అబ్దుల్లాపూర్ మెట్టులో 7 బైక్‌లకు నిప్పంటించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు
అబ్దుల్లాపూర్ మెట్టు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీలో గూండాలు రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన ఏడు బైక్‌లకు నిప్పంటించారు, దానితో పాటు ఏడు బైక్‌లను దగ్ధం చేశారు, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పన్ను విచారణ జరుగుతోంది. 7 బైక్ దగ్ధం ఘటనలో ఇద్దరు అనుమానితులుగా అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు అదే కాలనీకి చెందిన మొగిల మహేంద్ర, ఎజమేడల శివకుమార్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Rupee Weakness Results: ఫారెన్ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడంతో రూపాయి ఒత్తిడిలో పడింది. దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారడంతో ఈ క్షీణత సాధారణ ప్రజలపై ప్రభావం చూపనుంది. దీని ఫలితంగా పెట్రోల్, డిజిల్, ఎలక్ట్రానిక్స్, విదేశీ ప్రయాణాల ధరలకు రెక్కలు రానున్నాయి. 2025లో ఫారెన్ ఇన్వెస్టర్లు 18 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 16న డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ 91.02కి పడిపోయింది. ఇప్పటి ఇప్పటి వరకు ఉన్న అత్యల్ప స్థాయి. భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఉపసంహరించుకోవడంతో రూపాయిపై భారీ ఒత్తిడిని పడింది. రూపాయి బలహీనపడం సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దిగుమతులు మరింత ఖరీదుగా మారుతాయి. పెట్రోల్, డీజిల్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ లేదా విదేశాలకు ప్రయాణించే ఖర్చులు భారీగా పెరుగుతాయి.
రూ. 91.02 – డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. 20శాతం – ఏప్రిల్ 2022 నుండి రూపాయి క్షీణతకు గురైంది. 6శాతం – 2025లోనే పతనమయ్యింది. ఆసియాలోనే ఇది అత్యధికంగా 18 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2025లో ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్స్ నుంచి 50శాతం పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అయితే కొన్ని భారతీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించింది.
మొత్తానికి రూపాయికి కష్టకాలం వచ్చిందనే చెప్పాలి. సోమవారం కనిష్ట స్థాయికి చేరుకుని కొత్త రికార్డుకు చేరుకుంది. 2025లో రూపాయి ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబర్చిన కరెన్సీగా మారింది. థాయిలాండ్, దక్షిణకొరియా ఇండోనేషియా కరెన్సీల కంటే దారుణంగా పడిపోయింది. ఈ క్షీణత ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 2022 ఏప్రిల్ నుంచి క్షీణిస్తుంది. అప్పటి నుంచి డాలర్ తో పోలిస్తే దాదాపు 20శాతం, యూరోతో పోలిస్తే 29శాతం, బ్రిటిష్ పౌండ్ తో పోలిస్తే 23శాతం బలహీనపడింది.
రూపాయి ఎందుకు బలహీనపడుతోంది అనేదానికి కారణం ఏంటంటే.. భారత్ నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై అమెరికా 50శాతం వరకు సుంకాలను విధించింది. దీంతో భారతదేశపు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ కు దెబ్బతగిలినట్లయ్యింది. ఇండో అమెరికా వాణిజ్య చర్చలను నిలిపివేసింది. ఇదొక కారణం అయితే రెండో కారణం కూడా ఉంది. అమెరికా, ఇతర మార్కెట్లో మెరుగైన రాబడిని చూసి ఫారెన్ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు 2025లో ఇఫ్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులు 18 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. డిసెంబర్ లో 500బిలియన్ డాలర్లకు పైగా బాండ్ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ భారీ తరలింపు అనేది రూపాయిపై భారీ ఒత్తిడిని కలిగించింది.
సామాన్యులపై ఎలాంటి ప్రభావ చూపనుంది?
రుపాయి బలహీనపడుతుందంటే... దిగుమతులు ఖరీదుగా మారుతాయి. భారత్ తన చమురు అవసరాల్లో 8శాతానికిపైగా విదేశాలపైనే ఆధారపడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు మొబైల్స్, ల్యాప్ టాప్స్, ఐఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి డాలర్, యూర్, పౌండ్ తో పోలిస్తే రూపాయి బలహీనంగా మారడంతో విదేశీ ప్రయాణాలు కూడా మరింత ప్రియం అవుతాయి.
రూపాయి బలహీన పడితే ఎవరు ప్రయోజనం పొందుతారు?
రూపాయి బలహీనపడటం వల్ల ఎగుమతి కంపెనీలు లాభం పొందుతాయి. ఐటీ కంపెనీలు, ఔషధ తయారీదారు కంపెనీలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని డాలర్ల రూపంలోనే సంపాదిస్తాయి. కాబట్టి రూపాయి బలహీనపడితే వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
డాలర్ కు 95 రూపాయల వరకు చేరుకునే ఛాన్స్:
డాలర్ బలంగా ఉండి.. ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగిస్తే.. రూపాయి విలువ డాలర్ కు 92 నుంచి 95కి చేరుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్బిఐ డాలర్లను అమ్మడం ద్వారా క్షీణతను అరికట్టేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ దాని పరిధి అనేది పరిమితంగా ఉంటుంది.
ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉందా?
రూపాయి బలహీనత ఇక నుంచి కేవలం కరెన్సీ సమస్య మాత్రమే కాదు.. ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం కూడా ఉంటుంది. విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. భారత దేశ ఆర్ధికాభివ్రుద్ధి అంచనాల కంటే మెరుగ్గా ఉన్నా.. రూపాయి పడిపోవడం వల్ల ఈ మొత్తం వ్రుద్ధి కథకు భారీ సవాల్ విసురుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Post Office Schemes: కేంద్ర ప్రభుత్వం.. ప్రజల్లో పొదుపు అలవాట్లను ప్రోత్సహించేందుకు.. అనేక చిన్న మొత్తాల సేవింగ్స్ స్కీమ్స్ ను అమలు చేస్తోంది. ముఖ్యంగా పోస్టల్ శాఖ ద్వారా అందుబాటులో ఉన్న పొదుపు స్కీమ్స్ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా రూపకల్పన చేసింది. భద్రత, స్థిరమైన వడ్డీ, పన్ను ప్రయోజనాలు వంటి అంశాల వల్ల ఈ పథకాలకు మంచి ఆదరణ ఉంది. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టిన అసలు మొత్తానికి, వడ్డీ రాబడులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండటంతో మదుపర్లు భరోసాతో పెట్టుబడి పెట్టవచ్చు. చాలా పథకాలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. ఆ పథకాలేవి.. అందులో ఎంత వడ్డీ లభిస్తుంది.. ఎంత లాభం వస్తుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్:
ఈ ఖాతాను ఒక వ్యక్తి ఒంటరిగా లేదా ఇద్దరు కలిసి జాయింట్‌గా తెరవవచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్ లేదా మానసికంగా అశక్తుడైన వ్యక్తి తరఫున గార్డియన్ ద్వారా కూడా అకౌంట్ తీసుకోవచ్చు. ఇందులో వార్షిక వడ్డీ రేటు 4 శాతంగా ఉంది. కనీసంగా రూ.500 డిపాజిట్ చేయాలి. రోజువారీ లావాదేవీలకు ఇది ఉపయోగపడే ప్రాథమిక సేవింగ్స్ అకౌంట్.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD)
ఐదేళ్ల కాలపరిమితితో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. పెట్టుబడిదారులు ఎన్ని అకౌంట్లైనా తెరవొచ్చు. నెలకు కనీసం రూ.100 చొప్పున డిపాజిట్ చేయాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.70 శాతం వడ్డీ అమల్లో ఉంది. చిన్న మొత్తాల్లో క్రమంగా పొదుపు చేయాలనుకునేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
పోస్టాఫీస్ టైం డిపాజిట్
ఈ పథకంలో 1, 2, 3 లేదా 5 సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీ అనంతరం ఖాతాను మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం కూడా ఉంది. ఐదేళ్ల టైం డిపాజిట్‌పై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి –
• 1 సంవత్సరం: 6.90శాతం
• 2 సంవత్సరాలు: 7శాతం
• 3 సంవత్సరాలు: 7.5శాతం
• 5 సంవత్సరాలు: 7.50శాతం
కనీస డిపాజిట్ రూ.1,000 కాగా, గరిష్ట పరిమితి లేదు.
మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS)
ఈ పథకం నెలనెలా వడ్డీ ఆదాయం కోరుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.40 శాతం. కనీస డిపాజిట్ రూ.1,000. సింగిల్ అకౌంట్లో గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్లో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ ఆదాయంపై వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి.
సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
60 ఏళ్లు పైబడిన వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. అవసరమైతే వడ్డీ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్‌కు ఆటో క్రెడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.20 శాతం. కనీస పెట్టుబడి రూ.1,000, గరిష్టంగా రూ.30 లక్షల వరకు అవకాశం ఉంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
ఒక వ్యక్తికి ఒక్క పీపీఎఫ్ ఖాతా మాత్రమే అనుమతి ఉంటుంది. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ ఖాతా తెరవవచ్చు. వడ్డీపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. మెచ్యూరిటీ సమయానికి అసలు, వడ్డీ మొత్తం కలిపి చెల్లిస్తారు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.10 శాతం. కనీస డిపాజిట్ రూ.500, గరిష్టంగా ఏడాదికి రూ.1.50 లక్షలు. ఖాతా కాలపరిమితి 15 సంవత్సరాలు కాగా, తరువాత ప్రతి 5 సంవత్సరాలకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన ఈ పథకంలో ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేరు మీద అకౌంట్లు తెరవవచ్చు. పాప వయసు 10 సంవత్సరాలు పూర్తయ్యేలోపు తల్లిదండ్రులు లేదా గార్డియన్ అకౌంట్ తెరవాలి. వడ్డీ వార్షికంగా లెక్కించి మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.1 శాతం. కనీస డిపాజిట్ రూ.250, గరిష్టంగా రూ.1.50 లక్షలు. మెచ్యూరిటీపై పన్ను లేదు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)
ఈ స్కీమ్‌లో ఎన్ని అకౌంట్లైనా తెరవవచ్చు. వడ్డీ వార్షికంగా లెక్కించి మెచ్యూరిటీకి అసలుతో కలిపి చెల్లిస్తారు. 18 ఏళ్లు నిండిన వారు అకౌంట్ తెరవవచ్చు. మైనర్ల తరఫున గార్డియన్‌కు అవకాశం ఉంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.70 శాతం. కనీస డిపాజిట్ రూ.1,000, కాలవ్యవధి 5 సంవత్సరాలు.
కిసాన్ వికాస్ పత్ర (KVP)
ఈ పథకంలో పెట్టుబడి చేసిన మొత్తం 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. 18 ఏళ్లు నిండిన వారు అకౌంట్ తెరవవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.50 శాతం. కనీస డిపాజిట్ రూ.1,000, గరిష్ట పరిమితి లేదు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్
మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పథకంలో మహిళలు తమ పేరుతో లేదా మైనర్ బాలికల తరఫున గార్డియన్‌గా అకౌంట్ తెరవవచ్చు. మెచ్యూరిటీ సమయంలో అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తారు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.50 శాతం. కనీస డిపాజిట్ రూ.1,000, గరిష్టంగా రూ.2 లక్షలు. డిపాజిట్ కాలపరిమితి 2 సంవత్సరాలు.
ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షించి మారుస్తుంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, కాలవ్యవధి, పన్ను ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని సరైన పథకాన్ని ఎంచుకోవడం మంచిది. మరింత స్పష్టమైన సమాచారం కోసం సమీప పోస్టాఫీసును సంప్రదిస్తే పూర్తి వివరాలు లభిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
20 foot king cobra rescued video: సోషల్ మీడియాలో కోబ్రాల వీడియోలు ఇటీవల బాగా ట్రెండ్ అవుతున్నాయి. పాములు అంటేనేచాలా మంది భయంతో వణికిపోతారు. పొరపాటున ఎక్కడైన చీకట్లో తాడు కన్పించిన పామని భయపడిపోయే వారు చాలా మంది ఉంటారు. కోబ్రాలే డేంజర్ అంటే కింగ్ కోబ్రాల గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అవి చాలా డెంజర్గా ఉంటాయి. వీటి విషంలో సెకనుల వ్యవధిలో మనిషి చనిపోతారు. కింగ్ కోబ్రా విషం ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ,నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది.
దీంతో కింగ్ కోబ్రా కాటు వేసిన కొద్దిసేపటికి వ్యక్తి ప్రాణాలు కొల్పోతాడు. అడవులు, దట్టమైన కొండలు, చెరువులు మొదలైన ప్రాంతాల్లో ఎక్కువగా కింగ్ కోబ్రాలు ఉంటాయి. అవి ఇతర సర్పాలను తినేస్తాయి. గూడు కట్టుకుని ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక భారీ కింగ్ కోబ్రా జనావాసాల్లోకి వచ్చింది. అయితే.. వారు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అతను రంగంలోకి దిగాడు.
ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం భారీ కింగ్ కోబ్రా జనల మధ్యలోకి వచ్చింది. అక్కడి వారు స్నేక్ క్యాచర్ కు చెప్పడంతో చాకచక్యంగా దాన్ని పట్టుకొవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అది పలుమార్లు అతనిపై దాడికి యత్నించింది. అతను కింగ్ కోబ్రా కాటు నుంచి తప్పించుకున్నాడు. మొత్తంగా కింగ్ కోబ్రా కొన్ని గంటల పాటుముప్పు తిప్పలు పెట్టింది.
Read more: Snake Video: అరె వావ్... తాడును చుట్టుకుని నాట్యం చేస్తున్న నాగుపాము.. అరుదైన వీడియో...
ఎంతో చాకచక్యంగా ప్రయత్నించి చిరవకు కింగ్ కోబ్రాను మెల్లగా తనతో తెచ్చుకున్న కర్రను ఉపయోగించి తన ఆధీనంలోకి తెచ్చుకుని బందించాడు. ఆ తర్వాత దగ్గరలోని అడవిలో తీసుకెళ్లి వదిలేశాడు. ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.