్ని అక్కడున్న ఒక వ్యక్తి వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించి.. అతని స్కిల్‌కి ఫిదా అవుతున్నారు. ఇది కదా అసలైన ప్రాక్టికల్ ఇంజనీరింగ్.. గ్యాస్ బిల్లు తగ్గించుకోవడానికి ఇంతకంటే మంచి ఐడియా ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇవేకాకుండా చాలా మంది వింత వింత కామెంట్స్‌ కూడా చేస్తున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report
Advertisement

Gulabi Sadi పాటకి స్టేజ్‌ను షేక్ చేసిన బ్యూటీ.. వీడియో చూశారా?

Hyderabad, Telangana:

 College Student Dance Viral Video: కాలేజ్ జీవితం అంటేనే ఉత్సాహం, సరదా, మరుపురాని జ్ఞాపకాలు.. ఇక క్యాంపస్‌లో ఏదైనా ఈవెంట్‌, ఫ్రెషర్స్ డే లేదా వార్షికోత్సవం వచ్చిందంటే చాలు.. విద్యార్థుల సంతోషానికి అవధులు ఉండవు.. తమలో ఉన్న ఆనందాన్ని వేదికపై సందడి చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశంగా భావిస్తారు. తాజాగా ఇలాంటి ఒక కాలేజ్ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక విద్యార్థిని చేసిన అద్భుతమైన డాన్స్‌కు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో ఇది ఒకటి.. ఒక కళాశాల విద్యార్థిని ఇటీవల ఎంతో వైరల్ అయిన మరాఠీ-పాప్ లవ్ సాంగ్ గులాబీ సాడీ (Gulabi Sadi) పాటపై ఊపేసే రేంజ్‌లో డాన్స్ వేసింది. పాట ప్రారంభం కాగానే.. ఆ విద్యార్థిని ఎంతో అద్భుతంగా స్టేజ్ పైకి వచ్చి.. తన డ్యాన్స్‌ను మొదలుపెట్టడం మీరు చూడొచ్చు.. ఆమె ఇచ్చిన అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్, డైనమిక్ ఎనర్జీకి అక్కడున్న వారు కేకలు వేశారు.

 
 
 
 
 

డ్యాన్స్‌ చేస్తున్నంత వరకు ఆ విద్యార్థిని ఎనర్జీ ఎక్కడా తగ్గకపోవడం ఈ డాన్స్ ప్రధాన విశేషంగా భావించవచ్చు. పాట ట్యూన్‌కు అనుగుణంగా ఆమె చేసిన ప్రతి మూవ్‌మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం డాన్స్ చేయడమే కాకుండా ముఖంలోఎక్స్‌ప్రెషన్స్‌తో ఆ పాటను జీవించేలా చేసింది.. సభలో ఉన్న తోటి విద్యార్థులు, అధ్యాపకులు సైతం ఆమె పర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయి నిలబడి చప్పట్లు, ఈలలతో ప్రోత్సహించడం మీరు చూడొచ్చు.. చాలామంది తమ మొబైల్ ఫోన్లలో ఈ డ్యాన్స్‌ను రికార్డ్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేశారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఈ వీడియో ఇన్స్టాగ్రామ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అతి తక్కువ సమయంలోనే లక్షలాది వ్యూస్, వేలాది లైకులతో దూసుకుపోతోంది. ఇలాంటి ప్రతిభకు తగిన గుర్తింపు లభించాలి.. ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం వేరే లెవెల్.. నిజమైన టాలెంట్ అంటే ఇదే.. అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తిలో ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉంటే.. అది ప్రపంచానికి తెలియడానికి ఎక్కువ సమయం పట్టదని ఈ వీడియో మరోసారి నిరూపించింది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

Sugarcane Juice Tips: వర్షాకాలంలో చెరకు రసం ఎక్కువగా తాగుతున్నారా? డాక్టర్లు చెప్పిన కీలక హెచ్చరికలు ఇవే!

Hyderabad, Telangana:

Sugarcane Juice Sideeffects: వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, గాలిలో ఉండే తేమ వల్ల తరచూ దాహం వేస్తుంటుంది. ఈ సమయంలో రోడ్డు పక్కన కనిపించే చల్లని చెరకు రసం తాగాలని చాలామంది ఆసక్తి చూపుతారు. చెరకు రసంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అయితే, వర్షాకాలంలో రోడ్డు పక్కన లభించే చెరకు రసం తాగడం ఆరోగ్యానికి సురక్షితమేనా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.

వర్షాకాలంలో చెరకు రసం వల్ల కలిగే నష్టాలు
వర్షాకాలంలో వాతావరణం బ్యాక్టీరియా, వైరస్‌ల వృద్ధికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశం ఉంది.

తీవ్రమైన ఇన్ఫెక్షన్లు: పరిశుభ్రత లేని పరిసరాల్లో, ఈగలు ముసిరే ప్రదేశాలలో విక్రయించే చెరకు రసం తాగడం వల్ల కలరా, టైఫాయిడ్, కామెర్లు, డయేరియా వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

కలుషితమైన ఐస్ వాడకం: రసంలో కలిపే ఐస్ క్యూబ్స్ స్వచ్ఛమైన నీటితో తయారు చేయకపోతే, వాటిలోని బ్యాక్టీరియా కారణంగా గొంతు నొప్పి, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి.

శుభ్రత లోపించడం: చెరకు రసం తీసే యంత్రాలు, గ్లాసులను శుభ్రంగా కడగకపోతే వాటిపై పేరుకుపోయే బ్యాక్టీరియా వల్ల రోగనిరోధక శక్తి తగ్గి త్వరగా జబ్బుల బారిన పడతారు.

ఈ సీజన్‌లో పాటించవలసిన ముందస్తు జాగ్రత్తలు
1) వీధి పక్కన కాకుండా, అత్యంత శుభ్రంగా ఉండే ప్రదేశాలలో అప్పటికప్పుడు (ఫ్రెష్‌గా) తీసిన చెరకు రసాన్ని మాత్రమే ఎంచుకోవాలి.

2) వర్షాకాలంలో చెరకు రసంలో ఐస్ క్యూబ్స్ వేయించుకోకుండా తాగడమే శ్రేయస్కరం.

3) చెరకు రసం తీసిన కొద్ది నిమిషాల్లోనే తాగేయాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచితే అది ఆక్సీకరణం చెంది అనారోగ్యానికి దారితీస్తుంది.

4) మధుమేహం (షుగర్) లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో చెరకు రసానికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తీసుకోవాలంటే వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

పోషకాలు నిండిన చెరకు రసం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, వర్షాకాలంలో దాని తయారీలో పాటించే శుభ్రతపైనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సీజన్‌లో సురక్షితంగా ఉండండి!

Also Read: Shravan Month Diet: శ్రావణ మాసం బరువు తగ్గడానికి ఒకే ఒక్కదారి! 10 రకాల శాకాహారంతో కొవ్వు మొత్తం తగ్గిపోతుంది!

Also REad: Apple Pickle: ఆపిల్ పండుతో పచ్చడి ఎలా చేయాలో మీకు తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

కరాచీ లైయారీలో మళ్లీ గ్యాంగ్‌వార్.. బైక్‌పై వచ్చి జుబేర్ బలోచ్‌పై తూటాల వర్షం..

Hyderabad, Telangana:

Lyari Gang War Returns: నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధిలో ఒక్కసారిగా తూటాల వర్షం కురిసింది.. సెకన్ల వ్యవధిలోనే వీధులు రక్తసిక్తమయ్యాయి.. ఒకప్పటి కరాచీ నరకకూపాన్ని కళ్లముందుకు తెచ్చాయి.. పాకిస్తాన్‌లోని అత్యంత కుప్రసిద్ధ గ్యాంగ్‌స్టర్, పీపుల్స్ అమన్ కమిటీ మాజీ అధినేత ఉజైర్ బలోచ్ సోదరుడు జుబేర్ బలోచ్‌పై గురువారం సాయంత్రం దుండగులు మెరుపు దాడి చేశారు. 

ఏం జరిగింది? 
కరాచీలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన లైయారీలోని సింగు లేన్ వద్ద జుబేర్ బలోచ్ తన ఇంటి బయట ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. అక్కడ వాతావరణం సాధారణంగానే ఉంది.. కానీ ఆ ప్రశాంతత వెనుక మృత్యువు దాగి ఉందనే విషయం ఎవరూ ఊహించలేదు.. హఠాత్తుగా ముఖాలకు ముసుగులు ధరించి.. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని ముఠా.. జుబేర్‌ను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో విరుచుకుపడింది.

తూటాల శబ్దాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. జుబేర్ చాతి.. పొట్ట భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే రక్తమడుగులో విలవిలలాడిపోయాడు. ఈ కాల్పుల్లో దారిన పోతున్న ఇద్దరు అమాయక పౌరులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని ఓ షాపు యజమాని ధైర్యం చేసి తిరుగు కాల్పులు జరపడంతో.. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్రంగా గాయపడిన జుబేర్‌ను వెంటనే స్థానికులు కరాచీలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్లను తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని వైద్య వర్గాలు తెలిపాయి. సౌత్ డిఐజి సయ్యద్ అసద్ రజా ఈ ఘటన ప్రత్యేకమైన విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.. 

2012లో పలు తీవ్ర నేరాల్లో అరెస్ట్ అయిన ఆయన.. ఇటీవలే జైలు నుంచి విడుదలై.. ఓ రాజకీయ పార్టీలో చేరి క్రియాశీలకంగా మారారు. ఇక ఆయన అన్న ఉజైర్ బలోచ్ ఓ కేసులో 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుండగా.. ఇతర హత్యలు, ఉగ్రవాద కేసుల్లో ఆయన బెయిల్ పిటిషన్లు ఇటీవలే కోర్టు తిరస్కరించిన్నట్లు తెలుస్తోంది..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

అయితే, ఈ కాల్పుల ఘటనతో లైయారీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కరాచీ ఆపరేషన్ భయంతో దుబాయ్, ఇరాన్‌లకు పారిపోయిన పాత గ్యాంగ్‌స్టర్లు మళ్లీ నగరంలోకి అడుగుపెట్టారనే పుకార్లు స్థానికులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో.. ఎవరి తలలు తెగిపడతాయోనని కరాచీ ప్రజలు భయంతో వణికిపోతున్నారు..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Shravan Month Diet: శ్రావణ మాసం బరువు తగ్గడానికి ఒకే ఒక్కదారి! 10 రకాల శాకాహారంతో కొవ్వు మొత్తం తగ్గిపోతుంది!

Hyderabad, Telangana:

Shravan Month Diet Plan: శ్రావణ మాసం చాలా మందికి ఉపవాసంతో పాటు శాకాహారం మనలో ఎంతో మార్పులను తెలుస్తుంది. ఈ మాసంలో అనుసరించాల్సి ఉత్తమమైన సాత్విక ఆహారం గురించి తెలుసుకుందాం. ఇలాంటి శాకాహారాన్ని తినడం వల్ల తేలికగా మారడం కాకుండా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది శరీరాన్ని శుద్ధి చేయడంలో (డిటాక్స్) కూడా ఈ సాత్విక ఆహారం ఉత్తమంగా పనిచేస్తుంది. ఇలాంటి సాత్విక ఆహారాన్ని అలవాటు చేసుకునేందుకు శ్రావణ మాసం ఓ మంచి అవకాశంగా మారింది. అయితే శ్రావణ మాస డైట్‌ను పాటిస్తూనే బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కొన్ని సరైన ఎంపికలను ఇప్పుడు తెలుసుకుందాం.

1) సొరకాయ (బాటిల్ గార్డ్)
తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం కలిగి ఉండే సొరకాయ బరువు తగ్గడానికి అవసరమైన రెండు అంశాలనూ నెరవేరుస్తుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. అలాగే మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. దీనిని కూరగా వండుకోవచ్చు, సూప్‌గా మార్చుకోవచ్చు లేదా జ్యూస్‌గా కూడా తాగవచ్చు.

2) దోసకాయ
చల్లగా, శరీరానికి తేమను అందిస్తూ, విడిగా తినడానికి లేదా సలాడ్‌లో కలుపుకోవడానికి సులభంగా ఉంటుంది. దోసకాయలో పీచుపదార్థం, నీరు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, ఆకలిని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఉపవాస సమయంలో భోజన ఎంపికలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున, ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

3) సగ్గుబియ్యం
ఉపవాస సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఆహార పదార్థం. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం ముఖ్యం. దీనిని వేరుశెనగలు, పెరుగుతో కలిపి తీసుకుంటే, అది మరింత కడుపు నింపేదిగా, సమతుల్యంగా మారుతుంది.

4) సింగారా (వాటర్ చెస్ట్‌నట్ ఫ్లోర్)
వ్రతంలో తప్పనిసరిగా వాడే ఒక పదార్థం. గ్లూటెన్ రహితం, తేలికైనది, తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. మీ శ్రావణ మాస భోజనాలలో పూరీలు, పాన్‌కేక్‌లు లేదా టిక్కీల కోసం దీనిని ఉపయోగించండి.

5) మఖానా (ఫాక్స్ నట్స్)
తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్, పీచుపదార్థం కలిగిన మఖానా నిజంగా ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది. అతిగా తినడాన్ని అరికడుతుంది. దీనిని నెయ్యి, సైంధవ లవణంతో కొద్దిగా వేయించుకుంటే, ఇది కూడా ఒక రుచికరమైన ఎంపిక.

6) పెరుగు
మంచి బ్యాక్టీరియా, మంచి జీర్ణక్రియ.. ఈ రెండింటినీ పెరుగు అందిస్తుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనిని అలాగే తినండి, లేదా దోసకాయ లేదా పుదీనాతో రైతా తయారు చేసుకోండి.

7) కొబ్బరి నీరు
శరీరంలో నీటి శాతం తగ్గకుండా, తాజాగా ఉండేందుకు ఇది ఒక సహజమైన మార్గం. తక్కువ కేలరీలు, ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా వాతావరణం తేమగా మారినప్పుడు, శ్రావణ మాసానికి ఇది చాలా అనువైనది.

8) పండ్లు (అరటిపండు, ఆపిల్, బొప్పాయి మొదలైనవి)
విటమిన్లు, సహజ శక్తిని ఈ రెండింటినీ పండ్లు అందిస్తాయి. వీటిని అల్పాహారంగా లేదా మధ్యాహ్నపు చిరుతిండిగా తీసుకోండి. ఆపిల్, బొప్పాయి వంటి పీచుపదార్థం అధికంగా ఉండే పండ్లు ముఖ్యంగా జీర్ణక్రియకు సహాయపడతాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.

9) చిలగడదుంప
చిలగడదుంపలో కడుపు నింపేది, పోషకమైనది, పీచుపదార్థం అధికంగా ఉంటుంది. దీనిని ఉడకబెట్టండి లేదా కాల్చండి. ఏదేమైనప్పటికీ, ఇది రుచి విషయంలో ఏమాత్రం రాజీ పడని, వ్రతానికి అనువైన ఒక సులభమైన భోజనం.

10) పెసరపప్పు (పసుపు కాయధాన్యాలు)
కడుపుకు తేలికగా ఉంటుంది, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉపవాసం లేని రోజులకు చాలా మంచిది. ఇది బరువు తగ్గే లక్ష్యాలకు మద్దతు ఇస్తూనే కండరాలను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి శ్రావణ మాసం నిజంగా మంచి సమయం. తేలికైన, పోషకమైన, సాత్విక ఆహారం, బరువు తగ్గే లక్ష్యాలను సాధిస్తూనే సంప్రదాయాలను గౌరవించేలా చేస్తుంది. తగినంత నీరు తాగండి.. మితంగా తినండి.. వీలైనంత వరకు వేయించిన, బరువైన ఉపవాస ఆహారాలను మానుకోండి. అసలు సూత్రం ఇదే.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు పొందుపరిచినది. అనేక రుగ్మతలతో బాధపడే వారు దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు.)

Also Read: Apple Pickle: ఆపిల్ పండుతో పచ్చడి ఎలా చేయాలో మీకు తెలుసా?

Also Read: Weight Loss Habits: బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఉదయం చేయాల్సిన పనులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Bhadrachalam: వరద ఉధృతితో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Telangana:

Godavari Water Flow: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గంట గంటకూ నీటిమట్టం పెరుగుతూ ముంపు ప్రాంత పజలను ఆందోళన కలిగిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఉదయం  గోదావరి నీటిమట్టం 39.8 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నది నుంచి దిగువకు 7,63,488 క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది.

నిన్న సాయంత్రం 28 అడుగుల వద్ద ప్రవహించి పది అడుగుల మేర పెరిగి ప్రస్తుత 39.8 అడుగులకు గోదావరి చేరింది. ఈరోజు సాయంత్రం లేదా రేపు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంద్రావతి, ప్రాణహిత, మేడిగడ్డ నుంచి సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు పెద్ద ఎత్తున గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలంలో రామాలయం కల్యాణ కట్ట, స్నానఘట్టాల వద్దకు వరద చేరింది. వరద ప్రవాహం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు, సలహాలు చేస్తున్నారు.

భద్రాచలం వద్ద హెచ్చరికలు ఇలా ఇస్తారు..
43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక
48  అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక
53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక

పెన్‌గంగా ప్రవాహం
ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ప్రమాదకర స్థాయిలో పెన్ గంగా ప్రవహిస్తోంది. పెన్ గంగాలోకి ఎగువన మహారాష్ట్ర నుంచి 2.5 లక్షల క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో భీంపూర్, జైనథ్, భోరజ్, బేల మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పెన్‌గంగా పరివాహక ప్రాంతంలో భారీ వరదతో పత్తి-సోయా పంటలు నీట మునిగాయి.

ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత
శ్రీ పాద ఎల్లంపల్లి నిండడంతో ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు. నిన్న సాయంత్రం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల లిఫ్టింగ్ కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లక్షల క్యూసెక్కుల నీరు గోదావరి నదిలో చేరింది. కడెం నీళ్లు గోదావరి నది ప్రవాహంతో ఎల్లంపల్లి నిండింది. దీంతో రాత్రి 12 గంటల వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లను లిఫ్ట్ చేసి 4 లక్షల 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ వద్ద 8 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో కొనసాగుతుంది.

0
0
Report
Advertisement

పిచ్చెక్కించే లుక్‌లో Vivo T5x 5G Fusion Red విడుదల.. చీప్‌ ధరకే మీ సొంతం!

Hyderabad, Telangana:

Vivo T5x 5g Fusion Red Variant: భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న వివో (Vivo) సంస్థ.. తన పాపులర్ మోడల్ వివో T5x 5G (Vivo T5x 5G)లో కొత్తగా  ఫ్యూజన్ రెడ్ (Fusion Red) వర్షన్ వేరియంట్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో పాటు ఆకట్టుకునే డిజైన్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న స్టార్ సిల్వర్‌తో పాటు సైబర్ గ్రీన్ రంగులతో పాటు ఈ కొత్త రెడ్ షేడ్ కూడా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది..

ధర వివరాలు..
ఈ వివో T5x 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో కేవలం రూ.24,999లోపే విడుదల కావడం విశేషం.. ఒక రెండవ స్టోరేజ్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ రూ.27,999తో అందుబాటులోకి వస్తోంది. ఇక చివరి వేరియంట్‌ 8GB ర్యామ్‌తో 256GB స్టోరేజ్ రూ.30,999తో విడుదలైంది. 

లాంచ్ ఆఫర్లు..
ఇక హెచ్‌డిఎఫ్‌సి (HDFC), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)తో పాటు ఎస్‌బిఐ (SBI) క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.2,000 వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.. అంతేకాకుండా 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ (No-Cost EMI) వెసులుబాటును కూడా కంపెనీ అందిస్తోంది..

ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీని ప్రధాన ఆకర్షణ 7,200mAh భారీ బ్యాటరీగా భావించవచ్చు. దీనికి తోడు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల లాంగ్ బ్యాటరీ లైఫ్ లభించడమే కాకుండా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 6.76 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (FHD+) డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో (MediaTek Dimensity 7400 Turbo) 4nm ప్రాసెసర్‌పై పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది.. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను కూడా అందిస్తోంది.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

దుమ్ము, నీటి నుంచి ప్రొటక్షన్‌ కోసం IP68తో పాటు IP69 రేటింగ్స్ కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5G, వై-ఫై 6, బ్లూటూత్ 5.4తో పాటు యూఎస్‌బీ టైప్-సి (USB Type-C) కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. భారీ బ్యాటరీ లైఫ్, శక్తివంతమైన కెమెరా, అద్భుతమైన ప్రాసెసర్‌తో రూ. 25,000 బడ్జెట్ విభాగంలో Vivo T5x 5G ఫ్యూజన్ రెడ్ మోడల్ వినియోగదారులకు ఒక అద్భుతమైన ఎంపికగా భావించవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Bhogapuram Airport: ప్రధాని మోదీ పర్యటనకు భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు

Bhogapuram, Andhra Pradesh:

PM Modi AP Tour: భోగాపురం అల్లూరి సీతారామారాజు ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం రేపు అట్టహాసంగా జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి చేసిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు. మొత్తం ఏడు వేల మందితో భద్రతా ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

విమానాశ్రయ ప్రాంతాన్ని ప్రధానంగా 13 విభాగాలుగా విభజించాలని, వాటిని  89 సెక్టార్లుగా చేసి, ప్రతి సెక్టార్‌కూ 80 నుంచి 100 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ బందోబస్తు విధుల కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బలగాలను రప్పించగా, వారిలో 30 మంది ఐపీఎస్ అధికారులతో పాటు డీజీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. అత్యంత ప్రశాంతంగా జరిగేలా దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు.

సభా ప్రాంగణం, ఎయిర్‌పోర్ట్ జోన్, రూట్ బందోబస్తు, పార్కింగ్ ప్రాంతాలను ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఔటర్ పెరిఫెరల్ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు, మెటల్ డిటెక్టర్లతో కూడిన క్రైమ్ టీమ్స్ వారం రోజుల నుంచే తనిఖీలు చేపట్టాయని జిల్లా ఎస్పీ తెలిపారు. నేరాలు జరగకుండా ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించామని, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటికే సభ, ఎయిర్ పోర్ట్ ప్రాంగణంను క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి.

ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రాంతాలను, గ్రామాలను సందర్శించి భద్రతా దళాలు పూర్తి పట్టు సాధించాయి. ప్రధాని  సభలో ప్రముఖులు పాల్గొననున్న కారణంగా భద్రత కట్టుదిట్టం చేసి, నాలుగంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సభ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. ప్రధాని సభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు, 5,000 బస్సులు, ద్విచక్ర వాహనాలతో సహా 7,000 వరకు వీఐపీ, ఇతర ప్రైవేటు వాహనాలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు.

పార్కింగ్ స్థలాలు
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం సందర్భంగా తీవ్ర ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాహనాలు దారి మళ్లించారు.
విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలు: జాతీయ రహదారి-16 పైన ఆనందపురం జంక్షన్ మీదుగా రాజాపులోవ జంక్షన్‌కు చేరుకుని.. అక్కడ కొత్తగా నిర్మించిన ట్రంపెట్ బ్రిడ్జ్ వద్ద కుడివైపునకు మళ్లి పార్కింగ్ స్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది.

శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఒడిశా వైపు నుంచి వచ్చే వాహనాలు: జాతీయ రహదారి-16 మీదుగా వచ్చి భోగాపురం పరిధిలోని ముంజేరు జంక్షన్ లేదా కంచేరు-రావివలస జంక్షన్ల వద్ద సర్వీస్ రోడ్డులోకి మళ్లి పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాలి.
వీఐపీల పార్కింగ్‌: వీఐపీల వాహనాలు నేరుగా వీఐపీ పార్కింగ్‌కు చేరేలా సవరవల్లి జంక్షన్ నుంచి సన్ రే రిసార్ట్స్ సర్వీస్ గేటు మీదుగా ఎయిర్ పోర్టు ప్రాంతంలోకి చేరుకొనే విధంగా రహదారి ఏర్పాటు

సభా ప్రాంగణానికి కేవలం 400 నుంచి 600 మీటర్ల దూరంలోనే అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి కల్పించారు. మార్గమధ్యంలో వాహనాలు నిలిపివేస్తే వెనుక వచ్చే వాహనాలకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉండడంతో ప్రతిఒక్కరూ కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలపాల్సి ఉంటుంది. జాతీయ రహదారిపై సభకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా పార్కింగ్ స్థలాలకు చేరుకొనేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

అత్యవసర సర్వీసులు, నిబంధనలు
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో 48 గంటల పాటు 'నో ఫ్లైయింగ్ జోన్' ప్రకటించారు. డీజీసీఏ అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు డ్రోన్లు ఎగరవేస్తే వాటిని జప్తు చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారు.

అత్యవసర ప్రయాణాలు వాయిదా
రేపు జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో అత్యవసరం అయితే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జిల్లా పోలీస్‌ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు
ఎమర్జెన్సీ పరిస్థితుల ఎదురైతే తక్షణ వైద్యం అందించేందుకు పలుచోట్ల మెడికల్ క్యాంపులు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేకంగా ఒక కారిడార్‌ను ఖాళీగా ఉంచినట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top