సైదాపూర్ లో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన బీర్ల ఐలయ్య
Yadagirigutta, Telangana:యాదగిరిగుట్ట మండలంలోని సైదాపూర్ చెరువులో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆదివారం గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి జలాలను సైదాపూర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఐలయ్యను శాలువాలతో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Komatireddy Rajgopal: నేను ముఖ్యమంత్రి అవుతా.. బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు: రాజగోపాల్ రెడ్డి
Brahmana Vellemla, Telangana:YSR Death Anniversary: సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి స్వరం వినిపిస్తూ.. రేవంత్ రెడ్డిపై నేరుగా యుద్ధం చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు. ఆ టైం వస్తే బ్రహ్మ దేవుడు కూడా ఆపలేడని స్పష్టం చేశారు. కొత్తవాళ్లు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కబ్జా చేయాలని చూస్తున్నారని.. కానీ తాను ఊరుకోనని స్పష్టం చేశారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని.. మళ్లీ వైఎస్సార్ రాజ్యం తీసుకొస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని స్వగ్రామం బ్రాహ్మణవెల్లంలలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పర్యటించారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీ నాయకులను తీసుకోవడం మంచిదే. కానీ మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని వెలగొడతాం అంటే ఊరుకోం' అని కొందరిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సీఎం సీఎం అంటున్నారు అవకాశం వస్తే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు. ఆ సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని స్పష్టం చేశారు.
మరోసారి MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నేను సీఎం అవుతా
అదే టైం వస్తే బ్రహ్మ దేవుడు కూడా ఆపలెడు
రాష్ట్రంలో రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగం
తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి కి అభిమానులు లక్షలాది మంది ఉన్నారు.
వైఎస్ఆర్ ఆశయాల కోసం పాటుపడుతా , వైఎస్ఆర్ స్ఫూర్తి తో… pic.twitter.com/f3najx7RIh
— News Line Telugu (@NewsLineTelugu) September 2, 2026
'కొత్తవాళ్లు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కబ్జా చేయాలని చూస్తే రాజగోపాల్ రెడ్డి ఊరుకోడు. కొంత మంది కాంగ్రెస్ పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తా' అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మళ్లీ వైఎస్సార్ రాజ్యం తీసుకొస్తానని ప్రకటించారు. 'పేద ప్రజలకు రైతులకు అండగా నిలిచిన వాడే అసలైన నాయకుడని అలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పేద ప్రజలు కార్పొరేట్ వైద్యాన్ని అందుకుంటున్నారంటే అది రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకంతోనే. రైతులకు ఉచిత కరెంటు వైఎస్సార్ ప్రవేశపెట్టారు. పేద ప్రజల కోసం, రైతుల కోసం ఆయన తీసుకొచ్చిన పథకాలు దేశ చరిత్రలో ఏ నాయకుడు తీసుకురాలేదు' అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
'ఆనాడు రాజశేఖరరెడ్డి ఒప్పించి నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్లాడి తెచ్చిన ప్రాజెక్టు ఉదయ సముద్రం ఎత్తిపోతల బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇచ్చాం' అని రాజగోపాల్ రెడ్డి వివరించారు. 'తెలంగాణలో రాజశేఖర్ రెడ్డికి అభిమానులు లక్షలాది మంది ఉన్నారు. వైఎస్సార్ ఆశయాల కోసం పాటుపడుతా. వైఎస్సార్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్సార్ శిష్యులం. మేము వైఎస్సార్‌ని మరవం' అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగదని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
Janmashtami 2026: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026..జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన 7 కృష్టుడి దేవాలయాలు!
Hyderabad, Telangana:Janmashtami 2026 Famous Temples: శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, భక్తులు భారతదేశం అంతటా ఉన్న ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలను సందర్శిస్తుండటంతో, జన్మాష్టమి 2026ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. జన్మాష్టమి భారతదేశంలోని అత్యంత ఆనందకరమైన, ఆధ్యాత్మిక శక్తితో నిండిన పండుగలలో ఒకటిగా చెప్పవచ్చు.
ఈ సందర్భం కోసం దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ముస్తాబవుతాయి. అందమైన అలంకరణలు, గుంపులు గుంపులుగా తరలివచ్చే భక్తులు, గాలిలో మారుమోగే భజనలు, మీరు ఊహించిన దానికంటే చాలా సేపటి వరకు సాగే అర్ధరాత్రి వేడుకలు ఈ పండుగ ప్రత్యేకత. ఈ సమయంలో మీరు కృష్ణ దేవాలయాన్ని సందర్శించగలిగితే, అది మీ మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన అనుభూతిగా మారుతుంది. దైవ ఆశీస్సుల కోసం మీరు తప్పక సందర్శించవలసిన 7 ప్రసిద్ధ ఆలయాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
1) బాంకే బిహారీ దేవాలయం (బృందావన్)
బృందావన్‌కు అనేక విధాలుగా ఇది ఒక కిరీటం వంటిది. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలలో ఒకటి, జన్మాష్టమి సమయంలో ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడి భక్తి శక్తి ఉప్పొంగే విధానాన్ని వర్ణించడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదు.
2) కృష్ణ జన్మభూమి ఆలయం (మథుర)
ఇది శ్రీకృష్ణుని అసలైన జన్మస్థలం అని నమ్ముతారు. అందుకే ఇక్కడ జన్మాష్టమి జరుపుకోవడం అనేది ఇతర ఆలయాలు సరిపోల్చలేని ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం కృష్ణుడు జన్మించాడని చెప్పే అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ప్రధాన పూజలు జరుగుతాయి.
3) ద్వారకాధీష్ ఆలయం (ద్వారక)
కృష్ణాష్టమి వేడుకల కోసం ద్వారకకు వెళ్లడం మంచి ఎంపిక. ఇది ద్వారకా రాజుగా కృష్ణునికి అంకితం చేస్తారు. ఇక్కడి వేడుకలు ఆ రాజవైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రత్యేక హారతులు, విస్తృతమైన అలంకరణలు ఇక్కడి ప్రత్యేకత.
4) ఇస్కాన్ ఆలయం (ISKCON)
శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు మీరు సందడిగా ఉండే వాతావరణం కోరుకుంటే ఇస్కాన్ మీకు అందిస్తుంది. కీర్తనలు, నృత్యం, ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఇక్కడి జన్మాష్టమి చాలా సందడిగా, ఆనందంగా, ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఇది ఏమాత్రం నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం కాదు.
5) ప్రేమ్ మందిర్ (బృందావన్):
నిజం చెప్పాలంటే, ఈ ప్రదేశం వాస్తుశిల్పానికి ఒక అద్భుత దృశ్యం. అద్భుతమైన నిర్మాణం, నమ్మశక్యం కాని లైట్ షోలు ఇక్కడి ప్రత్యేకత. జన్మాష్టమి సమయంలో అలంకరణలు, దీపాల వెలుగులు తోడవడంతో ఆలయం మొత్తం ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది.
6) ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయం (కర్ణాటక)
కర్ణాటకలోని ఈ దేవాలయ వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సాంప్రదాయ ఆచారాలు, ప్రశాంతమైన వాతావరణం, ఆడంబరాల కన్నా సరళతకే ప్రాధాన్యత ఇస్తారు. ఇతర దేవాలయాలలో ఉండే వైభవం ఇక్కడ లేకపోయినా, భక్తి మాత్రం అపారంగా ఉంటుంది.
7) జగన్నాథ దేవాలయం (పూరి)
ఇది ప్రధానంగా జగన్నాథునికి ప్రసిద్ధి చెందినప్పటికీ, కృష్ణాష్టమికి ఇక్కడ వైభవంగా పూజలు జరుగుతాయి. భక్తిశ్రద్ధలతో, ప్రత్యేక ఆచారాలతో ఈ పండుగ రోజును ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు.
2026 జన్మాష్టమి సందర్భంగా ఈ దేవాలయాలను సందర్శించడం ఖచ్చితంగా విలువైనదే. ప్రతి దేవాలయం తనదైన శైలిలో శాంతి, భక్తి, ఆనందాన్ని అందిస్తుంది. కొన్ని దేవాలయాలు అట్టహాసంగా ఉంటే, మరికొన్ని భక్తి శ్రద్ధల్లో ముంచేలా ప్రతిబింబిస్తాయి. ఏది ఏమైనప్పటికీ, మీరు ఆధ్యాత్మికతను అన్వేషించినా లేదా కేవలం వేడుకలలో లీనమవ్వాలనుకున్నా, ఇవి మీరు ఒక్కసారి సందర్శిస్తే ఎప్పటికీ మరచిపోలేని ప్రదేశాలుగా నిలిచిపోతాయి.
Also Read: Krishna Janmashtami 2026: 2026 కృష్ణాష్టమి ఎప్పుడు.
Also Read: Rakhi Festival: రాఖీని ఎన్ని రోజులు చేతికి ఉంచుకొవాలి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
బార్లో బిల్లు కట్టలేదని యువతికి గుండు.. వైరల్ అవుతున్న వీడియో!
Hyderabad, Telangana:Thailand Bar Hair-shaving Video: సాధారణంగా రెస్టారెంట్లతో పాటు బార్లలో కడుపునిండా తిని.. పీకల లోతు దాకా తాగి బిల్లు కట్టకుండా తప్పించుకున్నారన్న వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిచేత అంట్లు తోమించడం లాంటి పనులు చేయిస్తూ ఉంటారు. కానీ థాయిలాండ్‌లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. విపరీతంగా ఖర్చు చేసి బిల్లు కట్టలేక పోయిన ఒక ఒక యువతికి పబ్బు యాజమాన్యం ఏకంగా గుండు కొట్టించింది.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారింది.. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అసలేమైందంటే..
ఆగస్టు 25వ తేదీన బ్యాంకాక్ లోని పినక్లావ్ (Pinklao) ప్రాంతంలో ఉన్న ఓ కాస్ట్లీ బార్లో 18 ఏళ్ల యువతి నకిలీ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళింది.. అయితే, అక్కడ విపరీతంగా మందు తాగడంతో పాటు.. అక్కడికి డాన్సర్లకు కూడా ఖరీదైన డ్రింక్స్ ఇప్పించింది. అలా ఆ రాత్రి ఆమె చేసిన బిల్లు ఏకంగా భారత కరెన్సీలో 1.7 లక్షల రూపాయలు.. అంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లును చూసి కంగు తిన్న ఆ యువతి.. డబ్బులు చెల్లించకుండా బార్ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది..
యువతి దొంగ చాటున పారిపోతుండగా గమనించిన భార సిబ్బంది.. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించాల్సిన యాజమాన్యం.. చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంది.. బిల్లులో కొంత మొత్తాన్ని రికవరీ చేయడానికి ఆ యువతి జుట్టును కొనుగోలు చేస్తున్నట్లుగా ఒక హెయిర్ పర్చేజ్ కాంట్రాక్ట్ (Hair Purchase Contract) పై బలవంతంగా యాజమాన్యం సంతకం చేయించుకుంది.. ఆ జుట్టుకు సుమారు 3000 బాట్లుగా రేటు కట్టారు.. ఆ తర్వాత వెంటనే ఎలక్ట్రిక్ ట్రిమ్మర్ ను తీసుకొచ్చి.. ఆమె జుట్టును పూర్తిగా కత్తిరించి గుండు చేశారు.. ఈ తథాంగాన్ని అంత కెమెరాలు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అధికాస్త విపరీతంగా వైరల్ అయింది.
— RT (@RT_com) August 30, 2026
ఈ వీడియోలో యువతి తెల్లటి డ్రెస్సులో కూర్చుని ఉండగా.. ఇద్దరు వ్యక్తులు ఇది మార్కెట్ రేటు ప్రకారమే తీసుకుంటున్నాం.. నేను నిన్ను మోసం చేయడం లేదు.. అని చెబుతూ గుండు చేయడం వీడియోలో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. థాయిలాండ్ కు సంబంధించిన సామాజిక కార్యకర్త చలిద ఫలమత్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడంతో.. ఆ బార్‌కు సంబంధించిన యాజమాన్యం చేసిన పనిని సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా ఖండించారు.. మరికొందరు మాత్రం మోసాలకు పాల్పడితే వారికి ఇదే సరైన బుద్ధి అని చెబుతూ వచ్చారు..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
ఏది ఏమైనా.. ఆ బార్లో ఉన్న సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో.. మేనేజర్ తప్పును అంగీకరించి క్షమాపణలు కోరినట్లు వార్తలు కూడా వచ్చాయి.. విషయాన్ని తెలుసుకున్న థాయిలాండ్‌కు సంబంధించిన సామాజిక అభివృద్ధి, మానవ భద్రత మంత్రుత్వ శాఖ ఈ వ్యవహారంపై అధికారిక విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ఓ పెద్ద సంచలనంగా మారింది.
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఒకప్పుడు చెత్త ఏరుకునేవారు.. ఇప్పుడు యజమానులు.. 100 మంది మహిళల సక్సెస్ స్టోరీ ఇదే!
Hyderabad, Telangana:Womens Turn Waste Into Wealth: చెత్త.. అనే పదం వినగానే అందరూ ముక్కు మూసుకుంటూ ఉంటారు.. అలాంటిది ఆ చెత్తనే తమ సంపాదనగా మార్చుకున్నారు త్రిపుర రాష్ట్రంలోని కోవాయ్ పట్టణానికి సంబంధించిన 100 మంది మహిళలు.. ఒకప్పుడు సమాజంలో చెత్త ఏరుకునే వారు అని పిలుచుకుంటూ అగౌరవానికి గురైన వారు.. ఇప్పుడు ఏకంగా ఒక వ్యవస్థకే యజమానులుగా మారారు.. వారి కృషితో ఇప్పుడు పట్టణం చెత్త కుండీలు లేని నగరంగా మారిపోయి దేశానికే ఆదర్శనీయంగా నిలిచింది.
పింకీ కర్ దేబ్ అని మహిళ గత తొమ్మిదేళ్లుగా చెత్తను సేకరించే పని చేసే వారట.. ఎలాంటి గ్లౌజులు లేకుండా.. చేతులతోనే చెత్తను వేరు చేసేదట.. మురుగు వాసన వచ్చే ఆ చెత్తలో పని చేస్తుంటే.. అటుగా వెళ్లే వారంతా ముక్కున వేలేసుకునే వారట.. కానీ నేడు పరిస్థితి ఊహించని స్థాయిలో మారింది.. పింకీ ఇప్పుడు ఒక చెత్త నిర్వాహణ కేంద్రానికి ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టింది.. మాస్క్ లేకుండా దర్జాగా తన ఆఫీసులో కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆమె ఒక కార్మికురాని స్థాయి నుంచి ఓనర్ స్థాయికి ఎదిగారు..
ఈ మార్పు వెనక ఒక ఐఏఎస్ అధికారి ఆలోచన కూడా ఉంది. కోవాయ్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) నిర్మల్ కుమార్ ఒకసారి గుజరాత్ లోని అముల్ కోఆపరేషన్ సందర్శించింది.. అదే తరహాలో పారిశుద్ధ్య కార్మికులతో ఎందుకు ఒక సొసైటీని ఏర్పాటు చేయకూడదు అన్న ఆయన ఆలోచనే..కోవాయ్ వేస్ట్ టు వెల్త్ ప్రొడ్యూసర్ సొసైటీ బీజం వేసినట్లు తెలుస్తోంది. దీనికి బెంగళూరులో చెత్త నిర్వహణపై శిక్షణ పొందిన సమీర్ అగర్తలా అనే 31 ఏళ్ల యువకుడు సాంకేతిక సహకారం అందించారు..
ఈ సొసైటీలో 100 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.. వీరే స్వయంగా మొత్తం చెత్త నిర్వహణ వ్యవస్థను నడుపుతున్నారు.. ప్రతిరోజు ఉదయం 7 గంటలకే రంగంలోకి దిగి ఇంటికి వెళ్లి చెత్తను సేకరిస్తారు.. అంతేకాకుండా తడి చెత్త తో పాటు పొడి చెత్తను వేరుగా చేస్తారట.. అలాగే వీరు ఇంటి యజమానులకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయమని కూడా సూచిస్తూ ఉంటారట. మొదట్లో సహకరించని వారి ఇళ్ళ ముందే కూర్చుని.. దుర్వాసన కొట్టే చెత్తను తమ చేతులతో వేరు చేస్తూ మీరు ఇంట్లో చేసే చిన్న పని మా జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తుందో చూడండి అని ప్రాక్టికల్ గా చూపించారు. దీంతో ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చి ఇప్పుడు 90% ఇల్లు చెత్తను వేరు చేస్తున్నారని సొసైటీ తెలిపింది..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
వారంతా రోజు దాదాపు 1500 కిలోలకు పైగా పొడి చెత్త తో పాటు.. 3000 కిలోలకు పైగా తడి చెత్తను సేకరించి రీసైకిల్ ఇంకు పంపుతున్నారు. ఆరు మెటీరియల్ రికవరీ కేంద్రాలతో పాటు 55 గుంతలు ఉన్న మైక్రో కంపోసింగ్ కేంద్రాల ద్వారా తడి చెత్తను రోజుకు 500 కిలోల కంపోస్ట్ ఎరువుగా మారుస్తున్నారు.. ఒకప్పుడు వీధుల చివర నిండిపోయిన దుర్వాసన వెదజల్లే చెత్తకుండీలన్నీ ఇప్పుడు మాయమయ్యాయి.. ఆ ప్రదేశాల్లో చిరు వ్యాపారుల కోసం చిన్న చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేశారు. బరువైన పనుల కోసం ఈ మహిళలే పురుషులను పనిలోకి పెట్టుకుని జీతాలు ఇవ్వడం విశేషం..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్
Dharmavaram, Andhra Pradesh:Telangana Governor Visits To Tirumala Temple Along With His Familyఅమెజాన్ జాబ్ పోయిందని కుంగిపోలేదు.. 6 కోళ్లతో మొదలుపెట్టి బిజినెస్ ఉమన్‌గా మారిన మరియా!
Hyderabad, Telangana:Woman Entrepreneur Success Story: కార్పొరేట్ ఉద్యోగం.. చేతినిండా భారీ జీతం.. ఉన్నట్టుండి ఆ ఉద్యోగం పోతే బాధ మాటల్లో చెప్పడం చాలా కష్టం.. ఎంతోమంది ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు లేఆఫ్స్ కారణంగా తీవ్ర నిరాశకు గురవుతూ వస్తున్నారు. కానీ ఆ కష్టాన్ని అవకాశంగా మలుచుకుని.. ఒక యువతి తన రాతను తానే మార్చుకుంది.. అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన మరియా హర్షిత అని యువతి ఏకంగా కోళ్ల ఫారం స్టార్ట్ చేసి.. తన సత్తా ఏంటో చాటుతూ వస్తోంది.. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సక్సెస్ స్టోరీ ఏంటో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మరియా హర్షిత అమెజాన్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్ విభాగంలో గతంలో పనిచేసేది.. అయితే మార్చి నెలలో అమెజాన్ సంస్థ చేపట్టిన లేఆఫ్స్ లో ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయింది. దీంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా అయోమయంలో పడిపోయింది.. ఎన్నో ఇంటర్వ్యూలకు తను హాజరైనప్పటికీ.. సీనియర్లు స్నేహితుల సాయం కోరినప్పటికీ.. ఆమెకు నిరాశే ఎదురయ్యింది.. తనకు డ్రీమ్ కెరీర్ ను ముగిసిపోయిందని ఆమె తీవ్ర ఆవేదనకు కూడా గురైంది..
ఉద్యోగం వెతుక్కోవడంలో విసిగిపోయిన ఆమెకు.. సొంతంగా ఏదైనా మొదలు పెట్టాలని భర్త డేవిడ్ సలహా ఇచ్చాడు.. దాంతో ఇంట్లోనే చిన్న మినీ కోళ్ల ఫారం పెట్టాలనుకున్నారు.. మొదటగా ఆరు కోళ్లను కొనుక్కొచ్చారు.. అవి 6 పెరిగి పెద్దయ్యాక కోడిపుంజులు గా మారాయి.. అయినప్పటికీ ఆమె నిరాశ పడలేదు.. మళ్లీ ప్రయత్నించింది.. ఈసారి పిల్లల కోసం ప్రత్యేకంగా మంచి గుడ్లను అందించాలని ఉద్దేశంతో పెట్టాలను కొనుక్కొచ్చింది. కొన్నాళ్లకే ఆ కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించాయి.. ఇంట్లోకి వాడుకోగా.. మిగిలిన గుడ్లను చుట్టుపక్కల వాళ్లకు అమ్మడం మొదలుపెట్టింది.. అలా మొదలైన చిన్న ప్రయాణం ఇప్పుడు మంచి లాభాలను తెచ్చిపెట్టే వ్యాపారంగా మారిపోయింది..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
అందరిలా కేవలం కోళ్లను పెంచడంతోనే ఆమె ఆగిపోలేదు.. తన కార్పొరేట్ నైపుణ్యాలను వినియోగించి పవర్ బి ఐ లాంటి టెక్నాలజీ టూల్స్‌ను వినియోగించి తన కోళ్ల ఫారానికి సంబంధించిన లెక్కలతో పాటు.. సప్లై, స్టాక్ మెసేజ్‌లు చేయడం కూడా ప్రారంభించింది.. ఒకప్పుడు ఏసీ గదుల్లో లాప్టాప్ల ముందు కూర్చుని పెద్దపెద్ద మీటింగ్‌లు పెట్టిన మరియా.. ఇప్పుడు పాములతో పాటు ఎలకల నుంచి తన కోళ్లను కాపాడుకుంటూ తాను నిర్మించుకున్న ఫారంను సమర్థవంతంగా నిర్వహిస్తోంది.. తన స్ట్రగుల్స్.. సక్సెస్ జర్నీని మరియా ఇటీవలే ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో పంచుకుంది. అది కాస్త వైరల్‌గా మారింది..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
12 ఏళ్లకు ఒకసారి పూసే నీలకురింజి.. 2030 వరకు ఆగాల్సిన పనిలేదు.. మున్నార్‌లో ఇప్పుడే వికసించాయ్!
Hyderabad, Telangana:Neelakurinji 2026 Blooms: ప్రకృతి ఎప్పుడు ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో ఊహించడం చాలా కష్టం.. పచ్చని కొండలపై నీలిరంగు తివాచీ పరిచినట్లు ఉండే మున్నార్ అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూసే అరుదైన నీలకురింజి పూల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు.. అయితే, ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు అందరూ అనుకున్నట్లుగా 2030 వరకు ఆగాల్సిన పనిలేదు.. ఎందుకంటే పర్యాటకులకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తూ అంచనాల కంటే.. దాదాపు నాలుగు ఏళ్ల ముందే మున్నార్ కొండల్లో ఈ పూలు పూసాయి..
సాధారణంగా మున్నార్ లోని ఎరవికులం నేషనల్ పార్క్‌లో కనిపించే నీలకురింజి పూలు అత్యంత ప్రసిద్ధి.. అవి గతంలో 2018లో వికసించాయి.. ఆ తర్వాత 12 ఏళ్ల జీవిత చక్రం ప్రకారం దాదాపు 2030లో పూయాల్సి ఉంటుంది.. కానీ ప్రకృతిలో దాగివున్న అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది.. పశ్చిమ కనుమల్లో విభిన్న రకాల నీలకురింజి మొక్కలు ఉన్నాయి.. ఇప్పుడు వికసించిన పూలు ఆ 2030 నాటి రకానికి చెందినవి కావని అక్కడున్న స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చొక్రముడి, మట్టుపెట్టి ప్రాంతాల్లో పూలు తమ సొంత 12 ఏళ్ల సైకిల్‌ను ఫాలో అవుతూ ఇప్పుడు వికసించాయి.. ఇవి చివరిసారిగా 2014లో వికసించాయని.. కాబట్టి లెక్కల ప్రకారం సరిగ్గా 2026లో మళ్లీ పుసాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు..
వీటిని కొంతమంది స్ట్రోబిలాంథెస్ కుంతియానాగా కూడా పిలుస్తారు.. ఎందుకంటే వీటి శాస్త్రీయ నామం అదే కాబట్టి. మొక్కతన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పూలు పూసి.. ఆ తర్వాత విత్తనాలను రాల్చి చనిపోతూ ఉంటుంది.. ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి పూలు పూయడానికి దాదాపు 12 ఏళ్ల సమయం పడుతుంది.. తమిళంలో నీల అంటే బ్లూ అని అర్థం.. కురుంజి అంటే పర్వతపు పువ్వు అని అర్ధాన్ని అందిస్తూ ఉంటుంది. అందమైన పూలవల్లే నీలగిరి పర్వతాలకు ఆ పేరు వచ్చింది. కేరళలో సుమారు 43 రకాల ఈ పూలకు సంబంధించిన జాతులు ఉండగా.. మున్నార్ ప్రాంతంలో సుమారు 3000 హెక్టార్లలో ఇవి విస్తరించి ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
ప్రస్తుతం ఛోక్రముడి కొండల వాలులో.. ఈ నీలకురుంజి పూలు పూయడం ప్రారంభించాయి.. అక్టోబర్ నెల నుంచి సెప్టెంబర్ నెలకి ఇవి మరింత విస్తరించి పూర్తిస్థాయిలో కనువిందు చేసే అవకాశాలు ఉన్నాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మట్టుపెట్టి సమీపంలో ఉండే ఎడలిమేడు, సెవెన్మల, గుండమల, మీసపులిమల వంటి ఎత్తైన ప్రాంతాల్లో ఈ పూలకు సంబంధించిన అరుదైన ప్రకృతి రమణీయతను వీక్షించవచ్చని వారు చెబుతున్నారు.. మళ్లీ ఈ ప్రాంతాల్లో ఈ పూలను చూడాలంటే దాదాపు 2038 వరకు ఆగాల్సిందేనట..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Irumudi Nizam Record: బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' ప్రభంజనం.. మెగాస్టార్ చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిన రవితేజ!
Hyderabad, Telangana:Irumudi Nizam Collection Record: తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై నేటికి విజయవంతంగా 12 రోజులు పూర్తవుతున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల జోరు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన కలెక్షన్లు ప్రాంతీయ (రీజినల్) చిత్రాలకు సంబంధించిన అనేక పాత రికార్డులను తిరగరాస్తున్నాయి.
గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' పేరిట ఉన్న రూ.47.55 కోట్ల షేర్ రికార్డును 'ఇరుముడి' సినిమా రూ.48 కోట్ల భారీ షేర్‌తో బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.186.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ప్రతిష్టాత్మకమైన రూ.200 కోట్ల క్లబ్లో చేరేందుకు అత్యంత సమీపంలో ఉంది. దీనితో పాటు ఈ చిత్రంలోని "మల్లెపూల పల్లకి" పాట థియేటర్లలో, సోషల్ మీడియాలో సృష్టించిన సంచలనం ఈ విజయానికి ప్రధాన బలగంగా నిలిచింది.
చిరంజీవి రికార్డును అధిగమించిన రవితేజ
సినీ వర్గాల, ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం.. 'ఇరుముడి' చిత్రం తెలంగాణ (TG) రాష్ట్రంలో ఊహించని రీతిలో భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో ఏకంగా రూ.48 కోట్ల అద్భుతమైన షేర్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలంగాణ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక షేర్ సాధించిన ప్రాంతీయ చిత్రంగా ఈ సినిమా సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. ఈ క్రమంలో, గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' అనే చిత్రం సాధించిన రూ.47.55 కోట్ల షేర్ రికార్డును 'ఇరుముడి' విజయవంతంగా అధిగమించింది.
రూ.200 కోట్ల క్లబ్ దిశగా..
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా 'ఇరుముడి' చిత్రం వసూళ్ల పరంగా అద్భుతమైన ఘనతలను సాధిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.186.5 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్ల స్పీడ్ చూస్తుంటే, అతి త్వరలోనే ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన రూ.200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
'మల్లెపూల పల్లకి' పాట క్రేజ్
ఈ చిత్రం సాధించిన భారీ విజయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది జానపద గాయకుడు డప్పు శ్రీనివాస్ (డప్పు శ్రీను) రాసి, స్వరపరిచిన "మల్లెపూల పల్లకి" పాట. థియేటర్లలో ఈ పాట వచ్చే సమయంలో ప్రేక్షకులు, రవితేజ అభిమానులు, అయ్యప్ప భక్తులు హారతులు ఇస్తూ భక్తితో స్టెప్పులు వేస్తున్నారు.
యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ పాట 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఈ పాటకున్న క్రేజ్‌ను గుర్తించి సినిమాలో ప్రత్యేకంగా నిలిపారు. ఈ అద్భుతమైన పాటను అందించినందుకు గానూ చిత్ర నిర్మాతలు డప్పు శ్రీనుకు అక్షరాల రూ.9 లక్షల భారీ పారితోషికం (రెమ్యునరేషన్) అందించడం విశేషం.
Also Read: రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోన్న 'ఇరుముడి'..బాక్సాఫీసు వద్ద రవితేజ సినిమా రికార్డు!
Also Read: 'ఇరుముడి'లో 'మల్లెపూల పల్లకి' సెన్సేషన్.. సింగర్ డప్పు శ్రీనుకు భారీ రెమ్యునరేషన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ganesh Chaturthi: గణేశ్ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. మండపాలకు ఉచిత విద్యుత్
Baddipadaga, Telangana:Ganesh Mandap Free Electricity: దేశంలోనే అత్యంత వైభవంగా హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు జరగనుండగా.. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉత్సవ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వినాయక చవితి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటుచేయనున్న గణేశ్ మండపాలకు ఈసారి కూడా ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శోభాయమానంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించింది. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టాలని సూచించింది.
రాష్ట్రంలో అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పర్యావరణహిత వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సమస్యలను ఇబ్బందులను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని సూచించారు. భద్రత, రక్షణ, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, నిరంతర విద్యుత్ అందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, డీజేల వినియోగాన్ని పూర్తిగా నిషేధిద్దామని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గణేష్ ఉత్సవ వేడుకలు-2026 ఉన్నతస్థాయి సన్నాహక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే గణేష్ నవరాత్రి ఉత్సవాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో ఘనంగా ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కలసి పనిచేయాలని మంత్రి సంబంధిత శాఖల ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రాష్ట్రంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. మండపాల నిర్వాహకులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో సుమారు 47 సంవత్సరాలుగా కొనసాగుతున్న గణేష్ ఉత్సవాల సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. గత అనుభవాల్లో ఎదురైన సమస్యలు, లోపాలను ముందుగానే గుర్తించి సరిచేసుకోవాలని ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాలు, నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. షీ టీమ్స్, యాంటీ-థెఫ్ట్ నిఘా బృందాలను వినియోగించడంతోపాటు శాంతిభద్రతలు, మత సామరస్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
మున్సిపల్ శాఖలు 24 గంటల పాటు పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, వీధి దీపాలను సక్రమంగా నిర్వహించాలని, బేబీ పాండ్ల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఫాగింగ్, బయో టాయిలెట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొత్తగా ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్ల లోగోలను విస్తృతంగా ప్రదర్శించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కీలక ప్రాంతాల్లో 24 గంటల వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో పాటు ప్రథమ చికిత్స సామగ్రి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, అంబులెన్సులు, షిఫ్ట్‌ల వారీగా వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, రఘువీర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, ఏడీజీపీ మహేష్ భగవత్, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, రమేశ్, సుమతి, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డేవిస్, సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, నారాయణ రెడ్డి, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంతరావు, ఆరోగ్య శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ, టూరిజం ఎండీ గౌతమి, టీజీఎస్పీడీసీఎల్ ఎండీ జితేష్ పాటిల్, సాంస్కృతిక శాఖ సంచాలకులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్
Dharmavaram, Andhra Pradesh:ISRO CHAIRMAN DR V NARAYANAN Visits To Tirumala Temple Watch VisualsNepal Compensation: "భారత్, చైనా, అమెరికా వల్లనే వరదలు వచ్చాయి": నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా!
Golche, Bagmati Province:Nepal Wants Compensation: ఆగస్టు 26న భోటేకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన ఘోర వరదలు నేపాల్‌లోని రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలను అతలాకుతలం చేశాయి. నేపాల్ అధికారులు 'హిమాలయ సునామీ'గా అభివర్ణించిన ఈ విపత్తులో కనీసం 1,127 మంది మరణించగా, సుమారు 3,900 మంది గల్లంతయ్యారు. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు దారుణంగా ధ్వంసమయ్యాయి. ఈ నష్టాల నుండి కోలుకుని కీలక మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి నేపాల్‌కు దాదాపు 4 నుండి 5 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 10 శాతం కావడం గమనార్హం.
ఈ ఘోర విపత్తు నేపథ్యంలో, నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ స్పందిస్తూ.. ఇది కేవలం విరాళాలు కోరే మానవతా అత్యవసర పరిస్థితి కాదని, ఉద్గారాలకు బాధ్యత వహించాల్సిన దేశాల నుండి పొందాల్సిన చట్టపరమైన, నైతిక హక్కు అని స్పష్టం చేశారు. వాతావరణ విపత్తు బాధితులకు సహాయపడేందుకు ఏర్పాటైన 'ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డామేజ్'కు నేపాల్ ఇప్పటికే అధికారిక అభ్యర్థన పంపింది.
తొలుత సహాయక చర్యల కోసం విదేశీ సహాయాన్ని నిరాకరించినప్పటికీ, పరిస్థితి తీవ్రతను బట్టి కాఠ్మండు ప్రభుత్వం భారత్, చైనా, ఇతర దేశాల నుండి ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు, బెయిలీ వంతెనల సహాయాన్ని కోరింది. భూకంపాలు సంభవించే అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతంలో చైనా నిర్మించిన మౌలిక సదుపాయాల భద్రతపై కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాసియా వ్యాప్తంగా కోట్లాది మందికి జీవనాధారమైన హిమాలయ నదీ వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని ఖనాల్ హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్‌కు అతి తక్కువగా దోహదపడిన నేపాల్ వంటి బలహీన దేశాలు, పునర్నిర్మాణ కార్యక్రమాలకు ఒంటరిగా నిధులు సమకూర్చుకోలేవని ఆయన స్పష్టం చేశారు.
ఈ వాతావరణ పరిహార డిమాండ్‌ను మరింత బలోపేతం చేసేందుకు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 81వ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించడానికి ప్రధాని బాలేంద్ర షా స్వయంగా న్యూయార్క్ వెళ్లే అవకాశం ఉంది. అయితే, వాతావరణ బాధ్యతకు సంబంధించిన వివాదం అత్యంత సంక్లిష్టంగా మారింది.
యూరోపియన్ కమిషన్ 2024 నివేదిక ప్రకారం భారత్ కూడా అగ్ర ఉద్గార దేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, చారిత్రక, తలసరి ఉద్గారాల పరంగా భారత్ వాటా చాలా తక్కువ. భారతదేశ తలసరి ఉద్గారాలు కేవలం 3 టన్నులు కాగా, చైనా తలసరి 11 టన్నులు, అమెరికా 17 టన్నులుగా ఉన్నాయి. అందువల్ల, ముందుగా పారిశ్రామికీకరణ చెంది ప్రయోజనం పొందిన ధనిక దేశాలే అధిక బాధ్యత వహించాలని భారత్ నిరంతరం వాదిస్తోంది.
Also Read: నేపాల్‌లో పెను విలయం..ఆకస్మిక వరదలకు 392 మంది మృతి..290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!
Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mamitha Baiju Hospitalised: నటి మమితా బైజుకు తీవ్ర అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక..ఆస్ట్రేలియా పర్యటన రద్దు!
Hyderabad, Telangana:Mamitha Baiju Hospitalised News: చిత్రసీమలో వరుస విజయాలతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యువ కథానాయిక మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఆస్ట్రేలియా పర్యటన రద్దు..వేడుకలు వాయిదా..
సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, ఆమె లేకపోవడంతో ఓనం వేడుకలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అభిమానులకు క్షమాపణలు చెప్పిన మమిత..
ఈ మేరకు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమితా బైజు ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచనల మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని తెలిపారు.
ప్రయాణాలు చేయడం వల్ల శారీరక నొప్పులు, అలర్జీలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని డాక్టర్లు హెచ్చరించారని, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. తనను ఎంతగానో ఆహ్వానించిన నిర్వాహకులకు, ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పూర్తిగా కోలుకుని కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజ్..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో మమితా బైజు కెరీర్ అద్భుతంగా సాగుతోంది. మలయాళంలో 'సూపర్ శరణ్య', 'ప్రేమలు' వంటి చిత్రాలతో అద్భుతమైన విజయాలు అందుకున్న ఆమె, జి.వి. ప్రకాష్ కుమార్ సరసన 'రెబెల్' సినిమాతో తమిళంలో ప్రవేశించారు. ఆ తర్వాత వచ్చిన 'డ్యూడ్' సినిమా కూడా తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ 2026 సంవత్సరంలోనే ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా, నెల రోజుల వ్యవధిలో విడుదలైన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించాయి.
ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇంతటి బిజీ షెడ్యూల్స్, సినిమా విడుదల ఉన్న తరుణంలో నటి ఆసుపత్రిలో చేరడం ఆమె అభిమానులను కలవరపెడుతోంది. ఒకే ఏడాదిలో ఇన్ని వరుస విజయాలు అందించిన మమితకు దిష్టి తగిలి ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
Also Read: రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోన్న 'ఇరుముడి'..బాక్సాఫీసు వద్ద రవితేజ సినిమా రికార్డు!
Also Read: 'దశావతారం' థీమ్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10..సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంఛ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Thalliki Vandanam: విద్యార్థులకు శుభవార్త.. 'తల్లికి వందనం' నిధులు మరోసారి విడుదల..లిస్ట్ వచ్చేసింది!
Vijayawada, Andhra Pradesh:Thalliki Vandanam 2026 Funds: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక అడ్డంకులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రధాన విడత నిధులను అర్హుల ఖాతాల్లో విజయవంతంగా జమ చేసిన సంగతి తెలిసిందే.
అయితే, నూతనంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో పాటు, అర్హత కలిగి ఉండి కూడా వివిధ సాంకేతిక సమస్యల వల్ల నిధులు అందుకోలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా ఈ దఫాలోనే పథకం లబ్ధి చేకూరుతుంది.
వాయిదా వెనుక కారణాలు
నిజానికి, ఈ పెండింగ్ నిధులను ఆగస్టు 30వ తేదీనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులు తొలుత ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఆర్థిక లావాదేవీల ప్రక్రియకు సాంకేతిక అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ సెలవుల కారణంగా నిధుల జమ ఆలస్యం కాగా, అధికారులు తాజా షెడ్యూల్‌ను నిర్ధారించారు. దీని ప్రకారం, వచ్చే వారం అంటే సెప్టెంబర్ 7 లేదా 8వ తేదీల్లో అర్హులైన లబ్ధిదారుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
అర్హుల గుర్తింపు..పరిశీలన ప్రక్రియ..
గతంలో నిధులు అందని తల్లుల నుండి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అభ్యంతరాలు, నూతన దరఖాస్తులను స్వీకరించింది. సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి, అర్హులైన సుమారు 2.80 లక్షల మందితో తుది లబ్ధిదారుల జాబితాను ఖరారు చేశారు. ఈ జాబితాలను ఇప్పటికే స్థానిక సచివాలయాల్లో ప్రజల సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించారు. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన విద్యాసంస్థలలో చదివే అర్హత గల విద్యార్థులందరికీ ఈ ఆర్థిక భరోసా లభిస్తుంది.
ఆర్థిక సహాయం, మౌలిక వసతుల నిధులు..
ఈ పథకం ద్వారా ఏటా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15,000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల మౌలిక సదుపాయాల మెరుగుదల, నిర్వహణ అవసరాల కోసం ఇందులో రూ. 2,000 నిధులను మినహాయించి, ఆ మొత్తాన్ని ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలకు బదిలీ చేస్తారు. మిగిలిన రూ.13,000 లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేస్తారు.
Also Read: చిలకలూరిపేట ఘోర రోడ్డు ప్రమాదం..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
నమ్మినవాళ్లే మోసం చేస్తున్నారా? చాణక్య నీతిలో ఈ 5 సూత్రాలతో వారికి చెక్ పెట్టండి!
Hyderabad, Telangana:Chanakya Niti Rules: మన జీవితంలో కొన్నిసార్లు బయట వ్యక్తుల కంటే.. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే సొంత మనుషులే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు.. మన ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోయే బంధువులతో పాటు మిత్రులు మన చుట్టూనే ఉండిపోతూ ఉంటారు.. వాళ్లు మనపై కుట్రలు పన్నుతున్నారని తెలిసినప్పుడు చాలామంది ఆవేశంతో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వేల ఏల క్రితమే ఆచార్య చానక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. సన్నిహితులు ద్రోహానికి పాల్పడినప్పుడు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా.. చాణక్యుడు సూచించిన ఐదు పద్ధతులను పాటిస్తే మిమ్మల్ని మీరు సులభంగా కాపాడుకోవచ్చు..
ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది..
మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు మీకు ద్రోహం చేస్తున్నారని.. లేదా మీపై కుట్రలు చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఆవేశపడకుండా ఉండడం చాలా మంచిది.. కోపంతో రగిలిపోతూ అప్పటికప్పుడు స్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఉంటాయని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మీకే నష్టం కలగవచ్చు.. కాబట్టి ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని.. ముఖ్యంగా మౌనంగా ఉండి పరిస్థితులను అంచనా వేయడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది..
మీ సీక్రెట్స్ ఎవరితో పంచుకోకూడదు..
కుటుంబంలో నమ్మకం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు.. కానీ అందరితో అన్నీ పంచుకోవడం తెలివైన పని కాదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. మీ ఆర్థిక పరిస్థితులతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు.. మీలోని బలహీనతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పకండి. మీ మాటలను వక్రీకరించి.. మీ రహస్యాలను మీకే ఆయుధంగా మలిచే ప్రమాదం కూడా ఉందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాల పట్ల ఎప్పుడు సీక్రెట్ మైంటైన్ చేయడం చాలా మంచిది..
ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులను అస్సలు నిందించకూడదు..
అనుమానం వేరు.. వాస్తవం వేరు.. మీపై ఎవరో కుట్రలు చేస్తున్నారని అనుమానం వచ్చిన వెంటనే వారిపై నిందలు వేయడం అస్సలు మంచిది కాదు.. ముందుగా అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి.. పక్క ఆధారాలు సేకరించిన తర్వాతే నిలదీయడం మంచిదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. సరైన ఆధారాలు లేకుండా బంధువులను, స్నేహితులను వేలెత్తి చూపుతే ఎన్నో రకాల గొడవలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని చాణక్యనీతి శాస్త్రం క్లియర్‌గా చెబుతోంది..
అనవసరంగా గొడవలకు దిగొద్దు..
ప్రతి సమస్యకు గొడవ పడడమే పరిష్కారం కాదు.. కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఘర్షణ పడటం వల్ల ఇంట్లో ప్రశాంతత ఊహించని స్థాయిలో దెబ్బతిని అవకాశాలున్నాయి. కొన్నిసార్లు దీని ప్రభావం ఇంట్లో పిల్లలతో పాటు వృద్ధులపై తీవ్రంగా పడుతుందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. కాబట్టి అసలైన సమయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది.. సరైన సమయం వచ్చినప్పుడు మీ వాదనలను సున్నితంగా.. కానీ గట్టిగా కానీ వినిపించడం చాలా మంచిది. వివాదాలను ఎప్పటికప్పుడు శాంతి మార్గంలో పరిష్కరించుకోవడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది.
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
అవసరమైతే దూరంగా ఉండండి..
ఒక వ్యక్తి పదే పదే మీ నమ్మకాన్ని వమ్ము చేస్తే.. ఉద్దేశపూర్వకంగా మీకు హాని తల పెడితే.. వారిని భరించాల్సిన అవసరం లేదు.. వారితో శాశ్వత బంధం పెంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. వారితో కేవలం అవసరమైతే మాట్లాడండి.. అన్నింటికంటే మీ మానసిక ప్రశాంతత తో పాటు సెక్యూరిటీ చాలా ముఖ్యం.. కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించడం చాలా మంచిది..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
పెళ్లి వేడుకల్లో విషాదం.. డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ 17 ఏళ్ల యువకుడు మృతి!
Hyderabad, Telangana:Narayanpet Dj Death: స్నేహితుడు పెళ్లి వేడుకల్లో ఆ యువకుడు అందరిలాగే ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉన్నాడు.. చెవులు చిల్లుపడే డిజె సౌండ్స్ మధ్య స్నేహితులతో కలిసి సందడి చేస్తున్నాడు.. కానీ కాసేపట్లోనే ఆ ఆనందం ఆవిరి అయిపోయింది. డిజె సౌండ్ ల తీవ్రతకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
పోతిరెడ్డిపల్లి కి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) అక్కడే ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చేస్తున్నాడు.. అయితే తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉండడంతో రాత్రి సమయంలో ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాడు.. వివాహ సంబరాల్లో భాగంగా భారీ శబ్దాలతో డీజేలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్నేహితులందరూ కలిసి ఆ డిజె సౌండ్స్ మధ్య అందరూ కలిసి బాగా డాన్స్ చేస్తున్నారు..
అయితే ఇంతలోనే.. డిజె సౌండ్స్ తాకిడికి ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గమనించిన స్నేహితులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. రవితేజ అప్పటికే తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ చేశారు..
చేతికి అందించిన కొడుకు అకాల మరణంతో కానరాని లోకంలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనుకున్న కొడుకు ఇలా విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు.. వివాహ వేడుకలు ఒక్కసారిగా ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి..
మితిమీరిన శబ్దాలతో వచ్చే డీజేల కారణంగానే ఇప్పటివరకు ఎంతోమంది అస్వస్థకు గురవ్వడమే కాకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో డీజేల వినియోగం ఏమాత్రం ఆగడం లేదు.. చిన్న పెద్ద తేడా లేకుండా ఎలాంటి వేడుకలైనా డీజేలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. నిబంధనలను ఉల్లంఘించి విపరీతమైన శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న డీజే ఆపరేటర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు కోరుతున్నారు..
Read more: Jagtial: వామ్మో.. హోటల్లో ఇలా కూడా బిల్ వసూలు చేస్తారా..?.. జగిత్యాలలో షాకింగ్ ఘటన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
