మూసి పైన బిజెపి నేతలు కొత్త డ్రామాలు : బీర్ల ఐలయ్య
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
India Post GDS Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారత తపాలా శాఖ (India Post) అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది.
భారత తపాలా శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల: జనవరి 31, 2026.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 31, 2026.
చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2026.
ఫీజు చెల్లింపు గడువు: ఫిబ్రవరి 16, 2026.
ఎంపికైన వారి జాబితా (Merit List): ఫిబ్రవరి 28, 2026.
ఖాళీల వివరాలు..
మొత్తం 28,740 పోస్టులలో తెలుగు రాష్ట్రాల వాటా ఇలా ఉంది.
ఆంధ్రప్రదేశ్: 1,060 పోస్టులు.
తెలంగాణ: 609 పోస్టులు.
తమిళనాడు: 2,009 పోస్టులు.
కర్ణాటక: 1,023 పోస్టులు.
అర్హతలు & వయోపరిమితి..
భారత తపాలా శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుల భర్తీకి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థికి స్థానిక భాషపై పట్టు ఉండాలి. సైకిల్ లేదా ద్విచక్ర వాహనం నడపడం తెలిసి ఉండాలి.
వయస్సు: 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం & జీతం..
అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల (మెరిట్) ఆధారంగానే ఎంపిక చేస్తారు.
జీతం: BPM: ₹12,000 నుండి ₹29,380 వరకు.
ABPM: ₹10,000 నుండి ₹24,470 వరకు.
దరఖాస్తు ఎలా చేయాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31 నుండి అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
(గమనిక: తక్కువ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. మరిన్ని వివరాల కోసం జనవరి 31న విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌ను గమనించగలరు. పైన పేర్కొన్న సమాచారం కేవలం కొంత అంచనా మాత్రమే. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Raviteja Irumudi: హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా: 'ఇరుముడి'తో భక్తి మార్గంలో రవితేజ..ఈసారి హిట్ పక్కా?
Also Read: EPS 95 Pension Budget: ఉద్యోగులకు బడ్జెట్ ధమాకా! కనీస పెన్షన్ రూ.7,500 పక్కా?! ఎప్పటి నుంచి అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Raviteja Irumudi: హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా: 'ఇరుముడి'తో భక్తి మార్గంలో రవితేజ..ఈసారి హిట్ పక్కా?
Ravi Teja Irumudi Movie Announcement: మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు (జనవరి 26) సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ, తన 77వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పవర్ ఫుల్ 'బౌన్స్ బ్యాక్' ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
రవితేజ కెరీర్లో 'ధమాకా' తర్వాత సరైన కమర్షియల్ సక్సెస్ లేక ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇటీవల వచ్చిన 'భర్తమహాశయులకు విజ్ఞప్తి'తో కాస్త ఊపిరి పీల్చుకున్న రవితేజ, ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో RT77 ప్రాజెక్టును పట్టాలెక్కించారు.
పవర్ ఫుల్ టైటిల్..'ఇరుముడి'
ఈ సినిమాకు 'ఇరుముడి' అనే వైవిధ్యమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సనాతన ధర్మంలో, ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులకు 'ఇరుముడి' ఎంత పవిత్రమైనదో మనకు తెలిసిందే. రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆయన అయ్యప్ప మాల ధరించి, భక్తుల కోలాహలం మధ్య ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
ఎమోషనల్ స్టోరీ
దర్శకుడు శివ నిర్వాణ అంటేనే భావోద్వేగాలకు పెట్టింది పేరు. ఈ చిత్రం కూడా ఒక తండ్రి – కూతుళ్ల మధ్య సాగే హృద్యమైన ఎమోషనల్ డ్రామా అని సమాచారం. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు గుండెకు హత్తుకునే సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతోంది.
టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ ఈ చిత్రానికి బాణీలు కడుతున్నారు. రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తోంది.
రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతారా?
'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు', 'మిస్టర్ బచ్చన్' వంటి సినిమాలు వరుసగా నిరాశపరిచిన నేపథ్యంలో రవితేజకు ఈ సినిమా విజయం చాలా కీలకం. భక్తి, ఎమోషన్, మాస్ అంశాల మేళవింపుగా వస్తున్న 'ఇరుముడి' రవితేజను మళ్లీ రూ.100 కోట్ల క్లబ్లో చేరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Vijay Shanthi Husband: నటి, MLC విజయశాంతి భర్తని చూశారా..ఆయన ఏం చేస్తారో తెలుసా..?
Also Read: Bank Strike 2026: తెలుగు ప్రజలకు అలర్ట్..రేపు అంతా బంద్..ఇప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees Civil Services Rules: తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా.. నిబంధనలు ఉల్లంఘించినా ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగం పటిష్టంగా నిర్వహించాల్సి ఉండగా.. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీసుకువచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలతో ఉద్యోగుల మెడపై కత్తి వేలాడనుంది.
Also Read: HIV Injection: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు
ప్రభుత్వ ఉద్యోగుల అనధికారిక గైర్హాజరుపై కఠిన నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు గైర్హాజరు కావడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (నియమావళి, నియంత్రణ, అప్పీల్) రూల్స్-1991కి సవరణలు చేసింది. కొత్త నిబంధనలు తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన సవరణల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి పలు కారణాల రీత్యా విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తారు.
Also Read: Pamda Awards 2026: పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఎవరెవరికి ఇచ్చారంటే..?
అనుమతి లేకుండా గైర్హాజరు: ప్రభుత్వ ఉద్యోగానికి ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెడితే ఉద్యోగం కోల్పోతారు. అది ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
దీర్ఘకాలిక గైర్హాజరు: సెలవు మంజూరైనా లేదా కాకపోయినా.. వరుసగా 5 సంవత్సరాలు విధులకు దూరంగా ఉండే ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తారు.
విదేశీ సేవలు: ప్రభుత్వం అనుమతించిన గడువు దాటిన తర్వాత కూడా ఫారిన్ సర్వీస్‌లో కొనసాగితే ఆ ఉద్యోగులను తీసేస్తారు. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటన చేసినా చర్యలు తీసుకుంటారు.
సవరించిన నిబంధనల కింద చర్యలు తీసుకునే ముందు సంబంధిత ఉద్యోగికి వివరణను ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. షోకాజ్ నోటీస్‌కు వారి సమాధానాన్ని పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో కీలక మార్పులు తీసుకురావడంతో ఉద్యోగులు ఇకపై సెలవు పొందాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయేలా నిబంధనలు తీసుకువచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల నిబంధనల్లోని సివిల్ సర్వీసెస్ రూల్స్‌లో రూల్ 9, రూల్ 25కి సవరణలు చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి రావడంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lakshmi Narayana Yoga 2026 Effect On Zodiac: 2026 సంవత్సరం ఫిబ్రవరిలో శుక్రుడు సంచారం చేయబోతోంది. ముఖ్యంగా శని రాశిగా భావించే కుంభంలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారం శుక్రుడు ఫిబ్రవరి 6వ తేదిన చేయబోతోంది. అలాగే అంతకంటే ముందే బుధుడు ఫిబ్రవరి 3న కుంభ రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా శని పాలించే కుంభంలో ఈ రెండు గ్రహాల సంయోగం జరగబోతోంది. ముఖ్యంగా ఇదే సమయంలో ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ రాజయోగం కూడా ఏర్పడబోతోంది. ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశులవారికి ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా మారబోతున్నాయి. అంతేకాకుండా సౌకర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ సంచారంతో సంబంధాల్లో అద్భుతమైన మాధుర్యం కూడా పెరుగుతుంది. వివాహ జీవితంలో సమతుల్యత కూడా లభిస్తుంది. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి:
శుక్రుడి సంచారంతో ఏర్పడే యోగంతో మేష రాశివారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు భారీ మొత్తంలో డబ్బు కూడా పొందుతారు. వ్యాపారాలు కూడా లాభసాటిగా మారుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీరు భవిష్యత్‌లో అద్భుతమైన విజయాలు సాధించే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సమయంలో ఆదాయాన్ని భారీ మొత్తంలో పొందుతారు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న గొడవలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ప్రేమ సంబంధాలు కూడా సమతుల్యంగా మారుతాయి.
కర్కాటక రాశి:
శుక్రుడి సంచారంతో కర్కాటక రాశివారికి స్థానికంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి మతపరమైన అంశాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు రావడం ప్రారంభమవుతాయి. జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. అలాగే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
సింహరాశి:
ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ రాజయోగంతో జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే సింహ రాశివారికి ఇంట్లో ప్రశాంత వాతావరణం కూడా నెలకొంటుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన పదోన్నతులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. పొదుపు చేయాలి అనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. ఆలాగే తీవ్ర సమస్యలతో బాధపడేవారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
మకర రాశి:
శుక్రుడి సంచారంతో మకర రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి వ్యక్తుత్వం కూడా ఆకర్షణీయంగా మారుతుంది. దీంతో పాటు ప్రేమ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. భావోద్వేగాలు కూడా మెరుగుపడతాయి. దీర్ఘకాలిక కోరికలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం సాధారణంగా మారుతుంది. వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి. ఉన్నతాధికారులు మీ పనితో సంతృప్తి కూడా చెందుతారు. అలాగే కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijayashanthi Husband Name: లేడీ అమితాబ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తన సినీ, రాజకీయ ప్రయాణంలో వెన్నంటి నిలిచిన తన భర్త గురించి, తన జీవితంలో ఎదురైన భావోద్వేగ సంఘటనల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
విజయశాంతి కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఎన్నో పోరాటాలు చేశారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెకు, తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ కొండంత అండగా నిలిచారు.
మర్చిపోలేని విషాదం..
విజయశాంతి జీవితంలో మర్చిపోలేని విషాదం ఆమె తండ్రి మరణం. 'దేవాలయం' సినిమా షూటింగ్ సమయంలో, తండ్రి చితికి నిప్పు పెట్టే సన్నివేశంలో ఆమె నటిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో చెన్నైలో ఆమె తండ్రి కన్నుమూశారు. షూటింగ్ పూర్తయ్యాక దర్శకుడు టి.కృష్ణ ఈ విషయాన్ని చెప్పడంతో ఆమె కుప్పకూలిపోయారు. ఏడాది వ్యవధిలోనే తల్లి కూడా మరణించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా అంధకారమైంది.
తల్లిదండ్రుల మరణం తర్వాత ఒంటరితనం వెంటాడుతున్న సమయంలో శ్రీనివాస్ ప్రసాద్ ఆమె జీవితంలోకి వచ్చారు. పెద్దల అండ లేకపోయినా, ఆమెకు తోడుగా నిలిచి వివాహం చేసుకున్నారు. తన భర్తను దేవుడు పంపిన బహుమతిగా విజయశాంతి అభివర్ణించారు.
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ ముగుస్తుందని భావిస్తారు, కానీ విజయశాంతి విషయంలో అది రివర్స్ అయింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన శ్రీనివాస్ ప్రసాద్, స్వయంగా సినిమాలు నిర్మించి ఆమెను ప్రోత్సహించారు. ఆమెకు నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన 'కర్తవ్యం' సినిమా నిర్మాణంలో ఆయన పాత్ర కీలకం. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా డూప్ లేకుండా ఫైట్స్ చేసేలా ఆమెను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేసింది ఆయనే.
సినిమాల్లో హీరోలకు సమానమైన ఇమేజ్ సంపాదించడమే కాకుండా, రాజకీయాల్లోకి ఆమె అడుగుపెట్టినప్పుడు కూడా శ్రీనివాస్ ప్రసాద్ సరైన దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ప్రయాణంలోనూ ఆయన మద్దతు కొనసాగుతోంది.
విజయశాంతి భర్త గురించి క్లుప్తంగా:
పేరు: శ్రీనివాస్ ప్రసాద్.
వృత్తి: సినీ నిర్మాత (గతంలో పలు చిత్రాలను నిర్మించారు).
ప్రస్తుత స్థితి: ఆయన లైమ్ లైట్ (ప్రచారానికి) దూరంగా ఉండటాన్ని ఇష్టపడతారు. అందుకే ఆయన తాజా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్దగా కనిపించవు.
Also Read; Bank Strike 2026: తెలుగు ప్రజలకు అలర్ట్..రేపు అంతా బంద్..ఇప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోండి!
ALso Read: EPS 95 Pension Budget: ఉద్యోగులకు బడ్జెట్ ధమాకా! కనీస పెన్షన్ రూ.7,500 పక్కా?! ఎప్పటి నుంచి అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
New Traffic Rules: భారత ప్రభుత్వం రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసింది. సవరించిన మోటారు వాహన నిబంధనల ప్రకారం, ఒకే సంవత్సరంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడానికి లేదా సస్పెండ్ చేయడానికి అధికారులకు అధికారం ఇచ్చింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. తరచుగా ట్రాఫిక్ నియమాలను అతిక్రమిస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే డ్రైవర్లను నియంత్రించడమే ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం, ఒక ఏడాది కాలంలో మోటారు వాహనాల చట్టానికి సంబంధించిన ఐదు వేర్వేరు ఉల్లంఘనలు నమోదైతే, సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కొనసాగించడానికి అనర్హుడిగా పరిగణిస్తారు. అయితే లైసెన్స్‌ను సస్పెండ్ చేయడానికి ముందు డ్రైవర్‌కు తన వాదనను వినిపించే అవకాశం కల్పిస్తారు. అంటే.. ప్రాంతీయ రవాణా కార్యాలయం లేదా జిల్లా రవాణా కార్యాలయం నేరుగా నిర్ణయం తీసుకోకుండా ముందుగా విచారణ నిర్వహించాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ లెక్కింపులో గత సంవత్సరాల ఉల్లంఘనలు చేర్చబడవు. కేవలం ఆ సంవత్సరం జరిగిన నేరాలనే పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రస్తుతం నోటిఫై చేసిన 24 రకాల ట్రాఫిక్ నేరాల్లో ఏవైనా ఐదు ఉల్లంఘనలు ఒకే ఏడాదిలో నమోదైతే చర్యలు తీసుకోవచ్చు. వీటిలో అతివేగంగా వాహనం నడపడం, హెల్మెట్ లేదా సీట్‌బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను దాటేయడం, అక్రమ పార్కింగ్, ఓవర్లోడింగ్, వాహన దొంగతనం, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం వంటి నేరాలు ఉన్నాయి. కేవలం పెద్ద తప్పిదాలే కాకుండా, చిన్న చిన్న ఉల్లంఘనల సమాహారం కూడా పరిమితిని దాటితే లైసెన్స్‌పై చర్యలు తప్పవు.
Also Read: Budget 2026: సీనియర్ సీటిజన్లు ఏం డిమాండ్ చేస్తున్నారు? వారి గోడును నిర్మలమ్మ వింటారా?
ఈ నిబంధనల అమలులో లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం RTO లేదా DTOకు ఉంటుంది. సస్పెన్షన్ ఎంత కాలం ఉండాలన్నది కూడా ఆయా అధికారులే నిర్ణయిస్తారు. గతంలో భౌతిక చలాన్ల ఆధారంగా మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఇ-చలాన్ రికార్డుల ఆధారంగా లైసెన్స్ సస్పెన్షన్ అమలు చేయనున్నారు. ఇది ట్రాఫిక్ నియమాల పట్ల డ్రైవర్లలో మరింత బాధ్యతను పెంచే చర్యగా ప్రభుత్వం భావిస్తోంది.
Also Read:Sukanya Samriddhi Yojana: ఆడపిల్లలకు రూ.72లక్షలు.. సుకన్య సమృద్ధి యోజన కొత్త మైల్స్టోన్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bank Strike On 27 JAN 2026: తమ దీర్ఘకాల డిమాండ్ అయిన 'వారానికి ఐదు రోజుల పని' విధానాన్ని అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్త బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో జనవరి 27, 2026న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఎందుకు ఈ సమ్మె?
ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, ఈ నిరసనకు ప్రధాన కారణాలను వెల్లడించారు.
అమలు కాని ఒప్పందం: మార్చి 2024లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యూనియన్ల మధ్య కుదిరిన వేతన సవరణ ఒప్పందంలో 'ఐదు రోజుల పని వారం' అంశాన్ని ఆమోదించినప్పటికీ, ప్రభుత్వం దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
స్పందించని ప్రభుత్వం: గత కొన్ని నెలలుగా విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళనను తీవ్రతరం చేయాలని యూనియన్లు నిర్ణయించాయి.
యూనియన్ల ప్రధాన డిమాండ్లు..
ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగులకు కేవలం 2వ, 4వ శనివారాల్లో మాత్రమే సెలవు లభిస్తోంది. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పని గంటల సర్దుబాటు: ఐదు రోజుల పని విధానం వల్ల పని గంటలు తగ్గకుండా ఉండేందుకు, సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాలు పని చేయడానికి ఉద్యోగులు ఇప్పటికే అంగీకరించారు.
మిగతా సంస్థల మాదిరిగానే: ఇప్పటికే RBI, LIC, స్టాక్ ఎక్స్ఛేంజీలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఐదు రోజుల పని విధానాన్ని అనుసరిస్తున్నాయని, బ్యాంకులకు కూడా అదే వర్తింపజేయాలని వారు వాదిస్తున్నారు. ఇటీవల 'X' (ట్విట్టర్)లో నిర్వహించిన ప్రచారానికి దాదాపు 18.8 లక్షల ఇంప్రెషన్లు రావడం, ఉద్యోగుల్లో ఉన్న అసహనానికి నిదర్శనమని యూనియన్లు పేర్కొన్నాయి.
బ్యాంకింగ్ సేవలపై ప్రభావం
జనవరి 27న జరగబోయే ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు నిలిచిపోవచ్చు.
"ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే సమ్మెను విజయవంతం చేయడమే మా లక్ష్యం" అని AIBOC స్పష్టం చేసింది. ఒకవేళ ఈ లోపు ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తే తప్ప, జనవరి 27న బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది.
Also REad: EPS 95 Pension Budget: ఉద్యోగులకు బడ్జెట్ ధమాకా! కనీస పెన్షన్ రూ.7,500 పక్కా?! ఎప్పటి నుంచి అంటే?
Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPS 95 Pension Hike Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టేందుకు సమయం దగ్గరపడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఈపీఎఫ్‌వో (EPFO) ఖాతాదారుల దృష్టి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రకటించబోయే నిర్ణయాలపైనే ఉంది. ముఖ్యంగా కనీస పెన్షన్ పెంపుపై ఈసారి బడ్జెట్లో కీలక ప్రకటన ఉండవచ్చని గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈపీఎఫ్‌వో పెన్షనర్ల దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరపడనుందని సమాచారం.
1. 11 ఏళ్ల తర్వాత పెన్షన్ పెంపు?
ప్రస్తుతం ఈపీఎస్ (EPS) కింద రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు అందుతున్న కనీస పెన్షన్ కేవలం రూ.1,000. దీనిని 2014లో నిర్ణయించారు. అప్పటి నుండి ద్రవ్యోల్బణం పెరిగినా, పెన్షన్ మాత్రం పెరగలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీనిని కనీసం రూ.7,500 నుంచి రూ.10,000 వరకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
2. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం..
కనీస పెన్షన్ పెంపు విషయంలో జాప్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని కోర్టు ఆదేశించడంతో, ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ఒక వేదికగా చేసుకుని పెన్షనర్లకు ఊరటనిచ్చే అవకాశం ఉంది.
3. ఫెసిలిటేషన్ అసిస్టెంట్ల వ్యవస్థ..
పెన్షనర్లకు సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం 'ఫెసిలిటేషన్ అసిస్టెంట్లను' నియమించాలని యోచిస్తోంది. వీరు నామమాత్రపు రుసుముతో పెన్షనర్లకు అవసరమైన డాక్యుమెంటేషన్, ఇతర సహాయం అందిస్తారు. దీనివల్ల వృద్ధులు, సీనియర్ సిటిజన్లు పదేపదే ఈపీఎఫ్‌వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
4. బడ్జెట్ పై అంచనాలు..
పెన్షన్ పెంపుతో పాటు ఆదాయపు పన్ను (Income Tax) మినహాయింపుల్లో కూడా మార్పులు ఉంటాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇటీవల కార్మిక మంత్రితో జరిగిన సమావేశంలో భారతీయ మజ్దూర్ సంఘం పెన్షన్ పెంపుపై గట్టిగా ఒత్తిడి తెచ్చింది.
కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 1న వెలువడే బడ్జెట్ ప్రకటనలో ఈ 'భారీ శుభవార్త' ఉంటుందో లేదో వేచి చూడాలి.
Also REad: Motorola Edge 50 Price: కేవలం రూ.668 లకే మోటరోలా 5G స్మార్ట్‌ఫోన్..ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rare Earth Stocks: దేశంలో అరుదైన భూమి మూలకాలు (Rare Earth Elements)పై డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ వాహనాలు (EVలు) స్వచ్ఛమైన ఇంధన రంగాల విస్తరణ దీనికి ప్రధాన కారణంగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 19.6 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదు కావడం గతంతో పోలిస్తే 17 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ పెరుగుదల అరుదైన ఖనిజాల అవసరాన్ని మరింత పెంచుతోంది.
EV మోటార్లు, బ్యాటరీ వ్యవస్థలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల్లో అరుదైన భూమి పదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే, పవన విద్యుత్ టర్బైన్ల వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు అవసరమైన అధిక సామర్థ్య అయస్కాంతాల తయారీలో కూడా ఇవి తప్పనిసరి. అందుకే.. ఈ రంగం దేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమవుతోంది.
ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం అరుదైన భూమి ఖనిజాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, రూ. 72.8 బిలియన్లతో అరుదైన భూమి శాశ్వత అయస్కాంతాల తయారీ కార్యక్రమానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్, రక్షణ, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక రంగాల్లో దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇది భారతదేశం ఈ రంగాన్ని దీర్ఘకాలికంగా బలోపేతం చేయాలనుకుంటోందని స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు.
ఈ విధానాల ప్రభావంతో, అరుదైన ఖనిజాలకు సంబంధం ఉన్న కంపెనీలపై పెట్టుబడిదారుల దృష్టి పడింది. ప్రస్తుతం ఈ రంగంపైనే పూర్తిగా దృష్టి సారించిన లిస్టెడ్ కంపెనీలు లేనప్పటికీ, కొన్ని సంస్థలు పరోక్షంగా లేదా విస్తృతంగా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.ఒవైస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ లోహాలు, ఖనిజాల రంగంలో పనిచేస్తోంది. మాంగనీస్ ఆక్సైడ్, ఫెర్రోమాంగనీస్, క్వార్ట్జ్ స్లాబ్‌లు, స్లాగ్ వంటి పదార్థాల నుంచి యాజమాన్య సాంకేతికత ద్వారా అరుదైన భూమి ఖనిజాలను రీసైక్లింగ్ చేస్తోంది. ఇవి ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, రక్షణ, కెపాసిటర్ పరిశ్రమల్లో వినియోగంలో ఉంటాయి. జనవరి 24న ఈ కంపెనీ షేర్ రూ.248.25 వద్ద ముగియగా, ఇది దాని 52 వారాల గరిష్ట స్థాయి నుంచి భారీగా తగ్గిన స్థాయిలో ఉంది.
Also Read: EPF–EPS: పదవీ విరమణ తర్వాత మీకు ఎంత పెన్షన్ లభిస్తుంది? కొత్త ఫార్ములా, నియమాలను తెలుసుకోండి..!!
ప్రభుత్వ రంగ సంస్థ అయిన NLC ఇండియా ప్రధానంగా లిగ్నైట్ మైనింగ్, థర్మల్ పవర్ ఉత్పత్తిలో ఉన్నప్పటికీ, కీలక ఖనిజాల అన్వేషణ వైపు అడుగులు వేస్తోంది. మాలీలో లిథియం బ్లాక్‌లు, కాంగోలో రాగి–కోబాల్ట్ గనులపై ప్రాథమిక చర్చలు మొదలయ్యాయి. అరుదైన భూమి మూలకాల అన్వేషణను దూకుడుగా కొనసాగించాలని గనులు, బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు సంస్థ వెల్లడించింది.
ఇక ఎకో రీసైక్లింగ్ దేశంలో ప్రముఖ ఈ-వ్యర్థాల నిర్వహణ సంస్థ. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి లోహాలను తిరిగి పొందే సౌకర్యాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. లిథియం-అయాన్ బ్యాటరీలు, PCBలు, హార్డ్ డ్రైవ్‌ల నుంచి కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలను రికవరీ చేయడం ద్వారా దేశీయ సరఫరాను పెంచాలన్నది దీని లక్ష్యం. దీంతో దిగుమతులపై ఆధారం తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా EVలు, స్వచ్ఛమైన శక్తి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అరుదైన భూమి ఖనిజాలు భారతదేశానికి అత్యంత కీలకమైన వనరులుగా మారుతున్నాయి. ఈ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కంపెనీల ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మరింత కీలకంగా మారనున్నాయి.
Also Read: EPFO: ఇలా చేస్తే ఇంటి నుంచే PF డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఆధార్ ఉంటే సరిపోతుంది..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
HIV Injection Incident: మానవ సంబంధాలు మంటగలుస్తున్న వేళ ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. భేదాభిప్రాయాలతో విడిపోయిన వారు.. వివాహేతర సంబంధాలు కలిగి ఉండడంతో కాపురాలు కుప్పకూలుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక సంచలన సంఘటన చోటుచేసుకుంది. తనను వదిలేసి విడాకులు తీసుకున్న భర్త మరో వివాహం చేసుకోవడంతో మాజీ భార్య తన సవతికి హెచ్ఐవీ వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. సినిమాను మించి రేంజులో ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Pamda Awards 2026: పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఎవరెవరికి ఇచ్చారంటే..?
ఏపీలోని కర్నూలుకు చెందిన డాక్టర్ కరుణాకర్, ఆదోనికి చెందిన వసుంధర కొన్ని సంవత్సరాల కిందట ప్రేమించుకొని కొన్ని కారణాలతో విడిపోయారు. ఆమెతో విడిపోయిన తర్వాత డాక్టర్ కరుణాకర్ తర్వాత మరో మహిళ డాక్టర్ శ్రావణిని ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆమె కర్నూలు మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలులోని విశ్వభారతి ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ కరుణాకర్ పనిచేస్తున్నారు. తనతో విడిపోయిన తర్వాత ఈ క్రమంలో తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో మాజీ లవర్ వసుంధర జీర్ణించుకోలేకపోయింది. వారిద్దరిపై అక్కసు పెంచుకున్న వసుంధర వారిని విడదీయాలని ఓ కుట్ర పన్నింది. సినిమా రేంజులో ఆమె పథకం రచించింది. ఆ పథకంలో భాగంగా ఈనెల 9వ తేదీ తన మాజీ ప్రియుడి భార్య డాక్టర్ శ్రావణి విధులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి ఆమె ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు.
ఢీకొట్టడంతో శ్రావణి కిందపడిపోవడంతో వెంటనే వేరే బైక్‌పై వచ్చిన వారు ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించారు. శ్రావణిని ఆటో ఎక్కిస్తున్నట్లు నటించి ఆమెకు ఓ వైరస్ హెచ్ఐవీ ఎక్కించారు. ఈ ఘటనపై భాదితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న కర్నూలు త్రీటౌన్ పోలీసులు దర్యాఫ్తు చేశారు. ఘటన స్థలం వద్ద సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించారు. వెంటనే వారిని అరెస్ట్ చేసినట్లు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో మాజీ ప్రియురాలు వసుంధరతోపాటు ఆమెకు సహకరించిన జ్యోతి, జశ్వంత్, శృతి అనే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని సినీ ఫక్కీలో జరిగిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Harish Rao: సింగరేణి కుంభకోణం సూత్రధారి రేవంత్ రెడ్డి.. అల్లుడు పాత్రధారి: హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Secunderabad Traffic Restrictions: భారతదేశం 77వ గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జనవరి 26న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కారణంగా ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రహదారులను మూసి వేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరవాసులు అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది.
టివోలి ఎక్స్ రోడ్స్ నుంచి ప్లాజా ఎక్స్ రోడ్స్ మధ్య రహదారి మూసివేయనున్నారు. సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ, ప్యాట్నీ, ఎస్బీఐ, ప్లాజా, సీటీవో, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉపకార్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్‌బండ్, బాలమ్రాయ్, రసూల్‌పురా, ప్యారడైజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
ప్రయాణికులు రైల్వే, బస్ స్టేషన్లకు ముందుగానే బయలుదేరాలని సూచించారు. మెట్రో సేవలను వాడుకోవాలని కోరారు. బేగంపేట, కార్ఖానా, జేబీఎస్, ప్యాట్నీ, సంగీత్ ఎక్స్ రోడ్స్, టివోలి, బోయిన్పల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను ఇతర మార్గాలకు డైవర్షన్ చేసేలా ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 8712662999 నెంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
Also Read: Padma Awards: 2026 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. 45 మందికి పద్మశ్రీ, తెలంగాణ నుంచి ఇద్దరికి అవార్డు..!
Also Read: IPL 2026: ఐపీఎల్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. 14 కోట్ల ప్లేయర్ ఔట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి