\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

ఇక మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే.. భయ్యా నీ క్రియేటివిటీకి దండాలు..  ఆఫీస్ పని ఇంటి పని రెండు కలిపి చేసుకోవడంలో నువ్వు తోపు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ పొరపాటున కెమెరా ఆన్ అయితే నీ పరిస్థితి ఏంటని మరి కొంతమంది కామెంట్లలో పెడుతున్నారు. ఈ వీడియో కేవలం వినోదం కోసమే కాకుండా నేటి తరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలను కూడా ప్రతిబింబిస్తోందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు. పండగ రోజుల్లో కూడా సెలవు దొరకకపోవడంతో ఉద్యోగులు ఇలాంటి వినూత్న మార్గాలను వెతుక్కుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

\n

\n","url":"https://pinewz.com/telugu/story/telangana/rangareddy-viral-video-busy-in-an-office-meeting-on-the-other-hand-the-dough-is-ready-work-from-home-techie-video-1773922059097","datePublished":"2026-03-19T12:07:40+05:30","dateModified":"2026-03-19T12:07:40+05:30"}

\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

ఇక మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే.. భయ్యా నీ క్రియేటివిటీకి దండాలు..  ఆఫీస్ పని ఇంటి పని రెండు కలిపి చేసుకోవడంలో నువ్వు తోపు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ పొరపాటున కెమెరా ఆన్ అయితే నీ పరిస్థితి ఏంటని మరి కొంతమంది కామెంట్లలో పెడుతున్నారు. ఈ వీడియో కేవలం వినోదం కోసమే కాకుండా నేటి తరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలను కూడా ప్రతిబింబిస్తోందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు. పండగ రోజుల్లో కూడా సెలవు దొరకకపోవడంతో ఉద్యోగులు ఇలాంటి వినూత్న మార్గాలను వెతుక్కుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

\n

\n","keywords":"news by pincode, pin news,local news, treading news, latest news, hyperlocal news sites, hyperlocal news app, best news app, local news in hindi, zee newz, ram mandir","image":{"@type":"ImageObject","url":"https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_700x400/public/2026/03/19/566200-work-from-home-fun-viral-video-watch.jpg?itok=B1ut4rG1","height":900,"width":1200},"datePublished":"2026-03-19T12:07:40+05:30","dateModified":"2026-03-19T12:07:40+05:30","author":{"@type":"Person","name":"Dharmaraju Dhurishetty"},"publisher":{"@type":"Organization","name":"Hyper local PWA","logo":{"@type":"ImageObject","url":"https://images2.pinewz.com/images/logo-big.png","width":600,"height":60}}}

\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

ఇక మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే.. భయ్యా నీ క్రియేటివిటీకి దండాలు..  ఆఫీస్ పని ఇంటి పని రెండు కలిపి చేసుకోవడంలో నువ్వు తోపు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ పొరపాటున కెమెరా ఆన్ అయితే నీ పరిస్థితి ఏంటని మరి కొంతమంది కామెంట్లలో పెడుతున్నారు. ఈ వీడియో కేవలం వినోదం కోసమే కాకుండా నేటి తరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలను కూడా ప్రతిబింబిస్తోందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు. పండగ రోజుల్లో కూడా సెలవు దొరకకపోవడంతో ఉద్యోగులు ఇలాంటి వినూత్న మార్గాలను వెతుక్కుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

\n

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

\n

\n","thumbnailUrl":"https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_700x400/public/2026/03/19/566200-work-from-home-fun-viral-video-watch.jpg?itok=B1ut4rG1","uploadDate":"2026-03-19T12:07:39+05:30","dateModified":"2026-03-19T12:07:40+05:30","datePublished":"2026-03-19T12:07:40+05:30","contentUrl":"NOT AVAILABLE","url":"https://pinewz.com/telugu/story/telangana/rangareddy-viral-video-busy-in-an-office-meeting-on-the-other-hand-the-dough-is-ready-work-from-home-techie-video-1773922059097","isFamilyFriendly":"http://schema.org/True","requiresSubscription":"http://schema.org/False","inLanguage":"en-hi","publisher":{"@type":"Organization","name":"pinewz","url":"https://pinewz.com/","logo":{"@type":"ImageObject","url":"https://images2.pinewz.com/images/logo-big.png","width":"512","height":"512"}}}
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Viral Video: ఆఫీస్ మీటింగ్‌లో బిజీ.. మరోపక్క పిండి వంటలు రెడీ.. వర్క్ ఫ్రమ్ హోమ్ టెకీ వీడియో!
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 12:07:40
Hyderabad, Telangana

Work From Home Fun Viral Video Watch: కరోనా కాలంలో మొదలైన వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ఐటీ ఉద్యోగుల జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకువచ్చింది. ఇంటి నుంచి పనిచేసే సౌలభ్యం ఉన్నప్పటికీ.. అటు ఆఫీస్ పనులతో పాటు ఇటు ఇంటి పనులను చక్కబెట్టుకోవడం ఉద్యోగులకు కత్తి మీద సామల మారింది.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఎందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒక యువకుడు ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా పాల్గొంటూనే.. మరోవైపు వంటింటిలో పూరీలు చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..

ఉగాది పండగ సీజన్ కావడంతో ప్రతి ఇంట్లో పిండి వంటల సందడి నెలకొంది.. అయితే, ఆఫీసుల్లో పని ఒత్తిడి వల్ల సెలవు దొరకని ఒక యువకుడు.. తన పనిని వదులుకోకుండానే పండగ వంటకాలను తయారు చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ పిండివంతలను ఆఫీస్ మీటింగ్ అటెండ్ అవుతూ తయారు చేస్తూ ఉండడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో రాహుల్_సింగ్2910 అని ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సదరు యువకుడు హెడ్ ఫోన్లు పెట్టుకొని సీరియస్గా లాప్టాప్ ముందు కూర్చుని కనిపిస్తూ ఉంటాడు.. అంతేకాకుండా లాప్టాప్ లో ఆఫీస్ మీటింగ్ జరగడం కూడా మీరు చూడొచ్చు.. అయితే, అతను తెలివిగా తన కెమెరాను ఆఫీసులో ఉంచినట్లు తెలుస్తోంది.

మీటింగ్ సమయంలో తమ సహుద్యోగులతో మాట్లాడుతున్న సమయంలో.. శ్రద్ధగా వింటూనే తన ముందున్న పళ్లెంలో పూరీలను తయారు చేస్తున్నాడు. ఒక చేత్తో మీటింగ్ ను గమనిస్తూ.. మరో చేత్తో ఆ పిండివంటను తయారు చేస్తున్న తీరును చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే లక్షల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేళలో లైకులు కూడా వచ్చాయి. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మల్టీ టాస్కింగ్ అంటే ఇదే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

ఇక మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే.. భయ్యా నీ క్రియేటివిటీకి దండాలు..  ఆఫీస్ పని ఇంటి పని రెండు కలిపి చేసుకోవడంలో నువ్వు తోపు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ పొరపాటున కెమెరా ఆన్ అయితే నీ పరిస్థితి ఏంటని మరి కొంతమంది కామెంట్లలో పెడుతున్నారు. ఈ వీడియో కేవలం వినోదం కోసమే కాకుండా నేటి తరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలను కూడా ప్రతిబింబిస్తోందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు. పండగ రోజుల్లో కూడా సెలవు దొరకకపోవడంతో ఉద్యోగులు ఇలాంటి వినూత్న మార్గాలను వెతుక్కుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 12:42:56
Hyderabad, Telangana:

Gandhari Vana Viral News: ఆకాశం ఒక్కసారిగా ఉన్నట్టుండి నల్లటి మేఘాలతో కమ్మేసింది.. చూస్తుండగానే భారీ వర్షం మొదలైంది.. సాధారణంగా వర్షం అంటే రైతులకు ఆనందంతో పాటు ఒక మనసును పరిమళింపజేసే అద్భుతమైన సంతోషం.. కానీ ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షం మాత్రం రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది.. వ్యవసాయ భాషలో దీనినే గాంధారివాన అంటారు. అసలు ఈ పేరు వెనక ఉన్న పరమార్ధం ఏంటి? పురాణాలకు.. ఈ వానకు ఉన్న సంబంధమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మహాభారతంలో గాంధారి పాత్ర మనందరికీ తెలిసిందే.. తన భర్త ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే కళ్ళు లేకపోవడంతో.. పతిభక్తితో ఆమె కూడా తన కళ్ళకు గంతలు కట్టుకుంటుంది.. అయితే, తన కళ్ళు కనిపించకపోవడంతో తన వందమంది కుమారులు చేసే ఆకృత్యాలను ఆమె చూడలేక పోతుంది. బిడ్డలపై అమితమైన ప్రేమతో వారి తప్పులను తెలుసుకో లేక ఏమీ చేయలేక పోతుంది.. అంతేకాకుండా వారందరికీ నిత్యం ఎంతగానో సేవలు చేస్తూ ఉంటుంది.. అయితే ఆమె వారిపై చూపే ప్రేమ ఎంతో వినాశనానికి దారితీస్తుంది. చివరకు కౌరవులంతా మరణించే వరకు వస్తుంది..

గాంధారి ప్రేమ బిడ్డలకు ఎలాగైతే మేలు చేయాల్సింది పోయి కీడు చేసిందో.. ఈ అకాల వర్షం కూడా పంటలకు అలాగే నష్టం కలిగిస్తుంది. పంట చేతికి వచ్చే సమయంలో లేదా కోతల సమయంలో కురిసే వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దవుతుంది. రైతు కష్టమంతా బురద పాలవుతుంది. అవసరం లేనప్పుడు కురిసే అధిక వర్షాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.. అందుకే సమయం కాని సమయంలో కురిసే ఈ వినాశకరమైన వర్షాలను మన పెద్దలు గాంధారి వానగా అభివర్ణించేవారు..

ఈ అరుదైన పదాన్ని నేటి తరానికి గుర్తు చేశారు న్యాచురల్ స్టార్ నాని.. ఆయన నటించిన దసరా చిత్రంలో చమ్కీల అంగీలేసి ఓ వదినే అనే జానపద గీతంలో ఈ పదం వినిపిస్తుంది. గాంధారి వానల్లె కురిసిందే నీ ప్రేమ అంటూ సాగే లిరిక్స్ ఆ సందర్భంలో ఎంతటి లోతైన భావాన్ని కలిగి ఉందో ఇప్పుడు మనం ఎంతో సులభంగా అర్థం చేసుకోవచ్చు.. ప్రకృతి వైపరీత్యము లేక వాతావరణ మార్పులో కానీ ప్రస్తుతం కురుస్తున్న ఈ గాంధారి వానలు అన్నదాతను ఆవేదనకు గురిచేస్తున్నాయి.. అవసరమైనప్పుడు గురువని వాన అవసరం లేనప్పుడు కురిసి సర్వస్వాన్ని నాశనం చేయడం నిజంగా దురదృష్టకరమే.

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1089
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 12:29:44
Hyderabad, Telangana:

Boyfriend Video Watch:ప్రేమ పేరుతో తనను మోసం చేస్తున్నాడని తెలుసుకున్న ఓ యువతి.. నడి రోడ్డుపై తన ప్రియుడికి చుక్కలు చూపించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. అందరూ చూస్తుండగానే అతనిపై విరుచుకుబడి చితకబాతిన ఘటన ఇప్పుడు మీరు ఈ వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది స్పష్టంగా తెలియనప్పటికీ.. సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం రచ్చ లేపుతోంది.. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులంతా ఆసక్తిగా ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సమాచారం ప్రకారం సదరు యువతి.. యువకుడు కొద్ది సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారట.. అయితే తన ప్రియుడు తనను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమెకు ఇటీవలే తెలిసింది.. తనను నమ్మించి మోసం చేస్తున్నాడని ఆగ్రహించిన ఆ యువతి.. అతనిని నడి రోడ్డుపై పట్టుకొని నిలదీసింది.. మాటకు మాట పెరగడంతో కోపం కట్టలు తెంచుకున్న యువతి.. ఆ యువకుడిని కిందకు నెట్టిపడేసింది.. అతనిపై కూర్చొని విచక్షణారహితంగా చితకబాతింది. 

ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్ ఇండియా రివైండ్ అనే ఖాతా నుంచి సోషల్ మీడియాలోకి పోస్ట్ చేశారు. యువతి తన ప్రియుడిని రోడ్డుపై పడేసి.. అతనిపై కూర్చుని మరి కొట్టడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. అంతేకాకుండా యువకుడు ఆమె చేతుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె జుట్టు పట్టుకుని లాగడం ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతసేపు ఇద్దరు రోడ్డుపైనే దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ యువతి అలా దాడి చేసుకుంటూనే.. తన ప్రియుడిపై పడుకుండిపోయింది.. దీంతో ఆ యువకుడు ఆమెను ఓదారుస్తూ రోడ్డుపైనే పడుకొని గట్టిగా హత్తుకున్నారు..

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

ఈ వింత ప్రవర్తనను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. మోసం చేశాడని కొట్టడం సరే.. మళ్లీ అంతలోనే అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ఇదొక వింత ప్రేమ కథ అని కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రత్యక్ష సాక్షులు తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ గా మారింది.

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1036
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 12:18:55
Hyderabad, Telangana:

Scared Horse Video Watch Now: పెళ్లి వేడుకలు అంటేనే భాజా భజంత్రీలతో పాటు సందడి కేరింతలు ఉంటూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్లిల్లో వరుడు గుర్రంపై రాజసంలో ఊరేగుతూ రావడం ఆనవాయితీగా ఉంటుంది.. అయితే కొన్నిసార్లు ఈ ఆనందం కాస్త ఆందోళనగా కూడా మారుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా ఆందోళన కలగక తప్పదు.. పెళ్లి మండపంలోకి వరుడు గుర్రంపై వస్తుండగా.. ఆ మూగ జీవి ఒక్కసారి భయాందోళనకు గురై వీరంగం సృష్టించింది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలోనే విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వరుడు అలంకరించిన గుర్రంపై కూర్చొని.. బంధుమిత్రుల కోలాహరం మధ్య వివాహం జరిగే వేదిక దగ్గరకు చేరుకోవడం మీరు చూడొచ్చు. చుట్టూ బాణాసంచా కాల్పులతో పాటు పెద్ద మ్యూజిక్ సౌండ్ కూడా వినిపించడం మీరు వీడియోలో గమనించవచ్చు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి నెలకొంది.. అయితే, అసలు ఘటన ఇప్పుడే జరిగింది...

అయితే బాణాసంచా వెలుగుకో లేదా సౌండ్‌కో కానీ.. ఒక్కసారిగా ఆ గుర్రం భయాందోళనకు గురైంది.. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న గుర్రం.. ఒక్క సెకండ్ పలో వెనక కాళ్లపైకి లేచి రంకెలు వేయడం మొదలుపెట్టింది. అలా ఆ గుర్రం కొద్దిసేపటి వరకు అలా రంకెలు వేస్తూనే వీరంగం సృష్టించింది. అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది..

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

గుర్రం అదుపుతప్పుతుందని గ్రహించిన వరుడు దానిపై నుంచి పడిపోకుండా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండడం మీరు వీడియోలో చూడొచ్చు.. కానీ ఆ గుర్రం అటు ఇటు పిచ్చిగా ప్రవర్తిస్తుండడంతో అక్కడున్న అతిథులు ప్రాణభయంతో గందరగోళంగా పరుగులు తీశారు. గుర్రంపై ఉన్న వరుడు కిందికి పడిపోవడం కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఆ గుర్రం సమీపంలోని కుర్చీలతో పాటు పరదాలను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించింది..

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. జంతువులకు భారీ శబ్దాలు అంటే పడదు.. ముఖ్యంగా పెళ్లిళ్లు ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని కొందరు సూచిస్తూ కామెంట్లు పెడుతున్నారు.. ఇక మరికొందరు మాత్రం వరుడు ప్రాణాలతో బయటపడటం అదృష్టమని కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఆడంబరాల కోసం జంతువులను ఇబ్బంది పెట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది..

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1040
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 19, 2026 11:02:10
Ukkayapalle, Andhra Pradesh:

Devuni Kadapa Temple: తెలుగు వారి తొలి పండుగ ఉగాది అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. అయితే ఈ పండుగ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముస్లిం భక్తులు దర్శించుకున్నారు. ఉగాది రోజు ప్రత్యేకంగా శ్రీవారి ఆలయాన్ని సందర్శించడం విశేషం. ఏపీలోని కడప జిల్లాలో ప్రతి ఉగాదికి ప్రత్యేకంగా నిలుస్తున్న ఈ సన్నివేశం శుక్రవారం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Telangana CM Gift: ఉగాది పండుగ కానుక ప్రకటించిన తెలంగాణ సీఎం.. రైతులకు అదిరిపోయే వార్త

ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా కడప జిల్లాలో మాత్రం ఈ పండుగ ఒక సరికొత్త ఆధ్యాత్మిక, సామాజిక సందేశాన్ని ఇస్తోంది. కులమతాలకు అతీతంగా.. దేవుడి కడప లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని ముస్లిం సోదరులు దర్శించుకున్నారు. ఈ విధంగా ముస్లింలు దర్శించుకోవడం ఇక్కడ దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. తమ ఇంటి అల్లుడిగా భావించే వేంకటేశ్వరుడికి ముస్లిం మహిళలు బుర్కాలు ధరించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.

Also Read: BRS Party Panchangam: రేవంత్‌ రెడ్డి వైఫల్యాలతో బీఆర్‌ఎస్‌ పార్టీకి రెట్టింపు బలం.. తెలంగాణ భవన్‌లో ఉగాది పంచాంగం

దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన క్షేత్రం దేవుని కడప. తిరుమల వేంకటేశ్వర స్వామికి తొలి గడపగా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వేకువజాము నుంచే ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. హిందూ సోదరులతో కలిసి క్యూ లైన్లలో నిలబడి, ఏడుకొండల వాడిని భక్తితో దర్శించుకుంటున్నారు​.

Also Read: Telangana CM: ఎవరూ అడ్డుపడ్డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా: తెలంగాణ సీఎం

ముస్లింలు వేంకటేశ్వర స్వామిని తమ అల్లుడిగా (బీబీ నాంచారమ్మ భర్త) భావించి పూజించడం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా ఉగాది రోజున కొత్త అల్లుడికి మర్యాదలు చేసినట్లుగా.. పండ్లు, పూలు, వేప పువ్వు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయ గడపకు హారతి ఇచ్చి, మొక్కులు చెల్లించుకోవడం ద్వారా ఏడాది పొడవునా సుఖసంతోషాలతో ఉంటామని వారు నమ్ముతారు. గంగా-జమున తహజీబ్‌కు ఈ దృశ్యం అద్దం పడుతోంది.

తిరుమలలో రద్దీ
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభవనామ ఉగాది పండగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం ని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రంగు రంగుల పుష్పాలతో అలంకరించింది. మామిడికాయలతో తోరణాలు, పూలతో ఏనుగులు, అరటి, కొబ్బరి కాయలతో అలంకరణ చేశారు. ఆధ్యాత్మిక సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. స్వామి దర్శనం చేసుకొని అలంకరణలు చూసి మురిసిపోతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1061
comment0
Report
HDHarish Darla
Mar 19, 2026 11:00:44
Hyderabad, Telangana:

Drinking Water After Fruits Bad: మనలో చాలా మంది ఆపిల్స్‌తో సహా వివిధ రకాల పండ్లను తింటుంటారు. ఎందుకంటే పండ్లు సాధారణంగా ఆరోగ్యానికి మంచిది. ఆపిల్స్ తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీంతో ఇలాంటివి తినడం ఎంతో ఆరోగ్యకరమని తెలుస్తోంది. ఆపిల్స్‌లో పోషకాల పరంగా, ఇతర ఆరోగ్య సమస్యల పరంగా ఔషధ గుణాలు ఉన్నాయి. 
 
పండ్లు సాధారణంగా ఇథిలీన్ వాయువును కూడా విడుదల చేస్తాయి. ఆ వాయువు ఇతర పండ్లను కూడా పక్వానికి తెస్తుంది. ప్రాచీన గ్రీకు గ్రంథాలు ఆపిల్స్‌ను అందం, ప్రేమకు చిహ్నంగా ఎన్నోసార్లు పేర్కొన్నాయి. మరోవైపు, సర్ ఐజాక్ న్యూటన్ తలపై ఆపిల్ పడిన సమయంలో గురుత్వాకర్షణ నియమాన్ని కనుగొన్నారు. 

ఆపిల్ చరిత్రను పరిశీలిస్తే.. ఈ పండు మానవులతో పాటే భూమిపైకి వచ్చిందని పరిశోధనలు వెల్లడించాయి. దీనిని క్రీ.పూ. 10,000 నుండి 8,500 మధ్య కాలంలో కనుగొన్నారని సమాచారం. వృక్షశాస్త్రజ్ఞుల ప్రకారం.. ఆపిల్ మొదట మధ్య ఆసియాలోని కజకిస్తాన్‌లో ఉద్భవించింది. అక్కడి నుండి, ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంది. అయితే ఈ పండును ఆసియా, ఐరోపాలో వేల సంవత్సరాలుగా సాగు చేస్తున్నారనేది కూడా వాస్తవం.

ఇండో-అమెరికన్ వృక్షశాస్త్రవేత్త సుష్మా నైతాని ఆపిల్‌కు నాలుగు మూలాలను పరిగణించారు. వీటిలో సారవంతమైన అర్ధచంద్రాకార ప్రాంతం (ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, ఇరాక్ వంటి దేశాల్లో), మధ్యప్రాచ్య ప్రాంతం (ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్), మధ్య ఆసియా ప్రాంతం (కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారతదేశంతో పాటు చైనా, థాయ్‌లాండ్, వియత్నాం, కొరియా ప్రాంతాల్లో విరివిగా పండిస్తున్నారు. ప్రాచీన భారతీయ గ్రంథమైన 'చరకసంహిత'లో చిన్చిట్ట గురించి క్లుప్త వివరణ ఉంది. దాని 'పండు'లో ఆపిల్ వగరు-తీపి, చల్లదనాన్నిచ్చేదిగా, తినదగినదిగా పరిగణించారు. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఇందులో సుమారు 7500 రకాలు ఉన్నాయి. 

ఆధునిక శాస్త్రం ప్రకారం.. తొక్క తీయని ఒక మధ్యస్థ పరిమాణపు ఆపిల్‌లో 86% నీరు, 52 కేలరీలు, 0.3 గ్రాముల ప్రోటీన్, 10.4 గ్రాముల చక్కెర, 13.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.4 గ్రాముల ఫైబర్, 0.2 గ్రాముల కొవ్వు ఉంటాయట. ఈ పండ్లు విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, రాగి, ట్రిప్టోఫాన్‌లకు మంచి మూలం. అంటే ఇది ఆకలి, నిద్ర, శరీరంలోని ఏ నొప్పినైనా నియంత్రిస్తుంది. అందువల్ల ఇది శరీరంలో అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌తో పోరాడి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈ పండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని చెబుతుంటారు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

ALso Read: Shraddha Kapoor Marriage: రష్మిక తర్వాత పెళ్లిపీటలెక్కనున్న మరో హీరోయిన్! లవర్‌తో ఎక్కడ పడితే అక్కడ ఇలా!

Also Read: Nora Fatehi Controversy Song: బూతు పాట, బూతు డ్యాన్స్‌లపై వివాదం..ఎట్టకేలకు మాట్లాడిన 'బాహుబలి' హీరోయిన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1072
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 19, 2026 10:29:09
Hyderabad, Telangana:

Farmers Ugadi Gift: తెలంగాణ రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఉగాది కానుక ప్రకటించారు. పంట పెట్టుబడి సహాయం అందించడమే కాకుండా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సాదా బైనామా సమస్యకు కూడా పరిష్కారం చూపించారు. సాదాబైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.

Also Read: BRS Party Panchangam: రేవంత్‌ రెడ్డి వైఫల్యాలతో బీఆర్‌ఎస్‌ పార్టీకి రెట్టింపు బలం.. తెలంగాణ భవన్‌లో ఉగాది పంచాంగం

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా అందించబోతున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని.. భూ భారతితో రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. సాదా బైనామాకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నట్లు ప్రకటించారు.

Also Read: Telangana CM: ఎవరూ అడ్డుపడ్డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా: తెలంగాణ సీఎం

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతులను గట్టెక్కించడానికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు బోనస్ కూడా ఇచ్చి ఆదుకుంటున్నట్లు తెలంగాణ సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల మేరకు దేశంలో అతితక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం గర్వకారణం అని ప్రకటించారు. పరిశ్రమలు ఎన్ని వచ్చినా, ఐటీ రంగాలు ఎంతగా రాణించినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రధాన జీవనాధారం వ్యవసాయమేనని చెప్పారు. 'రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,616 కోట్ల మేరకు రుణమాఫీ చేసి రైతులను ఆత్మగౌరవంతో బతకడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది' అని వివరించారు.

'ప్రతి ఎకరాకు రూ. 12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందించింది. పండించిన పంటలపై రైతుల్లో విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రుణమాఫీ చేయడం, రైతుభరోసా అందించడంతో పాటు రైతు బీమా అమలు చేయడం వంటివన్నీ రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు' అని తెలంగాణ సీఎం వెల్లడించారు. 'సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలన్నీ దేశంలో తెలంగాణ ప్రతిష్టను పెంపొదిస్తాయి. మన పొలాల్లో సమృద్ధిగా పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో విలసిల్లుతుంది అని తెలంగాణ సీఎం అభిలషించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1069
comment0
Report
BBhoomi
Mar 19, 2026 10:01:57
Lakshmapur, Telangana:

Atanu Chakraborty: భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన HDFC Bank ప్రస్తుతం అనుకోని పరిణామాలతో వార్తల్లో నిలిచింది. ఆ బ్యాంక్ పార్ట్-టైమ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్న అటాను చక్రవర్తి ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఆర్థిక రంగంలో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత కారణాలు చూపడం సర్వసాధారణం. అయితే ఈ సందర్భంలో ఆయన తన రాజీనామాకు పేర్కొన్న కారణాలు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తన రాజీనామా లేఖలో చక్రవర్తి స్పష్టంగా మాట్లాడుతూ..  గత రెండేళ్లుగా బ్యాంక్‌లో జరుగుతున్న కొన్ని అంతర్గత వ్యవహారాలు తన వ్యక్తిగత నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. నా విలువలతో సరిపోని పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను  అని ఆయన చెప్పడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. తన నిర్ణయానికి ఇతర ఎలాంటి కారణాలు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఎవరీ అటాను చక్రవర్తి:

అటాను చక్రవర్తి గుజరాత్ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే ప్రభుత్వ డిస్ఇన్వెస్ట్‌మెంట్ కార్యక్రమాల్లో కూడా ప్రధాన పాత్ర పోషించారు. 2021 మే నెలలో ఆయన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా చేరి, తర్వాత పార్ట్-టైమ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మరియు HDFC Ltd విలీనం జరిగిన కీలక సమయంలో ఆయన నాయకత్వం వహించారు. ఈ విలీనం ద్వారా ఒక పెద్ద ఆర్థిక సంస్థ ఏర్పడిందని ఆయన అభినందించినప్పటికీ, ఆ విలీనం ద్వారా రావాల్సిన పూర్తి ప్రయోజనాలు ఇంకా పూర్తిగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యంత స్థిరమైన బ్యాంక్‌గా పేరున్న సంస్థలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం అరుదైన విషయంగా భావిస్తున్నారు.

Also Read: New business ideas: రేవంత్ సర్కార్ అందిస్తున్న ఈ కోర్సు నేర్చుకుంటే.. మహిళలు ప్రతినెలా 50వేలు సంపాదించే ఛాన్స్..!!  

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి: 

చక్రవర్తి రాజీనామా అనంతరం, తదుపరి చర్యలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది. తాత్కాలికంగా మూడు నెలల కాలానికి పార్ట్-టైమ్ ఛైర్మన్‌గా Keki Mistry నియామకానికి ఆమోదం తెలిపింది. అయితే చక్రవర్తి లేవనెత్తిన నైతిక అంశాలపై బ్యాంక్ లేదా నియంత్రణ సంస్థల నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే: 

ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు బ్యాంక్ అంతర్గత పాలన ప్రమాణాలపై సందేహాలు తలెత్తడం సహజం. ముఖ్యంగా విలీనం వంటి కీలక దశలో ఉన్న సమయంలో ఉన్నతాధికారులు తప్పుకోవడం కొంత అనిశ్చితిని కలిగిస్తుంది. అందువల్ల పెట్టుబడిదారులు ఈ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ, బ్యాంక్ పనితీరు, భవిష్యత్తులో వచ్చే అధికారిక ప్రకటనలపై దృష్టి పెట్టడం మంచిది.

Also Read: Dr. Subhash Chandra: మనం నిజంగా ఒకే ప్రపంచమా, ఒకే కుటుంబమా? డాక్టర్ సుభాష్ చంద్ర వేసిన సూటి ప్రశ్న..!!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

1080
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 19, 2026 09:53:17
Hyderabad, Telangana:

BRS Pary Panchaga Shravanam: ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి.. ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పంచాంగం చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే.. ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 'విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం. యువత పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆందోళన. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం. ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసే సూచనలు, సమృద్ధిగా పంటలు పండే అవకాశం ఉంది' అని పంచాంగ శ్రవణంలో పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ తెలిపారు.

Also Read: Telangana CM: ఎవరూ అడ్డుపడ్డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా: తెలంగాణ సీఎం

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల అనంతరం మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పంచాంగ శ్రవణం చేసి ఈ ఏడాది పరిస్థితులపై తమ అభిప్రాయాలు తెలిపారు.

Also Read: Pre Wedding Shoot: వీళ్లకేం పోయేకాలం రా అయ్య.. మురికి కుంటలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌

యువత పక్కదారి పడే అవకాశం ఉందని పంచాంగ శ్రవణంలో పండితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా విదేశీ శక్తుల కుట్రలను మన దేశ సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారని, ఇరుగుపొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ హెచ్చరించారు.

Also Read: EPS 95 Pension: ఉద్యోగులకు ఉగాది గిఫ్ట్‌.. కనీస పింఛన్‌ రూ.7,500 పెంచేందుకు ఆమోదం?

వ్యవసాయ రంగంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, చెరువులు, జలాశయాలు నిండిపోతాయని మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ శుభవార్త తెలిపారు. ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉందని.. రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయని ప్రకటించారు. అయితే బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని, కూరగాయల ధరలు కొంతవరకు తగ్గవచ్చని మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ వివరించారు.

అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ హెచ్చరించారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మరింత గౌరవాన్ని పొందుతుందని.. వాణిజ్య రంగంలో దేశం రాణిస్తుందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని.. మానవతా విలువలు పెరుగుతాయని.. విడాకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రకటించడం శుభపరిణామం. ఉన్నత పదవుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపాలు ఉండే సూచనలు ఉన్నాయని మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ తెలిపారు. రైలు, విమాన, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

960
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 09:05:50
Hyderabad, Telangana:

Bull Attack Video Watch: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పర్యటనలు అనూహ్య ఘటన చోటుచేసుకుంది.. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగాల్సిన హెలిప్యాడ్ ప్రాంగణంలోకి ఒక్కసారిగా ఒక ఎద్దు దూసుకు వచ్చి నానా హంగామా సృష్టించింది.. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పోలీసులను ఆ ఎద్దు వెంబడించింది.. దీంతో వారు ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తుంది. 

బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రావాల్సి ఉంది.. ఆయన కోసం అధికారులు అక్కడ ఒక తాత్కాలిక ప్రత్యేకమైన హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాకకు ఇంకా కొన్ని గంటల సమయం ఉందనగా.. చుట్టూ ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటుకుంటూ ఒక ఎద్దు నేరుగా మైదానంలోకి ప్రవేశించింది.. అంతేకాకుండా ఆ మైదానంలోకి వచ్చి నాన హంగామా సృష్టించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు ఆ ఎద్దును అడ్డుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు.. అయితే ఆగ్రహంతో ఉన్న ఆ ఎద్దు ఒక్కసారిగా పోలీసుల పైకి తిరగబడడం ప్రారంభించింది.. తన కొమ్ములతో పొడవడానికి పోలీసులను వెంబడించింది.  కాకి దుస్తుల్లో ఉన్న ఆ పోలీసు అధికారిని ఆ ఎద్దు మైదానమంతా రౌండ్ కొట్టిస్తూ ఉండడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ ఎద్దు ఏమాత్రం ఆగకుండా పోలీస్ అధికారిని గ్రౌండ్ మొత్తం ఊరికించి.. భయాందోళనకు గురిచేసింది..

ఈ ఘటన అక్కడే ఉన్న కొంతమంది తమ స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సచిన్ గుప్తా అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. భారీ భద్రత ఉన్నప్పటికీ ఒక ఎద్దు బారికేడ్లను తోసుకుని లోపలికి రావడం అక్కడ భద్రత వైఫల్యాలను ఎత్తు చూపుతోందని కొంతమంది అధికారులను విమర్శిస్తున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం పోలీసు శిక్షణ ఈరోజు ఆ అధికారికి బాగా ఉపయోగపడింది.. అందుకే అంత వేగంతో పరిగెత్తుతున్నారు అంటూ సరదాగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

అయితే, ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్ ల్యాండ్ కావడానికి ముందే ఈ ఘటన జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హెలిక్యాప్టర్ దిగే సమయంలో ఈ ఎద్దు లోపలికి వచ్చి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని భద్రత నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎట్టకేలకు ఇతర సిబ్బంది సహాయంతో ఆ ఎద్దును మైదానం బయటకు పంపినట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం..

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1051
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 07:35:59
Hyderabad, Telangana:

 Funny Thieves Video Watch Here: సాధారణంగా దొంగలు ఎక్కడికైనా వెళితే ఎంతో జాగ్రత్తగా ఉండడమే కాకుండా.. చప్పుడు కాకుండా పని ముగించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు దొంగలు చేసే చిత్ర విచిత్రమైన పనులు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.. తాజాగా ముగ్గురు దొంగలు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దొంగతనం చేయడానికి ఒక ఇంట్లోకి చొరబడిన వీరు.. వెలుతురు కోసం స్విచ్ అనుకొని పొరపాటున డోర్ బెల్ నొక్కరు.. దీంతో ఆ డోర్ బిల్ భారీ శబ్దంతో మోగింది.. దాంతో భయపడి పోయి దొంగలు అక్కడి నుంచి పరుగో పరుగు పెట్టారు.  ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాను ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అర్ధరాత్రి సమయంలో అంత గాఢ నిద్రలో ఉన్న వేళ ముగ్గురు దొంగలు ఒక ఇంటి ముందు ఉంచిన మోటార్ సైకిల్ ను దొంగతనం చేసేందుకు ప్లాన్ చేశారు.. ఇంటి గేటు తెరిచి ఉండడంతో.. లోపలికి ప్రవేశించారు.. మెట్ల కింద బైక్ పార్క్ చేసి ఉండటాన్ని వారు గమనించారు. ఆ తర్వాత వారికి అక్కడ ప్రదేశం చీకటిగా ఉండడంతో.. ఒక దొంగ అక్కడ ఏదో స్విచ్ బోర్డు ఉందని గమనించి లైట్ వేద్దామని అనుకున్నాడు.. కానీ శీను మొత్తం రివర్స్ అయిపోయింది..

దురదృష్టవశాత్తు అతను నొక్కిన స్విచ్ లైట్‌ది కాదని.. అది ఆ ఇంటి డోర్ బెల్ అని అర్థమైంది.. నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో ఒక్కసారిగా డింగ్ డాంగ్ అంటూ బెల్ మోగడంతో దొంగలు భయపడిపోయారు.. ఇంట్లోని వారి ఎక్కడ మేల్కొంటారో అన్న భయంతో దొంగతనం చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి.. ఆ ముగ్గురు దొంగలు కలిసి అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు.. బెల్ మోగిన వెంటనే వారు అక్కడి నుంచి పరుగులు పెట్టేసారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి.

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

ఈ వింత దొంగతనం ప్రయత్నం అంతా ఆ ఇంటి ఆవరణలో ఉన్న ప్రత్యేకమైన సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వడంతో.. ఆ కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వీడియోలు పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు కాస్త వైరల్ గా మారాయి.. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. వీళ్లు దొంగలా లేక కమీడియన్ ఆర్టిస్టుల అంటూ కామెంట్లు చేస్తున్నారు. పాపం లైట్ వేద్దామనుకుంటే డోర్ బెల్ మోగిపోయింది.. వీరి బ్యాడ్ లక్ మామూలుగా లేదు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు..

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1099
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 07:24:52
Hyderabad, Telangana:

Bear Viral Video Watch: సాధారణంగా మనం పొలాల్లో దిష్టిబొమ్మలను అప్పుడప్పుడు చూస్తూ  ఉంటాం.. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అందరూ దిష్టిబొమ్మలతో పాటు పాత కుండాలతో తయారుచేసిన కొన్ని బొమ్మలను కడుతూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ రైతు మాత్రం తానే స్వయంగా ఒక దిష్టిబొమ్మగా మారారు.. ఆయన ఏకంగా ఎలుగుబంటి మారువేషం వేసి పొలాల్లో తిరగడం ఎప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వినడానికి వింతగా ఉన్న కోతుల గుంపు నుంచి తన పంటను కాపాడుకోవడానికి ఆ రైతు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లా, ఫిరోజ్‌పూర్ గ్రామానికి చెందిన ధర్మవీర్ అనే ఓ యువ రైతు గత కొంతకాలంగా కోతులు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు తన పంటపై 40 నుంచి 50 కోతుల గుంపు వచ్చి అటు ఇటు తిరుగుతున్నాయి. పొలంలోని బంగాళదుంపలు, ఇతర పంటలను నాశనం చేస్తున్నాయి. అయితే, అతను అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆరైతే వినూత్నంగా ఆలోచించి.. ఈ వేషం కట్టాడు..

దాదాపు 1600 రూపాయలు ఖర్చు చేసి ఒక ఎలుగుబంటి కాస్ట్యూమ్ని కొనుగోలు చేశాడు ఆ యువరైతు.. ప్రతిరోజు ఆ వేషం వేసుకొని పొలంలో అటూ ఇటూ తిరుగుతూ వింత శబ్దాలు చేయడం ప్రారంభించాడు. ఎలుగుబంటిని చూడగానే కోతులు హడలెత్తిపోయి ఆ పంట ప్రాంతాల్లోకి రాకుండా అయిపోయాయి.. కొద్ది రోజులపాటు ఆ యువరైతు అలాగే వెలుగుబంటి వేషాన్ని వేసుకొని అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. కోతులు ఏమాత్రం తన పంట పొలాల్లోకి రాకుండా ఉండిపోయాయి..

pic.twitter.com/IShYPIKEdP

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

కోతుల వల్ల మాకు భారీ నష్టం జరుగుతోంది.. ఈ ఏలుబంటి వేషం వేయడం వల్ల ప్రస్తుతానికి కోతులు రావడం తగ్గినప్పటికీ.. ఇది శాశ్వత పరిష్కారం కాదని.. రోజంతా ఈ వేషంలో ఎండలో ఉండటం చాలా కష్టంగా ఉందని ఆ యువరైతు ధర్మవీర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని చూసి స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు దీనిని తెలివైన ఉపాయం అంటూ సోషల్ మీడియాలో మెచ్చుకోవడం ప్రారంభించారు. అయితే అక్కడే ఉన్న మరి కొంతమంది రైతులు కూడా ఇదే వేషాన్ని వేసి.. కోతుల బెడద నుంచి విముక్తి పొందుతున్నారట..

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1052
comment0
Report
HDHarish Darla
Mar 19, 2026 06:53:02
Hyderabad, Telangana:

Shraddha Kapoor Marriage News: భారతీయ చిత్రసీమలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక వివాహం జరగ్గా.. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైంది. ఇటు టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రేమలో మునిగి తేలుతున్నారు. అదే కోవలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, సినీ రచయిత రాహుల్ మోడీల వివాహం గురించి ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తలు ఇప్పుడు బాలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ కోడలు తేజస్విని కొల్హాపురి స్పందన వైరల్ అవుతోంది.

శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీల మధ్య ప్రేమ వ్యవహారంపై రూమర్స్ రావడం ఇదేమి కొత్త కాదు. 2024 నుంచే వీరి ప్రేమాయణం నడుస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఓసారి డిన్నర్ తర్వాత వారిద్దరూ కలిసి సన్నిహతంగా కనిపించడంతో వారి ప్రేమను అభిమానులు ఖరారు చేశారు. అదే విధంగా వీరిద్దరూ కలిసి అనేక ప్రదేశాల్లో కలిసి కనిపిస్తున్నారు. దీంతో ప్రేమ నిజమే అనే భావన కొనసాగింది. 

అలానే శ్రద్ధాకపూర్, రాహుల్ మోజీల జంట కొన్ని గతేడాది జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు కూడా హాజరయ్యారు. అంతే కాకుండా వారిద్దరూ ప్రైవేట్ షోలతో సహా అనేక ప్రదేశాలలో కలిసి కనిపించారు. ప్రతి ఈవెంట్‌లోనూ శ్రద్ధా, రాహుల్‌లు కెమెరాకు చిక్కడంతో వారి సంబంధం నిజమే అంటూ ప్రచారం జరిగింది. శ్రద్ధా కూడా వారి సంబంధాన్ని పరోక్షంగా అంగీకరించినట్లు ఇటీవలే కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. తాజాగా వారిద్దరూ కలిసున్న ఫన్నీ వీడియోను శ్రద్ధా కపూర్ షేర్ చేసింది. 

శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీల వివాహంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వీరి పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రద్ధా కుటుంబం నుంచి ఓ హింట్ వచ్చేసింది. శ్రద్ధాకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మీడియాతో పంచుకునే ఆమె అత్త తేజస్విని కొల్హాపురి.. ఈ ప్రేమాయణం రూమర్లపై స్పందించింది. హీరోయిన్ శ్రద్ధా కపూర్ పెళ్లి ఇంకా ఖరారు కాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె వివాహ ఊహాగానాలకు తెరదించింది. శ్రద్ధా పెళ్లి విషయంపై మీడియా ప్రశ్నించగా.. తనకు ఏమీ తెలియదని ఆమె అత్త తేజస్విని చెప్పింది. 

ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో శ్రద్ధా తన అభిమానులకు కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో, ఆమె తన పెళ్లి గురించి ఒక అప్‌డేట్ ఇచ్చింది. ఒక అభిమాని శ్రద్ధాను ప్రశ్నిస్తూ.. "మీకు ఎప్పుడు పెళ్లి అవుతోంది?" అని అడిగాడు. దీనికి ఆ నటి తనదైన సరదా శైలిలో.. "నాకు పెళ్లి అవుతోంది. మీకు కూడా పెళ్లి అవుతోంది." అని సమాధానమిచ్చింది. ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, పెళ్లి గురించి నిరంతరం పుకార్లు వినిపిస్తున్నప్పటికీ, శ్రద్ధా గానీ, రాహుల్ గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ అభిమానులు మాత్రం శ్రద్ధా కపూర్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Nora Fatehi Controversy Song: బూతు పాట, బూతు డ్యాన్స్‌లపై వివాదం..ఎట్టకేలకు మాట్లాడిన 'బాహుబలి' హీరోయిన్!

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్! పెన్షన్ రూ.7,500 పెంపుపై మోదీ సర్కార్ కీలక ప్రకటన.. లోక్‌సభ సాక్షిగా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1043
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 05:10:34
Hyderabad, Telangana:

Malavya Rajayoga 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ  కదలిక మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలిసిందే. శుభగ్రహంగా భావించే శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభంలోకి ప్రవేశించడం అత్యంత శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఏప్రిల్ 19న జరిగే ఈ శుక్ర గ్రహ సంచారంతో కొన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితం లభించబోతోంది. అలాగే ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి లభించడమే కాకుండా సమాజంలో ఊహించని స్థాయిలో గౌరవ మర్యాదలు లభించబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని సంపాదన కూడా లభిస్తుంది. 

మాళవ్య రాజయోగం అంటే..
శుక్ర గ్రహం సొంత రాశి వృషభం లేదా తుల రాశుల్లోకి ప్రవేశించినప్పుడు జాతక చక్రంలో ఒకటి లేదా నాలుగు, ఏడు, పది స్థానాల్లో ఉన్నప్పుడు ఈ ఎంతో శక్తివంతమైన మాళవ్య మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల భోగభాగ్యాలు కలగడమే కాకుండా వాహనయోగంతో పాటు సౌందర్యం, కళా రంగాల్లో ప్రావీణ్యం కూడా లభిస్తుంది. అయితే ఇంతటి ప్రత్యేకత కలిగిన యోగం ఏ రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన ఆనందాన్ని అందించబోతుందో తెలుసుకుందాం. 

వృషభ రాశి 
శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభంలోకి ప్రవేశించినప్పుడు.. సొంత రాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ప్రతి పని ఎంతో సులభంగా పూర్తవుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం గా భావించవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కెరీర్ పరంగా ఈ యోగం ఎంతో మేలు చేయబోతోంది. ముఖ్యంగా కార్యాలయాల్లో పనులు చేసే వ్యక్తులకు పదోన్నతులు లభించడమే కాకుండా బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో తప్పకుండా ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు. 

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచారం అద్భుతమైన ప్రయోజనాలనుందిస్తుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరగడమే కాకుండా అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కూడా ఊహించని స్థాయిలో గడించబోతున్నారు. అలాగే జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మకర రాశి 
మకర రాశి వారు ఈ సమయంలో తప్పకుండా అద్భుతమైన సంతోషకరమైన వార్తను వినబోతున్నారు. విద్యార్థులకు ఉద్యోగులకు ఈ సమయం సృజనాత్మకత పెంచబోతోంది. అలాగే వీరికి ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. పూర్వీకుల ఆస్తుల వివాదాలు పరిష్కారం కూడా లభించబోతోంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1076
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 19, 2026 04:57:59
Hyderabad, Telangana:

Venus Transit 2026 Effect On Zodiac 2026: నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహంగా భావించే శుక్రుడు నక్షత్ర సంచారాన్ని చేయబోతున్నాడు. పంచాంగం ప్రకారం 2026 సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ తెల్లవారి జామున ఒకటి గంటల సమయంలో శుక్రుడు భరణి నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. ఏప్రిల్ 16వ తేదీ వరకు అంటే సుమారు 11 రోజులపాటు శుక్రుడు ఇదే నక్షత్రంలో కొనసాగడం విశేషం.. భరణి నక్షత్రానికి శుక్రులే అధిపతి కావడంతో ఈ సమయం కొన్ని రాశుల వారికి శుక్రుడు ప్రభావం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల నాలుగు రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు కూడా సంభవించబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ప్రేమ జీవితంలో మధురానుభూతులు లభించబోతున్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే శుక్రుడి ప్రభావం ఏ రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకువస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి ఊహించని లాభాలు:
వృషభ రాశి 
శుక్రుడి నక్షత్ర మార్పుల కారణంగా వృషభరాశి వారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవడమే కాకుండా.. ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే ఈ సమయంలో జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందే అవకాశాలున్నాయి. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి.

తులారాశి 
శుక్రుడు తులా రాశికి అధిపతి కావడంతో ఈ రాశి వారిపై కూడా ఊహించని ప్రభావం పడుతుంది. అయితే, వీరికి ఈ సమయం గోల్డెన్ పీరియడ్‌గా మారుతుంది. ముఖ్యంగా వీరికి అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఆందోళన ఇప్పుడు తొలగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న చిక్కులు వీడి.. భాగస్వామితో ఎంతో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. నూతన గృహాలు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు.

మిధున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం ఆర్థికంగా అద్భుతమైన లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలు అందించబోతోంది. అలాగే వీరికి అద్భుతమైన గుర్తింపు కూడా లభించబోతున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు.  మిధున రాశి వారికి ఈ సమయంలో సృజనాత్మకత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా శుక్రుడి సంచారంతో అనుకున్న పనుల్లో అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలున్నాయి. పాత అప్పుల నుంచి కూడా ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది. అలాగే వైవాహిక జీవితంలో ఉన్న మనస్పార్థాలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో విపరీతమైన శాంతి నెలకొంటుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1049
comment0
Report
Advertisement
Back to top