\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

కోతుల వల్ల మాకు భారీ నష్టం జరుగుతోంది.. ఈ ఏలుబంటి వేషం వేయడం వల్ల ప్రస్తుతానికి కోతులు రావడం తగ్గినప్పటికీ.. ఇది శాశ్వత పరిష్కారం కాదని.. రోజంతా ఈ వేషంలో ఎండలో ఉండటం చాలా కష్టంగా ఉందని ఆ యువరైతు ధర్మవీర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని చూసి స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు దీనిని తెలివైన ఉపాయం అంటూ సోషల్ మీడియాలో మెచ్చుకోవడం ప్రారంభించారు. అయితే అక్కడే ఉన్న మరి కొంతమంది రైతులు కూడా ఇదే వేషాన్ని వేసి.. కోతుల బెడద నుంచి విముక్తి పొందుతున్నారట..

\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

\n

\n","url":"https://pinewz.com/telugu/story/telangana/rangareddy-viral-video-young-farmer-turns-into-a-bear-you-will-be-surprised-to-see-the-video-1773905092000","datePublished":"2026-03-19T07:24:52+05:30","dateModified":"2026-03-19T07:24:52+05:30"}

\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

కోతుల వల్ల మాకు భారీ నష్టం జరుగుతోంది.. ఈ ఏలుబంటి వేషం వేయడం వల్ల ప్రస్తుతానికి కోతులు రావడం తగ్గినప్పటికీ.. ఇది శాశ్వత పరిష్కారం కాదని.. రోజంతా ఈ వేషంలో ఎండలో ఉండటం చాలా కష్టంగా ఉందని ఆ యువరైతు ధర్మవీర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని చూసి స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు దీనిని తెలివైన ఉపాయం అంటూ సోషల్ మీడియాలో మెచ్చుకోవడం ప్రారంభించారు. అయితే అక్కడే ఉన్న మరి కొంతమంది రైతులు కూడా ఇదే వేషాన్ని వేసి.. కోతుల బెడద నుంచి విముక్తి పొందుతున్నారట..

\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

\n

\n","keywords":"news by pincode, pin news,local news, treading news, latest news, hyperlocal news sites, hyperlocal news app, best news app, local news in hindi, zee newz, ram mandir","image":{"@type":"ImageObject","url":"https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_700x400/public/2026/03/19/566067-bear-viral-video-watch.jpg?itok=j1XWukxQ","height":900,"width":1200},"datePublished":"2026-03-19T07:24:52+05:30","dateModified":"2026-03-19T07:24:52+05:30","author":{"@type":"Person","name":"Dharmaraju Dhurishetty"},"publisher":{"@type":"Organization","name":"Hyper local PWA","logo":{"@type":"ImageObject","url":"https://images2.pinewz.com/images/logo-big.png","width":600,"height":60}}}

\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

కోతుల వల్ల మాకు భారీ నష్టం జరుగుతోంది.. ఈ ఏలుబంటి వేషం వేయడం వల్ల ప్రస్తుతానికి కోతులు రావడం తగ్గినప్పటికీ.. ఇది శాశ్వత పరిష్కారం కాదని.. రోజంతా ఈ వేషంలో ఎండలో ఉండటం చాలా కష్టంగా ఉందని ఆ యువరైతు ధర్మవీర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని చూసి స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు దీనిని తెలివైన ఉపాయం అంటూ సోషల్ మీడియాలో మెచ్చుకోవడం ప్రారంభించారు. అయితే అక్కడే ఉన్న మరి కొంతమంది రైతులు కూడా ఇదే వేషాన్ని వేసి.. కోతుల బెడద నుంచి విముక్తి పొందుతున్నారట..

\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

\n

\n","thumbnailUrl":"https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_700x400/public/2026/03/19/566067-bear-viral-video-watch.jpg?itok=j1XWukxQ","uploadDate":"2026-03-19T07:24:52+05:30","dateModified":"2026-03-19T07:24:52+05:30","datePublished":"2026-03-19T07:24:52+05:30","contentUrl":"NOT AVAILABLE","url":"https://pinewz.com/telugu/story/telangana/rangareddy-viral-video-young-farmer-turns-into-a-bear-you-will-be-surprised-to-see-the-video-1773905092000","isFamilyFriendly":"http://schema.org/True","requiresSubscription":"http://schema.org/False","inLanguage":"en-hi","publisher":{"@type":"Organization","name":"pinewz","url":"https://pinewz.com/","logo":{"@type":"ImageObject","url":"https://images2.pinewz.com/images/logo-big.png","width":"512","height":"512"}}}
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Viral Video: ఎలుగుబంటిగా మారిన యువరైతు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 07:24:52
Hyderabad, Telangana

Bear Viral Video Watch: సాధారణంగా మనం పొలాల్లో దిష్టిబొమ్మలను అప్పుడప్పుడు చూస్తూ  ఉంటాం.. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అందరూ దిష్టిబొమ్మలతో పాటు పాత కుండాలతో తయారుచేసిన కొన్ని బొమ్మలను కడుతూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ రైతు మాత్రం తానే స్వయంగా ఒక దిష్టిబొమ్మగా మారారు.. ఆయన ఏకంగా ఎలుగుబంటి మారువేషం వేసి పొలాల్లో తిరగడం ఎప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వినడానికి వింతగా ఉన్న కోతుల గుంపు నుంచి తన పంటను కాపాడుకోవడానికి ఆ రైతు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లా, ఫిరోజ్‌పూర్ గ్రామానికి చెందిన ధర్మవీర్ అనే ఓ యువ రైతు గత కొంతకాలంగా కోతులు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు తన పంటపై 40 నుంచి 50 కోతుల గుంపు వచ్చి అటు ఇటు తిరుగుతున్నాయి. పొలంలోని బంగాళదుంపలు, ఇతర పంటలను నాశనం చేస్తున్నాయి. అయితే, అతను అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆరైతే వినూత్నంగా ఆలోచించి.. ఈ వేషం కట్టాడు..

దాదాపు 1600 రూపాయలు ఖర్చు చేసి ఒక ఎలుగుబంటి కాస్ట్యూమ్ని కొనుగోలు చేశాడు ఆ యువరైతు.. ప్రతిరోజు ఆ వేషం వేసుకొని పొలంలో అటూ ఇటూ తిరుగుతూ వింత శబ్దాలు చేయడం ప్రారంభించాడు. ఎలుగుబంటిని చూడగానే కోతులు హడలెత్తిపోయి ఆ పంట ప్రాంతాల్లోకి రాకుండా అయిపోయాయి.. కొద్ది రోజులపాటు ఆ యువరైతు అలాగే వెలుగుబంటి వేషాన్ని వేసుకొని అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. కోతులు ఏమాత్రం తన పంట పొలాల్లోకి రాకుండా ఉండిపోయాయి..

pic.twitter.com/IShYPIKEdP

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

కోతుల వల్ల మాకు భారీ నష్టం జరుగుతోంది.. ఈ ఏలుబంటి వేషం వేయడం వల్ల ప్రస్తుతానికి కోతులు రావడం తగ్గినప్పటికీ.. ఇది శాశ్వత పరిష్కారం కాదని.. రోజంతా ఈ వేషంలో ఎండలో ఉండటం చాలా కష్టంగా ఉందని ఆ యువరైతు ధర్మవీర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని చూసి స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు దీనిని తెలివైన ఉపాయం అంటూ సోషల్ మీడియాలో మెచ్చుకోవడం ప్రారంభించారు. అయితే అక్కడే ఉన్న మరి కొంతమంది రైతులు కూడా ఇదే వేషాన్ని వేసి.. కోతుల బెడద నుంచి విముక్తి పొందుతున్నారట..

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 07:35:59
Hyderabad, Telangana:

 Funny Thieves Video Watch Here: సాధారణంగా దొంగలు ఎక్కడికైనా వెళితే ఎంతో జాగ్రత్తగా ఉండడమే కాకుండా.. చప్పుడు కాకుండా పని ముగించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు దొంగలు చేసే చిత్ర విచిత్రమైన పనులు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.. తాజాగా ముగ్గురు దొంగలు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దొంగతనం చేయడానికి ఒక ఇంట్లోకి చొరబడిన వీరు.. వెలుతురు కోసం స్విచ్ అనుకొని పొరపాటున డోర్ బెల్ నొక్కరు.. దీంతో ఆ డోర్ బిల్ భారీ శబ్దంతో మోగింది.. దాంతో భయపడి పోయి దొంగలు అక్కడి నుంచి పరుగో పరుగు పెట్టారు.  ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాను ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అర్ధరాత్రి సమయంలో అంత గాఢ నిద్రలో ఉన్న వేళ ముగ్గురు దొంగలు ఒక ఇంటి ముందు ఉంచిన మోటార్ సైకిల్ ను దొంగతనం చేసేందుకు ప్లాన్ చేశారు.. ఇంటి గేటు తెరిచి ఉండడంతో.. లోపలికి ప్రవేశించారు.. మెట్ల కింద బైక్ పార్క్ చేసి ఉండటాన్ని వారు గమనించారు. ఆ తర్వాత వారికి అక్కడ ప్రదేశం చీకటిగా ఉండడంతో.. ఒక దొంగ అక్కడ ఏదో స్విచ్ బోర్డు ఉందని గమనించి లైట్ వేద్దామని అనుకున్నాడు.. కానీ శీను మొత్తం రివర్స్ అయిపోయింది..

దురదృష్టవశాత్తు అతను నొక్కిన స్విచ్ లైట్‌ది కాదని.. అది ఆ ఇంటి డోర్ బెల్ అని అర్థమైంది.. నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో ఒక్కసారిగా డింగ్ డాంగ్ అంటూ బెల్ మోగడంతో దొంగలు భయపడిపోయారు.. ఇంట్లోని వారి ఎక్కడ మేల్కొంటారో అన్న భయంతో దొంగతనం చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి.. ఆ ముగ్గురు దొంగలు కలిసి అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు.. బెల్ మోగిన వెంటనే వారు అక్కడి నుంచి పరుగులు పెట్టేసారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి.

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

ఈ వింత దొంగతనం ప్రయత్నం అంతా ఆ ఇంటి ఆవరణలో ఉన్న ప్రత్యేకమైన సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వడంతో.. ఆ కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వీడియోలు పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు కాస్త వైరల్ గా మారాయి.. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. వీళ్లు దొంగలా లేక కమీడియన్ ఆర్టిస్టుల అంటూ కామెంట్లు చేస్తున్నారు. పాపం లైట్ వేద్దామనుకుంటే డోర్ బెల్ మోగిపోయింది.. వీరి బ్యాడ్ లక్ మామూలుగా లేదు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు..

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1099
comment0
Report
HDHarish Darla
Mar 19, 2026 06:53:02
Hyderabad, Telangana:

Shraddha Kapoor Marriage News: భారతీయ చిత్రసీమలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక వివాహం జరగ్గా.. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైంది. ఇటు టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రేమలో మునిగి తేలుతున్నారు. అదే కోవలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, సినీ రచయిత రాహుల్ మోడీల వివాహం గురించి ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తలు ఇప్పుడు బాలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ కోడలు తేజస్విని కొల్హాపురి స్పందన వైరల్ అవుతోంది.

శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీల మధ్య ప్రేమ వ్యవహారంపై రూమర్స్ రావడం ఇదేమి కొత్త కాదు. 2024 నుంచే వీరి ప్రేమాయణం నడుస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఓసారి డిన్నర్ తర్వాత వారిద్దరూ కలిసి సన్నిహతంగా కనిపించడంతో వారి ప్రేమను అభిమానులు ఖరారు చేశారు. అదే విధంగా వీరిద్దరూ కలిసి అనేక ప్రదేశాల్లో కలిసి కనిపిస్తున్నారు. దీంతో ప్రేమ నిజమే అనే భావన కొనసాగింది. 

అలానే శ్రద్ధాకపూర్, రాహుల్ మోజీల జంట కొన్ని గతేడాది జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు కూడా హాజరయ్యారు. అంతే కాకుండా వారిద్దరూ ప్రైవేట్ షోలతో సహా అనేక ప్రదేశాలలో కలిసి కనిపించారు. ప్రతి ఈవెంట్‌లోనూ శ్రద్ధా, రాహుల్‌లు కెమెరాకు చిక్కడంతో వారి సంబంధం నిజమే అంటూ ప్రచారం జరిగింది. శ్రద్ధా కూడా వారి సంబంధాన్ని పరోక్షంగా అంగీకరించినట్లు ఇటీవలే కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. తాజాగా వారిద్దరూ కలిసున్న ఫన్నీ వీడియోను శ్రద్ధా కపూర్ షేర్ చేసింది. 

శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీల వివాహంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వీరి పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రద్ధా కుటుంబం నుంచి ఓ హింట్ వచ్చేసింది. శ్రద్ధాకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మీడియాతో పంచుకునే ఆమె అత్త తేజస్విని కొల్హాపురి.. ఈ ప్రేమాయణం రూమర్లపై స్పందించింది. హీరోయిన్ శ్రద్ధా కపూర్ పెళ్లి ఇంకా ఖరారు కాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె వివాహ ఊహాగానాలకు తెరదించింది. శ్రద్ధా పెళ్లి విషయంపై మీడియా ప్రశ్నించగా.. తనకు ఏమీ తెలియదని ఆమె అత్త తేజస్విని చెప్పింది. 

ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో శ్రద్ధా తన అభిమానులకు కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో, ఆమె తన పెళ్లి గురించి ఒక అప్‌డేట్ ఇచ్చింది. ఒక అభిమాని శ్రద్ధాను ప్రశ్నిస్తూ.. "మీకు ఎప్పుడు పెళ్లి అవుతోంది?" అని అడిగాడు. దీనికి ఆ నటి తనదైన సరదా శైలిలో.. "నాకు పెళ్లి అవుతోంది. మీకు కూడా పెళ్లి అవుతోంది." అని సమాధానమిచ్చింది. ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, పెళ్లి గురించి నిరంతరం పుకార్లు వినిపిస్తున్నప్పటికీ, శ్రద్ధా గానీ, రాహుల్ గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ అభిమానులు మాత్రం శ్రద్ధా కపూర్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Nora Fatehi Controversy Song: బూతు పాట, బూతు డ్యాన్స్‌లపై వివాదం..ఎట్టకేలకు మాట్లాడిన 'బాహుబలి' హీరోయిన్!

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్! పెన్షన్ రూ.7,500 పెంపుపై మోదీ సర్కార్ కీలక ప్రకటన.. లోక్‌సభ సాక్షిగా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1043
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 05:10:34
Hyderabad, Telangana:

Malavya Rajayoga 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ  కదలిక మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలిసిందే. శుభగ్రహంగా భావించే శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభంలోకి ప్రవేశించడం అత్యంత శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఏప్రిల్ 19న జరిగే ఈ శుక్ర గ్రహ సంచారంతో కొన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితం లభించబోతోంది. అలాగే ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి లభించడమే కాకుండా సమాజంలో ఊహించని స్థాయిలో గౌరవ మర్యాదలు లభించబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని సంపాదన కూడా లభిస్తుంది. 

మాళవ్య రాజయోగం అంటే..
శుక్ర గ్రహం సొంత రాశి వృషభం లేదా తుల రాశుల్లోకి ప్రవేశించినప్పుడు జాతక చక్రంలో ఒకటి లేదా నాలుగు, ఏడు, పది స్థానాల్లో ఉన్నప్పుడు ఈ ఎంతో శక్తివంతమైన మాళవ్య మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల భోగభాగ్యాలు కలగడమే కాకుండా వాహనయోగంతో పాటు సౌందర్యం, కళా రంగాల్లో ప్రావీణ్యం కూడా లభిస్తుంది. అయితే ఇంతటి ప్రత్యేకత కలిగిన యోగం ఏ రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన ఆనందాన్ని అందించబోతుందో తెలుసుకుందాం. 

వృషభ రాశి 
శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభంలోకి ప్రవేశించినప్పుడు.. సొంత రాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ప్రతి పని ఎంతో సులభంగా పూర్తవుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం గా భావించవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కెరీర్ పరంగా ఈ యోగం ఎంతో మేలు చేయబోతోంది. ముఖ్యంగా కార్యాలయాల్లో పనులు చేసే వ్యక్తులకు పదోన్నతులు లభించడమే కాకుండా బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో తప్పకుండా ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు. 

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచారం అద్భుతమైన ప్రయోజనాలనుందిస్తుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరగడమే కాకుండా అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కూడా ఊహించని స్థాయిలో గడించబోతున్నారు. అలాగే జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మకర రాశి 
మకర రాశి వారు ఈ సమయంలో తప్పకుండా అద్భుతమైన సంతోషకరమైన వార్తను వినబోతున్నారు. విద్యార్థులకు ఉద్యోగులకు ఈ సమయం సృజనాత్మకత పెంచబోతోంది. అలాగే వీరికి ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. పూర్వీకుల ఆస్తుల వివాదాలు పరిష్కారం కూడా లభించబోతోంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1076
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 04:57:59
Hyderabad, Telangana:

Venus Transit 2026 Effect On Zodiac 2026: నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహంగా భావించే శుక్రుడు నక్షత్ర సంచారాన్ని చేయబోతున్నాడు. పంచాంగం ప్రకారం 2026 సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ తెల్లవారి జామున ఒకటి గంటల సమయంలో శుక్రుడు భరణి నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. ఏప్రిల్ 16వ తేదీ వరకు అంటే సుమారు 11 రోజులపాటు శుక్రుడు ఇదే నక్షత్రంలో కొనసాగడం విశేషం.. భరణి నక్షత్రానికి శుక్రులే అధిపతి కావడంతో ఈ సమయం కొన్ని రాశుల వారికి శుక్రుడు ప్రభావం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల నాలుగు రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు కూడా సంభవించబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ప్రేమ జీవితంలో మధురానుభూతులు లభించబోతున్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే శుక్రుడి ప్రభావం ఏ రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకువస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి ఊహించని లాభాలు:
వృషభ రాశి 
శుక్రుడి నక్షత్ర మార్పుల కారణంగా వృషభరాశి వారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవడమే కాకుండా.. ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే ఈ సమయంలో జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందే అవకాశాలున్నాయి. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి.

తులారాశి 
శుక్రుడు తులా రాశికి అధిపతి కావడంతో ఈ రాశి వారిపై కూడా ఊహించని ప్రభావం పడుతుంది. అయితే, వీరికి ఈ సమయం గోల్డెన్ పీరియడ్‌గా మారుతుంది. ముఖ్యంగా వీరికి అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఆందోళన ఇప్పుడు తొలగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న చిక్కులు వీడి.. భాగస్వామితో ఎంతో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. నూతన గృహాలు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు.

మిధున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం ఆర్థికంగా అద్భుతమైన లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలు అందించబోతోంది. అలాగే వీరికి అద్భుతమైన గుర్తింపు కూడా లభించబోతున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు.  మిధున రాశి వారికి ఈ సమయంలో సృజనాత్మకత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా శుక్రుడి సంచారంతో అనుకున్న పనుల్లో అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలున్నాయి. పాత అప్పుల నుంచి కూడా ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది. అలాగే వైవాహిక జీవితంలో ఉన్న మనస్పార్థాలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో విపరీతమైన శాంతి నెలకొంటుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1049
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 04:47:39
Hyderabad, Telangana:

Jupiter Favored Zodiac Signs 2026 In Telugu: నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహంగా.. జ్ఞానానికి, సంపదకు కారకుడిగా భావించి బృహస్పతికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో గురుడు ఒక వ్యక్తి జాతకంలో బలమైన స్థితిలో ఉంటే సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు అపారమైన సంపదలు లభిస్తూ ఉంటాయి. మొత్తం 12 రాశులలో మూడు రాశులు అంటే దేవ గురువుకు అత్యంత ప్రీతికరమైనవని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అందుకే ఈ రాశుల వారిపై ఆయన ఎల్లప్పుడూ కరుణాకటాక్షాలు ఊహించని స్థాయిలో అందిస్తూ ఉంటాడు. అయితే జ్యోతిష్య శాస్త్రం పరంగా దేవ గురువు బృహస్పతి అత్యంత ఇష్టపడే రాశులేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
ధనస్సు రాశి 

ధనస్సు రాశి వారికి స్వయంగా బృహస్పతి అనుగ్రహాన్ని అందిస్తాడు. కాబట్టి వీరికి ఎల్లప్పుడు గురువు ప్రభావం అత్యధికంగా ఉంటుంది. వీరు సహజంగానే ధైర్యవంతులు కావడమే కాకుండా అదృష్టవంతులు. కాబట్టి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా గురుడి అనుగ్రహం వల్ల అద్భుతంగా ముందుకు సాగుతారు. అలాగే వీరి ఆర్థిక పరిస్థితులు ఎల్లప్పుడూ నిలకడగా ఉంటాయి. వ్యాపార రంగాల్లో ఉన్న ధనస్సు రాశి వారికి ఎల్లప్పుడూ గురు అనుగ్రహం లభించి ఉన్నత శిఖరాలకు చేరే విధంగా అడుగులు వేస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా దేనికి లోటు ఉండదు..

మీన రాశి 
మీన రాశి వారికి కూడా బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి వీరికి కూడా ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరు జీవితంలో గురువు అనుగ్రహం వల్ల జ్ఞానాన్ని సొంతం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ప్రశాంతంగా జీవించేందుకు ఇష్టపడతారు. వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ అద్భుతమైన విజయం లభిస్తుంది. విద్యా రంగాల్లో పనులు చేసే వారికి తిరిగి ఉండదు. గురుడి ఆశీస్సులతో వారసత్వ సంపాదన కూడా విపరీతంగా ఉంటుంది. 

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ గురువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. వీరికి కూడా ఊహించని ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వీరు అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో జీవితాన్ని ముందుకు సాగిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అపారమైన కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతూ ఉంటాయి. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా అపారమైన సంపద పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1032
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 18, 2026 16:28:12
Hyderabad, Telangana:

Telangana Assembly Budget Session: తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిభింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్‌ను గవర్నర్‌ ఆవిష్కరించారని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు.  అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు.. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని పేర్కొన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ఠ ప్రణాళిక అని వివరించారు. గొప్ప సంకల్పాన్ని, పవిత్ర శాసన సభ వేదిక నుంచి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శుక్లా గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు.

Also Read: Pre Wedding Shoot: వీళ్లకేం పోయేకాలం రా అయ్య.. మురికి కుంటలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడారు. గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలని గవర్నర్ ప్రసంగంలో వివరించినట్లు తెలంగాణ సీఎం తెలిపారు. 'భవిష్యత్‌లో ఏఐ సునామీ రాబోతుంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్‌ను గవర్నర్‌ వివరించారు. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్  2047 విజన్ డాక్యుమెంట్ ను కనీసం చదివారా? చూశారా' అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

Also Read: KTR Chit Chat: మూసీ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్‌ భారీ అవినీతి, ప్రజల భూముల దోపిడీ: కేటీఆర్‌

'గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు. ఇది నవశకానికి నాంది పలుకాల్సిన సమయం. అధికారం కోల్పోయామన్న దుఃఖమే తప్ప ప్రభుత్వానికి సహకరించాలన్న ప్రధాన ప్రతిపక్షానికి ఆలోచన లేదు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఎవరూ అడ్డుపడ్డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించుకున్నట్లు చెప్పారు.

Also Read: EPS 95 Pension: ఉద్యోగులకు ఉగాది గిఫ్ట్‌.. కనీస పింఛన్‌ రూ.7,500 పెంచేందుకు ఆమోదం?

'కాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించాం. త్వరలో ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నాం' అని తెలంగాణ సీఎం విరించారు. మన హైదరాబాద్‌ నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే.. చెరువులను  పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరం మనల్ని క్షమించదని పేర్కొన్నారు. 'వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమం అని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది? మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా?' అని ప్రతిపక్షంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ఉప్పల్ భగాయత్‌లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూసొద్దాం రండి అని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1086
comment0
Report
RGRenuka Godugu
Mar 18, 2026 15:55:11
Hyderabad, Telangana:

Brother Killed Sister In Abdullapurmet: ఇటీవల కాలంలో తల్లి పిల్లల్ని చంపడం.. భార్య భర్తలు ఒకరిని ఒకరు చంపుకోవటం దుర్ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రోజురోజుకు మానవ సంబంధాలు ప్రశ్నార్ధకంగానే మారుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారంలో కూడా ఇలాంటి దారుణ ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అక్క చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది అని ఒక తమ్ముడు అత్యంత దారుణంగా చంపి చెరువులో పడేశాడు.  ఇది ఇలా ఉండగా కొన్నాళ్ల క్రితమే బావ కూడా చనిపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నగర శివారులో ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా బాటసింగారం ఉలిక్కిపడినట్టు అయింది. తోడబుట్టిన అక్కని అత్యంత కిరాతకంగా హత్య చేసి చెరువులో పడేశాడు. ఇది స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. పోలీసుల ప్రకారం బాటసింగారానికి చెందిన పప్పురామ్‌ అక్క ప్రవర్తన పై విసుకు చెందాడు. బావ కూడా కొన్ని రోజుల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత అక్క ప్రవర్తన తీరులో మార్పువచ్చింది. దీంతో ఆమెకు సర్దిచెప్పడానికి పలుమార్లు ప్రయత్నించాడు. గత నెల 28వ తేదీన కూడా ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. ఒక్కసారిగా ఇద్దరి మధ్య వివాదం పెద్దగా అవ్వడంతో ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు అక్కను హత్య చేశాడు. ఈరోజు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చంపిన తర్వాత ఆమెను ముక్కలుగా చేసి ఎవరికీ అనుమానం రాకుండా స్థానికంగా ఉండే చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా అక్క పై మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు ఇతర సాక్షా దారాలు తర్వాత తమ్ముడే అక్కను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడు పప్పు రామ్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదనే స్టైల్ లో విచారించగా అసలు సంగతి విషయం బయటకు వచ్చింది.

Also Read:  ఘోర ప్రమాదం.. దేవతపల్లి గేట్‌ వద్ద ఆటోను వేగంగా ఢీకొట్టిన లారీ, నలుగురు స్పాట్‌ డెడ్‌..!!

Also Read:  ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా నలుగురి దుర్మరణం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1066
comment0
Report
HDHarish Darla
Mar 18, 2026 15:07:19
Hyderabad, Telangana:

Nora Fatehi Controversy Song: కన్నడ హీరో ధ్రువ సర్జా, దర్శకుడు ప్రేమ్ తెరకెక్కించిన 'కేడీ' సినిమా ఇప్పుడు వివాదాల్లో నిలిచింది. ఇటీవలే విడుదలైన ఆ సినిమా ఐటెం సాంగ్ అందుకు ప్రధానకారణం. ఆ పాట ఇప్పుడు అసభ్యంగా ఉందని నెటిజన్లు విమర్శించారు. అంతేకాకుండా ఈ సాంగ్ గురించి నేడు లోక్‌సభలోనూ చర్చ జరిగింది. అయితే ఈ ఐటెంసాంగ్‌ దుమారంపై అందులో నటించిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి స్పందించింది. 
  
బూతుపాటగా వివాదస్పదంగా మారిన ఈ పాటలో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత నోరా ఫతేహి సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. "ఈ పాటను సుమారు మూడేళ్ల క్రితం కన్నడలో చిత్రీకరించిన టైమ్‌లో నేను నటించాను. సంజయ్ దత్ వంటి పెద్ద నటులు ఉండడం వల్ల నేను నటించేందుకు అంగీకరించాను" అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది. 

అయితే ఆ సాంగ్ చిత్రీకరించిన సమయంలో కన్నడ పాట ప్లే చేసిన కారణంగా ఆ పదాలు తనకు అర్థం కాలేదని నటి నోరా ఫతేహి చెప్పింది. పాటలోని సాహిత్యం అర్థాన్ని తెలుసుకునేందుకు తాను చిత్రబృందం చెప్పిన మాట విన్నానని స్పష్టం చేసింది. వాళ్లు తనకు వివరించే క్రమంలో తనకు ఎలాంటి బూతులాగా అనిపించలేదని నోరా చెప్పింది. నాకు హిందీ వచ్చు. తాజాగా విడుదలైన తర్వాత హిందీ వెర్షన్ విన్నాక ఈ సాంగ్ వివాదం తెస్తుందని ముందే నాకు తెలిసిపోయిందని నోరా ఫతేహి స్పష్టం చేసింది.

అంతేకాకుండా తన అనుమతి లేకుండా చిత్రబృందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి తనతో పాటు సంజయ్ దత్ ఫోటోలను ప్రచారానికి వాడినందుకు నోరా ఫతేహి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తన గౌరవాన్ని భంగం కలిగించే ఏ విషయాన్నైనా తాను సమర్థించనని నోరా అంటోంది. పాట విడుదల కార్యక్రమంలోనే తాను దర్శకుడు ప్రేమ్‌ను వివాదం అవుతుందని హెచ్చరించినట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే ఇలాంటి వివాదం నడుమ తాను ఎలాంటి ప్రమోషన్స్‌లో పాల్గొనని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.

ఈ పాటకు సంబంధించిన వివాదంపై నేడు లోక్‌సభలోనూ చర్చ జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ.. 'కేడీ' అనే కన్నడ సినిమాలోని వివాదస్పద లిరికల్ సాంగ్‌ను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు మంత్రి ప్రకటించారు. కన్నడ, హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్ర

Also Read: Job Notification: పదో తరగతి పాసయ్యారా? నెలకు రూ.63,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగం..జాబ్ ఏంటో తెలుసా?

Also Read; EPS-95 Pension Hike: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్! పెన్షన్ రూ.7,500 పెంపుపై మోదీ సర్కార్ కీలక ప్రకటన.. లోక్‌సభ సాక్షిగా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1055
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 18, 2026 12:29:08
Balapur, Telangana:

Sudden Heavy Rains: వేసవికాలం దంచికొడుతున్న ఎండలతో తీవ్ర ఉక్కపోత ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు వర్షాలతో హాయిగా ఉన్నారు. వేసవికాలంలో అకాల వర్షాలు జోరందుకున్నాయి. వరుసగా మూడు రోజులుగా తెలంగాణలో వర్షం వాతావరణం నెలకొనగా.. ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంది. బుధవారం ఏపీలోని పలు జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడింది. హైదరాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలతోపాటు ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అంతేకాకుండా వడగళ్ల వాన పడింది. ఈ వానతో రైతులతోపాటు సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read: Pre Wedding Shoot: వీళ్లకేం పోయేకాలం రా అయ్య.. మురికి కుంటలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

ఏపీలోని పలు జిల్లాల్లో..
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు పరిధిలో భారీ వాన కురిసింది. పమిడిముక్కల మండల పరిధిలో వడగండ్ల వాన పడడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నూజివీడులో వర్షం బీభత్సం సృష్టించింది. నూజీవీడు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద లెక్చరర్ దొడ్డ కమల కుమారి ఇంటి పైభాగం ధ్వంసమైంది. పట్టణంలో అకస్మాత్తుగా బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. కంగారు పడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటికి పరిశీలించగా పిడుగు పడడంతో ఇంటిపై భాగం ధ్వంసమైందని కుటుంబసభ్యులు గుర్తించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: KTR Chit Chat: మూసీ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్‌ భారీ అవినీతి, ప్రజల భూముల దోపిడీ: కేటీఆర్‌

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
వేసవికాలంలో వాతావరణం భిన్నంగా మారింది. తెలంగాణలో రాగల మూడు రోజులు కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం కొనసాగిన ద్రోణి బుధవారం మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుంచి మరాఠ్వాడ, విదర్భ ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. మరో ద్రోణి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టం నుంచ 0.9 కి మీ ఎత్తులో ఏర్పడింది. దీని ఫలితంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: EPS 95 Pension: ఉద్యోగులకు ఉగాది గిఫ్ట్‌.. కనీస పింఛన్‌ రూ.7,500 పెంచేందుకు ఆమోదం?

బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. 40 నుండి 50 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి  మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని చెప్పడంతో ఈ వార్త తెలంగాణ ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1100
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 18, 2026 11:01:11
Wadgaon, Maharashtra:

Viral Pre Wedding Shoot: ప్రస్తుతం మాంచి ముహూర్తాలు ఉండడంతో శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత వివాహాలకు ముహూర్తాలు ఉండడంతో యువతీ యువకులు వివాహానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే పెళ్లి నిశ్చయమైన వాళ్లు తమ ప్రి వెడ్డింగ్‌ షూట్‌లు చిత్ర విచిత్రంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ జంట తీసుకున్న ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ తీవ్ర వివాదానికి దారి తీసింది. మురికి కుంటలో పడిపోయినట్టుగా ఆ జంటకు సంబంధించిన షూట్‌లు తీయడం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR Chit Chat: మూసీ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్‌ భారీ అవినీతి, ప్రజల భూముల దోపిడీ: కేటీఆర్‌

ఫొటోల పిచ్చి పీక్స్‌కు చేరినట్టు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పేరిట జంటలతోపాటు ఫొటోగ్రాఫర్లు చేస్తున్న చేష్టలు దారుణంగా ఉంటున్నాయి. ఎక్కడో తెలియదు కానీ ఒక చోట కాబోయే కొత్త జంట తమ ప్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ నిర్వహించుకున్నారు. కాబోయే దంపతులను మరపురాని విధంగా ఫొటోలు, వీడియోలు తీయాలని ఫొటోగ్రాఫర్లు భిన్నంగా ఆలోచించారు. నీటిలో తేలియాడుతున్నట్టు కనిపించేలా ఫొటోలు, వీడియో తీయాలని నిర్ణయించుకున్నారు.

Also Read: EPS 95 Pension: ఉద్యోగులకు ఉగాది గిఫ్ట్‌.. కనీస పింఛన్‌ రూ.7,500 పెంచేందుకు ఆమోదం?

కొత్త జంటకు తెల్లటి దుస్తులు ధరించారు. అనంతరం ఓ క్వారీ ప్రాంతంలో నిలిచిపోయిన నీళ్లలో వారిని పడుకోబెట్టారు. వధువు ఒకవైపు.. వరుడు మరోవైపు తల పెట్టి నిద్రిస్తుండగా వారిద్దని వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ దృశ్యాలు చూస్తుంటే క్వారీలో పడి ఇద్దరు చనిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఆ వీడియోను ఒకరు తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఒక మిలియన్‌ మంది చూడగా.. అందరూ కామెంట్‌ చేస్తూ తమ స్పందన తెలియపరుస్తున్నారు.

Also Rea: One Crore Robbery: 24 గంటల్లో రూ.కోటి దోపిడీ కేసు ఛేదన.. శభాష్‌ తెలంగాణ పోలీస్‌!

ఇంతకీ వారి థీమ్‌ ఏమిటంటే నీటిలో చిక్కుపోయినట్టు.. తమ ప్రేమ బంధంలో కూడా నిండా మునిపోయినట్లు ఫొటోగ్రాఫర్లు సరికొత్త థీమ్‌ను రూపొందించారని నెటిజన్లు చెబుతున్నారు. భిన్నంగా.. వినూత్నంగా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసినట్లు భావిస్తున్నారు. వాస్తవంగా ఆ వీడియో చూస్తే మాత్రం ఇద్దరు నీటిలో పడి చనిపోయినట్లు కనిపిస్తోంది. ఇలా దారుణంగా ఎలా తీస్తారని ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ తీసే వారిపై ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిచ్చి పీక్స్‌కు చేరిందని మండిపడుతున్నారు. ఏమిటిది? ఎందుకు ఇలా తీయించుకోవడం? అని నిలదీస్తున్నారు. కాగా ఆ కొత్త జంట పెళ్లికి ముందే వైరల్‌గా మారారు. అయితే వారు ఎవరు? ఈ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియదు. ఆ వీడియో చూస్తుంటే తమిళనాడులో జరిగినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరు చూసి.. మీ స్పందనను కామెంట్‌ రూపంలో తెలపండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1057
comment0
Report
RGRenuka Godugu
Mar 18, 2026 10:41:25
Hyderabad, Telangana:

Jyeshtabhishekam at Tirumala 2026: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం కొన్ని వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అందుకే అక్కడ ప్రతిరోజూ శ్రీవారి భక్తలతో, గోవిందనామస్మరణాలతో మర్మోగుతుంది. ఇక రేపు ఉగాది సందర్భంగా తిరుమలలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఆ తరువాత శ్రీరామ నవమి, శ్రీరామ పట్టాభిషేకం కూడా ఆస్థానాలు మొత్తంగా మార్చి నెలలో మూడు జరుగుతాయి. ఆస్థానం అంటే 'దర్బారు' అని అర్థం. అయితే తిరుమలలో శ్రీవారికి జ్యేష్టమాసంలో జ్యేష్టాభిషేకాలు కూడా నిర్వహించడం కూడా ఆనవాయితీగా వస్తోంది.. ఇది స్వామివారి నిజరూప దర్శన ఉత్సవం. భక్తులు కూడా ఈ వేడుకను కనులారా తిలకించవచ్చు. ఏడాదికి ఒకసారి కలిగే అరుదైన దర్శన భాగ్యాన్ని మీరు తిలకించాలనుకుంటున్నారా? 

ఈ జ్యేష్టాభిషేకం మూడు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. 2026 జూన్ 26వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు . ఈ నేపథ్యంలో 2026 మార్చి 21వ తేదీ నుంచి ఈ ఉత్సవాలకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచి జ్యేష్టాభిషేకం టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అధికారిక వెబ్సైట్లో https://ttdevasthanams.ap.gov.in/ లో తిరుమల శ్రీవారి భక్తులు బుక్ చేసుకోవచ్చు. 

ప్రతిఏటా శ్రీమలయప్పస్వామికి ఈ జ్యేష్టాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రధానంగా స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా.. కళాకాంతులు తరిగిపోకుండా ఈ అభిషేకం నిర్వహించడం ఉత్తమం. అందుకే ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ క్రతువు సంపంగి ప్రాకారం కళ్యాణమండపంలో మూడో రోజులపాటు నిర్వహిస్తారు.

 మొదటి రోజు స్వామివారికి ఉన్న సువర్ణకవచాన్ని తొలగించి.. వజ్ర కవచాలు తొడుగుతారు. శ్రీవారి ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఇక రెండో రోజు ముత్యాల కవచాన్ని అలంకరించి తిరువీధి ఉత్సవం నిర్వహించి, మూడో రోజు తిరుమంజనం తర్వాత బంగారు కవచాలని మళ్లీ అలంకరిస్తారు. దీన్నే జష్టాభిషేకమని పిలుస్తారు. ప్రతి ఏడాది జేష్ట మాసంలో జేష్ఠ నక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మూడు రోజులు పాలు, పెరుగు, తేనె పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకిస్తారు. 

Read more: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జూన్‌నెల దర్శన, గదుల కోటా విడుదల..!

Read more: Annamayya: 10వ తరగతి పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.34000 జీతం, ఎలా అప్లై చేయాలంటే?

 ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 20వ తేదీన తిరుప్పావడ, వసంతోత్సవం సేవలు జూన్ 21వ తేదీన నిజపాద దర్శనం, 22న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్‌సేవలు కూడా టీటీడీ రద్దు చేస్తుంది. ఇక ఈ ఉత్సవానికి సంబంధించిన టిక్కెట్‌ రూ.400 వరకు ఉంటుంది. 

 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
  శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు ప్రజలకు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని వారు ఆకాంక్షించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

1070
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 18, 2026 09:31:54
Hyderabad, Telangana:

Telangana Assembly Budget Session: 'ఇది సర్కార్ కాదు.. సర్కస్. అధికార యంత్రాంగం నియంత్రణ తప్పింది. కుక్క తోకను ఆడించటం కాదు, తోక కుక్కను ఆడించినట్టు వ్యవహారం జరుగుతోంది' అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్‌ చురకలు అంటించారు. 'భూ సేకరణను ఫార్మా సిటీ పేరిట చేసి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇతరులకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోంది. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టుల మధ్య ప్రజలను ఎలా నివసింపజేస్తారు' అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు, ఫార్మా సిటీకి శ్రీకారం చుట్టింది కేసీఆర్‌ ప్రభుత్వమేనని, ఎస్‌టీపీలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌దని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. వడ్డీలేని రుణాలు రూ.57 వేల కోట్లు అసెంబ్లీలో చెప్పిన భట్టి, సీతక్క ఎవరూ రాజీనామా చేస్తారో ప్రజలకు చెప్పాలని కోరారు.

Also Read: EPS 95 Pension: ఉద్యోగులకు ఉగాది గిఫ్ట్‌.. కనీస పింఛన్‌ రూ.7,500 పెంచేందుకు ఆమోదం?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మూసీ ప్రాజెక్ట్, వడ్డీలేని రుణాలు, గవర్నర్ ప్రసంగం, పరిపాలనా వైఫల్యాలపై విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మూసీ ప్రాజెక్ట్‌కు లక్షన్నర కోట్లు ఎలా సమీకరిస్తుందో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ఆ డబ్బులను ప్రజలకు ఇచ్చే గ్యారంటీలకు వినియోగిస్తే మేలని సూచించారు.

Also Read: One Crore Robbery: 24 గంటల్లో రూ.కోటి దోపిడీ కేసు ఛేదన.. శభాష్‌ తెలంగాణ పోలీస్‌!

'ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్ బాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. డీపీఆర్‌ ఇచ్చామని చెబుతున్నప్పటికీ వాస్తవానికి డీపీఆర్‌ సమర్పించకపోవడంతోనే ఏడీబీ రుణం మంజూరు కాలేదు. పైసా ఇచ్చినోడు లేడు.. డీపీఆర్‌ లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. 'మూసీ ప్రాజెక్ట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారు. ఆరు నూరైనా పూర్తి చేస్తాం అనే వ్యాఖ్యలు చేయడం వారి అధికార పరిధికి మించినది. ప్రభుత్వ అక్రమాలకు తలొగ్గే అధికారులకు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి' అని కేటీఆర్‌ హెచ్చరించారు. సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని ప్రకటించారు.

Also Read: School Holiday: విద్యార్థులకు 'పండుగే'.. వరుసగా నాలుగు రోజులు స్కూల్స్‌కు హలీడే

'మూసీ ప్రాజెక్ట్‌కు మేం వ్యతిరేకం కాదు. కానీ దాని పేరిట జరుగుతున్న లూటీకి మాత్రమే వ్యతిరేకం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు కూడా నోటీసులు ఇస్తూ.. వేలాది కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. '3,297 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి 10 వేల ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పుడు 1,400 ఇళ్లు మాత్రమే అంటున్నారు. ఇది పూర్తిగా ప్రజలను మోసం చేసే ప్రక్రియ' అని మండిపడ్డారు. మధు పార్క్ కోసం ప్రత్యేకంగా ఇళ్లు ఇస్తామని ఎందుకు చెబుతున్నారు? మిగతా వారికి ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు.

'గవర్నర్ ప్రసంగంలో కూడా అసత్యాలు ఉన్నాయి. రూ.57 వేల కోట్ల రుణాల అంశంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. నిజంగా ఆ రుణాలు ఇచ్చినట్టు ఆధారాలు చూపిస్తే తాను కచ్చితంగా రాజీనామా చేస్తా' అని మాజీ మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. పొంగులేటి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నాయకుల ఇళ్లు కూడా అదే జోన్‌లో ఉన్నాయని, రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉందని కేటీఆర్‌ గుర్తుచేశారు. మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని.. గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

అమీన్‌పూర్‌లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలు చేపడుతోందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తమ పార్టీకి చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా విచారణకు సిద్ధమని.. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తప్పించుకుంటోందని పేర్కొన్నారు. 'బీఆర్‌ఎస్‌ పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. మమ్మల్ని తిడితే కూడా ఖండించలేదు. అలాంటప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారు? మాకే ప్రభుత్వం తట్టుకోవడం లేదు. కేసీఆర్‌ను ఎలా తట్టుకుంటారు?' అని కేటీఆర్‌ తెలిపారు.

'పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన ఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వం వైఖరిని చూపుతుంది. కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకు బయటపడుతోంది. ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో భారీ అవినీతి, ప్రజల భూముల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పారదర్శకంగా వ్యవహరించాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1031
comment0
Report
Advertisement
Back to top