AP Govt Employees: తమ డిమాండ్లు, సమస్యలపై ఆందోళన చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేతన సవరణ సంఘం, డీఏ పెంపుతోపాటు ఐఆర్, పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. ఉగాదిలోపు తమకు హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లలో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. బకాయిల ఊసే లేదని తమ ఆవేదనను వివరించారు.
తాడేపల్లిలోని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కార్యాలయంలో జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు ఉద్యోగ సంఘం నాయకులుగా తాము సమాధానం చెప్పలేకపోతున్నట్లు తెలిపారు.
'పీఆర్సీ దూరమవుతుందనే ఆందోళన అందరిలో ఉంది. ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి' అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. సరెండర్ లీవులు, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలు రావడం లేదని వివరించారు. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని వాపోయారు.
ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయీ అందలేదని.. రిటైరైన వారు రావాల్సిన బెనిఫిట్లు తీసుకోకుండానే మరణిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు, పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని వివరించారు. పాలనలో తాము ప్రభుత్వానికి సహకరిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తమకు సహకారం లేదని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కానే కాదు.. ముంచిన ప్రభుత్వం అని ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటం తథ్యం అని జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.
‘అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు.. అంతకుముందే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇవ్వడం లేదు' బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి అని తెలిపారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందని తమకు ఆందోళన నెలకొందని.. గతంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్‌ను ప్రకటిస్తూ వచ్చాయని గుర్తుచేశారు. రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రకటించారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటమేనని తేల్చిచెప్పారు.
ప్రభుత్వం హామీలు నిలబెట్టుకుంటుందని.. సమస్యలు పరిష్కరిస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నామని.. ఇప్పుడు ఊరుకునేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఐఆర్ ప్రకటించి, పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని.. అనివార్యంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడిందని జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. ఒక్క డీఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలని.. ఉగాదికి ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Telangana Assembly Session: అసెంబ్లీ సమావేశాలు చాలా తక్కువ రోజులే నిర్వహిస్తున్నారని.. మరో పది రోజులు పెంచాలని బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహించేది కొన్ని రోజులు మాత్రమేనని తెలిపారు. 'ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీని నడుపుతామని ప్రభుత్వం చెప్పింది. వాటిలో రెండు ఆదివారాలు, రెండు పండుగలు పోతే అసెంబ్లీని ఎన్ని రోజులు నడుపుతారని అడిగాం' అని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్‌సీ, ఐఆర్, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్‌లైన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం పీఏసీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తన వాదనలు చెప్పిన అనంతరం అసెంబ్లీలో మీడియాతో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు చిట్‌చాట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కచ్చితంగా అసెంబ్లీ పని దినాలు పెంచాలని చెప్పాం. ఆదివారాలు అసెంబ్లీ పెట్టాలని కోరాం. మార్చి 30వ తేదీ వరకు సభ నడుపుతామని చెబుతున్నారు. మేము కనీసం మార్చి 31 వ తేదీ వరకు సభ పెట్టాలని కోరాం. సీఎంతో మాట్లాడి చెప్తామని చెప్పి 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పింది. 22వ తేదీ ఆదివారం అసెంబ్లీ ఉంటుంది. హౌస్ కమిటీలు ఆలస్యమయ్యాయని చెప్పడంతో వేస్తామని చెప్పారు' అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వెల్లడించారు.
Also Read: KCR Wishes: నందిని సిద్దారెడ్డికి అభినందనల వెల్లువ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు శుభాకాంక్షలు
'రేపు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకపోవడంతో ప్రశ్నించాం. అన్‌స్టార్డ్ క్వశ్చన్స్, జీరో అవర్ ప్రశ్నలకు సమాధానం ఇప్పటివరకు రాలేదు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరాం' అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. 'బీఆర్ఎస్ పార్టీ తరపున ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాం. మేము మాట్లాడుతుంటే సీఎం, సంబంధిత శాఖా మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి మాత్రమే మాట్లాడాలని చెప్పాం' అని వెల్లడించారు.
ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇస్తే పట్టించుకోవడం లేదని స్పీకర్‌కు చెప్పాం. 19 అంశాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ తరపున అడిగాం. అసెంబ్లీ లైబ్రరీ పరిస్థితి దారుణంగా ఉందని బీఏసీలో ప్రభుత్వానికి చెప్పాం. బీఏసీ మినిట్స్ ఫాలో కాకపోతే వచ్చే బీఏసీని బాయ్ కాట్ చేస్తామని చెప్పాం. అసెంబ్లీని 9 గంటలకు పెట్టాలని బీఏసీలో డిమాండ్ చేశాం. అసలు ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను పెట్టలేదని చెప్పాం. ప్రివిలేజ్ మోషన్స్ తీసుకునేది డిప్యూటీ స్పీకర్. ప్రివిలేజ్ మోషన్స్ విషయంలో స్పీకర్ బాధ్యత తీసుకోవాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kendra Sahitya Akademi 2025 Award: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డికి దక్కడంపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాహిత్యానికి జాతీయ పురస్కారం లభించడంతో సిద్దారెడ్డికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన మిత్రుడు సిద్దారెడ్డికి అవార్డు లభించడంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్‌సీ, ఐఆర్, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్‌లైన్
'కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని.. ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన దీర్ఘ కవితా సంపుటి 'అనిమేష'కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం గొప్ప విషయం. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిద్ధారెడ్డి' అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రశంసించారు. 'మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యంతో ప్రజలను ఆలోచింపజేస్తూ.. ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిద్ధారెడ్డి చూరగొన్నారు' అని కేసీఆర్ కొనియాడారు.
కేటీఆర్ అభినందన
నందిని సిధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలంగాణకే గర్వకారణమని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ తెలిపారు. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడంతో శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.
'నందిని సిధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేసి తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారు. మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన నందిని సిధారెడ్డి కృషి మరువలేనిది. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష, ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప ఊపునిచ్చిన ప్రజా కవిగా సిద్ధారెడ్డి' అని మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. 'సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సిధారెడ్డి గెలుచుకోవడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవం. తెలంగాణ అస్తిత్వాన్ని.. సంస్కృతిని తన కలం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన సిద్దారెడ్డికి పురస్కారం దక్కడం సముచితం' అని మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు.
శుభాకాంక్షలు సర్: హరీశ్ రావు
అవార్డు దక్కించుకున్న నందిని సిధారెడ్డిని శుభాకాంక్షలు సర్ అంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటన విడుదల చేశారు. ''నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం గర్వకారణం. తెలంగాణ అస్తిత్వాన్ని అక్షరబద్ధం చేసిన మీ కృషి వెలకట్టలేనిది. ఈ పురస్కారం మీ సాహితీ ప్రస్థానానికి దక్కిన అసలైన గుర్తింపు. శుభాకాంక్షలు సర్' అని ప్రకటన చేశారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అభినందన
'తెలంగాణ మట్టి వాసనను భూమి స్వప్నంగా కన్న కవి.. మనుషుల మధ్య 'సంభాషణ' తెగిపోకుండా అక్షర వారధి కట్టిన సాహితీవేత్త సిద్దిరెడ్డి. ప్రాణహిత తీరాల్లో అలల ఉత్సాహాన్ని.. 'నీటిమనసు'లోని అలజడిని పట్టుకున్న అక్షర శిల్పి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం గర్వకారణం' అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రకటించారు. 'కరోనా కాలపు కన్నీటి దృశ్యాలు, మనిషి ఎదుర్కొన్న జీవన బీభత్సాన్ని 'ఆనిమేష' దీర్ఘ కవితలో అత్యంత ఆర్ద్రంగా ఆవిష్కరించారు. 'ఒక బాధ కాదు', అది సమాజపు సామూహిక వేదన అని చాటిన సిదారెడ్డి కృషీవలత్వానికి ఈ గౌరవం దక్కడం తెలంగాణ సాహిత్యానికే వన్నె తెచ్చింది' అని అభినందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IPL 2026 Winner Prediction: ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ ఇటీవలే ఘనంగా ముగిసింది. వరుసగా రెండోసారి భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు మరోసారి క్రికెట్ అభిమానులను రంజింపజేసేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ సిద్ధమవుతుంది. ఈ ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీ ప్రారంభం ముందే మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా కప్ గెలిచే సూచనలు లేవని వెల్లడించాడు. ఇంతకీ అతనెవరో తెలుసా?
మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. గత సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన ఆర్సీబీ జట్టు మరోసారి తమ సత్తా చాటాలని కృషి చేస్తోంది.
IPL 2026 విన్నర్ ఆ టీమ్!
రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నా ఈసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరడం కష్టమని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ క్రమంలో ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆకాష్ చోప్రా వెల్లడించాడు.
అయితే ఏ జట్టు ఈసారి విన్నర్‌గా నిలవబోతుందనే ప్రశ్నకు ఆకాష్ చోప్రా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఏ జట్టు గెలుస్తుందో తనకు తెలియదని అంటున్నారు. బహుశా ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ట్రోఫీ గెలుచుకోవచ్చని అన్నాడు. తన అభిప్రాయం అదే అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సీజన్‌లో సంజూ శాంసన్ అత్యధిక రన్స్ రాబట్టి ఆరెంజ్ క్యాప్ దక్కించుకుంటాడని.. అలాగే జస్‌ప్రీత్ బుమ్రా అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.
2025లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే జట్టు పరమచెత్తగా ఆడింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 10 ఓడిపోయి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. అయితే ఈసారి జట్టులోకి సంజూ శాంసన్ రాకతో ఏమైనా స్పెషల్‌గా జరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ సీజన్‌తో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
CSK జట్టులో ఎవరెవరు ఉన్నారంటే?
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని, సంజూ శాంసన్, డెవాల్ట్ బ్రెవిస్, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, కార్తీక్ శర్మ, ఉర్విల్ పటేల్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, జమీవ్ ఖో ఓవర్టన్, రామకృష్ణ కిహో ఓవర్టన్, ఖాన్, ముష్కే ఫౌల్కేస్, గుర్జబ్నీత్ సింగ్, ఎస్. గోపాల్, మాట్ హెన్రీ, అఖేల్ హొస్సేన్, రాహుల్ చాహర్.
Also Read: LPG Cylinder Price: సామాన్యుడికి షాకింగ్ న్యూస్..ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.7,000 అమ్మకం..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bengali Wedding Lip Kiss Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ పాపులర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన వీడియోలు తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో అప్పుడే పెళ్లైన నవ దంపతులు.. నిగ్రహంగా ఉండలేక పెళ్లిపీటలపై లిక్ కిస్‌లతో రెచ్చిపోయారు. పెళ్లిలో పెద్దల ముందే ఈ పాడుపని చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఏం జరిగింది?
నేటితరం యువత పెళ్లి తర్వాత నాలుగు గోడల మధ్య జరగాల్సిన కార్యాన్ని నలుగురిలో (సోషల్ మీడియాలో షేర్ చేయడం) పెద్ద ట్రెండ్ అయ్యింది. అలాంటి కొన్ని విచిత్రమైన పనులు వీడియోలుగా మారి ఇప్పుడు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో అప్పుడే పెళ్లైన ఓ జంట చేసిన పాడుపని గురించి నెట్టింట రకరకాలుగా చర్చ జరుగుతుంది.
వివరాల్లోకి వెళితే..అదొక బెంగాలీ పెళ్లి. పెళ్లిపందిరిలో ఘనంగా ముస్తాబై, నూతన వధూవరులు వివాహంతో ఒక్కటైన క్షణం అది. అయితే అకస్మాత్తుగా ఆ జంట బంధువులున్నారని పట్టించుకోకుండా పెళ్లిపీటలపై వధూవరులు ఇద్దరూ లిప్ కిస్ లు పెట్టుకుంటున్నారు. పందిట్లో పెద్దలు, పిల్లలు ఉన్నారనే ఇంగితం లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. పెళ్లికూతురు తీరును చూస్తే ఆమె అంతటితో ఆగేలా కనిపించలేదు. అలాగే పెళ్లికొడుకు కూడా తానేం తక్కువ తినలేదంటూ ముద్దుల్లో రెచ్చిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాదాపుగా 35 సెకన్ల పాటు సాగిన ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు హిందూ వివాహ ఆచారాల సాంప్రదాయ పవిత్రతకు విరుద్ధమని ఆగ్రహిస్తున్నారు. సంప్రదాయ భారతదేశంలో పాశ్చాత్య పోకడలు తగవని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ ముద్దులాట ఏంటని పలువురు తిట్టిపోస్తున్నారు. అలాగే మరికొందరు ఈ నూతన వధూవరులకు మద్దతుగా నిలుస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG Cylinder Price: సామాన్యుడికి షాకింగ్ న్యూస్..ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.7,000 అమ్మకం..ఎక్కడంటే?
LPG Cylinder Price 7000 News: దేశవ్యాప్తంగా కమర్షియల్ LPG సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ కొరత హోటల్ పరిశ్రమను పెద్ద సంక్షోభంలోకి నెట్టివేసింది. ఒకప్పుడు సాధారణ మిస్డ్ కాల్‌తో గ్యాస్ సిలిండర్లను పొందిన హోటల్ యజమానులు ఇప్పుడు సరఫరాలను పొందటానికి ఇబ్బంది పడుతున్నారు. దీని వలన రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఇదే అదునుగా కొందరు దళారులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను రూ.7,000లకు బ్లాక్‌లో అమ్మకాలు చేస్తున్నారు.
కొంతమంది మధ్యవర్తులు ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం ద్వారా డబ్బు దండుకుంటున్నారని హోటల్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు బెంగళూరులో కమర్షియల్ LPG సిలిండర్ అధికారిక ధర దాదాపు రూ.1,900 విక్రయిస్తుండగా.. ఇప్పుడు కొరత ఉందని గ్రహించిన దళారులు సిలిండర్లను బ్లాక్‌లో అమ్మకానికి ఉంచారు. ఒక్కో గ్యాస్ సిలిండర్‌ను రూ.7,000కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలాంటి కృత్రిమ కొరత ఏర్పరిచిన వారిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని హోటల్ యజమానాలు డిమాండ్ చేస్తున్నారు.
బెంగళూరుతో పాటు మైసూరు నుండి కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. హోటల్ యజమానులు సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో ఒక్కొక్కటి రూ.4,000 నుండి రూ.5,000 వరకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఫాస్ట్ ఫుడ్ సెండర్లు, రెస్టారెంట్లపై ఆర్థిక భారం పెరుగుతుందని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా అనేక హోటళ్లు ఆహార ధరలను భారీగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో టిఫిన్స్ అమ్మకాలపై ప్లేట్‌కు రూ.10 చొప్పున పెంచేశారు. కొన్ని హోటల్ యజమానులు గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నారు. అలా చేసినా అల్పాహారాల ధరలు రూ.5 నుంచి రూ.20 పెంచుతున్నట్లు కస్టమర్లు వాపోతున్నారు.
అయితే కొన్ని హోటళ్లలో కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా ఇంటికి ఉపయోగించిన LPG గ్యాస్ సిలిండర్లను చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార, పౌర సరఫరాల శాఖ పలుచోట్ల దాడులను నిర్వహించి అనేక సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు బెంగళూరు సిటీలో దాదాపుగా 316 సిలిండర్లను జప్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ క్యాంటీన్లు, ప్రసాదం పంపిణీ చేసే దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ముఖ్యమైన సంస్థలకు కమర్షియల్ LPG సిలిండర్లలో దాదాపు 20 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని ఆ శాఖ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KCR Fires On Congress Govt: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 16) గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ సీఎం, మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత స్వీచ్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది పాత వీడియోనే అయినా అందులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నట్లుగా ఉండడంతో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడా వీడియోను వైరల్ చేస్తున్నారు.
సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై చేసిన విమర్శలు ఈ వీడియోలో ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పాత్రను ఎండగట్టారు. అంతకుముందు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని కేసీఆర్ విమర్శించారు.
1956లో జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపారని, ఆనాడు విద్యార్థులు, మేధావులు వ్యతిరేకించినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. అలాగే 1969 ఉద్యమంలో ఇందిరా గాంధీ "నో తెలంగాణ" అని చెప్పి ఉద్యమాన్ని అణచివేశారని, వందలాది మంది విద్యార్థులు చనిపోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.
గత ప్రభుత్వాల వైఫల్యాలు..
ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్నా కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ అధినేత విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిన ఘటనను గుర్తుచేశారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసి, కంపల్షన్ (కచ్చితమైన పరిస్థితి) క్రియేట్ చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు.
మరోవైపు దేశంలో తెలంగాణ ప్రస్తుతం తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో అగ్రగామిగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టే ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద రూ.5 కోట్లు ఇస్తున్నామని, ఇది భారతదేశంలో మరే రాష్ట్రంలో లేదని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు ఇచ్చామని, విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించామని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG vs Induction Cooking: మన దేశంలో చాలామంది వంటగదిలో LPG గ్యాస్ సిలిండర్‌నే ఉపయోగిస్తున్నారు. దాదాపుగా గ్రామాల్లో కూడా కట్టెల పొయ్యిని పక్కన పెట్టి గ్యాస్ పొయ్యిలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సిటీల్లో ఇండక్షన్ కుక్‌టాప్ బాగా ఫేమస్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఇటీవలే ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఎప్పీజీ గ్యాస్ కొరత ఏర్పడనుందనే వార్తలు ఇప్పుడు ఇండక్షన్ స్టవ్‌లపై డిమాండ్ భారీగా పెరిగి పోయింది. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎంపిక అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కరెంట్ పొయ్యిలతో పోలిస్తే గ్యాస్ సిలిండర్ ఒక నెల రోజులు పనిచేస్తుంది. ఒక్కో సిలిండర్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.900 నుంచి రూ.1,100 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. మరోవైపు, ఇండక్షన్ కుక్‌టాప్ కరెంట్‌తో నడుస్తుంది. కాబట్టి దీనికి కరెంట్ బిల్లు కట్టాల్సిన పని ఉంది. అయితే దీని వాడకంలో యూనిట్‌కు రూ.6 నుంచి రూ.9 వరకు వసూలు చేస్తున్నారు.
ఇండక్షన్ కుక్‌టాప్‌ల ప్రయోజనాలు
LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్), ఇండక్షన్ కుక్‌టాప్‌ల మధ్య అతి ముఖ్యమైన వ్యత్యాసం వాటి వంట సామర్థ్యంలో ఉంది. LPG స్టవ్‌లో, దాదాపు 50 నుండి 60 శాతం శక్తి మాత్రమే నేరుగా వంట కోసం వినియోగిస్తారు. మిగిలినది వేడిమిగా చుట్టుపక్కల వాతావరణంలోకి కలిసి పోతుంది. అయితే ఇండక్షన్ స్టవ్ అందుకు భిన్నంగా 80 నుంచి 90 శాతం వరకు వేడిని నేరుగా వంట పాత్రలపై ప్రభావం చూపుతుంది. చాలా సార్లు ఇండక్షన్ స్టవ్‌లపై ఆహారం త్వరగా ఉడుకుతుందని చాలామంది అంటుంటారు. గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ ఎంతో పొదుపుగా వినియోగం అవుతందని.. రోజూ వారి ఆహారాన్ని రెడీ చేసేందుకు తక్కువ సమయం తీసుకుంటుందని పలువురు భావిస్తారు.
అయినా దేశంలోని వంటగదుల్లో ఇప్పటికీ 90 శాతం గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తారు. ఎందుకంటే చాలా మంది వీటికి అలవాటు పడడం సహా ఇండక్షన్ స్టవ్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి అవగాహన లేకపోవడం మరో కారణం కావచ్చు. దీంతో పాటు ప్రస్తుత కాలంలో చాలా మంది హైబ్రిడ్ కిచెన్ సెటప్‌లను వినియోగిస్తున్నారు. రోజువారీ వంటలకు ఇండక్షన్ స్టవ్, స్పెషల్ వంటకాలకు LPG సిలిండర్లను వినియోగిస్తున్నారు. కొన్నిసార్లు గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ కోతల కారణంగా LPG సిలిండర్‌కే ఎక్కువ మొగ్గు చూపుతారు.
ఏది డబ్బు ఆదా చేస్తుంది?
14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర దాదాపు రూ.900 నుంచి రూ.1,000 లకు మార్కెట్లో లభిస్తుంది. అయితే, ఈ సిలిండర్ సాధారణంగా ఒక నెల పాటు వినియోగానికి వస్తుంది. ఇంతలో ఇండక్షన్ స్టవ్‌పై వంట చేయడానికి దాదాపు 78 యూనిట్ల విద్యుత్ అవసరం. విద్యుత్ ధర యూనిట్ కు రూ.8 అయితే, ఖర్చు 78 × 8 = రూ. 624. అంటే LPG సిలిండర్ తో పోలిస్తే మనం దాదాపు రూ.289 ఆదా చేయవచ్చు.
మరోవైపు దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కొందరు PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) ఉపయోగిస్తున్నారు. ఇది గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అయితే, దీని ధర అంతర్జాతీయ LNG మార్కెట్‌తో సమానంగా ఉంది.
Also Read: Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఒకేఒక్క మహిళ? ఎవరీ ప్రియాంక రెడ్డి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vivo T5x 5G Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) టి-సిరీస్‌లో మరో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ రానుంది. వివో T5x 5G మొబైల్‌ను 2026 మార్చి 17న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు దేశంలో లాంఛ్ చేయనున్నారు. ఈ మొబైల్ ప్రముఖ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్, అలాగే వివో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ ఫీచర్స్ గురించి ఇప్పటికే కంపెనీ ఓ క్లారిటీ ఇచ్చింది. వాటిలో ప్రధానంగా బ్యాటరీ సైజ్ పెంచడమే కాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌తో పాటు దీనికి పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ మొబైల్ ధర, ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వివో T5X 5G స్మార్ట్‌ఫోన్ ధర
భారతదేశంలో Vivo T5X 5G ధర ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ వివోలో వాటి గత వేరియంట్స్‌తో పోలిస్తే రూ.10,000 నుంచి రూ.23,000 మధ్యలో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొంత మంది రూ.23,000 కంటే తక్కువ ధరకే అనగా.. రూ.15,999 నుంచి రూ.20,000 మధ్య ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా రేపటితో ఈ మొబైల్ ధర, ఫీచర్స్ గురించి జరుగుతున్న చర్చపై తెరపడనుంది.
వివో T5X 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వివో T5X 5G మెయిన్ ఫీచర్స్‌లో ఒకటి బ్యాటరీ సెటప్. 7,200mAh బ్యాటరీ కెపాసిటీతో దాని విభాగంలో ఇది అత్యున్నతంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా 44W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. 40 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 93 గంటల సంగీతం, BGMI వంటి 15 గంటలకు పైగా గేమింగ్, 18+ గంటల సోషల్ మీడియా వినియోగం లేదా ఒకే ఛార్జ్‌పై 14+ గంటల GPS నావిగేషన్ వంటి వాటిని పేర్కొంది.
ఈ వివో T5X 5G స్మార్ట్‌ఫోన్ కూడా మీడియాటెక్ డైమన్‌సిటీ 7400 టర్బో చిప్‌సెట్ (ఆక్టా-కోర్)తో ప్యాక్ చేశారని నిర్ధారించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6పై నడుస్తుంది. అలాగే ఇందులో ఫ్లూయిడ్ గేమింగ్ కోసం ఆల్ట్రా గేమ్ మోడ్, 4D గేమింగ్ వైబ్రేషన్లు, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, వాయిస్ ఎఫెక్ట్‌లను ఎనేబుల్ చేసే గేమ్ వాయిస్ ఛేంజర్ ఉన్నాయి. 50MP ప్రైమరీ సెన్సార్, LED ఫ్లాష్, రింగ్ లైట్‌తో సహా డ్యూయల్ రియర్ సెటప్‌ను కలిగి ఉంటుంది.
ఈ మొబైల్ దుమ్ము, వాటర్ ఫ్రూవ్ కోసం IP69+ రేటింగ్‌తో పాటు SGS డ్రాప్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌లను కూడా పొందుతుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్, 1,250 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 6.72-అంగుళాల FHD+ LCD ప్యానెల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. సైబర్ గ్రీన్, స్టార్ సిల్వర్ అనే రెండు రంగు ఎంపికలలో వస్తుంది. కనీసం 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులోకి రానుంది.
Also Read: Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఒకేఒక్క మహిళ? ఎవరీ ప్రియాంక రెడ్డి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Odisha Cuttack SCB Medical College Fire Accident: ఒడిశాలోని కటక్ ఏసీబీ మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు మంటలు అంటుకొని అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో మరో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సీఎం మోహన్ చరణ్ మాంఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించి ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇక ప్రమాదంపై కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
Fire In #Cuttack Hospital ICU #Kills 10 Patients, #Injures 11 Staff#SCBMedicalCollege#HospitalFire#OdishaNews#FireIncident#ICUFire#HospitalTragedy#SCBMedical#FireAccidentNews#FireBreaksOut#NewsFlash@CMO_Odisha@CuttackDM@dcp_cuttack https://t.co/BnnteHtlx0 pic.twitter.com/cbCunTjkCs
— Goldy Srivastav (@GoldySrivastav) March 16, 2026
Ustaad Bhagat Singh Pawan Kalyan Speech: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు (మార్చి 15) అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేదికగా తాను ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతానని ఫ్యాన్స్‌కు అభయమిచ్చారు పవన్ కళ్యాణ్. మొత్తానికి తాను రాజకీయాల్లో ఉన్నా.. సినిమాల్లో నటించడం పూర్తిగా మానేయనంటూ స్పష్టం చేశారు.
ఈ ఈవెంట్‌లో హీరో పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తన అభిమానుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ, సినిమా ఆలస్యమైనా తన వెంటే ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాలోని తన పాత్ర, హరీష్ శంకర్ మేకింగ్ గురించి ప్రస్తావించారు.
"నా గుండెల్లో కొలువై ఉన్న ఫ్యాన్స్‌కు, ఇంట్లో కూర్చొని కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సుమ గారు మాట్లాడుతూ నన్ను ఏదో పాత కాలం నటుడిని చేస్తున్నట్లు అనిపించింది (నవ్వుతూ..). 'ఓజీ' మొన్ననే రిలీజ్ అయ్యింది. అయినా నేను రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను వెనక్కి నెట్టేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం బల్లగుద్ది చెబుతున్నా.. నాకు అన్నం పెట్టింది, ఈరోజు ప్రజలకు సేవ చేసే స్థాయికి నన్ను చేర్చింది సినిమానే. సినిమా నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది, దాన్ని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు" అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
'ఫ్యాన్ వార్స్ వద్దు'
"నాకు ఎప్పటికీ ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు. ఆయన పక్కన ఉంటే నేను హీరోననే విషయం కూడా మర్చిపోతాను. రామ్ చరణ్ నా ట్రైలర్ గురించి ట్వీట్ చేయడం సంతోషంగా ఉంది. ఇకపోతే, సినిమా ఇండస్ట్రీకి ప్రాంతీయత ఉండదు. అందరు హీరోల సినిమాలు ఆడాలి, అందరూ బాగుండాలి. నాకు 'ఫ్యాన్ వార్స్' నచ్చవు. నా సినిమా కలెక్షన్లు అందరినీ దాటేయాలని నేను కోరుకోను, అందరూ విజయం సాధించాలని ఆశిస్తాను" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
"హరీష్ శంకర్ నన్ను బాగా నమ్ముతాడు. నాకు గుర్రపు స్వారీ రాకపోయినా 'గబ్బర్ సింగ్' లో చేయించాడు, ఇప్పుడు ఈ సినిమాలో నాతో డాన్స్ కూడా చేయించాడు. రాజకీయాల వల్ల నేను డేట్స్ ఇవ్వలేకపోయినా, కేవలం 40-45 రోజుల్లోనే రోజుకు 2-3 గంటలు కష్టపడి హరీష్ ఈ సినిమాను అద్భుతంగా ప్లాన్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు పెద్ద ఊపునిచ్చింది. శ్రీలీల, రాశీ ఖన్నా తమ పాత్రల్లో ఒదిగిపోయారు."
"సినిమా ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు, కానీ మేం మాత్రం ఎక్కడా తప్పు లేకుండా కష్టపడి పనిచేశాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు సామాజిక అవగాహన కూడా ఉంటుంది. మార్చి 19న విడుదల కాబోతున్న ఈ చిత్రం 'గబ్బర్ సింగ్' అంతటి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. చివరిగా ఒక్క మాట.. మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం నాది" అని పవన్ కళ్యాణ్ ముగించారు.
ఆ తర్వాత డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. సినిమా ఆలస్యానికి తానే బాధ్యుడినని సరదాగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌ను "మా ఎమ్మెల్యే" అని సంబోధిస్తూ, ఆయన ఇమేజ్‌కు తగినట్లుగా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని ధీమా వ్యక్తం చేశారు. ప్రమోషన్ కోసం ఆయన ధరించిన ప్రత్యేకమైన షర్ట్ అందరినీ ఆకట్టుకుంది.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.. ఎస్ఎస్ తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook