KCR Fires On Congress Govt: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 16) గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ సీఎం, మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత స్వీచ్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది పాత వీడియోనే అయినా అందులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నట్లుగా ఉండడంతో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడా వీడియోను వైరల్ చేస్తున్నారు.
సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై చేసిన విమర్శలు ఈ వీడియోలో ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పాత్రను ఎండగట్టారు. అంతకుముందు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని కేసీఆర్ విమర్శించారు.
1956లో జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపారని, ఆనాడు విద్యార్థులు, మేధావులు వ్యతిరేకించినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. అలాగే 1969 ఉద్యమంలో ఇందిరా గాంధీ "నో తెలంగాణ" అని చెప్పి ఉద్యమాన్ని అణచివేశారని, వందలాది మంది విద్యార్థులు చనిపోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.
గత ప్రభుత్వాల వైఫల్యాలు..
ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్నా కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ అధినేత విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిన ఘటనను గుర్తుచేశారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసి, కంపల్షన్ (కచ్చితమైన పరిస్థితి) క్రియేట్ చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు.
మరోవైపు దేశంలో తెలంగాణ ప్రస్తుతం తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో అగ్రగామిగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టే ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద రూ.5 కోట్లు ఇస్తున్నామని, ఇది భారతదేశంలో మరే రాష్ట్రంలో లేదని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు ఇచ్చామని, విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించామని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
LPG vs Induction Cooking: మన దేశంలో చాలామంది వంటగదిలో LPG గ్యాస్ సిలిండర్‌నే ఉపయోగిస్తున్నారు. దాదాపుగా గ్రామాల్లో కూడా కట్టెల పొయ్యిని పక్కన పెట్టి గ్యాస్ పొయ్యిలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సిటీల్లో ఇండక్షన్ కుక్‌టాప్ బాగా ఫేమస్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఇటీవలే ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఎప్పీజీ గ్యాస్ కొరత ఏర్పడనుందనే వార్తలు ఇప్పుడు ఇండక్షన్ స్టవ్‌లపై డిమాండ్ భారీగా పెరిగి పోయింది. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎంపిక అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కరెంట్ పొయ్యిలతో పోలిస్తే గ్యాస్ సిలిండర్ ఒక నెల రోజులు పనిచేస్తుంది. ఒక్కో సిలిండర్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.900 నుంచి రూ.1,100 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. మరోవైపు, ఇండక్షన్ కుక్‌టాప్ కరెంట్‌తో నడుస్తుంది. కాబట్టి దీనికి కరెంట్ బిల్లు కట్టాల్సిన పని ఉంది. అయితే దీని వాడకంలో యూనిట్‌కు రూ.6 నుంచి రూ.9 వరకు వసూలు చేస్తున్నారు.
ఇండక్షన్ కుక్‌టాప్‌ల ప్రయోజనాలు
LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్), ఇండక్షన్ కుక్‌టాప్‌ల మధ్య అతి ముఖ్యమైన వ్యత్యాసం వాటి వంట సామర్థ్యంలో ఉంది. LPG స్టవ్‌లో, దాదాపు 50 నుండి 60 శాతం శక్తి మాత్రమే నేరుగా వంట కోసం వినియోగిస్తారు. మిగిలినది వేడిమిగా చుట్టుపక్కల వాతావరణంలోకి కలిసి పోతుంది. అయితే ఇండక్షన్ స్టవ్ అందుకు భిన్నంగా 80 నుంచి 90 శాతం వరకు వేడిని నేరుగా వంట పాత్రలపై ప్రభావం చూపుతుంది. చాలా సార్లు ఇండక్షన్ స్టవ్‌లపై ఆహారం త్వరగా ఉడుకుతుందని చాలామంది అంటుంటారు. గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ ఎంతో పొదుపుగా వినియోగం అవుతందని.. రోజూ వారి ఆహారాన్ని రెడీ చేసేందుకు తక్కువ సమయం తీసుకుంటుందని పలువురు భావిస్తారు.
అయినా దేశంలోని వంటగదుల్లో ఇప్పటికీ 90 శాతం గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తారు. ఎందుకంటే చాలా మంది వీటికి అలవాటు పడడం సహా ఇండక్షన్ స్టవ్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి అవగాహన లేకపోవడం మరో కారణం కావచ్చు. దీంతో పాటు ప్రస్తుత కాలంలో చాలా మంది హైబ్రిడ్ కిచెన్ సెటప్‌లను వినియోగిస్తున్నారు. రోజువారీ వంటలకు ఇండక్షన్ స్టవ్, స్పెషల్ వంటకాలకు LPG సిలిండర్లను వినియోగిస్తున్నారు. కొన్నిసార్లు గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ కోతల కారణంగా LPG సిలిండర్‌కే ఎక్కువ మొగ్గు చూపుతారు.
ఏది డబ్బు ఆదా చేస్తుంది?
14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర దాదాపు రూ.900 నుంచి రూ.1,000 లకు మార్కెట్లో లభిస్తుంది. అయితే, ఈ సిలిండర్ సాధారణంగా ఒక నెల పాటు వినియోగానికి వస్తుంది. ఇంతలో ఇండక్షన్ స్టవ్‌పై వంట చేయడానికి దాదాపు 78 యూనిట్ల విద్యుత్ అవసరం. విద్యుత్ ధర యూనిట్ కు రూ.8 అయితే, ఖర్చు 78 × 8 = రూ. 624. అంటే LPG సిలిండర్ తో పోలిస్తే మనం దాదాపు రూ.289 ఆదా చేయవచ్చు.
మరోవైపు దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కొందరు PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) ఉపయోగిస్తున్నారు. ఇది గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అయితే, దీని ధర అంతర్జాతీయ LNG మార్కెట్‌తో సమానంగా ఉంది.
Also Read: Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఒకేఒక్క మహిళ? ఎవరీ ప్రియాంక రెడ్డి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vivo T5x 5G Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) టి-సిరీస్‌లో మరో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ రానుంది. వివో T5x 5G మొబైల్‌ను 2026 మార్చి 17న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు దేశంలో లాంఛ్ చేయనున్నారు. ఈ మొబైల్ ప్రముఖ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్, అలాగే వివో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ ఫీచర్స్ గురించి ఇప్పటికే కంపెనీ ఓ క్లారిటీ ఇచ్చింది. వాటిలో ప్రధానంగా బ్యాటరీ సైజ్ పెంచడమే కాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌తో పాటు దీనికి పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ మొబైల్ ధర, ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వివో T5X 5G స్మార్ట్‌ఫోన్ ధర
భారతదేశంలో Vivo T5X 5G ధర ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ వివోలో వాటి గత వేరియంట్స్‌తో పోలిస్తే రూ.10,000 నుంచి రూ.23,000 మధ్యలో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొంత మంది రూ.23,000 కంటే తక్కువ ధరకే అనగా.. రూ.15,999 నుంచి రూ.20,000 మధ్య ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా రేపటితో ఈ మొబైల్ ధర, ఫీచర్స్ గురించి జరుగుతున్న చర్చపై తెరపడనుంది.
వివో T5X 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వివో T5X 5G మెయిన్ ఫీచర్స్‌లో ఒకటి బ్యాటరీ సెటప్. 7,200mAh బ్యాటరీ కెపాసిటీతో దాని విభాగంలో ఇది అత్యున్నతంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా 44W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. 40 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 93 గంటల సంగీతం, BGMI వంటి 15 గంటలకు పైగా గేమింగ్, 18+ గంటల సోషల్ మీడియా వినియోగం లేదా ఒకే ఛార్జ్‌పై 14+ గంటల GPS నావిగేషన్ వంటి వాటిని పేర్కొంది.
ఈ వివో T5X 5G స్మార్ట్‌ఫోన్ కూడా మీడియాటెక్ డైమన్‌సిటీ 7400 టర్బో చిప్‌సెట్ (ఆక్టా-కోర్)తో ప్యాక్ చేశారని నిర్ధారించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6పై నడుస్తుంది. అలాగే ఇందులో ఫ్లూయిడ్ గేమింగ్ కోసం ఆల్ట్రా గేమ్ మోడ్, 4D గేమింగ్ వైబ్రేషన్లు, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, వాయిస్ ఎఫెక్ట్‌లను ఎనేబుల్ చేసే గేమ్ వాయిస్ ఛేంజర్ ఉన్నాయి. 50MP ప్రైమరీ సెన్సార్, LED ఫ్లాష్, రింగ్ లైట్‌తో సహా డ్యూయల్ రియర్ సెటప్‌ను కలిగి ఉంటుంది.
ఈ మొబైల్ దుమ్ము, వాటర్ ఫ్రూవ్ కోసం IP69+ రేటింగ్‌తో పాటు SGS డ్రాప్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌లను కూడా పొందుతుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్, 1,250 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 6.72-అంగుళాల FHD+ LCD ప్యానెల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. సైబర్ గ్రీన్, స్టార్ సిల్వర్ అనే రెండు రంగు ఎంపికలలో వస్తుంది. కనీసం 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులోకి రానుంది.
Also Read: Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఒకేఒక్క మహిళ? ఎవరీ ప్రియాంక రెడ్డి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Odisha Cuttack SCB Medical College Fire Accident: ఒడిశాలోని కటక్ ఏసీబీ మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు మంటలు అంటుకొని అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో మరో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సీఎం మోహన్ చరణ్ మాంఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించి ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇక ప్రమాదంపై కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
Fire In #Cuttack Hospital ICU #Kills 10 Patients, #Injures 11 Staff#SCBMedicalCollege#HospitalFire#OdishaNews#FireIncident#ICUFire#HospitalTragedy#SCBMedical#FireAccidentNews#FireBreaksOut#NewsFlash@CMO_Odisha@CuttackDM@dcp_cuttack https://t.co/BnnteHtlx0 pic.twitter.com/cbCunTjkCs
— Goldy Srivastav (@GoldySrivastav) March 16, 2026
Ustaad Bhagat Singh Pawan Kalyan Speech: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు (మార్చి 15) అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేదికగా తాను ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతానని ఫ్యాన్స్‌కు అభయమిచ్చారు పవన్ కళ్యాణ్. మొత్తానికి తాను రాజకీయాల్లో ఉన్నా.. సినిమాల్లో నటించడం పూర్తిగా మానేయనంటూ స్పష్టం చేశారు.
ఈ ఈవెంట్‌లో హీరో పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తన అభిమానుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ, సినిమా ఆలస్యమైనా తన వెంటే ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాలోని తన పాత్ర, హరీష్ శంకర్ మేకింగ్ గురించి ప్రస్తావించారు.
"నా గుండెల్లో కొలువై ఉన్న ఫ్యాన్స్‌కు, ఇంట్లో కూర్చొని కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సుమ గారు మాట్లాడుతూ నన్ను ఏదో పాత కాలం నటుడిని చేస్తున్నట్లు అనిపించింది (నవ్వుతూ..). 'ఓజీ' మొన్ననే రిలీజ్ అయ్యింది. అయినా నేను రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను వెనక్కి నెట్టేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం బల్లగుద్ది చెబుతున్నా.. నాకు అన్నం పెట్టింది, ఈరోజు ప్రజలకు సేవ చేసే స్థాయికి నన్ను చేర్చింది సినిమానే. సినిమా నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది, దాన్ని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు" అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
'ఫ్యాన్ వార్స్ వద్దు'
"నాకు ఎప్పటికీ ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు. ఆయన పక్కన ఉంటే నేను హీరోననే విషయం కూడా మర్చిపోతాను. రామ్ చరణ్ నా ట్రైలర్ గురించి ట్వీట్ చేయడం సంతోషంగా ఉంది. ఇకపోతే, సినిమా ఇండస్ట్రీకి ప్రాంతీయత ఉండదు. అందరు హీరోల సినిమాలు ఆడాలి, అందరూ బాగుండాలి. నాకు 'ఫ్యాన్ వార్స్' నచ్చవు. నా సినిమా కలెక్షన్లు అందరినీ దాటేయాలని నేను కోరుకోను, అందరూ విజయం సాధించాలని ఆశిస్తాను" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
"హరీష్ శంకర్ నన్ను బాగా నమ్ముతాడు. నాకు గుర్రపు స్వారీ రాకపోయినా 'గబ్బర్ సింగ్' లో చేయించాడు, ఇప్పుడు ఈ సినిమాలో నాతో డాన్స్ కూడా చేయించాడు. రాజకీయాల వల్ల నేను డేట్స్ ఇవ్వలేకపోయినా, కేవలం 40-45 రోజుల్లోనే రోజుకు 2-3 గంటలు కష్టపడి హరీష్ ఈ సినిమాను అద్భుతంగా ప్లాన్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు పెద్ద ఊపునిచ్చింది. శ్రీలీల, రాశీ ఖన్నా తమ పాత్రల్లో ఒదిగిపోయారు."
"సినిమా ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు, కానీ మేం మాత్రం ఎక్కడా తప్పు లేకుండా కష్టపడి పనిచేశాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు సామాజిక అవగాహన కూడా ఉంటుంది. మార్చి 19న విడుదల కాబోతున్న ఈ చిత్రం 'గబ్బర్ సింగ్' అంతటి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. చివరిగా ఒక్క మాట.. మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం నాది" అని పవన్ కళ్యాణ్ ముగించారు.
ఆ తర్వాత డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. సినిమా ఆలస్యానికి తానే బాధ్యుడినని సరదాగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌ను "మా ఎమ్మెల్యే" అని సంబోధిస్తూ, ఆయన ఇమేజ్‌కు తగినట్లుగా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని ధీమా వ్యక్తం చేశారు. ప్రమోషన్ కోసం ఆయన ధరించిన ప్రత్యేకమైన షర్ట్ అందరినీ ఆకట్టుకుంది.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.. ఎస్ఎస్ తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఆయనది కీలకపాత్ర అని ఈగల్ టీమ్ గుర్తించింది. ఇందులో పట్టుబడ్డ తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్‌ను వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే వీరితో ఉన్న ప్రియాంకా రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్లు ఈగల్ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ మాదకద్రవ్యాల పార్టీలో ముఖ్యులతో పాటు ఉన్న ఆ ప్రియాంక రెడ్డి ఎవరంటూ ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది.
ఏం జరిగిందంటే?
మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీని భగ్నం చేసేందుకు తొలుత ఈగల్ టీమ్ వెళ్లింది. దీంతో అక్కడి వాళ్లు అలర్ట్ అయ్యి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపడం సంచలనానికి గురిచేసింది. ఈ పార్టీలో మొత్తంగా 11 మంది పట్టుబడినట్లు తెలుస్తోంది. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ (టీడీపీ), మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితీష్ రెడ్డితో పాటు ప్రియాంకరెడ్డి, పలువురు వ్యాపారవేత్తలు, రియల్టర్లు, కాంట్రాక్టర్లు ఉన్నట్లు ఈగల్ టీమ్ పోలీసులు వెల్లడించారు.
ప్రియాంక రెడ్డి ఎవరు?:
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో దొరికిన ఏకైక మహిళ ప్రియాంక రెడ్డి (34 ఏళ్లు). ఈమె ఫిలింనగర్‌కు చెందిన హోమ్ మేకర్ అని సమాచారం. ఈమె శ్రీధర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ భార్యగా పోలీసులు గుర్తించారు. 10 మంది పురుషుల మధ్య ఈమె ఒక్కరే ఉండటంతో పాటు ఈ పార్టీలో ఆమె పాత్ర ఏమిటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ పార్టీలో ఈగల్ టీమ్ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకుంది. సిమ్లా నుండి కొకైన్ ప్యాకెట్లు తెప్పించి పార్టీలో సరఫరా చేసినట్లు ఈగల్ పోలీసులు గుర్తించారు. రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ కుమార్ వద్ద కూడా డ్రగ్స్ ప్యాకెట్లు దొరికినట్లు సమాచారం. దీంతో ఈగల్ పోలీసులు NDPS చట్టంతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద్ కేసులు నమోదు చేసారు. ఈ పార్టీలో పాల్గొన్న 11 మందిలో 6 మందికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు చెబుతున్నారు.
గతంలో పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసే సమయంలో దీని చుట్టూ సీసీ కెమెరాలు ఉండేవట.. కానీ, ఇప్పుడు వాటి జాడ కనిపించడం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో రేంజ్ రోవర్, బెంజ్, డిఫెండర్, వోల్వో వంటి అత్యంత ఖరీదైన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ustaad Bhagat Singh Pawan Kalyan Remuneration: సినిమాలు చేసినా చేయకపోయినా తెలుగు సినీఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యాక ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక.. ఆయన గురించి నేషనల్ వైడ్ గుర్తింపు అమాంతం పెరిగిపోయింది. ఈ సమయంలో ఎంతోమంది డైరెక్టర్లు, సినీ నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. దాదాపుగా రూ.100 కోట్లు ఇచ్చైనా ఆయన డేట్స్ తీసుకునేందుకు బడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఆయన రీసెంట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు పవన్ కల్యాణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా రిలీజైన సినిమా ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దానికి తోడు పవన్ కల్యాణ్‌కు 'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్ మరోసారి ఈ సినిమాకు డైరెక్షన్ చేయడం వల్ల సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా.. ఎస్ఎస్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. అయితే ఈ సినిమాలో ఇంతమంది స్టార్ నటీనటులు ఉన్న నేపథ్యంలో వారి రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ ఇప్పుడు చిత్రసీమలో జరుగుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీ విశ్లేషకుల కథనం ప్రకారం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కోసం హీరో పవన్ కల్యాణ్ కేవలం రూ.25 కోట్లు రెమ్యూనరేషన్‌తో పాటు రూ.5 కోట్లు అడ్వాన్స్ పుచ్చుకున్నట్లు సమాచారం. అయితే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో ఆయన రూ.50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు ఎందుకు అంత తక్కువ తీసుకున్నాడనే చర్చ జరుగుతోంది.
మైత్రీ మూవీస్ నిర్మాతలతో పవన్ కు ఉన్న సత్సంబంధాల కారణంగా ఆయన తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతే కాకుండా 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల సమయంలో ఆయా ప్రొడ్యూసర్లు పవన్‌కు అండగా నిలిచి కృతజ్ఞతతో వీరికి తక్కువ రెమ్యూనరేషన్‌తో సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. పవన్ గత సినిమాలు, పొలిటికల్ కెరీర్ కారణంగా ఆయన సినిమాలకు ఎన్నికల ముందు కొంత గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ సినిమాపై ఎలాంటి భారం పడకుండా పవన్ తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ తగ్గించుకొని నిర్మాతలకు న్యాయం చేశాడని చిత్రసీమలో అనుకుంటున్నారు.
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన శ్రీలీల రూ.2.5 నుంచి రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. అలాగే రెండో హీరోయిన్ రాశీ ఖన్నా కోటిన్నర రూపాయలు పారితోషకం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈరోజు అనగా మార్చి 15న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Woman attacks on passengers in running train video: సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్గా మారుతుంటాయి. ముఖ్యంగా నెటిజన్లు వైరల్ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకే ఎక్కడ ఎలాంటి ఫన్నీ ఘటనలు జరిగిన వెంటనే తమఫోన్ లలో రికార్డు చేసి చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో అవి కాస్త వైరల్గా మారతాయి. ఇటీవల రన్నింగ్ ట్రైన్ లలో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది మహిళలు సీట్ల విషయంలో తోటి ప్రయాణికులతో గొడవలు పడుతున్నారు.జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఈ గొడవలు కాస్త పీక్స్ కు వెళ్లిపోతున్నాయి. మరికొంతమంది రైళ్లలో వాష్ రూమ్ లలో రొమాన్స్ లు చేసుకుంటున్నారు.
భారతీయ రైల్వేస్ కి
స్వాగతం సుస్వాగతం 🙏🙏ఇండియా పేరు ప్రతిష్టలను నాశనం చేయడానికి, శత్రువులు అక్కరలేదు, మన వాళ్ళే చాలు - ప్రపంచమంతా ఢంకా కొట్టి మరీ సర్వనాశనం చేస్తారు.
pic.twitter.com/p1tzsAEqno— Hyderabad Intellectuals Forum 🇮🇳 (@HydForum) March 15, 2026
మొత్తంగా రైల్వే వ్యవస్థను కొంతమంది తమఛెండాలమైన పనులకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు. తాజాగా.. వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తోటి ప్రయాణికులతో గొడవలకు దిగింది. మరీ ఆమె ఎందుకు గొడవలు పడిందో తెలీదు.
ఇద్దరుమహిళలపై విరుచుకుపడింది. అక్కడి వారు చెబుతున్న వెనక్కు తగ్గలేదు. కిందపడేసి మరీ దాడులు చేసింది.ఇంతలో ఒక యువకుడు కల్గచేసుకున్నారు. కొపంలో ఆమె అతడ్ని కూడా ట్రైన్ లో కిందపడేసి కొట్టింది.
ఆతర్వాత అందరు కలిసి ఆమెను కూల్ చేశారు. మొత్తంగా సీటు విషయంలో గొడవలు పడ్డారో లేదా ఏమైన తిట్టుకున్నారో కానీ వీరు జుట్టు పట్టుకుని గొడవలు పడటంకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.ఏంట్రా బాబోయ్ ఈ అరాచకం అంటూ బిత్తరపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
King Cobra Catching Video: సాధారణంగా ప్రజలు పాములను చూసినప్పుడు భయపడి దూరంగా పారిపోతారు. అయితే ఓ అమ్మాయి మాత్రం ఎంతో ధైర్యంగా పాము పట్టి బయటకు లాగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసేప్పుడు మాత్రం మీ గుండె చప్పుడు కూడా మీకే వినిపించే అంత సస్పెన్స్ ఉంటుంది.
పాములు ఎంతో ప్రమాదకరమైనవని అందరికి తెలిసిన విషయమే. అయితే వాటిని చూడగానే అందరూ పారిపోవడమే మంచిదని అనుకుంటారు. కానీ, మనలో చాలా మంది ఎంతటి పామును అయినా ఇట్టే ఈజీగా పట్టే నైపుణ్యం ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా వీడియోలో ఓ యువతి పెద్ద పామును పట్టుకొని ఆడిస్తుంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక చిన్న గదిలో కనిపించిన పామును పట్టుకోవడానికి ఓ అమ్మాయి ప్రయత్నిస్తుంది. ఆమె పామును ఎంతో తేలికగా పట్టుకున్న తీరును చూస్తే బహుశా..ఈమె పాములు పట్టడంలో ఎంతో ప్రొఫెషనల్ అని తెలుస్తోంది. అస్సలు భయమే లేకుండా ఆ యువతి తన చేతులతో పామును పట్టుకుంది.
हमारे मौहल्ले की लड़कियाँ छिपकली
दिखते ही डर के मारे छीप जाती है
और एक ये है जो
सांप से खेल रही है दाद देने पड़ेगी
इसकी हिम्मत को pic.twitter.com/UIYKT4ZCY2— S marwadi (@s___marwadi786) March 14, 2026
ఈ వీడియోను సోషల్ మీడియా @s___marwadi786 (ట్విట్టర్ ఖాతా) అనే యూజర్‌నేమ్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. ఆ యువతి ధైర్యానికి నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. చాలామందికి ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోయారు. పాములతో జాగ్రత్త అంటూ సలహాలు ఇస్తున్నారు.
(గమనిక: అయితే పాములు పట్టుకునేందుకు చాలామందికి శిక్షణ ఇస్తారు. వీడియోలో పాములు పట్టినంత మాత్రానా మీరు దాన్ని ఇంటి వద్ద ప్రయోగాలు చేయడం క్షేమం కాదు. సరైన శిక్షణ ఉన్నప్పడు మాత్రమే పాములను పట్టుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే ఒకవేళ మీ ఇంట్లో పాములు కనిపిస్తే వన్యప్రాణ సంరంక్షకులను సమాచారం ఇవ్వడం మంచిది.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Abrar Ahmed Kavya Maran Controversy: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెట్ లీగ్ 'ది హండ్రెడ్' కోసం పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆమెపై భారత్‌లో వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత కావ్య మారన్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ చేయడం సహా అనేక మంది అభిమానులు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ మొదలుపెట్టారు.
అంతేకాకుండా రాబోయే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లను బహిష్కరిస్తామని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇన్ని సంఘటనల నడుము కావ్య మారన్‌కు మరో షాక్ తగిలింది. అయితే వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేసిన పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్.. తాను ఆడేందుకు సిద్ధంగా లేనని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్.. ది హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అదే సమయంలో అబ్రార్ అహ్మద్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. అదే సమయంలో ఆ టోర్నీకి పాక్ జట్టులో అబ్రార్ ఎంపికైతే.. సన్ రైజర్స్ తరఫున మ్యాచ్‌లు ఆడడం దాదాపు కష్టమే. దీంతో అబ్రార్ దాదాపుగా ది హండ్రెడ్ టోర్నీలో ఆడేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది.
ది హండ్రెడ్ లీగ్ జరిగే సమయంలో పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అబ్రార్ అహ్మద్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. జూలై 15 నుండి ఆగస్టు 7 వరకు రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్ వెస్టిండీస్‌కు వెళుతుంది. ది హండ్రెడ్ జూలై 21న ప్రారంభమై ఆగస్టు 16 వరకు కొనసాగుతుంది.
భారత్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ.. సౌతాఫ్రికా నిర్వహించే ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తానీ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయడం పట్ల స్వదేశంలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా లండన్ వేదికగా జరిగిన వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు అబ్రార్‌ను రూ.2.34 కోట్లకు దక్కించుకుంది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వైరం నేపత్యంలో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ లీగ్‌లోనూ పాక్ ఆటగాళ్లను భారత ఫ్రాంఛైజీలు వేలంలో కొనుగోలు చేయలేదు. అయితే కావ్య మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ జట్టు మాత్రం తప్పుడు మార్గంలో వెళ్లి పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం పట్ల దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Husband slits wife throat with blade in eluru: ఇటీవల కొంతమంది భార్యభర్తలు పెళ్లిళ్లు చేసుకుని మరీ గొడవలు పడుతున్నారు. ఒకర్నిమరోకరితో ఎలా గొడవలు పడాలి.. ఎలా చంపుకోవాలి అనే దానిపై రిసెర్చ్ లు చేస్తున్నారు.దీంతో ప్రతిరోజు భార్యభర్తల గొడవలకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఎన్నిసార్లు చెప్పిన వారి ప్రవర్తనమాత్రం మారడంలేదు. సుపారీలు ఇచ్చి చంపించడం కూడా చేస్తున్నారు. పెళ్లై, పిల్లలు ఉన్న కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు.అడ్డుగా అన్పిస్తే పిల్లల్ని కూడా లేపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉండటంతో చాలా మంది అసలు పెళ్లంటేనే భయంతో పారిపోతున్నారు. తాజాగా.. ఏపీలోని ఏలూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏలూరు జిల్లలోని తణుకు ప్రాంతంలో సజ్జాపురంలో గోవిందు,దిల్లేశ్వరీ ఇద్దరు ఉండేవారు . వీరిరి 13 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. 6వ తరగతి చదువుతున్న బాలుడు ఉన్నాడు. భర్త మద్యానికి బానిసై తరచుగా భార్యను కొడుతుండేవాడు. దీంతో అతని బాధలు పడలేక ఇటీవల తణుకు పీస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా.. తన కొడుకుతో ఇంట్లోంచి వెళ్లిపోయి సపరేట్ గా ఉంటుంది. అయితే.. భార్యపై కోపం పెంచుకున్న గోవిందు ఇటీవల మద్యంతాగి స్కూల్ కు వెళ్లి పిల్లాల్ని తీసుకొని రావడానికి వెళ్తున్న భార్యతో గొడవకు దిగాడు. అప్పటికే రెడీగా పెట్టుకున్న బ్లేడ్ తో ఆమె గొంతుపై పలు మార్లు కోశాడు. దీంతో తీవ్ర రక్త స్రావం అయ్యింది. ఆమె అపస్మారకస్థితిలోకి పడిపోవడంతో వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.
Read more: Punganur Tragedy: రాత్రంతా ఆన్‌లో బైక్… పొగ పీల్చి నిద్రలోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారుు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బైటపడింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసుల తీరుపైమండిపడుతున్నారు. గతంలో భర్తపై ఫిర్యాదు ఇచ్చినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుంటే ఈ దాడి జరిగేది కాదంటున్నారు . పొరపాటున ఆమె చనిపోతే ఆ బాలుడికి దిక్కెవరు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి