Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

Iran Israel War Impact: భారత్‌పై యుద్దం ఎఫెక్ట్! మరోసారి దేశం మొత్తం లాక్‌డౌన్..అందరికి వర్క్‌ ఫ్రమ్ హోమ్‍!

HDHarish Darla
Mar 13, 2026 12:29:24
Iran Israel War Impact on India: కరోనా సంక్షోభం తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Mar 13, 2026 13:15:58
Hyderabad, Telangana:

Chaturgrahi Yoga Effect On Zodiac Telugu: గ్రహాల గమనం మానవ జీవితంపై ఎంతటి ప్రభావం చూపుతుందో మనందరికీ తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం మార్చి నెలలో ఒక అరుదైన అత్యంత శుభప్రదమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. మార్చి 18వ తేదీన బృహస్పతి అధిపతిగా వ్యవహరించే మీనరాశిలో నాలుగు ప్రధాన గ్రహాలు కలయిక జరపబోతున్నాయి. ఈ సమయంలో చంద్రుడితో పాటు శని, శుక్రుడు, సూర్యుడు వంటి గ్రహాల సంయోగం జరుగుతుంది. దీంతో ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి 21వ తేదీ వరకు ఈ యోగ ప్రభావం కొనసాగుతుంది. అప్పటివరకు మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కీర్తి ప్రతిష్టలు లభించడమే కాకుండా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
వృషభరాశి 
ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ శక్తివంతమైన రాజయోగం ప్రభావంతో అపారమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరికి ఆదాయ మార్గాలు గణనీయంగా పెరగడమే కాకుండా.. వ్యాపారస్తులు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి కాస్త విముక్తి కూడా కలుగుతుంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలతో జీవితాన్ని ముందుకు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే ఈ రాశి వారికి కూడా అద్భుతమైన ధనయోగం ఉంది. వీరికి క్షేత్రస్థాయిలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కెరీర్లో పెద్దపెద్ద మైలురాయిని అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో విచక్షణతో వ్యవహరించడం చాలా మంచిది. లేదంటే ఈ సమయంలో విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మీన రాశి 
మీన రాశి వారికి చతుర్గ్రాహి యోగం ప్రభావంతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అలాగే సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు పదోన్నతులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ, వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. జీవితంలో అనుకున్న శిఖరాలకు చేరేందుకు ముందడుగు వేసే అవకాశాలున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

43
comment0
Report
HDHarish Darla
Mar 13, 2026 11:14:22
Hyderabad, Telangana:

Sadhvi Prachi On Monalisa Marriage: ప్రయాగ్‌ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా పూసలమ్మే అమ్మాయి ఫొటో దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. మోనాలిసా భోంస్లే అని పేరుతో ఫొటోలు తెగ వైరల్ చేశారు. ఆ యువతి తాజాగా కేరళలోని ఓ ముస్లిం బాయ్‌ఫ్రెండ్‌ ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లాడింది. అయితే ఈ ప్రేమ పెళ్లిపై పలువురు 'లవ్ జిహాద్' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇది లవ్ జిహాద్ కాదని వారిద్దరూ మీడియాకి స్పష్టం చేశారు. 

ఇదే విషయంపై ప్రముఖ హిందుత్వవాది సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పథ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వీ ప్రాచీ.. మోనాలీసా మతాంతర వివాహంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ పెళ్లి 'లవ్ జిహాద్' అంటూ అభివర్ణించారు. ఈ పెళ్లి తర్వాత మోనాలిసా భోంస్లే పరిస్థితి ఎంతో దారుణంగా ఉండబోతుందని ఆమె జోస్యం చెప్పారు. 

ఇదే మాదిరిగా గతంలో శ్రద్ధా వాకర్, నికితా తోమర్‌ల హత్యలు జరిగాయని సాధ్వీ ప్రాచీ గుర్తుచేశారు. అదే పరిస్థితి ఇప్పుడు మోనాలిసా ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితం శ్రద్ధావాకర్ అనే యువతిని తన ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత పాశవికంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే కోవలో 'లవ్ జిహాద్'కు తెగబడ్డ మోనాలిసా కూడా రాబోయే రోజుల్లో 35 ముక్కలుగా ఫ్రిజ్‌లో దొరికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె వెల్లడించారు. 

అందుకు బదులుగా మోనాలిసాను పెళ్లాడిన ఫర్మాన్ ఓ హిందువుగా మారి ఉంటే ఈ పెళ్లిని తాము అంగీకరించేవారమని సాధ్వీ ప్రాచీ చెప్పుకొచ్చారు. ఇది మోసపూరితమైన లవ్ జిహాద్ అంటూ ఆమె పునరద్ఘాటించారు. హిందువులు తమ పిల్లల మెడల్లో పంది దంతాలను కట్టాలని అలా చేయడం వల్ల ఇతర మతస్తులు తమ పిల్లల దరిదాపుల్లోకి రారని ఆమె సూచించింది.

Also Read: LPG Shortage: గ్యాస్ సిలిండర్ ఆదా చేసే అద్భుతమైన చిట్కాలు..ఈ చిన్న మార్పు చేస్తే నెల రోజుల సిలిండర్ 2 నెలల పనిచేస్తుంది!

Also Read: Kamakshi Bhaskarla Photos: మనశ్శాంతి కోసం శ్మశానానికి వెళ్లే హీరోయిన్..అక్కడికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందట!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

133
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 13, 2026 10:05:37
Hyderabad, Telangana:

Musi Gandhi Sarovar Project: మూసీ ప్రాజెక్టు పేరిట రేవంత్ రెడ్డి సాగిస్తున్న దమనకాండ, దౌర్జన్యాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా తప్పుబట్టారు. డీపీఆర్‌ లేకుండానే మూసీ ప్రాజెక్టుపై దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఏడీబీ ఇంకా రుణం కూడా చెల్లించలేదు కానీ పేదల ఇళ్లు ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. పవిత్రమైన అసెంబ్లీని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించాడని.. పేదల ఇళ్లు ఎందుకు కూలుస్తున్నారని నిలదీశారు.

Also Read: Allu Cinemas: లారీ ఎక్కి వెళ్లి నేను సినిమాలు చూసేవాడిని: రేవంత్‌ రెడ్డి

మూసీ గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుపై హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టుపై రేవంత్‌ రెడ్డికి కీలకమైన 8 సూటి ప్రశ్నలు వేశారు. వాటిలో రేవంత్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యం, బుల్డోజర్‌ పాలనపై ప్రశ్నలు వేసి రేవంత్ రెడ్డిని నిలదీశారు. వాటికి సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీటికితోడు బీజేపీ నాయకత్వానికి కూడా మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నలు వేశారు.

Also Read: Gas Cylinder Shortage: మళ్లీ కట్టెల పొయ్యి.. హాస్టల్స్‌, హోటళ్లలో సంప్రదాయ వంట పద్ధతి

హరీశ్‌ రావు 8 ప్రశ్నలు

  1. అసెంబ్లీ వేదికగా జనవరిలో రేవంత్‌ రెడ్డి ఇచ్చిన సమాధానం ప్రకారం హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు అధ్యయనం చేసి డీపీఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది చెప్పారు. మరి డీపీఆర్‌ రాకుండా పేదలకు ఎలా నోటీసులు ఇచ్చావు? ఎందుకు పేదల ఇండ్లు కూలగొడుతున్నావు? 10,017 ఇండ్లు కూల్చుతామని గెజిట్ ఎట్లా ఇచ్చావు?
  2. మీరు చేస్తున్నది మూసీ నది ప్రక్షాళననా? మూసీ సుందరీకరణనా? మూసీ ప్రక్షాళననా? అసలు ఏం చేస్తున్నావు సమాధానం చెప్పు?
  3. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం 9 మీటర్లు, మరొక ప్రభుత్వం 30 మీటర్లు? ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 మీటర్లు అంటున్నాడు. అసలు బఫర్ ఎలా నిర్ణయించారు? ఉంటే స్టడీ బయట పెట్టండి? అసలు మూసీ నుంచి ఎలా కొలుస్తారు?
  4. ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే కనీసం వంద ఏళ్ల డేటా తీసుకొని చేస్తాం. హైడ్రాలజికల్ లేదా ఫ్లడ్ వాటర్ స్టడీ చేశారా? చేస్తే బయట పెట్టండి.
  5. జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్‌ రెడ్డి ఏడీబీ లోన్ రూ.4,100 కోట్లు మూసీకి ఇవ్వడానికి అంగీకరించి మంజూరు చేసిందని చెప్పారు. కానీ ఏడీబీ డిసెంబర్ 15, 2025లో ఏమన్నది ఇంకా డీపీఆర్ మాకు సమర్పించలేదు, మా పద్దతి పాటిస్తేనే రుణం ఇస్తామని చెప్పింది. జనవరి 23, 2026 నాడు ఏం అన్నది.. మాకు డీపీఆర్ రాలేదు, మేం రుణం మంజూరు చేయలేదు అని చెప్పింది. నిన్న గాక మొన్న మార్చి 11వ తేదీన ఇచ్చిన లేఖలో మేం ఇంకా రుణం మంజూరు చేయలేదు అని చెప్పింది. ఇదీ వాస్తవం. మరి అసెంబ్లీ వేదికగా రేవంత్‌ రెడ్డి పచ్చి అబద్దం చెప్పాడు. ఇలా అబద్దాలు చెప్పే రేవంత్‌ రెడ్డి మాటలు ప్రజలు ఎలా నమ్ముతారు? పవిత్రమైన అసెంబ్లీనే రేవంత్‌ రెడ్డి తప్పు తోవ పట్టించాడు. రుణం మంజూరు అయ్యిందా లేదా? అసెంబ్లీని తప్పుదోవ పట్టించావా స్పష్టం చేయాలి? లేదంటే అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. అబద్దాలు మాట్లాడే రేవంత్ రెడ్డి శాపగ్రస్తుడు.
  6. ఇప్పటికే చాదర్‌ఘాట్‌లో మూసీలో 300 ఇళ్లు కూల్చారు. యూపీఏనే తెచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నాడు. పరిహారం ఇవ్వకుండా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు పంపావు. భూసేకరణ చట్టం ప్రకారం ఎవరికి ఎంత ఇచ్చారో చెప్పాలి? ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే ఏం చేయలేదు. నువ్వు చేస్తావని ప్రజలు ఎలా నమ్ముతారు? మధు రిడ్జ్ అపార్ట్ మెంట్‌వాసులు నిన్ను ఎలా నమ్ముతారు? మాట తప్పని నైజం కేసీఆర్‌ది అయితే.. మాట తప్పడమే రేవంత్‌ రెడ్డి నైజం అని పేరు తెచ్చుకున్నాడు.
  7. మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్‌వాసులకు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తాననడం సంతోషం. మధు రిడ్జ్ ఒక్కటే కాదు కదా? మూసీ వెంట మొత్తం 46 కాలనీలు ఉన్నాయి. పది వేల ఇండ్లు కూలగొడుతా అంటున్నావు. వీళ్లకు కూడా అదే పద్దతిలో స్థలం కేటాయిస్తవా? బ్యాంకుల్లో  నిధులు జమ చేస్తావా? పదివేల మందికి ఇదే తీరుగా ఇళ్లు కట్టిస్తావా? వారి ఉపాధికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.  
  8. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆవాసాలే కాదు మెట్రో రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చీలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నయి ఇవన్నీ కూల్చుతావా? నీ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయాలి.

Also Read: Gas Cylinder Shortage: ఎల్పీజీ గ్యాస్‌ కొరతపై కేంద్రానికి కేటీఆర్‌ లేఖ.. గ్యాస్‌ అందించాలని విజ్ఞప్తి

బీజేపీకి సూటి ప్రశ్న
'మూసీ ప్రక్షాళన శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానిస్తాం అంటున్నారు. మూసీ పేరిట రేవంత్‌ రెడ్డి చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు, దోపిడీకి బిజేపీ సహకరిస్తుందా? పేదల ఇండ్లు కూల్చడాన్ని సమర్ధిస్తుందా? సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్ చేశారు. 'కిషన్ రెడ్డి బస్తీ నిద్ర అని ప్రచారం చేశారు. అందులో చిత్తశుద్ది లేదా? మూసీ పేరిట జరుగుతున్న చేస్తున్న రేవంత్ దోపిడీ ఎందుకు అడ్డుపడటం లేదు. సమాధానం చెప్పాలి' అని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

163
comment0
Report
HDHarish Darla
Mar 13, 2026 09:32:22
Hyderabad, Telangana:

LPG Cylinder Shortage: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ దేశంలో ఇంధన కొరత ఏర్పడుతున్న విషయం అందరికి తెలిసింది. ఆ యుద్ద ప్రభావం ఇప్పుడు వంటగదిపై చూపిస్తుంది. ముఖ్యంగా దేశంలో ఎక్కువగా అవసరమైన పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ కూడా కొరత ఏర్పడుతుందని వార్తలు ఇప్పుడు సామాన్యుడి కంటిపై కనుకులేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్లాక్ దందా మొదలయ్యి.. ఒక్కో గ్యాస్ సిలిండర్‌ను వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ వాడకాన్ని తక్కువ చేసేలాగా కొన్ని చిట్కాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

నేటితరంలో ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్‌నే ఉపయోగిస్తున్నారు. కట్టెల పొయ్యి వాడకం కూడా గ్రామస్థాయిలో దాదాపుగా తగ్గిపోయింది. ఈ క్రమంలో మళ్లీ కట్టెల పొయ్యిపై ఆధారపడాల్సిన పనే లేకుండా ఉన్న గ్యాస్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగించుకునేందుకు అవకాశం ఉంది. కొందరు నిపుణులు చెబుతున్న చిట్కాలు పాటించడం ద్వారా మీ గ్యాస్ ను 20 నుంచి 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.  అయితే అందుకు మీరు మీ వంటగదిలో చేయాల్సింది కొన్ని చిన్నచిన్న మార్పులే. 

1) ఇంట్లో గ్యాస్ ఆదా చేసుకునేందుకు మొదటి ఉపాయం ప్రెషర్ కుక్కర్ వాడకం. ఇందులో ఆహారం త్వరగా ఉడుకుతుంది. దీంతో తక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. కుక్కర్‌లో బియ్యం, పప్పులు, కూరగాయలు, బంగాళదుంపలు వంటి వాటిని ప్రెషర్ కుక్కర్‌లో వండడం వల్ల గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. మామూలు అల్యూమినియం గిన్నెల్లో వంట చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. 

2) మనలో చాలామంది వంట గ్యాస్ ఆన్ చేసిన తర్వాత మిగిలిన సామాన్లు వెతకడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల గ్యాస్ వృథా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వంటకు సంబంధించిన అన్ని సామాన్లను గ్యాస్ మండించక ముందే రెడీ చేసుకోవడం ఉత్తమం. కూరగాయలు కట్ చేయడం, మసాలా ప్రిపరేషన్ వంటివి ముందుగానే రెడీ చేయడం వల్ల వంట మధ్య హడావుడి లేకుండా తక్కువ గ్యాస్ ఖర్చుతో పని పూర్తవుతుంది. 

3) సాధారణంగా వంట చేసే ప్రక్రియలో చాలా మంది గిన్నెలపై మూతలు లేకుండా వంట చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల ఆహారం తొందరగా ఉడకదు. ఇలా చేస్తే ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. మూత పెట్టి వంట చేయడం వల్ల వంట గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా పాత్ర పరిమాణం బట్టి మంటను అడ్జెస్ట్ చేయడం గ్యాస్ వృథా అవ్వదు. అదే విధంగా అల్యూమినియం బదులుగా కాపర్ పూత ఉన్న స్టీల్ పాత్రలను వంటకు వినియోగించడం ఎంతో మేలు.

4) ప్రెషర్ కుక్కర్‌లో పప్పు, కూరగాయలు ఉడికిస్తున్నప్పుడు మొదటి విజిల్ తర్వాత మంటను తగ్గించండి. ఇలా చేస్తే ఆహారం ఉడికించే క్రమంలో గ్యాస్ వినియోగం తగ్గుతుంది. ఎక్కువ మంట పెట్టడం వల్ల ఆహారంలోని నీరు ఆవిరైపోతుంది కానీ, ఆహారం ఉడకదు. కాబట్టి సన్నని మంటపై ఆహారాన్ని ఉడకబెట్టడం వల్ల గ్యాస్ ఆదా చేయోచ్చు. 

వంటగదిలో ఈ చిట్కాలు..
గ్యాస్ వినియోగదారులు నిత్యం గ్యాస్‌ను శుభ్రపరుకుంటే మేలు. ముఖ్యంగా బర్నర్లను క్లీన్ చేయడం ద్వారా గ్యాస్ వినియోగానికి ఆటంకం ఉండదు. నీలిరంగు మంట బదులు ఆరెంజ్ లేదా పసుపు రంగులో మంట వస్తే బర్నల్ రంధ్రాలు పూడుకుపోయాయని అర్థం. వెంటనే వాటిని క్లీన్ చేయాలి. 

మరోవైపు ఫ్రిజ్ లో నుంచి తీసిన పదార్థాలను వెంటనే వండొద్దు. అలా చేయడం వల్ల ఆహారం ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఫ్రిజ్ లో నుంచి కూరగాయలు, పాలు, మాసాలాలు చల్లదనం తగ్గిన తర్వాత మాత్రమే వంటలో వినియోగించండి. 

గమనిక: మరీ ముఖ్యంగా గ్యాస్ పైపు‌లో లీకేజీ ఉంటే గ్యాస్ వృథాగా పోవడమే కాకుండా గ్యాస్ సిలిండర్ పేలే అవకాశం ఉంది. మీకు ఏమైనా లీక్ అనుమానం వస్తే గ్యాస్ నిపుణులను సంప్రదించి పరిష్కారం తెలుసుకోవడం ఉత్తమం.

Also Read: Fee Reimbursement Latest News: కాలేజీ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు..ఎట్టకేలకు అకౌంట్లోకి డబ్బులు జమ చేశారు!

Also Read: Currency Notes Bleed Lines: 100, 200 నోట్లపై ఈ నల్లని గీతలను ఎప్పుడైనా గమనించారా? 99 శాతం మందికి తెలియని రహస్యం ఇది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

123
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 13, 2026 09:22:57
Hyderabad, Telangana:

Shani Astamayam 2026 Effect On Zodiac Telugu: ఖగోళంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. న్యాయదేవుడు, కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడు మార్చి 13వ తేదిన మీన రాశిలో అస్తమించింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో మీన రాశిలో ఆస్తమించి.. ఏప్రిల్‌ 22వ తేదిన సక్రమ మార్గంలోకి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం పరంగా శని గ్రహం ఏదైన ఒక రాశిలో దాదాపు సుమారు రెండున్నర ఏళ్ల పాటు ఉంటుంది. అయితే, శని గ్రహం అస్తమించడం వల్ల మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొందరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, శని ప్రభావంతో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అదృష్టం పొందే రాశులు:
వృషభ రాశి:
శని ప్రభావంతో ఈ రోజు నుంచి వృషభ రాశివారికి సానుకూల కాలం ప్రారంభమవుతుంది. వీరికి గత కొంత కాలంగా నిలిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు అద్భుతమైన శుభవార్తలు వింటారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. వ్యక్తిగత సంబంధాలు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. 

సింహ రాశి:
శని గ్రహం అస్తమించడం వల్ల సింహ రాశివారికి కెరీర్‌ పరంగా అద్భుతమైన పురోగతి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. దీంతో పాటు వేతనలు కూడా విపరీతంగా పెరుగుతాయి. కార్యాలయాల్లో పైఅధికారుల ప్రశంసలు కూడా లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆస్తుల నుంచి పాత వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు చాలా అద్భుతంగా  ఉంటుంది. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేస్తున్నవారికి భారీ మొత్తంలో లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన వారు అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు. దీంతో పాటు తల్లిదండ్రుల సపోర్ట్‌ లభించి.. మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

185
comment0
Report
RGRenuka Godugu
Mar 13, 2026 09:09:56
Hyderabad, Telangana:

Psycho Husband Video Record While Wife Hangs: భార్య ఆత్మహత్యను ఫోన్లో చిత్రీకరించిన ఘటన రాజంపేట బోయిన్‌పల్లిలో జరిగింది. ఉరేసుకుంటూ ఉంటే కాపాడాల్సిన భర్త నవ్వుతూ వీడియో చిత్రీకరించాడు. రైల్వే లోకో పైలట్ గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాసులు చేసిన ఈ బాగోతం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ విషాద ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. రాజంపేట కొత్త బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న శ్రీరామ్ రైల్వేలో లోకో పైలట్‌గా పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆయన భార్య కృష్ణవేణితో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఉరేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆమెని కాపాడకుండా నవ్వుతూ వీడియో చిత్రీకరించాడు. కిటికీ బయట నిలబడి ఆ దృశ్యాన్ని మొబైల్‌లో బంధించాడు. దీంతో పైశాచికంగా ఈయన ప్రవర్తించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని డోరు పగుల కొట్టి ఓపెన్ చేశారు. అప్పటికే కృష్ణవేణి మృతి చెంది ఉంది మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుడు శ్రీనివాసులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆ వీడియో వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్యకు ప్రేరేపించాడా? అని దర్యాప్తు కొనసాగుతుంది. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి సరైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
 

103
comment0
Report
HDHarish Darla
Mar 13, 2026 08:51:14
Velgapudi, Andhra Pradesh:

AP Fee Reimbursement Latest News: కాలేజీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తీపికబురును అందించింది. ఎట్టకేలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేస్తూనే అందులో ఎలాంటి కోతలు ఉండవని స్పష్టం చేసింది. ఎన్నో రోజులుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల ఉన్నత విద్యామండలిపై విమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కాలేజీ యాజమాన్యాలతో పాటు విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

తొలుత ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసే ప్రక్రియలో వడ్డీ మినహాయింపు కారణంగా నెల రోజులుగా ఆలస్యం అయినట్లు తెలిసిన విషయమే. ఇదే విషయమైన కాలేజీ మేనేజ్‌మెంట్స్ యూనియన్ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ విద్యార్థులకు ఎలాంటి కోత విధించకుండా నిధులు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. దీంతో ఎన్నో రోజులగా ఎదురుచూపులకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. 

ఏం జరిగిందంటే?
2024-25 ఏడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,200 కోట్ల మేర విడుదల చేసినట్లు సమాచారం. విడుదలైన నిధులు వెంటనే తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని కాలేజీ యాజమాన్యాలు భావించాయి. అయితే అంతలోనే ఉన్నత విద్యామండలి ఇందులో ట్విస్ట్ ఇచ్చింది.  

గవర్నమెంట్ వద్ద నిధులు లేకపోయినా రుణాలు తెచ్చిమరీ బకాయిలు ఇస్తున్నందున అందుకు సంబంధించిన రుణంపై 7.5 శాతం వడ్డీని కట్టాలని ప్రతిపాదించారు. ఇదే అంశంలో కాలేజీ యాజమాన్యాలతో ఉన్నత విద్యామండలి సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అయినా వడ్డీ కట్టేందుకు కాలేజీ యాజమాన్యాలు అందుకు ససేమీరా అన్నాయి. దీంతో నిధుల  విడుదలను నిలిపేస్తూ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.1,200 కోట్లపై వడ్డీ చెల్లిస్తే తాము రూ.90 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తుందని కాలేజీ యాజమాన్యాలు వాపోయాయి. ఇదే విషయమై సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఏకంగా 250 మెయిల్స్ ద్వారా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి కాలేజీ మేనేజ్‌మెంట్స్ తీసుకెళ్లాయి. కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను అడిగితే వడ్డీ కట్టమని అంటున్నారని, ఇదేమి న్యాయం అని యాజమాన్యాలు తమ గోడును వెళ్లబోసుకున్నాయి. 

ఈ సమస్యపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు, వడ్డీ ప్రతిపాదన విషయంలో ఉన్నత విద్యామండలి అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలకు సాంఘిక సంక్షేమ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. తొలుత రూ.300 కోట్లను బీసీ-డి కేటగిరీ విద్యార్ధుల ఫీజును విడుదల చేయగా.. ఉగాది నాటికి మిగిలిన రూ.900 కోట్లను కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలో జమ చేస్తామని తెలియజేశారు. ఈ విధంగా ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్ల కాలేజీ యాజమాన్యాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో మిగిలిన బకాయిలు అతి త్వరలోనే కాలేజీ బ్యాంకు అకౌంట్లలో జమకానున్నాయని అధికారులు చెబుతున్నారు.

Also Read: Currency Notes Bleed Lines: 100, 200 నోట్లపై ఈ నల్లని గీతలను ఎప్పుడైనా గమనించారా? 99 శాతం మందికి తెలియని రహస్యం ఇది!

Also Read: IPL 2026 Postponed: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2026 వాయిదా? బీసీసీఐ నుంచి బిగ్ అప్‌డేట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 13, 2026 08:18:34
Hyderabad, Telangana:

Iqoo Z11x 5g Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ మార్కెట్‌లోకి తమ కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. ఇది iQOO Z11x 5G స్మార్ట్‌ఫోన్‌ పేరుతో లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 7200mAh భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ విభాగంలో ఇంత మంచి బ్యాటరీతో ఈ మొబైల్‌ లాంచ్‌ కావడం విశేషం.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో (MediaTek Dimensity 7400 Turbo) 4nm ప్రాసెస్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా ఇది మల్టీ-టాస్కింగ్‌తో పాటు హెవీ గేమింగ్ చేసేవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు అద్భుతమైన స్మూత్ పెర్ఫార్మెన్స్‌ను కూడా అందిస్తుంది. అలాగే చాలా ప్రత్యేకమైన 6.76 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో లాంచ్‌ అయ్యింది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను అందించడం వల్లఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఇందులో బ్యాక్‌ సెడ్‌ అద్బుతమైన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ సోనీ IMX852 ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ బొకే లెన్స్ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో విశేషమేమిటంటే, ముందు, వెనుక కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన 7200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 40 గంటల వీడియో స్ట్రీమింగ్‌ను కూడా అందిస్తోంది. గేమింగ్‌ చేసేవారికి 15 గంటల వరకు అడుకునే ప్రత్యేకమైన సపోర్ట్ కూడా లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఇది నీరు, దుమ్ము నుంచి ప్రోటక్షన్‌ పొందండానికి IP69 రేటింగ్‌లను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో విడుదల అయ్యింది. మొదటి స్టోరేజ్‌ వేరియంట్ 6GB + 128GBతో అందుబాటులోకి రాబోతోంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

114
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 13, 2026 07:38:20
Hyderabad, Telangana:

Motorola Edge 70 Fusion Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా భారత మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (Motorola Edge 70 Fusion)ను గ్రాండ్‌గా లాంచ్‌ చేసింది. మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. అద్భుతమైన ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పవర్‌ బ్యాంక్‌ అవసరం లేకుండా రోజులు తరబడి పని చేస్తుంది. అయితే, దీనిని కంపెనీ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల సూపర్‌ హెచ్‌డీ ప్లస్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎమోలెడ్‌ (AMOLED)డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది.. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయ్యింది. కంటికి ప్రొటక్షన్‌ అందించేందుకు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7iను కూడా అందించారు.. అలాగే స్టైలిష్ లుక్ కోసం ఫోన్ వెనుక భాగంలో ఫాబ్రిక్ ఫినిషింగ్‌తో కూడిన డిజైన్‌ను కూడా అందిస్తోంది..

ఇందులో కంపెనీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో అందిస్తోంది. ఇది గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్‌ను చాలా స్మూత్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో ఏకంగా 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ అందుబాటులో ఉంది.. దీనికి 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉండడం వల్ల, కేవలం నిమిషాల్లోనే రోజంతా సరిపోయే ఛార్జింగ్ లభిస్తుంది.

ముఖ్యంగా ఫోటోగ్రఫీ కోసమే మంచి మొబైల్‌ కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది అద్భుతమైన మొబైల్‌గా భావించవచ్చు.. ఎందుకంటే ఇది సోనీ LYTIA 710 సెన్సార్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరాతో లభిస్తోంది. దీనికి తోడు 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.. ఇందులో కంపెనీ సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఈ ఫోన్‌లో మోటో ఏఐ (Moto AI) టూల్స్ కూడా లభిస్తుంది. ఇది ఫోటోలను మరింత అందంగా ఎడిట్ చేసేందుకు సహాయపడుతుంది.. ఇందులో ప్రత్యేకంగా గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ఏఐ అసిస్టెంట్‌లు కూడా ఇందులో లభించడం విశేషం..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.. ఇందులోని మొదటి వేరియంట్ 8GB + 128GB స్టోరేజ్‌తో రూ. 26,999తో ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్‌ 8GB + 256GB స్టోరేజ్‌తో రూ. 29,999తో అందుబాటులో ఉంది. ఇక మూడవ వేరియంట్‌ 12GB + 256GB స్టోరేజ్‌తో రూ. 32,999లతో లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై స్పెషల్‌గా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ బోనస్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే దీనిని కేవలం రూ.24,999కే పొందవచ్చు. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Mar 13, 2026 05:57:33
Mumbai, Maharashtra:

Bleed Lines On Currency Notes: రోజులో కనీసం ఒక్కసారైనా మనం 100 లేదా 200 రూపాయల నోటును చూస్తూనే ఉంటాము. మనలో చాలామందికి నకిలీ కరెన్సీ నోట్లకు అసలు నోట్లకు తేడా దాదాపుగా తెలిసే ఉంటుంది. అయితే మన భారత కరెన్సీ నోట్ల మీద ఉండే ఈ గుర్తును మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు దొంగనోట్లపై కూడా అన్ని రకాల గుర్తులు ఉండేలా కేటుగాళ్లు జాగ్రత్త పడుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఉన్న ప్రత్యేకమైన గుర్తులను గమనించడంలో మనలో చాలా మంది వెనుకబడుతున్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు ఇంకో స్పెషల్ న్యూస్ చెప్పనున్నాం. 

మన భారత కరెన్సీ నోటుపై మీరు ఎప్పుడైనా చిన్న గీతలను గమనించారా? అదే 100, 200, 500 రూపాయల నోట్ల అంచున కొన్ని నల్లని గీతలను చూడండి. అయితే ఆ గీతలు ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా తెలుసుకున్నారా? అయితే భారత కరెన్సీ నోట్ల చివర ఉన్న గీతలు.. కేవలం దృష్టిలోపం ఉన్న వారి కోసం అనువుగా వీటిని తయారు చేశారు. కంటిచూపు లేని లేదా దృష్టిలోపం ఉన్నవారు కరెన్సీ నోట్లను గుర్తించే విధంగా సహాయపడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రత్యేకమైన గుర్తులను కరెన్సీ నోట్లపై ప్రవేశపెట్టింది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్బీఐ కొత్తగా జారీ చేసిన ప్రతి కరెన్సీ నోటు అంచున కొన్ని నల్లని గీతలు ఉంటాయి. ఈ గీతలను బట్టి నోటు విలువ తెలుసుకోవచ్చు. మనలో చాలామంది అవి ఓ డిజైన్ అని భావిస్తారు. కానీ, వాటి వెనుక పెద్ద రహస్యం దాగి ఉంది. ఈ రేఖలను బ్లీడ్ మార్క్స్ అని అంటారు. 

ఈ పంక్తులు ఎవరి కోసం?
ఈ గీతల పంక్తులను దృశ్య చిహ్నాలు అని కూడా అంటారు. వీటిని దృష్టి లోపం లేదా కంటిచూపు లేని వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దృష్టి లోపం ఉన్నవారు ఈ కరెన్సీ నోట్లను తాకినప్పుడు ఆ గీతల వరుస, అమరిక ఆధారంగా కరెన్సీ నోటు విలువను సులభంగా గుర్తించవచ్చు. 

ఏ నోటుకు ఎన్ని గీతలు ఉంటాయి?
100 రూపాయల నోటుకు రెండు సెట్లు రెండు గీతలు అనగా.. నాలుగు పంక్తులు ఉంటాయి. అదే విధంగా 200 రూపాయల నోటుకు రెండు వైపులా నాలుగు గీతలు ఉన్నాయి. కానీ దీనికి అదనంగా ఆ గీతల మధ్యలో రెండు చిన్న చుక్కల మాదిరి కనిపిస్తాయి. వాటి ఆధారంగా అది 200 రూపాయల నోటుగా గుర్తించవచ్చు. 500 రూపాయల నోటుకు మాత్రం 5 రేఖలు ఉంటాయి. 2000 రూపాయల నోటు (ప్రస్తుతం రూ.2000 నోటు వాడుకలో లేదు) వరుసగా ఏడు గీతలను కలిగి ఉంటుంది. 

కేవలం రేఖలే కాదు..
కరెన్సీ నోట్లపై ఈ గీతలే కాకుండా అశోక చక్రంపై ఉన్న వివిధ రకాలైన ఆకారాలు ఆ నోటు విలువను తెలియజేస్తాయి. 
రూ.100 నోటుపై త్రిభుజం, రూ.500 నోటుపై వృత్తం, రూ.2000 నోటుపై వజ్రపు ఆకారాలను కలిగి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది దృష్టి లోపం, చూపు లేని వారికి కరెన్సీ నోట్లు గుర్తించేందుకు సహాయపడుతుంది. నోట్ల విలువ పెరిగే కొద్దీ ఈ గీతల సంఖ్య కూడా పెరుగుతుంది.

ALso Read; Tanker Arrived From Hormuz Strait: యుద్దం దాటుకొని ముంబై చేరుకున్న తొలి చమురు నౌక! భారత్‌కు ఇక్కట్లు తీరినట్టేనా?

Also Read: IPL 2026 Postponed: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2026 వాయిదా? బీసీసీఐ నుంచి బిగ్ అప్‌డేట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 12, 2026 09:02:48
Rajamahendravaram, Andhra Pradesh:

Milk Adulteration Test In AP: రాజమండ్రిలో కల్తీపాలు తాగిన ఘటనలో 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రత శాఖ) అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీపాలను ముందుగానే పసిగట్టే ప్రక్రియను ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు వివరంగా తెలిపే ప్రయత్నం చేశారు. పాలు, పాల పదార్థాల్లో కల్తీని ఇంట్లోనే సులువుగా గుర్తించవచ్చని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు.

మీ ఇంట్లో ఉన్న పాలలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు కొన్ని చిట్కాలు తెలిపారు. అందులో మొదటిది ముందుగా ఇంట్లోని స్టీల్ పళ్లెం తీసుకొని, దాన్ని ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్క పడే విధంగా ఉంచాలి. అది స్వచ్ఛమైన పాలు అయితే అది తెల్లటి ధార లాగా అది కిందికి దిగుతుంది. ఒకవేళ పాలలో నీళ్లు కలిపితే  ఆ పాల ధార వెంటనే కిందికి వెళ్లిపోతుంది. అయితే ఇది చిన్న చిట్కా అయినా ప్రాథమికంగా పాలలో కల్తీ జరిగిందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. 

కల్తీ జరిగిందా లేదా అనేది తెలిసిపోతుంది!
అయితే పాలలో అసలైన కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని కొంచెం లోతుగా విశ్లేషించేందుకు రెండో చిట్కా గురించి తెలుసుకుందాం. ముందుగా ఓ గ్లాసులో 10 మిల్లీలీటర్ల  పాలు, 10 మిల్లీలీటర్ల నీటిని మిశ్రమంగా కలిపి దాన్ని బాగా కదిలించాలి. అప్పుడు దాని పై భాగంలో మందమైన నురుగు లాగా ఏర్పడుతుంది. ఒకవేళ అది స్వచ్ఛమైన పాలు అయితే నురుగు రాకూడదు. నురుగు వస్తే మాత్రం కచ్చితంగా అది కల్తీ జరిగిందనే గుర్తించాలి.

పాలు రంగు మారితే..!
కొన్నిసార్లు కల్తీపాలు చిక్కదనం కోసం అందులో మొక్కజొన్న పిండి లేదా ఇతర పొడులను కలిపి చిక్కగా వచ్చేలా తయారు చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కల్తీ పాలను గుర్తించడానికి మరో ఉపాయం ఉంది. ముందుగా ఓ గ్లాసులో పాలు తీసుకొని అందులో రెండు లేదా ముండు చుక్కల ఆయోడిన్ ద్రావణాన్ని కలపాలి. ఆ తర్వాత ఆ పాలు తెలుపు నుంచి నీలిరంగులో మారితే కల్తీ జరిగిందని భావించాలి. ఒకవేళ పాలు రంగు మారకపోతే అవి స్వచ్ఛమైన పాలు అని పరిగణిస్తారు.

ఇవే కాకుండా పాలలో కల్తీతో పాటు పాల పదార్థాలలోనూ కల్తీ నానాటికి పెరిగిపోతుంది. ఈ కల్తీ ఇప్పుడు ప్రజల ప్రాణాలకు సంకటంలా మారిపోయింది. ఇప్పుడు పాలతో పాటు నెయ్యిలోనూ దళారులు కల్తీకి తెగబడ్డారు. ఒకవేళ నెయ్యిలో కల్తీ జరిగిందా అని తెలుసుకునేందుకు.. ముందుగా ఓ స్పూన్ నెయ్యిని చిన్న గాజు గ్లాస్ లేదా గిన్నెలో వేయాలి. ఆ  వెంటనే రెండు లేదా మూడు చుక్కల అయోడిన్ ఉప్పు ద్రావణాన్ని కలపాలి. ఆ సమయంలో నెయ్యి నీలిరంగులోకి మారితే అది కల్తీ జరిగిందని భావించాలి. 

ఒకవేళ నెయ్యిలో వనస్పతి లేదా ఇతర నూనెలు కలిపి కల్తీ చేసినట్లు మీరు భావిస్తే.. ముందుగా ఓ స్పూన్ నెయ్యిని తీసుకొని అందులో చిటికెడు చక్కెర కలిపి వేడి చేస్తే అది ఎరుపు లేదా గులాబి రంగులోకి మారితే ఆ నెయ్యిలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు భావించాలి. అంతే కాకుండా ఓ గ్లాస్ వేడినీటిలో స్పూన్ నెయ్యి వేస్తే.. స్వచ్ఛమైన నెయ్యి వేడినీటిపై తేలిఆడుతుంది. వనస్పతి కలిపిన నెయ్యి అయితే చిన్నచిన్న ముద్దలుగా మారి కనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఓ స్పూన్ నెయ్యిని అరచేతిలో వేసుకొని గట్టిగా రుద్దితే అది సువాసన రావాలి అలా సువాసన రాకపోతే ఆ నెయ్యిలో కల్తీ జరిగినట్లే గుర్తించాలి.

కల్తీ గురించి తెలిస్తే ఫిర్యాదు చేయాలి!
ఒకవేళ మీరు పైన చిట్కాలతో కల్తీని గుర్తించిన పక్షంలో 1800 425 3857 (టోల్-ఫ్రీ నెంబరు), 08645 297245 (ఐపీఎం ప్రధాన కార్యాలయం)కు తెలియజేయాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. 

Also Read: AP Adulterated Milk Death: రాజమండ్రిలో భయం భయం.. కల్తీపాలకు మరో చిన్నారి ప్రాణం బలి! 13కి చేరిన మృతుల సంఖ్య..

Also Read: Hardik Pandya Flag Complaint: హార్దిక్ పాండ్యాకి జైలు శిక్ష తప్పదా? లవర్‌‍తో కలిసి చెండాలంగా..జాతీయ జెండాకు అవమానం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 12, 2026 08:09:25
Hyderabad, Telangana:

OPPO K14x 5G Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ OPPO మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ప్రీమియం కెమెరా కలిగిన మొబైల్స్‌ను ఎక్కువగా విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా K-సిరీస్‌ కలిగి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా OPPO K14x 5G మొబైల్‌ అద్భుతమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. ముఖ్యంగా దీనిపై బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

OPPO K14x 5G మొబైల్‌ అద్బుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం కెమెరా సెటప్‌ను కలిగి ఉండడమే కాకుండా ప్రీమియం డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా 120Hz రిఫ్రెష్ రేట్, 1125 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 6300 (6nm చిప్‌సెట్) ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదలైంది.

ఈ మొబైల్‌ వెనక భాగంలో అద్భుతమైన రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది ఎంతో శక్తివంతమైన 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఫ్రంట్‌ భాగంలో ప్రత్యేకమైన సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇది 5 MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది Android 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రన్‌ అవుతుంది.. ఈ మొబైల్‌ 64 GB స్టోరేజ్‌తో పాటు IP64 రేటింగ్ ప్రోటన్‌తో లాంచ్‌ అయ్యింది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇది ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువగా బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.. మార్కెట్‌లో ఇది 4 GB RAM + 64 GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.12,999తో అందుబాటులోకి వచ్చింది. ఇక బ్యాంక్ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్‌లో ICICI, HDFC, Axis ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగిస్తే.. దాదాపు రూ.750 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.12,199 వరకు పొందవచ్చు. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Mar 12, 2026 07:30:58
Ahmedabad, Gujarat:

Hardik Pandya Mahieka Sharma Flag Complaint: తాజాగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్లో టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను మట్టికరిపించి వరుసగా రెండోసారి పొట్టికప్పు విజేతగా నిలిచింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్‌ విన్నింగ్ మూమెంట్స్‌లో ఓ సంఘటన ఇప్పుడు టీమ్ఇండియా ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురిచేస్తోంది. టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ అందుకున్న తర్వాత భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మతో కలిసి చేసిన డ్యాన్స్ ఇప్పుడు రాద్ధాంతంగా మారింది. ప్రస్తుతం ఇదే విషయమై హార్దిక పాండ్యాపై కేసు నమోదయ్యింది.

గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజేతగా నిలిచి ట్రోఫీ అందుకున్న తర్వాత ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. క్రికెటర్లంతా ఉత్సాహంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న క్రమంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇలా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో హార్దిక్ పాండ్యా భారత జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచాడని ఇప్పుడు ఓ కేసు నమోదయ్యింది. సదరు క్రికెటర్ జాతీయ జెండాను అగౌరవపరిచాడని పుణెకు చెందిన ఓ న్యాయవాది ఆరోపణలు చేయడం సహా హార్దిక్ పాండ్యాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

స్థానిక శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో వాజిద్ ఖాన్ అనే న్యాయవాది ఈ ఫిర్యాదును సమర్పించట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మతో కలిసి గ్రౌండ్‌లో వేడుకలు చేసుకుంటున్న తరుణంలో.. సదరు క్రికెటర్ ప్రవర్తించిన తీరు త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచినట్లు, దాని పవిత్రత దెబ్బతినే విధంగా ప్రవర్తించినట్లు న్యాయవాది వాజిద్ ఆరోపించారు. ఈ వేడుకల్లో హార్దిక్ పాండ్యా జాతీయ జెండాను తన శరీరం చుట్టూ చుట్టుకొని జెండాను అగౌరవపరిచాడని తెలిపారు.

న్యాయవాది వాజిద్ ఖాన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన వైఖరిని స్పష్టంగా వివరించారు. "అందరూ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసే ఉంటారు. కానీ, ట్రోఫీ అందుకున్న చివర్లో హార్దిక్ పాండ్యా మాత్రం తన సెలబ్రేషన్స్‌ నడుమ జాతీయ జెండాను తన వీపుకు కట్టుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో డ్యాన్స్ చేశాడు. అయితే 1971 జాతీయ జెండా చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. మనమంతా జాతీయ జెండాను గౌరవించాలి. కానీ, ఆ సెలబ్రేషన్స్‌లో హార్దిక్ పాండ్యా జాతీయ జెండాను కట్టుకోవడం సహా తన ప్రేయసితో పడుకున్నాడు. అది జాతీయ జెండాకు తీవ్ర అవమానం అని నేను నమ్ముతున్నాను" అని న్యాయవాది వాజిద్ ఖాన్ తెలిపారు. 

ఫ్యాన్స్ మద్దతు
అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది టీమ్ఇండియా ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యాకు సమర్ధించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన తర్వాత ఆటగాళ్లు తమ భావోద్వేగాలు కంట్రోల్‌లో ఉండవని.. ఆ క్రమంలో అది తెలియక జరిగిన పొరపాటు అయ్యిండొచ్చని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే దీన్ని మరికొందరు ఖండిస్తున్నారు. జాతీయ జెండాను చుట్టుకున్నా.. తన ప్రేయసితో కలిసి పడుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ కేసు నిలుస్తుందా? లేదా కొట్టివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది అగౌరవంగా భావిస్తే మాత్రం క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

చట్టం ఏం చెబుతోంది!
న్యాయవాది వాజిద్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదులో జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం గురించి ప్రస్తావించారు. దీని గురించి చెప్పాలంటే.. 1971 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ఏదైనా బహిరంగ ప్రదేశంలో లేదా జనావాసాల్లోని మరేదైనా ప్రాంతంలో జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని మంటల్లో కాల్చడం, చించివేయడం లేదా కట్ చేయడం, అసభ్యకరంగా వినియోగించడం, నాశనం చేయడం, కాళ్లతో తొక్కడం వంటి ఇతర అగౌరవ లేదా జాతీయ జెండా ధిక్కారానికి గురిచేయడం శిక్షార్హం.

Also Read: EPS 95 Pension Hike: పోరుబాట పట్టిన ఉద్యోగులు..ఈపీఎస్ పెన్షన్ 7 రెట్లు పెంపు?! ఫైనల్‌గా ఎంత రావొచ్చు?

Also Read: Amit Mishra Case: ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసిన క్రికెటర్ భార్య! తాగి రోజూ కట్నం కోసం హింసిస్తున్నాడట!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top